Sunday 30 September 2018

Name numerology/నామ సంఖ్య వివరణ




మన పేరులోని అక్షరాల సముదాయం కూడగా అంటే, పరిచయంలో చెప్పివున్న విధంగా చాల్దియన్‍ మరియు పైథాగరస్‍ పద్దతుల్లో కూడటం వలన మన నామసంఖ్య విలువ తెలుస్తుంది. పాశ్చాత్య దేశాల్లో ఎక్కువ శాతం పైథాగరస్‍ పద్ధతిలోనే పేరును లిఖించడం జరుగుతున్నది. తూర్పు, ఈశాన్యదేశాల్లో చాల్దియన్‍ పద్ధతిని పాటించడం గమనార్హం. అయితే మనం ఇప్పుడు ఆ రెండు పద్ధతుల వివరాలను మరొకసారి చూద్దాం. 

పైథాగరస్‍ పద్దతిలో ఆంగ్ల అక్షరాలకు ఇచ్చిన సంఖ్యా విలువలు..

A, J, S = 1

B, K, T = 2

C, L, U = 3

D, M, V = 4

E, N, W = 5

F, O, X = 6

G, P, Y = 7

H, Q, Z = 8

I, R = 9
ఇక చాల్దియన్‍ పద్దతి ప్రకారం ఆంగ్ల అక్షరాలకు ఇచ్చిన సంఖ్యా విలువలు..

A, U, Q, Y, J, I =  1

B, K, R =  2

C, G, L, S =  3

D, M, T =  4

E, H, N, X =  5

U, V, W =  6

O, Z =  7

F, P =  8
అయితే ఈ సంఖ్యా విలువలను ఆధారం చేసుకుని ఒక పేరును సంఖ్యా శాస్త్రం ప్రకారం ఎలా లెక్కవేయవచ్చో ఇప్పుడు చూడొచ్చు. 

చాల్దియన్‍ పద్దతి :-
ఉదా: L A T A   M A N G E S H K A R
3  1 4  1    4  1 5  3  5  3 5  2  1  2

= 3+1+4 + 1 + 4 + 1 + 5 + 3 + 5 + 3 + 5 + 2 + 1 + 2
= 40
అంటే ఒక పద్ధతిలో నామ సంఖ్య 40 అన్నమాట..

పైథాగరస్‍ పద్ధతి:- L A T A   M A N G E S H K A R
3 1  2 1     4  1  5  7  5 1  8  2  1  9

= 3+1 + 2 + 1 + 4 + 1 + 5 + 7 + 5 + 1 + 8 + 2 + 1 + 9

= 50
అంటే మరొక పద్ధతిలో నామ సంఖ్య 50 అన్నమాట.. ఈ నామ సంఖ్య విలువ గురించి తర్వాత పేజీల్లో చదివి ఆయా లక్షణాలను నిర్ధారించండి. ఒక్కోసారి మనకి ఒక పద్ధతిలో ఎక్కువ, ఒక పద్ధతిలో తక్కువ లక్షణాలు కన్పిస్తాయి. అయితే ఇదే పూర్తిస్థాయి వివరణ అనుకోకండి. ఇంకా కొన్ని రకాల పద్ధతులతో మనం ఏ పేరు గురించి అయినా ఒక నిర్ధారణకు రావాలి. అది అనుభవం మీదను, అభ్యాసం వల్ల మనకు అవగతమవుతాయి. అయితే ఈ విలువలను చూసుకొని పేరు బాగులేదు కదాని ప్రయోగాలు చేసేయకండి.. ఇవన్నీ మీకు అవగాహన కలగటానికి మాత్రమే. బాగులేదని తెలిసాకే దగ్గరలో ఒక ఉన్నత న్యూమరాలజిస్టుని సంప్రదించండి. అతను చెప్పిన పద్ధతిలో చక్కగా అభ్యాసం చేయండి. దేవునిపై నమ్మకం ఉంచండి. తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి. 
contact 9000123129

శివుడి ఆత్మలింగం భూమిపై వెలసిన "మురుడేశ్వర"..!



రావణుడు పరమశివుడు ప్రసాదించిన ఆత్మలింగంపై నున్న వస్త్రాన్ని విసిరివేయగా, ఆ వస్త్రం పడిన ప్రాంతమే "మురుడేశ్వర"గా అవతరించింది. ఈ మురుడేశ్వర కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలోగల భట్కల్ తాలూకాలో ఒక పట్టణం. శివుడి పుణ్యక్షేత్రమైన ఈ పట్టణం అరేబియా సముద్రం ఒడ్డున ఉంది. ప్రపంచంలోనే అతి పొడవైన శివుడి విగ్రహం కొలువైయున్న ఈ పట్టణంలో పరమశివుడు "మురుడేశ్వరుడు"గా నిత్యపూజలందుకుంటున్నాడు.

