Tuesday, 13 December 2016

ధనుర్మాసం ఆరంభం



డిసెంబర్  16 నుండి ధనుర్మాసం ఆరంభం అవుతుంది.ఈ రోజే మాస శివరాత్రి మరియు శని త్రయోదశి ఉండడం విశేషం.ఈ రోజు వీలయినంత వరకు శివుడికి నువ్వులనూనెతో అభిషేకం చేసి దక్షిణ ముఖంగా శనికి తిల దీపాన్ని వెలిగించడం శ్రేయస్కరం.

ఈ రోజు సూర్యుడు వృశ్చిక రాశి నుండి  ధనూరాశి లోకి ప్రవేసిస్తాడు,రవి సంక్రమణ పుణ్యకాలం  సమయం లో చేసే దాన ,స్నాన ,జప,పూజాదులు ఎక్కువ పుణ్యఫలాలను ఇస్తాయి.కావున అందరు వీలయినత ఎక్కువగా దైవ చింతనతో సమయం గడపండి .పుణ్యస్నానాలకు వీలున్న వారు చేయండి,అనవసర విషయాలతో కాలయాపన చెయ్యకుండా వెక్కువ సమయాన్ని పూజ మరియు జపంలో గడపండి.

శుభమస్తు

No comments:

Post a Comment