Friday 9 December 2016

చేతబడి,,,



గిట్టని వారిని చంపటానికో, హానిచేయడానికో చేసే/చేయించే విద్యని చేతబడి అంటారు.వివిధ ప్రాంతాలను బట్టి దీనిని విచ్ క్రాఫ్ట్, వూడూ, బ్లాక్ మ్యాజిక్, సిహ్ర్, బాణామతి, చిల్లంగి అని కూడా అంటారు. ఇది ఒట్టి మూఢ నమ్మకం, బూటకం, మాయ. కక్షలు తీర్చుకోటానికి ప్రయోగించే మరో దుర్మార్గం. దీని ప్రభావం వల్లనే నష్టం జరిగిందని భావించి పగలు తీర్చుకొంటున్నారు.
జన విజ్ఞాన వేదిక, నాస్తిక కేంద్రం లాంటి సంస్థలు ఇలాంటి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కలిగించుతున్నాయి.

ఇస్లాంలో చేతబడులు

ఇస్లాంలో చేతబడులు వంటి నమ్మకాలు చాలా రకాలుగా ఉంటాయి. బ్లాక్ మ్యాజిక్, చెడు దృష్టి, తావీజులు, మర్మ కళలు, జ్యోతిష్యం మెదలగు నమ్మకాలు ఉన్నాయి. ముస్లింలు సాధారణంగా సిహ్ర్(Sihr) అనే మాయా విద్యను నమ్ముతారు మరియు దీనిని అభ్యసించడాన్ని వ్యతిరేకిస్తారు. వీటి గురించి ఇస్లాం మతగ్రంథాలలో కూడా ప్రస్తావన ఉంది. సిహ్ర్ అనేది ఒక అరబిక్ పదం. దీని అర్థం చేతబడి లేక బ్లాక్ మ్యాజిక్. చేతబడి గురించి ఇస్లాం గ్రంథాలలో బాగా ప్రాచుర్యం పొందిన ప్రస్తావన సూరా అల్-ఫలాక్ లో ఉంది. దీని ముఖ్య విషయం ఏంటంటే చేతబడుల నుంచి కాపాడకోటానికి అల్లాహ్ ప్రార్థన ఉంటుంది.

మనిషి శరీరాన్ని ఆవహించిన జీనీలను వదిలించడానికి మహమ్మదు ప్రవక్త చెప్పిన సున్నాహ్ లోని రుఖ్యాని వాడతారు. రుఖ్యాలో ఖురాన్ వాక్యాలు మరియు భూతాలను తరిమే ప్రార్థనలు ఉంటాయి. ఈ ఖురాన్ వాక్యాలను ఏ రకంగా ఉపయోగించాలో తెలిసిన జ్ఞానము చేతబడి జ్ఞానము అంటారు.

సౌదీ అరేబియా ఇప్పటికీ చేతబడి చేసే వారికి మరణశిక్ష విధిస్తుంది. 2006లో ఫాజా ఫాలిహ్ అనే వ్యక్తికి మరణశిక్ష విధించారు.2007లో ఈజిప్టుకు చెందిన ఒక ఫార్మసిస్టును చేతబడి చేస్తున్నాడని నిర్బంధించి ఉరి తీశారు. అలాగే హజ్ యాత్రకు వచ్చిన అలీ సబాత్ అనే లెబనాన్ పౌరుడికి కూడా మరణశిక్ష విధించారు.

