Friday 27 August 2021

బలరాముడు

 



బలరాముడు దేవకీ గర్భం నుంచి ఏడవ వాడిగా పుట్టవలసినవాడు. కంసుడికి ఏడూ ఎనిమిదీ గర్భాల గురించిన సందిగ్ధతను పుట్టించి, ఇంకా భయాన్ని పెంచడానికి ఈ బలరాముణ్ని దేవకీ గర్భం నుంచి సంకర్షించి, గొల్లపల్లెలో ఉన్న వసుదేవుడి భార్యే అయిన రోహిణి గర్భంలో ఉంచారు. ఆ కాలంలోనే ఈ గర్భమార్పిడి పద్ధతి జరిగింది. అందుకనే బలరాముణ్ని సంకర్షణుడని అంటారు. సంకర్షించడమంటే అసలైన అర్థం, బ్రహ్మ చైతన్యం నుంచి దూరంగా లాగడమని. ఇలా భగవంతుణ్నించి దూరంగా లాగుతూ ప్రపంచ విలాసాల ప్రలోభా లను చూపించేది ప్రకృతి.



అంచేత ఇలా సంకర్షణ చేసే ప్రకృతే బలరాముడు. కానీ ప్రకృతి అంటే, భగవంతుడి ప్రకృష్టమైన, గొప్పదైన కృతి, పని, కావ్యం. కావ్యం కాంతలాగ బుర్రకెక్కేలాగ చెబుతుందని చెబుతారు. భగవంతుడనే పురుషుడు గీసిన గిరిలోనే ఉంటూ పనిచేస్తుంది ఈ ప్రకృతి అనే కావ్యకాంత. ప్రకృతి మనను దూరంగా లాగుతున్నా, దూరంగా పోవడం వల్ల కలుగుతూన్న కష్టనష్టాలను అనుభవించేలాగ చేసి, తిరిగి భగవంతుడి వైపు మళ్లేలాగ చేస్తుంది కూడాను. ఆ విధంగా కూటస్థుడైన శ్రీకృష్ణుణ్ని దాటి ఎప్పుడూ ప్రవర్తించదు అతిబలిష్ఠమూ ప్రకృతి రూపమూ అయిన బలరామత్వం.

 

బలరాముడు ప్రకృతిగా దుర్యోధన పక్షపాతిగా, భగవంతుడి దగ్గరే ఉన్నా అతనికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూన్నట్టు అవుపిస్తాడు. మోసం చేసి సంపాయించిన పాండవుల రాజ్యాన్ని కౌరవులు తిరిగి ఇయ్యాలి లేదా యుద్ధంలో చావాలి అని శ్రీకృష్ణుడు అంటూంటే, జూదమాడడమూ రాజ్యాన్ని పోగొట్టుకోడమూ ధర్మరాజు స్వయంకృతాప రాధాలే తప్ప, వాటిలో దుర్యోధన శకునుల తప్పేమీ లేదన్నట్టు గానే మాట్టాడాడు బలరాముడు.

 

శ్రీకృష్ణుడి సాయాన్ని అడగడానికి దుర్యోధనుడూ, అర్జునుడూ ద్వారకకు వచ్చారు. కృష్ణుడు వీళ్లను పరీక్షించాలను కొన్నట్టుగా నిద్రపోతున్నాడు. ముందు వచ్చిన దుర్యోధనుడు గర్వం కొద్దీ తల వైపూ తరవాత వచ్చిన అర్జునుడు భక్తి కొద్దీ పాదాల దగ్గర కూర్చున్నారు.  కృష్ణుడు లేవగానే ఎదురుగా కూర్చున్న అర్జునుణ్నే చూశాడు సహజంగానే. ‘కానీ బావా! నేనే ముందర వచ్చాను నీ సాయాన్ని అర్థించ డానికి’ అని దుర్యోధనుడు అన్నాడు.



‘నా సాయాన్ని రెండు భాగాలుగా చేస్తాను: ఒక భాగం, ఏ శస్త్రమూ ఆయుధమూ పట్ట కుండా ఏదో మాట సహాయం మాత్రం చేసే నేను; రెండో భాగం కోట్లాది మంది ఉన్న నా నారాయణీసేన. మీ ఇద్దరిలో చిన్నవాడూ నేను ముందు చూసినవాడూ అర్జునుడు కనక, అతన్నే ముందర కోరుకో మంటాను’ అని కృష్ణుడన్నాడు. దీనికి దుర్యోధనుడు, అర్జునుడు ఆ పెద్దసేనను ఎగరేసుకొనిపోతాడేమోననే బెంగతో గతుక్కుమన్నాడు. అయితే, అర్జునుడు శ్రీకృష్ణుడి గొప్పతనాన్ని ఎరిగినవాడు కనక, శస్త్రం పట్టకపోయినా ఎలా నడచు కోవాలో ఉపాయాలు చెప్పే అతన్నే ఎన్ను కున్నాడు.



నారాయణీసేనను సంతోషంగా గ్రహించి దుర్యోధనుడు ఆ మీద తనకు గదాయుద్ధం నేర్పిన బలరాముడి దగ్గరికి వెళ్లి సహాయమడిగాడు. ‘నేను కృష్ణుడితో మనకు ఇరుపక్షాలవాళ్లూ సమానమని చాలాసార్లే చెప్పాను కానీ అతనికి నా మాట నచ్చలేదు. నేనేమో కృష్ణుణ్ని విడిచి ఒక్క క్షణమైనా వేరుగా ఉండలేను. అంచేత ఇటు నీకు గానీ అటు అర్జునుడికి గానీ సాయం చేయ కూడదని మనసులో నిశ్చయించుకొన్నాను. సర్వరాజులూ పూజించే భరతవంశంలో పుట్టావు.



వెళ్లు, క్షత్రియ ధర్మానుసారమూ యుద్ధం చెయ్యి’ అని బలదేవుడనగానే అతన్ని కౌగిలించుకొని, కృష్ణుణ్ని మోసం చేయ గలిగానని మురిసిపోతూ దుర్యోధనుడు హస్తినా పురానికి చక్కాపోయాడు. ఇక్కడ యుధిష్ఠిరుడు మామగారైన ద్రుపదుణ్నీ, విరటుణ్నీ, బలరాముణ్నీ, సాత్యకినీ, ధృష్టద్యుమ్నుణ్నీ, శిఖండినీ, సహదేవుణ్నీ ఏడుగురు సేనాపతులుగా అభిషేకం చేశాడు. తిరిగి ఈ ఏడుగురి లోనూ ధృష్టద్యుమ్నుణ్ని సర్వసైన్యాధి పతిగా ఘోషించాడు. వీరికి అధిపతిగా అర్జునుణ్ని నియమించాడు.



అర్జునుడి క్కూడా నేతగానూ అతని రథాశ్వాల నియంతగానూ జనార్దనుణ్ని కోరు కున్నాడు యుధిష్ఠిరుడు. ఆ సమయంలోనే మహాయుద్ధానికి సన్నద్ధమయ్యారని తెలిసి బలరాముడు, అక్రూరుడూ గదుడూ సాంబుడూ మొదలైనవాళ్లతో సహా ధర్మ రాజును చూడ్డానికి వచ్చాడు. బల రాముడికి నాగలీ రోకలీ ఆయుధాలుగా వర్ణిం చడంలో కూడా అతను ప్రకృతికి ప్రతీక అని చెప్పడమే ఇమిడి ఉంది. నాగలితో నేలను దున్నగా పండిన ధాన్యాలతోనూ ఆ ధాన్యాలను రోకలితో దంచి ‘పొట్టు’ అనే అడ్డును తొలగించి ఆ అన్నాలతో సర్వభూతాలనూ ప్రకృతి సాకుతోంది.

