Monday 6 May 2019

శాస్త్రోక్తంగా చందనం అరగదీత సింహచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి ఆలయంలో...


ఈరోజు తొలి విడత చందనం అరగదీత కార్యక్రమం శాస్త్రోక్తంగా ప్రారంభమైం ది.
పాంచరాత్ర ఆగమశాస్త్రాన్ని అనుసరించి ఈ రోజు మంగళవారం ఉదయం 6.30 గంటల నుంచి ఈ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు.
వచ్చే నెల 7వ తేదిన చందనోత్సవాన్ని పురస్కరించుకుని స్వామికి తొలి విడతగా మూడు మణుగుల(125 కిలోలు) చందనాన్ని సమర్పిస్తారు.
అందులోభాగంగా తొలుత బేడా మండపంలో తొలి చందనం చెక్కను ఉంచి పూజలు నిర్వహించారు.
తదుపరి శాస్త్రోక్తంగా చందనం అరగదీత ప్రారంభించారు.
https://youtu.be/68G3C8HrG4g

అక్షయ తృతీయ రోజున ఏమి చేయాలి ... బంగారం తప్పక కొనాలా?


అక్షయ తృతీయ అంటేనే నేటికాలంలో బంగారం, వెండి లేదా ఇతర ఏదేని విలువైన వస్తువులు కొనడం అనేది ప్రచారంలో ఉంది. ఈ రోజున కొన్నది అక్షయం అవుతుందని చెప్పిన వ్యాపార ప్రచారాన్ని వాస్తవంగా నమ్మి వాటిని కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది.
అసలు అటువంటివి కొనాలని అనుకుని డబ్బు లేకున్నా అప్పు చేసో, తప్పు చేసో కొంటే, కొన్న బంగారం అక్షయం అవడం అటుంచి చేసిన అప్పులు,
తప్పులు తత్సంబంధ పాపాలు అక్షయం అవుతాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి. ...
అసలు ఈరోజున బంగారం కొనాలి అని శాస్త్రంలో ఎక్కడా చెప్పబడిలేదు. ఇది కేవలం వ్యాపార జిమ్మిక్ మాత్రమే....
అక్షయ తృతీయ నాడు, మనం చేపట్టిన ఏ కార్య ఫలమైనా, [ అది పుణ్యం కావచ్చు; లేదా పాపం కావచ్చు.] అక్షయంగా, నిరంతరం, జన్మలతో సంబంధం
లేకుండా, మన వెంట వస్తూనే ఉంటుంది. పుణ్య కర్మలన్నీ విహితమైనవే. అందునా, ఆ రోజు ఓ కొత్త కుండలో గానీ,
కూజాలో గానీ, మంచి నీరు పోసి, దాహార్తులకు శ్రధ్ధతో సమర్పిస్తే, ఎన్ని జన్మలలోనూ, మన జీవుడికి దాహంతో గొంతు ఎండి పోయే పరిస్థితి రాదు. అతిధులకు, అభ్యాగతులకు, పెరుగన్నంతో కూడిన భోజనం సమర్పిస్తే, ఏ రోజూ ఆకలితో మనం అలమటించవలసిన రోజు రాదు. వస్త్రదానం వల్ల తదనుగుణ ఫలితం లభిస్తుంది. అర్హులకు స్వయంపాకం, దక్షిణ, తాంబూలాదులు సమర్పించుకుంటే, మన ఉత్తర జన్మలలో, వాటికి లోటు రాదు. గొడుగులు, చెప్పులు, విసన కర్రల లాటివి దానం చేసుకోవచ్చు.
ముఖ్యంగా ఆ రోజు నిషిధ్ధ కర్మల జోలికి వెళ్ళక పోవడం ఎంతో శ్రేయస్కరం. ఓ సారి పరిశీలిస్తే, భాగవతం ప్రధమ స్కంధం ప్రకారం, పరీక్షిన్మహా రాజు కలి పురుషుడికి ఐదు నివాస స్థానాలను కేటాయించాడు. అవి: 👇
*జూదం, మద్య పానం, స్త్రీలు, ప్రాణి వధ, బంగారం*. వీటితో పాటు కలి కి లభించినవి
👉 *ఇంకో ఐదు* 👈
అసత్యం,గర్వం, కామం, హింస, వైరం. జాగ్రత్తగా పరిశీలిస్తే, ఆ పైన ఉన్న ఐదిటికీ ఇవి అనుషంగికాలు.
ఆ పై ఐదిటినీ ఇవి నీడలా వెన్నంటే ఉంటాయి.
అక్షయ తృతీయ రోజు ఎవరైనా, ఈ ఐదిటిలో దేని జోలికి వెళ్ళినా, కలి పురుషుడి దుష్ప్రభావం
అక్షయంగా వెంటాడుతూనే ఉంటుంది.
👉 *మరి అక్షయ తృతీయ నాడు ఏం చెయ్యాలి(పురాణకథనం)* 👈
మత్స్య పురాణం అరవై ఐదవ అధ్యాయం ప్రకారం.. పరమశివుడు పార్వతీదేవికి సర్వకామ ప్రథమైన అక్షయ తృతీయ వ్రతం గూర్చి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణమేదైనా దాని ఫలితము అక్షయమౌతుంది. అలాగే పుణ్య కార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే, పాపకార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది . ఈ నాడు, తృతీయా తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది. అందుచే విశేష పూజనీయమైనది. ఈ నాడు ఉపవాస దీక్ష జరిపి, ఏ పుణ్య కర్మనాచరించినా కూడా తత్సంబంధ ఫలము అక్షయముగానే లభిస్తుంది. ఈ తిథినాడు అక్షయుడైన విష్ణువు పూజింపబడతాడు. అందుకే దీనికి అక్షయ తృతీయ అని పేరు.
