Sunday 31 July 2016

శివ మన్గళాష్టకమ్

శివ మన్గళాష్టకమ్

భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే |
కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళమ్ || 1 ||
వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ |
పశూనాంపతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళమ్ || 2 ||
భస్మోద్ధూళితదేహాయ నాగయఙ్ఞోపవీతినే |
రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళమ్ || 3 ||
సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః కైలాసవాసినే |
సచ్చిదానందరూపాయ ప్రమథేశాయ మంగళమ్ || 4 ||
మృత్యుంజయాయ సాంబాయ సృష్టిస్థిత్యంతకారిణే |
త్రయంబకాయ శాంతాయ త్రిలోకేశాయ మంగళమ్ || 5 ||
గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే |
ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదేవాయ మంగళమ్ || 6 ||
సద్యోజాతాయ శర్వాయ భవ్య ఙ్ఞానప్రదాయినే |
ఈశానాయ నమస్తుభ్యం పంచవక్రాయ మంగళమ్ || 7 ||
సదాశివ స్వరూపాయ నమస్తత్పురుషాయ చ |
అఘోరాయ చ ఘోరాయ మహాదేవాయ మంగళమ్ || 8 ||
మహాదేవస్య దేవస్య యః పఠేన్మంగళాష్టకమ్ |
సర్వార్థ సిద్ధి మాప్నోతి స సాయుజ్యం తతః పరమ్ || 9 ||

శివరాత్రి - శుక్ల పక్ష శివరాత్రి - మాస శివరాత్రి - మహా శివరాత్రి



 

 



ప్రతిరోజు రాత్రి శివుని పదకొండు సార్లు తలచుకొని నిద్రపోపాలని అలా శివుని తలస్తూ రాత్రులు నిద్రపోవడం వలన ప్రతి రాత్రి శివరాత్రి అని అంటారు. త్రయోదశి తిథి శివునికి సంబంధించిన తిథి అని అందువలన పరమ శివుని తిథి అని అంటారు. నెలకు రెండు సార్లు త్రయోదశి తిథి వస్తుంది. శుక్ల పక్షంలో ఒక త్రయోదశి, కృష్ణ పక్షంలో ఒక త్రయోదశి వస్తుంది. శుక్ల పక్షంలో వచ్చే త్రయోదశి తిథితో కూడిన చతుర్దశీ తిథిని శుక్ల పక్ష శివరాత్రి అంటారు. శుక్ల పక్ష శివరాత్రి నెలకు ఒకసారి వస్తుంది.

శివరాత్రులు సంవత్సరానికొకసారో నెలకొకసారో కాక ప్రతి రాత్రి శివరాత్రిగానే భావించే సాంప్రదాయముంది. ఉదయాన్నే లేచి (శ్రీ హరి అని మూడుసార్లు తలచి లేవాలి ఎందుకంటే నిద్రలేచినది మొదలు నిద్ర కుపక్రమించేవరకు(జాగ్రదావస్థకు) ఉన్న కాలమునకు విష్ణువే అధిపతి ఆయన అనుగ్రహముతో ఆ రోజు కార్యములన్నీ శుభప్రదంగా జరగడాని కొరకు, మీరు చేసే మొదటి సంకల్పమే బ్రహ్మతత్వమైన సృష్టికి గుర్తు). నిత్య కర్మానుష్టనములు చేసుకొని శివలింగము నారాధించి, తను చేసే ప్రతి పనిలో ప్రతి ఒక్కరిలో శివును చూస్తూ సాత్వికాహార బద్ధుడై తిరిగి సాయంత్రం శివారాధన చేసి నివేదన చేయబడిన పదార్థములను ప్రసాద బుద్ధితో తీసుకొని రాత్రి నిద్రకు ఉపక్రమించడం. ఈ నిద్రనే శివుని స్వల్పకాలిక లయం అంటారు. ఈ నిద్రను పొందటను గమనిస్తూ శివుని పదకొండు సార్లు తలచుకొని నిద్రపోవాలని శాస్త్ర వచనం / పెద్దల వచనం . ఇలా రోజూ త్రిమూర్తులను తన అవస్థలలో గుర్తిస్తూ సాధన ద్వారా జ్ఞానం వేపుకి అడుగులేయడం. ప్రతి రోజు శివరాత్రి.
ఇక త్రయోదశి తిథి పరమ శివుని తిథిగా శాస్త్రాలు పెద్దలు గుర్తించారు. శుక్ల పక్షంలో వచ్చే త్రయోదశి తిథితో కూడుకుని ఉన్న చతుర్థశిని శుక్లపక్ష శివరాత్రి అని పిలుస్తూ ఉంటారు ఇది సంపూర్ణ జ్ఙానం వైపు వెళ్ళేసాధకునికి గుర్తు (చాలా వరకు శుక్ల పక్ష శివరాత్రిని ఉపాసన చేయడమన్నది ఈమధ్య కాలంలో కనబడడంలేదు, దీనికి తగిన ఆఖ్యానాలు కూడా ప్రచారంలో లేవు. ఉన్నవేమో తెలీదు.) ఇక కృష్ణ పక్షంలో త్రయోదశి తిథిని కూడిన చతుర్దశీ తిథిని మాస శివరాత్రి అని పిలుస్తారు అదే కృష్ణ పక్ష శివరాత్రి. ఒక రోజులో అసుర సంధ్య వేళ కేవలం శివ పూజకు ఎంత విశిష్టమో అలా ఒక నెలలో మాస శివరాత్రి అటువంటిది. ఈరోజు కూడా మహాశివరాత్రి లాగానే శివారాధనలూ, శివాభిషేకాలు, బిల్వ పత్రి పూజలూ, శివాలయ సందర్శనలూ, భజనలూ, ఉపవాసాలు, జాగరణలూ చేయడం పరిపాటి. ఆరాధనలో ఎటువంటి తేడాలేదు. ఐతే రోజూ చేసే ఉపాసనకన్నా ఈ రోజు చేసే ఉపాసన కొంత అధికం.
అలాగే మాఘమాసంలో వచ్చే కృష్ణ పక్ష చతుర్దశిని మహా శివరాత్రి అని నిర్ధారించారు. ఆరోజే రాత్రే శివలింగము ఆవిర్భవించిందని శాస్త్ర వాక్కు. ఆనాడు పగలంతా శివ పూజలతో, శివ కథా కాలక్షేపములతో సాత్విక ఆహారము లేదా ఉపవాసము (ఉపవాసమంటే లంఖణం కాదు ఉప= దగ్గర, వాసము= ఉండుట, భగవంతునికి దగ్గరగా ఉండుట. వీలైనంత తక్కువైన ఆహారము సాత్వికమైనది తీసుకొని భగవంతుని గుణములను కొలుస్తూ, స్తోత్ర పాఠాలను చేస్తూ, ఆ లీలా మూర్తి అనుగ్రహాలను తలచుకొంటూ భగవత్కార్యక్రమాలలో పాల్గొనుట).
శివలింగం అర్థ రాత్రి ఆవిర్భవించడం అంటే ఏదో ఒక రాయిలానో శిల గానో ఆవిర్భవించటం అని కాదు. మాఘ మాసం వచ్చేసరికి, (ఆషాడ మాసంనుంచి వర్షాలవల్ల లోకంలో సృష్టి ప్రతి సృష్టి జరిగుతుంది. భౌతికంగా అన్ని జీవాలు అంధకారంలోఉంటాయి, సరిగ్గా కనపడదు అందునా మాఘ మాసం చతుర్దశి అర్థ రాత్రి అమావాస్య ఘడియలలో లేదా అమావాస్య వస్తుందనగా ఉన్న చీకట్లను తొలగించడానికి జ్యోతి రూపంలో శివుడు ఆవిర్భవించాడు అదే అజ్ఙానరూపంలో ఉన్న చీకట్లను తొలగించడానికి జ్యోతి రూపంలో ఆవిర్భవించాడు. అవ్యక్తమైన పరమాత్మ వ్యక్తమైనాడు. ఆరోజు రాత్రి జాగరణ చేసి లింగావిర్భావ సమయమున ఒక జ్యోతి (దీపమును లేదా కర్పూర దీపమునుగాని) గాని ఈ క్రింది శ్లోకము చదువుతూ చూడవలెను అప్పుడు శివరాత్రి వ్రత పూర్ణ ఫలము.
కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః , జలేస్థలే యే నివసంతి జీవాః |
దృష్ట్వా ప్రదీపం నీచజన్మభాగినః , భవన్తి త్వం శ్వపచా హి విప్రాః ||
మన సనాతన ధర్మ గొప్పదనమెంతో చూడండి. ఈ శ్లోకం చదివి, ఆ దీపాన్ని వెలిగించిన యజమానే కాక, దానిని చూస్తున్న వారందరే కాక, కీటకములు, పక్షులు, దోమలు, చెట్లు, జల నివాసములు, ఏ ఏ జీవములు ఆ దీపమును చూచుచున్నవో లేదా ఏ ఏ జీవములపై ఆ దీపపు కాంతి పడుతున్నదో అవన్నీ ఉద్ధరణ పొందవలెను అని ఆ యజమాని భావన చేయాలి. దీనితోనే ఆ శివరాత్రి వ్రతం సంపూర్ణం. (ఇదే శ్లోకం కార్తీక పౌర్ణమి దీపాన్ని చూస్తూ కూడా చెప్పవలెను)
ఈ విషయాన్ని మీకు తెలిసినవారందరకీ తెల్పండి. [పూర్తిగా శివరాత్రి, కార్తీక పౌర్ణమి వ్రతాలు చేయకపోయినా (ఏ అస్వస్తత వల్లనో) అ నాటి రాత్రి జ్యోతి స్వరూపుడైన శివుని దీపము లో చూస్తూ ఈ శ్లోకం చెప్పినా చాలు అని పెద్దలెవరో చెప్పగా విన్నట్లు గుర్తు ]
ఇన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి, స్వయంగా ఆ పరమేశ్వరుడే మన అజ్ఙానపు చీకట్లను తొలగించడానికి జ్యోతీరూప శివలింగంగా ఆవిర్భవించిన రోజు కాబట్టీ, ప్రతి రోజూ అంత గొప్పగా ఉపాసన చేయడం అందరికీ సాధ్యం కాబట్టీ, కనీసం ప్రతి సంవత్సరం మహా శివరాత్రైనా జరుపుకోవాలని(జన్మానికో శివరాత్రి అని నానుడి) పెద్దలు నిశ్చయం చేశారు.







సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
 పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, 
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,
ఆర్దికలావాదేవీలు,ETC), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, 
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు
సంప్రదించండి.

FOLLOW US :
PLZ LIKE , SHARE , FOLLOW AND SUBSCRIBE

FACEBOOK PAGE

PRINTEREST

TWITTER

INSTAGRAM

BLOG

WHATSAPP GROUP 
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP:



FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/GQ72L3U0MNF4ZKKIECPG9Y

FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/BR5VHG7L4L8HHQ1UUWLDUI

FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/GMBYOVWRJ8MDJTJKFBOSKM


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA / హవనిజా
( B.ed, MCA, M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం/ SREE VIDHATHA PEETAM
Ph. no: 9666602371





శివునికి ఏ అభిషేకం వలన ఏమి ఫలం



రాత్రి వ్రతములు కొన్ని ఉంటాయి. దివావ్రతములు కొన్ని ఉంటాయి. మహాశివరాత్రి అహోరాత్ర వ్రతము. శివరాత్రి అనడంలోనే రాత్రి పాధాన్యం గురించి చెప్పబడుతున్నది. పైగా అమ్మవారికి కూడా మనం నవరాత్రులు అని మనం చేస్తాం. రాత్రి అంతర్ముఖ స్థితికి సంకేతం. ఆ సమయంలో చేసే ఆరాధనలు ధ్యానానికి, జ్ఞానానికి ప్రధానమైనవి. కర్మకు ప్రధానమైన వ్రతాలు పగటియందు చేస్తారు. 

లింగోద్భవ కాలం, తురీయ సంధ్యాకాలంలో ఒక మహాగ్ని లింగంగా తన ఆదిమద్యాంతరహితమైన తత్త్వాన్ని ప్రకటించాడు గనుక ఆ రాత్రికి ప్రాధాన్యమున్నది. అది జరిగినది మాఘబహుళ చతుర్దశి అర్థరాత్రి సమయం గనుక ఈ రాత్రిని మనం శివరాత్రి వ్రతంగా చేస్తున్నాం. ప్రతి ఆరాధనకీ ఉన్న నియమాలే శివారాధనలో కూడా ఉన్నాయి. వాటితో పాటు మరికొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఏ ఆరాధనకైనా ముందు ఉండవలసినది శుచి. దానినే సదాచారం అంటాం. "ఆచారహీనం నపునంతి వేదాః" అని శాస్త్రం. 

ఎంత వేదపండితుడైనా ఆచారపాలన లేనప్పుడు వాడు తరించడు. "ఆచార ప్రభవో ధర్మః ధర్మస్య ప్రభురచ్యుతః" అని విష్ణుసహస్రనామం చెబుతున్నది. సూర్యోదయాత్పూర్వం నిద్రలేవడం, బ్రాహ్మీ ముహూర్తంలో ధ్యానం చేయడం, స్నానసంధ్యాది నిత్యకృత్యముల తర్వాత శివారాధన చేయాలి. శివారాధనలో ప్రధానమైనది శివధర్మములు కొన్ని చెప్పబడుతున్నాయి. శివధర్మములు అనగా శివుని ఉద్దేశించి చేసే కర్మలు. పూర్ణిమ, అమావాస్యలయందు సముద్రం ఎలా వృద్ధిచెందుతుందో అలా ఆ కర్మలు వృద్ధిచెందే కాలం శివరాత్రి. అలాగే శివధర్మములు కొద్దిపాటి చేసినప్పటికీ గొప్ప ఫలితాలుంటాయి. శివాభిషేకం, నామస్మరణ ఇత్యాదులు. 

