Thursday 30 June 2016

అమ్మవారికి ఏ తిథి రోజున ఏ అబిషేకం , ఏ నైవేద్యం పెట్టాలి....!!

అమ్మవారికి ఏ తిథి రోజున ఏ అబిషేకం , ఏ నైవేద్యం పెట్టాలి....!!


పాడ్యమి రోజు - ఆవు నేయి తో అభిషేకం చేస్తే సకల రోగలు నివారణ అవుతాయి.
విదియ రోజు - చక్కర తో అభిషేకమ చేస్తే దీర్గాయువు కలుగుతుంది.
తదియ రోజు - ఆవు పాలు తో అభిషేకం చేస్తే ఎలాంటి అకాల మృత్యు దోషాలు తొలిగిపోతాయి ,
చవితి రోజున - పిండివంటలు నైవేద్యం పెట్టడం వలన సకల విద్యలు లబిస్తాయి.
పంచమి రోజు - అరటి పళ్ళు నైవేద్యం పెట్టడం వలన మేధస్సు , బుద్ది శక్తి పెరుగుతుంది.
షష్టి రోజున - తేనే తో అమ్మవారిని అభిషేకించి , బ్రహ్మనునికి దానం ఇవటం వలన కాంతి పెరుగుతుంది, యషస్సు పెరుగుతుంది.
అష్టమి రోజున - బెల్లం నీటి తో అభిషేకించి, మంచి బెల్లం ఎవరికయినా దానం ఇవటం వలన అష్ట కష్టాలు అంటారు కదా అలాంటివి అనీ తీరిపొతయి అంటారు.
నవమి రోజున - 

నైవేద్యం పెట్టడం వలన సకల సౌభాగ్యలు కలుగుతాయి.
దశమి రోజున - నల్ల నువ్వులు తో చేసిన పదార్ధాలు నైవేద్యం పెట్టడం వలన సకల రోగలు పోతాయి అని , దీర్గాయుషు పెరుగుతుంది.

వారాలలో ఏ నైవేద్యం....
ఆదివారం రోజు - పాలు
సోమవారం - పాయసం
మంగళవారం - అరటిపళ్ళు
బుధవారం - వెన్న
గురువారం - పటికబెల్లం
శుక్రవారం - తీపి పదార్ధాలు
శనివారం - ఆవు నేయి
అమ్మవారికి ఇష్టమయిన అన్నం
పులగం - అన్నం + పెసరపప్పు
పాయసన్నం
పెరుగు అన్నం
బెల్లం అన్నం
నైవేద్యం పెట్టకుండా మనం తింటే అది దొంగతనం చేసి తినట్టు , అందుకని దేవునికి నివేదన చేయకుండా తినకూడదు.

అమ్మవారిని పూజ ఎలా చేయాలి....!!

ఆచమనం ముందు చేయాలి , కాల స్మరణ చేయాలి (సంకల్పం ) , అబిషేకం చేయాలి , మామిడి రసం(చూత పళ్ళు ) తో అబిషేకం చేయటం వలన సరస్వతి ఆఇంటి ని విడిచి వెళ్ళదు, అ ఇంట్లో వుండే వారికీ సరస్వతి కటాక్షం ఉంటుంది. ఆవు నేయి తో అబిషేకం చేయటం వలన సకల రోగాలు పోతాయి , పెరుగు తో అబిషేకం వలన సంపదలు కలుగుతాయి అమ్మవారికి చాల ప్రీతిగా ఉంటారు , సకల రోగాలు పోతాయి, తేనే తో అబిషేకం చేయటం వలన యశస్సు పెరుగుతుంది, మేదస్సు పెరుగుతుంది , ఆవు పాల తో అబిషేకం చేయటం వలన సకల దోషాలు పోయి , సకల శుభాలు కలుగుతాయి , గంధం తో అబిషేకం చేయటం వలన మనలో తామస గుణం పోతుంది , పసుపు తో అబిషేకం చేయటం వలన సౌభగ్యమ్ పెరుగుతుంది.
అమ్మవారిని 108 పువ్వులు తో పూజ చేయడం విశేషం . కమలాలు, జాజిపువులు , లేత బిల్వాలు - సకల సంపదలు కలుగుతాయి , దాడిమి పువ్వులు ( దానిమ్మ చెట్టుకు పూసే పువ్వులు అంటే కాయకి ముందు వచ్చే పువ్వులు కాకుండా దానిమ్మ పువ్వు చెట్లు చిన్న చిన్న గులాబిలా ఉంటాయి వేరు ఉంటాయి ) వాటితో , మల్లెలు కూడా అమ్మవారికి ఇష్టం.

ఒకొక్క గుడికి ఒక్కో ప్రత్యేకత.

ఒకొక్క గుడికి ఒక్కో ప్రత్యేకత.


మన పూర్వీకులు గొప్ప సివిల్ ఇంజనీర్ లు.
పూర్వకాలంలో దేవాలయాలు ( కోవెలలు,గుడులు) నిర్మీంచేటప్పుడు ఒక ప్రత్యేకత కలిగి ఉండేటట్టు నిర్మించేవారు.
అయితే ఒక్కొక్క కోవెలకు ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉండేది.
ఉదాహరణకు కొన్ని చూద్దాం.
1.ఉత్సవవిగ్రహం లేకుండా మూలవిగ్రహమే బయటకు మాడవీధులకు వచ్చేది చిదంబరం నటరాజస్వామి.
2.కుంబకోణంలో ఐరావతేశ్వరస్వామి గుడి తారాశురం అనే గ్రామంలో వుంది.అక్కడశిల్పకళా చాతుర్యం చాలా గొప్పగా చెక్కబడివుంది.
ఒక స్తంభము నుంచి చూస్తె వాలిసుగ్రీవులు యుద్ధం మట్టుకే తెలుసుతుంది ,కొంచం దూరంలో ఇంకొక స్తంబములో రాముడు ధనుర్దారిగా ఉండేటట్టు చెక్కబడివుంది.ఇందులో గొప్ప ఏమిటి అంటే మోదటి స్థంబము నుంచి చూస్తె శ్రీరాముడు కనపడడు కాని రెండవ స్తంబము నుంచి చూస్తె వాలిసుగ్రీవుల యుద్దము చాల బాగా తెలుస్తుంది.
3.ధర్మపురి(తమిళనాడు)
మల్లికార్జునస్వామీ కోవెలలోన వంగామంటపం అంటే తొమ్మిదిస్తంభముల మంటపం అన్నమాట.ఇందులో రెండు స్థంబములు భూమిపై ఆనకుండా గాలిలో వేలాడుతున్నట్టుగా ఉంటాయి .
4.కరూర్(కోయంబత్తూర్)
సమీపంలోని కుళిత్తలై అనే ఊరిలో
కదంబ వననాధస్వామి కోవెలలో రెండు నటరాజ విగ్రములు ఒకే మండపములో ప్రతిష్ట గావించబడి వున్నాయి.
5.గరుడుడు నాలుగుకరములతో( చేతులతో) అందులో రెంటిలో శంఖచక్రములతో దర్శనము ఇచ్చేది కుంబకోణం ప్రక్కన వేల్లియంగుడి అనే గ్రామ దెవాలయంలోమాత్రమే.
6.కుంభకోణంలో నాచ్చియార్కోవిల్ అనే స్థలంలో విష్ణుగుడి వుంది.అక్కడ గరుడవాహనం రాతితో చేసినది స్వామీ సన్నిధిలో ఉంది అది నలుగురు మోసే బరువు వుంటుంది.
కాని క్రమంగా ఒక్కొక్క ప్రాకారందాటి బయటకు వస్తుంటే రానురాను 8,16,32 అలా బయటవీదిలోకి వచ్చేటప్పటికి 64 మంది మోసే అంత బరువు అయిపోతుంది
మరి స్వామీగుడిలోనికి పోతున్నప్పుడు అదేవిధముగా బరువు తగ్గిపోతూ వుంటుంది ఇక బయటవీధికి వచ్చేటప్పటికి గరుడవిగ్రహమునకు చెమటపట్టడం కూడా ఒకవిచిత్రమే.
7.చెన్నైసమీపంలో శ్రీపెరుంబుదూర్ అనే స్థలములో రామానుజుల వారి గుడి వుంది అక్కడ మూలస్థానంలో విగ్రహం రాతిది కాదు
పంచలోహవిగ్రహము కాదు కేవలం
కుంకుమపువ్వు పచ్చకర్పూరం మూలికలతో చేసినది.
ఆశ్చర్యం కదా.
8.తిరునెల్వేలి కడయం మార్గములో నిత్యకల్యాణి సమేత విశ్వనాథస్వామి దేవాలయంలో ఒకబిల్వచెట్టు స్థలవృక్షం గా వుంది.ఆ చెట్టులో కాచే బిల్వకాయలు లింగాకారంలో వుంటాయి.
9.కుంభకోణం సమీపంలో తిరునల్లూరు అనే స్థలంలో ఈశ్వరుని గుడి వుంది అక్కడ శివలింగం రోజుకు ఐదువర్ణములుగా మారుతూ వుంటుంది అందుకే ఆ కోవేలని పంచవర్నేశ్వరుడు కోవెల అని పిలుస్తారు.
10.విరుదునగర్ ప్రక్కనా ధన్పుదూర్ అనే ఊరిలోని తవ(తపస్)నందీశ్వరుని కోవెలలో నందికి కొమ్ములు చెవులు వుండవు.
11.ఆంధ్రప్రదేశ్
సామర్లకోటలో మూడువీదుల సంగమములో ఒకపెద్ద ఆంజనేయ విగ్రహం వుంది.దీని ప్రత్యేకత ఆంజనేయ విగ్రహం కనులు భద్రాచల శ్రీరామసన్నిధిలో శ్రీరాముని పాదములు ఒకే ఎత్తులో వుండడం.
12.వేలూర్ సమీపంలో విరించిపురం అనే వూరి కోవెలలో ఒకస్థంభములో అర్ధచంద్రాకారముగా ఒకటి నుండి ఆరు వరకు,ఆరునుండి పంన్నెండు వరకు అంకెలు చెక్కబడి వున్నది .
పైన వుండే పల్లము నుండి మనము ఒక పుల్లను పెడితే నీడ ఏ అంకెపై పడుతుందో అదే అప్పటి సమయం.
గడియారం చూసుకొఖ్ఖర లేదు.
13.చెన్నైనుంచి తిరుపతి వెళ్ళే దారిలో నాగలాపురం వద్ద వేదనారాయణస్వామి కోవెలలో మూలవిగ్రహం శిరస్సునుంచి నడుమువరకు మానవఆకారం నడుమునుంచి పాదములవరకు మత్స్యఆకారంలో వుంటుంది.
14,ధర్మపురి(తమిళనాడు)పక్కన పదుహారు అంటే పదిమైళ్ళదూరంలో అభీష్టవరదస్వామీ అనే విష్ణుగుడిలో నవగ్రహములు స్త్రీ రూపముతో ఉంటారు.
ఇలా మనకు తెలియని , తెలిసినా పట్టించు కోకుండా గొప్పగా చెప్పుకోనివి ఇంకా ఎన్నో ప్రత్యేకతలు పూర్వకాలంలో ఆగమవిధానంగా కట్టిన దేవాలయాలు వున్నాయి.

