Saturday 31 December 2016

యోగక్షేమం 1-1-2017



ఈ రోజు పసుపు వత్తులు వేసి , విప్పనూనే తో వెలిగించిన నాలుగు దీపాలు  ఇంటికి నాలుగు మూలల ఉంచండి అందులో కొంచం కర్పూరం పొడిని వెయ్యండి.ఇంట్లో ఉండే నేగిటివ్ ఎనర్జీ  పోయి  అంత శుభామౌతుంది.


శుభమస్తు

కేలండర్

 


తెలుగు కేలండర్ ని పంచాంగం అంటారు. తిథి,వారం, నక్షత్రం, యోగం, కరణం అనే అయిదు అంగాలు(విషయాలు) పంచాంగంలో ఉంటాయి.మనకి తెలసిన  కేలండర్  కీ, పంచాంగానికీ నక్క కీ ,నాగలోకానికీ ఉన్నంత వ్యత్యాసం ఉంటుంది. అవి డేట్స్ మాత్రమే చెప్తాయి. పంచాంగం అలా కాదు. సూర్య చంద్రాది గ్రహ గతులు అపార వైదిక గణిత శాస్త్రంతో విడమర్చి చెప్తాయి. పౌర్ణమి ఎప్పుడు?సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఎప్పుదేర్పడతాయి? ఇలాంటి మహత్తరమైన కాలపు లెక్కలు మన పంచాంగంలో ఉంటాయి. ఇవన్నీ మనం ఈ రోజు చూస్తున్న కేలండర్ కి చాలాచాలా వేల సంవత్సరాలకి ముందే మన భారతీయులు సాధించిన ఖగోళ గణిత విజ్ఞానం. 


మనం పుట్టిన వేళని బట్టి, అప్పుడున్న గ్రహగతుల్ని బట్టి ఎప్పుడు మంచి జరుగుతుందో, ఎప్పుడు బాధలోస్తాయో లెక్కలు గట్టి…. దానికి రెమెడీలు చెబుతారు. అంటే, చీకటి పడుతుంటే మనం అలా చీకట్లో బాధపడకుండా కొవ్వొత్తో, లాంతరో, లైటో వాడతాం!  ఫలానా పూజలు చెయ్యి, ఫలానా జపాలు చెయ్యి, ఫలానా దానాలు చెయ్యి-అని కొవ్వొత్తులూ, లాంతర్లూ వాడడం లాగా –పరిహారాలను చెప్పేదే పంచాంగం. 


మనకీ నెల్లో బాగుందనీ అదృష్టం వేరిస్తుందని, మనకీ నెల్లో నష్టం జరగవచ్చుననీ కష్తం వస్తుందని కేలండర్లు చెప్పలేవు. కానీ పంచాంగం ఈ విషయాలన్నింటిని  చెబుతుంది. అలాంటి మంచి మాటలూ, మంచి రోజులూ చెబుతుంది. గనుకనే పంచాంగాన్ని ఇన్ని వందల వేల సంవత్సరాల నుంచి మనంగౌరవిస్తున్నాం,పాటిస్తున్నాం.


భవిష్యత్తును సైతం అంచనా వేయగల మేధావులు మన పంచాంగకర్తలు .ప్రపంచంలో  ఖగోళ పరిజ్ఞానం  అతి ప్రాచీన కాలం నుండీ  మన హైందవసంస్కృతి లో ఉంది. శాస్ర్తీయమైన యతార్థ విజ్ఞానాన్ని తెలుసుకోకుండా, పాశ్చాత్య సాంప్రదాయాలపై నేడు మన హిందూ యువత మోజు చూపుతోంది. అందరు అనుసరించిన, అనుసరించవలసిన అసలు కాలమానం ఏది? ప్రస్తుతం మనం అనుసరిస్తున్న ఇంగ్లీష్ కాలమానంలో లోపాలు ఏంటి? 

ఏ కాలంలోనైనా ప్రపంచంలోని ఏ ప్రాంతానికైనా కాలమానానికి "ఖగోళమే" ఆధారం. ఇది ఎవరూ కాదనలేని సత్యం.కాలమాన అంశాలైన రోజు, వారం, పక్షం, మాసం, ఋతువు, అయనం, సంవత్సరం. పుష్కరం, శకం, యుగం కల్పకం మొదలైన అన్నింటినీ ప్రాచీన కాలం నుంచి హిందువులు ఖగోళ శాస్ర్త ఆధారంగానే ఏర్పాటు చేసుకున్నారు.విశ్వం లోని అంశాలైన నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కలు, గ్రహశకలాలు మొదలైన వాటి స్థితి గతుల్ని వివరించే శాస్ర్తమే ఖగోళశాస్ర్తం. కాలమాన విజ్ఞానాన్ని తెలుసుకోవాలంటే ఖగోళ శాస్ర్త పరిజ్ఞానం అత్యంత ముఖ్యం. భూమి వాతావరణానికి అవతల వ్యాపించి ఉన్న అనంత విశ్వాన్ని అంతరిక్షం అంటారు. గ్రహతారకాదులతో కూడి ఉన్న ఈ అంతరిక్ష పరిధినే ఖగోళం అని వ్యవహరిస్తారు. భూమి ఒక ఆత్మ ప్రదక్షిణం చేస్తే 1 రోజు అనీ, చంద్రుడు ఒక భూ ప్రదక్షిణ చేస్తే 1 నెల అని, భూమి ఒక సూర్య ప్రదక్షిణం చేస్తే 1 సంవత్సరం అనీ...ఇలా కాలమానాన్ని ఖగోళ విషయ ఆధారంగానే ఉండి తీరాలనేది  నియమం.