మహాశివరాత్రి నాడు ఆ కర్మలు చేస్తే కొద్దిపాటి చేసినప్పటికీ అధికఫలాన్నిస్తాయి పర్వకాల సమయంలో సముద్రం వలె అని పరమేశ్వరుడు చెప్పినట్లుగా శివపురాణంలోని వాక్యం. స్నానం శరీరానికి కేవలం బాహ్యశుద్ధిని మాత్రమే కలిగిస్తుంది. పూర్ణశుద్ధి కావాలి అంటే భస్మధారణవల్ల శుద్ధి అవుతున్నది. అందువల్ల త్రిపుండ్రములుగా నుదుటియందు, కంఠమునందు, భుజములయందు, చేతులయందు, వక్షస్థలములయందు భస్మాన్ని ధరించాలి అని శాస్త్రం. భస్మధారణ, రుద్రాక్షధారణ, పంచాక్షరీ మంత్రాన్ని జపించడం ఈమూడూ శివధర్మానికి ప్రధాన నియమాలు. స్వామికి ఇష్టమైన బిల్వదళములు, తుమ్మిపూవులు, ద్రోణ కుసుమములు(ఉమ్మెత్త పువ్వులు), వాటితో ఆరాధన చేయాలి. పంచబిల్వములు - తులసి, మారేడు, ఉసిరి, నిర్గుండి(వావిలి), నిమ్మ వీటితో అర్చించడం పరమేశ్వరునికి ప్రీతి. షట్కాల శివపూజ అని నాలుగు గంటలకొకమారు అభిషేకాదులు చేయాలి. అభిషేకప్రియః శివః అని అభిషేకానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. 

అర్హులు మంత్రసహితంగా, తెలియని వారు శివాయ నమః అనే నామం అంటూ అభిషేకం చేసినా చాలు. భక్తికి పరవశించే స్వామి పంచాక్షరితో చేసే పూజకే చాలా సంతోషిస్తాడట. వివిధ ద్రవ్యాలతో శివభిషేకం: భగవదుపచారములలో ఒక్కొక్క ఉపచారానికీ ఒక్కొక్క ఫలితాన్ని చెప్పారు. పరమేశ్వరునికి అభిషేకం అత్యంత ప్రీతిపాత్రమైనది. "అభిషేకాత్ ఆత్మశుద్ధిః" అని శాస్త్రం చెబుతోంది. అభిషేకం వల్ల ఆత్మశుద్ధి కలుగుతుంది. 

ఆత్మ అనగా చిత్తము. అంతఃకరణం శుద్ధికావాలి. చిత్త శుద్ధి లేని శివపూజ లేలరా? తో పాటుగా శివపూజ లేనిదే చిత్తశుద్ధి రాదయా అని కూడా ఉంది. అందుకని చిత్తశుద్ధి కోసం శివపూజ చేయాలి. తరువాత చిత్తశుద్ధితో శివపూజ చేయాలి. శుద్ధికి గొప్ప సాధనం అభిషేకం. 

ప్రతిదానికీ ప్రధాన, అవాంతర ప్రయోజనాలు లభిస్తాయి. ప్రధానమైనది ఆత్మశుద్ధి. అవాంతర ప్రయోజనాలు - ఐశ్వర్యం లభించడం, రోగాలు పోవడం, జ్ఞానం రావడం, మొ!!వి. పరమేశ్వరుడు త్రిగుణాతీతుడు, శుద్ధ సత్త్వ స్వరూపుడు. అందువల్ల ఆరాధనలో సాత్త్విక పదార్థాలను వినియోగించాలి. వాటిలో క్షీరము ప్రధానమైనది. 

శుద్ధజలం క్షీరం కంటే ప్రధానమైనది. శుద్ధజలంతో అభిషేకం చేయడం ఆయనకి అత్యంత ప్రీతిపాత్రం. గోక్షీరమే అభిషేకానికి వినియోగించాలి. వేరేవాటిలో గోక్షీరం కలపడం కూడదు. కొందరు ఆవుపాల ప్యాకెట్లు చించి నేరుగా అభిషేకం చేస్తారు. అలా చేయరాదు. మరికొందరు కొబ్బరికాయ కొట్టి నేరుగా అభిషేకం చేస్తారు. అది కూడా మహాదోషం. వాటిని వేరే పాత్రలోకి తీసుకొని అభిషేకం చేయాలి. క్షీరాభిషేకం వెండి పాత్రలోనే చేయాలి. రాగి, కంచు ఇత్యాది పాత్రలలో చేయరాదు. రాగి, కంచు పాత్రలతో తీర్థాన్ని కూడా పుచ్చుకోరాదు. అలా చేయడం వల్ల కల్లుపుచ్చుకున్న దోషం వస్తుంది. క్షీరంతో అభిషేకం చేస్తే అమృతంతో చేసిన గొప్ప ఫలం వస్తుంది. అపమృత్యు వంటి దోషాలు పోతాయి. క్షీరజన్యమైన దధితో అభిషేకం చేయడం కూడా ముఖ్యమైన అంశం. ఇది కూడా అమృతత్వాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. గోఘృతం (ఆవునెయ్యి)తో అభిషేకం చేయడం వలన యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తుంది. తేనెతో అభిషేకం చేయడం వల్ల వాక్శక్తి, జ్ఞానశక్తి లభిస్తాయి. 

శుద్ధజలాభిషేకం ఆత్మశుద్ధికి హేతువవుతుంది. పైగా గంగాజలంతో అభిషేకం చేయడం ప్రత్యేకమైన విధి. గంగాజలంతో అభిషేకం చేయడంవల్ల తత్త్వజ్ఞానం లభిస్తుంది. భస్మంతో అభిషేకం మోక్షహేతువు. వివిధ ఫలరసములతో అభిషేకం అభీష్టసిద్ధినిస్తుంది. పసుపునీటితో అభిషేకం అమంగళములను తొలగించి మంగళములను, శుభాలను కలిగిస్తుంది. కుశజలం (దర్భలు ముంచిన నీరు), మారేడు తులసీదళములు నీటిలో వేసి ఆనీటితో అభిషేకం చేయవచ్చు. ఈ దళములను వేయడం వల్ల ఆజలము ఔషధంగా మారి అన్ని రోగాలను పోగొట్టగలుగుతుంది. వీటితో అభిషేకం చేయడం వల్ల ఒక కల్పవృక్షం ఎలా కోరికలు తీరుస్తుందో అలాంటి ఫలితములొస్తాయి. ఐశ్వర్యాలొస్తాయి. సుగంధద్రవ్యములు కలిపిన జలం, వట్టి వేళ్ళు కలిపిన జలముతో అభిషేకం తాపహరం, రోగహరం.

జ్యోతిష్యo- స్థానాలు- భావాలు

జ్యోతిష్యo- స్థానాలు- భావాలు



స్నానం

స్నానం

స్నానం చేస్తే శరీరం శుభ్రం అవుతుంది. తలస్నానం చేస్తే తలభారం దిగుతుంది. చన్నీళ్ల స్నానం చేస్తే బద్ధకం పోతుంది. వేణ్ణీళ్ల స్నానం చేస్తే మసాజ్‌లా ఉంటుంది. ఆవిరి స్నానం చేస్తే నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది. గులాబీ రేకుల స్నానం చేస్తే చర్మానికి లాలన దొరుకుతుంది. అరోమ స్నానం చేస్తే ఒక క్రొత్త లోకంలో విహరిస్తున్నట్టుంది. ఇలా పలు విధాలుగా అనిపిస్తుంది. అసలు స్నానం అంటే ఏమిటి? ఇన్ని రకాల స్నానాల వల్ల మనకోచ్చేలాభాలేమిటి అంటే ఇది పూర్తిగా చదవవలసినదే.
మానవుల్ని పవిత్రులను చేసుకోవడానికి భగవంతుడు అనుగ్రహించినవి 1.జలము మరియు 2.అగ్ని. అగ్ని యొక్క దాహక శక్తి మనల్ని దహింప చేస్తుంది కనుక జలముతో శుద్ధి చేసుకోవడం అందుబాటులో ఉన్న శాస్త్ర సమ్మతమైన విషయంగా చెప్పబడింది. హిందూ పురాణాలలో వివిధ రకాలైన స్నానాల గురించి ప్రస్తావించారు. వాటిల్లో నేను నేర్చుకున్నవీ, చదివి, విని తెలుసుకున్నవీ అన్నిటినీ క్రూడీకరించి ఇక్కడ రాస్తున్నాను.
అన్నట్టుగా స్నానాలని అయిదు విధములుగా చెప్పినా చాలా రకాలుగా మనం విభజించు కోవచ్చును. స్నానం ఎప్పుడు చేస్తాం అనే అంశాన్ని పరిగణలోనికి తీసుకుంటే స్నానాలు మూడు విధములు. అవి
నిత్య స్నానం : ప్రతీరోజూ చేసే స్నానం నిత్య స్నానం.

నైమిత్తిక స్నానం :
ఒక నిమిత్తాన్ని పురస్కరించుకొని చేసేది నైమిత్తికం. ఉదా : గ్రహణం సమయములో, కక్కిన వెంటనే, క్షౌరం చేసుకున్న తరువాత, చెడ్డకలలు కన్న తరువాత, సంసారసుఖం అనుభవించిన తరువాత, ఎముకను పట్టుకొన్నపుడు, స్మశానానికి వెళ్ళినపుడు స్నానం చేయాలని పెద్దల అభిప్రాయం.
ప్రసవించిన స్త్రీని ముట్టుకొన్నప్పుడు, రజస్వలయైన స్త్రీని ముట్టుకొన్నప్పుడు, శవాన్ని ముట్టుకొన్నప్పుడు, శవాన్ని అనుసరించి వెళ్ళిన తరువాత, ఇలా ఒక కారణం చేత చేసే స్నానం నైమిత్తికమన్నమాట.
కామ్య స్నానం : ఒక కోరికతో చేసేది కామ్య స్నానం. ఉదా : తీర్థాదులలో, పుష్కరాలలో, రధసప్తమికి, కార్తీక మాసంలో, మాఘఫాల్గుణాలలో విశేష ఫలాలనుద్దేశించి చేసేదానికి, తన జన్మనక్షత్రం, వ్యతీపాత, వైదృతియను యోగాలు కలిసే రోజుల్లోగాని, పర్వతిథులలో చేసేది కామ్య స్నానం.
స్నానానికి ఉపయోగించే పదార్ధాన్ని బట్టి స్నానాలు రెండు విధములు. అవి
ముఖ్య స్నానం : ఇది నీటిని ఉపయోగించి చేసేది ఇది మళ్ళీ రెండు రకాలు --
మంత్రం లేదా బ్రాహ్మ్యం : వేదములలో చెప్పబడిన నమక, చమక, పురుష సూక్తములను, మార్జన మంత్రములను ఉచ్ఛరిస్తూ చేసేది "మంత్ర స్నానం".మంత్రించిన నీళ్ళని నెత్తిమీద చల్లుకోవడమే బ్రాహ్మ్య స్నానం.