రుద్రాక్షలు

రుద్రాక్షలు

contact for original rudrakshas : 9000123129



శివపురాణం, రుద్రాక్షోపనిషత్తు, రుద్రకారణ్యమహాత్యం, దేవిభాగవతం, రుద్రజాబాల్యుపనిషత్తు, లింగ పురాణం, స్కంద పురాణం, పద్మపురాణం లాంటి అనేక గ్రంథములలో రుద్రాక్షలవివరణ ఉన్నది.

రుద్రాకారణ్యమహాత్యం
ఒకప్పుడు త్రిపురాసుర పదార్థమైన నేను నిమిలిత నేత్రకుడినై యుండగా నాకన్నుల నుండి జలబిందువులు భూమ్మీద పడినవి ఆ జలబిందువుల నుండి సర్వజనులక్షేమార్థము రుద్రాక్ష వృక్షములు జనించినవి అని పరమేశ్వరుడు స్వయముగా చెప్పాడు.

''స్థావరత్వమనుప్రాప్య భక్తానుగ్రహకారణాత్
భక్తానాం ధారణత్పాపం దివారాత్రికృతం హరేత్
లక్షం తు దర్శనాత్పుణ్యం కోటిస్తద్ధారణాద్భవేత్"

అని రుద్రాక్షమాల గురించి "జాబాలోపనిషత్"లో పేర్కొనబడింది.

రుద్రుడు అంటే శివుడు, రాక్షసులతో ఫోరాడి, మూడు పురములను భస్మం చేసినపుడు మరణించిన వారిని చూసి విచారించాడు. అలా ఆయన విచారించినపుడు జాలువారిన కన్నీరు భూమిపై పడి చెట్లుగా మారాయి. వాటినుంచి నుంచి పుట్టినవే రుద్రాక్షలు. శ్రీశైల క్షేత్ర తూర్పు ద్వారమైన త్రిపురాంతక క్షేత్రంలో పరమశివుడు త్రిపురాసురులను సంహరించడంతో త్రిపురాంతక క్షేత్రమే రుద్రాక్షల జన్మస్థలమని కూడా చెబుతారు.

"ధాత్రీఫలప్రమాణం యచ్చ్రేష్ఠమేతదుదాహృతం
బదరీఫలమాత్రం తు మధ్యమం ప్రోచ్యతే బుధై:
అధమం చణమాత్రం స్యాత్ప్రక్రియైష మయోచ్యతే"

అంటే ఉసిరిక కాయంత పరిమాణమున్నవి ఉత్తమమైనవిగా, రేగుపండంత పరిమాణమున్నవి మధ్యమ జాతికి చెందినవిగా, శనగ గింజ పరిమాణం ఉన్నవి అధమమైనవిగా పేర్కొనబడుతున్నాయి. కాబట్టి రుద్రాక్షలను ధరించే సమయంలో వాటి పరిమాణమును కూడా గమనించాల్సివుంటుంది. తంత్ర శాస్త్ర ప్రకారం రుద్రాక్షలు ఎంత చిన్నవైతే అంత శక్తివంతమైనవి.

రుద్రాక్షలు

ఏకముఖి. (ఒక ముఖము కలిగినది) అత్యంత శ్రేష్టమయినది.
ద్విముఖి (రెండు ముఖములు కలిగినది) ఇది శివపార్వతుల స్వరూపం
త్రిముఖి (మూడు ముఖములు కలిగినది) త్రిమూర్తి స్వరూపం
చతుర్ముఖి (నాలుగు ముఖాలు కలిగినవది) నాలుగు వేదాల స్వరూపం
పంచముఖి (అయిదు ముఖాలు కలిగినది) పంచభూత స్వరూపం
షట్ముఖి (ఆరు ముఖములు కలది) కార్తికేయ రూపం
సప్తముఖి (ఏడు ముఖాలు కలిగినది) కామధేనువుగా పరిగరించుతారు
అష్టముఖి (ఎనిమిది ముఖాలు కలిగినది)విఘ్నేశ్వరరూపం
నవముఖి (తొమ్మిది ముఖాలు కలది) నవగ్రహ స్వరూపం.
దశముఖి (పది ముఖాలు కలిగినది) దశావతార స్వరూపం.

జనార్ధనుడికి ప్రతీక. అశ్వమేధ యాగం చేసినంత ప్రయోజనం కలుగుతుంది. దీనిని స్త్రీలు ఎక్కువగా ధరిస్తారు. ఇండస్ట్రియల్ స్కానింగ్ కానీ , డెంటల్ ఎక్స్ రే యంత్రంతో తీసిన ఎక్స్ రే ద్వారా నిజమైన రుద్రాక్షని గుర్తించవచ్చు
జన్మనక్షత్ర రీత్యా ధరించవలసిన రుద్రాక్షలు

నక్షత్రము --- ధరించవలసిన రుద్రాక్ష

అశ్వని --- నవముఖి
భరణి --- షణ్ముఖి
కృత్తిక --- ఏకముఖి, ద్వాదశముఖి
రోహిణి --- ద్విముఖి
మృగశిర --- త్రిముఖి
ఆరుద్ర --- అష్టముఖి
పునర్వసు --- పంచముఖి
పుష్యమి --- సప్తముఖి
ఆశ్లేష --- చతుర్ముఖి
మఖ -- నవముఖి
పుబ్బ --- షణ్ముఖి
ఉత్తర --- ఏకముఖి, ద్వాదశముఖి
హస్త --- ద్విముఖి
చిత్త --- త్రిముఖి
స్వాతి --- అష్టముఖి
విశాఖ --- పంచముఖి
అనురాధ --- సప్తముఖి
జ్యేష్ఠ --- చతుర్ముఖి
మూల --- నవముఖి
పూర్వాషాఢ --- షణ్ముఖి
ఉత్తరాషాఢ --- ఏకముఖి లేదా ద్వాదశముఖి
శ్రవణం --- ద్విముఖి
ధనిష్ట --- త్రిముఖి
శతభిషం --- అష్టముఖి
పూర్వాభాద్ర --- పంచముఖి
ఉత్తరాభాద్ర --- సప్తముఖి
రేవతి --- చతుర్ముఖి

Wednesday 29 June 2016

సాయిబాబా ప్రబోధించిన అసామాన్య గుణాలు......!!

సాయిబాబా ప్రబోధించిన అసామాన్య గుణాలు......!!


సర్వసాధారణంగా మనందరికీ ఇతర్ల గురించి కుతూహలం ఉంటుంది. తోటివాళ్ళేం
చేస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, ఎలా జేవిస్తున్నారు లాంటి అనేక అనవసర
విషయాలమీద దృష్టి పెడతాం. ఆ అంశాల్లో ఉన్న కుతూహలం నిజంగా అవసరమైన
విషయాల్లో ఉండదు. ముఖ్యంగా మన గురించి మనం తెలుసుకోవాలనుకోం.
ఆధ్యాత్మికంగా ఎదిగి ఔన్నత్యం సంపాదించాలనుకోం. సాయిబాబా ఇతర్ల విషయాలు
తెలుసుకోవాలనే ఈ రకమైన వైఖరిని పూర్తిగా ఖండించాడు. ఎవరికి వారు, ''నేను
ఎవర్ని? నేను ఈ లోకంలోకి ఎందుకు వచ్చాను, ఏం చేయాలి? ఏం చేస్తే జీవితం
సార్ధకమౌతుంది? - అని ఆలోచించి, ఎప్పటికప్పుడు మన నడవడిక తీర్చిదిద్దుకుంటూ,
ఆదర్శప్రాయంగా జీవించాలని షిర్డీ సాయిబాబా సామాన్యునిలా జీవించి, అసామాన్య
గుణాలను ప్రబోధించాడు.

ఇది వినడానికి చూడ్డానికి ఎంతో మామూలు అంశంలా కనిపిస్తుంది.
కానీ, ఇందులో ఎంతో లోతైన భావం ఉంది. మన గురించి మనం ఆలోచించడం మొదలుపెడితే మన కర్తవ్యం ఏమిటో తెలుస్తుంది. తోటివారికి సంబంధించిన అనవసరమైన ఆసక్తి తగ్గుతుంది.
అన్నిటినీ మించి ''నేను'', ''నా'' అనే స్వార్ధచింతన, అహంభావం తగ్గిపోతాయి.
సాయిబాబా ఇంకో విషయం కూడా స్పష్టంగా చెప్పాడు. తనను వెతుకుతూ భక్తులు ఎక్కడికీ పోనవసరం లేదన్నాడు. తాను ఈ ప్రపంచం లోని సకల జీవజాలంలో,వస్తువుల్లో.. అన్నిటిలో ఉన్నానని చాటి చెప్పాడు. ప్రతి జీవిలో చైతన్యం ఉంటుందని, ఆ చైతన్యమే దేవుడని గుర్తించాలని చెప్పాడు. దేవునికోసం అన్వేషణ మాని, మనం ఏం చేసినా అది దేవుడికి తెలుస్తుందని గుర్తుంచుకోవాలని చెప్పాడు. తోటివారిని ఏదో విధంగా బాధపెడుతూ, హింసిస్తూ దేవునికి పూజలు చేసినా ఫలితం ఉండదని, మంచి పనులు చేయడం ద్వారానే దేవునికి దగ్గర అవ్వాలని హితబోధ చేశాడు. మానవ సేవే
మాధవ సేవ అని ఎన్నోసార్లు గుర్తుచేశాడు. తోటివారిని విసిగించేవారు, బాధించేవారు పాపపు రాశులను పెంచుకుంటారని, ఆ ఫలితాన్ని అనుభవించక తప్పదని, తాము
కష్టపడి అయినా, ఇతర్లకు మేలు చేసేవారు జీవితాన్ని సార్ధకం చేసుకుంటారని స్పష్టం
చేశాడు.

పూజ్యాయ రాఘువేంద్రాయ

 పూజ్యాయ రాఘువేంద్రాయ


పూజ్యాయ రాఘువేంద్రాయ సత్య ధర్మ రతాయచ !
భజతాం కల్పవృక్షాయ నమతాం కామథేనవే !!
ఓం శ్రీ గురుభ్యో నమః

సాయి నామం....!

సాయి నామం....!

