Wednesday 20 July 2016

ఎవరి కోసం ప్రార్థించాలి ?

ఎవరి కోసం ప్రార్థించాలి ?


 అన్న ప్రశ్న తలెత్తిన ప్రతీసారీ నమస్కార ముద్ర మనకు సమాధానం చెబుతుంది.
 

1.మీ బొటన వేలు హృదయాన్ని తాకుతూ ఉంటుంది. ముందుగా మీ హృదయంలో స్థానం సంపాదించిన వ్యక్తుల కోసం ప్రార్థించండి. . 2.ఆ తర్వాత వచ్చేది చూపుడు వేలు. మీకు దారి చూపించిన గురువుల కోసం ప్రార్థించండి. . 
3.మూడోది మధ్యవేలు . అన్నిటికంటే పెద్దవేలూ అదే. దేశానికి అన్నం పెడుతున్న రైతుల కోసం .... దిశానిర్దేశం చేస్తున్న ప్రధానమంత్రీ రాష్ట్రపతి, ఎంతోమందికి అన్నం పెడుతున్న వ్యాపారవేత్తలు, పెద్దలందరి కోసం ప్రార్థించండి. 
4.నాలుగోది ఉంగరం వేలు. అది చాలా బలహీనమైనది.  బలహీనుల కోసం నిర్భాగ్యుల కోసం ప్రార్థించండి. వాళ్లందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ప్రార్థించండి. 
5.చివరిగి చిటికెన వేలు. అక్కడే మనం ఉండాలి. ప్రార్థనలో చివరి ప్రాధాన్యం మనకే. శారీరక, ఆధ్యాత్మిక ఉన్నతికోసం సృష్టికర్తను ప్రార్థించాలి. .
అందరూ బాగుండాలి ...అందులో మనమూ ఉండాలి ..ప్రార్దించాలి.మనకోసం కాక వేరొకరి కోసం చేసే ప్రార్ధన త్వరగా ఫలితాన్ని ఇస్తున్దంటారు పెద్దలు.

No comments:

Post a Comment