Thursday 15 February 2024

రథసప్తమి: అంటే ఏమిటి, ఎందుకు?

 


🌻రథసప్తమి అంటే సూర్యభగవానుని పూజించే పండగ. మాఘమాస శుక్ల పక్ష సప్తమి నాడు ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు. రథసప్తమి మహా తేజం. మన ఆథ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం ద్వాదశ ఆదిత్యులు అనగా పన్నేండుగురు సూర్యులు.

🌻సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు.

1. చైత్ర మాసంలో వచ్చే సూర్యుడి పేరు 'ధాత'

2. వైశాఖంలో అర్యముడు,

3. జ్యేష్టం-మిత్రుడు,

4. ఆషాఢం-వరుణుడు,

5. శ్రావణంలో ఇంద్రుడు,

6. భాద్రపదం-వివస్వంతుడు,

7. ఆశ్వయుజం-త్వష్ణ,

8. కార్తీకం-విష్ణువు,

9. మార్గశిరం- అంశుమంతుడు,

10. పుష్యం-భగుడు,

11. మాఘం-పూషుడు,

12. ఫాల్గుణం-పర్జజన్యుడు.

🌻ఆ నెలల్లో సూర్యుడి తీక్షణతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతారు.

🌻భూమి నుంచి 14.98 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని కిరణాల ప్రయాణ వేగం ఒక సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు. అవి భూమిని చేరడానికి పట్టే కాలాన్ని 8 నిమిషాలుగా అంచనా కట్టారు ఖగోళ శాస్త్రవేత్తలు. పురాణ కధనం ప్రకారం

🌻బాల్యంలో హనుమంతుడు సూర్యుడిని ఎర్రమి తినేపండు అనుకుని తిందామనే ఉద్దేశంతో అక్కడికి ఎగిరి వెళ్లాడట.అందుకోసం హనుమ వెళ్లిన దూరాన్ని 'యుగ సహస్ర యోజన పరాభాను' అని తులసీదాస్ హనుమాన్ చాలీసాలో చెబుతారు.

🌻దీన్ని లెక్క కడితే 'యుగం.. 12000 ఏళ్లు, సహస్రం 1000, యోజనం 8 మైళ్లు, మైలు 1.6 కిలోమీటర్లు కలిపి దాదాపు 15 కోట్ల కిలోమీటర్లు. ఇది ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్న 14.98 కోట్ల కిలోమీటర్లకు దాదాపు సరిపోతుంది. సూర్యకాంతి ఏడు వర్ణాల కలయిక అని వైజ్ఞానికులు చెబుతుంటే 

ఆయన ఏడు గుర్రాలున్న రథం మీద లోక సంచారం చేస్తాడని వేదవాజ్మయం చెబుతోంది.

🌻ఆ ఏడు గుర్రాల పేర్లు 

1. గాయత్రి,

2. త్రిష్ణుప్పు, 

3. అనుష్టుప్పు, 

4. జగతి, 

5. పంక్తి, 

6. బృహతి, 

7. ఉష్ణిక్కు

🌻వీటి రూపాలు సప్త వర్ణాలకు సరి పోలుతాయి.

🌻రామ రావణ యుద్ధం సమయంలో అలసిపోయిన శ్రీరాముడికి అగస్త్య మహాముని 'ఆదిత్య హృదయం' ఉపదేశించినట్లు రామాయణంలో ఉంది.

🌻ఇందులో 30 శ్లోకాలున్నాయి.వీటి స్మరణ వల్ల శారీరక,మానసిక ఆరోగ్యం బాగుంటుందని చెబుతారు.

🌻సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు పగలు, రాత్రికి ప్రతీక అని, చక్రాలకున్న ఆరు ఆకులు రుతువులకు, ధ్వజం ధర్మానికి ప్రతీకలని పురాణాల్లో ఉంది. అందుకే సూర్యుడి జన్మదినాన్ని ఆయన పేరుతో కాకుండా రథ సప్తమి అని పిలుస్తారు.

🌻ఈ రోజునుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది. సర్వదేవతామయుడైన ఆదిత్యుని ఆరాధించడం చేత తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి.

🌻ఈ రోజు సూర్యోదయ స్నానంతో సప్త జన్మల పాపాలు నశించి, రోగము, శోకము వంటి ఇబ్బందులు తొలగుతాయి.

