కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న ముప్పును మరియు భవిష్యత్తులో ఆశించే ఉపశమనాన్ని జ్యోతిష శాస్త్ర పరంగా అధ్యయనం చేసే చిన్న ప్రయత్నం ...
కరోనా వైరస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న సమస్య కావున దీనిని విశ్లేషించడానికి కాల పురుషుని కుండలిని పరిగణలోకి తీసుకోవాలి కాలం అంటే సమయం పురుష అంటే మానవ జీవి అని అర్థం కాబట్టి ఈ కుండలి సృష్టి(విశ్వం) ప్రారంభానికి సంబంధించినది కాల పురుషుని లగ్నం మేష లగ్నం నుంచి మొదలవుతుంది మిగిలిన రాశులు వరుసక్రమంలో ఉంటాయి కావున దీనిని మానవజాతి కుండలి అని పిలుస్తారు ఇక్కడ సూర్యుడిని కాలాన్ని నడిపించే శక్తిగా చంద్రుడిని విశ్వం యొక్క మనసు శక్తిగా పరిగణిస్తారు
మేషం 00-00 డిగ్రీల లాంగిట్యూడ్ మరియు 00-00 డిగ్రీ లాటిట్యూడ్ వద్ద మేషరాశిలో మొదలవుతుంది ఇక్కడ eciliptic(ఆకాశంలో సూర్యుని యొక్క స్పష్టమైన మార్గం) ఖగోళ భూమధ్యరేఖ ను కలుస్తుంది సూర్యుడిని కాలాన్ని నడిపించే శక్తిగా పరిగణించినప్పుడు ప్రస్తుత అధ్యయనం సూర్యుడి మీద దృష్టి ఎక్కువగా పెట్టాలి కావున సూర్యుడు ఈ యొక్క బలం మరియు బలహీనత మరియు సూర్యుని నుంచి వెలువడే ఉష్ణం అనేవి మానవ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనేది మనం గ్రహించాలి
లగ్నం మరియు లగ్నాధిపతి
కుజగ్రహానికి లగ్నానికి మరియు 8వ స్థానానికి ఆధిపత్యం ఉంది 8వ స్థానం దీర్ఘకాలిక వ్యాధులు గోప్యం ఆకస్మికత లోతైన పరిశోధనలు మరణం మొదలైన వాటిని సూచిస్తుంది కుజగ్రహానికి అష్టమ స్థానాల ఆధిపత్యం ఉండటం ఆ స్థానాన్ని రక్షించే ప్రయత్నం చేస్తాడు వృశ్చిక రాశి రసాయనాలకు సంబంధించిన రాశి కావున ఔషధ పరిశోధనలు కూడా ప్రోత్సహిస్తూ ఉంటుంది అష్టమ స్థానం నుంచి అష్టమ స్థానం తృతీయ స్థానం అవుతుంది తృతీయ స్థానంలో ఉన్న రాహువును కుజుడు వీక్షణ చేసి ఉన్నాడు కాబట్టి ఇది దగ్గు తుమ్ము మొదలైన వాటి ద్వారా శ్వాసకోశ వ్యాధులు రావడానికి సహాయపడుతుంది 22.3.2020 నాడు కుజుడు మకర రాశిలోకి ప్రవేశం జరిగింది కుజగ్రహానికి ఉచ్చ స్థానం మరియు 27.03.2020 వరకు వర్గోత్తమం లో ఉన్నాడు పదవ స్థానంలో దిగ్బలం చెంది ఉన్నాడు కాబట్టి మనకు కుజుడు చాలా శక్తివంతంగా ఉన్నాడు కావున వైద్యశాస్త్రంలో పరిశోధనలు చాలా విస్తృతంగా జరుగుతున్నాయి కొంత పురోగతి ని కూడా మనం చూడటం జరిగింది
రాహు
31.12.2019 నాడు ఊహన్ నగరంలో తెలియని కారణంతో నిమోనియా కనుగొనబడిన అప్పుడు దీనికి కారణం కరోనా వైరస్ అని గుర్తించడం జరిగింది జాతకంలో అన్ని రకాల వైరస్ కి రాహువు మరియు కేతువు గ్రహాలు కారకత్వాలు గా ఉంటాయి రాహు చాలా రహస్యమైన గ్రహం కాబట్టి ఇది భవిష్యత్తులో శీగ్ర పరిష్కారాలకు అనుమతించదు మరియు రాహు తన సొంత నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు మరియు శని గ్రహం యొక్క సప్తమ వీక్షణ మరియు కుజ గ్రహ అత్తమ్మ వీక్షణ చేత చూడ పడుతున్నాడు రెండు బలమైన పాపగ్రహాల వీక్షణ రాహు గ్రహం మీద ఉంది ఇది కనికరంలేని పాపగ్రహాల స్థితి అని మనం అర్థం చేసుకోవచ్చు ఇది అన్ని రకాల విదేశీ విషయాలతో మనం పోల్చుకోవచ్చు కాబట్టి ఊహన్ సిటీలో స్థానికంగా ప్రారంభమై త్వరగా అంటువ్యాధిగా మరి అత్యంత త్వరగా మహమ్మారి గా మారింది రాహు డ్రాగన్ యొక్క తల మరియు చైనా డ్రాగన్ కంట్రీ రాహు మిధున రాశిలో సంచారం చేస్తున్నాడు మిధున రాశి మూడో స్థానానికి సంబంధించినది ఈశాన్య దిశ సూచిస్తుంది అనగా చైనా ఉన్న ప్రదేశాన్ని సూచిస్తుంది మిధున రాశి వాయు తత్వ రాశి కరోనా వైరస్ తుంపర్ల ద్వారా వ్యాపిస్తుంది మూడో స్థానం గొంతు మరియు ఊపిరితిత్తుల పైభాగం వంటివి వాటిని సూచిస్తుంది