ఈ రోజు అక్షతోదకముతో స్నానం చేసి, అక్షతలను విష్ణు భగవానుని పాదములపై ఉంచి, అర్చించి, తరువాత ఆ బియ్యమును చక్కగా మరోసారి ఏరి బ్రాహ్మణులకు దానమిచ్చి, మిగిలిన వాటిని దైవోచ్చిష్టంగా, బ్రాహ్మణోచ్చిష్టంగా తలచి వాటిని ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి ఈ ఫలం తప్పక కలుగుతుంది అని పురాణంలో ఈశ్వర వాక్కు. ఇలా ఒక్క వైశాఖ శుక్ల తదియనాడు పైన చెప్పిన విధంగా నియమంతో అక్షయ తృతీయా వ్రతాన్ని ఆచరించిన తరువాత వచ్చే 12 మాసాలలో శుక్ల తృతీయ నాడు ఉపవసించి విష్ణువును ప్రీతితో అర్చిస్తే రాజసూయ యాగము చేసిన ఫలితము కలిగి అంత్యమున ముక్తిని పొందగలడు. అక్షతలు అంటే ఏ మాత్రము విరగని, పగుళ్ళు లేని, గట్టిగా ఉన్న బియ్యము. అవి వరి ధాన్యము నుండి కావచ్చు, గోధుమ ధాన్యము నుండి కావచ్చు, యవల నుండి కావచ్చు. ఇటువంటి వాటితో సిద్ధం చేసిన ఆహారమును అక్షతాన్నము లేదా అక్షతాహారము అంటారు. శ్రీ నారద పురాణం కూడా, ఈనాడు చేయు దాన ధర్మాలు అత్యధిక ఫలాన్నిస్తాయని చెపుతోంది.

........
ఒక చిన్న మనవి : మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియవు, శాస్త్రాలలో
చెప్పిన ధర్మ మార్గాలు తెలియవు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు, మన
పండుగల విశిష్టత తెలియదు, అందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు, కానీ నేర్చుకుని,
ఆచరించడానికి వయోపరిమితి లేదు, తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు,
అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, మన భావితరాల వారికైనా
ఇవన్నీ తెలిసేలా బాధ్యత మనదే, ఏదీ ఆలస్యం కాదు, నేనూ ఇప్పుడే ఎన్నో
తెలుసుకుంటున్నాను , నేర్చుకుంటున్నాను, ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాను,
అలానే అందరూ తెలుసుకుని, ఆచరిస్తారనే ఆశిస్తున్నాను
" శ్రీ విధాత పీఠం " ఫేస్బుక్ పేజీ ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు
కూడా పరిశీలించండి, వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం
కలిగుతుందని మా ఆశ. అందరికీ ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే
" శ్రీ విధాత పీఠం" ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం.మీరు తెలుసుకోండి ,
మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్
చేయండి
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం,
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట,
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల
కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
facebook page
facebook group :
(20+) Vidhatha Astro Numerology | Facebook
YouTube
Printerest
Twitter
Instagram
Blog
whatsapp group
Follow this link to join my WhatsApp group:
టెలిగ్రామ్
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
........

*_వైశాఖమాస స్నాన సంకల్పము_*


*శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |*
*ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే ||*
*సర్వపాపహరం పుణ్యం స్నానం వైశాఖకాలికం |*
*నిర్విఘ్నం కురుమేదేవ దామోదర నమోస్తుతే ||*
*వైశాఖః సఫలోమాసః మధుసూదన దైవతః |*
*తీర్థయాత్రా తపోయజ్ఞ దానహోమఫలాధికః ||*
*వైశాఖః సఫలం కుర్యాత్ స్నానపూజాదికం |*
*మాధవానుగ్రహేణైవ సాఫల్యంభవతాత్ సదా ||*
*మధుసూదన దేవేశ వైశాఖే మేషగేరరౌ |*
*ప్రాత స్నానం కరిష్యామి నిర్విఘ్నం కురు మాధవ ||*
ఓం మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభేశోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణో రాజ్ఞయా శ్రీ శివశంభోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా/గంగా/గోదావర్యోః మధ్యదేశే అస్మిన్(ఆయా ప్రాంతాలకు మార్చుకోవాలి) వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరానాం మధ్యే శ్రీ .......(సంవత్సరం పేరు చెప్పాలి) నామసంవత్సరే, ఉత్తరాయనే, వసంతఋతౌ, వైశాఖమాసే, ....పక్షే , ....తిధౌ, ......వాసర యుక్తాయాం, శుభనక్షత్ర, శుభయోగ, శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం, శుభతిదౌ, శ్రీ మాన్ .....(పేరు చెప్పాలి), గోత్రః .........(గోత్రం పేరు చెప్పాలి) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం క్షేమ, స్థైర్య, విజయ ఆయురారొగ్య ఐశ్వర్యాభివ్రుధ్యర్ధం, ధర్మార్ధ కామమోక్ష చతుర్విద ఫలపురుషార్ధ సిద్ధ్యర్ధం, గంగావాలుకాభి సప్తర్షిమండల పర్యంతం కృతవారాశేః పౌండరీకాశ్వమేధాది సమస్త క్రతుఫలావాప్త్యర్థం, ఇహజన్మని జన్మాంతరేచ బాల్య యౌవ్వన కౌమారవార్ధకేషు, జాగ్రత్ స్వప్నసుషుప్త్యవస్ధాను జ్ఞానతో జ్ఞానతశ్చకామతో కామతః స్వతః ప్రేరణతయా సంభావితానాం, సర్వే షాంపాపానాం అపనోద నార్ధంచ గంగా గోదావర్యాది సమస్త పుణ్యనదీ స్నానఫల సిద్ధ్యర్ధం, కాశీప్రయాగాది సర్వపుణ్యక్షేత్ర స్నానఫలసిద్ధ్యర్థం, సర్వపాపక్షయార్ధం, ఉత్తరోత్తరాభివృద్ధ్యర్ధం మేషంగతేరవౌ మహాపవిత్ర వైశాఖమాస ప్రాతః స్నానం కరిష్యే.