🌻ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసారా ధ్యానించి తలపై జిల్లేడాకులు, రేగాకులు పెట్టుకొని స్నానం చేయాలి అని ధర్మశాస్త్రం చెబుతుంది.జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి "అర్కః" అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక, ఏడు జన్మల్లో చేసిన పాపములను, ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి. ఈ రోజు ఉపవాసముండి సూర్యసంబంధమగు రథోత్సవాది కార్యక్రమములలో కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమీ వ్రతముచే సూర్యభగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు పొందుతారని పురాణప్రబోధము.

🌻ఈ రోజున స్నానం చేసేటప్పుడు చదువ వలసిన శ్లోకాలు:

నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః

అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే!!

యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు!

తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ!!

ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంత రార్జితమ్!

మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః!!

ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్తికే!

సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమీ!!

🌻పూజ విదానం:- చందనంతో అష్టదళ పద్మాన్ని లిఖించి,ఒక్కొక్క దళం చొప్పున రవి, భాను, వివస్వత, భాస్కర, సవిత, అర్క, సహస్రకిరణ, సర్వాత్మక - అనే నామాలు గల సూర్యుణ్ణి భావించి పూజించాలి. ఎర్ర చందనం, ఎర్రని పువ్వులతో సూర్యుని అర్చించడం విశిష్టమైనది.

🌻ఆవు పేడతో చేసిన పిడకలను కాల్చి ఈ వేడిలో క్షీరాన్నాన్ని వండి సూర్యునికి నివేదించాలి.ఆ క్షీరాన్నాన్ని చెరుకు ముక్కలతో కలుపుతూ ఉండాలి.దానిని చిక్కుడు ఆకులలో ఉంచి నివేదిస్తారు. చిక్కుడు, జిల్లేడు, రేగు - పత్రాలలో సౌరశక్తి విశేషంగా నిక్షిప్తమై ఉంటుంది.

🌻జిల్లేడు, రేగు, దూర్వాలు, ఆక్షతలు, చందనాలు కలిపిన నీటితోగాని, పాలతో గాని, రాగిపాత్ర ద్వారా అర్ఘ్యమివ్వడం మంచిది.

🌻మనం చేసే పూజలు, వ్రతాలు అన్ని పుణ్యసంపాదన కొరకే. శివ కేశవులకు ఇరువురికి మాఘమాసం ప్రీతికరమైనది.

🌻ఈ నాటి నుండి వేసవి ప్రారంభమైనట్లే!

: ఏడు జన్మల పాపాలు, ఏడు రకాలైన వ్యాధులు నశించాలంటే రథసప్తమి ఇలా చేయాలట….

ఏటా మాఘమాసం శుక్లపక్ష సప్తమి రోజు 'రథసప్తమి' జరుపుకుంటారు. ఆరోగ్య ప్రధాత అయిన సూర్యుడిని ఈ రోజు ఎలా పూజించాలి, ఏం నివేదించాలి, నిత్యం సూర్యుడికి చేసే పూజకి, రథసప్తమి రోజు పూజకి వ్యత్యాసం ఏంటి..

భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యుడే. అందుకే భానుడిని ప్రత్యక్షదైవం అంటారు.  హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యాధనకు ఎంతో విశిష్టత ఉంది. మాఘ మాస శుక్ల పక్షం సప్తమి రోజు జరుపుకునే రథసప్తమి మరింత విశేషమైనదని చెబుతారు. ఆదిత్యుడితి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ రోజు ఏఏ నియమాలు పాటించాలి...

రథ సప్తమి రోజు ఏం చేస్తే మంచిది .. ఎలాంటి ఫలితం ఉంటుంది

    సూర్యుడిని ఆరోగ్యప్రాధాతగా కోలుస్తారు. రథసప్తమి రోజున ప్రాతఃకాల సమయంలో గంగలో స్నానాలు, సూర్యోపాసనల వలన మృత్యుభయం పోతుందని విశ్వాసం.

    ఈ రోజు నదీ తీరంలో స్నానం ఆచరించాలి. తలమీద 7 జిల్లేడు ఆకులను, రేగు పళ్ళను ఉంచుకుని స్నానం చేయాలి.  జిల్లేడు ఆకుని అర్కపత్రం అంటారు. సూర్యునికి "అర్కః" అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం , ఏడు జన్మల్లో చేసిన పాపాలు, ఏడు రకాలైన వ్యాధులు నశింపజేస్తాయంటారు.

    నదుల దగ్గర స్నానం చేసిన వారు.. నేయ్యి లేదా నూనెతో దీపాన్ని వెలిగించి.. నీటిలో వదలాలని చెబుతారు.