    వివరణలు

    • ఇన్నయ్య :మన గ్రామాలలో బాణామతి, చేతబడి, దయ్యాలు, భూతాలు, పిశాచాలు, హస్తలాఘవాలు ఇంకా ఎన్నో జనాన్ని పట్టి పీడిస్తున్నాయి. వీటి ఆధారంగా ప్రజలను ఏడిపించే మంత్రగాళ్ళు, భూతవైద్యులు, గ్రామవైద్యులు ఉండనే ఉన్నారు. అలాంటి వారికి విపరీతమైన గౌరవం యిస్తూ, వారంటే భయపడుతూ వుండడంతో, వారు యింకా వ్యాపారం చేస్తున్నారు.ఉన్నట్లుండి యింట్లో బట్టలనుండి నిప్పు వస్తుంది. ఆరుబయట ఆరవేసిన వస్త్రాలు అంటుకొని నిప్పు రాజుతుంది.ఆ సంఘటన చుట్టూ కథలు అల్లుతారు. శాంతి చేయించమంటారు. కొన్నాళ్ళు యిల్లు పాడుబెట్టమంటారు. ఎవరో చేతబడి చేయించారంటారు. దోషం పోవడానికి ఏమేమి చెయ్యాలో చెబుతారు.
    ఇంటి బయట బట్టలు ఆరేయండి. పచ్చ ఫాస్ఫరస్ ఒక పాలు, కార్బన్ డైసల్ఫైడు ఆరు పాళ్లు కలపండి. కొద్దిగా బట్టలపై చల్లండి అలా చల్లింది ఆరగానే కాసేపట్లో నిప్పు అంటుకొంటుంది. ఇంట్లో అలమరలో పెట్టిన దుస్తులలోనూ యీ ద్రావకం చల్లవచ్చు. యింటిలోని వారిని ఏడిపించడానికి ఇలాంటి పనులు రహస్యంగా చేస్తుంటారు. జాగ్రత్తగా కనిపెడితే ఎవరు చేస్తున్నదీ అర్థమవుతుంది.సాధారణంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు, మూలకారణం పరిశీలించకుండా, మతపరమైన మూఢనమ్మకాల వలన భూతవైద్యుల్ని, సోది చెప్పేవారిని పిలుస్తుంటారు.
    • జనవిజ్ఞానవేదిక రాష్ట్ర కార్యదర్శి జి.జగ్గారావు :
    శరీరంలో వచ్చిన రోగానికి తావీదు కడితే జబ్బు నయం కాదు. అటువంటి ప్రయత్నాలు చేసి కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ద్రావకాల కారణంగా ఖాళీ గ్లాసులో మంచినీళ్లు పోసి ఎర్రని రక్తంగా మార్చవచ్చు.అదే ఎర్రని నీరులో నిమ్మ రసం వేసి తెల్లని నీరుగా మార్చవచ్చు.కత్తికి కెమికల్స్‌ పూసి కాయను కోస్తే ఎర్రగా మారుతుంది. ఇటువంటి వాటిని ఉపయోగించి పలువురు చేతబడి పేరుతో మోసం చేసి ధనార్జన చేస్తున్నారు.