*_సంకల్పము చెప్పుకొనుటకు ముందు చదువవలసిన ప్రార్థనా శ్లోకము_*
గంగాగంగేతియోబ్రూయాత్ యోజనానాంశతైరపి
ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్ఛతి ||
పిప్పలాదాత్సముత్పన్నే కృత్యే లోకాభయంకరి
మృత్తికాంతే ప్రదాస్యామి ఆహారార్దం ప్రకల్పయ ||
అంబత్వద్దర్శనాన్ముక్తిర్నజానే స్నానజంఫలం
స్వర్గారోహణ సోపాన మహాపుణ్య తరంగిణి ||
విశ్వేశం మాధవండుంఢిం దండపాణీం చ భైరవం
వందేకాశీం గుహం గంగాం భవానీం మణికర్ణికాం ||
అతితీక్షమహాకాయ కల్పాంత దహనోపమ
భైరవాయనమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి ||
త్వంరాజా సర్వతీర్థానాం త్వమేవ జగతః పితా
యాచితో దేహిమే తీర్థం సర్వపాపాపనుత్తయే ||
యోసౌసర్వగతో విష్ణుః చిత్ స్వరూపీనిరంజనః
సేవద్రవ రూపేణ గంగాంభో నాత్రసంశయః ||
నందినీ నళినీ సీతా మాలినీ చమహాసగా
విష్ణు పాదాబ్జ సంభూతా గంగా త్రిపధ గామినీ ||
భాగీరధీ భోగవతీ జాహ్నవీ త్రిదశేశ్వరీ
ద్వాదశైతాని నామాని యత్ర యత్ర జలాశయే
స్నానకాలేపఠేత్ నిత్యం మహా పాతక నాశనం ||
సమస్త జగదాధార శంఖచక్ర గదాధర
దేవదేహిమమానుజ్ఞాం తవ తీర్థ నిషేవణే ||
నమస్తే విశ్వగుప్తాయ నమో విష్ణుమపాంసతే
నమోజలధిరూపాయ నదీనాంపతయే నమః ||
మధుసూదన దేవేశ వైశాఖే మేషగేరవౌ
ప్రాతఃస్నానం కరిష్యామి నిర్విఘ్నంకురు మాధవ ||
స్నానం తరువాత ప్రార్థనాశ్లోకాలను చదువుతూ, ప్రవాహానికి యెదురుగా, వాలుగా తీరానికి పరాజ్ముఖముగా కుడిచేతి బొటనవ్రేలుతో నీటిని కదిలించి 3 దోసిళ్ల నీళ్లు తీరానికి జల్లి, తీరానికి చేరి కట్టుబట్టలను పిండుకోవాలి, తరువాత మడి/పొడి బట్టలను కట్టుకొని తమ సాంప్రదాయానుసారం విభూతి వగైరాలని ధరించి సంధ్యావందనం చేసుకోవాలి. తరువాత నదీతీరాన/గృహమున దైవమును అర్చించాలి. స్నానము చేయుచు క్రింది శ్లోకములను చదువుచు శ్రీహరికి - యమునికి అర్ఘ్యమునీయవలెను.
వైశాఖే మేషగే భానౌ ప్రాతఃస్నాన పరాయణః |
అర్ఘ్యం తేహం ప్రదాస్వామి గృహాణమధుసూదన ||
గంగాయాః సరితస్సర్వాః తీర్థాని చహ్రదాశ్చయే |
ప్రగృహ్ణీత మయాదత్త మర్ఘ్యం సమ్యక్ ప్రసీదధ ||
ఋషభః పాపినాంశాస్తాత్వం యమ సమదర్శనః |
గృహాణార్ఘ్యం మయాదత్తం యధోక్త ఫలదోభవ ||
_*దానమంత్రం*_
ఏవం గుణవిశేషణ విశిష్టాయాంశుభతిథౌ అహం .....గోత్ర, .....నామధేయ ఓం ఇదం వస్తుఫలం(దానంయిచ్చే వస్తువుని పట్టుకొని) అముకం సర్వ పాపక్షయార్థం, శుభఫలావాప్త్యర్థం అముక ......గోత్రస్య(దానం పుచ్చుకొనేవారి గోత్రం చెప్పాలి) ప్రాచ్యం/నవీనందదామి అనేన భగవాన్ సుప్రీతః సుప్రసన్నః భవతు దాత దానము నిచ్చి అతని చేతిలో నీటిని వదలవలెను.
దాన పరిగ్రహణ మంత్రం
ఓం ఇదం, ఏతద్ ఓమితిచిత్తనిరోధస్స్యాత్ ఏతదితి కర్మణి ఇదమితి కృత్యమిత్యర్ధాత్ అముకం ......గోత్ర, ....నామధేయః దాతృ సర్వపాప అనౌచిత్య ప్రవర్తనాదిక సమస్త దుష్ఫలవినాశార్ధం ఇదం అముకం దానం ఇదమితి దృష్ట్యాన అముకమితి వస్తు నిర్దేశాదిత్యాదయః పరిగృహ్ణామి స్వీగృహ్ణామి దానమును తీసికొనవలయును.
*_పురాణ ప్రారంభమున వైష్ణవులు చదువదగిన ప్రార్థనా శ్లోకములు_*
యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతం
విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే ||
యత్ర యోగీశ్వరః కృష్ణః యత్రపార్థో ధనుర్ధరః
తత్ర శ్రీర్విజయోభూతిః ధ్రువానీతిః మతిర్మమ ||
లాభస్తేషాం జయస్తేషాంకుత స్తేషాంపరాభవః
యేషా మిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః ||
అగ్రతః పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ
ఆ కర్ణపూర్ణ ధన్వానౌ రక్షతాం రామలక్ష్మణౌ ||
సన్నద్ధః కవచీఖడ్గీ చాపబాణధరోయువా
గచ్ఛన్ మమాగ్రతో నిత్యం రామః పాతుసలక్ష్మణః ||
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశమ్
విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగమ్ ||
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యమ్
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్ ||
ఉల్లాస పల్లవితపాలిత స్పతలోకీం నిర్వాహకోరకిత నేమకటాక్షలీలాం
శ్రీరంగహర్మ్యతల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామః ||
*_పురాణము ముగించునప్పుడు చదువదగిన ప్రార్థనా శ్లోకములు_*
విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరమ్
అనేకరూప దైత్యాంతం నమామి పురుషోత్తమమ్ ||
వందేలక్ష్మీం పరశివమయీం శుద్దజాంబూనదాభాం
తేజోరూపాం కనకవసనాం స్వర్ణ భూషోజ్జ్వలాంగీం ||
బీజాపూరం కనక కలశం హేమపద్మం దధానాం
