Friday 31 July 2020

1-8-2020 శని దోష కొరకు ఈనాటి యోగక్షేమం !!



శని  దోష నివారణ  కొరకు ఈ రోజు చెయ్యాల్సిన యోగ క్షేమం .మీ చేత్తో  మీరు ఏదైనా శుభ స్థలంలో  దేవాలయం, యాగశాల, గోశాల  లాంటి ప్రదేశాలలో నేరేడు చెట్టు నాటండి. అలాగే గురువు, మిత్రులె వరికైనా  నేరేడు చెట్టు గిఫ్ట్ గా ఇవాండీ.( తొందరగా ఫలాన్నిచ్చే హైబ్రిడ్, డ్వార్ఫ్ , గ్రాఫ్టెడ్ మొక్క అయితే మంచిది.)


లోకాఃసమస్తాః సుఖినోభవంతు"..
శుభ ముహూర్తములు,వివాహ పొంతనాలు , జ్యోతిషం ,న్యూమరాలజీ,, సైంటిఫిక్ వాస్తు , ప్రాణికి హీలింగ్, చండీ హోమము ,ఆయుష్య హోమ0 మరియు ఇతర హోమాలు ,గృహప్రవేశము, వివాహము,దేవాలయ ప్రతిష్ట,హోమములు,వ్రతములకుమరియు ,జాతక సంబందిత సమస్యల పరిష్కారాలకు సంప్రదించగలరు.

శ్రీ విధాత పీఠం ,
ph 9666602371

108 రోజుల విశ్వశాంతి మహా యజ్ఞం 30 వ రోజు



గురుపౌర్ణమి నాడు మొదలై  మీలాంటి భక్స్త  మహాశయులందరి సహకారంతో దిగ్విజయం గా  జరుగుతున్న ఈ మహత్ కార్యక్రమం  30 వరోజు పూర్తి చేసుకుంది.లోక కాయానం కోసం కరోనా మహమ్మారినుండి  మనందరికీ రక్షణగా జరుగుతున్న ఈ మహా యజ్ఞానికి మీ అందరి చేయూత శ్లాఘనీయం. ఈ బృహత్ కార్యక్రమం ఏ ఒక్కరి వల్లనో సాధ్యమయ్యేది కాదు. ధన వస్తు  రూపేణా తమ సహకారాన్ని అందిస్తున్న  మహానుభావులందరికి  మా హృదయపూర్వక శుభాశీస్సులు .వారందరికీ ఆ భగవంతుడు  ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆశిస్తున్నాము. 

 ఇంకా ఎవరైనా ఈకార్యక్రమానికి తమవంతు సాయం అందించాలనుకుంటే  క్రింది నంబరులో సంప్రదించగలరు. 


లోకాఃసమస్తాః సుఖినోభవంతు"..
శుభ ముహూర్తములు,వివాహ పొంతనాలు , జ్యోతిషం ,న్యూమరాలజీ,, సైంటిఫిక్ వాస్తు , ప్రాణికి హీలింగ్, చండీ హోమము ,ఆయుష్య హోమ0 మరియు ఇతర హోమాలు ,గృహప్రవేశము, వివాహము,దేవాలయ ప్రతిష్ట,హోమములు,వ్రతములకుమరియు ,జాతక సంబందిత సమస్యల పరిష్కారాలకు సంప్రదించగలరు.

శ్రీ విధాత పీఠం ,
ph 9666602371

01-08-2020 శనివారం నేటి పంచాంగం :



ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻

శ్రీ శార్వరి నామ సంవత్సరం,
దక్షిణాయణం
వర్ష ఋతువు,
శ్రావణ మాసం
శుక్ల పక్షం,
తిధి:త్రయోదశి రా9.48 తదుపరి చతుర్థశి,
నక్షత్రం:మూల ఉ7.48 తదుపరి పూర్వాషాడ,
యోగం:వైధృతి ఉ11.11 తదుపరి విష్కంభం
కరణం:కౌలువ ఉ10.25 తదుపరి తైతుల రా9.48 ఆ తదుపరి గరజి
వర్జ్యం:ఉ6.15 - 7.48 & సా5.15 - 6.50,
దుర్ముహూర్తం:ఉ5.42 - 7.24
అమృతకాలం :రా2.43 - 4.17,
రాహుకాలం :ఉ9.00 - 10.30,
యమగండం/కేతుకాలం:మ1.30 - 3.00
సూర్యరాశి:కర్కాటకం,
చంద్రరాశి:ధనుస్సు
సూర్యోదయం:5.41,
సూర్యాస్తమయం:6.31,

ఈరోజు విశేషం : శనిత్రయోదశి

"ఈరోజు పుట్టిన రోజు మరియు పెళ్లి రోజు జరుపుకునే వారికి ఆశీఃపూర్వక అభినందనలు"..