భగవంతుని పట్ల మనం ఎంత ఆరాధనాభావంతో ఉండాలో, వినయవిధేయతలు చూపాలో షిర్డీ సాయిబాబా స్వయంగా ఆచరించి చూపారు. దేవునికి వినమ్రంగా చేతులు జోడించాలని, మనల్ని మనం అర్పించుకోవాలని చెప్పేవారు బాబా.
సాయిబాబా అపూర్వ శక్తిసంపన్నుడు అయ్యుండీ తాను దైవాన్ని అని ఎన్నడూ చెప్పుకోలేదు. దేవుడు తనకు అప్పగించిన కార్యాలను నిర్వహించడానికి వచ్చానని చెప్పేవారు. భగవంతుని పట్ల అంతులేని ప్రేమను, వినయాన్ని ప్రకటించేవారు. సృష్టిలో దైవాన్ని మించింది ఇంకేదీ లేదని నిగర్వంగా చెప్పేవారు.

ఒక సందర్భంలో సాయిబాబా "నేను బానిసల్లో బానిసని. నీకు ఎంతగానో రుణపడి ఉన్నాను. నీ అపురూపమైన దర్శనంతో ఎనలేని ఆనందం కలుగుతోంది. సంతృప్తి చెందుతున్నాను. నీ పాదసేవ చేసుకోవడం నా అదృష్టం. ఈ భాగ్యాన్ని నాకు ఎన్నడూ దూరం చేయకు..." అన్నారు.
సాయిబాబా తన నడవడినే మనకు ఆదర్శంగా చేసి చూపారు. మనం ఆయన్ను అనుసరించే ప్రయత్నం చేస్తే సరిపోతుంది. ఒక్కరోజులో సర్వం వంటబట్టకున్నా క్రమక్రమంగా ఒక్కో లక్షణాన్నీ అలవరచుకోవచ్చు.
భగవంతునికి లేని సంపదలు అంటూ లేవు. ఆయన జ్ఞానానికి, కీర్తికి ఆకాశమే కొలమానం. దేవుడు మహా మహిమాన్వితుడు. భగవంతునికి ఏ ఒక్కరిమీదా ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు ఉండవు. కానీ అందరిమీదా ఔదార్యం చూపిస్తాడు.
మనం ఈ లోకలో అడుగుపెట్టింది జలసాలు, విలాసాలతో కాలక్షేపం చేస్తూ, సమయాన్ని వ్యర్ధం చేసుకోడానిక్కాదు. భగవన్నామస్మరణతో కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. భక్తులు, భగవంతుని చేరుకునే మార్గం సులభమైందేమీ కాదు. అది కొంచెం కష్టంతో కూడుకున్నదే. అభ్యాసంతో తేలికౌతుంది. సద్గురువు చేయి పట్టుకు నడిస్తే మరింత సులభసాధ్యమౌతుంది.
సాయిబాబా తనను దైవంగా చెప్పుకోక గురువుగా భావించమని మాత్రమే అనేవారు. బాబా సద్గురువు మాత్రమే కాదు, భగవంతుడేనని ఆయనతో కలిసి జీవించిన చాలామంది విశ్వసించారు. బాబా లీలలు మనలో చాలామందికి అనుభవమౌతున్నాయి.
సాయిబాబా చూపిన వినమ్రత, దయ, కరుణ, ఔదార్యం మొదలైన అద్భుత గుణాలను మనమూ అలవరచుకుందాం. వ్యర్థ విషయాలతో కాలాన్ని హరింపచేయకుండా, సాయి భగవాన్ నామస్మరణతో సద్వినియోగం చేసుకుందాం. జీవితాన్ని సార్ధకం చేసుకుందాం. సాయి నామం సుఖశాంతులనిస్తుంది.
ఓం సాయి.. శ్రీ సాయి.. జయ సాయి..

దత్తాత్రేయ రహస్యం....!!

దత్తాత్రేయ రహస్యం....!!

సమాజం లో కులభేధాలను మెట్టమెదటవ్యతిరేకించిన మహర్షి అత్రి.అస్పృశ్యులను ఆదరించారు.అస్పృశ్యతను ఆకాలంలోనే గట్టిగా వ్యతిరేకించారు.రజకులు ,చర్మకారులు నటకులు, కైవర్తకులు, మెదరులు ,కుమ్మరులు ,భిల్లులు, వీరందరికి యజ్ఞ,యాగాదివిషయాలలో భాగం కల్పించారు.అంతేకాకుండాయజ్ఞ,యాగాది విషయాలలో వారిని తాకరాదు,వీరిని తాకరాదు,నియమంలేదు యజ్ఞ,యాగాది విషయాలలో అందరు పాల్గోన వచ్చు అన్నది అత్రి అభిమతం.ఒక్కసారిఆలోచించండి ఇది ఏంత విప్లవాత్మక సంస్కరణో ఆలొచించండి. . అస్పృస్యత అనేది సమయ సందర్భాలను భట్టి మనుష్యులను ఆశ్రయించి వుంటుంది తప్ప శాశ్వితంగా ఒవ్యక్తినో ,వ్యక్తుల సమూహాన్నో అస్పృస్యత ఆశ్రయించివుండదనేది అత్రి అభిమతం. అంతేకాకుండాబ్రాహ్మణుల యెక్క శౌచవిధిని కూడా వివిరించారు. అంతేకాకుండాబ్రాహ్మణుల యెక్క శౌచవిధిని కూడా వివిరించారు.మాత్సర్యం,అసూయ ,అహంకారం,ధనాశ ఈ నాల్గు వున్నవాడు బ్రాహ్మణుడే కాదు అని తేల్చి చెప్పారు ఈ దుర్గుణాలు వున్న వ్యక్తి భ్రాహ్మణుడే కాదు అతని జపహోమాలు ,ఆచారము అనుష్టానుము ఎందుకు పనికిరావు అని శాసనం చేసారు. తెలుగు నేలతో అత్రిమహర్షికి ఎంతో అనుభందంవుంది గోదావరి తీరంలో గల అత్తిలి,ఆత్రేయపురం,అత్రిమహర్షి తిరగాడిననేల ముఖ్యంగా అత్తిలి అత్రిక్షేత్రంగా ప్రసిద్దిచెందింది.అత్రి పేరు మీదగానే అత్తిలి కి ఆ పేరు వచ్చింది ఆ ఊరిలో అత్రి దేవాలయం వుంది అందుకే శ్రీదత్తులవారు కలియుగంలో మెదటి అవతారమైన శ్రీపాదవల్లభులుగా గోదావరితీరంలోని స్వయంభూ కుక్కుటేశ్వర క్షేత్రమైన పీఠాపురగ్రామం లో అవతరించారు. ఇక అత్రిమహర్షి తపోశక్తి విషయానికి వస్తే పృధుచక్రవర్తి నిర్వహించిన ఆశ్వమేధయాగానికి అసూయ తో ఇంద్రుడు అవరోదం కల్పించినప్పుడు తన తపశక్తిని ఉపయోగించి ఇంద్రుని నిర్వీర్యంచేసాడు.అత్రిమహర్షి దయతోనే పృధుచక్రవర్తి ఆశ్వమేధాన్ని నిర్విఘ్నంగా నిర్వహించగలిగారు. మరోసారి దేవతలకు,రాక్షసులకు యుద్దం జరుగుతున్న సమయంలో సూర్య,చంద్రులిద్దరు రాహువు చేతిలోఘోరంగా దెబ్బతిని తమతేజస్సుని కోల్పోయారు.అప్పుడు వారిరువురు అత్రిమహర్షిని శరణువేడారు. శరణాగత రక్షకుడైన అత్రి మహర్షి తన తపశక్తి ని ఉపయోగించి వారికి దివ్యతేజో శరీరాలను కల్పించారు. అంతేకాకుండా భవిష్యత్తులో వారి తేజస్సును రాక్షసులు హరించకుండా వరమిచ్చారు. 

Tuesday 28 June 2016

Bhagavadgeetha




purathana anjaneya vigraham


బాలముకుందాష్టకం

బాలముకుందాష్టకం

కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతమ్ |
వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి || ౧ ||
సంహృత్య లోకాన్వటపత్రమధ్యే శయానమాద్యంతవిహీనరూపమ్ |
సర్వేశ్వరం సర్వహితావతారం బాలం ముకుందం మనసా స్మరామి || ౨ ||
ఇందీవరశ్యామలకోమలాంగం ఇంద్రాదిదేవార్చితపాదపద్మమ్ |
సంతానకల్పద్రుమమాశ్రితానాం బాలం ముకుందం మనసా స్మరామి || ౩ ||
లంబాలకం లంబితహారయష్టిం శృంగారలీలాంకితదంతపంక్తిమ్ |
బింబాధరం చారువిశాలనేత్రం బాలం ముకుందం మనసా స్మరామి || ౪ ||
శిక్యే నిధాయాద్యపయోదధీని బహిర్గతాయాం వ్రజనాయికాయామ్ |
భుక్త్వా యథేష్టం కపటేన సుప్తం బాలం ముకుందం మనసా స్మరామి || ౫ ||
కలిందజాంతస్థితకాలియస్య ఫణాగ్రరంగేనటనప్రియంతమ్ |
తత్పుచ్ఛహస్తం శరదిందువక్త్రం బాలం ముకుందం మనసా స్మరామి || ౬ ||
ఉలూఖలే బద్ధముదారశౌర్యం ఉత్తుంగయుగ్మార్జున భంగలీలమ్ |
ఉత్ఫుల్లపద్మాయత చారునేత్రం బాలం ముకుందం మనసా స్మరామి || ౭ ||
ఆలోక్య మాతుర్ముఖమాదరేణ స్తన్యం పిబంతం సరసీరుహాక్షమ్ |
సచ్చిన్మయం దేవమనంతరూపం బాలం ముకుందం మనసా స్మరామి || ౮ ||

సంతానం కోసం

సంతానం కోసం 






సంతానం కోసం దీక్ష తో పారాయణం చేయాలి
రామాయణం ,శ్రీ కృష్ణ భాగవతం ,దత్త చరిత్ర,హరివంశ పారాయణం 

సంతానం కోసం దానం
వెలగ పండు / కర్జురం దానం ఇవాలి.
సంక్రాంతి రోజు పెరుగు దానం ఇస్తే మంచి పిల్లలు పుడతారు. కొత్త కంచు పాత్ర లో నాటు ఆవు పాలు తేచి తోడు పెట్టి(పెరుగు తీయగా వుంటుంది) వేదం చదువుకునే వృధ దంపతులకి /గురువు గురు పత్ని కి / బ్రాహ్మణ / దంపతులకి (కులం తో పని లేదు ). సత్సంతానం కలుగుతుoన్ధి.

సంతానం కోసం వ్రతం

సంతాన గోపాలస్వామి వ్రతం
పుత్రదయి ఏకాదశి- శ్రావణ సుధా ఏకాదశి/పుష్య సుధా ఏకాదశి నుంచి మొదలు పెట్టి ఒక సంవత్సర కాలం ఏకాదశి వ్రతం చేస్తే సంవత్సరం లోపులో సంతానం కలుగుతుంది.
 
