Monday, 18 July 2016

ఈరోజున

ఈరోజున


 గురుశక్తి ప్రపంచమంతా సూక్ష్మభూమిలో వ్యాపించి ఉంటుంది. కనుక గురువు యొక్క అనుగ్రహానికి ఇది ఒక గొప్ప అవకాశం.
“నారాయణ’/సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం!
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం!!
అని భగవానునితో ప్రారంభమైన గురు పరంపర వ్యాసభగవానునితో కొనసాగి మనవరకు వచ్చి కొనసాగింపబడుతోంది. కనుక వ్యాసభగవానుని ఈరోజు అర్చించడం ప్రతి భారతీయుని కర్తవ్యమ్. వారి గ్రంథాలలో ఏ కొద్ది భాగాన్నైనా అధ్యయనం చేయాలి. వ్యాసపీఠంపై వ్యాసదేవుని ఏదో ఒక గ్రంథాన్ని ఉంచైనా షోడశోపచారాలతో పూజించాలి. వారిద్వారా అందిన ధర్మాన్నే గురువు మనకు ఉపదేశిస్తారు. కావున ఈరోజు ప్రతివారు తమ గురువులను కూడా పూజించాలి. “గురోః ప్రసాదాదన్యత్ర నాస్తి సుఖం మహీతలే” అని గురువు అనుగ్రహము లేనిదే ఇహలోకంలోనైనా పరలోకంలోనైనా సుఖం పొందడం దుర్లభం.
పూర్వాషాఢతో కూడుకొని ఉన్న పూర్ణిమ నాడు అన్నపానాదులు దానం చేయడం వలన అక్షయంగా అన్నపాన ప్రాప్తి కలుగుతుంది. ఈ పూర్ణిమ ప్రదోషకాలం వరకు వ్యాపించి ఉంటే శ్రీ శివుని శయనోత్సవం, పవిత్రారోపణం చేయవలెనని ధర్మ శాస్త్రములందు చెప్పబడింది. యతులు, సన్యాసులు ఈరోజున చాతుర్మాస్య దీక్షను స్వీకరిస్తారు.

No comments:

Post a Comment