పురాణాల ప్రకారం మురుడేశ్వర చరిత్రను చూస్తే.. రావణాసురుడు అకుంఠిత దీక్షతో తపస్సు చేసి పరమశివుడిని మెప్పించి, ఆయన ఆత్మలింగాన్ని భూలోకానికి తీసుకువస్తాడు. భూమిమీద ఆత్మలింగాన్ని ఎక్కడయితే ఉంచుతారో, అక్కడ అది స్థాపితం అయిపోతుందనీ, తిరిగీ దాన్ని ఎత్తుకోవటం సాధ్యంకాదని.. పరమశివుడు ఆత్మలింగం ఇచ్చేటప్పుడే రావణాసురుడికి ఒక నిబంధన పెడతాడు.

అయితే రావణుడు పరమశివుడి ఆత్మలింగాన్ని గనుక లంకలో ప్రతిష్టించితే నష్టం జరుగుతుందని భావించి దేవాధిదేవతలు మహావిష్ణువును వేడుకొంటారు. దాంతో విష్ణువు తన మాయతో సూర్యాస్తమయం అయ్యేటట్లుగా చేస్తాడు. అప్పుడు రావణుడు సూర్యాస్తమయం అయ్యిందని భావించి సంధ్య వార్చుకునేందుకు సిద్ధపడతాడు.

ఈలోగా విషయం తెలుసుకున్న నారద మునీంద్రుడు వినాయకుడి వద్దకు వచ్చి, రావణాసురుడివద్దనున్న ఆత్మలింగం తీసుకుని భూమిపై పెట్టాలని నూరిపోసి పంపిస్తాడు. రావణుడు సంధ్యవార్చుకునే సమయానికల్లా బ్రాహ్మణవేషంలో వెళతాడు వినాయకుడు. ఆ బ్రాహ్మణ బాలుడిని చూసిన రావణుడు సంధ్య వార్చుకునేంతదాకా ఆత్మలింగాన్ని పట్టుకోవాల్సిందిగా కోరతాడు. ఈ లింగం చాలా బరువుగా ఉంటే తాను ఎక్కువసేపు మోయలేననీ, మోయలేనప్పుడు మూడుసార్లు తమను పిలుస్తాననీ.. మీరు రాకపోతే ఈ లింగాన్ని భూమిపై ఉంచేస్తానని అంటాడు బాల బ్రాహ్మణుడి రూపంలోని వినాయకుడు.

రావణుడు అందుకు అంగీకరించి ఆత్మలింగాన్ని బాల బ్రాహ్మణుడి చేతిలో పెట్టి సంధ్య వార్చుకునేందుకు వెళతాడు. రావణుడు వెళ్లిన కాసేపటికే తాను లింగాన్ని మోయలేకపోతున్నానంటూ వినాయకుడు మూడుసార్లు పిలుస్తాడు. సంధ్యవార్చే కార్యక్రమం మధ్యలో ఉండటంతో కాస్త ఆలస్యంగా వస్తాడు రావణుడు. ఈలోగా వినాయకుడు ఆత్మలింగాన్ని భూమిమీద పెట్టేస్తాడు. దాంతో కోపంతో రావణుడు వినాయకుడి నెత్తిపై మొత్తగా, అతడికి గుంట పడుతుంది.

ఈలోగా తాను అనుకున్న కార్యం నిర్విఘ్నంగా జరిగిపోవటంతో సంతోషించిన విష్ణువు, మాయపొరను తొలగిస్తాడు. దీంతో వెంటనే సూర్యుడు ఆకాశంలో కనిపిస్తాడు. వెంటనే విషయాన్ని గ్రహించిన రావణుడు కోపంతో ఆత్మలింగాన్ని తన చేతులతో పెకిలించే ప్రయత్నం చేస్తాడు. లింగం పైనున్న కవచాన్ని విచ్ఛిన్నంచేసి విసిరివేయగా అది గోకర్ణ అనే ప్రాంతానికి 23 కిలోమీటర్ల దూరంలోని "సజ్జేశ్వర" అనే ప్రదేశంలో పడుతుంది.

Wednesday 26 September 2018

2018 లోమిగతా కాలం న్యూమరాలజీ, ప్రకారం మీ అదృష్టం ఎలా ఉందబోతోన్దో తెలుసా ?


