షిర్డీ సాయిబాబా ఎలాంటి మంత్ర తంత్రాలకు ప్రాధాన్యం ఇవ్వలేదు....!!
షిర్డీ సాయిబాబా భక్తి మార్గాన్ని అనుసరించినప్పటికీ ఎలాంటి మంత్ర తంత్రాలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆయన ఎవరికీ ఏ మంత్రాన్నీ ఉపదేశించలేదు. ఏ యోగ మార్గాన్నీ ఆయన ఆచరింపచేయలేదు. పూజా విధానమంటూ ఏ ప్రత్యేక పూజా విధానాన్నీ ఆయన ప్రతిపాదించలేదు. హఠయోగాన్ని, షట్కర్మల్ని ఆచరిస్తానని తన వద్దకు వచ్చిన కన్నడ ప్రాంతానికి చెందిన యోగిని కూడా ఆ పద్ధతుల నుంచి విముఖుడిని చేశారు. ఏకాదశి నాడు ఉపవాసాలనే తంతు నుంచి కూడా ఆస్తికులను విముక్తులను చేయించి, వారికి తిండి తినిపించమే కాకుండా ఉల్లిపాయలు కూడా వారిచేత తినిపించారు. తిథి, వార, నక్షత్రాలకు ఆయన ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదు. ధ్యాన మార్గానికి పట్టం కడుతూనే, భక్తి, ప్రేమల్ని ప్రోత్సహించారు. ధ్యాన మార్గంలో నడవలేమని అనుకునే వారిని సాకారం నుంచి నిరాకారం వైపు ప్రయాణం చేయమని ప్రబోధించారాయన.

No comments:
Post a Comment