Friday 14 April 2017

విష్ణు సూక్తంతో సర్వపాప పరిహారం......!!


బుగ్వేదం: మండలాలు 7 సూక్తములు 99, చందస్సు త్రిష్టుప్ బుషి మైత్రావరుణుడగు వశిష్టుడు.
శ్లోకం:
ఇంద్రా విష్ణు దృంహితా శంబరస్వ
నవ పురో నవతించశృధిష్టమ్�
శతం వర్చినస్సహస్యం చసాకం
హధో అప్రత్యసురస్వ వీరాన్.
.
తాత్పర్యం:
ఓ ఇంద్రా విష్ణువులారా మీకుద్రోహము తలపెట్టిన శంబరుడను రాక్షసుని యొక్క 9 పురములను (పట్టణములను) అటుపైన 90 పురణములను ద్వంసము చేసితిరి. తేజోవంతులగు 100తో 1000 మందితో కలిసి మీరు రాక్షసుని వీరులను వారి రథములను గుర్రములను కూడ మాయం చేసిరి.
శ్లోకం:
ఇరావతీ దేనుమతిహిభూతం
సూయవసిన మనుషేదశస్యా
దాదర్ధపృదవీ మభితో మయూబై:

తాత్పర్యం:
ఓ విష్ణుదేవా నీవే రోదసి కుహరమును నిలిపి పృదవిని దివమును వేరువేరుగా ఉండునట్లు స్తంభించి పట్టితివి. ఈ పృదవికి అభిముఖముగా సూర్యకిరణములను ప్రసరింపచేయుచున్నావు.దాని వలన భూమిపై జలములు ఏర్పడినవి, అవి మేఘములుగా ఏర్పడినవి అవి వర్షించినవి అన్నమేర్పడినది.పచ్చిక చక్కగా పెరుగుచున్నది. దానిని తినునట్టి దేనువు లేర్పడినవి. జీవులన్నియు ప్రసరించుట ఏర్పడినది. ఈ మొత్తము సంపదను నీవు మనువుకు దానం చేసితివి.అతడు మానవులకు కూడ దానం చేసెను.
శ్లోకం....
ఉరు యజ్ఙయ చక్రధురు లోకం
జనమంతా సూర్యముఫాసముగ్నిమ్
దాసస్యచిద్ వృషిని ప్రస్వమాయం
జఘ్నధుర్నరా పృతనాజ్యేషు.

తాత్పర్యము:
ఓ ఇంద్ర విష్ణువులారా మీరు విసృతిని వేగమును కలుగ చేయుదురు.
ఈ లోకమును వేగవంతము విసృతమగును అగ్ని పుట్టింతురు వర్షము వలన ఉద్భవించినట్టి లక్షణము చేత వృషశిప్రుడు అని పిలువబడు దేవదారి అను మీ దాసునకు గల ఎట్టి మాయనైన మీరు తోలగింతురు. సేనల వినియోగముననరులై సేనా నాయకులై ముందు నడచి కార్యసాధన చేయుదురు.
శ్లోకం:
ఇయం మనీఫా బృహతీహంతో
రుక్రమా తవసా వర్థయంతి
రరే వాం స్తోమం విదధేషువిప్లో
పిన్వతషో వృజనేష్వింద్ర