సంవత్సరం అనేది కాలమానంలో ఒక అంశం. నక్షత్రాల, గ్రహాల ఉనికీ సంవత్సర ఆరంభానికి ఖచ్చితంగా ఒక ఖగోళ ప్రత్యేకత అంటూ ఉండి తీరాలి. ఏ ఖగోళ పత్ర్యేకతా . ఆధారమూ లేకుండా ఎవరికో తోచిన జనవరి ఫస్ట్ ను సంవత్సరారంభంగా అంగీకరించి అనుసరించడం సరికాదు.మనం పాటించాల్సిన యదార్థ సంవత్సరారంభం ఉగాది.
క్రీస్తు శకాన్ని ఉపయోగిస్తూ కాలాన్ని లెక్కిచండం ఎందుకొచ్చింది? అందరూ క్రీస్తు శకాన్నే వాడడంలో ఏమైనా ప్రముఖ విశేషం ఉందా?

చరిత్రలో ఎప్పుడు ఏ సంఘటన జరిగిందో ఖచ్చితంగా తెలుసుకోవడానికి సంవత్సరాలను వరుసగా లెక్కించుకుంటూ రావడం అవసరమైంది. అయితే ఈ లెక్కకు ఎక్కడ నుంచి మొదలైందని చెప్పడం కష్టమే. పురాణ పురుషుల కాలం నుంచో.. మహా ప్రతిభావంతులైన చక్రవర్తుల కాలం నుంచో, ప్రవక్తల కాలం నుంచో... ఏదైనా గొప్ప సంఘటన జరిగిన నాటి నుంచో- సంవత్సరాలను లెక్క పెట్టడం చరిత్రలో ఒక రివాజు. దీనినే శకం లెక్కింపు అంటారు. 

ఒక్కొక్క జాతి ఒక్కొక్క కాలంలో తమ శకాలను ప్రారంభించుకుంది. మన హిందూజాతికి అతి పురాతన కాలం నుంచీ అనేక శకాలున్నాయి. కలిశకం, విక్రమశకం, శాలివాహన శకం మొదలైనవి ఉన్నాయి. ప్రస్తుతం కలిశకం లెక్క ఆచరణలో ఉంది. ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో అలవాటు చేయబడిన క్రీస్తు శకం కాలమానాన్ని ప్రపంచరీతి కోసం నేటికీ మనం అనుసరిస్తున్నాం.