"ఓం ఆపోహిష్టామ యోభువః
తాన ఊర్జే దధాతన మహేరణాయచక్షసే
యోవశ్శివతమోరసః
తస్య భాజయతేహనః
ఉశతీరివ మాతరః
తస్మారంగా మామవో
యస్యక్షయాయ చ తనః
ఆపో జన యధాచనః "
అనే మంత్రముతో పైన నీటిని చల్లుకుంటారు. పూజలు చేసేటప్పుడు కూడా గంగేచ, యమునేచ, గోదావరీ, సరస్వతీ, నర్మదా, సింధు, కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు అని నీళ్ళని మంత్రించి పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య, దేవస్య, ఆత్మానం సంప్రోక్ష్య అని మంత్రించిన నీళ్ళని చల్లాకనే పూజా విధానాలు మొదలుపెడతాం.
వారుణం : ఇది మామూలు నీళ్ళతో చేసేది. మనమందరం ఎక్కువగా చేసేది ఇదే. మనలో నిరంతరం విద్యుత్తు ప్రవహిస్తూ, ఎప్పటికప్పుడు విద్యుచ్ఛక్తి ఉత్పత్తి అవుతూ, బయటకు పోతూ ఉంటుంది. ఇలా నిరంతరం జరుగుతూ ఉంటేనే మనం ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటాం. ఈ ప్రక్రియను "electro-magnetic activity” అంటారు. నిజానికి శుచితో పాటు నీళ్ళతో దేహాన్ని తడపడంవల్ల లోపల ప్రవహిస్తున్న విద్యుచ్ఛక్తిని బయటకు పంపడం కూడా స్నానపు ప్రధాన ఉద్దేశ్యం. అందుకే పొద్దున్నే స్నానం చేయాలనే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. శరీరం మీద నీళ్ళు పడినప్పుడు, ఆ నీళ్ళు లోపలి విద్యుచ్ఛక్తిని పీల్చుకుంటాయి. ఆ రకంగా లోపలి విద్యుచ్ఛక్తి బయటకు వెళ్తుంది. ఆ ప్రక్రియ మొదలవగానే చురుకుదనం ప్రవేశిస్తుంది. పుణ్య నదులలో స్నానం ఆచరించడాన్ని కూడా వారుణ స్నానం అంటారు.
అముఖ్యం లేదా గౌణ స్నానం : నీరు లేకుండా చేసే స్నానాన్ని గౌణ స్నానం అంటారు (మీరు చదివినది నిజమే! నీరు లేకుండా కూడా స్నానం చేయచ్చు). ఇది అయిదు రకాలు
* ఆగ్నేయస్నానం : హోమ భస్మాన్ని లేపనంగా పూసుకోడాన్ని ఆగ్నేయ స్నానం లేదా విభూది స్నానం అంటారు. అంటే ఒంటి నిండా విభూతి పూసుకుంటే దానిని విభూతి స్నానం అంటారు. అదెక్కడి స్నానం అనుకుంటున్నారా? చెప్తాను వినండి కాదు రాస్తాను చదవండి. భస్మానికి మూడు హంగులు కావాలి. ఒకటి, కాలగలిగే పదార్ధం. రెండు, అది రాజుకుని అంటుకోడానికి తగినంత వేడి. మూడు, ఆ వస్తువు మండడానికి తగినంత ఆమ్లజని సరఫరా. అప్పుడే ఆ వస్తువు కాలుతుంది. కాలగా మిగిలిన దానిని బూడిద అంటాం. విభూది ఒక రకం బూడిదే అలానే నీరు కూడా ఒక రకం బూడిదే. ఉదజని వాయువుని ఆమ్లజని సమక్షంలో మండించగా మిగిలిన బూడిదే నీరు. కనుక, మండవలసిన పదార్ధం అంతా మండిపోగా మిగిలినవే బూడిద, నీళ్ళూను. బూడిద ఒంటినిండా రాసుకోడానికీ, నీళ్ళు ఒంటి మీద పోసుకోడానికీ మధ్య ఉన్న వైజ్ఞానిక పరమైన సారూప్యాన్ని మనవాళ్ళకి తెలిసే ‘విభూది స్నానం’ అన్న పేరు పెట్టడం జరిగింది.
"శ్రీకరంచ పవిత్రంచ శోకరోగ నివారణం|
లోకే వశీకరణం పుంసాం భాస్మత్రైలోక్య పావనం||"
పరమ పవిత్రమైన, అనారోగ్యాలను పోగొట్టే, సంపదలను చేకూర్చే, బాధలను నివారించే, అందరినీ వశంలో ఉంచుకునే విభూతిని ముఖాన పెట్టుకుంటున్నాను- అని ఈ శ్లోక భావం. విభూతి చర్మవ్యాధులను నివారిస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ప్రతిరోజూ విభూతిని ధరించడం వల్ల రక్తంలో ఉండే దోషాలు, మలినాలు పోయి, రక్తప్రసరణ సవ్యంగా ఉంటుంది. విభూతి క్రిమినాశినిగా పనిచేస్తుంది. నుదురు, భుజాలు మొదలైన శరీర భాగాలపై స్వేదంవల్ల జనించిన క్రిములు కలిగించే రోగాలనుండి రక్షిస్తుంది. శరీర ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు లేకుండా సమంగా ఉండేట్లు చేస్తుంది. ఆకలిని పెంచుతుంది. ఉద్రేకాలను తగ్గించి, శాంత స్వభావాన్ని చేకూరుస్తుంది. విభూతి స్వచ్చమైన తెల్లటి రంగులో ఉంటుంది కనుక ఇది నిర్మలత్వానికి సంకేతం. విభూది అంటే ఐశ్వర్యం అనే భావన కూడా ఉంది కనుక ఈ విభూది స్నానం చేస్తే ఐశ్వర్యవంతులం అవుతామన్న ఉద్దేశ్యంతో కూడా దీనిని ఆచరిస్తాం.
* భౌమస్నానం : పుణ్య నదులలో దొరుకు మన్ను లేక పుట్ట మన్ను మొదలగు పవిత్ర మృత్తికను ఒంటి నిండా అలముకొని మృత్తికా మంత్రములతో చేసేది "భౌమ స్నానం". దీనినే mud bath అంటారు. పంచభూతాల్లో మట్టి ఒకటి. మనం కాలు మోపాలన్నా, మనకు సర్వాన్నీ ప్రసాదించే చేట్టుచేమలను పెంచాలన్నా మట్టే కదా అవసరం. మట్టి లేకపోతే మనకు మనుగడే లేదు. పుట్టింది మొదలు, చనిపోయేవరకూ మట్టితో మనకు విడదీయరాని సంబంధం ఉంటుంది. చివరికి తుది శ్వాస విడిచిన తర్వాత ఈ శరీరం మట్టిలోనే కలిసిపోతుంది. భస్మ స్నానం, మృత్తికా స్నానం పూర్తయిన తర్వాతనే క్రొత్త యజ్ఞోపవీతం వేసుకోవాలనేది శాస్త్రం. మట్టిలో ఎన్నో క్రిముల్ని సంహరించే శక్తితో పాటు గాయాలని మాన్పగల శక్తి కూడా ఉంది.
* వాయవ్యస్నానం : ముప్పయి మూడు కోట్ల దేవతులు నివశించియున్న గోవులు నడుస్తుండగా వాటి కాళ్ళ నుండి రేగే మట్టి మన మీద పడేలా నడవడం. విభూతిని పెట్టుకోవడం, గోధూళిలో విహరించడం అనేవి పవిత్రమైన అంశాలుగా పద్మ పురాణం చెప్తోంది. గోధూళిలో ఉండే కమ్మటి వాసన మనకు అనుభవమే! అది శాస్త్రీయంగా కూడా ఎంతో మేలు చేస్తుంది.
* దివ్యస్నానం : లోక భాంధవుడు, జగత్ చక్షువు, కర్మ సాక్షి అయినటువంటి సూర్య భగవానుడు ఆకాశంలో ఉండి సూర్య కిరణాలను వెలువరిస్తున్నపుడు వర్షం నీటిలో తడవడాన్నే దివ్య స్నానం అంటారు. అంటే, ఒక్కోసారి ఎంతమాత్రం మబ్బు పట్టకుండా ఎండలోనే వాన వస్తుంది కదా! అలాంటి వర్షంలో తడవడాన్ని దివ్య స్నానం అంటారు. ఇది చాలా అరుదైనది. అవకాశం వస్తే వదలకండి.
* మానసిక స్నానం : అంటే మానసికంగా చేస్తాం తప్ప నిజంగా చేసే స్నానం కాదు. నిత్యం నారాయణ నామ స్మరణతో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య అహంకార ఢంభ దర్పదైన్యాది మాలిన్యాలను మనస్సులో చేరనీక పోవడం "మానస స్నానం". ఇది మహత్తర స్నానం. మహా ఋషుల చేత ఆచరింప బడుతుంది. పైపై స్నానాలు కాకిస్నానాలు ఎన్ని చేసినా లోపలి దేహానికి కూడా చేయించినప్పుడే అది సంపూర్ణ స్నానం అవుతుంది.
ఖస్థితం పుండరీకాక్షం చింతయేత్ పురుషోత్తమం| అనంతాదిత్యసంకాశం వాసుదేవం చతుర్భుజం||
శంఖచక్ర గదా పద్మధారిణం వనమాలినం| ధ్వజ వప్ర అంకుశైర్లక్ష్య పాదపద్మం సునిర్మలం||
త్వత్పాదోదజాం గంగాం నిపతంతీం స్వమూర్ధని| చింతయేత్ బ్రహ్మరంధ్రేణ ప్రవిశంతీం స్వకాంతమం||
తయా సంక్షాళయే త్సర్వమంతర్దేహగతం మలం| తత్ క్షణాత్ విరజా మర్త్యో జాయతే స్ఫటికోపమ:||
ఇదం మానసికం స్నానం ప్రోక్తం హరిహరాదిభి:| సార్దత్రికోటి తీర్ధేషు స్నానాత్కోటి గుణాధికం||
యోనిత్యమాచరేద్దేవం సవియెనారాయణ స్మృత:| కాలమృత్యు మతిక్రమ్య జీవత్యేవ నసంశయ:||
అంటే పరమాకాశంలో ఉండే పురుషోత్తముడయిన వాసుదేవుడిని, నాలుగు భుజములు కలవాడిని, శంఖ చక్ర గద పద్మము వనమాలలను ధరించినవానిని, ధ్వజాదులనే మంగళకరమైన గుర్తులున్నవానిని ధ్యానించాలి. వాని పాద పద్మముల నుండి పుట్టిన గంగను తన శిరస్సుపై పడి బ్రహ్మరంధ్రం వెంబడి హృదయంలో ప్రవేశించే దానిగా భావించాలి. ఆ గంగచేత తన పాపలు పోతున్నట్లుగా చింతించాలి. అప్పుడు స్ఫటికం మాదిరిగా మలినాలు లేకుండా నిర్మలంగా ఉండి మృత్యువును దాటగలరు. ఇలా హరిహరులను తలుచుకుంటూ చేసే మానసిక స్నానం కోటి పుణ్య నదులలో చేసిన స్నానం కన్నా గొప్పది అని దీని భావము.
ఇడా భాగీరథీ గంగా, పింగళా యమునా స్మృతా| తయోర్మధ్యగతా నాడీ, సుషుమ్నాఖ్యా సరస్వతీ||
జ్ఞానహ్రదే ధ్యానజలే రాగద్వేష మలపహే| య:స్నాతి మానసే తీర్ధే సయాతి పరమాం గతిం||
అచ్యుతోహం అనంతోహం గోవిందోహం అహం హరి:| ఆనందోహం అశేషోహం అజోహం అమృతోస్మ్యహం||
నిత్యోహం నిర్వికల్పోహం నిరాకారోహం అవ్యయ:| సచ్చిదానందరూపోహం పరిపూర్ణోస్మి సర్వదా||
బ్రహ్మైవాహం నసంసారీ, ముక్తోహమితి భావయేత్| ఆశక్నువన్ భాపయితుం వాక్యమేతత్ సమభసేత్||
ఏవం య: ప్రత్యహం స్మృత్వా, మానసం స్నానమాచరేత్| సదేహాంతే పరబ్రహ్మపదం యాతి నసంశయ:||
ఎడమ ముక్కులోనున్న ఇడానాడిని భాగీరథిగా, కుడి ముక్కులో నున్న పింగళనాడిని యమునగా, వాటి మధ్యలో నున్న సుషుమ్నును సరస్వతిగా భావించాలి. రాగద్వేషాలనే మాలిన్యాన్ని పోగొట్టే జ్ఞానమనే సరస్సులో స్నానం చేసినట్లు భావించి నేనే అచ్యుతుడను, గోవిందుడను, హరిని, ఆనందరూపుణ్ణి, చావు పుట్టుకలు లేని పరమాత్మ స్వరూపాన్ని నేనే అని భావిస్తూ మనస్సులోనే స్నానం చేస్తున్నట్లుగా భావించి తరించాలి అని దీని భావము.
అభ్యంగన స్నానం : ఇక మిగతా రకాల స్నానాల గురించి చెప్పుకోవాలంటే అభ్యంగన స్నానం ఒకటి. నఖ శిఖ పర్యంతము తలస్నానము చేయుట . ఇది కనీసం నెలకి రెండు సార్లయినా అందరూ చేయాలి! మరి దాని వలన ప్రయోజనాలేమిటో చూద్దాం -