31.12.2019 తేదీకి ముందు 26.12.2019 తేదీన సూర్యగ్రహణం జరిగింది అప్పుడు రవి తన యొక్క శక్తిని కోల్పోయాడు 10.01.2020 తేదీన చంద్రగ్రహణం జరిగింది అప్పుడు చంద్రుడు తన యొక్క శక్తిని కోల్పోయాడు రెండు వెలుగులు(సూర్యుడు మరియు చంద్రుడు) బలహీనపడడం కరోనా వైరస్ వేగంగా వృద్ధి చెందడానికి మరియు వేగంగా వ్యాప్తి చెందడానికి సహాయపడింది మూడవ స్థానం అసహజ మరణాలతో వ్యవహరిస్తుంది ఎందుకంటే మూడో స్థానం అష్టమ స్థానం నుంచి అష్టమ స్థానం అవుతుంది అష్టమ స్థానం నుంచి కుజుడు మరియు నవమ స్థానం నుంచి శని రాహు గ్రహం మీద వీక్షణ కలిగి ఉన్నారు ఈ వీక్షణ వల్ల పరిస్థితి ఘోరంగా మారిపోయింది రాహువు అంటువ్యాధులకు మరియు కుజుడు సంక్రమణాలకు మరియు శని దీర్ఘకాలిక రోగాలకు మరియు జన సమూహాలను కారకత్వాలు గా ఉన్నారు ఈ మూడు గ్రహాలు పరస్పర సంబంధాల చేత కరోనా వైరస్ అనే భారీ వ్యాప్తి జరిగింది మహమ్మారి గా మారింది అసహజ మరణాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి ప్రపంచాన్ని మోకాళ్ళ మీద నిలబెట్టాయి
కేతువు
అంటువ్యాధులు జ్వరాలు అనేక రకాల గుర్తించలేని వ్యాధులను కేతు కారకత్వాలు గా ఉంటాయి కేతు గ్రహం నాలుగు గ్రహాల తో కలయిక జరగడం వల్ల ఒక దాని శక్తిని ఇంకొకటి గ్రహిస్తూ ఉంటాయి కేతువు మోసపూరిత గ్రహం ఇది ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది ఇది సూక్ష్మ జీవులు మరియు వాటి అధ్యయనాలను సూచిస్తూ ఉంటుంది ఇటీవలి కాలంలో సూర్యగ్రహణానికి కారణమయింది ఇది కరోనా వైరస్ నివారణ కోసం కనుగొన్న మార్గాన్ని నిరోధిస్తూ ఉంటుంది కేతువు మరియు బృహస్పతి కలయిక కూడా ఒకసారి చూద్దాం ఇది చాలా ఇబ్బంది పెట్టే కలయిక. ఈ కలయిక వ్యాధి యొక్క వ్యాప్తి తీవ్రతను ప్రోత్సహిస్తుంది బృహస్పతి మంచి లేక చెడు దేనినైనా విస్తరణ చేసే గ్రహంగా ఉంటాడు మరియు కేతువు ఈ విషయాన్ని అయినా వృద్ధి చేస్తుంది విస్తరణ మరియు వృద్ధి(గురువు మరియు కేతువు) కలసి వ్యాధిని ప్రేరేపిస్తారు మరియు ప్రోత్సహిస్తారు ఈ కలయిక గురుచండాల యోగం కూడా మారింది కావున గురుడు బాధపెట్టే గ్రహంగా రూపాంతరం చెంది ఉన్నాడు మరియు కేతువు 12వ స్థానానికి ఆధిపత్యం కలిగిన గురుడు కలయిక ఆరో స్థానానికి ఆధిపత్యం కలిగిన బుధుడు తో కలిసి ఉన్నాడు 12వ స్థానం హాస్పిటల్స్ ని మరియు ఆరవ స్థానం రోగాలను సూచిస్తుంది 6 మరియు 12 స్థానాలు గ్రహ సంబంధాలు మంచిది కాదు ఈ సంబంధాలు కేతువుల కలయిక చేత అంత త్వరగా వ్యాధి నుండి కోలుకోవడానికి సహకరించదు 30.03.2020 బృహస్పతి మకరరాశి ప్రవేశం తర్వాత వ్యాధి నుంచి కోలుకుంటారని చాలామంది ఊహించారు కానీ అలా జరగలేదు
సూర్యుడు
భూమిపై అన్ని జీవరాశులకు జీవితాన్ని ఇచ్చేవాడు మరియు వాటిని రక్షించేవాడు సూర్యుడిని వైద్య పరిజ్ఞానం యొక్క తండ్రిగా పిలువబడుతున్నాడు సూర్యుడిని వ్యాధులను నిర్మూలన చేసే డాక్టర్ గా ఉన్నాడని మనకు విశ్వాసం సూర్యుడు ప్రపంచంలోనే ఉత్తమ క్రిమిసంహారక మందు ఇది బ్యాక్టీరియా సూక్ష్మక్రిములు వైరస్ మరియు సూక్ష్మ జీవులను చంపి నాశనం చేస్తుంది మరియు సూర్యుని యొక్క కుమారులు అశ్వినీ దేవతలు వీరు దేవతా వైద్యులు జాతకంలో బలహీనమైన సూర్యుడు ఆరోగ్య సంబంధిత లోపాలను సృష్టిస్తాడు
సూర్యుడికి ఇబ్బందులు ప్రారంభమైన తేదీ 26.12.2019.ఆ తేదీన సూర్యగ్రహణానికి సాక్ష్యం ఇచ్చింది ఇక్కడ సూర్యుడు రాహువు మరియు కేతువు చేత ప్రభావితం అయినప్పుడు బాగా బలహీన పడ్డాడు ఇది ప్రాణశక్తి సాధారణ ఆరోగ్యం మరియు తలనొప్పి మరియు జ్వరాలకు ఇలాంటి విషయాలు ప్రభావితమవుతాయి సూర్యుడు అకస్మాత్తుగా బలహీనంగా మారడం వలన కరోనా వైరస్ ఇబ్బందిని కలగజేసింది 10.01.2020 నాడు చంద్రగ్రహణం జరిగింది చంద్రుడు మనసును మరియు ఊపిరితిత్తులను సూచిస్తాడు అకస్మాత్తుగా చంద్రుడు బలహీనంగా మారడం వలన కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించిన ఊపిరితిత్తుల మీద ప్రభావితమైంది