    రథ సప్తమిరోజున ఆవు నేతితో దీపారాధన చెయడం వల ఆ ఇంటిలో అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని పండితులు చెబుతారు.

    రథసప్తమి రోజు సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కున తులసికోట పక్కగా ఆవు పేడతో అలికి, దానిపై పిండితో పద్మం వేసి, పొయ్యి పెట్టి, సంకాంత్రి రోజున పెట్టిన పిడకలు, గొబ్బెమ్మలతో పొయ్యి వెలిగించి దాని మీద పాలు పొంగిస్తారు.

    పొంగిన పాలల్లో కొత్తబియ్యం, బెల్లం, నెయ్యి, ఏలకులు వేసి పరమాన్నం తయారు చేస్తారు.

    తులసికోట ఎదురుగా చిక్కుడు కాయలతో రథం చేసి చిక్కుడాకులపై పరమాన్నం ఉంచి దేవుడికి నైవేద్యం సమర్పిస్తారు.

    రథసప్తమి రోజు సూర్యుడిని  ఎరుపు రంగు పూలతో పూజిస్తే మంచిది.

    రథసప్తమి రోజు బంగారం, వెండి లేదా రాగితో సూర్యుడికి చిన్న  రథం చేయించి అందులో ఎర్రరంగు సూర్యుని విగ్రహాన్ని ప్రతిష్టించి పూజించి ఆ రథాన్ని పండితులకు దానం ఇస్తే మంచిదంటారు.

    రథ సప్తమి రోజు ఉపవాసం ఉండి దైవారాథనలోనే కాలం గడిపితే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుని అనుగ్రహం పొందుతారని విశ్వాసం.

    ఈ రోజున ముత్తయిదువులు తమ నోములకు, వ్రతాలకు అంకురార్పణ చేస్తారు.

    చిత్రగుప్తుని నోము, ఉదయకుంకుమ నోము , పదహారఫలాల నోము, గ్రామకుంకుమ నోములను ఈ రోజు ప్రారంభిస్తారు.

    ఈ రోజు ఏ పుణ్యకార్యం తలపెట్టినా విజయవంతగా పూర్తి అవుతుందని నమ్మకం.

సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు జీవనాధారం అయిన సూర్యుడిని ఈ రోజు పూజిస్తే అప్పుల బాధలు, అనారోగ్యం, శత్రుబాధలు నశిస్తాయని చెబుతారు. 

ఓం నమో నారాయణాయ🙏

💥🌅ఓం_శ్రీ_సూర్య_నారాయణాయ_నమః 🌅💥

💥🌅 రథసప్తమికి #జిల్లేడకుకి సంబంధం ఏమిటి?

💥🌅 రథసప్తమినాడు స్నాన సమయంలో నెత్తిపై జిల్లేడాకు పెట్టుకోవాలి. ఆ ఆకునే ఎందుకు పెట్టుకోవాలి? ఏ తమలపాకో చిక్కుడాకో ఎందుకు పెట్టుకోకూడదు అన్నసందేహమూ వస్తుంది.

💥🌅 దీని వెనుక ఒకకథ ఉంది. పూర్వం అగ్నిష్వాత్తులు అనే పండితులు మహానిష్ఠతో చాలా యజ్ఞాలు చేశారు.

💥🌅 ఆ యజ్ఞాలతో పరమాత్మ తృప్తి చెంది, వాళ్ళని స్వర్గానికి తీసుకురండని దేవవిమానం పంపించాడు. ఆ సమయానికి యజ్ఞాంతంలో పూర్ణాహుతి చేస్తున్నారు అగ్నిష్వాత్తులు. ఆ దేవవిమానం చూసిన సంభ్రమంలో వారు ఆవునేతితో కూడిన హోమద్రవ్యాన్ని కంగారుగా వేశారు.

💥🌅 అయితే ఆసమయంలో పెద్దగాలిరావడంతో కొంత వేడివేడి నెయ్యి ప్రక్కనే ఉన్న ఒకమేకపై పడింది. ఆ వేడికి మేకచర్మం ఊడిపోయి మరణించి, దాని ఆత్మ వీరికంటే ముందుగా వెళ్ళి దేవవిమానంలో కూర్చుంది. ఆచర్మం ప్రక్కనే ఉన్న ఒక చెట్టుపై పడింది.