1. వేడినీటి స్నానం --చర్మాన్ని బలపరచి, చర్మంపైగల క్రిములను సంహరిస్తుంది. నూనె మర్దన శరీరంలో రక్తసరఫరా మెరుగుపరచి ఆరోగ్యవంతమైన చర్మాన్నిస్తుంది.
2. సౌనా పేరుతో నేడు చేయబడే స్టీం బాత్ లు --చర్మకణాలను పూర్తిగా శుభ్రపరచి, చర్మ రంధ్రాలు స్వేచ్ఛగా గాలి పొందేలా చేస్తాయి.
3. శరీర వెనుక భాగ చర్మం, పిరుదులు, భుజాలు, మొదలైనవి గట్టిగా వుంటాయి. వేడినీరు తగిలితే ఆ భాగాల లోని నొప్పులు, మంటలు మొదలైనవి తగ్గుతాయి. ముఖంపైన, తలపైన వేడినీరు వాడటం వలన జుట్టు ఊడే ప్రమాదం కూడా వుంది.
4. వేడి నీటి తలంటు స్నానం చర్మానికి నూనెను ఇచ్చి మెత్తబడేట్ల చేస్తుంది. నూనెతో మర్దన, పసుపు శనగపిండిలతో కూడిన పేస్టు రోగాలను తెచ్చే క్రిములను నశింపజేస్తుంది. చర్మం దురదలు, మం
ట తగ్గుతాయి. అపుడపుడూ అభ్యంగన స్నానం చేస్తే, మైండ్ చక్కటి రిలాక్సేషన్ పొంది చురుకుగా వుంటుంది. వేడినీటిలో సువాసన ద్రవ్యాలు వేస్తే అవి చర్మానికి సహజ కాంతి నిచ్చి చెడు వాసనలను పోగొడతాయి.
ఇవే కాక
నేతితో స్నానం చేయుట వలన ఆయుర్దాయం పెరుగుతుంది;
పెరుగు, ఆవుపేడతో స్నానం చేయుట వలన లక్ష్మీ వర్ధనము;
దర్భలతో చేయుట వలన సర్వ పాపాలు తొలగుతాయి;
సర్వ గంధాలతోటి స్నానం చేస్తే సౌభాగ్యము, ఆరోగ్యము అభివృద్ది చెందుతాయి;
ఆమలక స్నానము అంటే ఉసిరికాయని వేసి చేసిన స్నానం వలన దారిద్ర్యాలు తొలగుతాయి;
నువ్వులు మరియు తెల్ల ఆవాలతో చేసిన స్నానం అమంగళనివారకము; నువ్వులతో కాని తెల్ల ఆవాలతో కాని ప్రియంగువుతో కాని స్నానం చేస్తే సౌభాగ్యం .
వర్ధనము; మోదుగ, మారేడాకులు, రెల్లు, తామర, కలువ, కడిమి పువ్వులతో స్నానం చేస్తే లక్ష్మీ వర్ధనమే కాక శుభప్రదం;
నవరత్నాలతో స్నానము చేస్తే యుద్ధ విజయం;
బంగారము వేసిన నీటితో స్నానం చేస్తే ఆయుష్షు, మేధా శక్తి పెరుగుతాయి అని రక రకాల స్నానముల వలన కలిగే ఫలితాలను గురించి శ్రీ విష్ణు ధర్మోత్తర పురాణములో చెప్పబడింది.
సముద్ర స్నానము
మానవుడు సముద్రములో మునుగగనే, అన్ని తీర్థములలోను పుణ్యనదులలోను స్నానము చేసిన పుణ్యము లభించును.
కార్తీక స్నానము
కార్తీకమాసములో తైలము రాసుకొని స్నానము చేయకూడదు. పురాణములను విస్మరించరాదు. కార్తీకమాసమున వేడినీటితో స్నానము కల్లుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను. కావున, వేడినీటితో స్నానము కూడదు. ఒకవేళ అనారోగ్యముగా వుండి యెలాగైనా విడువకుండా కార్తీకమాసవ్రతం చేయవలెనన్న కుతూహలం గలవారు మాత్రమే వేడినీటి స్నానము చేయవచ్చును. అటుల చేయువారలు గంగ, గోదావరీ సరస్వతి యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెను.

మతము (part 5)

మతము (part 5)


continuation   హిందూమతము..

బ్రాహ్మణాలు
బ్రాహ్మణాలు (దేవనాగరి: ब्राह्मणम्) హిందూ మతం శ్రుతి సాహిత్యం యొక్క భాగంగా ఉన్నాయి. ఇవి ఆచారాలు సరైన పనితీరును వివరించే నాలుగు వేదాల మీద వ్యాఖ్యానాలు ఉన్నాయి. ప్రతి వేద శాఖ (పాఠశాల), దాని సొంత బ్రాహ్మణులను కలిగి ఉంది. ఈ అనేక గ్రంథాలు మహాజనపదులు కాలంలో ఎన్ని ఉనికిలో ఉన్నాయో తెలియదు.

వేదభాగము
బ్రాహ్మణము ఒక వేదభాగము. ఇది ప్రతి వేదంలో ఉంటుంది. ఇది సంహిత యెక్క యాగవినియోగవ్యాఖ్య. ఈ భాగములొ మహా యాగముల గూర్చి తెలపడం జరిగింది. అశ్వమేధము వంటి యాగముల ప్రశస్తి వివరించడం జరిగింది. యజ్ఞ యాగాదులు ఎలా చేయాలి? వాటి వెనుక రహస్యాలు ఏమిటి వంటి విషయాలు ఉన్నాయి.
ప్రతి వేదంలోను నాలుగు భాగాలున్నాయి. అవి


సంహితలు- మంత్ర భాగం, స్తోత్రాలు, ఆవాహనలు
బ్రాహ్మణాలు- సంహితలోని మంత్రమునుగాని, శాస్త్రవిధినిగాని వివరించేది. యజ్ఞయాగాదులలో వాడే మంత్రాల వివరణను తెలిపే వచన రచనలు.
అరణ్యకాలు - వివిధ కర్మ, యజ్ఞ కార్యముల అంతరార్ధాలను వివరించేవి. ఇవి బ్రాహ్మణాలకు, ఉపనిషత్తులకు మధ్యస్థాయిలో ఉంటాయి. ఇవి కూడా బ్రాహ్మణాలలాగానే కర్మవిధులను ప్రస్తావిస్తాయి.
ఉపనిషత్తులు - ఇవి పూర్తిగా జ్ఞానకాండ. ఉపనిషత్తులు అంటే బ్రహ్మవిద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, మోక్షము, పరబ్రహ్మ స్వరూపమును గురించి వివరించేవి. నాలుగు వేదాలకు కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. వేదముల శాఖలు అనేకములు ఉన్నందున ఉపనిషత్తులు కూడ అనేకములు ఉన్నాయి. వాటిలో 108 ఉపనిషత్తులు ముఖ్యమైనవి.

బ్రాహ్మణాలు నిర్వచనము
బ్రాహ్మణాలు, నందు పురాణాలు, తత్వశాస్త్రం మరియు వేదాల ఆచారాలు గురించి వ్యాఖ్యానాలు ఉంటాయి. వేదసంహితలు తదుపరి మహోన్నత స్థానం బ్రాహ్మణాలు కలిగి ఉన్నాయి. ఇవి వేదాలలోని అంతర్భాము. చతుర్వేదాలలోని సంహిత (శ్లోక, మంత్ర) భాగములకు బ్రహ్మ పదాన్ని, వ్యాఖ్యాన రూపంగా ఉన్నదానికి బ్రాహ్మణం అని చెప్పబడు తున్నది. ఈ నాలుగు వేదాలలో గల మంత్రాలను, ఎక్కడెక్కడ, ఏఏ యజ్ఞములకు ఈ మంత్రాలను ఎలా వినియోగించాలి, ఆయా వాటిని అవసరమైన చోట వ్యాఖ్యానిస్తూ ఉన్నటువంటి గ్రంథాలకు బ్రాహ్మణాలు అని అందురు. బ్రాహ్మణాల గ్రంథాలందు సంహితలలోని శ్లోకాల నిగూఢ అర్థాన్ని చెబుతూ అనేక వివరణలతో పాటుగా, ఉపాఖ్యానలు కూడా తెలియజేస్తాయి.


ఋక్సంహిత బ్రాహ్మణం
సంహిత యొక్క ప్రతి ప్రధాన శాఖకు ఒక బ్రాహ్మణం ఉండాలి/ఉండేది.
ఋక్సంహితకు 21 శాఖలు ఉన్నట్లుగా తెలియుచున్నది. ఆ విధముగా 21 బ్రాహ్మణాలు తప్పకుండా ఉండాలి.
ఋగ్వేదానికి కౌషీతకి బ్రాహ్మణం, ఐతరేయ బ్రాహ్మణం, అశ్వలాయన బ్రాహ్మణం గాలవ బ్రాహ్మణం బహ్వృచ బ్రాహ్మణం పైంగి బ్రాహ్మణం అని ఆరు బ్రాహ్మణములు మాత్రమే దృశ్యించినారని తెలుస్తున్నది.
ఈ ఆరింటిలోనూ, ప్రస్తుతము ఐతరేయ బ్రాహ్మణం, కౌషీతకి బ్రాహ్మణం అను రెండు బ్రాహ్మణాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మిగతావన్నీ చరిత్రలో కలసి పోయి నామమాత్రంగానే మిగిలిపోయాయి.
ఐతరేయ బ్రాహ్మణాన్ని బహ్వృచ బ్రాహ్మణం అని కూడా కొందరి వాదన, అభిప్రాయము ఉన్నది.
యజుస్సంహిత బ్రాహ్మణం
కృష్ణ యజుస్సంహిత బ్రాహ్మణం, శుక్ల యజుస్సంహిత బ్రాహ్మణం అను రెండు ప్రధానశాఖలు మాత్రమే లభ్యమవుతున్నాయి.
కాలగర్భములో కలసి పోయిన శాఖలు అయిన చరక బ్రాహ్మణం, కాఠక బ్రాహ్మణం, ఖాండికేయ బ్రాహ్మణం, కంకతి బ్రాహ్మణం, శ్వేతాశ్వతర బ్రాహ్మణం, ఛాగలేయ బ్రాహ్మణం, తుంబురు బ్రాహ్మణం, మైత్రాయణీ బ్రాహ్మణం, ఔఖేయ బ్రాహ్మణం, జాబాల బ్రాహ్మణం, హరిద్రవిక బ్రాహ్మణం, అహ్వారక బ్రాహ్మణం లు మొత్తం 12 వున్నాయి అని దర్శించారు.
కృష్ణ యజుస్సంహిత బ్రాహ్మణం
తైత్తిరీయశాఖలకు చందినది తైత్తిరీయ బ్రాహ్మణం
శుక్ల యజుస్సంహిత బ్రాహ్మణం
మాధ్యందిన మరియు కాణ్వ భేదముతో వీటికి రెండు శాఖలు ఉన్నాయి.
మాధ్యందిన శాఖకు మాధ్యందిన శతపథ బ్రాహ్మణం ఉన్నది.
కాణ్వ శాఖకు కాణ్వ శతపథ బ్రాహ్మణం ఉన్నది.
సామస్సంహిత బ్రాహ్మణం
మూడు ప్రధాన బ్రాహ్మణములు, నాలుగు ఉప బ్రాహ్మణములు ఉన్నాయి.
తలవకార బ్రాహ్మణం దీనికి జైమిని బ్రాహ్మణం అని పేరు.
తాండ్య బ్రాహ్మణా న్ని పంచవింశ బ్రాహ్మణం లేదా ప్రౌఢ బ్రాహ్మణం అని కూడా వ్యవహరింతురు.
ఛాందోగ్య బ్రాహ్మణం దీనిని మంత్ర బ్రాహ్మణం అని కూడా పేరు.
నాలుగు ఉప బ్రాహ్మణాలు మాత్రమే లభ్యమవుతున్నాయి. కాలగర్భములో కలసి, పేర్లు తెలిసిన బ్రాహ్మణాలు మరో నాలుగు వున్నాయి.
వీటికి వంశ బ్రాహ్మణం, సంహితోపనిషద్బ్రాణం, దైవత బ్రాహ్మణం, సామవిధాన బ్రాహ్మణం అని నాలుగు బ్రాహ్మణాలు ఉన్నాయి.
వీటిని అనుబ్రాహ్మణములు అని కొందరి అభిప్రాయము.
పేర్లు తెలిసిన రౌరుకి బ్రాహ్మణము, భాల్లవి బ్రాహ్మణము, శాఠ్యాయన బ్రాహ్మణము, కాలబవి బ్రాహ్మణము అను సామస్సంహిత బ్రాహ్మణాలు కాలగర్భములో కలసి పోయినవి.
అథర్వస్సంహిత బ్రాహ్మణము
అథర్వస్సంహితకు ఒకే ఒక బ్రాహ్మణము ఉన్నది. అదే గోపథ బ్రాహ్మణం. అథర్వవేదానికి యజ్ఞ, యాగాలకు ప్రాముఖ్యం లేనందు వలన, ఈ వేదానికి సంబందించిన ఇతర వివరములు, పేర్లు తదితరములు ఏవియునూ లభ్యము కావడము లేదు.


శ్రీ షిర్డీ సాయిబాబా సచ్చరిత్రము 3

శ్రీ షిర్డీ సాయిబాబా సచ్చరిత్రము 3

శ్రీ సాయిసచ్చరిత్రము /రెండవ అధ్యాయము




 శ్రీ సాయిసచ్చరిత్రము రెండవ అధ్యాయము ఈ గ్రంథమురచనకు కారణము, పూనుకొనుటకు అసమర్థత; బాబా అభయము; వాడాలో వివాదము; ’హేమడ్‍పంతు’ అను బిరుదు ప్రదానము; గురువు యొక్క యావశ్యకత. మొదటి యధ్యాయములో గోధుములు విసరి యాపిండిని ఊరుబయట చల్లి కలరా జాడ్యమును తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించితిని. ఇదేగాక శ్రీ సాయి యొక్క యితరమహిమలు విని సంతోషించితిని. అ సంతోషమే నన్నీ గ్రంథము వ్రాయుటకు పురికొల్పినది. అదేగాక బాబాగారి వింత లీలలును చర్యలను మనస్సున కానందము కలుగచేయును; అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును; తుదకు పాపములను బోగొట్టును గదా యని భావించి బాబా యొక్క ప్రవిత్ర జీవితమును, వారి బోధనలను వ్రాయమొదలిడితిని. యోగీశ్వరుని జీవితచరిత్ర తర్కమును న్యాయమును కాదు. అది మనకు సత్యమును, అధ్యాత్మికమునునైన మార్గమును జూపును.