ఆద్యాంశక్తీం సకలజననీం విష్ణువామాంకసంస్థాం ||
కుంకుమాంకితవర్ణాయ కుందేందు ధవళాయచ
విష్ణువాహ నమస్తుభ్యం పక్షిరాజాయతే నమః ||
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయాంతాం న్యాయ్యేన మార్గేణ మహీంమహీశాః
గోబ్రహ్మణేభ్యః శుభమస్తు నిత్యంలోకా స్సమస్తాస్సుఖినోభవంతు ||
కాలేవర్షతు పర్జన్యః పృధివీసస్యశాలినీ
దేశోయంక్షోభరహితో బ్రహ్మణాస్సంతు నిర్భయాః ||
స్వకాలే భవితావృష్టిః దేశోస్తునిరుపద్రవః
సమృద్ధా బ్రాహ్మణాస్సంతు రాజాభవతు ధార్మికః ||
సర్వేచ సుఖినస్సంతు సర్వేసంతునిరామయాః
సర్వేభద్రాణి పశ్యంతు నకశ్చిత్ పాపమాప్నుయాత్ ||
అపుత్రాః పుత్రిణస్సంతు పుత్రిణస్సంతు పౌత్రిణః
అధనాస్సధనాస్సంతు జీవంతు శరదాంశతం ||
*_పురాణ ప్రారంభమున శివ సాంప్రదాయము వారు చదవవలసిన ప్రార్థనా శ్లోకములు_*
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానం ఏకదంతముపాస్మహే ||
వందే శంభు ముపాపతీం సురుగురం వందే జగత్కారణం
వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాంపతిం ||
వందే సూర్యశశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం
వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరం ||
తప్త స్వర్ణవిభా శశాంకమకుటా రత్నప్రభాభాసురా
నానావస్త్ర విరాజితా త్రిణయనాభూమీరమాభ్యాం యుతా ||
దర్వీహాటక భాజనం చదధతీరమ్యోచ్చపీనస్తనీ
నృత్యంతం శివ మాకలయ్య ముదితాధ్యేయాన్నపూర్ణేశ్వరీ ||
భవానీ శంకరౌవందే శ్రద్దా విశ్వాసరూపిణో
యాభ్యాంవినాన పశ్యంతి సిద్ధాః స్వాంతస్థమీశ్వరం ||
ఉక్షం విష్ణుమయం విషాణకులిశంక రుద్ర స్వరూపంముఖం
ఋగ్వేదాది చతుష్టయంపద యుతం సూర్యేందు నేత్ర ద్వయం ||
నానాభూషణ భూషితం సురనుతం వేదాంత వేద్యంపురం
అండం తీర్థమయం సుధర్మ హృదయం శ్రీనందికేశంభజే ||
*పురాణం ముగించునపుడు చదవదగిన ప్రార్థనా శ్లోకములు*
సాంబోనః కులదైవతం పశుపతే సాంబత్వదీయా వయం
సాంబం స్తౌమిసురాసురోగగణాః సాంబేన సంతారితాః ||
సాంబాయాస్తు నమో మయావిరచితం సాంబాత్ పరంనోభజే
సాంబస్యామ చరోస్మ్యహం మమరతిః సాంబే పరబ్రహ్మణి ||
ఓంకార పంజరశుకీం ఉపనిషదుద్యానకేళి కలకంఠీం
ఆగమవిపిన మయూరీం ఆర్యామంతర్వి భావయే గౌరీం ||
యశ్శివోనామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళా
తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతోజయ మంగళం ||
నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక
మహాదేవస్య సేవార్థమనుజ్ఞాం దేహిమే ప్రభో ||
వేదపాదం విశాలాక్షం తీక్ష్ణ శృంగంమహోన్నతం
ఘంటాంగళే ధారయంతాం స్వర్ణరత్న విభూషితం
సాక్షాద్ధర్మ తనుందేవం శివవాహం వృషంభజే ||
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీంమహీశాః
గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యంలోకా స్సమస్తాస్సుఖినోభవంతు ||
కాలేవర్షతు పర్జన్యః పృధివీ సస్యశాలినీ
దేశోయంక్షోభరహితో బ్రహ్మణాస్సంతు నిర్భయాః ||
స్వకాలే భవితావృష్టిః దేశోస్తునిరుపద్రవః
సమృద్ధా బ్రాహ్మణాస్సంతు రాజాభవతు ధార్మిక ||
సర్వేచ సుఖినస్సంతు సర్వేసంతునిరామయాః
సర్వేభద్రాణి పశ్యంతు నకశ్చిత్ పాపమాప్నుయాత్ ||
అపుత్రాః పుత్రిణస్సంతు పుత్రిణస్సంతు పౌత్రిణః
అధనాస్సధనాస్సంతు జీవంతు శరదాంశతం ||

వైశాఖ మాసం ప్రారంభం.


వైశాఖ మాసం ఆధ్యాత్మిక సాధనకి అద్భుతమైన మాసాలలో ఒకటి. వైశాఖము, మాఘము, కార్తికము – ఈ మూడింటినీ ఆధ్యాత్మిక సాధనలో చాలా ప్రధానంగా చెప్తారు. ఏవిధంగా అయితే కార్తిక పురాణం, మాఘ పురాణం ఉన్నాయో అదేవిధంగా వైశాఖ పురాణాన్ని కూడా వ్యాసదేవుడు రచించాడు. ఆధ్యాత్మికంగా భగవదనుగ్రహం పొందడానికి ఈ మాసం అన్ని విధాలా అనుకూలమైనది. సాధనా మాసంగా దీనిని నిర్వచించవచ్చు. వసంతఋతువులో రెండవ మాసం ఇది. దీనికి వైదిక నామం మాధవ నామము. మధు అని చైత్రమాసానికి, మాధవ అని వైశాఖ మాసాన్ని అంటారు. వైశాఖమాసం లక్ష్మీ నారాయణుల ఆరాధనకి చాలా ప్రసిద్ధమైనది.
వైశాఖంలో రకరకాల వ్రతాలు చెప్పారు.
వైశాఖంలో పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా అనునిత్యం నారాయణుని తులసితో ఆరాధించడం చేయాలి. ఆ తులసి కూడా కృష్ణ తులసి సమర్పిస్తే శ్రేష్టం అని ధర్మశాస్త్రం చెప్తున్నది.
విష్ణుసహస్రనామ పారాయణ వైశాఖం అంతా చాలా ప్రశస్తమైనటువంటిది.
అనునిత్యం కూడా అశ్వత్థ వృక్షానికి సమృద్ధిగా జలం పోసి ప్రదక్షిణలు చేయడం, వైశాఖం అంతా చేసినట్లయితే అభీష్టసిద్ధి లభించడమే కాక పితృదేవతలు తృప్తి చెందుతారు.