 2018 వ సంవత్సరం యూనివర్సల్ సంవత్సరం. దీని సంఖ్య శక్తీ 11. ఈ 11 సంఖ్యను అంకెలకు గురువుగా భావిస్తారు. అంతేకాక ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. సంఖ్య ప్రకారం మీ అదృష్టం ఎలా ఉందో తెలుసుకుందాం.
అదృష్ట సంఖ్య1
ఈ సంవత్సరం వీరి జీవితం బాగుంటుంది. గతంలో ఉన్న ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి. వీరు గమ్యాన్ని చేరుకోవటానికి కొత్త మార్గాన్ని ఎంచుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది.

అదృష్ట సంఖ్య 2
ఈ సంఖ్య వారికీ కెరీర్ చాలా అనుకూలంగా ఉండి వారు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. అయితే వ్యక్తిగత విషయాలపై కొంచెం జాగ్రత్త వహించాలి. ఏ మాత్రం చిన్న తప్పు చేసిన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అదృష్ట సంఖ్య 3
ఈ సంవత్సరంలో వీరికి విదేశీ ప్రయాణాలు ఉంటాయి. వీరి జీవితంలో కొత్త అనుభవాలు,ఎనర్జీ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. వీరు ఏ పని చేసిన వెనక్కి తిరిగి చూసుకొనే అవకాశం ఉండదు. కొన్ని మార్పుల కారణంగా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి.

అదృష్ట సంఖ్య 4
వీరు కొన్ని విషయాల్లో రాజీ పడాలి. ఈ సంవత్సరం వీరికి మంచి జరగకపోయినా చెడు మాత్రం జరగదు. వీరు సొంతంగా సంస్థను స్థాపిస్తారు. ఈ క్రమంలో కొన్ని ఆటంకాలు ఎదురు అయినా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు.

అదృష్ట సంఖ్య 5
ఈ సంవత్సరం గెలుపు ఓటములు సమానంగా ఉండి మొత్తం మీద తటస్థంగా ఉంటుంది. వీరు వచ్చిన అవకాశాలను అంది పుచ్చుకొని ముందుకు సాగుతారు. అయితే వీరు కొంచెం తెలివిగా ఆలోచించ వలసిన అవసరం ఉంది.

అదృష్ట సంఖ్య 6
వీరు ఆధ్యాత్మికంగా ఆలోచిస్తూ ఉంటారు. ప్రేమ, వివాహం, వృత్తి, ఆరోగ్య పరంగా బలంగా ఉంటారు. రిస్క్ తీసుకోవటానికి ప్రయత్నం చేస్తారు. అయితే దేనిని పట్టించుకోకుండా సహనంతో పనిచేయాలి.

అదృష్ట సంఖ్య 7
వీరికి సంబంధం,ప్రేమ వ్యవహారాలలో కొన్ని క్లిష్టమైన సమస్యలు ఎదురు అవుతాయి. ఆ సమయంలో కృంగిపోకుండా దైర్యంగా ముందడుగు వేయాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మానసిక ఆందోళనలను తగ్గించుకుంటారు.

అదృష్ట సంఖ్య 8
వీరు చేసే పనిలో ఎక్కువగా భావోద్వేగాలు ఉంటాయి. వీరు నిర్ణయాలను తీసుకోవటంలో ఎక్కువ సమయాన్ని తీసుకుంటారు. అనేక అవకాశాలు వచ్చిన ఎంపిక విషయంలో మాత్రం ఆచి తూచి అడుగు వేయాలి.

అదృష్ట సంఖ్య 9
వీరిలో ఆధ్యాత్మిక శక్తి ఎక్కువగా ఉంటుంది. వీరు పైకి ఎదగాలంటే గట్టి ప్రయత్నాలను పట్టు విడవకుండా చేయాలి. ఉద్యోగంలో మార్పులు ఉంటే వాయిదా వేసుకోవటం ముఖ్యం. ఆరోగ్య పరంగా కొంచెం జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.

ధర్మసూక్ష్మం అంటే ఏమిటి ?



‘ధర్మో రక్షతి రక్షితః’ అను సూక్తి అందరికీ తెలిసినదే. మనం ధర్మాన్ని రక్షిస్తే... ఆ ధర్మం మనలను రక్షిస్తుంది... అని దాని అర్థం. రక్షించడం అంటే.. కత్తి, కర్ర పట్టుకుని దానికి కాపలా కాయడం కాదు. ఆచరించదగినది ధర్మం. అయితే ఈ ధర్మం ఆచరించే విషయంలో మనకు ఎన్నో సందేహాలు కలుగుతాయి.

‘సత్యమునే పలుకుము...అసత్యము పలుకరాదు’ అనే సూక్తి మనకు తెలిసిందే.
ఈ సూక్తికి కట్టుబడి ఎన్నో త్యాగాలు చేసి పురాణపురుషులుగా ప్రసిద్ధికెక్కిన మహనీయులు మనకు ఎందరో ఉన్నారు.