గ్రంథమురచనకు పూనుకొనుటకు అసమర్థత - బాబా అభయము:
శ్రీ సాయిసచ్చరిత్ర గ్రంథరచనకు తగిన సమర్థతగలవాడను కానని హేమడ్‍పంతు భయపడెను. అతడిట్లనుకొనెను: " నా యొక్క సన్నిహితస్నేహితుని జీవితచరిత్రయే నాకు తెలియదు. నా మనస్సే నాకు గోచరము కాకున్నది ఇట్టి స్థితిలో ఒక యోగిశ్వరుని చరిత్రను నేనెట్లు వ్రాయగలుగుదును? అవతారపురుషుల లక్షణముల నెట్లు వర్ణించగలను? వేదములే వారిని పొగడలేకుండెను. తాను యోగియయిన గాని యోగి యొక్క జీవితమును గ్రహింపజాలడు. అట్టిచో వారి మహిమలను నేనెట్లు కీర్తించగలను? సప్తసముద్రముల లోతును గొలువవచ్చును. అకాశామును గుడ్డలో వేసి మూయవచ్చును. కాని యోగిశ్వరుని చరిత్ర వ్రాయుట బహుకష్టము. ఇది గొప్ప సాహసకృత్య మని కూడ నాకు తెలియును." అందువలన నలుగురిలో నవ్వులపాలగుదునేమోనని భయపడి శ్రీసాయీశ్వరుని అనుగ్రహము కొరకు ప్రార్దించెను.
మహరాష్ట్ర దేశములోని ప్రథము కవియు, యోగిశ్వరుడునగు జ్ఞానేశ్వరమహరాజు యోగులచరిత్ర వ్రాసినవారిని భగవంతుడు ప్రేమించునని చెప్పియున్నారు. ఏ భక్తులు యోగులచరితలను వ్రాయ కుతూహలపడెదరో వారి కొరికలు నెరవేరునట్లు, వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగులనేకమార్గముల నవలంబించెదరు. యోగులే యట్టిపనికి ప్రేరేపింతురు. దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాత్రునిగా నుంచి వారివారి కార్యములను వారే కొనసాగించుకొనెదరు. 1700 శక సంవత్సరములో మహీపతి పండితుడు యోగీశ్వరుల చరిత్ర వ్రాయుటకు కాంక్షించెను. యోగులు అతనిని ప్రోత్సహించి అ కార్యమును కొనసాగించిరి. అట్లే 1800 శక సంవత్సరములో దాసుగణు యెక్క సేవను అమోదించిరి. మహీపతి నాలుగు గ్రంథములను వ్రాసెను. అవి భక్త విజయము, సంత విజయము, భక్తలీలామృతము, సంతలీలామృతము అనునవి. దాసగణు వ్రాసినవి భక్త లీలామృతమును సంకథామృతములోని మాత్రమే. అధునిక యోగుల చరిత్రలు వీనియందు గలవు. భక్తలీలామృతములోని 31, 32, 33 అధ్యాయములందును, సంకథామృతములోని 57వ యధ్యాయమందును సాయిబాబా జీవితచరిత్రయు, వారి బోధలును చక్కగా విశదీకరింపబడినవి. ఇవి సాయిలీలా మాసపత్రిక, సంపుటము 17, సంచికలు 11, 12 నందు ప్రచురితములు. చదువరులు ఈ యధ్యాయములు కూడ పఠించవలెను. శ్రీసాయిబాబా అద్భుతలీలలు బాంద్రా నివాసినియగు శ్రీమతి సావిత్రీబాయి రాఘునాథ్ తెండూల్కర్ చే చిన్న పుస్తకములో చక్కగా వర్ణింపబడినవి. దాసుగణు మహరాజుగారు. కూడ శ్రీసాయి పాటలు మధురముగా వ్రాసియున్నారు. గుజరాతీ భాషలో అమీదాస్ భవాని మెహతా యను భక్తుడు శ్రీసాయి కథలను ముద్రించినారు. సాయినాథప్రభ అను మాసపత్రిక శిరిడీలోని దక్షిణభిక్ష సంస్థవారు ప్రచురించి యున్నారు. ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత్రవ్రాయుటకు కారణమేమి? దాని యవసరమేమి? - యనిఎవరైనను ప్రశ్నింపవచ్చును.
దీనికి జవాబు మిక్కిలి తేలిక! సాయిబాబా జీవితచరిత్ర సముద్రమువలె విశాలమైనది, లోతైనది. అందరు దీనియందు మునిగి భక్తిజ్ఞానములను మణులను వెలికితీసి కావలసినవారికి పంచి పెట్టవచ్చును. శ్రీసాయిబాబా నీతిబోధమగు కథలు, లీలలు మిక్కిలి యాశ్చర్యమును కలుగజేయును. అవి మనోవికలత చెందినవారికి విచారగ్రస్టులకు శాంతి సమకూర్చి యానందము కలుగజేయును. ఇహపరములకు కావలసిన జ్ఞానమును బుద్ధిని ఇచ్చును. వేదములవలె రంజకములును ఉపదేశకములునునగు బాబా ప్రబోధములు విని, వానిని మననము చేసినచో భక్తులు వాంఛించునవి, అనగా బ్రహ్మైక్యయెగము, అష్టాంగయోగ ప్రావీణ్యము, ధ్యానానందము పొందెదరు. అందుచే బాబా లీలలను పుస్తకరూపమున వ్రాయ నిశ్చయించితిని. బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగుల అనందము కలుగజేయును. అందుచేత బాబాగారి యాత్మసాక్షాత్కారఫలితమగు పలుకులు, బోధనలు సమకూర్చుటకు పూనుకొంటిని. సాయిబాబాయే యీ కార్యమునకు నన్ను ప్రోత్సహించెను. నా యహంకారమును వారి పాదములపై నుంచి శరణంటిని. కావున నా మార్గము సవ్యమైనదనియు బాబా యిహపరసౌఖ్యములు తప్పక దయచేయుననియు నమ్మియుంటిని.
నా యంతట నేను ఈ గ్రంథరచనకు బాబా యెక్క యనుమతిని పొందలేకుంటిని. మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామా అను వారు బాబాకు ముఖ్యభక్తుడు. వారిని నా తరపున బాబాను ప్రార్దించమంటిని. నా తరపున వారు బాబాతో నిట్లనిరి "ఈ అన్నాసాహెబు మీ జీవిత చరిత్రను వ్రాయ కాంక్షించుచున్నాడు. ’నేను భిక్షాటినముచే జీవించు ఫకీరును, నా జీవితచరిత్ర వ్రాయనవసరము లేదని యనవద్దు! మీరు సమ్మతించి సహాయపడినచో వారు వ్రాసెదరు. లేదా మీ కృపయే దానిని సిద్ధింపజేయును. మీ యెక్క యనుమతి యాశీర్వాదము లేనిదే యేదియు జయప్రదము చేయలేము." అది వినినంతనే శ్రీసాయిబాబా మనస్సు కరిగి, నాకు ఊదీ ప్రసాదము పెట్టి యాశీర్వదించెను. మరియు (శ్యామతో) నిట్లు చెప్ప దొడంగెను: " కథలను, అనుభవములను, ప్రోగు చేయమనుము. అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకిగా వ్రాయమను. నేను సహాయము చేసెదను. వాడు నిమిత్తమాత్రుడే. నా జీవితచరిత్ర నేనే వ్రాసి నా భక్తులు కోరికలు నెరవేర్చవలెను. వాడు తన యహంకారమును విడువవలెను. దానిని నా పాదములపైన బెటువలెను. ఎవరయితే వారి జీవితములో నిట్లు చేసెదరొ వారికి నేను మిక్కిలి సహయపడెదను. నా జీవితచర్యలకొరకే కాదు. సాధ్యమైనంత వరకు వారి గృహకృత్యములందును తోడ్పడెదను. వాని యహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చునకు కూడ లేకుండునప్పుడు నేను వాని మనస్సులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసికొందును. నా కథలు బోధలు విన్నా భక్తులకు భక్తివిశ్వాసములు కుదురును, వారు అత్మసాక్షాత్కారమును బ్రహ్మనందమును పొందెదరు. నీకు తోచిన దానినే నీవు నిర్దారణ చేయుటకు ప్రయత్నించకుము. ఏ విషయము నైనను కీడు మేలు ఎంచు వివాదము కూడదు.
వివాదమునగనే నన్ను ’హేమడ్‍పంతు’ ని పిల్చుటకు కారణమేమో మీకు చెప్పెదనను వాగ్దానము జ్ఞప్తికి వచ్చినది. ఇప్పుడు దానినే మీకు చెప్పబోవుచున్నాను. కాకాసాహెబు దీక్షత్, నానాసాహెబు చాందోర్కరులతో నేనెక్కువ స్నేహముతో నుంటిని. వారు నన్ను శిరిడి పోయి బాబా దర్శనము చేయుమని బలవంతము చేసిరి. అట్లే చేసెదనని వారికి నేను వాగ్దానము చేసితిని. ఈ మధ్యలోనేదో జరిగినది. అది నా శిరిడి ప్రయాణమున కడ్డుపడినది. లోనావాలాలో నున్న నా స్నేహితుని కొడుకు జబ్బుపడెను. నా స్నేహితుడు మందులు, మంత్రములన్నియు నుపయోగంచెను గాని నిష్పలమయ్యెను. జబ్బు తగ్గలేదు. తుదకు వాని గురువును పిలిపించుకొని ప్రక్కన కూర్చుండబెట్టుకొనెను. కాని ప్రయెజనము లేకుండెను. ఈ సంగతి విని, "నా స్నేహితుని కుమారుని రక్షంచలేనట్టి గురువు యెక్క ప్రయెజనమేమి? గురువు మనకు ఏమియు సహయము చేయలేనప్పుడు నేను శిరిడి యేల పోవలెను?" అని భావించి, శిరిడీ ప్రయాణము మానుకొంటిని. కాని కానున్నది కాకమానదు. అది యీ క్రింది విధముగా జరిగెను.
నానాసాహెబు చాందోర్కర్ ప్రాంతీయ రెవెన్యూ అధికారి. ఉద్యోగరీత్యా యొకనాడాయన వసయీకి పర్యటనకై పోవుచుండెను. ఠాణా నుండి దాదరుకు వచ్చి యచ్చట వసయీ పోవు బండికొరకు కనిపెట్టుకొని యుండెను. ఈ లోగా బాంద్రా లోకల్ బండి వచ్చెను. దానిలో కూర్చొని బాంద్రా వచ్చి, నన్ను పిలిపించి శిరిడీ ప్రయాణమును వాయిదా వేసినందులకు నాపై కోపించెను. నాకు సంతోషదాయకముగను సమ్మతముగాను ఉండను. అందుచే నా రాత్రియే శిరిడీకి పోవ నిశ్చయించితిని. సామానులు కట్టుకొని శిరిడే బయలుదేరితిని. బాంద్రా నుండి దాదరు వెళ్ళి, అచ్చట మన్మాడ్ వెళ్ళు రైలు ఎక్కవలెనని అనుకొంటిని. అటులనే దాదరుసు టిక్కట్టు కొని, రైలు రాగానే ఎక్కి కూర్చొంటిని. బండి ఇక బయలు దేరుననగా, మహమ్మదీయుడొకడు నేను కూర్చోనిన పెట్టెలోనికి హడావిడిగా వచ్చి, నా సరంజామానంతయు జూచి, యెక్కడకు పోవుచుంటివని నన్ను ప్రశ్నించెను. నా యాలోచన వారికి చెప్పితిని. వెంటనే అతడు దాదరు స్టేషనులో దిగవద్దునీ, ఎందుకనగా మన్మాడుమెయిలు దాదరులో అగదనీ, అదే రైలులో ఇంకనూ ముందుకుబోయి బోరీబందరు స్టేషనులో దిగమని నాకు సలహ చెప్పెను. ఈ చిన్న లీలయే జరుగకుండినచో నేననుకొనెన ప్రకారము అ మరుసటి ఉదయము శిరిడీ చేరలేకపోయెడివాడను. అనేక సందేహములు కూడ కలిగి యుండెడివి. కాని నా యదృష్టవశాత్తు యది యట్లు జరుగలేదు. మరుసటి దినము సుమారు 9-10 గంటలలోగా నేను శిరిడీ చేరితిని. శిరిడీలో నా కొరకు కాకాసాహెబు దీక్షిత్ కనిపెట్టుకొని యుండెను.
ఇది 1910 ప్రాంతములో జరిగినది. అప్పటికి సాఠేవాడా యొక్కటియే శిరిడీ వచ్చు భక్తుల కోరకు నిర్మింపబడి యుండెను. టాంగా దిగిన వెంటనే బాబా దర్శించవలెనని నాకు అత్రము కలిగెను. అంతలో, అప్పుడే మసీదునుండి వచ్చుచున్న తాత్యాసాహెబు నూల్కరు, బాబా వాడాచివరన ఉన్నారనియూ, మొట్టమొదట ధూళిదర్శనము చేకుకొనమని నాకు సలహ యిచ్చెను. స్నాననంతరము ఓపికగా మరల చూడవచ్చుననెను. ఇది వినిన తోటనే నేను పోయి బాబా పాదములకు సాష్టాంగనమస్కారము చేసితిని. నాలో అనందము పొంగిపొరలినది. నానాసాహెబు చాందొర్కరు చెప్పినదానికన్ననూ ఎన్నోరెట్లు అనుభవమైనది. నా సర్వేంద్రియములు తృప్తిచెంది యాకలి దప్పికలు మరచితిని. మనస్సు సంతుష్టి కలిగెను. బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితములో గొప్ప మార్పు కలిగెను. నాకు శిరిడీ పోవలసినదని ప్రోత్సహించిన వారందరికి నేనెంత ఋణపడినట్లుగా భావించితిని. వారిని నా నిజమైన స్నేహితులుగా భావించితిని. వారి ఋణమును నేను తీర్చుకొనలేను, వారిని జ్ఞప్తికి దెచ్చుకొని, వారికి నా మనస్సులో సాష్టాంగప్రణామము చేసితిని. నాకు తెలిసినంతవరకు సాయిబాబా దర్శనము వల్ల కలుగు చిత్రమేమన మనలోనున్న యాలోచనలు మారిపోవును. వెనుకటికర్మల బలము తగ్గును. క్రమమగా ప్రపంచమందు విరక్తి కలుగును. నా పూర్వజన్మ సుకృతముచే నాకీ దర్శనము లభించినదనుకొంటిని. సాయిబాబాను చూచినంత మాత్రముననే నీ ప్రపంచమంతయు సాయిబాబా రూపము వహించెను.
తీవ్ర వాగ్వివాదము:
నేను శిరిడీ చేరిన మెదటి దినముననే నాకును బాలాసాహెబు భాటేకును గురువు యెక్క యావశ్యకతను గూర్చి గొప్ప వాగ్విఅవాదము జరిగెను. మన స్వేచ్చను విడిచి యింకొకరికి ఎందుకు లొంగియుండవలెనని నేను వాదించితిని. "మన కర్మలను మనమే చేయుటకు గురువు యెక్క యావశ్యకత ఏమి? తనంతట తానే కృషి చేసి, మిక్కిలి యత్నముతో యీ జన్మదుఃఖము నుండి తప్పించుకొనవలెను. ఏమియు చేయక సోమరిగా కూర్చొనువానికి గురువేమి చేయగలడు?" అని నేను స్వేచ్చపక్షమును అశ్రయించితిని. భాటే యింకొక వాదమును బట్టుకొని, ప్రారబ్ధము తరపున వాదించుచు, "కానున్నది కాక మానదు. మహనీయులు కూడ నీ విషయములో నోడిపోయిరి. మనుజుడొకటి తలంచిన భగవంతుడు వేరొకటి తలంచును. నీ తెలివితేటలను అటుండానిమ్ము. గర్వముగాని యహంకారము కాని మీకు తోడ్పడవు" అనెను. ఈ వాదన యొక గంట వరకు జరిగెను. కాని యిదమిత్థమని యేమియూతేలలేదు. అలసిపోవుటచే ఘర్షణ మానుకొంటిమి. ఈ ఘర్షణవల్ల నా మనఃశ్శాంతి తప్పినది. దేహాత్మబుద్ది, అహంకారము లేకున్నచో వివాదమునకు తావు లేదని గ్రహించితిని. వేయేల, వివాదమునకు మూలకారణము మహంకారము.
ఇతరలతో కూడ మేము మసీదునకు పోగా, బాబా కాకాను బిలిచి యిట్లడిగెను: "వాడాలో నేమి జరిగినది? ఏమిటా వివాదము? అది దేనిని గూర్చి? ఈ హేమడ్‍పంతు ఏమనుచున్నాడు?"
ఈ మాటలు విని నేను అశ్చర్యపడితిని. సాఠేవాడా మసీదునకు చాలా దూరముగా నున్నది. మా వివాదముగూర్చి బాబాకెట్లు తెలిసెను? అతడు సర్వజ్ఞడై యుండవలెను. లేనిచో మావాదన నెట్లు గ్రహించును? బాబా మన యంతరాత్మపై నధికారియై యుండవచ్చును.
హేమడ్‍పంతు అను బిరుదునకు మూలకారణము
సాయిబాబా నన్నెందులకు ’హేమడ్‍పంతు’ని పిలిచెనని అలోచింపసాగితిని? ఇది ’హేమద్రిపంతు’ అను నామమునకు రూపాంతరము. దేవగిరికి చెందిన యాదవవంశ రాజులకు హేమద్రిపంతు ప్రధానామాత్యుడు. అతడు గొప్ప పండితుడు, మంచి స్వభావము గలవాడు. చతుర్వర్గ చింతామణి, రాజ ప్రశస్తియను గొప్ప గ్రంథములను రచించినవాడు; మోడి భాషను, ఒక నూతన గణిత విధానమును కని పెట్టినవాడు. ఇక నేనా? వానికి వ్యతిరేకబుద్ది గలవాడను, మేధాశక్తి యంతగా లేని వాడను. మరి, సాయిబాబా నాకెందుకీ ’బిరుదు’ నొసంగిరో తెలియకుండెను. అలోచన చేయగా నిది నా యహంకారమును చంపుటకొక యమ్మనియు, నేనెప్పుడును అణుకువ నమ్రతలు కలిగి యుండవలెనని బాబా కోరికయయి యుండవచ్చుననియు గ్రహించితిని. అంతకుముందు వాడాలో జరిగిన చర్చలో నే చూపిన తెలివితేటలను బాబా యీ రీతిగా అభినందించియుండవచ్చని యనుకొంటిని.
భవిష్యచ్చరితము బట్టి చూడగా బాబా పలుకులకు (దాభోళ్కరును "హేమాడ్‍పంతు" అనుట) గోప్ప ప్రాముఖ్యము కలదనియు, భవిష్యత్తు తెలిసియే బాబా యట్లనెననియు భావించవచ్చును. ఏలయనగా హేమడ్‍పంతు శ్రీసాయిబాబా సంస్థానమును చక్కని చాకచక్యముతో నడిపెను. సంస్థానము యొక్క లెక్కలను బాగుగ నుంచెను. అదేకాక భక్తి, జ్ఞానము, నిర్వ్యామెహము, అత్మశరణాగతి, అత్మసాక్షాత్కారము మొదలగు విషయములతో శ్రీసాయి సచ్చరిత్ర యను గొప్ప గ్రంథము రచించెను.
గురువు యెక్క యావశ్యకత
ఈ విషయమై బాబా యేమనెనో హేమాడ్‍పంతు వ్రాసియుండ లేదు. కానీ, కాకాసాహెబు దీక్షిత్ ఈ విషయమును గూర్చి తాను వ్రాసికొనిన దానిని ప్రచురించును. హేమాడ్‍పంతు బాబాను కలిసిన రెండవ దినము కాకాసాహెబు దీక్షీత్ బాబావద్దకు వచ్చి "శిరిడి నుండి వెళ్ళ వచ్చునా" యని యడిగెను. బాబా యట్లేయని జవాబిచ్చెను. "ఎక్కడకు" అని ఎవరో యడుగగా, "చాలా పైకి" అని బాబా చెప్పెను. "మార్గమేది" యని దీక్షిత్ యడిగెను. "అక్కడకు పోవుటకు అనేక మార్గములు కలవు. శిరిడి నుంచి కూడ నొక మార్గము కలదు. మార్గము ప్రయాసకరమైనది. మార్గమధ్యమున నున్న యడవిలో పులులు, తోడేళ్ళ కలవని" బాబా బదులిడెను. "మార్గదర్శకుని వెంటదీసికొని పోయినచో" నని కాకాసాహెబు యడుగగా, "అట్లయినచో కష్టమే లేద’ని బాబా జవాబిచ్చెను. మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానము చేర్చును. మార్గమధ్యమున నున్న తోడే
ళ్ళు, పులులు, గోతులనుండి తప్పించును. మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములచే చంపబడవచ్చును. లేదా దారి తప్పి గుంటలలో పడిపోవచ్చుననెను. మశీదులో అప్పుడచ్చటనే యున్న దాభోళ్కరు తన ప్రశ్న కదియే తగిన సమాధానమని గుర్తించెను. వేదాంత విషయములలో మానవుడు స్వేచ్చాపరుడా కాడా? యను వివాదము వలన ప్రయోజనము లేదని గ్రహించెను. పరమార్దము నిజముగా గురుబోధలవల్లనే చిక్కుననియు, రామకృష్ణులు తమ గురువులైన వసిష్ఠసాందీపులకు లొంగి యణకువతో నుండి యాత్మసాక్షాత్కారము పొందిరనియు, దానికి దృఢమైన నమ్మకము (నిష్ఠ), ఓపిక (సబూరీ) యను రెండు గుణములు ఆవశ్యకమనియు గ్రహించెను.