లోకాఃసమస్తాః సుఖినోభవంతు"..
శుభ ముహూర్తములు,వివాహ పొంతనాలు , జ్యోతిషం ,న్యూమరాలజీ,, సైంటిఫిక్ వాస్తు , ప్రాణికి హీలింగ్, చండీ హోమము ,ఆయుష్య హోమ0 మరియు ఇతర హోమాలు ,గృహప్రవేశము, వివాహము,దేవాలయ ప్రతిష్ట,హోమములు,వ్రతములకుమరియు ,జాతక సంబందిత సమస్యల పరిష్కారాలకు సంప్రదించగలరు.

శ్రీ విధాత పీఠం ,
ph 9666602371

01-08-2020 శనివారం నేటి రాశిఫలాలు :


మేషం:
కొన్ని పనులు నిదానంగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. బంధువర్గంతో వివాదాలు. ధనవ్యయం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.
వృషభం:
చాకచక్యంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు పరిష్కారం. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సత్తా చాటుకుంటారు.
మిథునం:
రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. పనులు కొంత నెమ్మదిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు.
కర్కాటకం:
ఉద్యోగయత్నాలు సానుకూలం. కొత్త పరిచయాలు. ఆసక్తికర సమాచారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పనులు సమయానికి పూర్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజం చేసుకుంటారు.
సింహం:
శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో అనుకూలత. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.
కన్య:
పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ధన, వస్తులాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.
తుల:
వ్యవహారాలలో ఆటంకాలు. ఖర్చులు పెరుగుతాయి ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. ఆరోగ్యభంగం. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత అసంతృప్తి.
వృశ్చికం:
సన్నిహితులు, బంధువులతో మాటపట్టింపులు. అనారోగ్యం. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో శ్రమాధిక్యం.
ధనుస్సు:
వ్యవహారాలలో విజయం. బంధువుల ద్వారా శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజం చేసుకుంటారు.
మకరం:
కొన్ని వ్యవహారాలు శ్రమానంతరం పూర్తి. స్వల్ప అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు.
కుంభం:
పనుల్లో అవాంతరాలు. రుణదాతల ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. శ్రమ పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశాజనకమే.
మీనం:
కొత్త మిత్రుల పరిచయం. శుభకార్యాలలోపాల్గొంటారు. ధనప్రాప్తి. సంఘంలో ఆదరణ. చేపట్టిన పనులలో విజయం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు.



లోకాఃసమస్తాః సుఖినోభవంతు"..
శుభ ముహూర్తములు,వివాహ పొంతనాలు , జ్యోతిషం ,న్యూమరాలజీ,, సైంటిఫిక్ వాస్తు , ప్రాణికి హీలింగ్, చండీ హోమము ,ఆయుష్య హోమ0 మరియు ఇతర హోమాలు ,గృహప్రవేశము, వివాహము,దేవాలయ ప్రతిష్ట,హోమములు,వ్రతములకుమరియు ,జాతక సంబందిత సమస్యల పరిష్కారాలకు సంప్రదించగలరు.

శ్రీ విధాత పీఠం
ph 9666602371

01-08-2020 శని త్రయోదశి నాడు ఏమి చేస్తే దేవుడు సంతృప్తి చెందుతాడు?