గళంతిక ఆరాధన – శివునకు ఈ మాసమంతా అభిషేకం చేస్తే చాలా ప్రసిద్ధి. అనునిత్యం శివారాధన అభిషేకంతో చేయాలి. అది ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆదిదైవిక తాపత్రయాలను తొలగించి మనశ్శాంతినిస్తుంది. అందుకు శాంతి కోసం శివునికి అభిషేకం చేస్తారు. శివాలయాలలో శివునకు పైన గళంతికను ఏర్పాటు చేయడం కూడా చాలా మంచిది. దీనినే దారాపాత్ర అంటారు. నిరంతరం శివుడి మీద ధార పడేటట్లుగా ఒక పాత్రను ఏర్పాటు చేయాలి. ఇలా నెలంతా శివునిపై ధార పడేటట్లు చేసినట్లయితే సృష్టిలో ఉన్నటువంటి వేదనలు, తాపాలు, అరిష్టాలు నశిస్తాయని ధర్మశాస్త్రములు చెప్తున్న విషయం.
’వైశాఖే మాధవో, రాధో’
వైశాఖమాసాన్ని ’మాధవామాసం’ అని అంటారు. ఈ మాసంలో విష్ణుస్మరణతో, అభీష్ట దేవతారాధనతో నియమపాలన చేయడం ఇహ పర శ్రేయస్సునిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. వైశాఖమాసాన్ని మహిమాన్వితమైన దివ్యమాసంగా శాస్త్రాలు వర్ణించాయి. ఈ మాసాన ప్రాతః కాలాన లేచి మధుసూదనుని స్మరిస్తూ స్నానం చేయడం విశేష ఫలప్రదం.
ప్రాతః సనియమ స్నాన్యే ప్రీయతాం మధుసూదనః!
అదే విధంలో
"మాధవే మేషగే భానౌ మురారే మధుసూదన
ప్రాతః స్నానేన మే నాథ ఫలదోభవ పాపహన్!! -
అనే ప్రార్థనతో తీర్థాదులలో చేసిన స్నానం దివ్యఫలాన్నిస్తుంది.
తులసీ కృష్ణ గౌరాభ్యాం తయాభ్యర్చ్య మధుద్విషమ్!
విశేషేణ తు వైశాఖే నరో నారాయణో భవేత్!!
మాధవం సకలం మాసం తులస్యాయోర్చయే న్నరః!
త్రిసంధ్యం మధుహంతారం తస్యనాస్తి పునర్భవః!!
వైశాఖమాసమంతా శ్రీ మహావిష్ణువును తులసీ దళాలతో అర్చించితే శ్రేష్ఠం.
ప్రాతః స్నానానంతరం అధికజలంతో అశ్వత్థ (రావి) వృక్షపు మూలాన్ని తడిపి ప్రదక్షిణలు చేస్తే పూర్వీకులంతా తరిస్తారు.
ఈ మాసంలో ఒంటిపూట భోజనం లేదా నక్తం (పగలంతా ఉపవసించి రాత్రి ప్రారంభంలో భుజించడం) ఆచరించడం మంచిది.
ఈ మాసంలో చలివేంద్రాలు, పళ్ళరసాలు, మజ్జిగ వంటి పానీయాల శాలలని నిర్వహించడం, విసనకర్రలు, గొడుగులు, పాదరక్షలు దానం చేయడం పుణ్యఫలాన్నిస్తుంది.

మే నెల 7 వ తేదీ మంగళ వారము అక్షయ తృతీయ.


ఆ రోజునే
సింహాచల వరాహ నరసింహ స్వామి వారి చందనోత్సవం.
అదే రోజున
పరశురామ జయంతి .
మరిన్ని అక్షయ తృతీయ ప్రాముఖ్యతలు.
అక్షయ తృతీయ ప్రాముఖ్యత
1. పరశురాముని జన్మదినం
2. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం
3. త్రేతాయుగం మొదలైన దినం
4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం
5. వ్యాస మహర్షి “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో, వ్రాయడం మొదలుపెట్టిన దినం
6. సూర్య భగవానుడు అజ్ఞాతవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” ఇచ్చిన దినం
7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం
8. ఆదిశంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన దినం
9. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం
10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం.
*అక్షయ తృతీయ రోజున బంగారం తప్పక కొనాలా?*
అక్షయ తృతీయ అంటేనే నేటికాలంలో బంగారం, వెండి లేదా ఇతర ఏదేని విలువైన వస్తువులు కొనడం అనేది ప్రచారంలో ఉంది. ఈ రోజున కొన్నది అక్షయం అవుతుందని చెప్పిన వ్యాపార ప్రచారాన్ని వాస్తవంగా నమ్మి వాటిని కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది. అసలు అటువంటివి కొనాలని అనుకుని డబ్బు లేకున్నా అప్పు చేసో, తప్పు చేసో కొంటే, కొన్న బంగారం అక్షయం అవడం అటుంచి చేసిన అప్పులు, తప్పులు తత్సంబంధ పాపాలు అక్షయం అవుతాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి. *అసలు ఈరోజున బంగారం కొనాలి అని శాస్త్రంలో ఎక్కడా చెప్పబడిలేదు. ఇది కేవలం వ్యాపార జిమ్మిక్ మాత్రమే*
అక్షయ తృతీయ నాడు, మనం చేపట్టిన ఏ కార్య ఫలమైనా, [ అది పుణ్యం కావచ్చు; లేదా పాపం కావచ్చు.] అక్షయంగా, నిరంతరం, జన్మలతో సంబంధం
లేకుండా, మన వెంట వస్తూనే ఉంటుంది. పుణ్య కర్మలన్నీ విహితమైనవే. అందునా, ఆ రోజు ఓ కొత్త కుండలో గానీ,
కూజాలో గానీ, మంచి నీరు పోసి, దాహార్తులకు శ్రధ్ధతో సమర్పిస్తే, ఎన్ని జన్మలలోనూ, మన జీవుడికి దాహంతో గొంతు ఎండి పోయే పరిస్థితి రాదు. అతిధులకు, అభ్యాగతులకు, పెరుగన్నంతో కూడిన భోజనం సమర్పిస్తే, ఏ రోజూ ఆకలితో మనం అలమటించవలసిన రోజు రాదు. వస్త్రదానం వల్ల తదనుగుణ ఫలితం లభిస్తుంది. అర్హులకు స్వయంపాకం, దక్షిణ, తాంబూలాదులు సమర్పించుకుంటే, మన ఉత్తర జన్మలలో, వాటికి లోటు రాదు. గొడుగులు, చెప్పులు, విసన కర్రల లాటివి దానం చేసుకోవచ్చు.