తాత్పార్యము:
ఇంద్రా విష్ణువులారా ఈ మీస్తోత్రము ప్రజ్ఙయము చాల మహత్తర మై విసృతిని కలుగచేయును. ఉరుక్రము డైన విష్ణుని స్తోత్రము సృష్టిని వర్ధిల్లచేయు ను. పాపములను బాణములవలే ఖండిం చును. ఈ స్తోత్రములను చక్కగా స్తుతింప బడినచో సంపదను పోందగలరు.
వివరణ:
యజ్ఙము అనగా ఫలా ఫేక్ష లేక చేయునట్టి విశ్వశ్రే యమైన సత్కర్మము యజ్ఙములలో మొట్టమొదటి సృష్టి కర్మ దానికై అంతర్యామీ ప్రజ్ఙము ఇంద్రియా అధిపతి అయిన మ నస్సు యొక్క ప్రజ్ఙయు కావాలయును. ఆరెండింటిని విష్ణువు ఇంద్రుడు అనువారు ఆధిదేవతలు దేనిని ఉద్భవింపచేయుట కు లోకములను కల్పింపవలెను.వానిని కల్పించువాడిగా మొ దట సూర్యుని కల్పింపవలేను. దానిని కల్పించునదిగా ఉషస్సు ను కల్పించవలయును.ఉషస్సు అనగా సూర్యోదయానికి ముం దు కూడ ఉషస్సును పట్టును.అది సూర్య తేజస్సును నిర్మాణం చేయునట్టి అనంతమైన వేలుగు దానిని పుట్టించుటకు ముందు అగ్ని కావలేను. అగ్ని అనగా అంగముల యందు వివాహితమై మనలో జీవుడుగా వెలుగుచున్నది. మరియు అగ్రము అందు కొని రాబడునది (అన్నిటికనన ముందు పుట్టునది) అని అర్ధ ము. అది వ్యక్తము యొక్క మొదటి రూపమైన మహత్తు నుండి వ్యక్తి యగు అహాంకారము ( ఇది జీవుల అహాంకారము కాక ఒక సృష్టికి మొదటి అహాంకారము.
ఇది బిందువుల వలేవ్యక్త మగు అంతర్యామీయైన విష్ణుత్వము నుండియే ఇది వ్యక్తమ గుచుండును, కనుకనే దేవతలందరిలో అగ్ని మొదటివాడు విష్ణువు చివరివాడని ఐతరేయం బోధించుచున్నది. ఈ విధము గా ఉషస్సు కోరకై అగ్ని వీరిద్దరును తెచ్చుచున్నారు. విష్ణుని వర్షా శక్తి వలన భూమిపై పుట్టిన జీవుడు వృషశిపుడు అను పేరుతో వ్యవహరింపబడుచున్నాడు.అతడు విష్ణువు నందు భా గమై జీవించుచున్నందున, విష్ణునకు దాసుడు అతనికి ఇంద్రీ య సుఖములందు సంపదలయందు చిక్కుకోనుట కలుగు చుండును. దానినే మాయ అంటారు.దానిని తోలగివచుటకు విష్ణుని అంతర్యామి ధ్యానమే తోడ్పడును మంచి చేడులను గూర్చిన అభిప్రాయములు సేనల వలే బారులు తీర్చి యుద ్ధభూమిని కల్పించుచుండును. ఈ సేనలకు నామకుడై విష్ణువే వైరాగ్య మార్గమున పరిష్కారము కలిగించి, విజయమును క ల్పించినది. ఇందలి భావముననే కురుక్షత్రమైన ఉభయ సేనల నడుమ నరునకు సారథిగా నారాయణుడు ఉన్నట్లు స్వీకరించి మహాభారత గ్రంథములో కృష్ణుని కథతో కలిసి వివరించేను.
వివరణ:
పురణములతో ఇంద్రుడుశంబరసురుని చంపిన కథకిది మూలం. శంబసురుడనగా మాయ అనగా లేనిది ఉన్నట్లుగా కనిపించుట అని అర్ధం. ఈ విద్యను శాంబరి విద్య నందురు. దేని వలన సృష్టిలో సర్వము విష్ణుమయ మే అయినను మనస్సు ఇంద్రీయములు. దేహములు ఇంద్రీయార్ధములు సంపదలు చుట్టరికములు కష్టసుఖములు మొదలగునవి.నిజముగా ఉన్నట్లు నమ్మకం కలుగును. దానితో విష్ణుమయమైన సృష్టికి బాధలు కలుగును. దా నితో విష్ణుమయమైన సృష్టికి బాధలు కలుగును.కనుక ఇది ద్రోహరుపమైన నిర్మాణము. ఇది ఇంద్ర విష్ణువుల ధ్యానముచే తోలగిపోవును. కనుక వారిరు వురును శంబరుని పట్టణములను ద్వంసము చేసినట్లు చెప్పబడినది.
శంబ రుని రధములు అనగా జీవుల దేహములను గుర్రములనగా, ఇంద్రయము లు, శంబరుని 9 పురము( పట్టణము) లనగా నవ ద్వారములు గల భౌతిక శరీరములు 99 అనగా సంఖ్యలో సృష్టి కర్మయందు హెచ్చింపబడుచున్న దేహములు. ఇచ్చట ఒకటి అను సంఖ్య మొదటి వాడగు ఇంద్రునకు 9 అను సంఖ్య ఈ నవ ద్వారపురములను నిర్మించిన శంబరునకును,పూర్ణమగు సం ఖ్‌య విష్ణువునకు సూచకములు 9 లో ఒకటి తాకినచో 9 మాయమై ఒకటి యు లేదా సున్నయు మిగులును.(9+1=10) అదేవిధంగా 99ని 1 కలిపిన (99+1=100) అవును. అనగా శంబరుని పురమును ఇంద్రుడు తాకినచో పురముమాయమై ఇంద్రా విష్ణువులు మిగులుదురు. వీరిద్దరి 10, 100, 1000 మొదలగు సంఖ్యలు పుట్టును. ఇట్లు పుట్టుచున్న జీవులు తాత్కాలిక దేహములైన దేహముల ప్రజ్ఙనుండి విముక్తి చెంది విష్ణు లోకమున వర్ధిల్లుచున్నారన్నది ంభావం.
శ్లోకం :
వషట్‌తో విష్ణవాస అకృణోమి
తన్మోజుషస్వ శిపివిష్ణు హవ్వమ్,
వర్ధంతు త్వా సుష్ణుతమోగిరోమే
మాయం పాత స్వస్థిభి స్వదాన:

తాత్పార్యము:
ఓ ఇంద్రా విష్ణువులారా మేము ఓ విష్ణు అని పిలువగా అపదము నందు విష్ణువు వసించుచుండును,శ్రద్ధతో ప్రత్యేక్షము చేసికోనుచు ప్రార్ధించుదము, ఆకారముచే మాయజ్ఙము నందు మీరు ప్రవేశించి మా అన్నమును యజ్ఙశేష ముగా ప్రసాధించుదురుగాక మిమ్ములను పుష్కములైన స్తోత్రములతో మేము స్తుతింతుముగాక అట్టి మా వాక్కులు మీ యేడల వర్ధిల్లునుగాక మీమ్ములను ఎల్లపుడును యోగ క్షమములతో రక్షింతురుగాక.

