Saturday 24 December 2016

రాజయోగము







ఆరు గ్రహములు ఉచ్చరాశి యందున్నన, రాజసమానుడు. ప్రభువు కాగలదు. ఐదు గ్రహములు ఉచ్చస్తితి పొందిన ఇదే ఫలములు కలుగును. గురుడు కర్కాటకమున ఉచ్చస్తితి పొంది అది లగ్నమైనను ఈ ఫలములు కలుగును. మొదటి రెండు స్తితులు అరుదుగా నున్నను, కర్కాటకము లగ్నమై అందు గురుడున్న జాతకములు నేను చాలా చూచినాను. ఈ శుభఫలములు వారికి ఉన్నవి. వృష లగ్నము అందు చంద్రుడు మిగతా గ్రహములు స్వ ఉచ్చ స్తితి పొందినను ఈ రాజయోగము కలుగును. ఏ ఒక్కగ్రహమైన ఉచ్చస్తితి పొంది, మరో మిత్రుడు చూచుచున్న ధనసంపద కలిగియుండును. గ్రహములు శత్రువు ఇంట నుండి, నీచస్తితి పొందిన, శుభఫలములు ఉండవు. ఒకటి రెండు గ్ర హములు అటులున్న కొంత నీచము. ఎక్కువ గ్రహములున్న పరమ నీచస్తితి అనుభవిమ్చును. లగ్నమున చంద్రుడు, చతుర్ధమున గురుడు, దశమున శుక్రుడు ఉండి, శని స్వ లేక ఉచ్చస్తితి పొందిన జాతకుడు అధిక ధవంతుడు, పరిజనులు సేవకులు కలిగి ఉందును. ఇది అధికారము, ధనము హోదాను సూచించును. గురుడు బుదునితో కలిసినా, లేక చూచినా ఈ ఫలములే ఉండును. చంద్రస్తితి ని బట్టి రాజయోగమిటులుండును. చంద్రుడు లగ్నమున కాక ఇతర కేంద్రములలో ఉన్న పంచమ, నవమ స్థానములలో శుక్రునితో కలిసి ఉన్న, చూడబడిన, రాజయోగమే. లగ్నము మొదలు ఆరు రాసులలో ఉచ్చగ్రహములు ఉన్న జన్మతాహా రాజగును. సప్తమమునుండి ఆరు రాశులలో ఉచ్చ స్తితి పొందిన ఉత్తరార్ధమున ( మధ్యవయస్సు తరువాత ) రాజయోగము కలుగును. ఇట్టి జాతకములు కొన్ని కలవు. లగ్నమున గురుడు. కేంద్రమున బుధుడు ఉంది వారు లాభ, భాగ్యాదిపతులచే చూడబడిన రాజయోగము గా భావించవలెను. ఏడవఇంట గురుడు ఉండి, కోణాధిపతి కూడా అక్కడే ఉండి లగ్నాది పతి వీక్షణ ఉన్నచో రాజయోగము. కేంద్రమున శని వుండి, మూలత్రికోణమైన, స్వ ఉచ్చస్తానమైన, దశామాధిపతి వీక్షణము ఉన్న అధిక ధనయోగము. గురుడు పంచమమున వుండి, అది చంద్రునకు కేంద్రమైన, లగ్నము స్థిరరాశియై, లగ్నాధిపతి దశమమున నున్న రాజ తుల్యుడు అగును. ఇందులో రాజు, రాజసమానుడు, రాజ తుల్యుడు, అను పదాలకు, అధిక ధనవంతుడు, అధికారము, దర్పము, హోదా పరివారము సేవాజనము, గలవారని భావించ వలెను.

No comments:

Post a Comment