 శ్రీ సాయినాథాయ నమః రెండవ అధ్యయము సంపూర్ణము

సమర్ద సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు
శుభం భవతు

Saturday 30 July 2016

తెలంగాణా సంప్రదాయ పండుగ బోనాలు ...

తెలంగాణా సంప్రదాయ పండుగ బోనాలు ...
Information about hindu festival bonalu. bonalu news, bonalu festival celebrations, bonalu festival 2013.


బోనాల పండుగ అనగానే తెలంగాణ ప్రాంత ప్రజల మనస్సులు పులకరిస్తాయి. పురాణగాధలు, చారిత్రక సంఘటనలతో సంబంధం లేకుండా ఆయా ప్రాంతాల ప్రజలు బంధుమిత్రుల కుటుంబాలతో కలిసి మెలిసి ఈ పండుగ జరుపుకుంటారు. గ్రామీణ వాతావరణంలో నివసించే కుటుంబాల్లో బంధాలను, అను బంధాలను పెంపొందించే వారిధి బోనాలు. భాగ్య నగరవాసుల ప్రత్యేక పండుగగా ఇది సుప్రసిద్ధం. బోనాలు మహాకాళిని పూజించే హిందువుల పండుగ. ఈ పండుగ ప్రధానంగా తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకోబడుతుంది. సాధారణంగా జూలై లేక ఆగష్టులో వచ్చే ఆషాఢమాసంలో ఈ పండుగ జరుపుకుంటారు.  నగరంలో ఆషాడమాసంలో జరిగే బోనాలు గ్రామాల్లో శ్రావణమాసంలో జరుగుతాయి. గ్రామాల్లో కులవృత్తుల సంప్రదాయం ప్రకారం బోనాల వేడుకలను భారీ ఎత్తున నిర్వహిస్తారు. పండుగ మొదటి మరియు చివరి రోజులలో ఎల్లమ్మదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు.

Information about hindu festival bonalu. bonalu news, bonalu festival celebrations, bonalu festival 2013.

బోనం అంటే  నైవేద్యం. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో తమ తలపై పెట్టుకుని, డప్పుగాళ్ళు, ఆటగాళ్ళు తోడ్కొని రాగా దేవిగుడికి వెళ్తారు. మహిళలు తీసుకెళ్ళే ఈ బోనాల కుండలను చిన్న వేపరెమ్మలతో, పసుపు, కుంకుమ లేక కడి (తెల్ల ముగ్గు)తో అలంకరించి, దానిపై ఒక దీపం ఉంచడం జరుగుతుంది. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ మొదలైన పేర్లు కల ఈ దేవిగుళ్ళను దేదీప్యమానంగా అలంకరిస్తారు. 

Information about hindu festival bonalu. bonalu news, bonalu festival celebrations, bonalu festival 2013.

ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం; అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనేగాక, ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్టశక్తులను పారద్రోలటానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలి ఇచ్చేవారు. నేడు దున్నపోతులకు బదులు కోడి పుంజులను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది. పూనకం పట్టిన కొందరు స్త్రీలు తలపై బోనం మోస్తూ డప్పుగాళ్ళ లయబద్ధమైన మోతలకు అనుగుణంగా దేవిని స్మరిస్తూ నర్తిస్తారు. బోనాలను మోసుకెళ్తున్న మహిళలను దేవీ అమ్మవారు ఆవహిస్తారని విశ్వాసము;

Information about hindu festival bonalu. bonalu news, bonalu festival celebrations, bonalu festival 2013.

మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది కావున ఆమెను శాంతపరచడానికై ఈ మహిళలు ఆలయమును సమీపించు సమయములో వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్ళు కుమ్మరిస్తారు. తమ భక్తికి చిహ్నంగా ప్రతి భక్తబృందమూ ఒక తొట్టెలను (కాగితమూ, కర్రలతో కూర్చబడిన చిన్న రంగుల పరికరము) సమర్పించడం ఆచారంగా ఉంది. బోనాలు పండుగ దేవికి నైవేద్యము సమర్పించు పండుగ కావడం చేత, ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు అతిథులతో పాటు స్వీకరిస్తారు. నివేదనానంతరం మాంసాహార విందు భోజనం మొదలౌతుంది. పండుగ జరిగే ప్రాంతాలలో వేపాకులతో అలంకరించబడిన వీధులు దర్శనమిస్తాయి. జానపద శైలిలో ఉండే అమ్మవారి కీర్తనలతో నిండిన మైకుసెట్ల హోరులో పండుగ వాతావణం విస్పష్టంగా ప్రస్ఫుటమౌతుంది.
పోతురాజు

Information about hindu festival bonalu. bonalu news, bonalu festival celebrations, bonalu festival 2013.

దేవీ అమ్మవారి సోదరుడైన పోతురాజును ప్రతిబింబించే ఒక మనిషి చేత పండుగ సమూహాన్ని నడిపించడం ఇంకొక ఆనవాయితీ. పోతురాజు పాత్రను పోషించే వ్యక్తి స్ఫురద్రూపిగా బలశాలిగా ఉంటాడు; ఒంటిపై పసుపు, నుదుటిపై కుంకుమ, కాలికి గజ్జెలు కలిగి, చిన్న ఎర్రని ధోతీని ధరించి డప్పువాయిద్యానికి అనుగుణంగా ఆడతాడు. అతను భక్త సమూహము ముందు ఫలహారం బండి వద్ద నాట్యం చేస్తాడు. అతను పుజాకార్యక్రమాల ఆరంభకుడిగా, భక్త సమూహానికి రక్షకుడిగా భావించబడాతాడు. కొరడాతో బాదుకొంటూ, వేపాకులను నడుముకు చుట్టుకుని, అమ్మవారి పూనకములో ఉన్న భక్తురాళ్ళను ఆలయములోని అమ్మవారి సమక్షానికి తీసుకెళతాడు
రంగం

Information about hindu festival bonalu. bonalu news, bonalu festival celebrations, bonalu festival 2013.