 నేడు ప్రపంచంలో క్రైస్తవాన్ని ఆదరించే దేశాల ప్రాబల్యంతో ఏసు క్రీస్తు శకాన్ని ఉమ్మడి శకంగా తీసుకోవాల్సివచ్చింది. అంతేగానీ ఈ శకాల కంటే క్రీస్తు శకానికి ఏదో ప్రత్యేకత ఉందని మాత్రం కాదు.
వివిధ దేశాల ప్రజలు వివిధ కాలమానాలతో జీవనాలు సాగించేవారు. ఎవరి లెక్కలు వారికుండేవి. తమకు తెలియని విషయాన్ని, మరో జాతి నుంచి నేర్చుకునేవారు. అయితే కాలం గడిచేకొలదీ...ప్రపంచమంతా ఒకే కాలమాన పద్ధతిని అనుసరిస్తే బావుంటుందనే భావన మొదలయ్యింది. అయితే ఎవరి కాలమానాన్ని...ఈ ప్రపంచ కాలమానంగా తీసుకోవాలనే సమస్య వచ్చింది. ఈ సమస్య ఉత్పన్నమైనప్పుడు ప్రపంచంలో అనేక ప్రాంతాలు బ్రిటీష్ వారి ఆక్రమణలో ఉన్నాయి. దీంతో బ్రిటీష్ వారు తాము స్వీకరించిన క్రీస్తు శకం అనే కాలమానాన్ని బలాతిశయంతో ప్రముఖంగా ముందుకు తీసుకువచ్చారు. తమ ఆధీనంలోని అన్ని దేశాలలో ఈ శకాన్ని అమలుపర్చడం మొదలు పెట్టారు. ఈ విధంగా ప్రపంచలోని అనేక దేశాల్లో క్రీస్తు శకం వాడకం మొదలైంది. ఆ తర్వాత మిగిలిన దేశాలు తమ సౌలభ్యం కోసం క్రీస్తు శక కాలమానాన్ని తప్పనిసరిగా తీసుకోవాల్సి వచ్చింది.
అయితే క్రీస్తు శకంలో ఓ తిరకాసు ఉంది. ఏసు క్రీస్తు ఎప్పుడు పుట్టాడనే విషయాన్ని చరిత్రకారులెవరు కూడా ఒక నిర్థారణగా ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు. క్రీస్తు జీవితానికి సంబంధించిన ఏ చారిత్రక ఆధారమూ కన్పించడం లేదని విదేశీ చరిత్రకారులు తెలిపారు. ప్రముఖ చరిత్రకారులు హెచ్. జివెల్స్ తన ప్రపంచ చరిత్ర గ్రంథంలో క్రీస్తు జీవితానికి సంబంధించిన ఆధారాలు లభించడం లేదని తెలిపారు. బైబిల్ కూడా క్రీస్తు అనంతరం రాయబడింది.
చాలా మంది క్రీస్తు పుట్టుక నుంచే క్రీస్తు శకం మొదలైందని అనేకమంది భావిస్తారు. ఏసు క్రీస్తు జీవించాడానికి చెప్పబడుతున్న కాలానికి కొన్ని శతాబ్దాల తర్వాత క్రీ.శ. 532వ సంవత్సరంలో డయోనీషియన్ ఎక్సీగస్ అనే రోమన్ సన్యాసి, క్రీస్తు పేరుతో ఒక శకాన్ని ప్రారంభించాలంటూ ప్రచారం మొదలు పెట్టాడట..! క్రీస్తు పుట్టిన సంవత్సరం క్రీ.శ.1అని ఆయన ప్రతిపాదించాడు. అయితే చాలా కాలం వరకూ ఈ క్రీస్తు శకం అనే అంశాన్ని ఎవరూ అంగీకరించలేదు. క్రీ.శ.816లో చల్సా బిషప్ ల మహాసభ క్రీస్తు శకాన్ని వాడకంలోకి తీసుకురావాలంటూ పిలుపునిచ్చింది. అయినా కూడా చాలా సంవత్సరాలు ఎవరూ పట్టించుకోలేదు. క్రీ.శ.879 లో జర్మనీ చక్రవర్తి 2వ ఛార్లెస్ మొట్టమొదటగా క్రీస్తు శకాన్ని అమలులో పెట్టాడట. అనంతర కాలక్రమంలో ఇతర చోట్ల మెల్లమెల్లగా క్రీస్తు శకం వాడకం మొదలైంది. ఇది క్రీస్తు శకం అసలు చరిత్ర.! అంటే క్రీస్తు జీవితానంతరం సుమారుగా 800 సంవత్సరాల తర్వాత, క్రీస్తు శకం అమలులోకి వచ్చిందన్నమాట. అయితే క్రీస్తు పుట్టింది. క్రీ.శ.1 లో కాదనీ , క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో అయి ఉండవచ్చుననీ సుప్రసిద్ధ చరిత్రకారుడు సర్ జాన్ కెప్లర్ తేట్చాడని కొంతమంది చెబుతారు. అయినా కూడా క్రీస్తు శకం లెక్కను మాత్రం ఎవరూ మార్చలేదు. అలాగే వదిలేశారు. ఇది అలాగానే కొనసాగుతోంది.
అమెరికాకు చెందిన చరిత్రకారుడు విల్ డ్యూరాంట్...క్రీస్తు గత చరిత్రపై పరిశోధన చేశాడు. డిసెంబర్ 25న క్రిస్ మస్ పండుగపై కూడా ఆయన ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టాడు. క్రీ.స్తు పుట్టిన సంవత్సరాన్ని చరిత్రకారులు బయటపెట్టలేకపోయాడు. ఆయన పుట్టిన నెల, తేదీలను నిర్ణయించగల అవకాశాలు చరిత్రలో ఎక్కడ కనిపించలేదని...దీంతో ఆ కాలాన రోమ్ నగరంలో ప్రతియేటా డిసెంబర్ 25వ తేదీన శాటర్నేలియా అనే పండుగ వేలాది మందితో తిరునాళ్ల వలే జరుపుకునేవారు. ఇది క్రైస్తవ మత ప్రచారానికి అనుకులంగా ఉంటుందని భావించిన ఎక్సీగస్ ఇదే రోజును క్రీస్తు జన్మదినంగా ప్రచారం చేసేవాడట..! కాలక్రమేణ ఆ ప్రచారం ముదిరి క్రీ.శ.1020 నాటికి డిసెంబర్ 25వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా క్రీస్తు జన్మదినంగా అనేక చోట్ల స్థిరపడింది.


.క్రీస్తు శకం వాడకం ఒక ఆధారమంటూ లేకుండా కొనసాగుతున్న ఆచారం..! వసంత ఋతువులో సంత్సరాదిని ఏర్పాటు చేసుకోవడం ఖగోళపరంగా ఖచ్చితమైన పద్ధతి. కాలమానంలో సుక్ష్మఘడియలు, పరఘడియలు, విఘడియలు, ఘడియలు, రోజులు, వారాలు, మాసాలు, సంవత్సరాలు...మొదలైనవి ఏర్పరచిన అతి ప్రాచీన కాలమానం మనది. ఇవన్నీ కూడా ఖగోళ ఆధారంగానే ఏర్పరచడం జరిగింది. విదేశీ కాల్యెండర్ లో జనవరి 1వ తేదీ నుంచి డిసెంబర్ 31 వరకూ తేదీల్ని అంకెల్లో లెక్కించుకోవడం తప్ప... ఏ తేదీన ఖగోళ పరిస్థితి ఎలా ఉన్నది తెలిపే విధానం ఏదీ లేదు. కానీ అదే మన హిందూ పంచాంగంలో ఖగోళ పరిస్థితి తెలిపే విధానం ఉంది.తెలుగు వాళ్ళందరం దానినే అనుసరిద్దాం.