31.12.2019 నాడు చైనా దేశం వారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనీ సంస్థకు కొత్త వైరస్ కనుగొన్నామని తెలియజేయడం జరిగింది చైనాలోని ఊహన్ నగరం నుండి కరోనా వైరస్ వ్యాధి తీవ్రంగా వ్యాపించింది (30 degrees 35.5 N , 114 degrees 18 E) అక్షాంశం రేఖాంశం సూర్యుడు అప్పుడు దక్షిణ అర్ధ గోళంలో మకర రాశిలో(23 degrees 26 min) దగ్గర చాలా తక్కువ (ఉత్తరార్ధ గోళం) సూర్యకిరణాల మరియు తక్కువ ఉష్ణోగ్రతల సీతాకాలం కు దారితీస్తాయి ఈ కాలంలో మరియు ఈ ప్రాంతంలో కరోనా వైరస్ చల్లని వాతావరణంలో వృద్ధి చెందింది
15.01.2020 నాడు సూర్యుడు మకర సంక్రాంతి మకర రాశిలోకి ప్రవేశించి ఉత్తరాయణంలో ఉత్తరం వైపు ప్రయాణం మొదలుపెడతాడు ఇది సూర్యునికి బలంగా మారే సమయం కరోనా వైరస్ ను నియంత్రించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు
24.03.2020 నాడు శార్వరి నామ సంవత్సరం ఆరంభమైంది ఇది ఖగోళ శాస్త్ర పరంగా దక్షిణ అర్ధ గోళంలో నుండి ఉత్తర అర్ధ గోళంలో కి దాటుతాడు సూర్యుడు అప్పుడు భూమధ్యరేఖ వద్ద ecliptic(ఖగోళ భూమధ్యరేఖ వద్ద కలుస్తుంది) పగలు మరియు రాత్రి ఇక్కడ సమానంగా ఉంటాడు మరియు సూర్యుడు మరింతగా మండుతూ సూర్య కిరణాలను ప్రసరింప చేస్తూ ఉంటాడు దీనికి కారణం చేత వ్యాధిని అరికట్టడానికి మరియు నియంత్రించడానికి శ్రమిస్తూ ఉంటాడు
13.04.2020 తేదీన సూర్యుడు మేష రాశిలో కి ఉచ్చ స్థానం లోకి ప్రవేశించాడు ఇది సూర్యుడి యొక్క శక్తి ఉద్ధృతి కి సంకేతం 13.04.2020 నుండి 17.04.2020(00-00 degress to 3 degrees 20 min) వరకు వర్గోత్తము లో ఉంటాడు ఇదిదేవతల వైద్యులు లేక నక్షత్రంలో అశ్విని లో ఉంటాడు వైద్యం మరియు నివారణ శక్తులు కలిగి ఉన్న సూర్యుడు అప్పుడు చాలా బలంగా మరియు శక్తివంతంగా ఉంటాడు ఇది వ్యాధి నియంత్రించడానికి బాగా దోహదపడాలి ఈ సమయంలో అనేక మంది జ్యోతిష్య పండితులు కరోనా వైరస్ వ్యాక్సిన్ లేదు మెడిసిన్ లభిస్తుంది అని ఊహించి ఫలితాలు చెప్పారు కానీ మనకు అనుభవంలోకి రాలేదు మరియు జరగలేదు
21.04.2020 నుండి 21.06.2020 వరకు రెండు నెలలు గ్రీష్మ ఋతువు ప్రారంభమవుతుంది సూర్యుడు చాలా వేడిగా ఉంటాడు ఇది కర్కాటకరాశిలో (భూమిపై ఉత్తరాన ఉన్న పాయింట్) పై ఉంటుంది వేడి మరియు బలంగా ఉండడం వల్ల సూక్ష్మ క్రిములు మరియు వైరస్ ను చంపుతుంది
సూర్యుడు భూమిపై ఉన్న అన్ని జీవులకు ప్రాణ శక్తిని అందించడం జరుగుతుంది ఇది సౌర వ్యవస్థను మరియు గ్రహ వ్యవస్థలను నియంత్రిస్తుంది పరాశర మరియు జెమిని మహర్షి యొక్క జ్యోతిషశాస్త్రంలో లగ్న భావానికి(తను భావానికి) కారకుడు సూర్యుడు. మొదటి స్థానం పూర్తి జాతకాన్ని నియంత్రించగలిగే శక్తిసామర్ధ్యాలను కలిగి ఉంటుంది కాల పురుషుని కుండలిలో లగ్నమైన మేష లగ్నం కూడా విశ్వం యొక్క ప్రారంభాన్ని సూచిస్తుంది ఇది కాలపురుషుని కుండలి..అనగా మానవ జీవిత కుండలి కాబట్టి ఇది ప్రత్యేకంగా ఎంపిక చేయబడింది ప్రస్తుతం అధ్యయనం కోసం ఈ అధ్యయనం యొక్క ప్రాథమిక దృష్టి సూర్యుని మీద ఉండాలి సూర్యుడు మనలోని ఆత్మనీ సూచిస్తుంది కాబట్టి మనమందరం అది త్వరలోనే ఈ మహమ్మారి నుండి బయటపడాలని ఆ దేవుని ముందు శిరసు వంచి ప్రార్థిద్దాం సాధ్యమైనంత వరకు సూర్యుడు ప్రార్థించండి ఈ విశ్వాన్ని మహమ్మారి నుంచి కాపాడుకోవటానికి ప్రతి ఒక్కరూ మీకు తోచిన విధంగా సూర్యుడిని ఆరాధించండి
కరోనా వైరస్(covid-19) గురించి లోతైన విశ్లేషణ తెలుసుకునే ముందు మనం గతంలో జరిగిన గ్రహస్థితులను ఒకసారి పరిశీలించాలి....