రంగం పండుగ రెండవ రోజు ఉదయం జరుగుతుంది. ఈ రంగం కార్యక్రమంలో పోతరాజు వేషం వేసిన వ్యక్తికి పూనకం వస్తుంది. ఆ వికృతమైన కొపాన్ని తగ్గించెందుకు అక్కడవున్న భక్తులు కొమ్ములు తిరిగిన మేకపోతును అందిస్తారు. పొతరాజు తన దంతాలతో ఆ మేకపోతును కొరికి, తల, మొండెం వేరు చేసి పైకి ఎగురవేస్తాడు. ఈ కార్యక్రమం జాతర ఊరేగింపు తరువాత జరుగుతుంది. బోనం అంటే భోజనం. జానపదులు తమకు ఇష్టమైన గ్రామదేవతలకు సమర్పించే నైవేద్యం. దీన్ని కొత్తకుండలో వండి ప్రదర్శనగా వెళ్లి గ్రామదేవతలకు భక్తిప్రపత్తులతో సమర్పిస్తారు. చిన్నముంతలో పానకం పోస్తారు. దానిపై దివ్వె పెట్టి బోనంజ్యోతి వెలిగించి జాతర కన్నుల పండువగా నిర్వహిస్తారు. వేటపోతు మెడలో వేపమండలుకట్టి వ్యాధినిరోధకశక్తిని పెంచే పసుపు కలిపిన నీరు, వేపాకుల్ని చల్లుకుంటూ భక్తులు ఊరేగింపుగా గ్రామదేవతల ఆలయాలకు తరలివెళ్లి బోనాలు సమర్పిస్తారు. ఇలా బోనాల సమర్పణ వల్ల దేవతలు శాంతించి అంటువ్యాధులు రాకుండా కాపాడుతారని ప్రజల విశ్వాసం.
ఘటం

Information about hindu festival bonalu. bonalu news, bonalu festival celebrations, bonalu festival 2013.

అమ్మవారి ఆకారములో అలంకరింపబడిన రాగి కలశాన్ని ఘటం అని సంబోధిస్తారు. సాంప్రదాయక వస్త్రధారణ, ఒంటిపై పసుపు కలిగిన పూజారి ఈ ఘటాన్ని మోస్తాడు. పండుగ మొదటి రోజు నుండి, చివరి రోజు నిమజ్జనం దాకా ఈ ఘటాన్ని డప్పుల మేళవాద్యాల నడుమ ఊరేగిస్తారు. ఘటం ఉత్సవం రంగం తర్వాత జరుగుతుంది.
హైద్రాబదులో బోనాలు.

Information about hindu festival bonalu. bonalu news, bonalu festival celebrations, bonalu festival 2013.

కులీకుతుబ్‌ షాల కాలంలో ప్రారంభమైన బోనాలు ప్రతి సంవత్సరం రాజదానిలో సుమారు నెలరోజుల పాటు వైభవోపేతంగా జరుగుతుంది. గోల్కొండ ఖిల్లాలోని జగదాంబికా ఆలయంలో జరిగే బోనాలకు అయిదు వందల ఏళ్ల, సికింద్రాబాద్‌ లోని ఉజ్జయిని మహంకాళి బోనాలకు సుమారు రెండువందల ఏళ్ల చరిత్ర ఉంది. అలాగే నిజాం నవాబుల ప్రార్ధనలతో ప్రాశస్త్యం పొందిన లాల్‌దర్వాజా సింహవాహిని మాతా మహంకాళి ఆలయంలో శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. హైద్రాబదులో బోనాల పండుగ సందోహం గోల్కొండ కోటలోని గోల్కొండ మహంకాళి ఆలయం వద్ద మొదలయ్యి లష్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయము, బల్కంపేట్ లోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా ఓల్డ్‌సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది.

Information about hindu festival bonalu. bonalu news, bonalu festival celebrations, bonalu festival 2013.

హరిబౌలిలోని అక్కన్న, మాదన్న దేవాలయము వారి ఘటముతో ఏనుగు అంబారీపై, అశ్వాల మధ్య, అక్కన్న, మాదన్నల బొమ్మల నడుమ ఊరేగింపు మొదలయ్యి సాయంత్రానికి కన్నుల పండుగగా నయాపుల్ వద్ద ఘటముల నిమజ్జనతో ముగుస్తుంది.అక్కన్న-మాదన్న మాతా మహంకాళి ఆలయంగా సుప్రసిద్ధమైన హరిబౌలి ఆలయంలో బోనాల రోజున రాష్ట్రప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టుచీరను కానుకగా సమర్పించే సంప్రదాయం కొనసాగుతున్నది. లాల్‌దర్వాజా నుండి నయాపుల్ వరకు వీధుల వెంబడి వేలాదిమంది ప్రజలు నిలుచుని రంగ రంగ వైభవంగా అలంకరించబడిన ఘటాలను చూస్తారు. పోతురాజుతో పాటు, వివిధ పౌరాణిక వేషధారణలలో ఉన్న కుర్రవాళ్ళు తమదైన రీతిలో జానపదగీతాలు, వాయిద్యాల మధ్య నృత్యం చేస్తారు.

Information about hindu festival bonalu. bonalu news, bonalu festival celebrations, bonalu festival 2013.

ఓల్డ్‌సిటీలో జరిగే ఘటాల ఊరేగింపులో హరిబౌలి అక్కన్న, మాదన్న, లాల్‌దర్వాజా, ఉప్పుగూడ, మిరాలంమండీ, కాసరట్టలలోని మహంకాళి ఆలయాలు, సుల్తాన్‌షాహీలోని జగదాంబాలయం, షాలిబండ, అలీజా కోట్లా, గౌలీపురా మరియు సుల్తాన్‌షాహీలోని బంగారు మైసమ్మ దేవాలయాలు, ఆలియాబాదులోని దర్బారు మైసమ్మ మందిరం మరియు చందూలాల్ బేలాలోని ముత్యాలమ్మ గుడి పాల్గొంటాయి.


తెలంగాణ జనజీవన ప్రతీక ‘బోనాలు’

 
, ,
బహుశా ప్రపంచంలో ఏ పండుగా నెలరోజుల పాటు జరుగదు. కాని తెలంగాణ బోనాలు మాత్రం ఆషాఢమాసం నుంచి శ్రావణం చివరిదాక జరుపుకుంటరు. తెలంగాణ పండుగలు రెండూ గ్రామీణ జీవన నేపథ్యం కావడం విశేషం. ఒకటి బోనాలు (ఆషాడం) రెండు బతుకమ్మ (ఆశ్వీయుజ మాసం). బోనం అంటే భోజనం. అమ్మతల్లికి పెట్టే నైవేధ్యం (భోజనం). బువ్వ; ఇది అత్యంత భక్తిశ్రద్ధలతో, ఊరేగింపుగా ఊరుమ్మడిగా కలసి వెళ్లి ఊరి బయట గల గ్రామ దేవతలకు సమర్పించేది.
మానవులు నాగరికత నేర్చి, గ్రంథాలు రచించిన కాలంలోనే, అత్యంత ప్రాచీన దశలో ఆదిమ మానవులు, దైవభావనకు అంతర్గత రూపమిచ్చారు. అది నిరాకార భావన. అందుకే గ్రామ దేవతలకు విగ్రహాలు ఉండవు. గుళ్లుండవు. అదిమానవులు వర్షం వచ్చినా, ఉరిమినా, మెరిసినా బయపడేవారు. భయం భక్తికి మూలం; కాబట్టి భయంతో ప్రారంభమైన ఆరాధన భక్తిగా నిలిచింది. అందువల్ల ‘అమ్మలా’ ఆపదల నుండి గట్టెక్కించేదెవరని ఆలోచించారు. తమను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడే ‘అమ్మ’నే తొలిదైవం చేశారు. అందువల్లే గ్రామదేవతలంతా తల్లి దేవతలే. అయితే, అమ్మకు మాత్రం ఆకలి దప్పులుండవా! అందువల్ల ఆమెను కన్న కొడుకుల్లా, కడుపులో పుట్టిన సంతానం కనిపెట్టుకొని, కడుపు నిండా పెట్టాలి కదా, కాబట్టి ‘బోనాలు’ పండుగ పేర ప్రతి ఆషాడంలో అమ్మతల్లికి జాతరలు జరుపు కుంటారు. మరి ఆషాడ మాసమే ఎందుకంటే, వర్షాలు కురిసి వ్యాధులు విజృంభిస్తాయి. మరోవైపు గ్రామీణులు ఎవుసం మొదలు పెట్టేది ఇప్పుడే. అందుకే, ‘తమ పిల్లా పాపా గోడు గోదా, పాడి పంట, చల్లగా కాపాడుతల్లీ’ అంటూ మొక్కులు తీర్చుకుంటారు.
తెలంగాణ ఆత్మ, అంతరాత్మ ఎంత చల్లనిదో, ఎంత ఆత్మీయత కలదో, ఈ పండుగ నిరూపిస్తుంది. ఎక్కడ ఉన్నా, కుటుంబమంతా ఈ పండుగ వేళ ఒక్కటవుతారు. కలసి మురిసి పండుగ చేసుకుంటారు. ఊరంతా ఉమ్మడిగా ఊరేగింపుగా సాగుతారు. పల్లెంతా పండుగ వాతావరణం నెలకొంటుంది. మరో విధంగా చెప్పాలంటే, పట్నం మురువని పండుగ ఇదే. నేటికి జరుగుతున్న లష్కర్‌ బోనాలే ఇందుకు మంచి ఉదాహరణ. పెద్దమ్మ తల్లి దేవాలయాలే అందుకు ప్రత్యక్ష నిదర్శనాలు. పల్లె జీవులు ఎంత నిబద్ధత కలిగిన వారో దీనివల్ల తెలుస్తుంది. బడుగుజీవుల కాలనీల్లో తప్పక ‘అమ్మతల్లుల’ దేవాలయాలు కనిపిస్తాయి. ఇది ఆధునిక చింతనలో ఒక భాగం అని చెప్పాలి.
జానపద దేవతలైన గ్రామ దేవతలకు గుళ్లు – గోపురాలు ఉండవు. తమకు నీడనిచ్చే చేట్టే అమ్మకు నీడనిస్తుంది. ఆమెను ఆమే కాపాడుకుంటుంది. ‘రక్షణ! ఎందుకు’? అనుకుంటరు. వేయిగండ్ల తల్లి పోచవ్వ తల్లి అని భావిస్తారు.
గ్రామదేవతలు, ఏడుగురు; స్త్రీ మూర్తులు. ప్రపంచమంతా స్త్రీ మూర్తుల ఆరాధన ఉంది. మెక్సికోలో ధాన్యదేవత, బొంగా దీవులలో ‘అలో అలో’ దేవి, గ్రీసులో ‘డెమిటర్‌’, రోమనులు ‘పెరిన్‌’ అనే పంట దేవతలను పూజిస్తారు.
స్త్రీ సంరక్షకురాలు మాత్రమే కాదు, మానవుల అతి ముఖ్యావసరం ‘అన్నం’ (ఆహారం) కనిపెట్టింది కూడా స్త్రీ. ఆదిమ మానవుల కాలంలో మగవారు వేటకు వెళ్లగా ఆడవాళ్లు ఇంటిపట్టున ఉండి వర్షానికి మొలకెత్తిన ధాన్యాన్ని చూశారు. తాము అదే విధంగా విత్తనాన్ని వేస్తే ఫలిస్తుందని భావించిన సృజనాత్మకత వారిది. అందుల్ల తొలుత వ్యవసాయం కని పెట్టింది స్త్రీలే అనాలి. మగవాళ్లలో స్త్రీ మూర్తి ఆరాధనాభావానికి ఇదో కారణం. రెండోది, సంతానాన్ని అందించి, సంరక్షించేది స్త్రీలే కాబట్టి వారు పూజ్యనీయులయ్యారు.
8-7-2016 News.p65‘ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలుంటారు’ అంటారు మనువు. కానీ, జానపదులు స్త్రీలను దేవతలుగా తలచి, కొలచి ఆరాధించారు. వాళ్ల దృష్టిలో వారే దేవతలు. ఒక్కొక్క ఆపదకు, ఒక్కో దేవత, ఒక్కొక్క విషయానికి ఒక్కో దేవతను ఆరాధించారు. ఈ విధంగా తెలుగునాట లెక్కకు మిక్కిలి గ్రామ దేవతలున్నారు. తెలంగాణలో చాలా చోట్ల పోచమ్మ, మైసమ్మ, బాలమ్మ, ఎల్లమ్మ దేవతల ఆరాధన చాలాచోట్ల కనిపిస్తుంది. వీరు ఏడుగురు అక్కచెల్లెండ్లుగా, వీరికి తోడు పోతురాజు తమ్ముడని గాథ. ‘పోచమ్మ, మైసమ్మ, బాలమ్మ, ఎల్లమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ, పెద్దమ్మ’. తరువాత వైదిక కాలంలో వీరే ‘సప్తమాతృక -రూపాలకు మూలమయ్యారని భావించాలి.
ఆరాధ్య విధులు.. ఈ దేవత ఆరాధనలో ముఖ్యమైన విషయాలు గమనించాలి. ఇవి ప్రత్యేకతలు కూడా.
ఈ దేవతలకు గుళ్లుండవు. ఊరి చివర, వేపచెట్టు మొదట్లో రెండు పక్కల పొడుగైన రాయి నిలబెట్టి పైన ఓ రాయి బోర్లిస్తారు. గూడులా ఉండే దీనిలో, ఎదురుగా ఉన్న రాయికి సున్నం పూసి, పసుపు కుంకుమ బొట్లు పెడ్తారు. ఇదే గ్రామ దేవతకు ప్రతీక.
ఈ దేవతలకు పూజారులు బలహీన, బడుగువర్గాల వారే. స్వయంగా పూజలు చేసుకుంటారు . చాకళ్లు, పంబాల వాల్లు చాలాచోట్ల ఆరాధన విధులు నిర్వహిస్తారు. ఈ దేవతలకు జాతరలు జరిపి, బోనం పెట్టాలి. కాబట్టి ‘బోనాల’ జాతర, ‘కల్లుపాక’ పోస్తారు.
దేవతలు ఆగ్రహిస్తే మశూచి, కలరా వస్తాయి. వీటిని పోచమ్మ వచ్చుడు, గత్తర వచ్చుడు అంటారు. అందుకు వాటి నివారణకు కొలువులు నిర్వహిస్తారు. దేవతలకు మద్యం, మాంసం ఇష్టమైనవి. అందువల్ల జంతుబలి అనివార్యం అంటారు. అయితే, తాము ఇష్టపడేవే దేవతలు ఇష్టపడతారని జానపదుల నమ్మకం. ఈ దేవతలలో ప్రత్యేకంగా కొందరు దేవత లుంటారు. పశువులను కాపాడే దేవత ‘మైసమ్మ’. బాలలను కాపాడే దేవత ‘బాలమ్మ’. చెరువుకట్టలు కాపాడే దేవత ‘కట్టమైసమ్మ’. అయితే, ఈ దేవతలకు లెక్కకు మించి తలలు, చేతులు ఉండవు, అసలు ఆకారమే ఉండదు. నిరాకార చింతనకు ప్రతిరూపం గ్రామదేవత. ఈ దేవతల ఆరాధన ప్రజల విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. ఎవరిళ్ళలోనైనా శుభకార్యం జరిగితే, వాల్లు ‘పోచమ్మలు చేసుడు’ అని ఆరాధిస్తారు. ఊరుమ్మడి సమస్యలు కలరా, పశువులు చావడం వంటివి వచ్చినప్పుడు గాని, అవి రాకుండా నివారణకు గాని, ఊరుమ్మడిగా బోనాలు, పోచమ్మలకు చేసుడు, పండుగగా చేసుకుంటారు. పండుగ ఒక్కరోజుకే పరిమితం కాదు. ఆషాఢమాసంలో, గురు, ఆదివారాల్లో, ఈ పండుగ నెలంతా జరుగుతుంది. ఒక్కచోట, ఒక్కోరోజు జరగడం విశేషం.
 