తిరుప్పావై 17 వ రోజు




ఆచార్యుడు అందించే మంత్రం
పాశురము

అమ్బరమే తణ్ణీరే శోఱే అఱం శెయ్యుం
ఎమ్బెరుమాన్ నందగోపాలా! ఎరుందిరాయ్
కొన్బనార్ క్కెల్లాం కొరుందే! కుల విళక్కే
ఎమ్బెరుమాట్టి యశోదా! అఱివుఱాయ్
అమ్బరం ఊడఱుత్తు ఓంగి ఉలగళంద
ఉమ్బర్ కోమానే! ఉఱంగాదు-ఎరుందిరాయ్
శెమ్బొఱ్ కరలడి చ్చెల్వా బలదేవా!
ఉమ్బియుం నీయుం ఉఱంగ్-ఏలోర్ ఎంబావాయ్


ఈరోజు ఆచార్యుడు, ఆచార్యుడి ద్వారా అందే మంత్రం, ఆ మంత్రార్థం అయిన పరమాత్మ, ఆ పరమాత్మ ను అందించే భాగవతోత్తముల సేవ ఇవన్నిన్నీ పాశురంలో వివరించింది. నిన్న ద్వారపాలకులు మనవాళ్ళను లోనికి పంపాక, ఒక్క సారి తొంగి చూసారు. అయితే వరుసగా కొన్ని పడకలు కనిపించాయి అందులో మొదట నందగోపుడు, తరువాత యశోదమ్మ ఆ తర్వాత అంత స్పష్టంగా కనిపించట్లేదు, కాని ఒక కాలికి కడియం వేసి ఉంది, మరొక పాదంలో గుర్తులు కనిపిస్తున్నాయి బహుషా వారు కృష్ణ, బలరాములై ఉండొచ్చు అని అనుకున్నారు. ఏక్రమంలో చూస్తున్నారో అదే క్రమంలో లేపడం ప్రారంభించారు.
ఎదుటి వారిని ప్రసన్నం చేసుకోవడానికి వారి కీర్తిని పొగుడుతుంది ఆండాళ్, "అమ్బరమే" వస్త్రములు, "తణ్ణీరే" నీళ్ళు, "శోఱే" ఆహారం, "అఱం శెయ్యుం" ఏ ప్రయోజనం ఆశించకుండా, "ఎమ్బెరుమాన్" దానం ఇచ్చే "నందగోపాలా!" నంద గోపాలా "ఎరుందిరాయ్" లేవయ్యా, అనిలేపారు.
ఆ తర్వాత యశోదమ్మ కనబడుతుంది, మొదట ఆచార్యుడు లభిస్తే తద్వారా లభించేది ఆచార్య ఆధీనంలో ఉండే మంత్రం. అదే యశోదమ్మ అని అనొచ్చు, ఎందుకంటే యశస్సును ప్రసాదించేది - యశోద లేక మంత్ర రత్నం. "కొన్బనార్ క్కెల్లాం" సుందరమైన దేహ స్వరూపం కల్గి, స్త్రీ జాతి కందరికి "కొరుందే!" చిగురులాంటి దానా. "కుల విళక్కే" ఆ కృష్ణ ప్రేమ కల్గిన కులానికే ఒక దీపంలాంటి దానా "ఎమ్బెరుమాట్టి" నీవే ఆయన అనుగ్రహాన్ని కల్గించే స్వామినివి "యశోదా!" ఓ యశోదమ్మా! "అఱివుఱాయ్" తెలివి తెచ్చుకో. యశోదమ్మను మంత్రం గా ఊహించింది అందుకే తెలివితెచ్చుకో అని చెబుతుంది. ఓ అష్టాక్షరీ మహా మంత్రమా జ్ఞానాన్ని ప్రసాదించు అని అర్థం. ఇంక యశోదమ్మ కూడా అంగీకరించింది, ఆమెను దాటి వీళ్ళు లోపలికి వచ్చారు.
అక్కడ ఒక పాదంలో కొన్ని గుర్తులు కనబడుతున్నాయి, అదే కృష్ణుడు అని గమనించి అక్కడికి వెళ్ళారు. "అమ్బరం ఊడఱుత్తు" ఆకాశం మద్య అంతా ఆక్రమించేట్టుగా "ఓన్గి" పెరిగి "ఉలగళంద"లోకాలను అంతా కొలిచిన, "ఉమ్బర్ కోమానే!" దేవతలందరికి నియంత అయిన స్వామి "ఉఱంగాదు" నిద్ర పోవటానికా నీవు వచ్చావా ఇక్కడికి, "ఎరుందిరాయ్" లేవయ్యా. అమ్మ ఈరోజు ఆకాశాన్ని కొలిచిన పాదాన్ని పాడుతుంది. ఇన్నాళ్ళు మాకు తెలియక నీ వద్దకు రాలేదు, ఇప్పుడు నీగురించి తెల్సుకొని వచ్చాం లేచి మమ్మల్ని అనుగ్రహించవయ్యా అని అండాళ్ విన్నపించింది.
ఆయన లేవలేదు, అన్నగారు లేవలేదని ఆయన లేవడం లేదని ఆండాళ్ భావించి బలరాముణ్ణి లేపడం ప్రారంభించింది. కృష్ణావతరంలో బలరాముని ఆధీనంలో ఉంటాడు, బాలరాముణ్ణి విడిచి ఉండడు. దేవకీ దేవి గర్భంలో ఆరుగురు శిషువులు పుట్టారు, ఎవ్వరూ దక్కక పోయే సరికి ఏడో గర్భాన్ని రక్షించటానికి రోహిణీ దేవి గర్భంలో పెంచారు, ఆ పుట్టిన శిషువుకి ఒక బంగారు కడియం వేసారు, ఆయన పాద విశేషంచే కృష్ణుడు మనకు దక్కాడు. "శెమ్బొఱ్ కరలడి" అపరంజి బంగారు కడియం కల్గిన "చ్చెల్వా" ఓ సంపన్నుడా "బలదేవా!" బలదేవా! "ఉమ్బియుం నీయుం" నివ్వూ నిద్ర పోకూడదు, "ఉఱంగ్" మమ్మల్ని రక్షించు. అయితే బలరాముడు లేచి మీరు బ్రమించారు, కృష్ణుడు ఇక్కడ లేడు నీళాదేవి భవనంలో ఉన్నాడని రహస్యాన్ని చెప్పాడు. 