ముఖ్యంగా ఆ రోజు నిషిధ్ధ కర్మల జోలికి వెళ్ళక పోవడం ఎంతో శ్రేయస్కరం. ఓ సారి పరిశీలిస్తే, భాగవతం ప్రధమ స్కంధం ప్రకారం, పరీక్షిన్మహా రాజు కలి పురుషుడికి ఐదు నివాస స్థానాలను కేటాయించాడు. అవి: 👇
*జూదం, మద్య పానం, స్త్రీలు, ప్రాణి వధ, బంగారం*. వీటితో పాటు కలి కి లభించినవి
👉 *ఇంకో ఐదు* 👈
అసత్యం,గర్వం, కామం, హింస, వైరం. జాగ్రత్తగా పరిశీలిస్తే, ఆ పైన ఉన్న ఐదిటికీ ఇవి అనుషంగికాలు.
ఆ పై ఐదిటినీ ఇవి నీడలా వెన్నంటే ఉంటాయి.
అక్షయ తృతీయ రోజు ఎవరైనా, ఈ ఐదిటిలో దేని జోలికి వెళ్ళినా, కలి పురుషుడి దుష్ప్రభావం
అక్షయంగా వెంటాడుతూనే ఉంటుంది.
👉 *మరి అక్షయ తృతీయ నాడు ఏం చెయ్యాలి(పురాణకథనం)* 👈
మత్స్య పురాణం అరవై ఐదవ అధ్యాయం ప్రకారం.. పరమశివుడు పార్వతీదేవికి సర్వకామ ప్రథమైన అక్షయ తృతీయ వ్రతం గూర్చి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణమేదైనా దాని ఫలితము అక్షయమౌతుంది. అలాగే పుణ్య కార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే, పాపకార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది . ఈ నాడు, తృతీయా తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది. అందుచే విశేష పూజనీయమైనది. ఈ నాడు ఉపవాస దీక్ష జరిపి, ఏ పుణ్య కర్మనాచరించినా కూడా తత్సంబంధ ఫలము అక్షయముగానే లభిస్తుంది. ఈ తిథినాడు అక్షయుడైన విష్ణువు పూజింపబడతాడు. అందుకే దీనికి అక్షయ తృతీయ అని పేరు.
ఈ రోజు అక్షతోదకముతో స్నానం చేసి, అక్షతలను విష్ణు భగవానుని పాదములపై ఉంచి, అర్చించి, తరువాత ఆ బియ్యమును చక్కగా మరోసారి ఏరి బ్రాహ్మణులకు దానమిచ్చి, మిగిలిన వాటిని దైవోచ్చిష్టంగా, బ్రాహ్మణోచ్చిష్టంగా తలచి వాటిని ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి ఈ ఫలం తప్పక కలుగుతుంది అని పురాణంలో ఈశ్వర వాక్కు. ఇలా ఒక్క వైశాఖ శుక్ల తదియనాడు పైన చెప్పిన విధంగా నియమంతో అక్షయ తృతీయా వ్రతాన్ని ఆచరించిన తరువాత వచ్చే 12 మాసాలలో శుక్ల తృతీయ నాడు ఉపవసించి విష్ణువును ప్రీతితో అర్చిస్తే రాజసూయ యాగము చేసిన ఫలితము కలిగి అంత్యమున ముక్తిని పొందగలడు. అక్షతలు అంటే ఏ మాత్రము విరగని, పగుళ్ళు లేని, గట్టిగా ఉన్న బియ్యము. అవి వరి ధాన్యము నుండి కావచ్చు, గోధుమ ధాన్యము నుండి కావచ్చు, యవల నుండి కావచ్చు. ఇటువంటి వాటితో సిద్ధం చేసిన ఆహారమును అక్షతాన్నము లేదా అక్షతాహారము అంటారు. శ్రీ నారద పురాణం కూడా, ఈనాడు చేయు దాన ధర్మాలు అత్యధిక ఫలాన్నిస్తాయని చెపుతోంది.
అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే మంచిదా?
అక్షయ తృతీయకు బంగారానికి లింకేంటి?..💐💐
హిందువుల సాంప్రదాయం ప్రకారం….సంవత్సరంలోని మూడు రోజులు ఏ పని ప్రారంభించడానికైనా చాలా మంచివి. అవి.
1) ఉగాది.
2) అక్షయ తృతియ
3) విజయదశమి.
అందుకే ఈ మూడు రోజులను పవిత్రదినములుగా చూస్తారు. అయితే ఇక్కడ అక్షయ తృతీయ గురించి కాస్తంత వివరంగా చెప్పుకుందాం…
అక్షయ అంటే ఎప్పటికీ తరగనిది.. ఇది వైశాఖ మాసంలో శుక్ల పక్షం మూడవ రోజు వస్తుంది కాబట్టి…దానిని అక్షయ తృతియ అంటారు.
మన పురాణాల ప్రకారం ఈ రోజు..💐
వేద వ్యాసుడు అక్షయ తృతీయనాడే మహాభారతం ఆరంభించాడు.
విష్ణుమూర్తి ఆరవ అవతారమైన పరశురాముడు జన్మించింది కూడా అక్షయ తృతీయనాడే.
అక్షయ తృతీయ నాడు బంగారం కొనాలనే నియమానికి స్టార్టింగ్ పాయింట్ గా చెప్పుకునే లాజిక్:💐
కుచేలుడు దారిద్ర్యంతో అష్టకష్టాలు పడుతూ.. ఓ రోజు తన ప్రాణ స్నేహితుడైన శ్రీ కృష్ణుడిని చూసేందుకు వెళ్తాడు. కృష్ణుని వద్దకు వెళ్లేటప్పుడు అటుకులు తీసుకెళ్తాడు. స్నేహితుడిచ్చిన అటుకుల్లో పిడికిలి తీసుకుని తిన్న కృష్ణుడు అక్షయం ప్రాప్తించుగాక అని ఆశీర్వదించాడు.