శనిదేవుడు అంటే చాలా మంది బయపడతారు. వాస్తవానికి శని దేవుడు చాలా మంచివాడు.అమ్మ నాన్నల ప్రేమను శని దేవుడు చూపిస్తాడు.శని భగవానుడు అంటే నీతి,న్యాయం,ధర్మబద్దతకు కట్టుబడి ఉంటాడు.గోచారరిత్య శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు భక్తితో కొలిచి ధర్మబద్దంగా జీవించే వారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు.
,మీ సమస్య ఏదైనా తక్షణమే పరిష్కారం పొందుటకు మాకు ఫోన్ చేయండి - 9704840400.
శని త్రయోదశి అంటే శనివారం రోజు త్రయోదశి తిధి ఉన్న రోజును శని త్రయోదశి అంటారు. ఆ రోజు స్వామి వారిని నువ్వులతో,నూనేతో నల్లని వస్త్రంతో అభిషేకం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు. అయితే ఎలాంటి అభిషేకాలు చేయాలి.ఎలా చేయాలి.తెలుసుకుందామా...? శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి.
కుటుంబ,ఉద్యోగ,వ్యాపార,ఆరోగ్య ,కోర్టు కేసులు, శత్రువులు,రుణాలు నుంచి విముక్తుల్ని చేయాల్సిందిగా మొక్కుకుని నియమాలు పాటిస్తారు. శనీశ్వరుడి ఆలయం నుంచి బయటికు వెళ్ళేప్పుడు అక్కడ ఉన్న బిక్షగాల్లకు,పేదవారికి శక్తి కొలది ఆహార రూపంలో కాని ,వస్త్ర,ధన,వస్తు రూపంలో కాని దాన ధర్మాలు విరివిగా విశాల హృదయంతో చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి.
పూజకు వాడే నల్లటి వస్త్రం సుమారు రెండు మీటర్ల పోడవు అంటే ఒక లుంగి లాంటిది ఉండాలి. పూజ తర్వత ఆ వస్రాన్ని దానం చెస్తే దానం తీసుకున్నవారు ఉపయోగించుకునేలా ఉండాలి అని అర్ధం .దానలు అనేవి ఉన్నవారికి చేస్తే ఫలితం రాదు.కేవలం నిరుపేదలకు,పశు పక్షాదులకు చేస్తేనే పుణ్యఫలం దక్కుతుంది ఇది గమనించాలి.
త్రయోదశి వ్రతం:-
శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి.కాశ్యపన గోత్రం. సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు. శనికి ఉన్న ఇతర పేర్లు కోణస్త,పింగళ, కృషాణు, శౌరి, బభ్రు, మంద,పిప్పలా,రౌద్రాంతక, సూర్యపుత్ర అని పిలవబడుతాడు.
నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కరుణామూర్తి శనీశ్వరుడు. ఏ త్రయోదశి అయితే శనివారంతో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని శనీశ్వరుడుగా సంబోధించి పరమశివుడు వరం ఇచ్చాడని అంటారు.
ఈ శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టం.దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న కోరికలను తీర్చి శు ఫలితాలను అందించేవాడు శనీశ్వరుడు.దీనికి నిష్టా నియమం కావాలి.ఈ రోజు ఎలాంటి నియామాలు పాటించాలి.
* ఉదయాననే నువ్వుల నూనేతో ఒళ్ళంతా మర్ధన చేసుకుని తలస్నానం చేయాలి.
* ఆ రోజు మద్య,మాంసాలు ముట్టరాదు.
* వీలైన వారు శివార్చన తామే స్వయంగా చేస్తే మంచిది.
* శనిగ్రహ స్థానదోషాల వలన బాధపడేవారు
నీలాంజన సమభాసం
రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం
తం నమామి శనైశ్చరం.
అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు పఠిస్తే మంచిది.
* వీలైనంత వరకు ఏపని చేస్తున్నా మౌనంగా ఉంటూ దైవ చింతనతో ఉండాలి.
* అందరిలోను ప్రతీ జీవిలోను దేవున్ని చూడగలగాలి.
* ఎవరితోను వాదనలకు దిగరాదు.
* ఆరోజు ఆకలితో ఉన్న వారికి,పశు పక్షాది జీవులకు భోజనం పెడితే మంచిది.
* ఉదయం సూర్యోదయం కాగనే శరీరానికి నువ్వుల నూనే రాసుకుని గంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తే శని అనుగ్రహాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి.
* మూగ జీవులకు ఆహార గ్రాసలను,నీటిని ఏర్పాటు చేయాలి.
* కాకులకు బెల్లంతో చేసిన రొట్టెలను నువ్వులనూనేతో కాల్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి కాకులకు వేయాలి.
* అనాధలకు,అవిటి వారికి,పేద వితంతువులకు,పేద వృద్ధులకు ఏదో రూపంగా సహయపడాలి.
* జీవిత భాగస్వామితో సఖ్యతతో మెలగాలి.
* ప్రతి రోజు తలి దండ్రుల పాద నమస్కారం చేసుకోవాలి.
* అత్త మామలను ,వంట చేసి వడ్డించిన వారిని,మన మేలు కోరేవారిని,ఉద్యోగం ఇప్పించిన వారిని,ఆపధ కాలంలో సహాయంగా నిలచిన వారిని ఎట్టి పరిస్థితులలో నిందించరాదు.
* ఎట్టి పరిస్థితులలోను భాద్యతలను,భవ బంధాలను మరువరాదు.
ఈ విధంగా వ్యవహరించ గలిగితే తప్పక శని భగవానుడు పూర్తి స్థాయి మేలు చేసి మంచి ఉన్నత స్థానంలో నిలబెడతాడు.