Thursday 13 April 2017

పాకిస్తాన్‌లో చారిత్రక హిందూ ఆలయం... కటసరాజ దేవాలయం


Image may contain: outdoor
మన దాయాది దేశం పాకిస్తాన్‌లో హిందూ దేవాలయాలు చాలా అరుదు. అలాంటి అరుదైన దేవాలయాల్లో చారిత్రక విశిష్టత కలిగిన దేవాలయం కటాసరాజ ఆలయం. పాకిస్తాన్ లో శిథిలావస్థలో ఉన్న ఆలయాల్లో కటాస్ రాజ్ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయం ఎంతో విశాలంగా, అద్భుతంగా ఉంటుంది. అయినా ఈ ఆలయాన్ని పట్టించుకునే నాథుడే లేడు.పాకిస్తాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన ఈ ఆలయం చక్వాల్‌ జిల్లాలోని కటాస్‌ గ్రామంలో ఉన్నది. ఇది ఒక శివాలయం. మహాభారతకాలంలో పాండవులు తమ అరణ్యవాసంలో కొంతకాలాన్ని ఈ ప్రదేశంలో గడిపినట్టు భావిస్తారు.
దక్ష యజ్ఞసమయంలో, సతీదేవి ప్రయో ప్రవేశం చేసినదన్న వార్త తెలిసినపుడు శివుని కంటి నుండి రెండు కన్నీటిబొట్లు రా లాయి. అవి భూమి మీద పడినపుడు, ఒకటి ఇక్కడి కటాసక్షేత్రంలోని అమృతకుండ్‌ తీర్థం గానూ, రెండవది భారతదేశం, రాజస్థాన్‌ రాష్ట్రంలోని అజమేరు (అజ్మీర్‌)లోని పుష్కర రాజ్‌ తీర్థంగానూ మారాయి. మహాభారత అరణ్య పర్వంలో పాండవులు అరణ్య వాసంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి తాను అగ్నిని మధించే ఆరణిని ఒక చెట్టు కొమ్మలో దాచా ననీ, అప్పుడే వచ్చిన ఒక దుప్పి ఆ కొమ్మను రాచుకోన్నందున ఆరణి దాని కొమ్ములలో చిక్కుకొని పోయినదని దానిని తెచ్చి ఇవ్వవల సినదిగా కోరగా ధర్మరాజు నలుగురు తమ్ము లతో లేడిని పట్టుకోవడానికి బయలుదేరుతా రు. కొంతసేపటికి ఆ లేడి మాయమవుతుంది.
వెతికి వెతికి అలసట చెంది మంచి నీరు తెమ్మని నకులుని పంపగా... అతను ఎంత కూ రాకపోవడంతో సహదేవుని పంపుతారు. అదే విధంగా అర్జునుడు, భీముడు ఎవరు తిరిగిరారు. చివరకు ధర్మరాజు బయలుదేరి మంచినీటి కొలను ప్రక్కనే పడివున్న నలుగు రు తమ్ములను చూసి దుఃఖంతో భీతిల్లుతా డు. అంతలో అదృష్యవాణి ఇలా పలుకుతుం ది. ‘‘ధర్మనందనా నేను యక్షుడను. ఈ సర స్సు నా ఆధీనంలో ఉన్నది. నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పక, నీ తమ్ములు అహంభా వంతో దాహం తీర్చుకోబోయి నందుననే ఈ గతి పట్టినది. నీవయిననూ, నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ దాహం తీర్చుకో’’ అన్నా డు యక్షుడు. దానికి సరే అన్నాడు ధర్మరాజు. వీటినే, యక్షప్రశ్నలుగా హిందువులు చెప్పు కుంటూ ఉంటారు. ఇది కటాసక్షేత్రంలోని అమృతకుండ్‌ వద్దనే జరిగింది.
చరిత్ర...
ఇక్కడ 100కి పైగా ఉన్న ఆలయాల్లో ఎక్కువ శాతం 900 సంవత్సరాలు లేదా అంతకన్నా పూర్వానివేనని చరిత్రకారుల ఉద్దేశ్యం. కటా సక్షేత్రం ఉచ్ఛస్థితిలో ఉన్నపుడు విశ్వవిద్యాల యంగా కూడా భాసిల్లినది. ఎందరో దేశీ, విదే శీ విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తూ ఉండే వారు. ప్రముఖ గణితజ్ఞుడు ఆల్బెరూనీ ఈ విశ్వవిద్యాలయంలో సంస్కృత అధ్యయనం చేస్తూ, భూమి చుట్టుకొలతను లెక్కించాడు. 1947 కాలంలో ఇక్కడి హిందువులందరూ భారతదేశంలోని పంజాబ్‌కు వెళ్లిపోయారు.

Monday 10 April 2017

హనుమాన్ జయంతి రోజున ఈవిదంగా చేయండి



హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా,
 రక్షకునిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. 
ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని 
ఆరాధిస్తారు

హనుమంతుడు అంజనాదేవి, కేసరిల పుత్రుడు. వాయుదేవుని ఔరస 
పుత్రుడు. మహాబలుడు. శ్రీరామ దాసుడు. అర్జునుని సఖుడు. ఎర్రని
 కన్నులుగల వానరుడు. అమిత విక్రముడు. శతయోజన విస్తారమైన సముద్రమును దాటినవాడు. లంకలో బందీయైన సీతమ్మతల్లి శోకము
ను హరించినవాడు. ఔషధీ సమేతముగా ద్రోణాచలమును మోసుక వచ్చి 
యుద్ధమున వివశుడైన లక్ష్మణుని ప్రాణములు నిలిపినవాడు. దశకంఠుడైన రావణాసురుని గర్వమును అణచినవాడు. హనుమంతుని ఈ నామములు 
నిదురించుటకు ముందు, ప్రయాణమునకు ముందు స్మరించినవారికి మృత్యుభయం లేదు. వారికి సర్వత్ర విజయం లభిస్తుంది.

హనుమాన్ జయంతి సందర్భముగా భక్తులు హనుమాన్ చాలీసా 
పారాయణం చేస్తుంటారు.

ఆంజనేయ స్వామి ధర్యానికి ప్రతీక. శక్తి సామర్ధ్యాలకు ప్రతీక హనుమత్ 
రూపం. సముద్రం దాటి లంక చేరాడు. ఆకాశ మార్గములో ప్రయాణం చేసి 
సీతమ్మ జాడ కనిపెట్టారు. సంజీవని పర్వతాన్ని పెకిలించి తీసుకొచ్చిన వీర 
హనుమాన్ శక్తి యుక్తులను కీర్తించడం సాధ్యమా? 

హనుమాన్ జయంతిని కొందరు చైత్ర పౌర్ణమి నాడు చేస్తుండగా మరికొందరు 
వైశాఖ దశమి నాడు జరుపుకుంటారు. ఇక కేరళ రాష్ట్రం లో మార్గశిర మాసం 
లో హనుమత్ జయంతిని జరుపుకుంటారు. 

 
హనుమంతుడు అంతులేని పరాక్రమవంతుడయ్యివుండి కూడా శ్రీరాముని 
సేవలో గడపడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఆన్జనేయునికి 
శ్రీరాముడంటే ఎంత భక్తి ప్రపత్తులంటే తన మనసునే మందిరంగా చేసి 
ఆరాధించాడు. హనుమంతుడు గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనం 
ఇచ్చారని శ్రీరామున్ని సీతమ్మ తల్లికంటె మిన్నగా ప్రమించాడు 
హనుమంతుడు. 

 
ఒకసారి  సీతమ్మ నుదుటున సిందూరం పెట్టుకోవడ చూసి సింధూరం 
ఎందుకు పెట్టుకున్నావమ్మా? అని అడుగుతాడు. అందుకు సీతమ్మ నవ్వి " 
శ్రీరాముడు దీర్ఘాయుష్కుడిగా వుండాలని చెపుతుంది. అంతే హనుమంతుడు 
ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఒళ్ళంతా సింధూరం పూసుకుంటాడు. 
  అదీ హనుమంతునికి శ్రీరాముని మీద గల నిరుపమానమైన భక్తి. 


హనుమంతుని భక్తికి ఇలాంటి తార్కానాలన్ని ఎన్నో ఎన్నోన్నో వున్నాయి.
హనుమాన్ జయంతి విశేష దినాన మరింత భక్తి శ్రద్ధలతో హనుమంతున్ని 
అర్చిస్తారు.  కలౌ కపి వినాయకౌ:  ....... అంటే కలియుగం లో త్వరగా 
ప్రత్యక్షమయ్యే దేవతా రూపాలు ... వినాయకుడు, హనుమంతుడు. 