కృష్ణుడి అనుగ్రహంతో కుచేలుడు అష్టైశ్వర్యాలను పొందుతాడు. ఆ రోజునే అక్షయ తృతీయగా పరిగణించబడుతోందని పురాణాలు చెబుతున్నాయి.
అయితే దీనిని ఆధారంగా చేసుకొని ఈరోజు కొన్న ప్రతి వస్తువు మూడింతలు అవుతుందని ఓ నమ్మకం.
వాస్తవానికి ఈ రోజు వ్రతం చేస్తే దానికి మూడు రెట్ల పుణ్యం వస్తుంది, పేదలకు దానం చేయడం వల్ల మూడు రెట్ల పుణ్యం వస్తుంది, కొత్త పనులు ప్రారభించడం వల్ల ఎక్కువగా సక్సెస్ అవుతాయి.
వాటిని వదిలి బంగారం కొనాలి అనే కొత్త కాన్సెప్ట్ ను మన మీద రుద్దింది మాత్రం బంగారు వ్యాపారస్థులు. మొదట అక్షయ తృతీయ నాడు బంగారం కొనాలనే విధానం ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఉండేది..కాలక్రమేణ అదే భావన మన దక్షిణ భారతదేశానికి కూడా వ్యాపించింది.
సో వీలైతే ఈ రోజు దానం చేయండి, అంతేకానీ డబ్బులు లేకున్నా అప్పుచేసి మరీ బంగారు షాపులకు వెళ్లకండి. మన దేశంలోని బంగారపు షాపులలో అత్యధిక వ్యాపారం జరిగేది ఈరోజేనట...
అక్షయ తృతీయ ప్రాముఖ్యత.💐
1. పరశురాముని జన్మదినం
2. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం
3. త్రేతాయుగం మొదలైన దినం
4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం
5. వ్యాస మహర్షి “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో, వ్రాయడం మొదలుపెట్టిన దినం
6. సూర్య భగవానుడు అజ్ఞాతవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” ఇచ్చిన దినం
7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం
8. ఆదిశంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన దినం
9. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం
10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం.
అక్షయ తృతీయ విశిష్టత.💐
వైశాఖ శుద్ధ తదియనాడు అక్షయ తృతీయ జరుపుకుంటారు . కొందరు వైశాఖ శుక్లపక్ష తృతీయ (తదియ ) రోహిణియుతమైన రోజునే, అక్షయతృతీయ పర్వదినంగా జరుపుకుంటారు . ఇది ఒక నమ్మకం మాత్రమే .
పూజలు , వ్రతాలు , నోములు , యజ్ఞాలు ,యాగాలు చేస్తే ధనము , ఐశ్వర్యము వస్తుందనేది ఎంతమాత్రము శాస్త్ర సమ్మతం కాదు . . . కాని నమ్మకం మూలానా మానవుడు కొంతవరకు ఆదా చేసే అవకాశము , కనీసము ఆరోజైనా భవిష్యత్తు అవసరాలకు ఆదాచేసే అవకాశము ఉంది.
ఒక తరము నుండి మరొక తరానికి " జ్ఞాపకాల " బదలాయింపు జరుగుతూ ఉండాలి ... ఉంటేనే మన సంస్కృతి , సంప్రదాయాలు కలకాలము నిలిచిఉంటాయి.
ఈనాడు మనం 21వ శతాబ్దంలోకి అడుగు పెట్టాము.
ఇది ఎంతో స్పీడు యుగం, అయినప్పటికి ఈ జీవితాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకునేందుకు చివరిగా పరమేశ్వర సాయుజ్యం పొందేందుకు మన హిందూ సంస్కృతి సంప్రదాయాలలో మన జీవిత గమ్యం గాడి తప్పకుండా ధర్మార్ధ కామ, మోక్షాల కొరకు చక్కని మార్గాన్ని తల్లి గర్భధారణ మొదలుకొని క్రమపద్ధతిలో జరిగే షోడశ సంస్కారాలతో మనకు ఆరంభమవుతాయి.
అట్టి పూలబాటలో అలనాటి మన ఋషులు ఆదర్శవంతంగా ఆచరించి మనకు మార్గగమ్యాన్ని చూపించారు. ఆ బాటలోనివే ఈ నోములు వ్రత్రాలు, ఉపవాసాలు, పండుగలు అన్నవి. వాటికన్నిటికినీ యుగయుగాలనాటి చరిత్రతో మేళవించబడినవి.
అటువంటి పండుగయే ఈ "అక్షయ తృతీయ-ఉగాది" పర్వదినం. . .
అక్షయం అంటే క్షయం లేకుండుట. జీవితంలో అన్నింటిని అక్షయం చేసే పర్వదినం కనుక దీనికి అక్షయ తృతీయ అని పేరు వచ్చింది. ఈ రోజున చేసిన హోమాలు, దానాలు, పిత్రుదేవతలకూ, దేవతలకూ చేసే పూజలు, క్షయం కాకుండా, అక్షయంగా ఉంటాయని, అందుచేతనే ఈ రోజుకు అక్షయ తృతీయ అని పేరు వచ్చిందని శ్రీ కృష్ణుడు, ధర్మరాజుకు చెబుతాడు.
ఈ అక్షయ తృతీయ నాడు బంగారాన్ని తప్పకుండా కొనాలని తద్వారా లక్ష్మిదేవిని తమ తమ ఇళ్లల్లో సుస్థిరంగా నివాసం ఉండేలా చేయాలని పెద్దలు చెబుతుంటారు.
బంగారం కొనుగోలు చేయలేనివారు లవణం (అంటే ఉప్పు)ను కొనుగోలు చేయవచ్చు. ఉప్పు కూడా శ్రీ మహాలక్ష్మికి కటాక్షం కలిగిన వస్తువు కనుక బంగారం కొనలేనివారు ఉప్పును అయినా కొనుగోలు చేస్తే సుఖంగా జీవిస్తారని అంటారు.
వైశాఖ శుద్ధ తదియనాడు జరుపుకునే అక్షయ తృతీయకు చాలా విశిష్టత ఉంది. ఈ రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి విష్ణువును ప్రార్థిస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు.