    దారుణాలు


    చేతబడి చేస్తున్నారనే నెపంతో ఇటీవల నల్లగొండ జిల్లా, చౌటుప్పల్ సమీపంలో దాదాపు 300 మంది కలిసి చిలివేరు నర్శింహ (60) మరియు గుడ్డేటి ఎల్లయ్య(65) అనే ఇద్దరు వృద్దులను సజీవ దహనం చేసిన దృశ్యం.
    చేతబడి కారణంగా దానికి చాలా సందర్భాల్లో అమాయకులు బలైపోతున్నారు.అనుమానితుల్ని చితకబాదటం, రాళ్ళతో కొట్టడం, వివస్త్రల్ని చేసి ఊరేగించడం, పళ్ళు రాలగొట్టడం, మల మూత్రాదులు బలవంతంగా తినిపించడం, చిత్ర హింసలకు గురి చేయడం జరుగుతున్నది. ఇందుకు కారణం ఊర్లో ఉండే భూత వైద్యులు కూడా.. మన దేశంలో చేతబడి అనుమానం వల్ల హత్యకి గురవుతున్నవాళ్ళలో ఎక్కువ మంది మహిళలే. ఆ మహిళలలోనూ ఎక్కువ మంది పెళ్ళి కాని స్త్రీలు, భర్త చనిపోయిన స్త్రీలు, భర్త నుంచి విడిపోయిన స్త్రీలు.
    • మంత్రగాడనే నెపంతో నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం లోని మిట్టాపూర్ అనేగ్రామంలో గిర్నిల మల్లేష్ అనే వ్యక్తిని గొంతు కోసి గోదావరి నదిలో పడవేసి హత్య చేశారు
    • విజయనగం జిల్లా, మెంటాడ మండలం, కొంకిణవలస గ్రామంలో చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో గ్రామస్థులు ఒక వ్యక్తిని కొట్టి చంపారు.
    • మహబూబ్‌నగర్‌ జిల్లా బల్మూర్‌ మండలం చెన్నారం గ్రామంలో చేతబడి చేస్తున్నాడనే నెపంతో గ్రామస్థులంతా మూకుమ్మడి దాడి చేసి జి.నిరంజన్‌ (55) అనే వ్యక్తిని దారుణంగా చంపేశారు 
    • తన కూతురు జ్వరానికి కారణం చేతబడి చేసిందనే అనుమానంతో ఖమ్మం జిల్లా చంద్రుగొండ మండలం పెంట్లం గ్రామంలో బుల్లెమ్మ అనే మహిళ దోసిట్లో గ్రామస్థుడు తాటి నగేశ్ మరియు కె బాబూ రావు, తాటి అక్కమ్మ లతో కలిసి నిప్పులు పోశాడు.
    • చేతబడి చేసారనే నెపంతో ఆత్మకూరు(S), నల్గొండ జిల్లాలో భార్యాభర్తలను గ్రామస్థులు నిర్బంధించి తీవ్రంగా కొట్టారు
    • కరీంనగర్ జిల్లా, మహాముత్తారం మండలంలో చేతబడి చేస్తున్నాడనే నెపంతో సమ్మయ్య అనే వృద్దుడిని హతమార్చారు.
    • మంత్రాల నెపంతో ఆదిలాబాద్ జిల్లా, కాగజ్‌నగర్లో ఒక కుటుంబం పైన స్థానికులు దాడిచేశారు.
    • చేతబడి నెపంతో కరీంనగర్ జిల్లా, జగిత్యాల మండలం కండ్లపల్లిలో కోలార్ జమున అనే వృద్దురాలిని చందర్ అనే వ్యక్తి కర్రలతో మోది హత్యచేశాడు.
    • చేతబడి నెపంతో నిజామాబాద్ జిల్లా, బాల్కొండ మండలంలోని దూద్‍గాం శివార్లలోని నెహ్రూనగర్ వీధిలో 'యశోదా అనే వృద్దురాలిని స్థానికం
    • గా ఉన్న ఇద్దరు యువకులు కొట్టి చంపారు..

చేతబడి నివారణ:

చేతబడిని మూడు మార్గాల్ని అనుసరించి పోగొట్టడం జరుగుతుంది. అందులో రెండు అధర్మం అవగా, ఒకి మాత్రమే ధర్మసమ్మతం.

అదర్మ పద్ధతి-ఒకటి:
 ఒక మనిషిపై ఉన్న జిన్నును లేదా చేతబడిని తీయడా నికి ఇంకో జిన్ను సహాయం తీసుకోవడం. ఇది అందరి ఏకాభిప్రాయంతో నిషేధించబడింది. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”అసలు విషయం ఏమిటంటే కొందరు మనుషులు కొందరు జిన్నాతుల శరణు వేడుకునేవారు. ఈ కార ణంగా జిన్నాతుల పొగరు మరింత పెరిగి పోయింది”. (జిన్‌: 6)

అధర్మ పద్ధతి – రెండవది:
జిన్ను ముందరే షిర్క్‌ పనులు చేసి దాన్ని పోగొట్ట డం. ఇది పలు రకాలుగా ఉంటుంది. దాటు తీయడం, గుడ్డలూడదీసి రాత్రి సమయంలో చక్కర్లు కొట్టించడం, కన్య స్త్రీని వివస్త్రను చేెసి ముగ్గు మధ్యలో కూర్చో బెట్టడం వగైరా. ఇలాంటి జుగుప్సాకరమయిన చేష్టల ద్వారా షైతాన్‌ మెప్పు పొంది చేతబడినిగానీ, జిన్నుని గానీ తొలగించే ప్రయత్నం చేయడం. ఇది కూడా అధర్మమే, హరామే.