 
హనుమంతుడు - అంజనా దేవి, కేసరీల పుత్రుడు. వాయుదేవుని ఔరస 
పుత్రుడు, మహా బాలుడు. శ్రీరామునికి దాస దాసుడు, అర్జునికి సఖుడు, 
ఎర్రని కన్నులుగల వానరుడు, అమిత విక్రముడు, శతయోజన విస్తారమైన 
సముద్రాన్ని దాటినా వాడు, లంకలో బందీయైన సీతమ్మ తల్లి శోకాన్ని 
హరించిన వాడు, ఔషధీ సమేతముగా ద్రోణాచలం మోసుకుని వచ్చిన 
యుద్ధంలో వివశుడైన లక్ష్ముని ప్రాణాలు నిలిపిన వాడు.  దశకంటుడు 
అయిన రావణాసురుని గర్వం అణచినవాడు. హనుమంతుని ఈ నామాలు 
నిద్రించడానికి ముందు, ప్రయాణానికి ముందు స్మరించిన వారికి మృత్యు 
భయం లేకుండా వారికి సర్వత్రా విజయం లభిస్తుంది

ఎక్కడైతే రామనామం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడు ఉంటాడని భక్తుల నమ్మకం. అలాగే భూత ప్రేత పిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెప్తేనే భయపడి పారిపోతాయి. మహా రోగాలు నయం అవుతాయి. శని గ్రహం అనుకూలంగా లేకపోతె వచ్చే బాధలూ తొలగిపోతాయి. మంచి బుద్ధి కలుగుతుంది. బలం పెరుగుతుంది. కీర్తి లభిస్తుంది. ధైర్యం వస్తుంది.
 హనుమంతునికి 5 సంఖ్య చాల ఇష్టం. 5 ప్రదక్షిణలు చేయండి.  అరటి పళ్ళు , మామిడి పళ్ళు అంటే ఆయనకు ప్రీతి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.
అలాగే చైత్ర పౌర్ణమి నుండి వైశాఖ బహుళ  దశమి  వరకు గల మండలం రోజుల పాటు ప్రతిరోజూ 1, 3, 5, 11, లేదా 41 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఇలా చేయడం వల్ల అనుకున్న పనులు త్వరగా పూర్తి అవుతాయి. కోరిన కోరికలు నెరవేరే అవకాశాలు వుంటాయి. సంతానం కోరేవారు మండలం పాటు పారాయణ చేసి అరటిపండు నివేదించి ఆ పండును ప్రసాదం గా స్వీకరిస్తే తప్పకుండ సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. 



ఒక చిన్న మనవి : మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియవు, శాస్త్రాలలో 
చెప్పిన ధర్మ మార్గాలు తెలియవు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు, మన 
పండుగల విశిష్టత తెలియదు, అందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు, కానీ నేర్చుకుని, 
ఆచరించడానికి వయోపరిమితి లేదు, తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు, 
అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, మన భావితరాల వారికైనా 
ఇవన్నీ తెలిసేలా బాధ్యత మనదే, ఏదీ ఆలస్యం కాదు, నేనూ ఇప్పుడే ఎన్నో 
తెలుసుకుంటున్నాను , నేర్చుకుంటున్నాను, ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాను, 
అలానే అందరూ తెలుసుకుని, ఆచరిస్తారనే ఆశిస్తున్నాను
శ్రీ విధాత పీఠం " ఫేస్బుక్ పేజీ ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు 
కూడా పరిశీలించండి, వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం
కలిగుతుందని మా ఆశ. అందరికీ ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే
 " శ్రీ విధాత పీఠం" ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం.మీరు తెలుసుకోండి , 
మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ 

చేయండి

సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
 పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, 
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,ETC), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, 
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు
సంప్రదించండి.

FOLLOW US :
PLZ LIKE , SHARE , FOLLOW AND SUBSCRIBE

FACEBOOK PAGE

PRINTEREST

TWITTER

INSTAGRAM

BLOG

WHATSAPP GROUP 
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP:
HTTPS://CHAT.WHATSAPP.COM/CDRK2ZFOHGI1RQFGNRJTBF
HTTPS://CHAT.WHATSAPP.COM/B57SNQO4QZ7KI1EH7P2QI5

HTTPS://CHAT.WHATSAPP.COM/IYNMOI7TGW9FN6LLPK8UDX

HTTPS://CHAT.WHATSAPP.COM/GEMSHZZOZHB5ACUXTVW5JY

HTTPS://CHAT.WHATSAPP.COM/KDKVPAHTYUSCYAPVGSHGIV

HTTPS://CHAT.WHATSAPP.COM/GMBYOVWRJ8MDJTJKFBOSKM


FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://CHAT.WHATSAPP.COM/GQ72L3U0MNF4ZKKIECPG9Y

FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://CHAT.WHATSAPP.COM/BR5VHG7L4L8HHQ1UUWLDUI

FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://CHAT.WHATSAPP.COM/GMBYOVWRJ8MDJTJKFBOSKM


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA / హవనిజా
( B.ed, MCA, M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం/ SREE VIDHATHA PEETAM
Ph. no: 9666602371