2019 నవంబర్ నెలలో కేతువు మరియు శని కలిసి ధనస్సు రాశిలో స్థితి పొంది ఉన్నారు ధనస్సు రాశి మానవాళికి పునాది లాంటిది కేతువు వైరస్ మరియు గుర్తించలేని వ్యాధులు ఇస్తుంది కేతువు 2009-10 మధ్యకాలంలో సంచారం చేస్తున్నప్పుడు స్పైన్ ఫ్లూ వ్యాధి గుర్తించబడింది కానీ శని గ్రహం ఆ వ్యాధిని పెద్దగా వ్యాప్తి చెందకుండా నియంత్రించడం జరిగింది శని గ్రహం ఏ విషయాన్ని అయినా పరిమితులు విధిస్తాడు కానీ నవంబర్ 2019లో బృహస్పతి ధనస్సు రాశి ప్రవేశం చేశాడు అనగా ధనుస్సురాశిలో శని మరియు కేతువు మరియు బృహస్పతి కలయిక జరిగింది బృహస్పతి ఏ విషయాన్ని అయినా విస్తరణ(expansion) చేస్తాడు కావున కేతువు యొక్క కార్యకలాపాలను విస్తరించాడు అదే సమయంలో పరిమితులను విధించడానికి శని సహాయ పడుతున్నాడు కేతువు మరియు గురువుల కలయికను గురు చండాల యోగం గా పరిగణించబడుతోంది కావున కేతువుకి లోబడి గురువు ఫలితాలను ఇస్తున్నాడు
ధనుస్సు రాశి కి సమ సప్తకం లో అనగా మిధున రాశిలో రాహు సంచారం జరుగుతుంది మిధున రాశి శ్వాసకోస వ్యవస్థ మరియు దాని అవయవాలు ఊపిరితిత్తులను సూచిస్తుంది రాహు ఎప్పటిలాగానే కేతువు యొక్క శక్తులను దిశానిర్దేశం చేస్తున్నాడు పైగా రాహువు అప్పటికే సొంత నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రంలో 12. సెప్టెంబర్ 2019 నుండి సంచారం చేస్తున్నాడు కేతువు నేపథ్యాన్ని సిద్ధం చేశాడు
డిసెంబర్ 2019 ఈ నెలలో గ్రహ రాజు అయిన సూర్యునికి గ్రహణం పట్టింది అప్పుడు ఆ రాశిలో బృహస్పతి మరియు శని తో సహా అనేక గ్రహాలు ఉన్నాయి అప్పుడు ఆ రాశిలో అనేక రకాల గ్రహాల శక్తి ఆవిర్భవించింది 7 గ్రహాలు నేరుగా ఈ గ్రహణంలో పాలు పంచుకున్నాయి ఇది ఆచరణాత్మకతలో అసమతుల్యతను కారణం అయ్యింది ఈ గ్రహణ ప్రభావం చేత మానవ సంబంధాలు వ్యక్తిగతంగా మరియు రాజకీయ పరిస్థితులపైన మరియు ప్రపంచ ఆర్థిక రంగంపైన మరియు ప్రపంచ ఆరోగ్య సమస్యలు లాంటివి ప్రభావితం అయ్యాయి కానీ చివరకు ఈ గ్రహణ ప్రభావం covid-19 అనే కరోనా వైరస్ ఎక్కువగా ప్రభావం అయ్యి మానవ జీవితం లోకి విడుదల చేయడానికి ఈ గ్రహణ ప్రభావం ఎక్కువగా ప్రేరేపించింది
ఆ తర్వాత జనవరి 2020 లో మరొక గ్రహణాన్ని మనం చూడవలసి వచ్చింది మిధున రాశిలో రాహువు మరియు ధనుస్సు రాశి లో కేతువు మధ్యలో గ్రహాల యొక్క శక్తి ప్రభావితం అవుతూనే ఉంది ఛాయాగ్రహాలు వాటి యొక్క శక్తిని విపరీతంగా ఉత్పత్తి చేస్తున్నాయి ఆ సమయంలో బుద్ధుడు అస్తంగత్వం చెందటం వలన మానవాళి మెంటల్ గా చాలా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి శని గ్రహం తన సొంత రాసి అయిన మకర రాశిలోకి ప్రవేశం చేశాడు వెంటనే అస్తంగత్వం చెందాడు ఆ విధంగా బృహస్పతి మరియు కేతువు ధనస్సు రాశి లో స్థితి పొంది ఉన్నారు శని గ్రహం నుండి విముక్తి పొందిన కేతువు బృహస్పతి ప్రభావంతో విస్తరించాడు అనగా వైరస్ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా పెరిగింది దాని ప్రభావాలు మనం కూడా చూడడం జరిగింది బృహస్పతి అతిచార వేగంతో కదలటం వలన కేటు చర్యలను బృహస్పతి ఇంకా ఎక్కువగా చేసింది
కేతువు తన సొంత నక్షత్రమైన మూల నక్షత్రంలో కి జనవరి 16న ప్రవేశించి మానవాళిని నాశనం చేయటానికి మరింత శక్తిని పొందాడు మూల నక్షత్రం విష్ణువు నాభి ని సూచిస్తుంది మన యొక్క గెలాక్సీలో కేంద్రం వంటిది దీనిలో శక్తి యొక్క రహస్య నిల్వలు ఉంటాయి ఇది నాశనం యొక్క శక్తి అయిన నిరుతి చేత పాలించబడుతుంది
ఫిబ్రవరి 2020 లో కుజ గ్రహం తమ యొక్క శక్తిని ధనస్సు రాశి లోకి చేర్చింది ఇప్పుడు కేతువు మరియు కుజుడు రెండు అగ్ని తత్వ గ్రహాలు బృహస్పతికి శక్తిని అందిస్తున్నాయి బృహస్పతి ఆ శక్తిని విస్తరణ చేస్తున్నాడు చైనా నిర్బంధంలో నుండి వైరస్ బయటికి వచ్చి వ్యాప్తి చెందటం లో ఫిబ్రవరిలో మరిన్ని దేశాలు ప్రభావితమయ్యాయి కానీ అప్పుడు శని అస్తంగత నుంచి కోలుకుంటున్నాడు కాబట్టి స్పందన ఆసక్తికరంగా ప్రారంభమైంది ప్రభుత్వాలు మరియు సమాజాలు తమను తాము నిర్వహించడం ప్రారంభించాయి కానీ కేతువు ఇంకా శక్తితో ఉన్నాడు కాబట్టి వ్యాప్తి కొనసాగుతుంది ఫిబ్రవరి 26న మనము కేతువు కుజ గ్రహాలు కలయిక బాగా దగ్గరగా ఉంది ఇది కేతువుకి మరింత శక్తిని ఇవ్వటానికి దోహదపడింది ఫిబ్రవరి -మార్చి మూడు వారాల కాలంలో బుధుని ప్రభావం బాగా బలహీనంగా ఉంది కాబట్టి ప్రతిస్పందనను పెంచటంలో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి సమన్వయ లోపం జరిగింది బుద్ధుడు అస్తంగత్వం మరియు వక్రీకరణ నుంచి కోలుకున్న తర్వాత ప్రతిస్పందన క్రమబద్ధంగా మారింది బాగా ఆలోచించి నిర్ణయాలు చేయడం జరిగింది