ఆండాళ్ తిరువడిగలే శరణం 
జై శ్రీమన్నారాయణ్

ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371






తిరుప్పావై 16 వ రోజు




భగవంతుణ్ణి పొందేది ఆచార్యుని ద్వారానే
పాశురము

నాయగనాయ్ నిన్ఱ నందగోపనుడైయ
కోయిల్ కాప్పానే! కొడిత్తోన్ఱుం తోరణ
వాశల్ కాప్పానే, మణిక్కదవం తాళ్ తిఱవాయ్
ఆయర్ శిఱుమియరోముక్కు అఱై పఱై
మాయన్ మణివణ్ణన్ నెన్నలే వాయ్-నేరుందాన్
తూయోమాయ్ వందోం తుయిలెర ప్పాడువాన్
వాయాల్ మున్నం మున్నం మాత్తాదే అమ్మా
నీ నేశనిలైక్కదవం నీక్కు- ఏలోర్ ఎంబావాయ్


మన ధనుర్మాస వ్రత మహోత్సవంలో గత పది పాశురాల్లో ఒక పది మంది జ్ఞానుల అనుగ్రహాన్ని మన పై పడేట్టు చేసింది మన ఆండాళ్ తల్లి. ఈ రోజు వారందరిని మనతో కల్పి నందగోప భవనానికి తీసుకువచ్చింది. ఆ నందగోపుడినే మనం ఆచార్యుడు అంటాం. ఎందుకంటే భగవంతుణ్ణి తలచి, భగవంతుణ్ణి తనలో కల్గి ఆనందించేవాడు కాబట్టి ఆయన నందుడు, ఆ భగవంతున్ని దుష్టుల దృష్టిలో పడకుండా దాచి గోప్యంగా ఉంచేవాడు అందుకే ఆయన గోపుడు. ముందుగా మనం చేరాల్సింది ఆచార్యుడి వద్దకు, అందుకే ఆండాళ్ తల్లి మనల్ని ఆచార్య భవనానికి తీసుకెళ్తుంది.
ఆ భవనంకు ఒక తోరణం ఒక ద్వజం కట్టి ఉన్నాయి, ఇదే నందగోప భవనం అని మన వాల్లంతా వచ్చారు. నందగోకులం కదా, ఎప్పుడూ ఏదో ఒక అసురుడు వస్తాడేమోనని చాలా కాపలా ఉండేది, వీరంతా అక్కడికి రాగానే అక్కడ ద్వార పాలకులు అప్రమత్తం అయ్యారు. ఆండాళ్ ముందుగా వాళ్ళను ప్రసన్నం చేసుకుంటుంది.
"నాయగనాయ్ నిన్ఱ" నాయకుడవై ఉండే "నందగోపనుడైయ" నందగోపుడి "కోయిల్ కాప్పానే!" భవనాన్ని కాపాడేవాడా! నందగోపుడెందుకు మాకు, అసలు నీవే మానాయకుడివి. చిన్న పిల్లల్ని చూసి ఆయన కంటితోనే అంగీకారం చెప్పాడు, లోనికి పంపాడు. అక్కడ ఇంకో ద్వార పాలకుడు ఉన్నాడు, అక్కడ "కొడిత్తోన్ఱుమ్" ఒక గరుడ ద్వజం ఉంది, దాన్ని గుర్తు చూసుకొని శ్రీకృష్ణుడు ఉందేది ఇక్కడే అని వాళ్ళంతా వచ్చారు. శ్రీకృష్ణుణ్ణి కలవడానికి అందరూ రాత్రుల్లే వచ్చేవారు ఎందుకంటే ఆయన ఉదయం గోవులు కాయటానికి యమునా నదికి వెళ్ళేవాడు. మరి ఆ నందగోకులంలో భవనాలు అన్నీ ఒకేలా ఉండటంతో, తనను చేరల్సినవారు పొరపాటుతో వేరే ఇంటి తలుపు తట్టకుండా భగవంతుడు చేసుకున్న ఏర్పాటు - ఆ గరుడ ద్వజం. ఇదీ భగవంతుని చేష్ట. "తోరణ వాశల్ " మంచి అద్భుతమైన తోరణం చెక్కి ఉన్న ద్వారం ఏర్పాటు చేసాడు నందగోపుడు. ఎందుకంటే శ్రీకృష్ణుణ్ణి చూద్దామని వచ్చిన వాళ్ళు. అధ్భుతమైన తోరణాన్నే చూస్తూ శ్రీకృష్ణుణ్ణే మరచిపోయేట్టు చేస్తాయట. ఇతర వాటి యందు దృష్టి లేకుండా శ్రీకృష్ణుడియందు మాత్రమే దృష్టి కల్గినవారు మాత్రమే నేరుగా శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళేవారు. మన ఆలయాల్లో ఉండే అద్భుతమైన శిల్పాల ఏర్పాటు అందుకే, ఒక వేళ మన దృష్టి ఇతరత్రమైన వాటి యందు ఉంటే అక్కడే ఆగిపోతావు, అది దాటితే లోపలున్న పరమాత్మను దర్శనం చేసుకుంటావు. అలాగే శ్రీకృష్ణుడి భవనానికి నందగోపుడు అలాంటి ఏర్పాటు చేయించాడు. అలాంటి ద్వారాన్ని "కాప్పానే" కాపాడేవాడా అని నమస్కరించారు. "మణిక్కదవం " మణి మాణిక్యాలతో ఉన్న ద్వారం "తాళ్ తిఱవా" తాళ్ళం తీయవయ్యా.
ఎందుకొచ్చారు మీరింత రాత్రి అడిగాడు ఆయన. శ్రీకృష్ణుణ్ణి కలవడానికి వీళ్ళేదు అన్నాడేమో "ఆయర్ శిఱుమియరోముక్కు" చిన్న గొల్ల పిల్లలం మేమంతా. మరి ఏం కోరి వచ్చారు మీరు అని అడిగాడు. "అఱై పఱై" వ్రత పరికరాలు ఇస్తానన్నాడు శ్రీకృష్ణుడు అందుకే వచ్చాం అన్నారు. ఓ ఏదో ప్రయోజనం కోరి వచ్చారు కదా, అయితే తెల్లవారిన తర్వాత రమ్మని చెప్పాడు. మా కర్మ ఇలా ఉంది కాని, " నెన్నలే వాయ్-నేరుందాన్" నిన్న మమ్మల్ని కల్సి ఇంటికి రమ్మన్ని మాచుట్టూ తిరిగాడు, ఇప్పుడు మేం అయనచుట్టు తిరగాల్సొస్తుంది, "మాయన్" ఉత్త మాయావి, మరి వదిలేద్దామా అయనని అంటె "మణివణ్ణన్" ఆయన దివ్య కాంతి మమ్మల్ని వదలనివ్వటమం లేదయా. ఆయన ఎడబాటుని తట్టుకోలేమయా మేం. "తూయోమాయ్ వందోమ్" చాలా పవిత్రులమై వచ్చాం, ఇతరత్ర ప్రయోజనాలు కోసం రాలేదు, ఆయనేదో ఇస్తానంటే పుచ్చుకుందాం అని అనుకున్నాం కాని మేం వచ్చింది "తుయిలెర ప్పాడువాన్" ఆయన పవళించి ఉంటే ఎట్లా ఉంటాడో చూసి సుప్రభాతం పాడి లేపుదాం అని.
"వాయాల్ మున్నం మున్నం మాత్తాదే అమ్మా" అమ్మా స్వామీ ముందు నీవు నోటితో అడ్డు చెప్పకుండా, "నీ నేశనిలైక్కదవం" శ్రీకృష్ణ ప్రేమచే సుదృడంగా బంధించబడి ఉన్న ఆ ద్వారాలను తెరువు, ఎందుకంటే నందగోకులంలో మనుష్యులకే కాదు, వస్తువులకు కూడా శ్రీకృష్ణుడంటే ప్రేమ, ఎవ్వరు పడితే వారు తెరిస్తే తెరుచుకోవు, "నీక్కు" నీవే తీయవయ్యా అని అయనను ప్రార్థించి లోపలికి వెళ్ళారు.