Sunday 9 April 2017

చైత్ర పౌర్ణమి




చిత్తా నక్షత్రం లో చంద్రుడు సంచరించునపుడు వచ్చే పౌర్ణమి చైత్ర పౌర్ణమి. మధు మాధవములు గా పిలువబడు వసంత మాసములలో వచ్చే మొదటి పౌర్ణమి ఈ చైత్ర పౌర్ణమి. నూతన సంవత్సరం ఆరంభమైన పక్షం రోజులకి వచ్చే పౌర్ణమి ఈ చైత్ర పౌర్ణమి. ఈ విధంగా అనీక రీతుల మనం ఈ పౌర్ణమి గురుంచి చెప్పుకోవచ్చు.
అయితే, సనాతన భారతీయ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతీ పౌర్ణమి ఒక సందేశాన్ని ఇస్తుంది . గడిచిన కాలం లో (గత పక్షం రోజులలో) జరిగిన పనులు , దాని ఫలితం, (Reconciliation) రాబోయే పౌర్ణమి వరకు జరగవలసిన పనులు, (A kind of Plan) దానికి ప్రయత్నం ఇలా అనేక సందేశాలు పౌర్ణమి వల్లనే తెలుస్తుంది. భౌతిక , ప్రాపంచిక విషయ వివేకం (Materialistic intensities) కన్నా, ఆధ్యాత్మిక చైతన్యం (Spiritual Insights) ఎక్కువగా ప్రభావం చూపే రోజు పౌర్ణమి. అందుకే మన శాస్త్రాల్లో పౌర్ణమికి ఒక విశేషమైన స్థానం వున్నట్టు తెలుస్తుంది. పౌర్ణమి నాడు మనం చేసే పూజలు, ఉపాసనలు, దీక్షలు, అధ్యయనాలు, అభ్యాసనలు వచ్చే తరానికి, వారి ఉన్నతికి దోహద పడతాయి. అమావాస్య నాడు చేసేవి గతించిన పితరలకు చెందుతాయి.
ముఖ్యంగా ఈ చైత్ర పౌర్ణమి వలన ఒక అద్భుతమైన ప్రక్రియ మానవ శరీరం లో జరుగుతుంది. అదే అంకురారోపణం. మానవ శరీరానికి, ప్రకృతి లో ఋతువులకు ఒక చక్కని సంబంధం ఉన్నది. అది బయట వేడిని బట్టి మన శరీరం తన వేడిని సమతుల్యం చేస్తుంది (Equilibrium between Internal and External bodies) ఇక్కడ అనేక శరీరాలు అని అర్ధం కాదు, మన శరీరమే అనేక రీతుల వ్యవహరిస్తుంది అని అర్ధం.
దీనిని కొంచం సామాన్యం గా ఆలోచిద్దాం , మన పెద్దలు “పోలికలు” రావడం అంటారు కదా !! అది ఇక్కడి నుండే మొదలవుతుంది. అమావాస్య నాడు పితరలకు చేసే తర్పణాలు వారికి చెంది ఆ వంశం లో ఇంకో “అంకురం” కోసం కృషి చేసి, వారి అంశని ఆ రక్తాన్ని మోస్తున్న ఆ వంశపు పురుషుని భ్ర్రూమధ్య స్థానాన నింపుతారు. అదే కొన్ని రోజులకి (సుమారుగా ఒక పక్షం రోజులకి) ఆ పురుషని లో వంశాభివృద్ధికి కారణమయ్యే వీర్య కణం గా మారి దోహదపడుతుంది. ఇది ఏ శాస్త్రవేత్త కాదనలేని అక్షరసత్యం. దీనిని జ్యోతిష్య శాస్త్రం అమావాస్య నాడు మొదలయ్యి పౌర్ణమి తో పూర్తీ అయ్యే “శుక్ల” పక్షంగా చెప్తారు. మానవులలో ఈ ప్రక్రియ ఈ మాసానే మొదలవుతుంది అని ఎక్కడా లేదు, కానీ ఈ విధానం సృష్టి లో మాత్రం ఈ మాసంతోనే జరుగుతుంది. ఆకురాలుకాలం అయ్యాకా చిగురులు వస్తాయి అనడం అంటే ఇదే!!. ఈ పరిణామాన్ని మానవులకి ఆపాదించుకుంటే ???
మానవ శరీరం ఒక రధం, దాని కర్తవ్యం ఒక పయనం, ఒక గమనం, పరిపూర్ణ తత్వాన్ని ఆవిష్కరిస్తే అది ఒక మహా యజ్ఞం.

ఈరోజు విశేష౦




మదన త్రయోదశి ఈ రోజు లేద అనంగ త్రయోదశి
మన్మధుడు యొక్క భార్య రతి దేవి బ్రహ్మ యొక్క వామ భాగం నుండి ఉద్భవించినది
మదనుదు తన పంచ బాణాలతో బ్రహ్మ నిచలిన్చే విధం గా ప్రయత్నం చేసాడు
దాంతో శరీరం లేకుండా పోతావని శపించాడు
దాని ఫలితమే శివుడు మూడో కన్నుతో భస్మం చేసిన తర్వాత రతి దేవి ప్రార్ధన తో కేవలం రతి దేవికి మాత్రమే కనిపించేలా అనుగ్రహించి న రోజు
కావున ఈ రోజు ప్రత్యేకం గా ఈ రోజు శివుణ్ణి పూజించాలి
ఆది దంపతుల అనుగ్రహం పొందండి