ధర్మసమ్మతమయిన విధానం:
ఇది దైవప్రవక్త ముహమ్మద్‌ (స) సూచించిన విధానం. సృష్టిలో మన ఇంద్రియాలకు కానరాని అనేక ప్రాణుల కీడు నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో అల్లాహ్‌, ప్రవక్త (స) వారికి బోధ పర్చాడు.కాబట్టి ముస్లిం అయిన మనం ప్రామాణికమయిన ప్రవక్త (స) వారి పద్ధతినే అనుసరించాలి, ఆచరణలో పెట్టాలి.
1) ”అవూజు బిల్లాహి మినష్షయితానిర్రజీమ్‌” చదవాలి.
2) ఖుర్‌ఆన్‌లోని అల్‌ ఆరాఫ్‌ సూరా (7: 200) ఆయతును, అన్నహల్‌ సూరా (16:98) అయతును చదవాలి.
3) ముఅవ్వజతైన్‌- ఖుల్‌ అవూజు బిరబ్బిల్‌ ఫలఖ్‌ మరియు ఖుల్‌ అవూజు బిరబ్బిన్నాస్‌ (113, 114) చదవాలి. ప్రవక్త (స) వారికి చేయబడిన చేతబడి కి విరుగుడు అవతరించిన సూరాలు ఇవి.
4) ఆయతుల్‌ కుర్చీ చదవాలి. ప్రవక్త (స) అన్నారు: ”ఎవరయితే పడుకోక ముందు ఆయతుల్‌ కుర్సీ (2:255) పూర్తిగా చదువుకుమాడో, తెల్లారే వరకూ అల్లాహ్‌ తరఫున ఒక దైవదూత అతనికి రకణగా ఉమాడు. మరియు షైతాన్‌ అతని దగ్గరకు రాడు”. (బుఖారీ)
5) సూరహ్‌ బఖరహ్‌లోని చివరి రెండు ఆయతులు (2: 285, 286) చద వాలి. ”సూరహ్‌ బఖరహ్‌లోని చివరి రెండు ఆయతులు మూడు రాత్రులు వరుసగా ఏ ఇంటిలోనయితే పఠించబడతాయో ఆ ఇంటి దరిదాపులకు కూడా షైతాన్‌ రాలేడు”. (తిర్మిజీ)
6) అజాన్‌: ”అజాన్‌ ఇవ్వబడినప్పుడు షైతాన్‌ వీపు చూపి, గాలి వదులుతూ పారి పోతాడు”. (బుఖారీ)
7) సూరహ్‌ ఫాతిహా చదవాలి. ఓ సహాబీ (ర) సూరహ్‌ా ఫాతిహా చదివి ఓ వ్యక్తి చేతబడిని దూరం చేశారు.
గమనిక:వీటిని ఎవ్వరయినా చదవచ్చు. అంతగా భయం ఉంటే ధర్మబద్ధమ యిన రీతిలో వైద్య చేసే దైవభీతి పరుల వద్దకు మాత్రమే వెళ్ళాలి.