సంతానం కోసం మంత్రం
సంతాన గోపాలస్వామి మంత్రం
లలితసహస్రనామలు
గర్బరక్షంబిక మంత్రం
చదువుకుంటూ ఆవు వెన్న నయివేద్యం పెట్టి భార్య భర్త ఇదరు తినాలి.


సంతానం కోసం స్నానం
సర్ప సూక్తం చదువుకుంటూ - నాగ ప్రతిష్ట శ్రీశైలం/ రామేశ్వరం లో చేస్తే మంచిది.
సేతు స్నానం (రామ సేతు దగర స్నానం చేస్తే సంతన దోషాలు పోతాయి)
శివ లింగ ప్రతిష్ట.
పాడయిపోతున దేవాలయాలు/ జీర్ణం అయిపోతున దేవాలయాలు పునరుధరిస్తే (ధూపం, దీపం, నేయివేద్యం) అనేక దోషాలు పోతాయి .


నాగదోషం పోవడం కోసం
సర్ప సూక్తం పారాయణం చేయటం - కళ్యాణ స్థానం లో వున దోషం పోవటం కోసం
సప్తమ స్థానం లో/కి దోషం ఏర్పడడం వలన - ఎ జన్మలో నాగదోషం ఏర్పడుతుంది . పోవడానికి గరుడ ప్రదక్షిణ చేయలి.

గర్భం దాల్చిన తరువాత చదువుకోవలిసినవి

నిత్యం పాటించాల్సిన మంత్రాలూ : -

సంతాన గోపాలస్వామి మంత్రం
క్రీం అచ్చుత అనంత గోవింద

గర్బరక్షంబిక మంత్రం
నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః ।
పుత్ర సౌఖ్యం దేహి దేహి గర్భ రక్షం కురుష్వా నః I


Sunday 26 June 2016

వారఫలం (జూన్ 26-జూై1 2016)

 వారఫలం  (జూన్ 26-జూై1 2016)

మేషం
అశ్వని, భరణి, కృతికి 1 వ పాదం పరిచయాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. ఆర్థికస్థితి సంతృప్తికరం. రుణ విముక్తులవుతారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. పనులు ఆలస్యంగానైనా అనుకున్న విధంగా పూర్తి కాగలవు. ఆది, సోమ వారాల్లో వాగ్వాదాలు, అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలతో హడావుడిగా ఉంటారు. సొంత నిర్ణయాలే శ్రేయస్కరం. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వ్యాపారాల్లో ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. అధికారులకు ధనప్రలోభం తగదు. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. సన్మాన, సాహిత్య సభలు, కీలక సమావేశాల్లో పాల్గొంటారు.

వృషభం
కృత్తిక 2, 3, 4 పాదాలు. రోహిణి, మృగశిర 1, 2 పాదాలు సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకుంటారు. ఎదుటివారికి మీపై గౌరవం పెరుగుతుంది. రావలసిన ధనంలో కొంత మొత్తం అందుతుంది. చెల్లింపులు, చెక్కుల జారీలో జాగ్రత్త. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. కలసివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. బుధవారం నాడు కావలసిన వ్యక్తుల కలయిక అనుకూలించదు. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. షాపుల స్థల మార్పు కలిసివస్తుంది. ఇతరుల బాధ్యతలు చేపట్టి ఇబ్బందులెదుర్కుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి, స్వస్థల చలన మార్పు సంభవం. ఉపాధి పథకాల్లో రాణిస్తారు. వృత్తుల వారికి అవకాశాలు కలిసివస్తాయి. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. ఆస్తి, భూ వివాదాలు కొలిక్కి వస్తాయి. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు.


మిథునం
మృగశిర 3, 4 పాదాలు, ఆర్థ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు ఆర్థిక లావాదేవీలు ఏమంత సంతృప్తినీయవు. దుబారా ఖర్చులు విపరీతం. పొదుపు చేయాలన్న ఆలోచన ఫలించదు. ఆది, గురువారాల్లో పనులు మొదలెట్టే సమయానికి ఆటంకాలెదుర్కుంటారు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. ఆత్మీయుల హితవు మీపై చక్కని ప్రభావం చూపుతుంది. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. ప్రముఖుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏమంత సంతృప్తినీయవు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. వ్యాపారాలు వేగవంతమవుతాయి. నష్టాలు, ఆటంకాలను అధిగమిస్తారు. వృత్తుల వారికి ఆశాజనకం. సెన్సెక్స్ లాభాల బాటలో సాగుతుంది.

కర్కాటకం
పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. కొన్ని సంఘటనలు మీపై తీవ్ర ప్రభావం చూపుతాయి. లక్ష్యసాధనకు మరింతగా కృషి చేయాలి. మంగళ, శనివారాల్లో కొన్ని విషయాలు పెద్దగా పట్టించుకోవద్దు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు అధికం. పనులు, వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. వాగ్వాదాలు. పంతాలకు పోవద్దు. గుట్టుగా యత్నాలు సాగించండి. కొంతమంది మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం తగదు. విద్యార్థులకు రెండవ విడత కౌన్సిలింగ్ అనుకూలం. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. వృత్తుల వారికి అవకాశాలు కలిసివస్తాయి.

కర్కాటకం
పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. కొన్ని సంఘటనలు మీపై తీవ్ర ప్రభావం చూపుతాయి. లక్ష్యసాధనకు మరింతగా కృషి చేయాలి. మంగళ, శనివారాల్లో కొన్ని విషయాలు పెద్దగా పట్టించుకోవద్దు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు అధికం. పనులు, వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. వాగ్వాదాలు. పంతాలకు పోవద్దు. గుట్టుగా యత్నాలు సాగించండి. కొంతమంది మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం తగదు. విద్యార్థులకు రెండవ విడత కౌన్సిలింగ్ అనుకూలం. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. వృత్తుల వారికి అవకాశాలు కలిసివస్తాయి.

 సింహం
మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం సంప్రదింపులకు అనుకూలం. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థికంగా బాగుంటుంది. ఖర్చులు ప్రయోజనకరం. పొదుపు దిశగా ఆలోచిస్తారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు క్షేమం కాదు. పనుల్లో ఆటంకాలెదురైనా అనుకున్న విధంగా పూర్తి కాగలవు. గురు, శుక్రవారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు. కొంతమంది ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఒక సంఘటన మీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. విద్యార్థులకు రెండో విడత కౌన్సిలింగ్ అనుకూలం. వ్యాపారాల్లో నష్టాలు భర్తీ చేసుకుంటారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగ ప్రకటనలపై ఏకాగ్రత వహించండి. విశ్రాంత ఉద్యోగస్తులకు రావలసిన ధనం అందుతుంది. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.

కన్య
ఉత్తర 2, 3, 4 పాదాలు. హస్త, చిత్త 1, 2, పాదాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. పొదుపు పథకాలు లాభిస్తాయి. ఖర్చులు భారమనిపించవు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. పరిచయాలు విస్తరిస్తాయి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. శనివారం విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. సొంత నిర్ణయాలే అనుకూలం. చెప్పుడు మాటలను పట్టించుకోవద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అధికారులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం, విశ్రాంతి లోపం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఒక నష్టం మరో విధంగా భర్తీ చేసుకుంటారు. ప్రస్తుతం వ్యాపారాలే శ్రేయస్కరం. గృహ నిర్మాణాలు వేగవంతమవుతాయి. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆశాజనకం.

తుల
చిత్త 3, 4, పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు ప్రముఖులతో పరిచయాలు ఉన్నతికి దోహదం చేస్తాయి. అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. పదవులు, సభ్యత్వాల స్వీకరణకు మార్గం సుగమమవుతుంది. పొగడ్తలు, మొహమ్మాటాలకు తలొంచవద్దు. సన్నిహితులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలబడదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు సాదరవీడ్కోలు పలుకుతారు. నిరుద్యోగులు విద్యార్ధుల కృషి ఫలిస్తుంది. వాహనచోదకులకు దూకుడు తగదు

 వృశ్చికం
విశాఖ 4వ పాదం, అనూరాధ, జేష్ట్య ఈ వారం యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆందోళన కలిగించిన సమస్య తొలగుతుందియ. మానసికంగా స్థిమితపడుతారు. ఆలోచనలు కార్యరూపంలో పెట్టండి. పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఎవరికి హామీలివ్వవద్దు. ప్రతి విషయంలోను ఆచితూచి వ్యవహరించండి. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం అందుతుంది. బంధుమిత్రులతో విభేదాలు తలెత్తుతాయి. కొన్ని విషయాలు పెద్దగా పట్టించుకోవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. సంతానానికి విదేశీ విద్యావకాశం లభిస్తుంది. విద్యార్థులకు కొత్త పరిచయాలేర్పడుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి, బదిలీ ఉత్తర్వులు అందుతాయి. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరువ్యాపారులకు పురోభివృద్ధి.

ధనస్సు
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాలలో హడావుడిగా ఉంటారు. రుణయత్నం ఫలిస్తుంది. అవసరాలు నెరవేరుతాయి. ఒక సమాచారం ఉత్సాహానిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దంపతుల మధ్య సఖ్యత లోపం, చికాకులు తలెత్తుతాయి. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. ఆది, సోమవారాల్లో మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి అవకాశలివ్వవద్దు. పెద్దల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడస్తారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. సహోద్యోగులతో జాగ్రత్తగా మెలగండి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. వృత్తి ఉపాధి పథకాల్లో రాణిస్తారు. కోర్టు వ్యవహారాలు విచారణకు వస్తాయి.


మకరం
ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు వ్యవహార ఒప్పందాలలో ఏకాగ్రత వహించండి. తొందరపడి హామిలివ్వొద్దు. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. స్వయంకృషితో రాణిస్తారు. రాబోయే ఆదాయానికి ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. ఆలస్యంగానైనా అనుకున్న విధంగా పూర్తికాగలవు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. మంగళ, బుధవారాల్లో ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మీ శ్రీమతి సలహా పాటించండి. వ్యాపారాల్లో ఒడిదుడుకుల ధీటుగా ఎదుర్కొంటారు. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఉద్యోగయత్నం ఫలిస్తుంది. రిటైర్డు ఉద్యోగస్తులకు సాదర వీడ్కోలు పలుకుతారు. అధికారులకు కొత్త బాధ్యతలు, ఒత్తిడి పనిభారం విశ్రాంతి లోపం. జూదాలు, బెట్టింగ్‌ల వల్ల చిక్కుల్ల పడే ఆస్కారం ఉంది.