అయితే...‘ప్రాణ, విత్త, మానభంగమందు బొంకవచ్చు’ అని శుక్రాచార్యునిచేత బలిచక్రవర్తికి చెప్పించాడు పోతనామాత్యుడు. అసలు ఏ మానవుడైనా ఈ మూడు సందర్భాలలోనే అబద్ధం చెప్పడానికి సిద్ధపడతాడు. మరి ఈ సంగతి తెలియకనేనా పోతనంతటివాడు, వ్యాసభగవానుని బాటలో నడిచి అలా పలికాడు?
‘ఆలస్యం అమృతం విషం’ అనే సూక్తితో పాటు ‘నిదానమే ప్రధానం’ అనే మరొక సూక్తి కూడా ఉంది. ఇలాంటి పరస్పర విరుద్ధమైన ధర్మాలు మనకు ఎన్నో ఉన్నాయి. వీటిని ఎలా ఆచరించాలి అనే విషయంలోనే సందేహాలు కలుగుతాయి. అప్పుడే ఆ ధర్మాన్ని సూక్ష్మంగా పరిశీలించాలి. ఇందుకు నిదర్శనంగా ఒక కథ చెప్తాను.
దండకారణ్యంలో ఓ ఋషి ఆశ్రమం కట్టుకుని శిష్యులకు విద్యాదానం చేస్తూ కాలం గడుపుతున్నాడు. ఆ ఋషి ధర్మనిష్ఠాగరిష్ఠుడు...సత్యవాది. అతని ఆశ్రమానికి రెండు ప్రక్కల అరుగులు ఉన్నాయి. ఒకరోజు ఆ ఋషి కుడివైపు అరుగు మీద కూర్చుని శిష్యులకు విద్యాబోధన చేస్తున్నాడు. ఆ సమయంలో ఒక ఆవు ప్రాణ భయంతో ఆర్తనాదం చేస్తూ ఆ ఆశ్రమం ముందునుంచి పరుగెత్తుకుని వెళ్లింది. అది చూసాడు ఆ ఋషి. ఓ వేటగాడు ఆ ఆవును తరుముతున్నాడని గ్రహించాడు. వేటగాడు వచ్చి ‘ఇలా ఆవు వెళ్ళిందా’ అని అడిగితే ‘అబద్ధం ఆడరాదు’ అనే దర్మానికి కట్టుబడి ‘వెళ్ళింది’ అని చెప్పాలి. అలా చెబితే తాను గోహత్యకు కారణభూతుడవుతాడు. ఒక్క క్షణం ఆలోచించి తన శిష్యులతో సహా ఆ అరుగు మీదనుంచి లేచి, ఎడమవైపు అరుగుమీద కూర్చుని, శిష్యులను మౌనంగా ఉండమని చెప్పి విద్యాబోదన చేస్తున్నాడు. కొంతసేపటికి ఓ వేటగాడు అక్కడకు వచ్చి ‘అయ్యా...ఇలా ఏదైనా ఆవు పరుగెత్తుకుని వెళ్లిందా?’ అని ఆ ఋషిని అడిగాడు. గురువుగారు ఏం చెప్తారా అని శిష్యులు ఆత్రంగా చూస్తున్నారు. ఆ ఋషి వేటగాని వంకచూసి ‘నాయనా.. ఈ అరుగు మీద కూర్చుని నా శిష్యులకు పాఠం చెప్తున్నప్పటినుంచి ఏ ఆవు ఇలా వెళ్ళలేదు’ అని బదులిచ్చాడు. వేటగాడు సంతృప్తిచెంది వచ్చిన దారినే వెనుదిరిగి వెళ్లిపోయాడు. ఋషి కుడివైపు అరుగు మీద కూర్చుననప్పుడు ఆవు వెళ్లింది సత్యం. అందుకే ఋషి అరుగు మారి కూర్చున్నాడు. అప్పుడు ఏ ఆవు అటు వెళ్లలేదు. అదీ సత్యమే. అదే చెప్పాడు ఆఋషి. ఋషి అసత్యము ఆడలేదు. ఆవు రక్షించబడింది. ఇదీ కథ.
మంచి పని చేసే విషయంలో ఆలస్యం పనికిరాదు. అప్పుడు ‘ఆలస్యం అమృతం విషం’ అనే సూక్తితని పాటించాలి. చెడు పని చేసే విషయంలో ‘నిదానమే ప్రదానం’ అనే సూక్తిని పాటించాలి. అదే దర్మసూక్ష్మం. ఈ సూక్ష్మాన్ని గ్రహించగలిగినవాడే ధర్మాన్ని రక్షిస్తాడు. ధర్మం చేత రక్షింపబడతాడు.