ఆండాళ్ తిరువడిగలే శరణం 
జై శ్రీమన్నారాయణ్

ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog

Friday 30 December 2016

తిరుప్పావై 15 వ రోజు




ఆచార్య సన్నిదానానికి చేరే ముందర స్థితి
పాశురము

ఎల్లే! ఇళంకిళియే! ఇన్నం ఉఱంగుదియో
శిల్ ఎన్ఱ్ అరైయేన్మిన్ నంగైమీర్! పోదరుగిన్ఱేన్
వల్లై ఉన్ కట్టురైగళ్ పండేయున్ వాయఱిదుమ్
వల్లీర్గళ్ నీంగళే నానే తాన్ ఆయిడుగ
ఒల్లై నీ పోదాయ్ ఉనక్కెన్న వేఱుడైయై
ఎల్లారుం పోందారో పోందార్ పోంద్-ఎణ్ణిక్కోళ్
వల్లానై కొన్ఱానై మాత్తారై మాత్తరిక్క
వల్లానై మాయనై ప్పాడ-ఏలోర్ ఎమ్బావాయ్



మనిషికి సహనం, ఓరిమి కలగడం చాలా కష్టం. ఉద్రేకం రావడం అనేది మానవసహజం, కాని దాన్ని ఓరిమితో సహించడం మానవప్రయత్నంతోనే సంభవం. దీన్నే మనం సాధన అంటాం. ఇది భాగవత సహవాసం వల్ల ఏర్పడుతుంది. అలా ఏర్పడి ఉంటే, అప్పుడు ఆచార్య కటాక్షం కలిగే యోగ్యత ఏర్పడింది. మంత్రానుసంధానం చేసే స్థితి లభించినట్లే. ఆచార్య సన్నిదానానికి చేరే ముందర కల్గాల్సిన దాంట్లో ఇది ముందర స్థితి . ఈ రోజు ఆండాళ్ తల్లి ఎట్లాంటి భాగవతోత్తముల సహవాసం మనకు కావాలో చెబుతుంది.
ఈరోజు పాశురం బయటగోపబాలికలకు లోపలగోపబాలిక మద్య సంభాషనలా సాగుతుంది. నిన్నటి గోపబాలికతో కల్సి వీరంతా స్వామిని పంఖజ నేత్రా, పుండరీకాక్షా అని పాడుతుంటే విన్నది. ఈవిడకి భాగవతోత్తముల పాటలంటే చాలా ఇష్టం. తాను లేచి బయటకొస్తే వారు పాడటం ఆపేస్తారేమో నని అనుకోని తాను లోపలనుండే గొంతు కలిపి ఆనందిస్తుంది.
అంతలోనే వాళ్ళంతా అక్కడ చేరగానే లోపల గోప బాలిక మెలుకువతోనే ఉండి తమ దగ్గరకు రాలేదని కోపంతో, "ఎల్లే!" ఏమే "ఇళంకిళియే!" లేత చిలకా! "ఇన్నం ఉఱంగుదియో" ఇంకా నిద్ర పోతూనే ఉన్నావా. వీళ్ళకేమో ఈ గోపబాలిక అందమైన గొంతు కలదని, వారి వెంట ఈ గోప బాలిక ఉంటే శ్రీకృష్ణుడు తప్పక వాళ్ళకు దొరుకుతాడు అని భావిస్తున్నారు ఆమెలోని యోగ్యతను పొగుడుతున్నారు.
కాని లోపల గోప బాలికకు నేను మిమ్మల్ని అంతా ఎడబాసి బాధతో నేనుండగా నన్ను పొగడటం సరికాదు అని, శ్రీకృష్ణుడు తన దగ్గర ఉన్నట్లు భావించి ఆక్షేపిస్తున్నట్లుగా అనిపించి "శిల్ ఎన్ఱ్ అరైయేన్మిన్" ఏమిటా గోల మీరంతా, శ్రీకృష్ణుడు నా దగ్గర ఏమి లేడు "నంగైమీర్!" పరిపూర్ణులు మీరే. "పోదరుగిన్ఱేన్" వస్తున్నాను అని అంది.