కుంభం
ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు నూతన పెట్టుబడులు, పొదుపు పథకాలకు అనుకూలం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. హోల్‌సేల్ వ్యాపారులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. నిర్ధిష్ట ప్రణాళికలతో యత్నాలు కొనసాగిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థికంగా కుదుటపడుతారు. ఖర్చులు భారమనిపించవు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆది, గురువారాల్లో పనులు సానుకూలంగా శ్రమిస్తారు పెద్దల గురించి ఆందోళన చెందుతారు. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. సంతానం చదువులపై మరింత శ్రద్ధ అవసరం. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. విద్యార్థులకు ఒత్తిడి అధికం. ఉద్యోగస్తుల కార్యక్రమాలకు ప్రశాంతగా సాగుతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ప్రయాణం తలపెడతారు.

మీనం
పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర, రేవతి ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. అధికారులు సహోద్యోగులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఉద్యోగుల ప్రకటనల పట్ల అహగాహన ముఖ్యం. దళారులను విశ్వసించకండి. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు కొత్త సమస్యలెదుర్కొంటారు. వృత్తుల వారికి ఆశాజనకం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. పరిచయాలు, వ్యాపకాలు పెరుగుతాయి. మంగళ, శని వారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి ఖర్చు చేస్తారు. శుభకార్యం నిశ్చయమవుతుంది. ఇచ్చిపుచ్చునే వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. బంధువుల వైఖరి నిరుత్సాహపరుస్తుంది. కోర్టు వ్యవహారాలు విచారణకు రావు.

తిరుమలలో తొలుత వరాహస్వామినే ఎందుకు దర్శనం చేసుకోవాలి?


తిరుమలలో  తొలుత వరాహస్వామినే ఎందుకు దర్శనం చేసుకోవాలి?




 తిరుమలకు వెళితే మొదటగా చాలామంది వరాహస్వామిని దర్శించుకున్న తర్వాతనే శ్రీవారి వద్దకు వెళుతుంటారు. అసలు వరాహస్వామి ఎవరో ఇప్పటికీ చాలామందికి తెలియదు. తిరుమల గిరులు ఉన్నాయంటే అందుకు కారణమే వరాహస్వామి. స్వామివారు ఉన్న ప్రాంతం నుంచి తిరుమల మొత్తం కూడా వరాహస్వామి వారిదే. ఆయన తన స్థలాన్ని శ్రీవారికి ఇచ్చేశారు. అందుకే వరాహస్వామికి తిరుమలలో ఎంతో ప్రాశస్త్యం ఉంది. తితిదే కూడా వరాహస్వామి ఆలయాన్ని స్వామి వారి నిలయం ఎడమభాగాన ప్రత్యేకంగా నిర్మించింది. ప్రతిరోజు ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం.


పూర్వం ఒకానొకప్పుడు జలప్రళయం ఏర్పడింది. ఆ ప్రళయంలో లోకాలన్నీ నీటితో మునిగిపోయాయి. అదే సందర్భంలో హిరణ్యాక్షుడనే దుష్టరాక్షసుడు భూమండలాన్ని బంతిగా చేసుకుని ఆడుకుంటూ నానాభీభత్సం చేస్తుంటాడు. చివరకు నీటిలో భూమిని ముంచి అల్లకల్లోలం చేస్తాడు. ఆ సమయంలో శ్రీమహావిష్ణువు శ్వేత వరాహరూపంలో అవతరించి తనవాడి కోరలతో హిరణ్యాక్షుడిని సంహరించి, నీటిలో మునుగుతున్న భూదేవిని ఉద్ధరించి రక్షించాడు. యక్ష కిన్నర గంధర్వాది దేవతలందరూ, శ్రీ భూవరాహస్వామి మీద పూలవానకురిపించి అనే విధాలుగా కీర్తించారు.


ఇదే శ్వేతవరాహ రూపంతోనే, భూదేవితో కూడి దర్శనం ఇస్తూ ఈ వేంకటాచల క్షేత్రంపైనే, మరికొంత కాలం పాటు దుష్టశిక్షణ, శిష్ట రక్షణ చేస్తూ ఉండవలసిందిగా అందరూ అనేక విధాలుగా ప్రార్థించారు. అందరి కోరికలను మన్నించి సరేనన్నాడు వరాహస్వామి. అప్పటి నుంచే శ్వేత వరాహకల్పం ప్రారంభమైంది. అంతేకాదు భూదేవిని రక్షించి భూదేవిలతో కలిసి ఆదివరాహస్వామి స్థిరపడి కొలువై దర్శనమిస్తూ ఉన్న ఈ దివ్యక్షేత్రమే ఆదివరాహక్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. అక్కడే ఆ క్షేత్రంలో కొలువై ఉన్న ఆది వరాహస్వామివారిని వకుళామాలిక అనే యోగిని సేవిస్తూ సపర్యలు చేస్తూ కాలక్షేపం చేస్తూ ఉండేది.


ఇలా కొంతకాలం గడిచింది. ఇంతో వృషభానుడుడనే క్రూర రాక్షసుడు ఆ కొండల్లో కోనల్లో తిరుగుతూ అక్కడ తనమాచరించుకుంటన్న మునులను బాధిస్తూ ఉండేవాడు. సజ్జనులను హింసిస్తూ ఉండేవాడు. వాళ్ళందరూ వెళ్ళి వరాహస్వామితో విన్నవించుకున్నారు. వారి బారి నుంచి తమను రక్షించమని అనేక విధాలుగా ప్రాదేయపడ్డారు. శ్వేత వరాహస్వామి చాలా కాలంపాటు ఆ వృష భాసురునితో యుద్ధం చేసి వాణ్ణి సంహరించాడు. అలా వీర విజయంతో తిరిగి వస్తున్న సందర్భంలో వరాహస్వామికి ఆ పర్వతంలో తలమీది గాయంతో రక్తం కారుతూ మూలికల కోసం అన్వేషిస్తూ ఉన్న శ్రీనివాసుడు కనపడ్డాడు.


శ్రీనివాసుని దీనగాథనంతా ఆలకించిన ఆదివరాహస్వామి వకుళామాలికను శ్రీనివాసునికి సేవ చెయ్యమని ఆదేశించాడు. వరాహస్వామివారి అనతిపై నియోగింపబడిన వకుళామాత ఆ క్షణం నుంచి శ్రీనివాసుని కన్నకొడుకువలె భక్తి ప్రేమలతో సేవించుతుండినది. ఇలా ఎంతో చరిత్ర కలిగిన వరాహస్వామిని  ముందుగానే దర్శిచుకుంటారు.