జూన్ 21 వరకు పాక్షిక కాలసర్పదోష ప్రభావంతో రాహు కేతువులు మరింత శక్తివంతంగా ఉండే అవకాశం ఉంది రాహు కేతువుల మధ్య ఉన్న గ్రహాల శక్తిని చేజిక్కించుకొని వారు మరింత శక్తివంతంగా మరి వికృత చేష్టలు చేసే అవకాశం ఉంది
20 మార్చ్ 2020 కుజుడు మరియు బృహస్పతి కలయిక జరిగింది కాబట్టి అగ్ని తత్వ గ్రహమైన కుజుని శక్తి వలన వైరస్ మరియు దాని నివారణ పై గణనీయమైన అవగాహన పొందడానికి వైద్య బృందాలు ఈ శక్తి ఉపయోగించటానికి ప్రయత్నం చేస్తాయి మార్చి 22వ తేదీన కుజ గ్రహం మకర రాశిలోకి ప్రవేశం
జరిగింది బృహస్పతి మరియు కేతు గ్రహాలు ధనస్సు రాశి లోనే ఉన్నారు మకర రాశిలో కుజుడు ఉచ్ఛస్థితిలో ఉంటాడు కాబట్టి ప్రభుత్వాలు సమాజానికి ఉపయోగపడే మార్గదర్శకాలను మానవాళికి విడుదల చేస్తాయి మరియు 31 వ తేదీన బృహస్పతి మకర రాశిలోకి ప్రవేశం జరిగింది కుజుడు మరియు శని గ్రహాల కలయిక గ్రహ యుద్ధం లో పాల్గొనడం జరిగింది ఒక అగ్ని తత్వ గ్రహం మరియు ఒక వాయు తత్వ గ్రహం విపరీతమైన శక్తిని వెదజల్లుతాయి ఇది కొన్ని విస్ఫోటనాల కు దారితీస్తుంది కాబట్టి మార్చి చివరి వారం నాటికి వైరస్ వ్యాప్తి పరిణామాలపై ప్రభుత్వానికి మరియు వైద్య బృందాలకు చాలా కార్యాచరణ వచ్చిపడింది అనేక గ్రహాలు ఒకే రాశిలో కలిసినప్పుడు మరియు గ్రహ యుద్ధం లో పాల్గొన్నప్పుడు ఆ శక్తి దేశ పరిస్థితులపై మరియు మానవ సంబంధాలను ప్రభావితం చూపిస్తుంది మనం మానవ జీవితాల విధిని చదవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఏ గ్రహ శక్తి మానవ జీవితాల పై ఎక్కువగా ప్రభావం చూపుతుందో అనేక చిక్కులు మనం సూక్ష్మంగా పరిశీలించాలి
ఏప్రిల్ 2020 లో మకర రాశిలో శని మరియు కుజుడు మరియు బృహస్పతి స్థితి పొంది ఉన్నారు ఈ కలయిక ప్రభుత్వాలు వైద్య బృందాలు వ్యాధిని నయం చేయడానికి అవసరమైన శక్తిని ఉత్పత్తి చేసే అవకాశం ఉంది కానీ ధనస్సు లోని కేతువు ఒంటరిగా మరియు ఏ గ్రహం చేత వీక్షణ లేకుండా తన యొక్క చర్యలను కొనసాగించాడు మరియు వైరస్ ప్రజలకు వ్యాప్తి చేసి మరియు ప్రభావితం చేసే పని చేసింది అయితే దాని వేగం మరియు తీవ్రత కొంచెం మందలించాలి కానీ అలా జరగలేదు
మే 2020 గ్రహాల సంచారంలో బృహస్పతి మరియు శుక్రుడు మరియు శని మూడు గ్రహాలు వక్రీకరించడం జరుగుతుంది ఇది గందరగోళానికి దారితీస్తుంది ప్రభుత్వం మరియు సమాజం మరియు వైద్య ప్రతిస్పందనలు లోపాలు ఎదురుకావచ్చు మే చివరి వారంలో అంటువ్యాధిగా మారిన కరోనా వైరస్ అనే మహమ్మారి తాత్కాలిక పెరుగుదలను దారి తీస్తుంది
జూన్ 2020 నెలలో ఒక చంద్రగ్రహణం ఏర్పడింది మరియు ఆ తరువాత మిధునం మరియు ధనసురాశి యాక్సెస్ లో సూర్యగ్రహణం ఉంది ఈసారి శుక్రుడు బుధుడు సూర్యుడు మిధున రాశిలో రాహు తో కలిసి ఉంటారు ఈ గ్రహణం తూర్పు అర్థగోళంలో మళ్లీ కనిపిస్తుంది చైనా రష్యా భారతదేశం లాంటి దేశాలు వైరస్ కలిగివున్న కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే గ్లోబల్ ఎకానమీ కూడా గందరగోళంలో ఉంటుంది ఈ నెలలో కొన్ని గ్రహాలు అస్తంగత్వం మరియు వక్రీకరించడం వల్ల ఈ సంవత్సరంలో ముఖ్యంగా జూన్ నెలలో అత్యంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
జూలై 2020 బృహస్పతి ధనస్సు రాశి లోకి ప్రవేశం కానీ బృహస్పతి కేతు గ్రహానికి దూరంగా ఉంటాడు ఇది మనకి ఒక ఆశీర్వాదం కానీ ధనస్సు రాశి కేతువు మరియు బృహస్పతి యొక్క శక్తి ద్వారా పనిచేస్తుంది కాబట్టి ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలు పూర్తిగా కోలుకుంటారు ఈ పరిస్థితి 2020 సెప్టెంబరు వరకు ఉంటుంది బృహస్పతి మరియు శని రుజుమార్గం లోకి వచ్చేంత వరకు కొనసాగుతుంది కేతువు మూలనక్షత్రంలో అంటే ధనస్సు రాశిలో సెప్టెంబర్ 23 వరకు ఉంటుంది కాబట్టి సెప్టెంబర్ వరకు ఈ వైరస్ ఉద్ధృతి కొనసాగే అవకాశం ఉంది సెప్టెంబర్ చివరి వారంలో గణనీయమైన మార్పు కనిపిస్తుంది అక్టోబర్ చివరి వారం కల్లా దీని యొక్క తీవ్రత దాదాపుగా కనుమరుగు అయ్యే అవకాశం ఉంది పరిస్థితులు సద్దుమణిగిన తరువాత మొత్తం మానవాళి ఊపిరి పీల్చు కుంటుంది ప్రభుత్వాలు మరియు సమాజం మరియు దేశాలు వాటి యొక్క సరిహద్దులను తీవ్రంగా పర్యవేక్షించబడుతుంది వ్యాక్సిన్ లేక మెడిసిన్ తయారు చేయబడి మానవాళికి ఉపయోగపడేలా చేస్తుంది ఆర్థిక మార్కెట్లు కొంతవరకు సాధారణ స్థాయికి వచ్చే అవకాశం ఉంటుంది మానవ జీవితం ప్రాథమిక పరిస్థితుల్లోకి మారుతుంది