బయట నుండి వాళ్ళు " వల్లై" మహా సమర్దురాలివే "ఉన్ కట్టురైగళ్" నీనోటి దురుసుతనం మాకు తెలుసులే, "పండేయున్ వాయఱిదుమ్" ఎప్పటినుండో మాకు నీ సంగతి తెలుసులే అని అన్నారు. అంతలో లోపల గోప బాలిక "వల్లీర్గళ్ నీంగళే" మీరే సమర్థులు, నన్నా సమర్థురాలు అని అంటున్నారు, అసలే నేను శ్రీకృష్ణుడి ఎడబాటుచే భాదలో ఉన్నాను, మీరేమో అంతా కల్సి శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళడానికి సిద్దంగా ఉన్నారు, "నానే తాన్ ఆయిడుగ" రాకపోవడం నాదే తప్పు అని ఓరిమితో అంది.
కాని బయట నుండి, "ఒల్లై నీ పోదాయ్" ఏమే రా! మరి ఇంక, "ఉనక్కెన్న వేఱుడైయై" మరి తప్పు ఒప్పుకున్నా నీకేమి వేరే అనుభవమా మరోకసారి ఎత్తిపొడిచారు లోపల గోపబాలికను పరిక్షించటానికి. ఆమె లోపలనుండి "ఎల్లారుం పోందారో" అంతా వచ్చారా అంది, బయటనుండి వీల్లు "పోందార్" అందరూ వచ్చారు, నీవు బయటికి రా నీ దర్శనం మాకు కావాలి అన్నారు.
"పోంద్-ఎణ్ణిక్కోళ్" ఏం చేద్దాం అందరం అని ఆడిగింది లోపల గోప బాలిక. "వల్లానై కొన్ఱానై " బలం కల్గిన ఏనుగు -కువలయాపీడం "మాత్తారై మాత్తరిక్కవల్లానై" దాని కొమ్ములను విరిచి ఆ కొమ్ములతోనే సంహరించిన స్వామి, శత్రువులలోని శత్రుత్వాన్ని తోలగించగల్గినవాడు "మాయనై" చిత్ర విచిత్ర మైన మాయలు చేసే మాయావిని "ప్పాడ" పాడుదాం.
ఆండాళ్ తల్లి అయిదోపాటలో మాయనై అని మొదలుపెట్టి శ్రీకృష్ణ అవతారాన్ని ప్రారంభించింది. శ్రీకృష్ణుడు పుట్టింది మథురలో, పెరిగింది గోకులంలో అక్కడ ఎన్నెన్నో ఆశ్చర్యకరమైన పనులు చేసి మల్లీ మథురా నగరానికి తిరిగి వచ్చి కంస సంహారం చేసాడు. మథురానగరం నుండి బయలుదేరి మళ్ళీ తిరిగి అక్కడికే వచ్చేవరకు ఉంది ఆయన మాయ. పుట్టగానే రాత్రికి రాత్రికే యమునానది దాటి ఆవల గోకులానికి బయలుదేరాడు, అక్కడికి పంపిన పూతన, శకటాసురుడు, అశ్వాసురుడు, బకాసురుడిని సంహరించి తన కళ్యాణ గుణాలతో అక్కడివారిని పిచ్చెక్కించి, అక్కడినుండి తిరిగి మథురకు వచ్చి కువలయాపీడాన్ని, చారూణముశ్టికులను చంపి, కంసున్ని చంపి, బందీగా ఉన్న ఉగ్రసేనున్ని రాజుగా చేసి మథురానగరానికి పట్టిన దారిద్ర్యాన్ని తొలగించాడు. ఇది భగవంతుడు చేసే చేష్ట.
ఈరోజుతో పదో గోపబాలికను లేపుతూ మనకు ఒక పది రకాల జ్ఞానులని, వారి జ్ఞాన దశలను పరిచయం చేసింది ఆండాళ్. అలాంటి యోగ్యత కల్గిన మహనీయుల్ని మనం చేరి ఉండాలని, వారిని దర్శించుకుంటూ వారు ఆదేశించిన మార్గంలో పయనిస్తూ జీవితంలో ముందుకు సాగ గలిగితే అది మనకు శ్రేయస్సు. ఇది నిలబడడానికి మనం భగవంతుణ్ణి ప్రార్థించాలి తప్ప, లోకంలో భక్తులను దూరం చేసుకోకూడదు. తిరుప్పావై మనకు అదే నిరూపణ చేస్తుంది. పదిమంది గోపికలను లేపే ఈ పది పాటలే తిరుప్పావై అంటారు, ఇక ఈ నమ్మకం గట్టి పడటానికి మిగతా పాటలు.