శ్రీమద్భగవద్గీత మొదటి అధ్యాయం అర్జునవిషాదయోగం

శ్రీమద్భగవద్గీత
మొదటి అధ్యాయం
అర్జునవిషాదయోగం
 

ధృతరాష్ట్ర ఉవాచ:
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః |
మామకాః పాండవాశ్చైవ కి మకుర్వత సంజయ || 1
ధృతరాష్టృడు: సంజయా ! ధర్మానికి నిలయమైన కురుక్షేత్రంలో యుద్ధసన్నద్ధులై నిలిచిన నా వాళ్ళూ, పాండవులూ ఏం చేశారు?
సంజయ ఉవాచ:
దృష్ఠ్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా |
ఆచార్య ముపసంగమ్య రాజా వచన మబ్రవీత్ || 2
సంజయుడు: యుద్ధానికి సంసిద్ధులైవున్న పాండవ సైన్యాలను చూసి, దుర్యోధనుడు ద్రోణాచార్యుల దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు.
పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చమూమ్ |
వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా || 3
ఆచార్యా ! మీ శిష్యుడూ, ధీమంతుడూ అయిన ధృష్టద్యుమ్నుడు వ్యూహం పన్నిన పాండవుల మహాసైన్యాన్ని చూడండి.
అత్ర శూరా మహేష్వాసాః, భీమార్జునసమా యుధి |
యుయుధానో విరాటశ్చ ద్రుపద శ్చమహారథః || 4
ధృష్టకేతు శ్చేకితానః కాశీరాజ శ్చ వీర్యవాన్ |
పురుజిత్కున్తిభోజశ్చ శైబ్యశ్చ నరపుఙ్గవః || 5
యుధామన్యుశ్చ విక్రాన్తః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ |
సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః || 6
ఈ పాండవుల సైన్యంలో ధైర్య సాహసవంతులూ, అస్త్ర విద్యానిపుణులూ, శౌర్యంలో భీమార్జున సమానులూ ఉన్నారు. సాత్యకి, విరాటుడు, ద్రుపదుడు, ధృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, శైభ్యుడు, యుధామన్యుడు, ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ఉపపాండవులు కూడా ఉన్నారు. వీళ్ళంతా మహారథులే.
అస్మాకం తు విశిష్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ |
నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే || 7
బ్రాహ్మణోత్తమా ! ఇక మన సైన్యంలో ఉన్న నాయకులూ, సుప్రసిద్ధులూ అయిన వాళ్ళ గురించి కూడా చెబుతాను.
భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితిఞ్జయః |
అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తి స్తథైవ చ || 8
అన్యే చ బహవశ్శూరాః మదర్థే త్యక్తజీవితాః |
నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః || 9
మీరు, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సౌమదత్తి వున్నారు. ఇంకా ఎంతోమంది శూరాగ్రేసరులూ, యుద్ధవిశారదులూ నా కోసం జీవితాల మీద ఆశ వదలి సిద్ధంగా వున్నారు.
అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితమ్ |
పర్యాప్తం త్విద మేతేషాం బలం భీమాభిరక్షితమ్ || 10
భీష్ముడు రక్షిస్తున్న మన సైన్యం అపరిమితం, భీముడి రక్షణలో వున్న పాండవ సైన్యం పరిమితం.
అయనేషు చ సర్వేషు యథాభాగ మవస్థితాః |
భీష్మమేవాభిరక్షంతు భవంత స్సర్వ ఏవ హి || 11
అందువల్ల మీరంతా యుద్ధరంగంలో మీ మీ స్థానాలు వదిలిపెట్టకుండా ఉండి భీష్ముణ్ణి కాపాడాలి.
తస్య సంజనయన్ హర్షం కురువృద్ధః పితామహః |
సింహనాదం వినద్యోచ్చైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్ || 12
అలా అంటున్న దుర్యోధనుడికి సంతోషం కలిగిస్తూ కురువృద్ధుడైన భీష్ముడు సింహనాదం చేసి శంఖం పూరించాడు.
తత శ్శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః |
సహసై వాభ్యహన్యంత స శబ్దస్తుములో௨భవత్ || 13
వెంటనే కౌరవవీరుల శంఖభేరీ ఢక్కామృదంగ గోముఖాది ధ్వనులతో దిక్కులన్నీ పిక్కటిల్లాయి.
తత శ్శ్వే తైర్హయై ర్యుక్తే మహతి స్యందనే స్థితౌ |
మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః || 14
అప్పుడు తెల్లగుర్రాలు కట్టిన మహారథం మీద కూర్చున్న కృష్ణార్జునులు కూడా తమ దివ్యశంఖాలు పూరించారు.
పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయః |
పౌండ్రం ధధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః || 15
అనంతవిజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః |
నకుల స్సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ || 16
కాశ్యశ్చ పరమేష్వాసః శిఖండీ చ మహారథః |
ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకి శ్చాపరాజితః || 17
ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే |
సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్ || 18
శ్రీకృష్ణుడు పాంచజన్యం, అర్జునుడు దేవదత్తం, భీముడు పౌండ్రకం ఊదారు. ధర్మరాజు అనంతవిజయం, నకుల సహదేవులు సుఘోషమణిపుష్పకాలూ పూరించారు. కాశీరాజు, శిఖండి, ధృష్టద్యుమ్నుడు, విరాటుడు, సాత్యకి, ద్రుపదుడు, ఉపపాండవులు, అభిమన్యుడు తమ తమ శంఖాలు అన్నివైపులా ఊదారు.
స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ |
నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్ || 19
ఆ శంఖధ్వనులు భూమి ఆకాశాలను దద్దరిల్లజేస్తూ కౌరవ వీరుల హృదయాలను బద్దలు చేశాయి.
అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః |
ప్రవృత్తే శస్త్రసంపాతే ధను రుద్యమ్య పాండవః || 20
హృషీకేశం తదా వాక్యం ఇద మాహ మహీపతే !
అర్జున ఉవాచ:
సేనయో రుభయో ర్మధ్యే రథం స్థాపయ మే௨చ్యుత ! 21
కురురాజా ! అప్పుడు అర్జునుడు యుద్ధసన్నద్ధులైన దుర్యోధనాదులను చూసి, గాండీవం ఎత్తిపట్టి శ్రీ కృష్ణుడితో " అచ్యుతా ! రెండు సేనల మధ్య నా రథాన్ని నిలబెట్టు" అన్నాడు.
యావ దేతాన్ నిరీక్షే௨హం యోద్దుకామా నవస్థితాన్ |
కైర్మయా సహ యోద్ధవ్యమ్ అస్మిన్ రణసముద్యమే || 22
యోత్స్యమానా నవేక్షే௨హం య ఏతే௨త్ర సమాగతాః |
ధార్తరాష్ట్రస్య దుర్భుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః || 23
"కృష్ణా ! శత్రు వీరులను చూడనీ, దుష్టుడైన దుర్యోధనుడికి సాయం చేయడనికి సమరరంగానికి వచ్చిన వాళ్ళందరినీ చూడాలనుకుంటున్నాను" అన్నాడు అర్జునుడు.
సంజయ ఉవాచ:
ఏవ ముక్తో హృషీకేశో గుడాకేశేన భారత |
సేనయో రుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమమ్ || 24
భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితామ్ |
ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి || 25
సంజయుడు: ధృతరాష్ట్రా ! అర్జునుడి మాటలు ఆలకించిన శ్రీకృష్ణుడు రెండు సేనల మధ్య భీష్మద్రోణాదులకు ఎదురుగా రథం ఆపి, అక్కడ చేరిన కౌరవ బలాన్ని అవలోకించమన్నాడు.
తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితౄనథ పితామహాన్ |
ఆచార్యాన్ మాతులాన్ భ్రాతౄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీం స్తథా || 26
శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయో రుభయో రపి |
తాన్ సమీక్ష్య స కౌన్తేయః సర్వాన్ బంధూనవస్థితాన్ || 27
కృపయా పరయా௨௨విష్టో విషీదన్నిద మబ్రవీత్.
అప్పుడు అర్జునుడు ఉభయ సేనలలోనూ యుద్ధానికి సిద్ధంగా వున్న తన తండ్రులనూ, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను; పౌత్రులనూ, మిత్రులనూ, బంధువులందరినీ చూశాడు. చూసి మిక్కిలి దయగలిగి దుఃఖిస్తూ విశేషకృపాంతరంగుడూ, విషాదవశుడు అయి ఇలా అన్నాడు.
అర్జున ఉవాచ:
దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితమ్ || 28
సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి |
వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే || 29
గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే |
న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః || 30
కృష్ణా ! యుద్ధాసక్తులై ఎదురుగా వున్న చుట్టాలను చూడగానే నా అవయవాలు తడబడుతున్నాయి. నోరు ఎండిపోతున్నది. శరీరమంతా గగుర్పాటుతో కంపిస్తున్నది. గాండీవం చేతిలోంచి జారిపోతున్నది. దేహం మండుతున్నది. నిలబడడానికి కూడా శక్తి లేదు. నా మనస్సు తల్లడిల్లుతున్నది.
నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ |
న చ శ్రేయో௨నుపశ్యామి హత్వా స్వజన మాహవే || 31
కేశవా ! దుశ్శకునాలు కానవస్తున్నాయి. యుద్ధంలో బంధువులను చంపడం వల్ల కలిగే మేలు ఏమీ గోచరించడం లేదు.
న కాంక్షే విజయం కృష్ణ ! న చ రాజ్యం సుఖాని చ |
కిం నో రాజ్యేన గోవింద ! కిం భోగై ర్జీవితేన వా? || 32
కృష్ణా ! యుద్ధవిజయం మీద, రాజ్యసుఖాలమీద నాకు ఆసక్తిలేదు. రాజ్యభోగాలతో కూడిన జీవితం వల్ల ప్రయోజనం ఏమీ లేదు.
యేషా మర్థే కాంక్షితం నో రాజ్యం భోగాస్సుఖాని చ |
త ఇమే௨వస్థితా యుద్ధే ప్రాణాం స్త్యక్త్వా ధనాని చ || 33
ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహాః |
మాతులాశ్శ్వశురాః పౌత్రాః స్యాలాస్సబంధిన స్తథా || 34
ఎవరికోసం రాజ్యం, భోగం, సుఖం కోరుతున్నామో వాళ్ళంతా---గురువులు, తండ్రులు, కుమారులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావమరదులు, ఇతర బంధువులూ---ధన ప్రాణాల మీద ఆశవదలి ఈ రణరంగంలోనే ఉన్నారు.
ఏతా న్న హంతు మిచ్చామి ఘ్నతో௨పి మధుసూదన |
అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకృతే || 35
మధుసూదనా ! వాళ్ళు నన్ను చంపితే చంపనీ, ముల్లోకాలనూ ఏలే అవకాశం కలిగినా నేను మాత్రం వాళ్ళను వధించదలచుకోలేదు. అలాంటప్పుడు ఈ రాజ్యం కోసం వాళ్ళను చంపుతానా ?
నిహత్య ధార్తరాష్ట్రా న్నః కా ప్రీతి స్స్యా జ్జనార్దన? |
పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతా నాతతాయినః || 36
దుర్యోధనాదులను సంహరించి మనం పొందే సంతోషమేమిటి? జనార్దనా ! ఈ పాపాత్ములను చంపితే మనకూ పాపమే.
తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ |
స్వజనం హి కథం హత్వా సుఖిన స్స్యామ మాధవ || 37
బంధువులైన దుర్యోధనాదులను చంపడం మనకు మంచిదికాదు. మాధవా ! స్వజనాన్ని వధించి ఎలా సుఖపడగలం ?
యద్య ప్యేతే న పశ్యంతి లోభోపహతచేతసః |
కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకమ్ || 38
రాజ్యకాంక్షాపరులైన కౌరవులు వంశనాశనం, మిత్రద్రోహం వల్ల కలిగే పాతకాన్ని గ్రహించలేక పోతున్నారు.
కథం న జ్ఞేయ మస్మాభిః? పాపాదస్మాన్నివర్తితుమ్ |
కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భి ర్జనార్దన || 39
జనార్దనా ! వంశక్షయంవల్లవచ్చే దోషాన్ని బాగా తెలిసిన మనమైనా ఆ పాపం నుంచి ఎందుకు తప్పించుకోకూడదు ?
కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా స్సనాతనాః |
ధర్మే నష్టే కులం కృత్స్నమ్ అధర్మో௨భిభవత్యుత || 40
వంశనాశనంతో ప్రాచీన కుల ధర్మాలు నశిస్తాయి. కుల ధర్మాలు నశించిన వంశమంతటా అధర్మం అలుముకుంటుంది.
అధర్మా௨భిభవాత్ కృష్ణ! ప్రదుష్యన్తి కులస్త్రియః |
స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః || 41
కృష్ణా ! అధర్మం ప్రబలితే కులస్త్రీలు చెడిపోతారు. దానితో జాతి సంకరం జరుగుతుంది.
సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ |
పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియాః || 42
వర్ణసంకరం వల్ల కులానికీ, కులనాశకులకూ కలిగేది నరకమే. వారి పితృదేవతలు పిండోదక కార్యాలు లేక అధోగతి పాలవుతారు.
దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః |
ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః || 43
కులాన్ని నాశనంచేసే వాళ్ళమూలంగా కలిగే వర్ణసాంకర్యం కారణంగా శాశ్వతాలైన జాతిధర్మాలూ, కులధర్మాలూ అడుగంటిపోతాయి.
ఉత్సన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్దన |
నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమ || 44
జనార్దనా ! కులధర్మాలు నశించిన కుటుంబాలవారు శాశ్వత నరక వాసులవుతారని వింటున్నాము.
అహో ! బత ! మహత్పాపం కర్తుం వ్యవసితా వయమ్ |
యద్రాజ్యసుఖలోభేన, హంతుం స్వజన ముద్యతాః || 45
ఎంత ఆశ్చర్యం ! రాజ్యలోభంతో బంధువులను చంపడానికి పూనుకుని, ఘోరపాపాలు చేయడానికి సిద్ధపడ్డాం కదా.
యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః |
ధార్తరాష్ట్రా రణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్ || 46
ఆయుధాలు ధరించిన ధార్తరాష్ట్రులు అస్త్రశస్త్రాలు విసర్జించిన నన్ను యుద్ధంలో సంహరిస్తే అది నాకు మరింత మంచిది.
సంజయ ఉవాచ:
ఏవ ముక్త్వా௨ర్జున స్సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ |
విసృజ్య సశరం చాపం శోక సంవిగ్న మానసః || 47
సంజయుడు: అర్జునుడు అలా చెప్పి దుఃఖాక్రాంతుడై విల్లమ్ములు విడిచిపెట్టి రణరంగంలో రథం మీద చతికిలబడ్డాడు.
ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్భగవద్గీతలోని "అర్జున విషాదయోగం" అనే మొదటి అధ్యాయం సమాప్తం.

లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం

లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం

శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే భోగీంద్రభోగమణిరాజిత పుణ్యమూర్తే |
యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || ౧ ||
బ్రహ్మేంద్రరుద్రమరుదర్కకిరీటకోటి సంఘట్టితాంఘ్రికమలామలకాంతికాంత |
లక్ష్మీలసత్కుచసరోరుహరాజహంస లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || ౨ ||
సంసారదావదహనాకరభీకరోరు-జ్వాలావళీభిరతిదగ్ధతనూరుహస్య |
త్వత్పాదపద్మసరసీరుహమాగతస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || ౩ ||
సంసారజాలపతితతస్య జగన్నివాస సర్వేంద్రియార్థ బడిశాగ్ర ఝషోపమస్య |
ప్రోత్కంపిత ప్రచురతాలుక మస్తకస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || ౪ ||
సంసారకూమపతిఘోరమగాధమూలం సంప్రాప్య దుఃఖశతసర్పసమాకులస్య |
దీనస్య దేవ కృపయా పదమాగతస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || ౫ ||
సంసారభీకరకరీంద్రకరాభిఘాత నిష్పీడ్యమానవపుషః సకలార్తినాశ |
ప్రాణప్రయాణభవభీతిసమాకులస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || ౬ ||
సంసారసర్పవిషదిగ్ధమహోగ్రతీవ్ర దంష్ట్రాగ్రకోటిపరిదష్టవినష్టమూర్తేః |
నాగారివాహన సుధాబ్ధినివాస శౌరే లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || ౭ ||
సంసారవృక్షబీజమనంతకర్మ-శాఖాయుతం కరణపత్రమనంగపుష్పమ్ |
ఆరుహ్య దుఃఖఫలితః చకితః దయాళో లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || ౮ ||
సంసారసాగరవిశాలకరాళకాళ నక్రగ్రహగ్రసితనిగ్రహవిగ్రహస్య |
వ్యగ్రస్య రాగనిచయోర్మినిపీడితస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || ౯ ||
సంసారసాగరనిమజ్జనముహ్యమానం దీనం విలోకయ విభో కరుణానిధే మామ్ |
ప్రహ్లాదఖేదపరిహారపరావతార లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || ౧౦ ||
సంసారఘోరగహనే చరతో మురారే మారోగ్రభీకరమృగప్రచురార్దితస్య |
ఆర్తస్య మత్సరనిదాఘసుదుఃఖితస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || ౧౧ ||
బద్ధ్వా గలే యమభటా బహు తర్జయంత కర్షంతి యత్ర భవపాశశతైర్యుతం మామ్ |
ఏకాకినం పరవశం చకితం దయాళో లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || ౧౨ ||
లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణో యజ్ఞేశ యజ్ఞ మధుసూదన విశ్వరూప |
బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || ౧౩ ||
ఏకేన చక్రమపరేణ కరేణ శంఖ-మన్యేన సింధుతనయామవలంబ్య తిష్ఠన్ |
వామేతరేణ వరదాభయపద్మచిహ్నం లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || ౧౪ ||
అంధస్య మే హృతవివేకమహాధనస్య చోరైర్మహాబలిభిరింద్రియనామధేయైః |
మోహాంధకారకుహరే వినిపాతితస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || ౧౫ ||
ప్రహ్లాదనారదపరాశరపుండరీక-వ్యాసాదిభాగవతపుంగవహృన్నివాస |
భక్తానురక్తపరిపాలనపారిజాత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || ౧౬ ||
లక్ష్మీనృసింహచరణాబ్జమధువ్రతేన స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ |
యే తత్పఠంతి మనుజా హరిభక్తియుక్తా-స్తే యాంతి తత్పదసరోజమఖండరూపమ్ || ౧౭ ||

దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కరించకూడదు.

 దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కరించకూడదు.


దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కరించకూడదు. ఎందుకంటే దక్షిణ దిక్కున యమధర్మరాజు గారు ఉంటారు. ఎవరైనా మనకి నమస్కరిస్తే దానిని ఊరికే పుచ్చుకోకూడదు. వారిని ఆశీర్వదించి వారిని మనం ఏ రకంగా అనుగ్రహించగలమో ఆ విధంగా కాపాడాలి.
ఇప్పుడు యమధర్మరాజు గారికి నమస్కరిస్తే? ఆయన శక్తి అనుసారంగా ఆయన ఎలా అనుగ్రహించగలరో అలా అనుగ్రహిస్తారు. తప్ప నమస్కారాన్ని ఊరికే పుచ్చుకోరు ఎవరు. తప్పనిసరిగా ఆశీర్వదించి తీరాలి ఎంత మేరకు వీలైతే అంత వరకు. ఒహో వీడికి పాపం ఈ శరీరం బాధాకరంగా ఉన్నట్టుంది అందుకని నన్ను శరణు వేడుతున్నాడు అని శరీరంతో ఉన్న బంధనాన్ని తీసి వేస్తారు. లేదా, రోగాలు ప్రబలడానికి కారణం యమధర్మ రాజు గారి ఆగ్రహం అంటారు. ఒహో నాకు నమస్కరించావు కదా, సరేరా అబ్బాయి, నువ్వు చేస్కున్న పాపాలన్ని ఈ రోగం రూపంలో అనుభవించేయి, అప్పుడు ఇక నీకు వాటితో ఒక గొడవ వదిలిపోతుంది అని ఒక రోగాన్ని ప్రసాదిస్తారు చేస్కున్న పాపాలు అన్ని పోయేలాగ. ఆయన చేతుల్లో పనులేంటో అవి కటాక్షించగలరు. కానీ ఈ రెండూ కూడా సహజంగా ఎవరూ కోరుకునే కోరికలు కాదు కాబట్టి దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కరించకూడదు.
ఒక్క సంధ్యావందనం చేసేటప్పుడు అన్ని దిక్కులకి పెట్టే నమస్కారం తప్ప, ఇక వేరే ఎప్పుడూ దక్షిణ దిక్కుకి నమస్కారం పెట్టకూడదు. ఒకవేళ ఎవరైన పెద్దవారు దక్షిణ దిక్కున నిలబడినప్పుడు వారికి నమస్కరించాలి అనుకుంటే అయ్యా కాస్త ఇటుగా తిరగండి మీకు నమస్కరించుకుంటాను అని చెప్పి దిక్కు మరల్చి అప్పుడు నమస్కరించాలి. అది గురువుకైనా సరే తల్లిదండ్రులకైనా సరే.

రుక్మిణీ కళ్యాణాన్ని విన్నంత మాత్రం చేత కన్యకామణులందరికీ శుభం కలుగుతుంది.

రుక్మిణీ కళ్యాణాన్ని విన్నంత మాత్రం చేత కన్యకామణులందరికీ శుభం కలుగుతుంది.


రుక్మిణీ కళ్యాణాన్ని పెళ్ళి కాని పిల్లలు కనుక వింటే,అల్పాయుర్దాయము కలవాడు, అన్యోన్య దాంపత్యం జరగనివాడు,ఆడపిల్లని హింసపెట్టేవాడు,ఆమె మనసు బాధ పడటానికి కారణం అయినవాడు భర్తగా రావాలి అని రాసిపెట్టి ఉంటే,ఆ నొసటి రాత తొలగుతుంది అని సంప్రదాయజ్ఞులు వ్యాఖ్యానం చేస్తారు.
అంత గొప్పది రుక్మిణీ కళ్యాణం.అందుకే ఆడపిల్లలకి రుక్మిణీ కళ్యాణం చేయించకుండా పెళ్ళి ప్రయత్నం చెయ్యరు.అటువంటి రుక్మిణీ కళ్యాణం లో ఆ లేఖ,ఆ పద్యాలు విన్నంత మాత్రం చేత కన్యకామణులందరికీ శుభం కలుగుతుంది.తప్పకుండా పెళ్ళి ఈడు వచ్చిన ఆడపిల్లలందరికి రుక్మిణీ కళ్యాణాన్ని,దాని గొప్పతనాన్ని వర్ణించి పారయణం చేయించాలి.పెళ్ళైపొయినవారికి అక్కర్లేదా అండి అని అడిగితే పెళ్ళి అయిపొయిన వారు వింటే వారికి కృష్ణానుగ్రహం కలుగుతుంది.

Friday 24 June 2016

శ్రీవారి పచ్చకర్పూరం యొక్క మహిమ....!!

శ్రీవారి పచ్చకర్పూరం యొక్క మహిమ....!!


కలియుగ వైకుంఠంశ్రీవేంకటేశ్వరస్వామికి ప్రతి నిత్యం పూజారులు పచ్చకర్పూర తిలకాన్ని పెడుతుంటారు. ఈ పచ్చ కర్పూరాన్ని కుంకుమలో కలిపి నుదుటన ధరిస్తే సాక్షాత్తు వెంకన్న స్వామి అనుగ్రహం లభిస్తుది. 


ఇంకా స్వామివారి ప్రసాదమైన పచ్చకర్పూరాన్ని పాలల్లో వేసుకుని తాగితే స్వామివారి ప్రసాదం సేవించినంత ఫలితం ఉంటుంది. అలాగే వెంకన్న పచ్చకర్పూరాన్ని కుంకుమపువ్వు రెంటినీ కలిపి డబ్బుల డబ్బాలో పెట్టుకుంటే ధనలాభం కలుగుతుంది.


వ్యాపారాలు ప్రతిరోజూ స్వామివారి పచ్చకర్పూర కుంకుమను నుదుటికి పెట్టుకుంటే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఇంకా స్వామివారి పచ్చకర్పూరంతో హోమం చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.
స్వామివారి పచ్చకర్పూరాన్ని నీటిలో కలిపి ముక్కు, ఎద, నుదుటికి రాసుకుంటే తలనొప్పి, జలుబు నయమైపోతాయి. స్వామివారి పచ్చకర్పూరాన్ని కొబ్బరినూనెలో కలిపి తలకు పెట్టుకుంటే జుట్టు సుగంధమయం అవుతుంది.

అలాగే స్వామివారి పచ్చకర్పూరాన్ని తీపి పదార్థాలతో కలిపి దేవునికి నైవేద్యంగా పెట్టి దానం చేస్తే ఆ యింట శుభకార్యాలు త్వరగా జరుగుతాయి. స్వామివారి పచ్చకర్పూరాన్ని దేవాలయానికి దానం చేస్తే రాజసన్మానం, సంఘంలో గౌరవమర్యాదలు లభిస్తాయి.

స్వామివారి పచ్చకర్పూరం, పాలతో మంగళవారం సుబ్రహ్మణ్యస్వామికి అభిషేకం చేసి ఆ పాలను తాగుతూ ఉంటే అన్ని రకాల గర్భదోషాలు నివృత్తి కలిగి సంతానం లేని వారికి సంతానం యోగం కలుగుతుంది.

  పచ్చకర్పూరం యొక్క కుంకుమ,తిలకo కొసం  సంప్రదిoచoడి.ph 9000123129

గోవింద నామాలు.......!!

గోవింద నామాలు.......!!


శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశా గోవిందా
భక్త వత్సల గోవిందా భాగవతా ప్రియ గోవిందా
నిత్య నిర్మల గోవిందా నీలమేఘ శ్యామ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

పురాణ పురుషా గోవిందా పుండరీకాక్ష గోవిందా
నంద నందనా గోవిందా నవనీత చోరా గోవిందా
పశుపాలక శ్రీ గోవిందా పాప విమోచన గోవిందా
దుష్ట సంహార గోవిందా దురిత నివారణ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
శిష్ట పరిపాలక గోవిందా కష్ట నివారణ గోవిందా
వజ్ర మకుటధర గోవిందా వరాహ మూర్తీ గోవిందా
గోపీజన లోల గోవిందా గోవర్ధనోద్ధార గోవిందా
దశరధ నందన గోవిందా దశముఖ మర్ధన గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
పక్షి వాహనా గోవిందా పాండవ ప్రియ గోవిందా
మత్స్య కూర్మ గోవిందా మధు సూధనా హరి గోవిందా
వరాహ న్రుసింహ గోవిందా వామన భృగురామ గోవిందా
బలరామానుజ గోవిందా బౌద్ధ కల్కిధర గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
వేణు గాన ప్రియ గోవిందా వేంకట రమణా గోవిందా
సీతా నాయక గోవిందా శ్రితపరిపాలక గోవిందా
దరిద్రజన పోషక గోవిందా ధర్మ సంస్థాపక గోవిందా
అనాథ రక్షక గోవిందా ఆపధ్భాందవ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
శరణాగతవత్సల గోవిందా కరుణా సాగర గోవిందా
కమల దళాక్షా గోవిందా కామిత ఫలదాత గోవిందా
పాప వినాశక గోవిందా పాహి మురారే గోవిందా
శ్రీముద్రాంకిత గోవిందా శ్రీవత్సాంకిత గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
ధరణీ నాయక గోవిందా దినకర తేజా గోవిందా
పద్మావతీ ప్రియ గోవిందా ప్రసన్న మూర్తే గోవిందా
అభయ హస్త గోవిందా అక్షయ వరదా గోవిందా
శంఖ చక్రధర గోవిందా సారంగ గదాధర గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
విరాజ తీర్థ గోవిందా విరోధి మర్ధన గోవిందా
సాలగ్రామ హర గోవిందా సహస్ర నామ గోవిందా
లక్ష్మీ వల్లభ గోవిందా లక్ష్మణాగ్రజ గోవిందా
కస్తూరి తిలక గోవిందా కాంచనాంబరధర గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
గరుడ వాహనా గోవిందా గజరాజ రక్షక గోవిందా
వానర సేవిత గోవిందా వారథి బంధన గోవిందా
ఏడు కొండల వాడా గోవిందా ఏకత్వ రూపా గోవిందా
రామ క్రిష్ణా గోవిందా రఘుకుల నందన గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
ప్రత్యక్ష దేవ గోవిందా పరమ దయాకర గోవిందా
వజ్ర మకుటదర గోవిందా వైజయంతి మాల గోవిందా
వడ్డీ కాసుల వాడా గోవిందా వాసుదేవ తనయా గోవిందా
బిల్వపత్రార్చిత గోవిందా భిక్షుక సంస్తుత గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
స్త్రీ పుం రూపా గోవిందా శివకేశవ మూర్తి గోవిందా
బ్రహ్మానంద రూపా గోవిందా భక్త తారకా గోవిందా
నిత్య కళ్యాణ గోవిందా నీరజ నాభా గోవిందా
హతి రామ ప్రియ గోవిందా హరి సర్వోత్తమ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
జనార్ధన మూర్తి గోవిందా జగత్ సాక్షి రూపా గోవిందా
అభిషేక ప్రియ గోవిందా అభన్నిరాసాద గోవిందా
నిత్య శుభాత గోవిందా నిఖిల లోకేశా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
ఆనంద రూపా గోవిందా అధ్యంత రహిత గోవిందా
ఇహపర దాయక గోవిందా ఇపరాజ రక్షక గోవిందా
పద్మ దలక్ష గోవిందా పద్మనాభా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
తిరుమల నివాసా గోవిందా తులసీ వనమాల గోవిందా
శేష సాయి గోవిందా శేషాద్రి నిలయ గోవిందా
శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

భావములోన బాహ్యమునందును....

భావములోన బాహ్యమునందును.......








భావములోన బాహ్యమునందును
గోవిందా గోవిందా యని కొలువవో మనసా
హరి యవతారములే యఖిలదేవతలు
హరిలోనివే బ్రహ్మండంబులు
హరినామములే అన్ని మంత్రులు
హరి హరి హరి హరి యనవో మనసా "భావ"

విష్ణుని మహిమలే విహిత కర్మములు
విష్ణుని పోగడెడి వేదంబులు
విష్ణుఁ డోక్కడే విశ్వాంతరాత్ముఁ డు
విష్ణువు విష్ణువని వెదకవో మనసా "భావ"
అచ్యుతుఁ డితఁడే అదియు సూత్రము
అచ్యుతుఁడే యసురాంతకుఁడు
అచ్యుతుఁ డు శ్రీ వేంకటాద్రి మీఁ ద నిదె
అచ్యుత యచ్యుత శరణనవో మనసా " భావ".

Thursday 23 June 2016

కనకధారాస్తోత్రం........!!

కనకధారాస్తోత్రం........!!


వందే వందారు మందారం ఇందిరానంద కందలమ్ |
అమందానందసందోహం బంధురం సింధురాననం ||
అంగం హరేః పులకభూషణమాశ్రయంతీ
భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ |
అంగీకృతాఖిలవిభూతిరపాంగలీలా
మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః ||

ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః
ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని |
మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా
సా మే శ్రియం దిశతు సాగరసంభవాయాః ||

ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందమ్-
ఆనందకందమనిమేషమనంగతంత్రమ్ |
ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం
భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః ||
బాహ్వంతరే మధుజితః శ్రితకౌస్తుభే యా
హారావళీవ హరినీలమయీ విభాతి |
కామప్రదా భగవతోఽపి కటాక్షమాలా
కళ్యాణమావహతు మే కమలాలయాయాః ||

కాలాంబుదాళిలలితోరసి కైటభారేః
ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ |
మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః
భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః ||
ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్
మాంగళ్యభాజి మధుమాథిని మన్మథేన |
మయ్యాపతేత్తదిహ మంథరమీక్షణార్ధం
మందాలసం చ మకరాలయకన్యకాయాః ||

విశ్వామరేంద్రపదవిభ్రమదానదక్షం
ఆనందహేతురధికం మురవిద్విషోఽపి |
ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం
ఇందీవరోదరసహోదరమిందిరాయాః ||

ఇష్టా విశిష్టమతయోఽపి యయా దయార్ద్ర
దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే |
దృష్టిః ప్రహృష్ట కమలోదరదీప్తిరిష్టాం
పుష్టిం కృషీష్ట మమ పుష్కరవిష్టరాయాః ||
దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారా-
మస్మిన్న కించన విహంగశిశౌ విషణ్ణే |
దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం
నారాయణప్రణయినీనయనాంబువాహః ||

గీర్దేవతేతి గరుడధ్వజసుందరీతి
శాకంభరీతి శశిశేఖరవల్లభేతి |
సృష్టిస్థితిప్రళయకేలిషు సంస్థితాయై
తస్యై నమస్త్రిభువనైకగురోస్తరుణ్యై ||
శ్రుత్యై నమోఽస్తు శుభకర్మఫలప్రసూత్యై
రత్యై నమోఽస్తు రమణీయగుణార్ణవాయై |
శక్త్యై నమోఽస్తు శతపత్రనికేతనాయై
పుష్ట్యై నమోఽస్తు పురుషోత్తమవల్లభాయై ||
నమోఽస్తు నాళీకనిభాననాయై
నమోఽస్తు దుగ్ధోదధిజన్మభూమ్యై |
నమోఽస్తు సోమామృతసోదరాయై
నమోఽస్తు నారాయణవల్లభాయై ||
నమోఽస్తు హేమాంబుజపీఠికాయై
నమోఽస్తు భూమండలనాయికాయై |
నమోఽస్తు దేవాదిదయాపరాయై
నమోఽస్తు శార్ఙ్గాయుధవల్లభాయై ||

నమోఽస్తు దేవ్యై భృగునందనాయై
నమోఽస్తు విష్ణోరురసిస్థితాయై |
నమోఽస్తు లక్ష్మ్యై కమలాలయాయై
నమోఽస్తు దామోదరవల్లభాయై ||
నమోఽస్తు కాంత్యై కమలేక్షణాయై
నమోఽస్తు భూత్యై భువనప్రసూత్యై |
నమోఽస్తు దేవాదిభిరర్చితాయై
నమోఽస్తు నందాత్మజవల్లభాయై ||

సంపత్కరాణి సకలేంద్రియనందనాని
సామ్రాజ్యదానవిభవాని సరోరుహాక్షి |
త్వద్వందనాని దురితాహరణోద్యతాని
మామేవ మాతరనిశం కలయంతు మాన్యే ||
యత్కటాక్షసముపాసనావిధిః
సేవకస్య సకలార్థసంపదః |
సంతనోతి వచనాంగమానసైః
త్వాం మురారిహృదయేశ్వరీం భజే ||

సరసిజనిలయే సరోజహస్తే
ధవళతమాంశుకగంధమాల్యశోభే |
భగవతి హరివల్లభే మనోజ్ఞే
త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్ ||
దిగ్ఘస్తిభిః కనకకుంభముఖావసృష్ట
స్వర్వాహినీ విమలచారుజలప్లుతాంగీమ్ |
ప్రాతర్నమామి జగతాం జననీమశేష
లోకాధినాథగృహిణీమమృతాబ్ధిపుత్రీమ్ ||

కమలే కమలాక్షవల్లభే త్వం
కరుణాపూరతరంగితైరపాంగైః |
అవలోకయ మామకించనానాం
ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః ||
దేవి ప్రసీద జగదీశ్వరి లోకమాతః
కళ్యాణదాత్రి కమలేక్షణజీవనాథే |
దారిద్ర్యభీతిహృదయం శరణాగతం మామ్
ఆలోకయ ప్రతిదినం సదయైరపాంగైః ||

స్తువంతి యే స్తుతిభిరమీభిరన్వహం
త్రయీమయీం త్రిభువనమాతరం రమామ్ |
గుణాధికా గురుతరభాగ్యభాగినో
భవంతి తే భువి బుధభావితాశయాః ||



వ్యాపారాభివృద్ధి జరగాలంటే.........!!

వ్యాపారాభివృద్ధి జరగాలంటే.........!!

దుకాణం మూసేసిన తర్వాత నిమ్మకాయ తో దిష్టి తీయాలి.కోసి రెండు వైపుల కర్పూరం వెలిగించాలి.