లోకాఃసమస్తాః సుఖినోభవంతు"..
శుభ ముహూర్తములు,వివాహ పొంతనాలు , జ్యోతిషం ,న్యూమరాలజీ,, సైంటిఫిక్ వాస్తు , ప్రాణికి హీలింగ్, చండీ హోమము ,ఆయుష్య హోమ0 మరియు ఇతర హోమాలు ,గృహప్రవేశము, వివాహము,దేవాలయ ప్రతిష్ట,హోమములు,వ్రతములకుమరియు ,జాతక సంబందిత సమస్యల పరిష్కారాలకు సంప్రదించగలరు.

శ్రీ విధాత పీఠం
ph 9666602371

01-08-2020 శని త్రయోదశి రోజు శని దేవుడిని ఏవిధముగా ఆరాధనా చెయ్యవలెను ?



ఈ రోజు “అష్టమ” , “అర్ధాష్టమ” , ” ఏలినాటి శని ” లతో బాధ పడుతున్నవారు.రేపు ఉదయం “శన్యూష కాలంలో” అనగా తెల్లవారుజామున 5.00 నుండి 6:30 మధ్యకాలంలో లేదా ” శని హోరలో” అనగా ఉదయం 6:30 నుండి 7:30 మద్యకాలంలో రుద్రాభిషేకం చేసిన మంచి ఫలితాలు పొందవచ్చు. సాయంత్రం “ప్రదోష వేళలో ” అనగా 5:30 to 6:30 మధ్య కాలంలో శివాలయం లో “నువ్వల నూనె” తో దీపారాధన చేసిన ఉన్నతమైన ఫలితాలు పొందుతారు.
సూర్యోదయానికి ముందే స్నానాదికాలను ముగించుకుని శనైశ్చరుడిని ఆరాధించాలి.
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం| -అనే శని ధ్యాన శ్లోకాన్ని పఠించాలి.
ఈరోజున ఉపవాసం ఉండడం మంచిది.
శని శాంతి పూజలు ఈ శనిత్రయోదశినాడు చేయించడం వలన అర్ధాష్టమ శని, ఏలినాటి శని వలన వచ్చే కష్టాలు తొలగుతాయి.
శనికి నువ్వులనూనెతో అభిషేకం చేయాలి.
నల్లని వస్త్రాలను ధరించడం దానం చేయడం రెండూ మంచిదే.
కొన్ని నల్లనువ్వులు, కొద్దిగా నువ్వులనూనె, ఒక గుప్పెడు బొగ్గులు, ఏడంగుళాల నల్లని రిబ్బను, ఎనిమిది ఇనుప చీలలు/మేకులు(nails), కొన్ని నవధాన్యాలు బ్రాహ్మడికి దానం ఇవ్వాలి. లేదా పారే నదిలో విడిచిపెట్టాలి.
కాకికి ఆహారాన్ని పెట్టాలి. ఆకలితో ఉన్నవారికి, వికలాంగులకు అన్నదానం చెయ్యాలి.
శని త్రయోదశినాడు నూనె గానీ, గొడుగు కానీ, నువ్వులను, నవధాన్యాలను కానీ కొనరాదు.

లోకాఃసమస్తాః సుఖినోభవంతు"..
శుభ ముహూర్తములు,వివాహ పొంతనాలు , జ్యోతిషం ,న్యూమరాలజీ,, సైంటిఫిక్ వాస్తు , ప్రాణికి హీలింగ్, చండీ హోమము ,ఆయుష్య హోమ0 మరియు ఇతర హోమాలు ,గృహప్రవేశము, వివాహము,దేవాలయ ప్రతిష్ట,హోమములు,వ్రతములకుమరియు ,జాతక సంబందిత సమస్యల పరిష్కారాలకు సంప్రదించగలరు.