💥🌅 అప్పటి నుండి ఆ చెట్టు మూలతత్త్వం మారిపోయి, మెత్తని ఆకుల్ని ధరించిన జిల్లేడు చెట్టుగా మారిపోయింది.

💥🌅 అలా జిల్లేడాకు యజ్ఞంత సమయంలో ఆజ్యధారలు ధరించడంతో పరమపవిత్రం అయ్యింది. జిల్లేడు ఆకును ముట్టుకొంటే మేకచర్మంలా మెత్తగా ఉంటుందందుకే! జరిగిన దానికి అగ్నిష్వాత్తులు బాధపడ్డారు. అప్పుడు ఆకాశవాణి, "మీరు దుఃఖించాల్సిన పనిలేదు. మీరు చేసిన యజ్ఞఫలం ఆ మేకకు కూడా దక్కి, దుర్లభమైన స్వర్గప్రాప్తి కలిగింది.

💥🌅 ఈ జిల్లేడు మేకచర్మ స్పర్శతో పవిత్రమై అర్కవృక్షంగా అనగా పూజింపదగినదిగా మారింది" అని పలికింది. ఆ మాట అగ్నిష్వాత్తుల్ని సంతోషపరిచింది. అది మాఘశుద్ధ సప్తమీతిథి.

💥🌅 అప్పటి నుండి రథసప్తమినాడు నెత్తిపై జిల్లేడాకు పెట్టుకుని, సూర్యప్రీతి కోసం స్నానం చేసేవారికి లేశమాత్రం యజ్ఞఫలం లభిస్తోంది. ఏడుజన్మల పాపాలు పోతున్నాయి.

    💥🌅 ఓం శ్రీ సూర్య నారాయణాయ నమః 🌅💥

: రథ సప్తమి విశిష్టత

‘ఆరోగ్యం బాస్కరాధిచ్చేత్‌’ ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు భాస్కరుడు, సూర్య భగవానున్ని ఆరాదించే పండుగ 'రథ సప్తమి'. చిమ్మ చీకట్లను తరిమి.. చలిని తొలగించి నులు వెచ్చని ఉత్సాహాన్ని, చైతన్యాన్ని కలిగించే కర్మ సాక్షిగా నిలిచే సూర్యభగవానునికి కృతఙ్ఞతా సూచకంగా చేసే పండుగ ఇది. సూర్యుడు మకర రాశి ప్రవేశం ఉత్తరాయన ప్రారంభ సూచకంగా రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈ రోజు పవిత్రమైన రోజుగా భావించి భారతీయులు సూర్యున్ని ఆరాధిస్తారు. 

చలికాలము చివర్లో.. వేసని కాలపు ఆరంభం మాఘ మాసమవుతుంది. 'రథసప్తమి' పండుగను మాఘ మాస శుద్ధ సప్తమి నాడు జరుపుకుంటారు. సూర్యుడు దక్షిణాయణం ముగించుకుని, ఉత్తరాయణంలో ప్రవేశించటానికి సూచనగా మనం రెండు పండగలను జరుపుకుంటాము. అందులో ఒకటి సంక్రాంతి. రెండవది రథ సప్తమి. సప్తమి సూర్యుని జన్మ తిధి. ఉత్తరాయణం ప్రారంభానికి సూచనగా మాఘ శుద్ధ సప్తమి నాడు, జరుపుకునే రథ సప్తమి సూర్య సంబంధమైన పండుగ. 

శ్రీసూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవం. సూర్యుడు ఏకచక్ర రథారూఢుడు. ఈ చక్రమే కాలచక్రం. ఆ చక్రానికి 6 ఆకులు. రథానికి 7 అశ్వాలు. చక్రం సంవత్సరానికి ప్రతీక. ఆకులు 6 ఋతువులు. 7 అశ్వాలు 7 కిరణాలు. సుషుమ్నము, హరికేశము, విశ్వకర్మ, విశ్వవచన, సంపద్వసు, అర్వాగ్వసు, స్వరాడ్వసు.. అనబడే సహస్ర కిరణాలతో ప్రకాశించే ఈ సప్త కిరణాలు మన శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యం లేకుండా కాపాడుతాయి. సూర్య భగవానుడు ఉదయం బ్రహ్మస్వరూపంగా, ప్రకృతిలో జీవాన్ని నింపి, మహేశ్వరునిగా మధ్యాహ్నం తన కిరణాల ద్వారా సృష్టి యొక్క దైవిక వికారాలను రూపు మాపి, సాయంకాలం విష్ణురూపంగా భాసిల్లే తన కిరణాల వెలుగును మనోరంజకంగా ప్రసరింపజేస్తూ ఆనందాన్ని కలిగించే ద్వాదశ రూపుడు.

