Monday 25 July 2016

అంశుమంతుడు(సూర్యుడు)

అంశుమంతుడు(సూర్యుడు)

భగవాన్ నామము స్మరించు. దానివల్ల సమస్త పాపాలు , కామ క్రోధాలు నిర్మూలమవుతాయి . భాగవన్నామము , భగవంతుడు వేరుకావు . చేతులను చరుస్తూ ఉదయం , సాయంకాలమున హరి(హర)నామ సంకీర్తన చేయండి . మీ పాపాలు , బాధలన్నీ మిమ్మల్ని వదిలి పలాయనమౌతాయి . చెట్టుక్రింద నిలబడి చప్పట్లు కొడితే చెట్టుమీది పక్షలు ఎగిరిపోతాయికదా. చప్పట్లు కొడుతూ హరి (హర) నామము చేస్తే మీ శరీరం అనే చెట్టునుండి పాపాలనే పక్షులు ఎగిరి పోతాయి .
- శ్రీ రామకృష్ణ పరమహంస .
శాస్త్రపరిజ్ఞానము అంతగా అభివృద్ధి చిందని పూర్వకాలములో ద్వాపరయుగాంతములో వేదవ్యాసుడు సూర్యుని దేవుని గా బావించమని జనులను ఉద్భోదించాడు అని అనుకోవచ్చును . . నిత్యజీవతం లో మానవునికి ఉపయోగపడే ప్రతిదీ భవవాన్‌ స్వరూపమనే భోదించాడు . భగవంతునకు భక్తునకు ఉన్న సంభందం . అలా అన్ని ఆరోగ్య సూత్రాలు ఆద్యాత్మికం గా లింక్ పెట్టి భోదించాడని ఇక్కడ గ్రహించాలి .
మార్గశిర మాసం లో అంశుమంతుడనే సూర్యుడు తన రధం లో సంచరిస్తూ ఉంటాడు . కశ్యపమహర్షి , ఊర్వశి అనే అప్సరస , రుతసేనుడనే గంధర్వుడు , మహాశంఖమనే సర్పం , తారక్ష్యుడు అనే యక్షుడు , విద్యుచ్చత్రువు అనే రాక్షసుడు , ఆయన వెంట ఉంటారు . ఆయన చీకట్లను పారద్రోలడం లో , శత్రువులను సంహరించడం లో సమర్ధుడు , సకల జగత్తుకు శుభప్రదుడు . మునీశ్వరులు ఆయన్ని ఎప్పుడు స్తుతిస్తూ ఉంటారు . అటువంటి అంశుమంతుడు అనే ఈ ఆదిత్యుడు తొమ్మిదివేల కిరణాలతో శోభిల్లుతూ ఆకుపచ్చ వర్ణంతో ఉంటాడు అని పురాణాలు చెప్తున్నాయి .
ఒక సారి వైశంపాయనుడు వ్యాసమహర్షి ని ఈ విధం గా అడిగాడు ... ఓ మహర్షి ! ప్రతి రోజు ఆకాశం లో ఉదయించే ఆ తేజశ్శాలి ఎవరు? దేవతలు , మహర్షులు సిద్ధులు , మానవులంతా ఆ మహాపురుషుని ఆరాధిస్తూ ఉన్నారు ఆయన గురించి చెప్పండి .. అని అడుగగా ఈ విధం గా వివరించారు .
" ఓ వైశంపాయనా ! యితడు బ్రహ్మ స్వరూపం నుండి ఉద్భవించాడు . ఉత్స్క్రుస్తమైన బ్రహం తేజోరూపుడు . సాక్షాత్ బ్రహ్మమయుడే . ఈ భగవానుడు ధర్మ , అర్ధ , కామ , మోక్షము అనే నాలుగు పురుశార్ధఫలాలనిస్తాడు . ఇదే సూర్యుని యొక్క సత్యమయ స్వరూపము . లోకములయోక్క ఉత్పత్తి , పాలన ఈయన వల్లే జరుగుతాయి . ఈయన లోకరక్షకుడు . ద్విజులు మొదలైనవారు ఈ మహాత్ముని ఆరాధించి మోక్షాన్ని పొందుతారు .
సంద్యోపాసన సమయం లో బ్రహ్మవేత్తలైన బ్రాహ్మినులు తమ భుజాలను పైకెత్తి ఈ దివ్యపురుశున్నే సేవిస్తారు . ఈయన్ని ఆరాదిస్తే సమస్త దేవతలను ఆరాదిన్చినట్లే .సూర్యమండలం లో ఉన్న సాధ్యదేవిని పపాసిన్చిద్విజులంతా స్వర్గాన్ని , మోక్షాన్ని పొందుతున్నారు . సుర్యోపాసన వలనే మనుష్యులు రోగాలనుంచి విముక్తులవుతున్నారు . ఈ స్వామిని పుజించేవారికి ఎన్నడు అంధత్వము దారిద్రియము , దు:ఖము , శోకాలు కలుగవు అని తెలియజేషారు వ్యాసమహర్షి .
సూర్యుడు ఆధునిక శాస్త్రము :
ఖగోళ శాస్త్రంలోని అనేక నక్షత్రాలలో ఒక నక్షత్రం సూర్యుడు. సూర్యుడు హైడ్రోజన్ మరియు హీలియం లతో కూడిన ఒక పెద్ద వాయుగోళం. సూర్యుని గురుత్వాకర్షణ శక్తి కారణంగా సౌరకుటుంబం లోని భూమి, అంగారకుడు మొదలైన గ్రహాలు సూర్యుని చుట్టూ నిర్ధిష్ట కక్ష్యలలో తిరుగుతున్నాయి

No comments:

Post a Comment