మిధున రాశి మరియు ధనసురాశి యాక్సెస్ శక్తివంతమైనది ఇది వేగవంతమైన ఫలితాలను ఇవ్వడానికి రెడీగా ఉంటాయి ఆకస్మిక సంఘటనలతో పాటు ప్రపంచ మానవత్వం మొత్తం పెద్ద స్థాయిలో పని చేసేటట్లు ఉంటుంది మానవత్వం స్థాయి మరియు ప్రభుత్వ స్థాయి వరకు పరీక్షించబడుతున్నాయి మీరు ఇప్పుడు కొత్త పద్ధతులను అవలంభించాలి సాధారణ పరిస్థితులకు కొంత విభిన్నంగా ఉండాలి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం పరిశుభ్రతకు సంబంధించిన అన్ని పద్ధతులను అవలంబించడం సహజమైన రోగనిరోధకశక్తిని మెరుగుపరచటానికి ప్రయత్నించటం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం మరింత సమతుల్యమైన జీవనశైలిని గడవడం మరియు చేతులను తరచూ శుభ్రం గా కడగటం ప్రతి ఒక్కరు జీవనశైలిలో ప్రాథమిక మార్పులు ఇతరులకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా రెండు చేతులతో నమస్కరించటం వంటి పద్ధతులను అనుసరించాలి
మిధున రాశి మరియు ధనుస్సు రాశి యాక్సిస్ ను ప్రభావితం చేసిన రాహు కేతు గ్రహాలు మనందరికీ లోతైన కర్మ సంఘటన కరోనా వైరస్ వల్ల కొంతమంది ప్రభావితం అవుతారు కొందరు దీనిని నయం చేయడానికి కృషి చేస్తున్నారు కొందరు దిగ్బంధం(లాక్ డౌన్) చెందటం కారణంగా బాధపడుతున్నారు మీరు కరోనా వైరస్ ద్వారా ప్రత్యక్షంగా ప్రభావితం కాకపోయినా రాహు కేతువులు మీ జీవితంలో ఏదో ఒక రకంగా విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉంటారు గత జీవితం యొక్క కర్మ మీ జీవిత పునాదులను కదిలించి మీరు ఎన్నుకున్న మార్గాన్ని పని చేసే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి మీ జాతకం ప్రకారం మిధున రాశి మరియు ధనసురాశి యాక్సెస్ మీ జీవితంలో జరిగే అనేక సంఘటనలకు కదిలించే లోతైన విషయాలను చూస్తారు కరోనా వైరస్ దీనిలో ఒక భాగం మాత్రమే
కరోనా వైరస్-భారతీయ వాతావరణం
నేను పైన చెప్పిన విధంగా సెప్టెంబర్ 2020 మూడో వారం దాకా ఈ పరిస్థితిని ఎదుర్కొంటోంది కానీ భారతదేశంలో ఒక ప్రశ్న ఉంది ఇతర దేశాలతో పోల్చి చూస్తే కొంతవరకు మెరుగ్గా ఉంది
31 మార్చి 2020 న మకర రాశిలో కుజుడు మరియు శని గ్రహ యుద్ధంలో పాల్గొన్నారు ఈ కలయిక తో ప్రభుత్వాలు మరియు వైద్య బృందాలు వారి యొక్క శక్తిని ఎక్కువగా ఉపయోగించడానికి ప్రేరేపిస్తాయి ఏదైనా నివారణ చర్యలకు మరియు వ్యూహాలను అభివృద్ధి చేయడానికి దీనిని ఉపయోగిస్తారు మరియు బృహస్పతి కేతువునీ విడిచిపెట్టి మకర రాశిలోకి ప్రవేశించే జరిగింది మరియు ఏప్రిల్ ఒకటి 2020 నా మకర రాశిలో కుజ గ్రహం శనిగ్రహం కంటే ముందుకు కదులుతుంది కుజ గ్రహం యుద్ధంలో విజయం సాధించాడు కుజ గ్రహం మే నెల 4వ తేదీ వరకు మకర రాశి లోనే ఉన్నాడు
కేతువు వైరస్ కి కారకుడు కాబట్టి మార్చి 31 తర్వాత కేతు గ్రహానికి శక్తిని ఇచ్చే గ్రహం లేదు కేతువు ఒంటరిగాధనస్సు రాశిలో ఉన్నాడు ధనస్సు రాశి అధిపతి అయిన బృహస్పతి మకర రాశిలోకి ప్రవేశించి నీచ స్థానాన్ని పొంది కొంత బలహీనం చెందాడు కాబట్టి కేతుగ్రహానికి శక్తి కొంత తగ్గుతుంది కాబట్టి బూతు స్థాయిలను దెబ్బతీసే శక్తి కేతు గ్రహానికి తగ్గుతుంది కానీ కేతు చేసిన నష్టం కొనసాగుతుంది కానీ దాని తీవ్రత కొంత నెమ్మదిస్తాయి
కానీ రాహు మిధున రాశిలో సంచారం చేస్తున్నాడు మిధున రాశి ఊపిరితిత్తులను సూచిస్తుంది కాబట్టి శరీరంలో ఊపిరితిత్తులు ప్రభావితమవుతాయి మిధున రాశి అధిపతి అయిన బుధుడు రాహు కి తగిన శక్తిని అందిస్తున్నాడు అప్పుడు బుద్ధుడు కుంభ రాశిలో సంచారం చేస్తున్నాడు ఏప్రిల్ 7 తర్వాత బుధుడు మీన రాశిలోకి ప్రవేశించి బలహీనం అయ్యాడు బుధుడు మీన రాశిలో ఉన్నంతవరకు మరణాల సంఖ్య విపరీతంగా పెరిగి ఆందోళన కలిగించే విధంగా ఉంది అనగా ఏప్రిల్ 24 వరకు బుద్ధుడు వేగంగా ముందుకు కదులుతాడు