మహాలయ అమావాస్య... అత్యంత మహిమాన్విత అమావాస్య!


భాద్రపద అమావాస్య అంటే.. సెప్టెంబర్ 30న వచ్చే అమావాస్యని మహాలయ అమావాస్య అని పిలుస్తారు. ఈ అమావాస్య క్రిష్ణ పక్షం చతుర్ధశి రోజున ప్రారంభమవుతోంది. తరువాతి రోజున కూడా కొనసాగుతోంది. ఈ పర్వదినాన శివుడిని పూజిస్తారు.ఈ అమావాస్య రోజు శివుడిని పూజించడం వల్ల అన్ని సమస్యలు దూరమై జీవితంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతలు పొందుతారు. పూర్తీ నమ్మకం, భక్తితో ఈ రెండు రోజులు శివుడిని పూజించాలి. అయితే శనిదేవుడిని కూడా ఈ అమావాస్య వేళ పూజిస్తే జీవితంలో ఎదుర్కొంటోన్న కష్టాలన్నీ తీరిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రతి ఏలా భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ అమావాస్య రోజు సాధారణంగా పితృపక్షాలు నిర్వహిస్తారు. అలాగే అనేక ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.  
శాస్త్రాల ప్రకారం అమావాస్య శనివారంనాడు వచ్చిదంటే చాలా పవిత్రంగా భావిస్తారు. ఆ రోజు శనిదేవుడిని పూజించడం వల్ల చాలా ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. అన్ని పాపాలు తొలగిపోవడమే కాకుండా ఆరోగ్యం, సంపద, శ్రేయస్సు కలుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శించి, పవిత్ర స్నానాలు, యాగాలు చేసి, ఉపవాసం ఉండటం వల్ల కూడా పాపాల నుంచి విముక్తి పొందవచ్చు.
శివుడ్నే కాదు భాద్రపద అమావాస్య నాడు విష్ణుమూర్తిని కూడా ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ అమావాస్య రోజు విష్ణువుని పూజిస్తే మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం, ఆర్థికంగా మెరుగైన ఫలితాలు పొందుతారు.
చనిపోయిన కుటుంబ సభ్యులకు ఈ అమావాస్య రోజు పూజలు చేయడం వల్ల వాళ్లు ప్రశాంతత పొందుతారు. చనిపోయిన వాళ్ల కోసం ఉపవాసం ఆచరిస్తే వాళ్ల ఆత్మ శాంతిస్తుంది. అలాగే, శాస్త్రాల ప్రకారం పితృ దేవతలకు అమావాస్య ప్రత్యేకం. అందుకే అమావాస్య రోజులలో చనిపోయిన వాళ్ల పేరు మీద పూజలు నిర్వహించాలి. ఇక సంవత్సరానికి ఒకసారి వచ్చే మహాలయ అమావాస్య నాడు తప్పనిసరిగా పితృ దేవతల్ని ఆరాధించాలి. శ్రద్ధగా శ్రాద్ధ క్రియ చేయటంతో పాటూ నువ్వుల నీటితో తర్పణాలు విడవాలి. అప్పుడే వాళ్లు సంతోషించి మనకు రక్షణ, శుభాలు కలిగిస్తారు...
ఈ అమావాస్య రోజు హోమం చేయడం కూడా చాలా మంచి పలితాలను ఇస్తుంది. జీవితంలో అన్ని సమస్యలు దూరమవుతాయి. కాబట్టి జ్యోతిష్య శాస్త్రానుసారం మనకు ఏ హోమం అవసరమో తెలుసుకుని దాన్ని భాద్రపద అమాస్యనాడు ఆచరించాలి.
మొత్తంగా మహాలయ అమావాస్యగా చెప్పబడే ఈ భాద్రపద అమావాస్యనాడు ఎంత భక్తి, శ్రద్ధలతో గడిపితే అంత ఉత్తమం. ఆధ్యాత్మిక ఉన్నతికి ఈ రోజు అద్భుతమైన అవకాశం కల్పిస్తుంది.

Tuesday 25 September 2018

మహాలయ పక్షాల ప్రాధాన్యత



భాద్రపద బహుళ పాడ్యమి నుంచి భాద్రపద అమావాస్య వరకు మధ్యనున్న పదునైదు దినములనూ ‘మహాలయ పక్షములు’ అంటారు. మరణించిన మన తండ్రి, తాత, ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ, తర్పణ, పిండప్రదానాది పితృయఙ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశిచబడిన ఈ పదునైదు రోజులనే ‘మహాలయ పక్షాలు’ అంటారు. వీటినే ‘పితృపక్షము’లనీ.., ‘అపరపక్షము’లనీ కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి, వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్యోద్దేశ్యము.