శ్రీ విధాత పీఠం
ph 9666602371

01-08-2020 శని త్రయోదశి ప్రత్యేకత శని దోష నివారణ మార్గాలు :


ప్రతిరోజూ అన్నం తినేముందు కొంచెం అన్నం కాకులకు వేయండి.
రొట్టెముక్కలకు నువ్వులనూనె రాసి, వీథి కుక్కలకు రాత్రిపూట ఆహారంగా వేస్తే శనిగ్రహ దోషాల నివారణ జరుగుతుంది.
ఇనుము, పెనం, నూనె దానం చేయండి. ఏ లగ్నం వారికైనా కానీ శనిగ్రహ స్థితి బాగోకపోతే ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం, రాత్రిపూట కాలభైరవ స్తోత్రం పఠించండి.
నల్ల గుర్రం కాలికి కట్టిన నాడాని నువ్వులనూనెతో అభిషేకించి శనిస్తోత్రం పఠించండి.
గుమ్మానికి కానీ తలుపుకు కానీ కట్టడం వల్ల శనిగ్రహ ప్రభావం నుండి తప్పిస్తుంది.
నల్లనువ్వులు 8 సంఖ్య కొలత గల ఇనుము లేదా స్త్రీలు అరిటాకులో పోసి దక్షిణ తాంబూలం పెట్టి శనిగ్రహాన్ని విధివిధానంగా పూజించి, మధ్యాహ్నం ఒంటిగంట - ఒంటిగంట మూడు నిముషాల మధ్యవయస్సు బ్రాహ్మణుని ఆహ్వానించి పాద ప్రక్షాళన చేసి నమస్కరించి, పశ్చిమ దిక్కుకు తిరిగి దానం ఇవ్వాలి.
నువ్వు ఉండలు పిల్లలకు పంచడం, ఆవాలు, గడ్డ పెరుగు కలిపి గేదెకు పెట్టడం శనిగ్రహదోష నివారణలో ఒక విధానం.
శనిగ్రహానికి అధిష్టాన దైవం శ్రీవేంకటేశ్వరుడు. శనివార నియమం పాటిస్తూ ప్రతి రోజూ వెంకటేశ్వరస్వామికి పూజ అభిషేకం చేయడం వల్ల శనిగ్రహ దోష నివారణ జరుగుతుంది.
ఇనుము లేదా స్టీల్ బిందెలో శుద్ధమైన నీళ్ళను నింపి, అందులో నల్లనువ్వులు, మినుములు, నల్ల ఉమ్మెత్త వేర్లు, దర్భలు, జమ్మి ఆకులు వేసి ఉంచుకోవాలి.
ధన ఆకారపు ముగ్గు వేసి దానిపై దర్భలు పరిచి బిందెను ఉంచాలి.

లోకాఃసమస్తాః సుఖినోభవంతు"..
శుభ ముహూర్తములు,వివాహ పొంతనాలు , జ్యోతిషం ,న్యూమరాలజీ,, సైంటిఫిక్ వాస్తు , ప్రాణికి హీలింగ్, చండీ హోమము ,ఆయుష్య హోమ0 మరియు ఇతర హోమాలు ,గృహప్రవేశము, వివాహము,దేవాలయ ప్రతిష్ట,హోమములు,వ్రతములకుమరియు ,జాతక సంబందిత సమస్యల పరిష్కారాలకు సంప్రదించగలరు.

శ్రీ విధాత పీఠం
ph 9666602371

Thursday 30 July 2020

ధర్మసందేహాలు - లక్ష్మి దేవికి బిల్వదళం పెట్టవచ్చా ?


ఏనుగు యొక్క కుంభస్థలంగో పృష్ఠంతామరపువ్వుబిల్వదళంస్త్రీయొక్క సీమంతము ( నుదుటి భాగము ) ఈ ఐదు కూడా లక్ష్మీదేవికి ప్రబల నివాస స్థానములు. ఎవరైతే భక్తి శ్రద్దలతో లక్ష్మి దేవికి  బిల్వదళాన్ని  సమర్పిస్తారో వారింట  లక్ష్మి దేవి స్థిరంగా నివాసముంటుంది 



శ్రీ విధాత  పీఠం 9666602371

మిత్రులందరి వరలక్ష్మీ వ్రత శుభాభినందనలు.



ఓం శ్రీ మాత్రే నమః

ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః

శుభ శ్రావణ శుక్రవారంశ్రీ మహాలక్ష్మీ దేవి మాతా శుభాశీస్సులతో ........

‌మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి, ఐశ్వర్య ప్రదాయిని. ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములుగా వరాలను ప్రసాదించే అష్టలక్ష్మీ సమిష్ఠి రూపమే మహాలక్ష్మి.
ఓం శ్రీ మహాలక్ష్మీ దేవి దివ్య ఆశీస్సులతో మిత్రులందరికీ శుభ శుక్రవారం శుభ శుభోదయ వరలక్ష్మీ వ్రత శుభాభినందనలు.






