ఈరోజు కాలభైరవాష్టమి: (మార్గశిర బహుళ అష్టమి)
శ్లో॥ కాలాకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి।
తన్నో కాలభైరవ ప్రచోదయాత్॥
శ్రీ కాలభైరవస్వామి జన్మించిన రోజే కాలభైరవాష్టమి...
కాలభైరవస్వామి ఆవిర్భవానికి సంబంధించి శివపురాణంలో ఆసక్తికరమైన పురాణగాధ
వుంది. పూర్వం సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడికి శివుడికి మధ్య ఒక వివాదం
ఏర్పడింది. బ్రహ్మదేవుడు మధ్యన వున్న తన ఐదవ శిరస్సుతో శివుడిని తూలనాడడం
ప్రారంభించాడు. దీనితో కోపోద్రిక్తుడైన శివుడు హూంకరించాడు. ఆ హూంకారం
నుంచి ఒక భయంకర రూపం ఆవిర్భవించింది.
మహోన్నతకాయముతో... మూడు నేత్రాలతో త్రిశూలము, గద, ఢమరుకము
వంటి వాటిని చేతులతో ధరించిన ఆ భయంకర రూపుడే - శ్రీకాలభైరవుడు. శివుని
ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మదేవుడి ఐదు శిరస్సులలో మధ్యన వున్న ఐదవ
శిరస్సును ఖండించాడు. దీనితో బ్రహ్మదేవుడి గర్వం అణిగిపోయింది.
బ్రహ్మ శిరస్సును ఖండించిన కాలభైరవుడు తనకు చుట్టుకున్న
బ్రహ్మహత్యాపాతకాన్ని పోగొట్టుకోవడానికి కాశీ చేరుకోగా ఆయన చేతికున్న
బ్రహ్మ కపాలం కాశీలో మాయమైంది... అదే బ్రహ్మ కపాల తీర్థంగా ప్రసిద్ధి
చెందింది...
శక్తిసంపన్నుడైన కాలభైరవుడు ఉద్భవించిన రోజుని కాలభైరవ
అష్టమిగా జరుపుకుంటూ వుంటారు. ఈ రోజున చాలా మంది ఆయన అనుగ్రహాన్ని కోరుతూ
కాలభైరవ వ్రతం చేస్తుంటారు. దగ్గరలో గల కాలభైరవ ఆలయాల్లో స్వామికి
అభిషేకాలు నిర్వహిస్తారు. లేదంటే శివాలయాల్లోనే పూజాభిషేకాలు జరుపుతారు.
కాలభైరవుడు పరమేశ్వరుని యొక్క అంశ అందునా శివక్రోధము చేత
జన్మించాడు... ఇతను కాలస్వరూపుడు, భయంకరమైన రూపం కలవాడు. సాధారణంగా
కాలభైరవుడు నాలుగు చేతులతో దర్శనమిస్తాడు. నాలుగు చేతుల్లో శూలం,కపాలం,గద
మరియు ఢమరుకం ఉంటాయి. రౌద్రనేత్రాలు , పదునైన దంతాలు, మండే వెంట్రుకలు ఇదే
కాలభైరవ స్వరూపం. కాలభైరవుడు నాగుపాములను ఆభరణాలుగా ధరిస్తాడు. ఈయన వాహనం
శునకం.
శ్రీ శివమహా పురాణం ప్రకారం ప్రధానంగా భైరవుని రూపాలు ఎనిమిది. అవి
1) కాల భైరవ
2) అసితాంగ భైరవ
3) సంహార భైరవ
4) రురు భైరవ
5) క్రోధ భైరవ
6) కపాల భైరవ
7) రుద్ర భైరవ
8 ) ఉన్మత్త భైరవ
ఇవే కాక భీష్మ భైరవ, స్వర్ణాకర్షణ భైరవ, శంబర భైరవ, మహా భైరవ,
చండ భైరవ అనే రూపాలు కుడా ఉన్నాయి. స్వర్ణాకర్షణ భైరవుని పై సహస్రనామాలు
కూడా ఉండడం విశేషం.... ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లో ఉన్న కాలభైరవ ఆలయం
చాలా ప్రసిద్ధి చెందింది. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు రాసిన శ్రీ
'కాలభైరవాష్టకం' కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది.1) కాల భైరవ
2) అసితాంగ భైరవ
3) సంహార భైరవ
4) రురు భైరవ
5) క్రోధ భైరవ
6) కపాల భైరవ
7) రుద్ర భైరవ
8 ) ఉన్మత్త భైరవ
కాలభైరవాష్టకం
దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్ |
నారదాదియోగిబృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౧ ||
భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ |
కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౨ ||
శూలటంకపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ |
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౩ ||
భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోకవిగ్రహమ్ |
నిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౪ ||
ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ |
స్వర్ణవర్ణకేశపాశశోభితాంగనిర్మలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౫ ||
రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్ |
మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రభూషణం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౬ ||
అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాసనమ్ |
అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౭ ||
భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం కాశివాసిలోకపుణ్యపాపశోధకం విభుమ్ |
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౮ ||
కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం జ్ఞానముక్తిసాధకం విచిత్రపుణ్యవర్ధనమ్ |
శోకమోహలోభదైన్యకోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువమ్ ||

No comments:
Post a Comment