Friday, 15 July 2016

ఈ రోజు నుండి దక్షీణాయన పుణ్య కాలం మొదలు (కర్కాటక సంక్రమణం) 16-7-2016

ఈ రోజు నుండి దక్షీణాయన పుణ్య కాలం  మొదలు (కర్కాటక సంక్రమణం) 16-7-2016


కాలమును రాత్రింబవళ్ళుగా విభజించే సూర్యచంద్రుల గమనంపై మానవ జీవన విధానం ఆధారపడి ఉంటుంది. అంతేకాక సంవత్సరంలో సూర్యుడు ఒక రాశినుండి మరొక రాశిలోనికి ప్రతినెల మారుతుంటాడు. ఇలా మారుటనే సంక్రమణం అంటారు. ప్రవేశించిన ప్రతిరాశిలోను సూర్యుడు ఒక మాసముంటాడు. సూర్యుడు కర్కాటకరాశియందు ప్రవేశించినది మొదలు మకరరాశియందు ప్రవేశించు వరకు గల మధ్యకాలము దక్షిణాయనము. దక్షిణాయనమనగా భూమధ్యరేఖకు దక్షిణమున సూర్యుడు సంచరించు కాలము. శ్రావణమాసమునుండి పుష్యమాసము వరకు ఆరు నెలలు ఉండును.

ఏ శుభకార్యాలకైనా ఉత్తరాయనం మిక్కిలి శ్రేష్ఠము. దేవాలయం, తోటలు, బావులు మొదలగు వాని ప్రతిష్ఠలు దక్షిణాయనంలో చేస్తే ఫలితం లభించదు (నిర్ణయసింధువు)
గృహప్రవేశము, దేవతాప్రతిష్ఠ, వివాహము, చౌలము, ఉపనయనం, ఈ శుభకర్మలు ఉత్తరాయణంలో చేయాలి. నిందితమైన కర్మలు దక్షిణాయనంలో చేయాలి (నిర్ణయసింధువు)

దీనికి అపవాదము కాశీ ఖండంలో ఇలా ఉంది:
సదా కృతయుగం చాస్తు సదా చాస్తూత్తరాయనం
సదా మహోదయశ్చాస్తు కాశ్యాం నివసతాం సతాం!! ఇత్యయనం – కాశీఖండం!!
“ఎప్పుడూ కృతయుగం ఉండనీ ఎప్పుడూ ఉత్తరాయనం ఉండనీ, ఎప్పుడూ మోక్షం లభించనీ కాశీలో ఉండే సజ్జనులందరికీ” అని.

No comments:

Post a Comment