Saturday 8 April 2017

అనంగత్రయోదశి



భార్యాభర్తలమధ్య అన్యోనయతారాగాలను వృద్ధి చేయడంతో పాటు దాంపత్యజీవనాన్ని సుఖమయం చేసే పవిత్ర పర్వదినం – అనంగత్రయోదశి.
చైత్రమాసంలో శుక్లపక్ష త్రయోదశి – ఈ అనంగ త్రయోదశి. దీనికే మదన త్రయోదశి, కామదేవత్రయోదశి అని కూడా పేర్లు. ప్రేమాధిదేవత లేక కామదేవుడు అయిన మన్మథుడి పూజకు కేటాయించిన పర్వదినం అనంగ త్రయోదశి. శాస్త్ర గ్రంథాలలో ’దమనేన అనంగపూజ’ అని చెప్పడాన్ని బట్టి ఈ రోజు అనంగుడు లేదా మన్మథుడిని దవనంతో పూజించాలనీ ఈ రోజు మన్మథుడి పూజకు ఉత్కృష్టమైన రోజు అని స్పష్టమవుతూ ఉంది. మన్మథుడిని గురించి పురాణాలలో అనేక రకాలైన గాథలు కనిపిస్తాయి.
మన్మథుడు ’కామదేవుడు’ ’ప్రేమదేవత’ సౌందర్యరాశి. మన్మథుడి వాహనం చిలుక! అరవిందాది పుష్పములే మన్మథుడి బాణాలు. అట్టి మన్మథుడు సృష్టి ప్రారంభంలో సృష్టికర్త బ్రహ్మదేవుడి హృదయం నుండి జన్మించాడు. మరీచాది మహర్షులు అతనికి ’మన్మథుడు’ అని నామకరణం చేశారు. మన్మథుడి భార్య రతీదేవి. మన్మథుడు సృష్టికర్తను కూడా వదలలేదు. మన్మథుడు మొదట తన బాణములను బ్రహ్మదేవుడి మీదనే ప్రయోగించాడు. దీనితో బ్రహ్మదేవుడు వికార చిత్తుడయ్యాడు. చివరకు బ్రహ్మదేవుడు కోపోద్రిక్తుడై ’భస్మమై శరీరం లేనివాడు’గా అయ్యేటట్లు మన్మథుడిని శపించాడు.
కాగా, మరో గాథ ప్రకారం స్థితికారకుడైన శ్రీమహావిష్ణువు కుమారుడు మన్మథుడు. పూర్వం ఒకసారి శ్రీమన్నారాయణుడు సంతానంకోసం శివుడిని ప్రార్థించాడు. శివుడి అనుగ్రహం వల్ల విష్ణుమూర్తికి మన్మథుడు కుమారుడుగా జన్మించాడు. ఈ విషయం పార్వతీదేవికి తెలిసింది. విష్ణుమూర్తి కేవలం తనభర్త అయిన శివుడినే ప్రార్థించి తనను విస్మరించడంతో కోపోద్రిక్తురాలైన పార్వతీదేవి శివుడి వరంవల్ల విష్ణువుకు జన్మించిన వాడు శివుని వల్లనే భస్మమైపోవుగాక” అని శపించింది.
ఈవిషయం విష్ణువుకు తెలిసి పార్వతీదేవిని ప్రార్థించాడు. ప్రసన్నురాలైన పార్వతీదేవి శాపాన్ని ఉపసంహరించడం కుదరదు అని చెప్పి భస్మమైన మన్మథుడు తిరిగి జీవించేటట్లు వరం ప్రసాదించింది.
అనంతరం కొంతకాలానికి తారకాసురుడు అనే రాక్షసుడివల్ల కష్టాలపాలైన దేవతలు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి మొరపెట్టుకోగా ’శివుడి కుమారుడు తారకాసురుణ్ణి సంహరించగలడు” అని సలహా యిచ్చాడు.
అప్పటికి శివుడు తపస్సులో మునిగివున్నాడు. శివుడు తపస్సు మాని పార్వతీ దేవిని వివాహం చేసుకునేలా చేయమని ఇంద్రుడు మన్మథుడికి చెప్పాడు.
దీనితో మన్మథుడు తపస్సు చేస్తున్న శివుడిపై బాణం వేశాడు. శివుడి మనస్సు చలించింది. “తనను చలింపజేసింది ఎవరా?” అని శివుడు మూడవనేత్రాన్ని తెరిచాడు. ఫలితంగా మన్మథుడు భస్మమై ’అనంగుడు’ అయ్యాడు. ఈ విషయం రతీదేవికి తెలిసి తీవ్ర దుఃఖానికి లోనైంది. శివుణ్ణి ప్రార్థించింది. రతీదేవి ప్రార్థనలను విని ప్రసన్నుడైన శివుడు, మన్మథుడు రతీదేవికి మాత్రమ్ఏ కనిపించేటట్లు వరం ప్రసాదించాడు. రతీమన్మథులు ఇద్దరూ అన్యోన్యతానురాగాలున్న దంపతులు. అట్టివారిని పూజించడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనురాగాలు వృద్ధి చెందుతాయి. దాంపత్య జీవనం సుఖమయమవుతుంది.
అనంగ త్రయోదశి రోజు తెల్లవారు ఝామునే నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేసి నిత్య పూజా విధులను పూర్తిచేసి మన్మథుడిని పూజించాలి.
మన్మథుడి చిత్రపటాన్ని గానీ, పసుపుతో చేసుకున్న ప్రతిమను గానీ మందిరంలో ఉంచి
నమోస్తు పుష్పబాణాయ జగదాహ్లాదకారిణే!
మన్మథాయ జగన్నేత్రే రతిప్రీతి ప్రియాయతే!!
అనే శ్లోకాన్ని పఠించి మన్మథుని ఆవాహన చేసుకొనవలెను. వివిధ పుష్పాలతో పాటు ’దవనం’తో పూజించి నైవేద్యాన్ని సమర్పించవలెను. ఈవిధంగా అనంగత్రయోదశినాడు మన్మథుని పూజించడం వల్ల దంపతుల జీవితం సుఖమయమవుతుంది.

తత్పురుషాయ విద్మహే కామదేవాయ ధీమహీ తన్నో అనంగః ప్రచోదయాత్!!


Friday 7 April 2017

అనంగత్రయోదశి



అనంగత్రయోదశి భార్యాభర్తలమధ్య అన్యోనయతారాగాలను వృద్ధి చేయడంతో పాటు దాంపత్యజీవనాన్ని సుఖమయం చేసే పవిత్ర పర్వదినం ..

చైత్రమాసంలో శుక్లపక్ష త్రయోదశి – ఈ అనంగ త్రయోదశి. దీనికే మదన త్రయోదశి, కామదేవత్రయోదశి అని కూడా పేర్లు. ప్రేమాధిదేవత లేక కామదేవుడు అయిన మన్మథుడి పూజకు కేటాయించిన పర్వదినం అనంగ త్రయోదశి. శాస్త్ర గ్రంథాలలో ’దమనేన అనంగపూజ’ అని చెప్పడాన్ని బట్టి ఈ రోజు అనంగుడు లేదా మన్మథుడిని దవనంతో పూజించాలనీ ఈ రోజు మన్మథుడి పూజకు ఉత్కృష్టమైన రోజు అని స్పష్టమవుతూ ఉంది. మన్మథుడిని గురించి పురాణాలలో అనేక రకాలైన గాథలు కనిపిస్తాయి.


మన్మథుడు ’కామదేవుడు’ ’ప్రేమదేవత’ సౌందర్యరాశి. మన్మథుడి వాహనం చిలుక! అరవిందాది పుష్పములే మన్మథుడి బాణాలు. అట్టి మన్మథుడు సృష్టి ప్రారంభంలో సృష్టికర్త బ్రహ్మదేవుడి హృదయం నుండి జన్మించాడు. మరీచాది మహర్షులు అతనికి ’మన్మథుడు’ అని నామకరణం చేశారు. మన్మథుడి భార్య రతీదేవి. మన్మథుడు సృష్టికర్తను కూడా వదలలేదు. మన్మథుడు మొదట తన బాణములను బ్రహ్మదేవుడి మీదనే ప్రయోగించాడు. దీనితో బ్రహ్మదేవుడు వికార చిత్తుడయ్యాడు.

