1 ) ఒక వత్తి : సామాన్య శుభం
2 ) రెండు వత్తులు : కుటుంబ సౌఖ్యం
3 ) మూడు వత్తులు : పుత్ర సుఖం
4 ) ఐదు వత్తులు : ధనం , సౌఖ్యం , ఆరోగ్యం , ఆయుర్ధాయం , అభివృద్ధి దీపారాధనకు పత్తితో చేసిన వత్తి శ్రేష్ఠము .
💥దీపారాధన విధానం :-💥
1 ) నెయ్యి : నేతితో దీపారాధన చేసిన ఇంటిలో సర్వ సుఖాలు సౌభాగ్యాలు కలుగును .
2 ) నువ్వుల నూనె : నువ్వుల నూనెతో దీపారాధన చేసిన సమస్త దోషములు , పీడలు తొలగును .
3 ) ఆముదం : ఆముదముతో దీపారాధన చేసిన , దేదీప్యమానమగు జీవితం , బంధుమిత్రుల శుభం , దాంపత్య సుఖం వృద్ధియగును .
4 ) వేరుశెనగ నూనె : వేరుశెనగనూనెతో దీపారాధన చేసి నిత్య ఋణములు , దుఖం , చోర భయం , పీడలు మొదలగునవి జరుగును .
5 ) నెయ్యి , ఆముదం , వేప నూనె , కొబ్బరి నూనె , యిలప నూనె కలిపి 48 రోజులు దీపారాధన చేసిన , వారికి దేవీ అనుగ్రహం కలుగును .
6 ) వేపనూనె , నెయ్యి , యిలపనూనె మూడు కలిపి దీపారాధన చేసిన ఐశ్వర్యం ఇలవేల్పులకు సంతృప్తి కలుగును .
7 ) ప్రతిరోజు దీపారాధన ఉదయం మూడు గంటల నుండి జరుగంటలలోపు చేసిన సర్వరుభములు , శాంతి కలుగును .
🏹దీపాల యొక్క దిక్కుల ఫలితములు :-🏹
1 ) తూర్పు : కష్టములు తొలగును , గ్రహదోషములు పోదురు ,
2 ) పశ్చిమ : అప్పుల బాధలు , గ్రహదోషములు , శనిదోషములు తొలగును ,
3 ) దక్షిణం : ఈ దిక్కున దీపము వెలిగించరాదు కుటుంబమునకు కష్టము కలును ,
4 ) ఉత్తరం : ధనాభివృద్ధి , కుటుంబములో శుభకార్యములు జరుగును .
🎪దీప వత్తుల యొక్క ఫలితములు : -🎪
1)పత్తి:-పత్తితో దీపము వెలిగించినదో ఆయుషు పెరుగును .
2 ) అరటినార :-ఆరటి నారతో దీపము వెలిగించినదో చేసిన తప్పులు తొలగి కుటుంబమునకు శాంతి కలుగును .
2 ) జిల్లేడినార:- జిల్లేడినారతో దీపము వెలిగించినచో భూత , ప్రేత , పిశాల బాధలు ఉండవు ,
4 ) తామర నార :-పూర్వ జన్మలో చేసిన పాపములు తొలగును . ధనవంతు లగుదురు .
5 ) నూతన పసుపు వస్త్రము :- అమ్మవారి అనుగ్రహమునకు పాత్రులగుదురు
6)నూతన ఎరుపు వస్త్రము :- పెళ్ళిళ్ళు అగును , గొడ్రాలికి సంతానము కల్గును
7 ) నూతన తెల్ల వస్త్రము :- పన్నీరులో ముంచి ఆరబెట్టి దీపము వెలిగించిన శుభకార్యములు జరుగును ,
సాయంత్ర సమయములందు శ్రీ మహాలక్ష్మికి దీపారాధన చేసి పసు కుంకుమతో అర్చన చేస్తే కుటుంబ క్షేమం , సౌభాగ్యం కల్గును .
No comments:
Post a Comment