దీని గురించి అందరూ తెలుసుకోండి,,ఎందుకంటే ఈరోజుల్లో చిన్న చిన్న చిల్లంగి విద్యలను కూడా చేతబడి అని భ్రమపడి భయపడేవారు చాలా ఎక్కువగా ఉన్నారు,చాల మంది అనేక రకాల భయాలతో ,అనుమాలతో రకరకాలైన ప్రశ్నలు అడుగుతున్నారు.  అసలు చేతబడి చేయగల సామర్థ్యం ఉన్న క్షుద్రులు ఎక్కువగా ఒరిస్సా,కేరళ,తమిళనాడులోని ఒక ప్రాంతంలో,,ఇక ఉత్తరాఖండ్ పైభాగంలో మాత్రమే ఉన్నారు,, మన తెలుగు రాష్ట్రాలలో అంతటి శక్తికల క్షుద్రులు లేరు . అసలు నిజంగా చేతబడి చేసే గురువు ఎంతో సమర్థుడై,క్రూరుడై,గుండె బండగా కలవాడై,,భయం అనేది తెలియనివాడై ఉంటాడు,, చేతబడి చేసే సమయంలో క్షుద్ర గురువు కొన్ని రకాల ముగ్గుల మధ్యలో ఒక పిండి బొమ్మను చేసి ఆ వ్యక్తులకు సంబంధించిన వస్తువులను ఆ బొమ్మకు పెట్టి,,ఆ బొమ్మకి భయంకరమైన మంత్రోచ్చారణతో క్షుద్రశక్తులను పంపకం చేసి ఆ వ్యక్తిని హింసిస్తూ ఉంటాడు,,ఇలా కొన్నిరోజులకు ఆ వ్యక్తి తీవ్రమైన అనారోగ్యంపాలై మరణించడం జరుగుతుంది,, ఇలా చేసే సమయంలో ఏచిన్న తప్పు జరిగినా ఆ ప్రేరేపించబడిన క్షుద్రశక్తికి ఆ గురువే బలవుతాడు,,కొందరు మహాశక్తివంతమైన క్షుద్రులు కొన్ని నియమితరోజులలోనే మనిషిని చేతబడితో చంపగలరు, కాష్మోరా,కాట్రేరీ వంటి ప్రయోగాలు చేయగలిగినవారు మనిషిని నలభైనిమిషాలలో చంపే శక్తిసామర్థ్యాలను కలిగియున్నారు,, వీటిని తిప్పికొట్టలంటే వీరి శక్తికన్నా ఎక్కువ శక్తికల తాంత్రికగురువుల వల్ల మాత్రమే సాధ్యపడుతుంది,, కనుక మీ కుటుంబాలలో జరిగే చిన్న చిన్న సమస్యలను ""చేతబడి"" అని భయపడకండి , అవి అతిచిన్న ప్రయోగాలని గమనించండి,,వీటికి విరుగుడు  శ్రీ ప్రత్యంగిరా పరదేవత,కనుక ఎవరూ భయపడవద్దు.: అన్నింటికన్నా హేయమయిన చేతబడి మనకు మనం చేసుకు నేది. దాంతో పోలిస్తే ఎదుివాళ్ళు చేెసే చేతబడి అత్యల్పం. ఏ విధంగా చూసుకున్నా మనకు మనం చేసుకునే అన్యాయమే ఎక్కువ. మన మనసునిమనం మంచి ,భగవన్నామ స్మరణ,అచంచల విశ్వాసంతోనిమ్పుకున్నప్పుడుమనల్ని ఏ తంత్రాలు ఏమి చెయ్యలేవు,
 మన చూట్టూ ఉండే వారి ఉద్దేశాల్ని మనం అదుపు చెయ్యలేము గానీ, మన లోపల జరిగే దాన్ని మాత్రం మనం అదుపు చేససుకోగలం. మన మనసును నూటికి నూరుశాతం భగవత్ స్మరణ నిండిన నెలవుగా మార్చుకోవచ్చు. అప్పుడు మనకేమి అవ్వదు. ఇది నిజం; కఠోర సత్యం!

"మంచి ని ఎప్పుడు చెడు గెలవలేదు ,"
ఓం శ్రీ ప్రత్యంగిరా పరదేవతాయై నమః అని స్మరించుకోండి .అవసరం ఉన్న వాళ్ళు  ఆ ప్రత్యన్గిర పరదేవత హోమాన్ని చేయించుకొని శాంతిపొందగలరు.


ఓం శ్రీ ప్రత్యంగిరా పరదేవతాయై నమః

No comments:

Post a Comment