 రోహిణి కొడుకు రాగానే ధర్మరాజూ కృష్ణుడూ భీముడూ అర్జునుడూ నకుల సహదేవులూ ఇతర రాజులూ అందరూ వినయంగా లేచి నిలబడి అతన్ని సత్కరించారు.



కృష్ణుడి వైపు చూస్తూ బలరా ముడు ‘ఇక ఈ మహా భయంకరమైన యుద్ధం జరగవలసిందేనేమో! యుద్ధానికి ముందే, ఏ దెబ్బలూ సుస్తీలూ లేనప్పుడే చుట్టాల్నీ సుహృత్తుల్నీ చూసిపోదామని వచ్చాను. ఎవరెవరు ఈ కురుక్షేత్రానికి చేరుకున్నారో వాళ్లందరికీ కాలం పక్వ మైందన్న మాట నిస్సంశయం. నువ్వు ఒకవైపు ఉండొద్దని నేను కృష్ణుడికి చెప్పాను. పాండవులు మనకెలాగ బాంధవులో దుర్యోధన మహారాజు కూడా బంధువే. అతనిక్కూడా సాయం చెయ్యి.



అతను చాలామార్లే ఇక్కడికి వస్తూ పోతున్నాడు. కానీ నీ కోసమనీ కృష్ణుడు నా మాట పట్టించుకోకుండా దుర్యోధనుణ్ని ఉపేక్షిం చాడు. కృష్ణుడువినా నేను ఈ జగత్తును కన్నెత్తై చూడలేను. అంచేత అతను ఏం చేయదలుచుకున్నాడో దాన్నే నేనూ అనుస రిస్తాను. గదాయుద్ధంలో విశారదులైన భీమదుర్యోధనులిద్దరూ నాకు శిష్యులే. అంచేత వాళ్ల పట్ల నాకు సమానమైన స్నేహముంది. కురువంశీయులు నాశనమవుతూంటే నేను చూస్తూ ఊరకనే ఉండలేను.



అందుకే నేను సరస్వతీనది ఒడ్డున ఉన్న తీరాన్ని సేవించుకొందామని వెళ్తున్నాను’ అని సెలవు తీసుకొన్నాడు. ఈ మాటలతోనూ మనకు బలరాముడు తాను పురుషుడి (ఆత్మ) అధీనంలో ఉండే ప్రకృతినని చెప్పకనే చెప్పినట్టయింది.

 యుద్ధంలో పద్దెనిమిదో రోజుకు నలభై రెండు రోజులపాటు తీర్థయాత్రలు ముగించుకొని బలరాముడు వచ్చాడు. భీమ దుర్యోధనుల యుద్ధం జరుగు తూండగా అర్జునుడు కృష్ణుణ్ని ‘ఈ ఇద్దరిలో నీ ఉద్దేశంలో ఎవరు గొప్ప? ఎవరిలో ఏయే గుణాలున్నాయి? నువ్వు ఎలాగ బేరీజు వేస్తావు?’ అని అడిగాడు.



దానికి జవాబుగా వాసుదేవుడు ఇలాగ చెప్పాడు: ‘ఇద్దరికీ సమానమైన శిక్షణే అందింది. భీమసేనుడు బలంలో మిన్న; దుర్యోధనుడేమో గదాయుద్ధంలో బాగా పరిశ్రమ చేశాడు. భీముడు ధర్మపూర్వ కంగా గదా యుద్ధం చేస్తే గెలవడు; అన్యా యంగా చేస్తేనే సుయోధనుణ్ని చంప గలుగుతాడు. దేవతలు అసురుల్ని మాయ తోనే, అంటే ఉపాయంతో కూడిన నేర్పు తోనే జయించారు. అంచేత భీముడు కూడా మాయమయమైన పరాక్రమాన్ని అవలంబించాలి. జూదమాడుతూన్న ప్పుడు సుయోధనుడి తొడలను గదతో విరగ్గొడతానని ప్రతిజ్ఞ చేశాడు గదా! ఆ ప్రతిజ్ఞను ఇప్పుడు పూర్తి చెయ్యాలి.



మాయావి అయిన దుర్యోధనుణ్ని మాయ తోనే నాశనం చేయాలి. అలా కాకుండా బలాన్నే ఆశ్రయించుకొని న్యాయంగా నాభి కింద కొట్టకూడదనే నియమాన్ని పాటిస్తే యుధిష్ఠిరుడు గడ్డు పరిస్థితిలో పడిపోతాడు. ధర్మరాజు దుర్యో ధనుడితో ఈ ద్వంద్వ యుద్ధంలో నువ్వు గెలిస్తే నీదే రాజ్యమంతా అని బుద్ధి లేని మాటల న్నాడు. భీష్మ ద్రోణ కర్ణ శల్య జయద్రథ భగదత్తుల్లాంటి వీరుల్ని చంపిన మీదట ధర్మరాజు ఈ పిచ్చిమాట అని ఇంత కాలమూ కష్టపడి చేసినదాన్నంతనీ ఒక్క సారిగా సంశయంలో పడేశాడు.



ఇది ధర్మ రాజు తాలూకు పెద్ద అబుద్ధే. ఈ ఒక్కటీ గెలిస్తే అంతనీ గెలుచుకొన్నట్టే అంటూ ఇంతదాకా గెలుచుకొన్నదాన్నంతనీ పణంగా పెట్టేశాడు. దుర్యో ధనుడు గదా యుద్ధంలో ఆరితేరినవాడు. అదీగాక మిమ్మల్ని గెలవాలన్న అతినిశ్చయంతో ఉన్నాడు. భీముడు గదాయుద్ధ నియమానికి విరుద్ధంగా తన ప్రతిజ్ఞను తీర్చుకోడానికి ప్రయత్నం చెయ్యకపోతే, దుర్యోధనుడు రాజై కూర్చుంటాడు’ అని సుదీర్ఘంగా ఉపన్య సించాడు.

 

అప్పటికే వాళ్లిద్దరూ యుద్ధంలో పరస్పర గదాఘాతాలతో ఎర్రగా తయా రయ్యారు. భీముడి గదావేగం దుర్యో ధనుడి తొడలను విరగ్గొట్టింది. కింద కూలిపోయాడు. భీముడు మునపటి సన్నివేశాలన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ కసి కొద్దీ దుర్యోధనుడి కిరీటాన్ని కాలితో తన్ని అతని తలను తొక్కాడు. ఇది చూసేసరికి బలరాముడి కోపం మిన్నంటింది. ‘ఛీ ఛీ భీమసేనుడా! గదాయుద్ధంలో బొడ్డు కింద కొట్టగూడదనే శాస్త్రీయ నియమాన్ని ఉల్లంఘించావు’ అని అతన్ని నిందించి, కృష్ణుడితో ‘ఈ రోజున నాతో సమానుడైన దుర్యోధనుణ్నే గాదు నన్ను కూడా అవ మానించాడు భీమసేనుడు’ అంటూ అతి కోపంతో భీముడి మీదకు ఉరికాడు. తక్షణమే శ్రీకృష్ణుడు అన్నను ఆపాడు.