ఈ రోజున బదిరీనారాయణ మందిరం ద్వారములు భక్తుల దర్శనం కోసం తెరిచే ఉంటాయని వారు చెబుతున్నారు.
వైశాఖ శుక్లపక్ష తృతీయ రోహిణియుతమైన రోజునే, అక్షయతృతీయ పర్వదినంగా జరుపుకుంటారు. ఈ రోజున దేవతలను, పితృదేవతలను ఆరాధించడం ద్వారా పుణ్య ఫలము సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. గోదానము, భూదానము. సువర్ణదానము, వస్త్రదానము చేసేవారికి సుఖసంతోషాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు.
అందుచేత అక్షయ తృతీయ రోజున స్త్రీలు చిన్ని కృష్ణునికి, గౌరీదేవీకి డోలోత్సవము జరిపించి ముత్తైదువలను కన్యలను పూజించి ఫలపుష్పాదులను శనగలు వాయనమిచ్చి సత్కరిస్తే దీర్ఘసుమంగళీ ప్రాప్తంతో పాటు ఆ గృహం సిరిసంపదలతో వెల్లివిరుస్తుందని విశ్వాసం.
శ్రీ నరసింహుడు ప్రహ్లాదునికి అనుగ్రహించిన రోజునే "అక్షయ తృతీయ"గా పిలువబడుతోందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున శ్రీ మహాలక్ష్మిదేవిని పూజించడం సంప్రదాయం. ఈ రోజున బంగారం కొని ఇంటికి తెచ్చుకుంటే ఏడాదంతా సిరిసంపదలతో వర్ధిల్లుతారని విశ్వాసం.
బంగారం కొనలేని పక్షంలో శ్రీ మహాలక్ష్మి ప్రతిమ లేదా ఫోటో ముందు.. ఉప్పు, పచ్చిబియ్యం, పసుపును ఓ అరటి ఆకుపై పోసి నిష్ఠతో ప్రార్థించి, కర్పూర నీరాజనాలు సమర్పించుకునే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటున్నారు.
అదేవిధంగా ఇదే రోజున నరసింహస్వామిని పుష్ప, ఫలాలను అర్పించి దైవ నామస్మరణ చేసిన వారికి సంపద, పుణ్యఫలం ప్రాప్తిస్తాయని ప్రతీతి.
ఇంకా చెప్పాలంటే... ఈ రోజున గోధుమలు, శెనగలు, పెరుగన్నం దానం చేసిన వారికి సకల పాపాలు హరించి, శాశ్వతంగా శివసాయుజ్యం పొందుతారని పురాణాలు చెబుతున్నాయి.
వీటితో పాటు గొడుగు, పాదరక్షలు, భూమి, బంగారం, వస్త్రాలను దానం చేసే వారికి పుణ్యం లభిస్తుందని విశ్వాసం.
"వైశాఖమాసస్య చ యా తృతీయా నవమ్య సౌ కార్తీక శుక్లపక్షే
నభస్య మాసస్య తమిస్రపక్షే త్రయోదశీ పంచదశీ చ మాఘే"
కావున ఇది కృతయుగ ఆరంభ ఉగాది అని విష్ణు పురాణాదులు పేర్కొనుచున్నవి.
కొన్ని ప్రాంతములలో వైశాఖశుద్ధ తదియనాడు ఈ పండుగ చేయుచుందురు. ఈనాడే "బదరీనారాయణ" మందిర ద్వారములు భక్తుల దర్శన నిమిత్తం తిరిగి తెరుతురు. అంతవరకు ఈ ఆలయం మంచుతో నిండియుండి అగమ్య గోచరమైన ఈ హృషీకేశము భక్తులచే కిటకిటలాడుచు పూజాదికాలు ప్రారంభమగును.
ఈ పుణ్యదినమందు దేవతలను, పితృదేవతలను ఆరాధించుట, గోదానము, భూదానము, సువర్ణదానము, వస్త్రదానము, పూర్ణఘటముతో నిండియున్న ఉదక దానము మున్నగునవి, మరియు ఈ దినమందు చేయు జప, హొమ, దానాదులన్నియు "అక్షయము" పొందునుగాన! ఇది "అక్షయతృతీయ" మని కృష్ణభగవానుడు స్వయముగా ధర్మరాజుకు వివరించినాడు.
ఇందులకొక పురాణగాధకలదు..💐
పూర్వము ఒక వైశ్యుడు ఎన్నో దారిద్ర్య బాధలు వెంటాడుతున్నా; సత్ప్రవర్తన వీడక జీవించుచు ఒకసారి ఒక పౌరాణికుడు "వైశాఖశుద్ధ తృతీయ నాడు చేయు స్వల్పదానమైనను అక్షయ ఫలప్రదము" అని చెప్పగా విని, ఆ దినమందు గంగలో పుణ్యస్నానమాచరించి దేవతలకు, పితృదేవలకు తర్పణమాచరించి, ఇంటికి వచ్చి సద్‌బ్రాహ్మణులను ఆహ్వానించి వారికి యథాశక్తి భోజన తాంబూలాదులతో దానమిచ్చెను.
అలా ఆచరించిన పుణ్యఫలమే వాని వెంటవచ్చి మరుజన్మమున అతడు కుశావతీ నగరమునకు రాజుగా జన్మించెను. అయినను అతడు ఎన్నో యజ్ఞయాగాదులు, దానధర్మాలు నిర్వర్తించుచున్నను వాని సంపద అక్షయమగుటే గాని తరుగలేదుట. "అందువల్లనే మన పౌరాణికుల మాటలు పెడచెవిని పెట్టకుండా, విశ్వసించే వారికి విశ్వసించినంత ఫలం ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు.
"వైశాఖ శుక్ల పక్షేతు తృతీయా రోహిణి యుతా,
దుర్లభా బుధచారేణ సోమనాపి యుతా తథా"
వైశాఖ శుక్లపక్ష తృతీయ రోహిణీయుతమైన అత్యంత పుణ్యప్రదమైనది అని విష్ణుపురాణాదులు చెప్పుచున్నవని, పరమభాగవతోత్తముడు నారదీయవచనమును నిర్ణయామృతకారుడు ఉదహరించినాడు.
అట్టి పుణ్య ఫలాన్ని అందించే ఈ అక్షయ తృతీయను భక్తి శ్రద్ధలతో ఆచరించి సర్వులము పునీతులౌదాము.