31-7-2020 లక్ష్మీ సిద్ధి.కొరకు ఈనాటి యోగక్షేమం !!


ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః..!!

లక్ష్మీ కటాక్షం కలగాలంటే నిత్యం ఈక్రింది శ్లోకాన్ని
56 సార్లు జపించాలి.

"సర్వమంగళ మాంగళ్యేశివే సర్వార్థసాధికే
శరణ్యేత్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే"

శుభమస్తు

శ్రీ విధాత పీఠం
9666602371

31-07-2020 శుక్రవారం నేటి పంచాంగం:


ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻

శ్రీ శార్వరి నామ సంవత్సరం,
దక్షిణాయణం
వర్ష ఋతువు
శ్రావణ మాసం
శుక్ల పక్షం,
తిధి:ద్వాదశి రా11.03 తదుపరి త్రయోదశి,
నక్షత్రం:జ్యేష్ఠ ఉ8.33 తదుపరి మూల
యోగం:ఐంద్రం మ1.23 తదుపరి వైధృతి
కరణం:బవ ఉ11.51 తదుపరి బాలువ రా11.03 ఆ తదుపరి కౌలువ,
వర్జ్యం :సా4.17 - 5.50
దుర్ముహూర్తం:ఉ8.15 - 9.07 & మ12.32 - 1.23
అమృతకాలం :రా1.35 - 3.08,
రాహుకాలం: ఉ10.30 - 12.00,
యమగండం/కేతుకాలం:మ3.00 - 4.30
సూర్యరాశి:కర్కాటకం |
చంద్రరాశి: వృశ్చికం
సూర్యోదయం:5.41
సూర్యాస్తమయం:6.31,


సర్వే జనాః సుఖినో భవంతు,శుభమస్తు
గోమాతను పూజించండి,గోమాతను సంరక్షించండి

ఈరోజు విశేషం : వరలక్ష్మి వ్రతం, దామోదర ద్వాదశి

"ఈరోజు పుట్టిన రోజు మరియు పెళ్లి రోజు జరుపుకునే వారికి ఆశీఃపూర్వక అభినందనలు"..

లోకాఃసమస్తాః సుఖినోభవంతు"..
శుభ ముహూర్తములు,వివాహ పొంతనాలు , జ్యోతిషం ,న్యూమరాలజీ,, సైంటిఫిక్ వాస్తు , ప్రాణికి హీలింగ్, చండీ హోమము ,ఆయుష్య హోమ0 మరియు ఇతర హోమాలు ,గృహప్రవేశము, వివాహము,దేవాలయ ప్రతిష్ట,హోమములు,వ్రతములకుమరియు ,జాతక సంబందిత సమస్యల పరిష్కారాలకు సంప్రదించగలరు.

శ్రీ విధాత పీఠం ,ph 9666602371

31-07-2020 శుక్రవారం నేటి రాశిఫలాలు :


మేషం:
ఆశ్చర్యకరమైన సమాచారం. పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆధ్యాత్మిక చింతన. బంధువులతో సఖ్యత. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
వృషభం:
పనులు వాయిదా పడతాయి. ఆలయ దర్శనాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. అనుకోని ప్రయాణాలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
మిథునం:
సన్నిహితుల నుంచి ధనలాభం. దూరపు బంధువుల కలయిక. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
కర్కాటకం:
కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. వస్తులాభాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
సింహం:
చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆలయ దర్శనాలు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. అనుకోని ధనవ్యయం. ఉద్యోగయత్నాలు విరమిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.
కన్య:
నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. బంధువర్గంతో విభేదాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
తుల:
పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. ధనలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.
వృశ్చికం:
కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో సఖ్యత. వస్తులాభాలు. మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.
ధనుస్సు:
పనులు వాయిదా వేస్తారు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. కుటుంబంలో కొన్ని ఇబ్బందులు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.
మకరం:
పనుల్లో జాప్యం. ఆప్తుల నుంచి ఒత్తిడులు. పుణ్యక్షేత్రాల సందర్శనం. ప్రయాణాలలో ఆటంకాలు. రుణాలు చేస్తారు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.
కుంభం:
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆస్తిలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.
మీనం:
పరిస్థితులు అనుకూలించవు. పనులు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక చింతన. భూవివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అవాంతరాలు.