Wednesday 29 June 2016

దత్తాత్రేయ రహస్యం....!!

దత్తాత్రేయ రహస్యం....!!

సమాజం లో కులభేధాలను మెట్టమెదటవ్యతిరేకించిన మహర్షి అత్రి.అస్పృశ్యులను ఆదరించారు.అస్పృశ్యతను ఆకాలంలోనే గట్టిగా వ్యతిరేకించారు.రజకులు ,చర్మకారులు నటకులు, కైవర్తకులు, మెదరులు ,కుమ్మరులు ,భిల్లులు, వీరందరికి యజ్ఞ,యాగాదివిషయాలలో భాగం కల్పించారు.అంతేకాకుండాయజ్ఞ,యాగాది విషయాలలో వారిని తాకరాదు,వీరిని తాకరాదు,నియమంలేదు యజ్ఞ,యాగాది విషయాలలో అందరు పాల్గోన వచ్చు అన్నది అత్రి అభిమతం.ఒక్కసారిఆలోచించండి ఇది ఏంత విప్లవాత్మక సంస్కరణో ఆలొచించండి. . అస్పృస్యత అనేది సమయ సందర్భాలను భట్టి మనుష్యులను ఆశ్రయించి వుంటుంది తప్ప శాశ్వితంగా ఒవ్యక్తినో ,వ్యక్తుల సమూహాన్నో అస్పృస్యత ఆశ్రయించివుండదనేది అత్రి అభిమతం. అంతేకాకుండాబ్రాహ్మణుల యెక్క శౌచవిధిని కూడా వివిరించారు. అంతేకాకుండాబ్రాహ్మణుల యెక్క శౌచవిధిని కూడా వివిరించారు.మాత్సర్యం,అసూయ ,అహంకారం,ధనాశ ఈ నాల్గు వున్నవాడు బ్రాహ్మణుడే కాదు అని తేల్చి చెప్పారు ఈ దుర్గుణాలు వున్న వ్యక్తి భ్రాహ్మణుడే కాదు అతని జపహోమాలు ,ఆచారము అనుష్టానుము ఎందుకు పనికిరావు అని శాసనం చేసారు. తెలుగు నేలతో అత్రిమహర్షికి ఎంతో అనుభందంవుంది గోదావరి తీరంలో గల అత్తిలి,ఆత్రేయపురం,అత్రిమహర్షి తిరగాడిననేల ముఖ్యంగా అత్తిలి అత్రిక్షేత్రంగా ప్రసిద్దిచెందింది.అత్రి పేరు మీదగానే అత్తిలి కి ఆ పేరు వచ్చింది ఆ ఊరిలో అత్రి దేవాలయం వుంది అందుకే శ్రీదత్తులవారు కలియుగంలో మెదటి అవతారమైన శ్రీపాదవల్లభులుగా గోదావరితీరంలోని స్వయంభూ కుక్కుటేశ్వర క్షేత్రమైన పీఠాపురగ్రామం లో అవతరించారు. ఇక అత్రిమహర్షి తపోశక్తి విషయానికి వస్తే పృధుచక్రవర్తి నిర్వహించిన ఆశ్వమేధయాగానికి అసూయ తో ఇంద్రుడు అవరోదం కల్పించినప్పుడు తన తపశక్తిని ఉపయోగించి ఇంద్రుని నిర్వీర్యంచేసాడు.అత్రిమహర్షి దయతోనే పృధుచక్రవర్తి ఆశ్వమేధాన్ని నిర్విఘ్నంగా నిర్వహించగలిగారు. మరోసారి దేవతలకు,రాక్షసులకు యుద్దం జరుగుతున్న సమయంలో సూర్య,చంద్రులిద్దరు రాహువు చేతిలోఘోరంగా దెబ్బతిని తమతేజస్సుని కోల్పోయారు.అప్పుడు వారిరువురు అత్రిమహర్షిని శరణువేడారు. శరణాగత రక్షకుడైన అత్రి మహర్షి తన తపశక్తి ని ఉపయోగించి వారికి దివ్యతేజో శరీరాలను కల్పించారు. అంతేకాకుండా భవిష్యత్తులో వారి తేజస్సును రాక్షసులు హరించకుండా వరమిచ్చారు. 

No comments:

Post a Comment