పితృదేవతలకు ... ఆకలి తీర్చడం?

అనే సందేహం మీకు కలుగవచ్చు. ఈ కనిపించే సకల చరాచర జగత్తు మొత్తం ‘ఆకలి’ అనబడే సూత్రం మీదనే నడుస్తోంది.
              
              అన్నాద్భవంతి భూతాని  -  పర్జన్యాదన్న సంభవః
               యఙ్ఞాద్భవతి పర్జన్యో  -  యఙ్ఞః కర్మ సముద్భవః


అన్నము వలన ప్రాణికోటి జన్మిస్తుంది. వర్షము వలన అన్నము లభిస్తుంది. యఙ్ఞము వలన వర్షము కురుస్తుంది. ఆ యఙ్ఞము కర్మ వలననే సాధ్యమౌతుంది. అంటే....
అన్నం దొరకాలంటే .... మేఘాలు వర్షించాలి.
మేఘాలు వర్షించాలంటే....దేవతలు కరుణించాలి.
దేవతలు కరుణించాలంటే...వారి ఆకలి తీరాలి. వారి ఆకలి తీరాలంటే యఙ్ఞాల ద్వారా వారి వారి హవిర్భాగాలు వారికి అందజేయాలి. ఎందుకు ఇంత తతంగం అని  అడగొచ్చు.

మరణించిన ప్రాణి ‘ఆత్మ’ రూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆత్మ తన పూర్వ కర్మానుభవం కోసం తిరిగి ఈ భూమిమీద  ‘జీవాత్మ’గా అవతరించడానికి...  అన్నాన్ని ఆశ్రయించి, తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి, శుక్ల కణముగా రూపొంది, స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి, శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది.
మరణిచిన మన పితరులకు మోక్షం కలగాలంటే .. కర్మ పరిపక్వం కావాలి. అలా జరగాలంటే ..పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకం లోకి రావాలి. అలా రావాలంటే వారికి  అన్నాన్ని అందించాలి. అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి. అప్పుడే వారికి  పితృఋణం తీరుతుంది. ఋణం తీరడమే ‘మోక్షం’ అంటే. రేపు మనకైనా ఇంతే.

తద్దినాలు పెడుతున్నాం కదా మహాలయ పక్షాలు పెట్టాలా?


అనే సందేహం తిరిగి మీకు కలుగవచ్చు. మరణించిన తండ్రి తిథినాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాది నుంచి వస్తున్న ఆచారం. పితృతిథినాడు పుత్రుడు తన తండ్రి, తాత, మత్తాతలను తలచుకుని పితృయఙ్ఞాన్ని నిర్వహిస్తాడు. మరి  పుత్రులు లేనివారి సంగతి ఏమిటి? వారి గతి అథోగతేనా? అంటే..‘కాదు’ అంటుంది శాస్త్రం. మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్లికాని సోదర, సోదరీలు మరణించి ఉండవచ్చు. లేదా..పెళ్లయినా సంతానం కలుగని దంపతులు మరణించి ఉండవచ్చు. లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్నపిల్లలు ఉండవచ్చు. లేదా యుద్ధాలలో కానీ, శిక్షల ద్వారా కానీ, ఆత్మహత్యల ద్వారా కానీ, ప్రకృతి వైపరీత్యాల (వరదలు, భూకంపాలు) ద్వారా కానీ గుర్తు తెలియక  మరణించి ఉండవచ్చు. అటువంటివారందరికి కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్థ్వలోకాలకు పంపడం కోసం ఈ ‘మహాలయ పక్షాలు’ నిర్దేశించబడ్డాయి. పితృతిథి నాడు మూడు తరాలవారికి (తండ్రి, తాత, ముత్తాత) మాత్రమే తిలోదకాలతో, పిండప్రదానం యివ్వబడుతుంది. కానీ ఈ  ‘మహాలయ పక్షాలు’ పదునైదు రోజులు మన వంశంలో మరణిచిన వారందరికీ మాత్రమే కాక, పుత్రులు లేని గురువులకు (గురువు కూడా తండ్రితో సమానం) స్నేహితులకు కూడా తిలోదకాలతో, పిండప్రదానం ఇచ్చే అర్హత, అధికారం మనకు ఉంది. దీనినే ‘సర్వ కారుణ్య తర్పణ విధి’ అంటారు. ఏ కారణం  చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి, తద్దినం పెట్టకపోతే.., ఆ తద్దినం పెట్టని దోషం ‘మహాలయం’ పెట్టడం వలన పోతుంది. మహాలయ పక్షాలు పదునైదు రోజులు మన పితృదేవతలు ‘మా వారసుడు పితృయఙ్ఞం చేయకపోతాడా.., మా ఆకలా తీర్చకపోతాడా’ అనే ఆశతో మన ఇంటిని ఆవహించి ఉంటారు. పితృయఙ్ఞం చేసిన వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలనీ...పిల్లపాపలతో ఆనందంగా ఉండాలనీ దీవిస్తారు. పితృయఙ్ఞం చేయని వారసుని వంశం.. నిర్వంశం కావాలని శపించి కోపంగా వెళ్ళిపోతారు.  వంశం నిర్వంశం కావడం అంటే... సంతానం కలుగక పోవడమే కదా. సంతనం లేనివారి గతి ఎలా ఉండుందో తెలుసుకున్నాం కదా. అందుచేత తప్పకుండా ‘మహాలయ పక్షాలు’ పెట్టి తీరాలి.
మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి?