 
 చివరకు బ్రహ్మదేవుడు కోపోద్రిక్తుడై ’భస్మమై శరీరం లేనివాడు’గా అయ్యేటట్లు మన్మథుడిని శపించాడు.
కాగా, మరో గాథ ప్రకారం స్థితికారకుడైన శ్రీమహావిష్ణువు కుమారుడు మన్మథుడు. పూర్వం ఒకసారి శ్రీమన్నారాయణుడు సంతానంకోసం శివుడిని ప్రార్థించాడు. శివుడి అనుగ్రహం వల్ల విష్ణుమూర్తికి మన్మథుడు కుమారుడుగా జన్మించాడు. ఈ విషయం పార్వతీదేవికి తెలిసింది. విష్ణుమూర్తి కేవలం తనభర్త అయిన శివుడినే ప్రార్థించి తనను విస్మరించడంతో కోపోద్రిక్తురాలైన పార్వతీదేవి శివుడి వరంవల్ల విష్ణువుకు జన్మించిన వాడు శివుని వల్లనే భస్మమైపోవుగాక” అని శపించింది.


ఈవిషయం విష్ణువుకు తెలిసి పార్వతీదేవిని ప్రార్థించాడు. ప్రసన్నురాలైన పార్వతీదేవి శాపాన్ని ఉపసంహరించడం కుదరదు అని చెప్పి భస్మమైన మన్మథుడు తిరిగి జీవించేటట్లు వరం ప్రసాదించింది.


అనంతరం కొంతకాలానికి తారకాసురుడు అనే రాక్షసుడివల్ల కష్టాలపాలైన దేవతలు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి మొరపెట్టుకోగా ’శివుడి కుమారుడు తారకాసురుణ్ణి సంహరించగలడు” అని సలహా యిచ్చాడు.
అప్పటికి శివుడు తపస్సులో మునిగివున్నాడు. శివుడు తపస్సు మాని పార్వతీ దేవిని వివాహం చేసుకునేలా చేయమని ఇంద్రుడు మన్మథుడికి చెప్పాడు.


దీనితో మన్మథుడు తపస్సు చేస్తున్న శివుడిపై బాణం వేశాడు. శివుడి మనస్సు చలించింది. “తనను చలింపజేసింది ఎవరా?” అని శివుడు మూడవనేత్రాన్ని తెరిచాడు. ఫలితంగా మన్మథుడు భస్మమై ’అనంగుడు’ అయ్యాడు. ఈ విషయం రతీదేవికి తెలిసి తీవ్ర దుఃఖానికి లోనైంది. శివుణ్ణి ప్రార్థించింది. రతీదేవి ప్రార్థనలను విని ప్రసన్నుడైన శివుడు, మన్మథుడు రతీదేవికి మాత్రమ్ఏ కనిపించేటట్లు వరం ప్రసాదించాడు. రతీమన్మథులు ఇద్దరూ అన్యోన్యతానురాగాలున్న దంపతులు. అట్టివారిని పూజించడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనురాగాలు వృద్ధి చెందుతాయి. దాంపత్య జీవనం సుఖమయమవుతుంది.

మన్మథుడి చిత్రపటాన్ని గానీ, పసుపుతో చేసుకున్న ప్రతిమను గానీ మందిరంలో ఉంచి
నమోస్తు పుష్పబాణాయ జగదాహ్లాదకారిణే!
మన్మథాయ జగన్నేత్రే రతిప్రీతి ప్రియాయతే!!
అనే శ్లోకాన్ని పఠించి మన్మథుని ఆవాహన చేసుకొనవలెను. వివిధ పుష్పాలతో పాటు ’దవనం’తో పూజించి నైవేద్యాన్ని సమర్పించవలెను. ఈవిధంగా అనంగత్రయోదశినాడు మన్మథుని పూజించడం వల్ల దంపతుల జీవితం సుఖమయమవుతుంది.


అనంగ త్రయోదశి రోజు తెల్లవారు ఝామునే నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేసి నిత్య పూజా విధులను పూర్తిచేసి మన్మథుడిని పూజించాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనురాగాలు వృద్ధి చెందుతాయి. దాంపత్య జీవనం సుఖమయమవుతుంది.

చైత్ర పౌర్ణమి సందర్భంగా




చైత్రమాసం ఎంతో విశిష్టతను ... మరెంతో ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. ఈ మాసంలో ప్రకృతి కొత్తఅందాలను సంతరించుకుని కనువిందుచేస్తుంది. ఆరోగ్యానికి అవసరమైన ఆహారాన్నే కాదు, మనసు కోరుకునే ఆహ్లాదాన్ని కూడా అందిస్తుంది. చైత్రమాసంలో తొలిరోజున ఉగాది పండుగ, నవమి రోజున సీతారామ కల్యాణ మహోత్సవం అంతా కలిసి ఆనందంగా జరుపుకుంటారు. ఇక ఈ మాసంలో గల 'పౌర్ణమి' కూడా ఎంతో విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తుంది.



ఈ రోజున లక్ష్మి దేవిని పూజించాలని   ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఆ దేవి  అనుగ్రహంతోనే జీవుల మనుగడ కొనసాగుతూ వుంటుంది.వారి అనుగ్రహంతోనే భక్తుల పాపాలు పటాపంచలై పోతుంటాయి ... వాళ్లకి ఉత్తమగతులు కలుగుతుంటాయి. ఇక అమ్మవారి చల్లనిచూపు వలన సంపదలు ... సంతాన సౌభాగ్యాలు లభిస్తూ వుంటాయి.


10-4-2017 చైత్ర పౌర్ణమి సందర్భంగా విధాత పీటంలో లక్ష్మి దేవి కి కుంకుమ పూజ, శత ఘటాభిషేకం, లక్ష్మి హోమం నిర్వహించబడును.ఔత్సాహికులకు సాయంత్రం 4 నుండి 6 మధ్య లక్ష్మి మంత్రం ఇవ్వబడుతుంది. 9000123129 కి ఫోన్ చేసి  అప్పాయింట్మెంట్ తీసుకోగలరు.

"శ్రీపలం"


No automatic alt text available.
.శ్రీఫలాన్నే,లఘు నారియల్,లక్ష్మీ నారికేళం అనికూడ అంటారు.
చంద్రుడు జ్యోతిష శాస్త్రంలో మనస్సుకు కారకుడు. మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః’ అని పెద్దల వాక్యం. మనస్సే అన్నింటికీ కారణం. ఆ మనస్సుకు కారకుడు చంద్రుడు. చంద్రుని కళలతో మనస్సు ప్రభావితం అవుతుందని పెద్దలు చెబుతారు. రక్త హీనత, అతి మూత్రం, గర్భ సంబంధిత వ్యాధులు, వరబీజము, బేదులు, మానసిక వ్యాధులు, ఉదర సంబంధిత వ్యాధులు, కేన్సర్(రాచ పుండు) మొదలైన వాటికి చంద్రుడు కారకుడు.
చంద్రుని ఆధారంగా ఆ నక్షత్రం యొక్క ప్రభావంతో వారి వ్యక్తిత్వాన్ని అంచనావేస్తాం. అంటే...మనస్సు, తెలివితేటలు, గ్రహణశక్తి, మతిమరుపు, చిత్తచాంచల్యం, ఇంద్రియనిగ్రహం, సౌందర్యం, లావణ్యం, శరీరసౌఖ్యం... మొదలైనవి.సూర్యచంద్రకాంతుల ప్రభావం మనపై ఉంటుంది. సూర్యకాంతి వల్ల శారీరక ఆరోగ్యం, చంద్రకాంతి వల్ల మానసిక ఆరోగ్యం కలుగుతాయని గుర్తించాలి. అందుకే ఇంటిలోకిసూర్య, చంద్రకాంతి పడేలా చూసుకోవాలని శాస్త్రం చెబుతోంది. క్షార వృక్షములకు చంద్రుడు అధిపతి.
Image may contain: plant and food
జాతకంలో చంద్రుడు అనుకూలంగా లేని వాళ్ళు ,బాలారిష్ట దోషం ఉన్నవారు శ్రీఫలాన్ని పూజించాలి.శ్రీపలాన్నే లఘు నారికేళం అని కూడ అంటారు.సముద్ర తీర ప్రాంతాలలో క్షార వృక్ష జాతికి చెందిన వృక్షాలయందు దొరుకుతాయి.
శ్రీలక్ష్మీ ఫలాలు కొన్నిబూడిద రంగులో ఉంటాయి.కొన్ని తెలుపు రంగులో ఉంటాయి.శ్రీలక్ష్మీ ఫలం చూడటానికి చిన్న సైజులో ఉన్న దీనిప్రభావం చాలా శక్తి వంతమైనవి.
శ్రీలక్ష్మీ ఫలం అనేది కొబ్బరికాయ ఆకారంలో పెద్దసైజు ఉసిరికాయ ఆకారంలో ఉంటాయి.కొబ్బరికాయలాగే దీనికి కూడా పీచు ఉంటుంది.పీచు దిగువున మామూలు కొబ్బరికాయలకు ఉండే విధంగానే మూడు బిందువులు ఉంటాయి. శ్రీలక్ష్మీ ఫలం లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారు.
శ్రీలక్ష్మీ ఫలాన్ని ఏదైనా శుభముహూర్తంలో ఇంటికి తెచ్చుకొని శుభ్రమైన నీటితో కడిగి పవిత్ర గంగాజలంతో అభిషేకించాలి.ఉదయాన్నే స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని పసుపు,గంధంతో శ్రీలక్ష్మీ ఫలానికి మొత్తం పూయాలి.తరువాత కుంకుమతో బొట్ట్లు పెట్టాలి.శ్రీఫలమ్ చుట్టు పుష్పాలతో అలంకరించాలి.లవంగాలు,యాలకులు,పండ్లు నైవేద్యం ఇవ్వాలి.కర్పూరం,సాంబ్రాణితో ధూపం చూపాలి.తరువాత పసుపు గాని,ఎరుపు గాని,తెలుపు గాని వస్త్రాన్నితీసుకొని శ్రీలక్ష్మీ ఫలాన్ని ,కొన్ని నాణేలను గుడ్డలో చుట్టి పెట్టి లక్ష్మీ దేవి ప్రతిరూపంగా భావిస్తూ ధూపదీపనైవేద్యాలతో పూజించాలి.శ్రీలక్ష్మీ ఫలంతో పాటు పెట్టిన నాణేలను అప్పుడప్పుడు తీసుకొంటు,నాణేలను అప్పుడప్పుడు చేరుస్తూ ఉంటే ఇంట్లో ఎల్లప్పుడు ధనాభివృద్ధి ఉన్నట్లే.
"ఓం శ్రీం శ్రియై నమః"అనే మంత్రాన్ని రోజు 11 సార్లు జపమాలతో జపం చేయాలి.
జాతకంలో చంద్రుడు పాపస్థానాలలో ఉన్న నీచలో ఉండి శుభగ్రహ దృష్టి లేకపోయిన మానసిక సమస్యలు ఎదుర్కొంటారు.అమావాస్య పౌర్ణమి రోజులలో ఉద్రేకాలకు లోనవుతారు.ఇలాంటి వారు ఎల్లప్పుడు శ్రీఫలాన్ని దగ్గర ఉంచుకుంటె మంచిది.శ్రీ ఫలం తాంత్రిక ప్రయోగాలకు ఎంతో ఉపయోగపడుతుంది.
జాతకంలో చంద్రుడు అష్టమంలో ఉంటే బాలారిష్ట దోషం అంటారు.బాలారిష్ట దోషం ఉన్నవారు శ్రీపలాన్ని ఎర్రటి గుడ్డలో కట్టి మెడలో గాని ,నడుముకి గాని కట్టుకోవాలి.
ప్రజాపయోగ వ్యాపారసంస్థలలో,వాటర్,రియల్ ఎస్టేట్,పాల వ్యాపారసంస్థలలో తప్పనిసరిగా శ్రీపలాన్ని పూజించాలి.శ్రీ ఫలాన్ని నిత్యం పూజించే వారికి ధనానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు.శ్రీ ఫలాన్ని వ్యాపారస్ధలంలోను, ఆపీసుల్లో ఉంచిన సత్వర ఆర్ధికాభివృద్ధి ఉంటుంది.శ్రీ ఫలాన్ని పూజచేసుకొని దగ్గర ఉంచుకొనేవారికి డబ్బు వృధాగా ఖర్చు అవ్వవు.శ్రీ లక్ష్మీ ఫలంతో పాటు ఎల్లప్పుడు నాణేలను ఉంచాలి.