ఇప్పటి వరకు గడిచిన సంవసరం లో శని ,కుజుడు, రాహు మరియి కేతు లు కలిసి విపరీత ఫలితాలని ఇచ్హారు.డిసెంబర్ లో కూడా రాహు ,కేతువులు మరియు కుజుడి కలయిక కొనసాగుతుంది.డిసెంబర్ చివరికి కుజుడు కాలసర్ప యోగాన్ని వదిలివేస్తాడు.డిసెంబర్ 19 న బుదుడి వక్రగతి ధనుస్సులో మొదలై జనవరి 8 న ధనుస్సులోనే ముగుస్తుంది. ఈ కాల౦లో జరిపే ప్రయాణాలు,సంతకాలు,మాట ముచ్చటలు మరియు ఒప్పందాలపైన జాగ్రత్త వహించండి.
శని , రవి లు డిసెంబర్ 9 నుండి డిసెంబర్ 15 వరకు కలయిక సంభవిస్తుంది.అయిన ఈ నెలంత దాని ఫలితం కనిపిస్తుంది.ప్రజలు మరియు పదవిలో గల ప్రజా ప్రతినిధి మధ్య ,తండ్రి మరియు తనయుల అంతరాల మధ్య వారధులు ఏర్పడతాయి.సింహ, వృశ్చిక,మీన, కర్కాటక రాసి వాళ్లకి ఈ ఫలితం ఎక్కువగా ఉండే అవకాసం ఉంటుంది.
కుజ , కేతువులు కుంభ రాశిలో నవంబర్ 1 నుండి డిసెంబర్ 11 వరకు కలిసి ఉంటారు.డిసెంబర్ 11 తర్వాత మకర రాశిలోకి అత్యున్న్నత స్థితి వెళ్లి మేష,కర్కాటక,తుల మరియు మకర రాసులలో ప్రబలమైన రుచక యోగాన్ని కలిగిస్తుంది.ఈ యోగం వలన ఆయా రాసులవాళ్ళకి బలము మరియి అధికారం పెరుగుతాయి.కుజుడు మకరం లో అతున్నత స్థితి లో ఉన్నప్పుడు ఆ రాసి అధిపతి అయిన శని వృశ్చిక రాసి లో ఉంది పరివర్తన యోగాన్ని కలిస్తాయి. 11 డిసెంబర్ నుండి 18 జనవరి కుజుడు కుంభరాశి లో కేతువు తో కలిసి ఉంటాడు.కుజ,కేతువులు సములు వాటి అగ్ని తత్వం కుంభరాశి యొక్క వాయు తత్త్వం మధ్య సంఘర్షన ఉంటుంది.కుంభ రాశి వాయు తత్వం ప్రపంచానికి మేలు చేయాలని దానికి ఎదురేగుతూ కుజ ,కేతువుల అగ్ని తత్వం ప్రతిఘటిస్తూ గడుస్తుంది. మేష,వృశ్చిక,మీనా రాసుల వాళ్ళుఎక్కువ సంఘర్షణని పొందుతారు.
డిసెంబర్ లో రెండు కాల సర్పయోగాలున్నాయి.ఒకటి డిసెంబర్ 6 న ముగుస్తుంది.ఇంకొకటి డిసెంబర్ 19 నుండి డిసెంబర్ 29 మద్య ఉంటుంది.మామూలుగా ఈ కాలసర్ప యోగాలు అంతర్జాతీయ వ్యవహారాలపైన ,వేర్పాటువాదం పైన పని చేస్తాయి.అమెరిక ఎలక్షన్లు కాలసర్ప యోగంలో జరిగాయి.అంతేకాకుండా జాతకంలో కాలసర్ప యోగం ఉన్న జాతకుడిని ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డాడు.
డిసెంబర్ 27 న కుజ కేతువుల కలయిక.. 29 డిసెంబర్ కుజుడు కేతువు తో కాలసర్ప యోగాన్ని ఖండిస్తూ ముందుకి వెళతాడు.ఈ రోజులలో శక్తి ప్రసారం చాల అస్థిరంగా ఉంటుంది.అందువల్ల ఈ రోజులలో ఎలాంటి ఘర్షణకి తావులేకుండా చూసుకోండి.కుజ,కేతువులు రెండు బలమైన గ్రహాలూ ,మరియు ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి కలుస్తాయి.ఆయా సమయాలలో విరుద్ద ఫలితాలు,ఘర్షనలు జరిగే అవకాసం ఉంటుంది .అందువల్ల వీలయిన౦త జాగ్రత్తగా ఉండడం మంచిది.
శుభమస్తు
No comments:
Post a Comment