భారతదేశానికి 24 మార్చ్ 2020 శ్రీ వికారి నామ సంవత్సరం చివరి రోజు ఆ సంవత్సర నామం పేరు వికారి. దాని అర్థం పాడైపోయిన మరియు చెడిపోయినా మరియు అధ్వాన్నమైన మరియు అసాధారణమైన మార్పు మొదలైనవి ఆ తరువాత శార్వరి నామ సంవత్సరం మొదలైంది శార్వరి అనే పేరులో సంధ్య రాత్రి పసుపు మొదలైనవి కాబట్టి శార్వరి నామ సంవత్సరంలో చెడి పోయిన సంవత్సరం నుండి కొంత ఉపశమనం కలగాలి కాని ప్రస్తుతం మనకు అలా జరగడం లేదు కానీ కచ్చితంగా జరుగుతుంది
మన భారతదేశంలో వేసవి కాలం ప్రారంభమైంది ఏప్రిల్ 13 నుండి మేష రాశి లోకి సూర్యుని ప్రవేశం జరిగింది కుజుడు నాలుగో దృష్టితో సూర్యుడిని వీక్షణ చేస్తున్నాడు కుజ గ్రహ శక్తిని సూర్యుడు అందిపుచ్చుకున్నాడు రెండు అత్యంత ప్రమాదకరమైన అగ్ని తత్వ గ్రహాలు చాలామంది పండితులు సూర్యుడు మేష రాశి ప్రవేశం తర్వాత కరోనా వైరస్ కంట్రోల్ అవుతుందని ఊహించారు కానీ అలా జరగలేదు ఎక్కడ శనితో కలిసి ఉన్న కుజుని దృష్టి సూర్యుని మీద ఉంది కావున కరోనా వైరస్ నియంత్రణ కాకపోగా ఇంకా ఆ వ్యాధి తీవ్ర రూపం దాల్చింది దేశం మొత్తం 35 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు చూస్తుంది
కుజుడు తన నాలుగో దృష్టితో సూర్యుడిని వీక్షణ చేస్తూనే ఉన్నాడు మే నెల 4వ తేదీ 2020 న కుజుడు కుంభ రాశి లోకి ప్రవేశం చేశాడు మే నెల 14వ తేదీన సూర్యుడు వృషభ రాశి లోకి ప్రవేశం చేస్తాడు ఇప్పుడు కూడా కుజ గ్రహ నాలుగో దృష్టి సూర్యుడి మీద ఉంటుంది ఆ తరువాత కుజుడు మీన రాశి లోకి ప్రవేశం సూర్యుడు మిధున రాశి ప్రవేశం జూన్ 20 నుండి జూలై 16 వరకు ఉంటుంది ఈ విధంగా కుజ గ్రహ దృష్టి సూర్యుడిని వెంబడిస్తూ ఉంటుంది వైరస్ వ్యాప్తి చెందడానికి చల్లని వాతావరణం అవసరం కానీ కుజ గ్రహ దృష్టి సూర్యుడిని వెంబడించడం వల్ల తీవ్ర ఉష్ణోగ్రతలు ఈ వైరస్ వ్యాప్తి కొంత మందకొడిగా నమోదు కావడం మనం చూస్తాము ఈ ఉష్ణోగ్రతలు ఈ వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి కచ్చితంగా తోడ్పడతాయి మనం ప్రస్తుతం చూస్తున్నాం ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలో వ్యాధి తీవ్రత తక్కువగానే ఉంది
ఈ ఉష్ణోగ్రతలు వైరస్ వ్యాప్తి తగ్గిస్తుంది ఇప్పటికే వైరస్ కి గురైన వారు వారి వ్యక్తిగతమైన జాతకాలు ఖచ్చితమైన పాత్రను పోషిస్తాయి కానీ ఈ వైరస్ వ్యాప్తి నుండి దేశం మొత్తం నెమ్మదిగా మెరుగుపడుతుంది జూన్ మధ్య వరకు ఈ ఉష్ణోగ్రతలు మనకు కనబడతాయి రుతుపవనాల కి ముందు ఉండే తేమ తీవ్ర వడగాలులు సాధారణ వాతావరణం ఇలాంటి మిశ్రమ వాతావరణం ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవటానికి శక్తి వంతంగా ఉండాలి
కానీ జూన్ 2020 అత్యంత గందరగోళంగా ఉన్న నెల. ఈ నెలలో గందరగోళ పరిస్థితులు గ్రహాలు వక్రీకరణ అస్తంగత్వం గ్రహణాలు ఉన్నాయి కాబట్టి మన దేశం ముఖ్యంగా తూర్పు వైపున ఉన్న కొండలు మరియు తీర ప్రాంతాలను ప్రభావితం చేసే తుఫానులు మరియు విపత్తులను చూస్తాము జూన్ నెల అత్యంత కష్టతరం కాబట్టి చాలా దేశాలు లాక్ డౌన్లో ఉంటాయి అవసరమైన సేవలు మాత్రమే పనిచేస్తాయి ఇందులో భారతదేశం కూడా ఉండవచ్చు సెప్టెంబర్ చివరి వారం నాటికి మాత్రమే పరిస్థితి సాధారణంగా మారుతుంది(ఇక్కడ ఒక విషయం గమనించాలి భారతదేశ జాతకాన్ని పరిశీలించి గోచారాన్ని బట్టి చూస్తే మనకు ఇంకా లోతైన విషయాలు తెలుసుకోవచ్చు
గడచిన కాలంలో కుజ మరియు శని కలయిక చేత ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు ఆ కలయిక ప్రజలను విద్వేషాలను రెచ్చగొట్టే స్థాయికి చేరుస్తుంది కుజుడు దృష్టి సూర్యుడి మీద ఉండటం చేత చికాకులు తగాదాలకు దారితీస్తుంది కావున మీరు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించండి వైద్య బృందాలు మరియు ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలను పాటించండి మీ జీవితం కంటే మరొకటి ఏదీ కూడా ముఖ్యమైనది కాదు అని గ్రహించండి బాధ్యతాయుతంగా ప్రవర్తించండి మరియు మీ ఇంట్లో మీ కుటుంబానికి మరియు మీ పొరుగు వారికి సహాయం చేయండి