ధాతా, అర్యమా, మిత్ర, వరుణ, ఇంద్ర, వివస్వాన్, పుషా, పర్జన్య, అంశుమాన్, భగ, త్వష్టా, విష్ణువు అనే ఈ 12 మంది సూర్యులు సమస్త జీవజాలానికి సృష్టి విధానానికి ఆధారభూతులవుతున్నారని, ఈ 12 నామాలు స్మరిస్తే, దీర్ఘ రోగాలు నయమవుతాయని, దారిద్య్రం పోతుందని భవిష్య పురాణం చెబుతోంది.

ఈ 'రథ సప్తమి' రోజు తిరుమల తిరుపతిలో కూడా శ్రీవారిని ముందుగా సూర్యప్రభ వాహనం మీద ఊరేగింపు చేస్తారు. చివరన చంద్రప్రభ వాహనంపై ఊరేగిస్తారు. మిగతా వాహనాలు హనుమద్వాహన, గరుడ వాహన, పెదసేష వాహన, కల్పవృక్ష వాహన, స్వయం భూపాల వాహనాలపై స్వామివారిని ఊరేగిస్తారు. చక్రస్నానం కూడా ఇదే రోజు చేస్తారు. ఒక్క రోజు బ్రహ్మోత్సవాన్ని కన్నులపండుగగా జరుపుతారు. భక్తులు స్వామి వారిని కనులారా దర్శించుకుని తరిస్తారు.

ఏడు జన్మల పాపాలు నశిస్తాయి

రథ సప్తమికి ముందు రోజున రాత్రి ఉపవాసం చేసి, మరునాడు అంటే రథ సప్తమి అరుణోదయంతోనే స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు నశిస్తాయని శాస్త్రం చెబుతోంది. స్నానానికి ముందు ప్రమిదలో దీపం వెలిగించి దానిని శిరసుపై నుంచి, సూర్యుని ధ్యానించి, దీపాన్ని నీటిలో వదిలి, స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు, జిల్లేడు ఆకులు, చిక్కుడు ఆకులు, రేగుపళ్ళు నెత్తిమీద పెట్టుకుని స్నానం చేయాలి. 

ఇక స్నానానంతరం.. 'జననీత్వంహి లోకానాం సప్తమీ సప్తసప్తికే.. సప్తమ్యా హ్యాదితే దేవి నమస్తే సూర్యమాతృకే'... అంటూ శ్లోకం చదివి, సూర్యునికి అర్ఘ్యమిచ్చి, ధ్యానం చేయాలి. అటు తర్వాత తల్లిదండ్రులు లేని వారైతే, పితృతర్పణం చేసి, చిమ్మిలి దానం చేయాలి. 

ఇంకొందరు రథసప్తమి వ్రతం కూడా చేస్తారు. మాఘశుద్ధ షష్టి నాడు, అంటే రథసప్తమికి ముందు రోజు తెల్ల నువ్వుల పిండితో నలుగు పెట్టుకుని స్నానం చేయాలి. బంధువులతో కలసి నూనె లేని వంటకాలతో భోజనం చేయాలి. రాత్రి ఉపవాసముండాలి. వేద పండితులను పిలిచి, వారినే సూర్య భగవానులుగా తలచి సత్కరించాలి. రాత్రికి నేలపై నిద్రించాలి. గురువుకు ఎరుపు వస్త్రాలు దానం చేయాలి. 

ఈ పర్వదినాన బంగారము గాని, వెండిగాని, రాగిగాని రథమును చేయించి, కుంకుమాదులు, దీపములతో అలంకరించి అందులో ఎరుపు రంగు ఉండే సూర్యుని ప్రతిమను ఉంచి, పూజించి గురువునకు ఆ రథమును దానమీయవలెనని, ఆ రోజు ఉపవాసం ఉండి.. సూర్యసంబంధమగు రథోత్సవాది కార్యక్రమంలను చూస్తూ కాలక్షేపం చేయాలి. ఇలా రథసప్తమీ వ్రతముతో సూర్య భగవానుని అనుగ్రహంతో ఆయురారోగ్యాది సకల సంపదలు వచ్చునని శాస్త్ర ప్రబోధము. 

జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహోద్యుతిం..

తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం..