- సాధారణంగా తండ్రి చనిపోయిన తిథినాడు ‘మహాలయం’ పెట్టడం ఉత్తమమం. ఏ కారణంచేతనైనా అలా పెట్టడం వీలుకాని పరిస్థతిలో ‘మహాలయ అమావాస్య’నాడు
   పెట్టడం ప్రశస్తం. దీనినే ‘సర్వ పితృ అమావాస్య’ అంటారు. ఈ రోజునే మరణించిన బంధువులందరికీ..వారి వారి తిథులతో సంబంధం లేకుండా ‘మహాలయం’ పెట్టాలి.
- క్రిందటి సంవత్సరం చనిపోయిన వారికి ‘చేత భరణి లేక భరణి పంచమి’ తిథులలో అనగా..మహాలయ పక్షాలు మొదలైన 4 లేక 5 రోజున మహాలయం పెట్టాలి.
- భార్య మరణించిన వాడు ‘అవిధవ నవమి’నాడు అనగా తొమ్మిదవ రోజున మహాలయం  పెట్టాలి. ఆ రోజున సుమంగళిగా మరణించిన తన భార్యను తలచుకుని ఒక సుమంగళికి భోజనం పెట్టి, పసుపు, కుంకుమ, గాజులు, పూవులు, చీర,రవికెలగుడ్డ  పెట్టి   సత్కరించి పంపాలి.
- చిన్న పిల్లలు చనిపోతే.. వారికి పన్నెండవ రోజున ‘మహాలయం’ పెట్టాలి. చిన్న పిల్లలు అంటే..ఉపనయన వయస్సు (పది సంవత్సరములు) దాటనివారు. ఒకవేళ      పది సంవత్సరముల వయస్సు లోపే  ఉపనయనము జరిగి ఉంటే.., ఆ పిల్లవాడు మరణించిన తిథినాడే ‘మహాలయం’ పెట్టాలి.
- ఇక ప్రమాదాలలో కానీ, ఉరిశిక్ష వల్ల కానీ, ఆత్మహత్య చేసుకుని మరణించిన వారికి ‘ఘట చతుర్థి లేక ఘాయల చతుర్థి’నాడు అనగా అమావాస్య ముందురోజున పెట్టాలి.
మహాలయము పెట్టే కర్త శుచిగా స్నానంచేసి, పవిత్రమును(దర్భలతో చేసిన ఉంగరము) ధరించి, శ్రధ్ధగా, భక్తిగా, మంత్రపూర్వకంగా ఐదుగురు బ్రాహ్మణభోక్తలతో ఈ పితృకార్యాన్ని నిర్వహించాలి. ఐదుగురు భోక్తలు ఎందుకంటే...