‘మనకు శుద్ధపౌరుషులైన పాండవులు సహజ మిత్రులు. స్వయానా మన మేనత్త కొడుకులు. అదీగాక శత్రువుల చేత బాగా మోసానికి గురి అయ్యారు. క్షత్రియుడైన వాడికి ప్రతిజ్ఞా పరిపాలనం అతిధర్మం. సుయోధనుడి తొడల్ని గదతో భేదిస్తానని సభామధ్యంలో భీముడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. తొడలు బొడ్డుకిందే ఉంటాయి. బొడ్డు కింద కొట్టకూడదంటే, ప్రతిజ్ఞను తీర్చుకోడానికి మరో మార్గమేది? అదీగాక మైత్రేయ మహర్షి, అడవిలో పాండవుల కష్టాల్ని కళ్లారా చూసి, దుర్యోధనుడికి పాండవులతో వైరం మానుకోమని చెప్పి నప్పుడు, ఈ దుర్యోధనుడు తొడమీద కొట్టుకొంటూ అతనికి కోపాన్ని తెప్పిం చాడు.



ఆయన అప్పుడు భీముడి గద నీ యీ తొడను బద్దలుగొడుతుందని శపించాడు కూడాను. అదీగాకుండా ఇప్పుడు కలియుగం ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. వీటన్నిటి దృష్ట్యా వైరాన్నీ ప్రతిజ్ఞనీ తీర్చుకోవడం క్షత్రియుడైన భీముడికి తగినదే. నువ్వు కోపాన్ని దిగమింగాలి’ అని కృష్ణుడు బలరాముణ్ని తగ్గేలాగ చేశాడు. బలరాముడు కృష్ణుడికి ఎదురాడలేక ద్వారకకు వెళ్లిపోయాడు.




సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం,
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,
ఆర్దికలావాదేవీలు,ETC), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట,
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు
సంప్రదించండి.
FOLLOW US :
PLZ LIKE , SHARE , FOLLOW AND SUBSCRIBE
FACEBOOK PAGE
VIEW_PUBLIC_FOR=1712439968969888
FACEBOOK GROUP :
(20+) VIDHATHA ASTRO NUMEROLOGY | FACEBOOK
YOUTUBE
PRINTEREST
TWITTER
INSTAGRAM
BLOG
WHATSAPP GROUP
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP:
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, విశిష్ట ఆచార్య, వాస్తు విశారద
HAVANIJAAA / హవనిజా
( B.ed, MCA, M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం/ SREE VIDHATHA PEETAM
Ph. no: 9666602371






Saturday 21 August 2021

హయగ్రీవ జయంతి... లక్ష్మీదేవి సహిత విష్ణమూర్తి

 




అందరం ప్రతినిత్యం చదువుకునే ఈ లలితా సహస్రనామాలు కూడా హయగ్రీవుని ద్వారానే వచ్చాయి. హయగ్రీవుడు చదువులకు అధిదైవం. జ్ఞానంవిద్యసద్య స్ఫురణసృజనాత్మకత కావాలనుకునే వారు హయగ్రీవుని ఆరాధించాలి. అవి కావాలని అందరూ కోరుకుంటారు కనుక అందరూ హయగ్రీవుని ఉపాసన చేయడం మంచిది.


శ్రవణానక్షత్రం ఏ పూర్ణిమనాడుంటే ఆ మాసాన్ని శ్రావణమాసం అంారు. శ్రవణం శ్రీహరి జన్మ నక్షత్రం. పూర్ణిమ లక్ష్మీదేవి పుట్టినతిథి. ఆ రెండు కలిసిన శ్రావణపూర్ణిమకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

జ్ఞానానంద మయం దేవం నిర్మల స్పఠికాకృతిమ్‌

ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే

దుష్టశిక్షణ శిష్టరక్షణ కోసం శ్రీహరి దాల్చిన అవతారాల్లో హయగ్రీవ అవతారం ఒకి. సమస్త విద్యలను, జ్ఞానాన్ని పాండిత్యాన్ని అనుగ్రహించే శ్రీ గురుమూర్తి హయగ్రీవ స్వామి.

గుర్రపుముఖంతో, నరశరీరంతో, చతుర్భుజుడై శంఖచక్రాలను ధరించి వామాంకంలో లక్ష్మీదేవి సహితంగా ఆవిర్భవించిన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే హయగ్రీవస్వామి.

బ్రహ్మాండ పురాణంలో : హయగ్రీవస్వామికి సంబంధించిన మరొక పురాణగాథ బ్రహ్మాండ పురాణంలో ప్రచారంలో ఉంది. ఒకప్పుడు అగస్త్య మహర్షి శ్రీ లక్ష్మీహయగ్రీవస్వామిని ఉపాసించాడు. ఆ స్వామి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. జగజ్జనని శ్రీ లలితా పరమేశ్వరుని గూర్చి ఏమి ఉపదేశించినా సరే అన్నాడు. అప్పుడు హయగ్రీవస్వామి శ్రీ లలితా అమ్మవారి మంత్రాన్ని అంగన్యాస, కరన్యాస పూర్వకంగా ఉపదేశించడమే కాకుండా, లలితాదేవి మహత్యాన్ని గూర్చి విపులంగా చెప్పాడు. అమ్మలగన్న అమ్మను గూర్చి సర్వవిధాల ఉపదేశించారు. కానీ, ఇంకొక కొరత ఉన్నది. అదే లలితా పరాబట్టారికా సహస్రనామస్తోత్ర వైశిష్ట్యాన్ని వీరు చెప్పకపోవడం వెలితిగా ఉంది అన్నాడు మహర్షి. అప్పుడు హయగ్రీవస్వామి అతి రహస్యమైనది, మహిమ గలది లోకక్షేమం కోసం, పరమేశ్వరీ సంకల్పంతో దాన్ని ఉపదేశిస్తాను అన్నాడు.

శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ

చిదగ్నికుండసంభూతా దేవకార్య సముద్యతా


శ్రీ చక్రరాజనిలయా శ్రీమత్త్రిపురసుందరీ

శ్రీ శివా శివశక్యైక్య రూపిణి లలితాంబికా

ఏవం శ్రీలలితా దేవ్యా నామ్నాం సహస్రకం జగుః...

ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే ఉత్తరాఖండే శ్రీహయగ్రీవాగస్త్య సంవాదే శ్రీ లలితాసహస్రనామ స్తోత్రకథనం సంపూర్ణం....

అంటూ జరిగిన శ్రీహయగ్రీవస్వామి, అగస్త్య మహర్షి వారల సంవాదం వల్ల అత్యంత రహస్యమైన మహిమగల లలితా సహస్రనామం లోకానికి అందింది.

హయగ్రీవుని విశాల ఆలయం అస్సాంలో ఉంది. తిరుమల శ్రీహరి ఆలయ మహా ప్రదక్షిణ మార్గంలో శ్రీ లక్ష్మీహయగ్రీవ ఆలయం ఉంది.

ఆధ్యాత్మిక, చైతన్యాన్ని జ్ఞానాన్ని అందిస్తూన్న యజ్ఞమయ, విద్యామయ, దేవతామయ రూపం హయగ్రీవ స్వరూపం. శ్రావణపూర్ణిమనాడు హయగ్రీవ ఆరాధన చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం.

ఈ హయగ్రీవుని గురించి వేరు వేరు పురాణాలు వేరు వేరు గాథలను చెపుతున్నాయి. 

ముఖ్యంగా అందరం ప్రతినిత్యం చదువుకునే ఈ లలితా సహస్రనామాలు కూడా హయగ్రీవుని ద్వారానే వచ్చాయి. హయగ్రీవుడు చదువులకు అధిదైవం. జ్ఞానంవిద్య, సద్య స్ఫురణ, సృజనాత్మకత కావాలనుకునే వారు హయగ్రీవుని ఆరాధించాలి. అవి కావాలని అందరూ కోరుకుంటారు కనుక అందరూ హయగ్రీవుని ఉపాసన చేయడం మంచిది.







సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం,
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,
ఆర్దికలావాదేవీలు,ETC), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట,
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు
సంప్రదించండి.
FOLLOW US :
PLZ LIKE , SHARE , FOLLOW AND SUBSCRIBE
FACEBOOK PAGE
VIEW_PUBLIC_FOR=1712439968969888
FACEBOOK GROUP :
(20+) VIDHATHA ASTRO NUMEROLOGY | FACEBOOK
YOUTUBE
PRINTEREST
TWITTER
INSTAGRAM
BLOG
WHATSAPP GROUP
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP:
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, విశిష్ట ఆచార్య, వాస్తు విశారద
HAVANIJAAA / హవనిజా
( B.ed, MCA, M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం/ SREE VIDHATHA PEETAM

Ph. no: 9666602371









Monday 9 August 2021

శ్రావణమంగళగౌరీవ్రతవిధానం – #మంగళగౌరీపూజ






ఈ మంగళగౌరీ వ్రతం


ఈ నెలలో వచ్చే ఐదు మంగళవరాలు మంగళ గౌరీని పూజించాలి. పార్వతి దేవికి మరొక పేరు (గౌరీ) మంగళ గౌరీ. సాధారణంగా కొత్తగా పెళ్ళయిన ముత్తైదువలు ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్నిగురించి స్వయంగా శ్రీ కృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి.


శ్రావణ మంగళ గౌరీ వ్రతం విధానం లేదా మంగళ గౌరీ పూజ ఏవిధంగా జరుపుకోవాలో మంత్ర పూర్వకంగా, వివరణతో క్రింది విధంగా తెలుపబడినది.


శ్రీ పసుపు గణపతి పూజ:


శ్లో || శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే

దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః

సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చదేహిమే


(దీపము వెలిగించి దీపపు కుందెకు గంధము,కుంకుమబొట్లు పెట్టవలెను.)


శ్లో || అగమార్ధం తు దేవానాం గమనార్ధం తు రక్షసాం

కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్


(గంటను మ్రోగించవలెను)


ఆచమనం


ఓం కేశవాయ స్వాహా,ఓం నారాయణాయ స్వాహా,ఓం మాధవాయ స్వాహా,


(అని మూడుసార్లు ఆచమనం చేయాలి)


ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః,

మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః,

వామనాయ నమః, శ్రీధరాయ నమః,

ఋషీకేశాయ నమః, పద్మనాభాయ నమః,

దామోదరాయ నమః, సంకర్షణాయ నమః,

వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః,

అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః,

అధోక్షజాయ నమః, నారసింహాయ నమః,

అచ్యుతాయ నమః, జనార్ధనాయ నమః,

ఉపేంద్రాయ నమః, హరయే నమః,

శ్రీ కృష్ణాయ నమః

యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా

తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళమ్ ||

లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవహః

యేషా మిందీవర శ్యామో హృదయస్థో జనార్థనః

ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదాం

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ||

సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే

శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే ||


శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః

వాణీ హిరణ్యగర్బాభ్యాం నమః శచీపురందరాభ్యం నమః

అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః

నమస్సర్వేభ్యో మహాజనేభ్య నమః

అయం ముహూర్తస్సుముహోర్తస్తు

ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమి భారకాః

ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే ||


(ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.)


ప్రాణాయామము


(కుడిచేతితో ముక్కు పట్టుకొని యీ మంత్రమును ముమ్మారు చెప్పవలెను)


ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్

ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోమ్


సంకల్పం:


ఓం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే, శోభ్నే, ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చెప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే (ఉత్తర/దక్షిణ) ఆయనే (ప్రస్తుత ఋతువు) ఋతౌ (ప్రస్తుత మాసము) మాసే (ప్రస్తుత పక్షము) పక్షే (ఈరోజు తిథి) తిథౌ (ఈరోజు వారము) వాసరే (ఈ రోజు నక్షత్రము) శుభ నక్షత్రే (ప్రస్తుత యోగము) శుభయోగే, శుభకరణే. ఏవం గుణ విశేషణ విషిష్ఠాయాం, శుభతిథౌ,శ్రీమాన్ (మీ గోత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ,ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం, ధర్మార్ద, కామమోక్ష చతుర్విధ ఫల,పురుషార్ధ సిద్ద్యర్థం, ధన,కనక,వస్తు వాహనాది సమృద్ద్యర్థం, పుత్రపౌత్రాభివృద్ద్యర్ధం, సర్వాపదా నివారణార్ధం, సకల కార్యవిఘ్ననివారణార్ధం,సత్సంతాన సిధ్యర్ధం, పుత్రపుత్రికానాం సర్వతో ముఖాభివృద్యర్దం, ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం, శ్రీమత్ క్షీరాబ్దిశయన దేవతా ముద్దిశ్య శ్రీ క్షీరాబ్ధిశయన దేవతా ప్రీత్యర్ధం యావద్బక్తి ధ్యాన,వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే


(అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.)


తదంగత్వేన కలశారాధనం కరిష్యే


కలశారాధనం:


శ్లో || కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః

మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః

కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా

ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః

అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః


(కలశపాత్రకు గంధము,కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను.కలశపాత్రపై కుడి అరచేయినుంచి ఈ క్రింది మంత్రము చదువవలెను.)


శ్లో || గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి

నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు

ఆయాంతు దేవపూజార్థం – మమ దురితక్షయకారకాః

కలశోదకేన పూజా ద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య


(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా పూజాద్రవ్యములపైన,తమపైన జల్లుకొనవలెను.తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుతూ ఈ క్రింది మంత్రము చదువవలెను.)


మం || ఓం గణానాంత్వ గణపతి హవామహే కవింకవీనాముపమశ్రస్తవం

జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్


శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి,ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి


(అక్షతలు వేయవలెను)


శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి


(నీళ్ళు చల్లవలెను)


శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి


(నీళ్ళు చల్లవలెను)


ముఖే శుద్దాచమనీయం సమర్పయామి శుద్దోదకస్నానం సమర్పయామి


(నీళ్ళు చల్లవలెను)


శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి


(అక్షతలు చల్లవలెను)


శ్రీ మహాగణాధిపతయే నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి


(గంధం చల్లవలెను)


శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి


(అక్షతలు చల్లవలెను)


ఓం సుముఖాయ నమః,ఏకదంతాయ నమః,కపిలాయ నమః,గజకర్ణికాయ నమః,లంబోదరాయ నమః,వికటాయ నమః,విఘ్నరాజాయ నమః,గణాధిపాయ నమః,ధూమకేతవే నమః,గణాధ్యక్షాయ నమః, ఫాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః,శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ది ప్రదాయకాయ నమః,మహాగణాదిపతియే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాం సమర్పయామి.

మహాగణాధిపత్యేనమః ధూపమాఘ్రాపయామి


(అగరవత్తుల ధుపం చూపించవలెను.)


ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్

సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి.


(బెల్లం ముక్కను నివేదన చేయాలి)


ఓం ప్రాణాయస్వాహా, ఓం అపానాయస్వాహా, ఓం వ్యానాయ స్వాహా

ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా ,మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.


(నీరు వదలాలి.)


తాంబూలం సమర్పయామి, నీరాజనం దర్శయామి.