బ్రహ్మ స్వరూపముదయే మధ్యాహ్నంతు మహేశ్వరం.. 

సాయం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తించ దివాకరం..

వినతాతనయో దేవః కర్మ సాక్షీ సురేశ్వరః.. 

సప్తాశ్వః సప్తరజ్జుశ్చ అరుణోమే ప్రసీదతు..

ఆదిత్యశ్య నమస్కారం యే కుర్వంతి దినే దినే.. 

జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపజాయతే.. 

ఆ ప్రత్యక్ష భగవానుడి ఆశీర్వాదంతో.. అనుగ్రహంతో అందరూ సదా సర్వదా ఆరోగ్యంతో, ఆనందంతో జీవించాలని కోరుకుంటూ... ముందుగా అందరికీ రథ సప్తమి పర్వదిన శుభాకాంక్షలు.

: రథసప్తమి  సందర్భంగా .

*  రథసప్తమి  మహా తేజం...*

మన ఆథ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం 12 మంది సూర్యులు. 

ఏడాదిలోని ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు. 

1. చైత్ర మాసంలో వచ్చే సూర్యుడి పేరు ‘ధాత’, 

2. వైశాఖంలో అర్యముడు, 

3. జ్యేష్టం-మిత్రుడు, 

4. ఆషాఢం-వరుణుడు, 

5. శ్రావణంలో ఇంద్రుడు, 

6. భాద్రపదం-వివస్వంతుడు, 

7. ఆశ్వయుజం-త్వష్ణ, 

8. కార్తీకం-విష్ణువు, 

9. మార్గశిరం- అంశుమంతుడు, 

10. పుష్యం-భగుడు, 

11. మాఘం-పూషుడు, 

12. ఫాల్గుణం-పర్జజన్యుడు. 

ఆ నెలల్లో సూర్యుడి తీక్షణతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతారు. 

భూమి నుంచి 14.98 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని కిరణాల ప్రయాణ వేగం ఒక సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు. అవి భూమిని చేరడానికి పట్టే కాలాన్ని 8 నిమిషాలుగా అంచనా కట్టారు ఖగోళ శాస్త్రవేత్తలు.  

బాల్యంలో హనుమంతుడు సూర్యుణ్ణి పండు అనుకుని తిందామనే ఉద్దేశంతో అక్కడికి ఎగిరి వెళ్లాడట. అందుకోసం హనుమ వెళ్లిన దూరాన్ని ‘యుగ సహస్ర యోజన పరాభాను’ అని తులసీదాస్‌ హనుమాన్‌ చాలీసాలో చెబుతారు. 

దీన్ని లెక్క కడితే... ‘యుగం.. 12000 ఏళ్లు, సహస్రం.. 1000, యోజనం.. 8 మైళ్లు, మైలు... 1.6 కిలోమీటర్లు వెరసి దాదాపు 15 కోట్ల కిలోమీటర్లు. ఇది ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్న 14.98 కోట్ల కిలోమీటర్లకు దాదాపు సరిపోతుంది. 

సూర్యకాంతి ఏడు వర్ణాల కలయిక అని వైజ్ఞానికులు చెబుతుంటే, 

ఆయన ఏడు గుర్రాలున్న రథం మీద లోక సంచారం చేస్తాడని వేదవాజ్మయం చెబుతోంది. 

ఆ ఏడు గుర్రాల పేర్లు 

1. గాయత్రి, 

2. త్రిష్ణుప్పు, 

3. అనుష్టుప్పు, 

4. జగతి, 

5. పంక్తి, 

6. బృహతి, 

7. ఉష్ణిక్కు... 

వీటి రూపాలు సప్త వర్ణాలకు సరి పోలుతాయి. 

రామరావణ యుద్ధం సమయంలో అలసిపోయిన శ్రీరాముడికి అగస్త్య మహాముని ‘ఆదిత్య హృదయం’ ఉపదేశించినట్లు రామాయణంలో ఉంది. 

ఇందులో 30 శ్లోకాలున్నాయి. వీటి స్మరణ వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుందని చెబుతారు. 

సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు పగలు, రాత్రికి ప్రతీక అని, చక్రాలకున్న ఆరు ఆకులు రుతువులకు, ధ్వజం ధర్మానికి ప్రతీకలని పురాణాల్లో ఉంది. 

అందుకే సూర్యుడి జన్మదినాన్ని ఆయన పేరుతో కాకుండా రథ సప్తమి అని పిలుస్తారు.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment