విబూదిని ధరించండి.. తలనొప్పి, జలుబును తగ్గించండి
''భస్మ'' అంటే మన పాపాలను ప్రక్షాళన చేసుకుని భగవంతుడిని స్మరించడం, భగవంతునికి అర్పించే హోమంలో సమర్పించే గంధపు చెక్కలు, నెయ్యి, ఇతర ఔషధాల నుంచి వచ్చే బూడిద ఈ భస్మం. భస్మాన్ని స్వీకరించినప్పుడు చిటికెడు భస్మాన్ని తీసి నోట్లో వేసుకోవడం ఆచారం. ''భ'' భరతత్సానాం (పాపనాశనానికి) ''స్మ" స్మరణ అని అర్థం. ఈ భస్మాన్నే మనం విబూదిగా పేర్కొంటాం.
జనన మరణ పరిధుల నుంచి బయటపడి, శారీరక అహంకారాల్ని మసిచేయడానికి గుర్తుగా ఈ విబూదిని ధరించాలి. శరీరం అశాశ్వతమని, ఏదోకరోజు అది భస్మరూపం దాల్చుతుందని కూడా విబూదిధారణ స్ఫురణకు తెస్తుంది. శరీరం అంతా భస్మాన్ని పూసుకునే శివునికి సాన్నిహిత్యం కలదీ విబూది. దీనికి ఔషధ విలువలు కూడా వున్నాయి. అనేక ఆయుర్వేద మందులలో ఉపయోగించే విబూది శరీరంలో అదనపు తేమను గ్రహించి, జలుబు, తలనొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

No comments:
Post a Comment