(తాంబూలము నిచ్చి కర్పూరమును వెలిగించి చూపవలెను)


ఓం గణానాంత్వ గణపతిగ్ హవామహే కవింకవీనాముపమశ్రవస్తవం

జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్

శ్రీ మహాగణాదిపతయే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి

ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి

అనయా మయా కృత యధాశక్తి పూజాయచ శ్రీ మహాగణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు


(అనుకొని నమస్కరించుకొని, దేవుని వద్ద గల అక్షతలు ,పుష్పములు శిరస్సున ధరించవలసినది.)


తదుపరి పసుపు గణపతిని కొద్దిగా కదిలించవలెను.


శ్రీ మహాగణాధిపతయే నమః యధాస్థానం ముద్వాసయామి.


(శ్రీ మహాగణపతి పూజ సమాప్తం.)


శ్రావణ మంగళ గౌరీ వ్రతం విధానం:


ధ్యానం:


శ్లో: సకుంకుమ విలేపనామలిక చుంబిక కస్తూరికాం

సమందహాసితేక్షణాం సశర చాపాశాంకుశాం

అశేష జనమోహిని అరుణమాల్యాభూషాంభరాం

జపాకుసుమభాసురాం జపవిధౌస్మరేదంబికాం.


శ్లో: దేవీం షోడశావర్షీ యాం శశ్వత్ సుస్థిర యౌవనాం

బిమ్బోష్టీం సుదతీం శుద్దాం శరత్పద్మ నిభాననాం

శ్వేతా చంపకవర్నాభాం సునీలోత్పల లోచనం


శ్రీ మంగళగౌరి దేవతాయై నమః ధ్యానం సమర్పయామి.


*ఆసనం 


శ్లో: కల్లోలోల్ల సితామ్రుతాబ్ది లహరీ మధ్యే విరాజన్మని

ద్వీపే కల్పకవాతికా పరివృతే కాదంబ వాత్యుజ్వలె

రత్న స్థంభ సహస్ర నిర్మిత సభామద్యే విమానోత్తమే

చింతారత్న వినిర్మితం జననితే సింహాసనం భావయే.


శ్రీ మంగళగౌరి దేవతాయై నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి.


*ఆవాహనం 


శ్లో: ఏణాంకానల భానుమందల సచ్చీచ్రక్రమ మధ్యేస్తితాం

బాలార్క ద్యుతి భాసురాం కరతలై పాశాన్కుశౌ బిబ్రతీం

చాపం బానమసి ప్రసన్న వదనం కౌస్తుమ్భ వస్త్రాన్విన్తాం

తాంత్వాచంద్ర కలావటం సమకుతాం చారుష్మీతాం భావయే


శ్రీ మంగళగౌరి దేవతాయై నమః ఆవాహనం సమర్పయామి.


పాద్యం:


శ్లో: ఈశానాదిపదం శివైక ఫలదం దత్నాసనం తే శుభం

పాద్యం కుంకుం చందనాది భరితం చార్ఘ్యం సరత్నాక్షతై

శుద్డై రాచమనీయం తవ జలైర్భాక్తై మయా కల్పితం

కారుణ్య మ్రుతవారిదే తధఖిలం సంతుష్టయే కల్పతాం.


శ్రీ మంగళగౌరి దేవతాయై నమః పాదయో పాద్యం సమర్పయామి.


*అర్ఘ్యం 


శ్రీ మంగళగౌరి దేవతాయై నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి.


*ఆచమనీయం 


శ్రీ మంగళగౌరి దేవతాయై నమః ముఖే ఆచమనీయం సమర్పయామి.


*శుద్దోదక స్నానం 


శ్లో: లక్ష్మే యోగిజనన్య రక్షిత జగజ్జాలే విశాలేక్షేన

ప్రాలేయామ్బు పటీర కుంకుమ లసత్కర్పూరమి శ్రోదకై

గోక్షేరై రాపి నారికేళ సలిలై శుద్దోదకై ర్మంత్రితై

స్నానం దేవిదియా మయైతదఖీలం సంతుష్టయే కల్పతాం.


శ్రీ మంగళగౌరి దేవతాయై నమః స్నానం సమర్పయామి.


అక్షతలు:


శ్లో: హ్రీంకారఅంకిత మంత్రక్షితలతోనో హేమాచాలాత్స చిన్తై

రత్నైరుజ్జ్వల ముత్తరీయసహితం కౌస్తుమ్భ వర్ణాంకుశాం


వస్త్రయుగ్మం:


శ్లో: కల్హారోత్పలమల్లికా మ్రునకై సౌవర్ణ పంకేరుహై

జాతీ చంపక మాలతీ వకులకై మందారకుందాదిభి

ముక్తానంతతి యగ్నసూత్ర మమలం సౌవర్ణ తంతూద్భవం

దత్తం దేవిదియా మయి మయైతద ఖిలం సంతుష్టయే కల్పతాం.


శ్రీ మంగళగౌరి దేవతాయై నమః కంచుక సహిత కౌసుంద వస్త్రయుగ్మం సమర్పయామి.


యజ్ఞోపవీతం:


శ్రీ మంగళగౌరి దేవతాయై నమః స్వర్ణ యజ్ఞోపవీతం సమర్పయామి.


ఆభరణం:


శ్లో: హంసి రాస్యతిలో భానీయగామనే హారావాలీ ముజ్వలాం

హిందోళ ద్యుతి హేమపూరిత తారేహేమాన్గాడే కనకనే

మంజీరౌ మనికున్దలౌ మ్కుతమవ్యే ర్దేండు చూదామనిం

నాసామోవ్క్తిక మంగులీయ కతకౌ కాన్చీమపి స్వీకురు


శ్రీ మంగళగౌరి దేవతాయై నమః నవరత్న మయా భారనాని సమర్పయామి.


గంధం:


శ్లో: సర్వాంగే ఘనసారకుమ్కుమ ఘన శ్రీ గంధనం కామ్కితం

కస్తూరి తిలకం చ ఫాలఫలకే గోరోచనా పత్రకం

గండా దర్శన మండలే నాయన యోర్ది వ్యంజనం తెర్పితం

కన్తాబ్జే మ్రుగానాభిపంకమమలం త్వత్ప్రీతయే కల్పతాం


శ్రీ మంగళగౌరి దేవతాయై నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి.


అధాంగ పూజ:


వుమాయై నమః పాదౌ పూజయామి

గౌర్యై నమః జన్ఘి పూజయామి

పార్వత్యైనమః జానునీ పూజయామి

జగన్మాత్రేనమః ఊరూ పూజయామి

జగత్ ప్రతిష్టాయై నమః కటిం పూజయామి

మూల ప్రక్ర్తుత్యైనమః నాభిం పూజయామి

అమ్బికాయై నమః ఉదరం పూజయామి

అన్నపూర్నాయై నమః స్థ నౌ పూజయామి

శివ సుందర్యై నమః వక్షస్థలం పూజయామి

మహాబలాయై నమః బాహూన్ పూజయామి

వరప్రదాయై నమః హస్తాన్ పూజయామి

కంభు కంట్యై నమః కంటం పూజయామి

బ్రహ్మ విద్యాయై నమః జిహ్వం పూజయామి

శాంకర్యై నమః ముఖం పూజయామి

శివాయై నమః నేత్రే పూజయామి

రుద్రాన్యై నమః కర్ణౌ పూజయామి

సర్వంన్గాలాయై నమః లలాటం పూజయామి

సర్వేశ్వర్యై నమః శిరః పూజయామి

మంగళ గౌర్యై నమః సర్వాణ్యంగాని పూజయామి

మంగలగౌర్యై నమః


 అష్ట్తోత్తర శతనామావళి


ఓం గౌర్యై నమః

ఓం గిరిజాతనుభావాయై నమః

ఓం జగన్మాత్రే నమః

ఓం వీరభద్ర ప్రసువే నమః

ఓం విశ్వరూపిన్యై నమః

ఓం కష్ట దారిద్రషమన్యై నమః

ఓం శామ్భావ్యై నమః

ఓం బాలాయై నమః

ఓం భాద్రదాయిన్యై నమః

ఓం సర్వ మంగలాయై నమః

ఓం మహేశ్వర్యై నమః

ఓం మంత్రారాధ్యై నమః

ఓం హేమాద్రిజాయై నమః

ఓం పార్వత్యై నమః

ఓం నారాయణంశాజాయై నమః

ఓం నిరీశాయై నమః

ఓం అమ్బికాయై నమః

ఓం ముని సంసేవ్యాయై నమః

ఓం మేనకాత్మజాయై నమః

ఓం కన్యకాయై నమః

ఓం కలిదోష నివారిన్యై నమః

ఓం గణేశ జనన్యై నమః

ఓం గుహామ్బికాయై నమః

ఓం గంగాధర కుతుమ్బిన్యై నమః

ఓం విశ్వా వ్యాపిన్యై నమః

ఓం అష్టమూర్తాత్మికాయై నమః

ఓం శివాయై నమః

ఓం శాంకర్యై నమః

ఓం భావాన్యై నమః

ఓం మాంగల్య దాయిన్యై నమః

ఓం మంజు భాశిన్యై నమః

మహా మాయాయై నమః

ఓం మహా బలాయై నమః

ఓం హేమవత్యై నమః

ఓం పాప నాశిన్యై నమః

ఓం నిత్యాయై నమః

ఓం నిర్మలాయై నమః

ఓం మ్రుదాన్యై నమః

ఓం మానిన్యై నమః

ఓం కుమార్యై నమః

ఓం దుర్గాయై నమః

ఓం కాత్యాయిన్యై నమః

ఓం కలార్చితాయై నమః

ఓం క్రుపాపూర్నాయై నమః

ఓం సర్వమయి నమః

ఓం సరస్వత్యై నమః

ఓం అమర సంసేవ్యాయై నమః

ఓం అమ్రుతెశ్వర్యై నమః

ఓం సుఖచ్చిత్పుదారాయై నమః

ఓం బాల్యారాదిత భూతదాయై నమః

ఓం హిరణ్మయై నమః

ఓం సూక్ష్మాయై నమః

ఓం హరిద్రా కుంకుమా రాధ్యాయై నమః

ఓం సర్వ భోగాప్రదాయై నమః

ఓం సామ శిఖరాయై నమః

ఓం కర్మ బ్రమ్హ్యై నమః

ఓం ఓం వాంచితార్ధ యై నమః

ఓం చిదంబర శరీరిన్యై నమః

ఓం దేవ్యై నమః

ఓం కమలాయై నమః

ఓం మార్కందేయవర ప్రదాయి నమః

ఓం పున్యాయై నమః

ఓం సత్యధర్మరతాయై నమః

ఓం శశాంక రూపిన్యై నమః

ఓం భాగాలాయై నమః

ఓం మాత్రుకాయై నమః

ఓం శూలిన్యై నమః

ఓం సత్యై నమః

ఓం కల్యాన్యై నమః

ఓం సౌభాగ్యదాయిన్యై నమః

ఓం అమలాయై నమః

ఓం అన్నపూర్ణాయై నమః

ఓం అఖిలాగమ సంస్తుతాయై నమః

ఓం అమ్బాయై నమః

ఓం భానుకోటి సముద్యతాయై నమః

ఓం పరాయి నమః

ఓం శీతాంశు కృత శేఖరాయై నమః

ఓం సర్వ కాల సుమంగళ్యై నమః

ఓం సామ శిఖరాయై నమః

ఓం వేదాంగ లక్షణా యై నమః

ఓం కామ కలనాయై నమః

ఓం చంద్రార్క యుత తాటంకాయై నమః

ఓం శ్రీ చక్ర వాసిన్యై నమః

ఓం కామేశ్వర పత్న్యై నమః

ఓం మురారి ప్రియార్దాన్గై నమః

ఓం పుత్ర పౌత్ర వర ప్రదాయి నమః

ఓం పురుషార్ధ ప్రదాయి నమః

ఓం సర్వ సాక్షిన్యై నమః

ఓం శ్యామలాయై నమః

ఓం చంద్యై నమః

ఓం భాగామాలిన్యై నమః

ఓం విరజాయై నమః

ఓం స్వాహాయై నమః

ఓం ప్రత్యంగి రామ్బికాయై నమః

ఓం దాక్షాయిన్యై నమః

ఓం సూర్య వస్తూత్తమాయై నమః

ఓం శ్రీ విద్యాయై నమః

ఓం ప్రనవాద్యై నమః

ఓం త్రిపురాయై నమః

ఓం షోడశాక్షర దేవతాయై నమః

ఓం స్వధాయై నమః

ఓం ఆర్యాయై నమః

ఓం దీక్షాయై నమః

ఓం శివాభిదానాయై నమః

ఓం ప్రణ వార్ధ స్వరూపిన్యై నమః

ఓం నాద రూపాయి నమః

ఓం త్రిగునామ్బికాయై నమః

ఓం శ్రీ మహాగౌర్యై నమః

ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః

నానావిధ పరిమళ పత్ర పుష్పాణి పూజయామి.


ధూపం:


శ్లో: హన్తారం మదనస్య నందయసియై రంగై రాసంగోజ్వలై

రైబృంఘ్యా వలినీల కుంతలా భర్త్యై ర్భ్నాసి తస్యాశయం

తానీ మాని తవాంబ కొమలతరాన్యా మొదలీలాగ్రుహ

న్యామోదాయదశాంగగ్గుల ఘ్రుటై ర్దూపై రహన్దూపాయే .


ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః దూపమాగ్రాపయామి


*దీపం 


శ్లో: లక్ష్మిముజ్జ్వలయామి రత్ననివహైర్భాస్య త్తరు మందిరే

మాలారత్న నిడంబిటై ర్మనిమయ స్తంభేషు సంభావియై

చిత్రైర్హాతకపు త్రికాకరద్రుటై ర్ఘవై ఘ్రుతై ర్వర్దిటై

ర్దివ్యైర్దిపగానైర్ధ్యై గిరిసుతే త్వత్ప్రీతయే కల్పతాం.


ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః దీపం దర్శయామి


నైవేద్యం:


శ్లో: హ్రీమ్కారేశ్వరి తప్త హాటక కృతి స్తాలీసహశ్ర్యై ఘ్రుతం

దివ్యాన్నం ఘ్రుతసూపశక భరితం చ్త్రాన్నభేదం తదా

దుగ్దాన్నం మధుశార్కరాధది యుతం మానిక్యపాత్రేస్తితం

మాశాపూశాసః శ్రమంబ సఫలం నైవేద్య మావేదాయే


ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః మహా నైవేద్యం సమర్పయామి


*తాంబూలం 


శ్లో: సచ్చాయై ర్వరకేతకీదలరుచా తాంబూల వల్లి దలై

ఫూగీ ర్భూరి గుణి స్సుగంది కర్పూర ధన్దోజ్జలై

ముక్తాచూర్ణ విరాజియై గృహవిధ్యై ర్వక్తాంభుజా మోదకై

పూర్నా రత్న కలాచికా తమ మదేన్యస్త పురస్తాడుమే


ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః తాంబూలం సమర్పయామి.


నీరాజనం:


శ్లో: కన్యాభి కమనీయ కాంతిభి రాలంకారామలారారిక్త

పాత్రే పౌక్తిక చిత్ర పంజ్క్తి విలసత్కర్పూర దీపాలిభి

తత్తత్తాల మ్రుదంగగీత సహితం నృత్య పదాంభోరుహం

మంత్రారాధన పూర్వకం సువిహితం నీరాజయం గృహ్యాతాం


ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి.


శ్లో: పరాంకుషౌ పాశామభీతి ముద్రం

కరైర్వహన్తీం కమలాసనస్తాం

బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రం

భజేహ మంబాం జగదీశ్వరీం తాం.


*మంత్రపుష్పం 


శ్లో: సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే

శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.


ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః మంత్రపుష్పం సమర్పయామి.


*ప్రదక్షిణ నమస్కారాన్ 


శ్లో: హ్రీంకార త్రయపుటేన మనునోపాస్యే త్రయీ మౌలిభి

వాక్యై రల్క్ష్యతనో తవ స్తుతివిదౌ కో వాక్షమేతాంబికే

సల్లాప స్తుతిః ప్రదక్షిణ శతం సంచార ఏ వాస్తుమే

సంవేశో నమసహస్ర మఖిలం సంతుష్టయే కల్పతాం.


ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి.


శ్రావణ మంగళ గౌరీ వ్రత కథ


పూర్వం కృతయుగంలో దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగరమధనం చేసే సమయాన అమృతానికి ముందు అగ్నిజ్వాలలు కక్కుతూ కాలకూట విషయం పుట్టుకొచ్చింది. దానిని చూసి భయకంపితులైన దేవదానవులు పరమేశ్వరుని శరణుజొచ్చారు. ఆ సమయాన పరమేశ్వరుడు మందహాసముతో చిరునవ్వు నవ్వి.. ఇప్పుడు నేనేమి చెయ్యను? అన్నట్లు పార్వతి వైపు చూచాడు. ఆ సర్వమంగళ స్వరూపిణియై జగన్మాత, భర్తచూపులోని ఆంతర్యమేమిటో గ్రహించింది. దేవతులైనా, దానవులైనా, మానవులైనా, మనభక్తులే కదా! మన బిడ్డలకు ఆపద కలిగినప్పుడు మనము కాక వేరెవరు రక్షిస్తారు? అని భావించి నిరంతరం స్త్రీల సౌభాగ్య సంపదను కాపాడే ఆ సర్వమంగళ స్వరూపిణి తన మాంగల్య సౌభాగ్యముపై ప్రగాఢ విశ్వాసముంచి, లోకవినాశానికి కారణభూతమైన ఆ భయంకర కాలకూట విషాన్ని తన భర్త మింగేందుకు అనుమతి ఇచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. అట్టి కరుణాంతరమూర్తి పార్వతీదేవి. అట్టి సర్వమంగళ స్వరపిణి అయిన భవానీ మాతను కొత్తగా పెళ్లైన స్త్రీలు శ్రావణమాసం తొలి మంగళవారంతో మంగళగౌరీ వ్రతాన్ని విధిగా ప్రారంభించి ఐదు సంవత్సరాలు దీక్షగా ఆచరించాలి. అలా ఈ వ్రతాన్ని చేపట్టిన స్త్రీలపై శ్రీ మంగళగౌరి కటాక్షముతో వైధవ్యబాధలు లేకుండా వారీ జీవితాంతం సర్వసౌఖ్యములతో గడుపుతారు.


పార్వతిదేవికి మరో పేరు మంగళ గౌరి. శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరి అయిన పార్వతీదేవిని పూజించాలి. మంగళ గౌరీ ఎక్కడ ఉంటుందో తెలుసా … పసువు, కుంకుమ, పూలు, సుగంధాది మంగళ ద్రవ్యాలలోను, ఆవు నేతితో ప్రకాశించే జ్యోతిలోనూ కొలువై ఉంటుంది.


చాలాకాలము క్రితము జయపాలుడనే రాజు మహిష్మతీ నగరాన్ని పాలించేవాడు. భోగభాగ్యాలు ఎన్ని ఉంటేనేం ఆయనకు సంతానము కలుగలేదు. ఆ దంపతులకు అదే దిగులు.. ఎన్ని నోములు నోచినా, ఎన్ని దానాలు చేసినా ఫలితం శూన్యము.. చివరికి పరమేశ్వరునికి ఆ మహారాజు దంపతుల పై కరుణ కలిగినది … పరమేశ్వరుడు ఓ సన్యాసి రూపములో జయపాలుని నగరానికి వచ్చి అంత:పురము బయట ద్వారము వద్ద నిలబడి “భవతీ భిక్షాందేహి” అనేసి అక్కడనుండి వెళ్ళిపోయాడు. జయపాలుని భార్య పళ్లెం లో సంబరాలు సమకూర్చుకుని భిక్ష వేసేందుకు వచ్చేలోపలే ఆ సన్యాసి వెళ్లిపోయాడు. ఇలా మూడు రోజులు జరిగింది. జరిగినదంతా భర్తకు వివరించింది. రేపు ఆ సన్యాసి వచ్చేముందే నీవు సిద్ధంగా ఉండమని భార్యతో చెప్పాడా రాజు.


మరుసటిరోజు సన్యాసి రావడం మహారాణి బంగారు పళ్ళెంతో సహా భిక్ష వేయబోయింది. ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించక … సంతానము లేని నీ చేతిభిక్ష నేను స్వీకరించనని పలికేసరికి … అయితే మహాత్మా! సంతానము కలిగే మార్గాన్ని ఉపదేశించండి అని వేడుకోగా.. ఆ సన్యాసి రూపము లో ఉన్న ఈశ్వరుడు అమ్మా నేను చెప్పబోయేది నీ భర్త కు తెలియజేయి నీలం రంగు వస్త్రాలను ధరించి, నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి, ఒంటరిగా నీ భర్తను నగరం తూర్పు దిక్కుకు వెళ్ళమను. అక్కడ అరణ్యంలో అతని నీలాశ్వం ఎక్కడ అలసట తో క్రిందపడుతుందో అక్కడ దిగి త్రవ్వమను. ఆ త్రవ్వకము నుండి ఒక స్వర్ణదేవాలయం బయట పడుతుంది. ఆ స్వర్ణదేవాలయం లో ఉండె అమ్మవారిని భక్తి, శ్రద్ధలతో పూజిస్తే ఆమె మీకు సంతానాన్ని ఇస్తుంది. అని చెప్పి వెళ్ళిపోయాడు సన్యాసి రూపియైన శివుడు. ఈ విషయంతా భర్తకు చెప్పి ఆవిధంగా చేయసాగేరు. స్వర్ణదేవాలయం లో ఉన్న అమ్మవారిని జయపాలుడు ప్రార్ధించాడు. జయపాలుని భక్తికి మెచ్చి ధనాన్నిస్తాను కోరుకోమంది అమ్మవారు. నాకు ధనము వద్దు సంతానము కావాలని అన్నాడు జయపాలుడు. అప్పుడు అమ్మవారు దీర్ఘాయువు, వైధవ్యము గల కన్య కావలెనా? అల్పాయుష్కుడు, సజ్జనుడు అయిన కుమారుడు కావాలా? కోరుకోమని అడిగింది అమ్మవారు. అప్పుడు రాజు పిత్రుదేవతలను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలని కోరుకున్నాడు. అప్పుడాదేవి ఆ రాజుని తన పార్శమున ఉన్న గణపతి నాభియందడుగు వైచి, చెంతనే ఉన్న చూతవృక్షఫలాన్ని నీ భార్యకు ఇవ్వు అని అంతర్ధానమయ్యెను. జయపాలుడు ఆ వృక్షానికున్న పండ్లన్నీకోసేసరికి గణపతికి కోపము వచ్చింది. ఇందుకు ఫలితంగా నీకు జన్మించే కుమారుడు పదహారవ ఏట సర్పం బారినపడి మరణిస్తాడని శపిస్తాడు .


ఈ విదంబుగా కొన్నాళ్ళకు జయపాలుని భార్య ఒక కుమారుని కన్నది. ఆ కుర్రవాడికి వయసొచ్చింది. వివాహము జరిగితే కుమారుడికి ఆయుస్సు పెరుగుతుందేమోనని భావించి కుమారుడికి వివాహము చేద్దాం అని భర్త తో అన్నది. కాశీ విశ్వేశ్వరున్ని దర్శించి వచ్చాక వివాహము చేద్దాం అని చెప్పి తన కుమారుణ్ణి అతని మేనమామ తో కాశీకి పంపించారు. త్రోవలో వారు ప్రతిష్టానపురం చేరారు. అక్కడ వారిద్దరూ ఓ సత్రం లోకి ప్రవేశించారు. అక్కడ కొందరు కన్యలు ఆడుకొంటున్నారు. వారిలో సుశీల అనే కన్య మరొక కన్యతో గొడవపడగా ఆ కన్య సుశీలను ముండ, రండ అంటూ కోపం తో దుర్భాషలాడింది. అప్పుడు సుశీల మా అమ్మగారు మంగళగౌరీ వ్రతము చేస్తుంది కాబట్టి మాకుటుంబము లో ఎవరూ ముండలు, రండలు ఉండరు అంది కోపం తో. జయపాలుని కుమారుడు శివుడు, అతని మేనమామ ఇదంతా జరిగేటప్పుడు అక్కడే ఉన్నారు. తన మేనల్లుడు అల్పాయుష్కుడు అన్న సంగతి అతనికి తెలుసు. మా ఇంట్లో ముండలు, రండలు ఎవరు ఉండరు. మా అమ్మ శ్రావణ మంగళ గౌరీవ్రతం చేస్తుంటుంది. అన్న సుశీల మాట వినేసరికి శివుడి మేనమామకు ఓ ఉపాయము తోస్తుంది. సుశీలను శివుడి కిచ్చి వివాహము జరిపిస్తే అతనికి తప్పకుండా మంగళ గౌరీదేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుష్కుడు అవుతాడని భావిస్తాడు. మేనల్లుడు శివునితో సహా శివుని మేనమామ, ధ్యానము లో ఉన్న సుశీల తల్లిదండ్రుల వద్దకు చేరి శివుడనే బాలుడు నీకూతురుకి తగిన భర్త అని దేవుని వాక్యముగా వారిని నమ్మిస్తాడు. దాంతో సుశీల .. శివుడుల వివాహము జరిగిఫోతుంది.


పెళ్ళయిన ఆ కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు. మంగళగౌరీదేవి ముత్తైదువు రూపములో సుశీలకు కలలో కనబడి నీ భర్త అల్ఫాయుష్కుడు ఈ రాత్రితో అతని ఆయువు చెల్లింది. ఈ దోషమునకు మార్గము చెపుతాను విను అని ఈ విధంగా చెప్పింది. కొద్ది సేపట్లో ఒక కృష్ణ సర్పము నీ భర్తను కరవడానికి వస్తుంది. వెంటనే నీవు నిండా పాలు ఉన్న ఓ కుండను దాని ముందు ఉంచు … అప్పుడ పాము ఆ ఘటం లోకి ప్రవేశించాక వస్త్రము తో ఆకుండ మూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయనమివ్వు. దాంతో నీ భర్తకా గండము తప్పిపోతుంది అని అంతర్ధానమవుతుంది. శివుడు తన మేనమామతో కాశీ యాత్ర పూర్తిచేసుకొని తిరుగు ప్రయాణములొ భార్య సుశీలను తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. విషయము తెలుసుకొందామని శివుడు .. సుశీలను తన ఆయువు ఎలా పెరిగినదని అడుగగా అంతా శ్రావణ మంగళ గౌరీ వ్రతం ప్రభావమని చెప్పినది. ఈ విధముగా కృష్ణుడు ఈ కథను ద్రౌపదికి చెప్పాడు.


*పూజావిధానం  ఒక శుభ్రమైన పీటను పసుపు కుంకుములతో అలంకరించి, దాని పైన ఒక ఎండు కొబ్బరి చిప్పలో పసుపుతో చేసిన గౌరీదేవిని అలంకరించాలి. పసుపు వినాయకుడిని కూడా అలంకరించాలి. ముందుగా వినాయక పూజ చేయాలి. కలశం ప్రతిష్ఠించే సంప్రదాయం ఉన్నవారు కలశాన్ని పెట్టి, కలశ పూజగావించాలి. ముందుగా వినాయకుడికి నైవేద్యం సమర్పించాక, మంగళ గౌరి లేక ఫణి గౌరి దేవి అష్టోత్తరం చదివి, అమ్మవారి ముందు 5 ముడులు, 5 పొరలు కలిగిన, 5 తోరాలు, 5 పిండి దీపారాధనలు (బియ్యం పిండి, బెల్లం మిశ్రమంతో చేసిన దీపాలు) పెట్టి పూజించాలి. పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టి, హారతి ఇచ్చి, అమ్మవారి దగ్గర పూజ లో పెట్టిన ఒక తోరం చేతికి కట్టుకోవాలి. పిండి దీపారాధనలు కూడా….ఒకటి అమ్మవారికి, ఒకటి మనకి (పూజ చేసినవారు), మిగిలిన 3 ముత్తయిదువలకు తాంబూలంతో పాటు ఇవ్వాలి. వ్రతం చేసుకున్న మరు నాడు కూడా అమ్మవారికి హారతి ఇచ్చి, నైవేద్యం పెట్టి యధాస్థానం ప్రవేశయామి, పూజార్ధం పునరాగమ నాయచః అని అమ్మవారికి ఉద్వాసన చెప్పాలి. అంటే అమ్మా నీ స్వస్థానానికి వెళ్లి, మళ్లీ పూజకి మమ్మల్ని అను గ్రహించు అని అర్ధం. అంతటితో ఒక వారం వ్రతం సంపూర్ణం అవుతుంది. పసుపు కుంకుమల సౌభాగ్యం కోసం, సత్సంతానం కోసం, అన్యోన్యదాంపత్యం కోసం మంగళ గౌరీ వ్రతాన్ని చేస్తారు.





సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం,
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,
ఆర్దికలావాదేవీలు,ETC), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట,
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు
సంప్రదించండి.
FOLLOW US :
PLZ LIKE , SHARE , FOLLOW AND SUBSCRIBE
FACEBOOK PAGE
VIEW_PUBLIC_FOR=1712439968969888
FACEBOOK GROUP :
(20+) VIDHATHA ASTRO NUMEROLOGY | FACEBOOK
YOUTUBE
PRINTEREST
TWITTER
INSTAGRAM
BLOG
WHATSAPP GROUP
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP:
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, విశిష్ట ఆచార్య, వాస్తు విశారద
HAVANIJAAA / హవనిజా
( B.ed, MCA, M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం/ SREE VIDHATHA PEETAM
Ph. no: 9666602371