 
 31-7-2016

ఇవాళ జంట నగరాలలో బోనాలు సమర్పించే ఆలయాల గురించి చెప్తానన్నానుకదా. బోనాల సమర్పణకి కూడా కొన్ని నియమాలున్నాయి. ఈ బోనాలు ముందుగా గోల్కొండ కోటలోని జగదంబా మహాకాళి ఆలయంలోని అమ్మవారికి సమర్పిస్తారు. తర్వాతే మిగతా ఆలయాలలో. అందుకనే ముందుగా ఆ ఆలయం గురించి తెలుసుకుందాము.  
జగదంబా మహాకాళి ఆలయం, గోల్కొండ
ఈ ఆలయం 900 సంవత్సరాల క్రితం నుంచీ వున్నది. అంటే గోల్కొండ కోట కట్టటానికన్నా ముందే ఈ ఆలయం వున్నది. పూర్వం ఈ కొండమీద గొల్లవారు పశువులను మేపుకోవటానికి వచ్చేవారు. వాళ్లు కనుగొన్న ఆలయం ఇదని ఒక కధనం వున్నది. ఇంకొక కధనం ప్రకారం కాకతీయ రాజు ప్రతాప రుద్రుడు ఈ కొండమీద మట్టికోట కట్టించేటప్పుడు అక్కడ అమ్మవారిని పూజించి బోనాల పండగ చేశారు. ఈ మట్టికోట గొల్లవాళ్ళు పాలించేవారు. అప్పటినుంచీ దీనిని గొల్లకోట అనేవారనీ, అదే క్రమంగా గోల్కొండ అయిందంటారు. అప్పటినుంచీ ఇక్కడ బోనాల ఉత్సవం నిర్వహిస్తున్నారు. అందువల్లనే కాబోలు అతి పురాతనమైన ఈ ఆలయంలో ముందుగా బోనాల ఉత్సవం ప్రారంభమవుతుంది. హింతూ ముస్లిమ్ ల సమైక్యతకు చిహ్నంగా, నిజాం సమయంలో జరిగిన బోనాల ఉత్సవాలలో ముస్లింలు కూడా సోదర భావంతో పాల్గోనేవారు.
ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం బోనాల సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు లంగర్ హౌస్ చౌరస్తాలో ఆలయ కమిటీవారికి అందజేస్తారు. అలాగే ఈ ఆలయ కమిటీ తరఫున జంట నగరాలలోని సికిందరాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి, లాల్ దర్వాజా అమ్మవారికి, ఇంకా కొన్ని ఆలయాలలో అమ్మవార్లకు పట్టు వస్త్రాలు అందజేస్తారు. ప్రభుత్వ ప్రతినిధులు పట్టు వస్త్రాలు ఆలయ కమిటీకి అందజేసిన తర్వాత చుట్టు పక్కల ప్రాంతాలనుంచీ భక్తులు తీసుకు వచ్చిన తొట్టెల ఊరేగింపు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం ప్రారంభమయ్యే ఈ ఊరేగింపు రాత్రి వరకూ సాగుతుంది. గోల్కొండ ప్రాంతంలో వుండే ఆలయ పూజారిగారి ఇంటినుంచి అమ్మవారి విగ్రహాన్నికూడా ఊరేగింపుగా తీసుకు వెళ్తారు. ఈ ఉత్సవాలకు సమీపంలోవారేకాక చుట్టుపక్కల జిల్లాలనుంచి కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరవుతారు. అమ్మవారికి తొమ్మిది వారాలపాటు పూజలు నిర్వహిస్తారన్నానుకదా. ఈ తొమ్మిది వారాలలో 3వ వారం ఉజ్జయినీ మహంకాళి బోనాలు, ఐదవ వారం లాల్ దర్వాజా అమ్మవారి బోనాలతోబాటు అన్ని ప్రాంతాలలో కూడా ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
ఆలయం : ఇక్కడ చాలాకాలం ఎటువంటి షేడ్ లేకుండా వున్నది. ఇప్పుడు కూడా ఆలయం చిన్నదే. అయితే అనేక శతాబ్దాలనుండీ పూజలందుకుంటున్న తల్లి మహిమ మాత్రం అనంతమని ఆలయంలో బోనాలు సమర్పించే భక్తులను చూస్తే తెలుస్తుంది. ఈ ఆలయం కిందనుంచీ చార్మినార్ దాకా సొరంగ మార్గం వున్నదంటారు. ఇప్పుడు మూసేశారు.
బోనాలు: బోనాల ఉత్సవాలు ఈ ఆలయంలో ప్రారంభమవుతాయన్నానుకదా. ఇక్కడ 9 వారాలపాటు తొమ్మిది పూజలతో అమ్మవారిని కొలుస్తారు. అంటే దాదాపు 2 నెలల 15 రోజులు. ఈ సమయంలో ప్రతి గురువారం, ఆదివారం భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. తొమ్మిది వారాలు అమ్మవారికి పూజలు చేసిన తర్వాత తొమ్మిదవ వారంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఘటం ఉత్సవం రంగం తర్వాత జరుగుతుంది. హరిబౌలిలోని అక్కన్న మాదన్న దేవాలయము వారి ఘటముతో ఏనుగు అంబారీపై, అశ్వాల మధ్య, అక్కన్న, మాదన్నల బొమ్మల నడుమ ఊరేగింపు మొదలయ్యి సాయంత్రానికి నయాపుల్ వద్ద ఘటముల నిమజ్జనతో ముగుస్తుంది. లాల్‌దర్వాజా నుండి నయాపుల్ వరకు వీధుల వెంబడి వేలాదిమంది ప్రజలు నిలుచుని అత్యంత సుందరంగా అలంకరించబడిన ఘటాలను చూస్తారు. పోతురాజుతో పాటు, వివిధ పౌరాణిక వేషధారణలలో ఉన్న కుర్రాళ్ళు జానపదగీతాలు, వాయిద్యాల నడుమ నృత్యం చేస్తారు. పాత నగరంలో జరిగే ఘటాల ఊరేగింపులో పరిసర ప్రాంతాలలోని ఆలయాలవారంతా పాల్గొంటారు
ఉజ్జయిని మహంకాళి ఆలయం, సికిందరాబాద్
సికిందరాబాద్ లో జనరల్ బజారులో కిక్కిరిసిన దుకాణాల మధ్య వున్నది ఈ ఆలయం. మొదట్లో ఇక్కడ ఆలయం మాత్రమే వుండేది. తర్వాత తర్వాత జనావాసాలు పెరిగాయి. ఈ ఆలయం వెనుక ఒక చిన్న కధ వున్నది. క్రీ.శ. 1813 లో సురిటి అప్పయ్య అనే ఆయన మిలటరీలో పని చేస్తూ ఈ ప్రాంతాల్లో వుండేవారు. ఆయనకి ఉజ్జయినీ బదిలీ అయితే అక్కడికి వెళ్ళారు. ఒకసారి అక్కడ కలరా వ్యాధి తీవ్రంగా ప్రబలి, చాలామంది చనిపోసాగారు. అప్పుడు అప్పయ్యగారు ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వెళ్ళి ఆ తల్లికి మొక్కుకున్నారు. కలరా తగ్గిస్తే తన స్వంత ఊరులో అమ్మవారికి ఆలయం నిర్మిస్తానని. కలరా తగ్గింది. రెండు ఏళ్ళ తర్వాత స్వస్ధలానికి వచ్చిన అప్పయ్యగారు దారుతో అమ్మవారి విగ్రహాన్ని చేయించి ఒక వేప చెట్టు కింద వుంచి పూజించసాగారు. తర్వాత చిన్న ఆలయం... ఆ తర్వాత ఆలయం విస్తీర్ణం చేసే సందర్భంలో తూర్పువైపు వున్న బావిని మరమ్మత్తు చేయిస్తుంటే బావిలో మాణిక్యాంబ విగ్రహం దొరికింది. అమ్మవారి ఆనతి ప్రకారం అమ్మవారి విగ్రహం పక్కనే మాణిక్యాంబ విగ్రహాన్ని ప్రతిష్టించారు. క్రీ.శ. 1864 సం. లో శ్రీ సురటి అప్పయ్యగారి సారధ్యంలో ఇదివరకు విగ్రహాల స్ధానంలో ఇప్పుడున్న మూర్తులను ప్రతిష్టించారు. అప్పటినుంచీ ఇక్కడ శాస్త్రోక్తంగా నిత్య పూజలు జరుగుతున్నాయి.
అమ్మవారు: ఇక్కడ అమ్మవారు ఒక చేతిలో ఖడ్గంతో, మరో చేతిలో భరిణతో దర్శనమిస్తారు. పక్కనే మాణిక్యాంబ దర్శనమిస్తుంది. ముందు వున్న వేప చెట్టుని అలాగే వుంచి చుట్టూ ఆలయం నిర్మించారు. ఉపాలయంలో ఈశ్వరాంశ సంభూతుడైన వీరభద్రస్వామి చతుర్భుజాలతో ఎదురుగా నందీశ్వరుడితోసహా దర్శనమిస్తాడు.
బోనాలు:  గోల్కొండలో బోనాల ఉత్సవం మొదలయిన మూడవ ఆదివారం ఈ ఆలయంలోనూ, ఈ పరిసర ప్రాంతాలలోని వందకు పైగా ఆలయాలలోనూ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అదే రోజు సాయంత్రం ఫలహారం బళ్ళు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తాయి. మర్నాడు మహంకాళి, మాణిక్యాంబల చిత్రపటాలను ఏనుగు మీద వూరేగిస్తారు. ఇక్కడ బోనాల మర్నాడు జరిగే రంగం చాలా ప్రసిధ్ధి చెందింది. ఘటం ఊరేగింపు రోజూ, పరిసర ప్రాంతాలలో ఒక్కొక్క వీధిలో జరుగుతుంది. ఈ ఆలయాలని మీరు దర్శించారా? లేకపోతే అవకాశం వున్నప్పుడు తప్పక దర్శించండి. ఈ నెల 15వ తారీకునుంచీ మహిళలు ఆసక్తిగా ఎదురుచూసే శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఆ సందర్భంగా కొన్ని అమ్మవార్ల ఆలయాలు దర్శించుకుందాము.