ఆండాళ్ తిరువడిగలే శరణం  
జై శ్రీమన్నారాయణ్

ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

మొండి అప్పులు వసూలవడానికి








మొండికి పడిన అప్పులు వసూలు అవ్వడానికి నలభై రోజులు కొబ్బరినూనె తో  దీపారాధన చెయ్యాలి .క్రమంగా అప్పులు వసూలు అవుతాయి.

పాము కలలో కన్పిస్తే ???





నెరవేరని ఆశల్లో ఒక భాగమే కలలుగా వస్తాయని  అంటూ ఉంటారు. అయితే స్వప్నంలో పాములు కనబడితే మంచిదని, సృజనాత్మక శక్తి అధికంగా గలవారికే కలల్లో పాములు కన్పిస్తాయని జ్యోతిష్య శాస్త్రం అంటోంది.
పాము కలలో కన్పిస్తే ఏం జరుగుతుందో? ఏమో? అని అందరూ ఆలోచిస్తూ, భయపడుతూ ఉంటారు. మీ కలలో పాము కన్పించి, అది కాటేసి వెళ్లిపోతే.. ఇకపై ఎలాంటి సమస్యలుండవని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా.. పాము స్వప్నంలో కన్పించి, ఏమీ చెయ్యకుండా మెల్లగా జారుకుంటే ఆ వ్యక్తి సుఖసంతోషాలతో ఉంటారు.అలా కాకుండా పదే పదే పాములు కనబడుతుంటే  రాబోయే అరిష్టానికి సూచనగా గుర్తించాలి.సుబ్రహ్మణ్య స్వామికి లేదా ఎల్లమ్మకి పొంగలి నైవేద్యం సమర్పించాలి.

Wednesday 28 December 2016

కుంకుమార్చన ప్రాముఖ్యత



అమ్మవారి  లేదా ఏ ఇతర భగవత్ రూపాన్ని నామాలతో జపిస్తూ కుంకుమను సమర్పించడం కుంకుమార్చన.
ఇది కేవలం కుంకుమను చరణాలకి సమర్పించడం, లేదా చరనాలనుంది శిరస్సు వరకు సమర్పించడం  లేదా కుంకుమను నీరు లేదా పన్నీరు లో కలిపి అభిషేకించడం చేస్తారు.

ఎరుపు రంగు ప్రకాశ గుణాన్ని కలిగి ఉంటుంది.ఆ ప్రకాశాన్నుండి శక్తి తత్వం ఉత్పన్నం ఔతుంది. కుంకుమ లో శక్తి తత్వాన్ని ఆకర్షించే శక్తి అధికంగా ఉంటుంది.కుంకుమతో  అర్చన దేవత విగ్రాహాలకి చేసినప్పుడు ఆ విగ్రహాలలో ఉండే స్థితి శక్తి ఎరుపు రంగు ప్రకాశంతో జాగ్రుతమౌతుంది. గ్రాహక శక్తి వలన కుంకుమ ఆశక్తి ని గ్రహించి నిలుపుకుంటుంది.మనం ఆ అర్చించిన కుమ్కుమని బొట్టుగా ధరించినప్పుడు అందులోని భగవత్ శక్తి  మనకి లభిస్తుంది.

తిరుమురై 11




మదిమలి పురిసై మాడక్ కూడఱ్
పదిమిసై నిలవు పాల్నిఱ వరిచ్చిఱ
కన్నం పయిల్బొళిల్ ఆల వాయిన్
మన్నియ సివన్యాన్ మొళిదరు మాట్రం
పరువక్ కొణ్మూప్ పడియెనప్ పావలర్క్

కొరుమైయిన్ ఉరిమైయిన్ ఉదవి ఒళిదిహళ్
కురుమా మదిబురై కులవియ కుడైక్కీళ్స్
సెరుమా ఉహైక్కుం సేరలన్ కాణ్గ
పణ్బాల్ యాళ్బయిల్ పాణ పత్తిరన్
తన్బోల్ ఎన్బాల్ అన్బన్ తన్బాఱ్

కాణ్బదు కరుదిప్ పోందనన్
మాణ్బొరుళ్ కొడుత్తు వరవిడుప్ పదువే.

ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371