1.పితృదేవతలకు అధిపతి శ్రీ మహావిష్ణువు. కనుక విష్ణుదేవతా ప్రీత్యర్థం ఒక భోక్త.
2.ఇది విశ్వేదేవస్థానం. విశ్వ, ఆర్ద్ర దేవతల ప్రీత్యర్థం ఒక భోక్త.
3.ఇది పితృస్థానం.  తండ్రి, తాత, ముత్తాతల ప్రీత్యర్థం ఒక భోక్త.
4.ఇది మాతామహస్థానం. తల్లి తండ్రి, తాత, ముత్తాతల ప్రీత్యర్థం ఒక భోక్త.
5.ఇది సర్వ కారుణ్యస్థానం. తండ్రి తరపు బంధువుల, తల్లి తరపు బంధువుల, గురువుల, స్నేహితుల, తక్కినవారి ప్రీత్యర్థం ఒక భోక్త. ఈ విధంగా మీ పురోహితుని సూచనానుసారం ఈ పితృకార్యాన్ని హోమ, తర్పణ, పిండప్రదానాది విధులతో అత్యంత శ్రద్ధగా నిర్వహించాలి. ఎందుకంటే.. ‘శ్రద్ధయా క్రియతే ధేయం ..శ్రాద్ధం’ అన్నారు పెద్దలు. అయిదుగురు భోక్తలతో ఈ పితృయఙ్ఞం జరిపించే ఆర్థికస్థోమత లేని పక్షంలో...కనీసం ఒక భోక్తతో అయినా ఈ క్రతువు జరపాలి గానీ...మహాలయం పెట్టకుండా మాత్రం ఉండకూడదు. మరొక్క విషయం. మనిషన్నాక బలహీనతలు సహజం. కనుక వివాహేతర సంబంధాల వల్ల జన్మించిన సంతానానికి మాత్రం ఈ పితృకార్యం చేసే అర్హత, అధికారం లేదు. శాస్త్రం ఆ వీలు కల్పించలేదు. కనుక మనకీ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు విధివిధాన పితృకర్మలు నిర్వహించడం.., వారి పుత్రులుగా మన విధి, కర్తవ్యం, బాధ్యత. ఈ బాధ్యతను ప్రతి పుత్రుడు గుర్తించి, ఈ మహాలయ విధులు భక్తి, శ్రద్ధలతో నిర్వహించి పతృదేవతల ఆశీస్సులు అందుకుంటారని "శ్రీ విధాత పీటం" ఆకాంక్షిస్తోంది. 
                                                     
- ఆకాంక్ష  ఎడుర్


 

Thursday 13 September 2018

భాద్రపదమాసం



చాంద్ర మానం ప్రకారం, ఈ నెలలో పౌర్ణమి నాడు పూర్వభాద్ర లేక ఉత్తరభాద్ర నక్షత్రం ఉండటం వల్ల ఇది భాద్రపదమాసం అయ్యింది. దేవతలకే కాకుండ పితృదేవతలకు కుడా ప్రీతికరమైన మాసం - "భాద్రపద మాసం " ! దశావతారాలలో రెండు అవతారాలను శ్రీ మహా విష్ణువు ఈ మాసం లోనే ధరించాడు. అవి వరాహ, వామన అవతారాలు. ఈ మాసం లోని శుద్ధ తదియ రోజున వరాహ జయంతి . ఆ రోజున విష్ణువు ఆలయాలకు వెళ్ళి స్వామిని దర్శించుకుని , అర్చనలు చెయ్యాలి. ఈ మాసం లో శుక్ల పక్ష పాడ్యమి నుండి దశమి వరకు దశావతారాలలో రోజుకొక అవతారాన్ని పూజించి , చివరి రోజున అన్ని అవతారాలను పూజిస్తూ దశవతార వ్రతాన్ని ఆచరించడం వల్ల శ్రీ మహా విష్ణువు కృప లభిస్తుంది . ఈ సమయములో దేవ ఋషి పితురలకు తర్పణాలు ముఖ్య విధులుగా చెప్పబడ్డాయి. భాద్రపద శుక్ల పక్ష షష్టి నాడు పంచగవ్య ప్రాశనం చెయ్యాలి అని శాస్త్ర వచనం . అందు వల్ల అశ్వమేధ యాగం ఫలము లభిస్తుంది అని అంటారు. ఆవుపాలు, పెరుగు, నెయ్యి, ఆవుమూత్రం , గోమయం అనేవి పంచగవ్యాలు. బహుళ పక్షం పితృదేవతలకు ఇష్టమైన కాలం. అందుకే దీనికి "పితృపక్షం" లేక మహాలయ పక్షం అని పేర్లు. ఈ పక్షములో పదిహేనురోజుల పాటు పితృదేవతలకు తర్పణాలు వదలడం , శ్రాద్ధ విధులను నిర్వహించడం , పిండప్రదానాలు చేయదం వంటివి ఆచరించాలి . మహాలయ అమావాస్య నాడు కుడా ఈ విధముగా చెయ్యాలి . ఈ మాసములో ఒక పూట భొజనం , మరో పూట ఉపవాసం ఉండాలి. బెల్లం, ఉప్పులను దానం చెయ్యడం మంచిది . పూర్ణిమ నాడు శ్రీ భాగవత పురాణాన్ని దానం చెయ్య్డం వల్ల మరణ అనంతరం విష్ణువులోక ప్రాప్తి కలుగుతుంది అని శాస్త్ర వచనం . భాద్రపద పూర్ణిమ నాడు జరుపుకునే ఉమా మహెస్వర వ్రతం సర్వ విధాలా శ్రేష్టమైనది . ఈ వ్రతం చేసిన భక్తుల ఇళ్ళు సకల సంపదలతో కళకళలాడుతూ ఉంటాయి.