మీరు సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండే ప్రయత్నం చేయండి మీరు మీ సమయాన్ని ప్రతి నిమిషం కరోనా వైరస్ గురించి ఆలోచించడం మానేయండి దాని గురించి మీరు ఏమీ చేయలేరు ప్రభుత్వాలు మరియు వైద్య బృందాలు కరోనా వైరస్ మీద తీవ్రంగా పోరాటం కొనసాగిస్తున్నాయి ఈ కాలాన్ని మీరు మీ వ్యక్తిగత ఎదుగుదలకు ఆలోచించండి ఏదైనా ఆధ్యాత్మిక సాధన చేయండి మీ ఇష్ట దేవత ప్రార్థన చేయండి ఏదైనా మంత్రాన్ని రోజుకు 108 సార్లు చదివే ప్రయత్నం చేయండి ధన్వంతరీ దేవత ప్రార్థన చేయండి మీ తల్లిదండ్రులు మరియు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని హాయిగా గడపండి పిల్లలతో ఆటలు ఆడండి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి శారీరక వ్యాయామం చేయండి సూర్య నమస్కారాలు చేయండి ప్రస్తుతం చాలా ఒత్తిడితో కూడిన పరిస్థితి లో పనిచేస్తున్న వారికి బృందాలకు మరియు పోలీసులకు మరియు సరిహద్దు నియంత్రణ గార్డులకు మొదలైన వారికి కృతజ్ఞతగా మీ శక్తి సరిపడా సహాయ సహకారాలు అందించండి వారు ప్రస్తుతం మన సమాజంలో నిజమైన హీరోలు
ఒక దేశంలో 20 శాతం పైగా జంతువుల పై గోరంగా వ్యవహరిస్తున్నారు ధనస్సు రాశి లో కేతువు ఈ కర్మను మనం తిరిగి సమతుల్యం చేసుకునే లాగా చూసుకోవాలి కేతువు మనకు అతి పెద్ద అభ్యాసాన్ని చాలా బాధాకరమైన కర్మలనుండి పొందిన లోతైన జ్ఞానం ఇచ్చాడు
లాక్ డోన్ పూర్తి అయిన తర్వాత మనము కొత్త ప్రపంచంలోకి అడుగు పెడతాం కొత్తగా ప్రవర్తించవలసి ఉంటుంది సరిహద్దుల ఆవశ్యకతను మనమందరం గ్రహించడం వల్ల వన్ వరల్డ్ అనే భావన నిలబడదు చాలా ప్రాథమిక మార్పులు సంభవించాయి ప్రాక్టికల్గా షట్ డౌన్ పూర్తి అయిన తర్వాత రాత్రింబవళ్ళు పని చేయాల్సి ఉంటుంది
కరోనా వైరస్ వ్యాప్తికి కేతువు మరియు సూర్యుడు మరియు బుదుడి పాత్ర
ప్రస్తుత ప్రపంచం కరోనా వైరస్ అనే సంక్షోభంలో వుంది భారతదేశం మిగతా ప్రపంచ దేశాల కంటే కొంత మెరుగైన స్థితిలో ఉంది ఈ వైరస్ మహమ్మారికి వెనుక కదిలే శక్తి కేతువు
రాహువు మరియు కేతువు గ్రహాలు జ్యోతిషశాస్త్రంలో ప్రత్యేకంగా చెప్పబడి ఉన్నాయి రాహు కేతు గ్రహాలు ఛాయాగ్రహాలు కాబట్టి అవి విగ్రహాల తో కలయిక చెందుతాయో మరియు ఏ గ్రహాల చేత వీక్షణ చేయబడతాయో ఏ రాశిలో ఉంటాయో ఆ విధంగా ఆ గ్రహాల యొక్క శక్తిని గ్రహించి తిరిగి ఆ శక్తిని ప్రసరింప చేస్తూ ఉంటాయి ప్రస్తుతం కరోనా వైరస్ సంక్షోభంలో రాహు కేతువులను ఏ గ్రహాలు ప్రభావితం చేస్తున్నాయో విశ్లేషించుకోవాలి ఇది జ్యోతిష్యశాస్త్రం నుండి తెలుసుకోవడానికి నవంబర్ 2019 నుండి సెప్టెంబర్ 2020 వరకు గోచార గ్రహస్థితిని మనం తెలుసుకోవాలి
కేతువు ఉదాసీనత ఆసక్తి లేని వాడు పొగమంచు పొగ మొదటి చూపులో స్పష్టంగా కనిపించనీ విషయాలు మీరు చూడడానికి ఇష్టపడని వాడిగా తల లేనివాడిగా కేవలం శరీరంతో పాము లాంటి చర్మం నల్ల గోళ్లు భయంకరమైన రూపం గా మండుతున్న స్వభావం కలవాడిగా ఉంటాడు కేతువు వ్యాధి విపత్తు నిరాశ మరియు మరణం లాంటివాడు అతను పూర్తి విచ్ఛేదనం విభజన ఇలాంటి విషయాలను కలిగి ఉంటాడు ఇంద్రియాల లో అతనికి వాసన యొక్క భావం ఎక్కువ రంగులలో ఎరుపు రంగును సూచిస్తాడు మీరు అతని వేడిని గ్రహించగలరు కానీ అతన్ని చూడలేరు అతను భౌతికంగా శ్రేయస్సును మరియు ప్రతికూలతలు ఇవ్వగలడు ఎక్కువగా ఆధ్యాత్మిక లాభాలను ఇస్తాడు కేతువు విపరీతమైన మరియు వింతైన మరియు అహంకార మైన మతోన్మాదాన్ని ఇస్తాడు ఇది అడ్డుకోవడం అసాధ్యం
కేతువు మీ చుట్టూ ఉన్న విషయాలను ప్రభావితం చేస్తుంటే పరిస్థితులు అనూహ్యమైన వి మరియు అహేతుకమైన వి మరియు వికృతమైన వి మరియు అసమంజసమైన వి మరియు ప్రమాదకరమైనవి అని గ్రహించండి కేతువు ఊహించని రుగ్మతలను ఇస్తాడు గాలిలో జెండా ఎగరవేయడం మనం చూస్తాం ఎలా కదులుతుందో మనకు తెలియదు కేతువు గాలిలో కదిలి స్తాడు వికారమైన అనియత కాని అద్భుతమైన అన్ని తార్కాలను మించినది అందువల్ల కేతువు మాలో కొంతమందికి అంతిమ సాక్షాత్కారాన్ని ఇవ్వగలడు ఎందుకంటే కేతువు మోక్ష కారకుడు. మన అవగాహనల పరిమితికి మించి ఉన్నాడు కానీ మనలో చాలా మందికి గందరగోళంలో ఉన్నారు కొంతమంది శారీరక మరణానికి కూడా కారణం అవుతున్నాడు
కేతువు చివరిసారి ధనుస్సు రాశిలో 18 సంవత్సరాల క్రితం సంచారం చేశాడు అప్పుడు కేతువు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యుద్ధానికి బాధ్యత వహించాడు ఇప్పుడు ఆ విధానానికి వింతగా కొనసాగుతుంది 11 సెప్టెంబర్ 2001 9/11 నాడు wto జంట టవర్లు కూలిపోయాయి అప్పుడు కుజుడు కేతువుకు కలిసి ధనస్సు రాశి లో ఉండగా గురువు మరియు రాహువు మిధున రాశి లో ఉన్నారు వారి వీక్షణ కేతువు మరియు కుజుడు గ్రహాల పైన ఉంది
ఫిబ్రవరి 2020 కరోనా వైరస్ వ్యాప్తి లో విపరీతమైన పెరుగుదల కనిపించింది ఇక్కడ కూడా ఆ గ్రహాలు పనిచేస్తున్నాయి బృహస్పతి మరియు కేతువు మరియు అంగారక గ్రహాలు ధనస్సు రాశి లో ఉండగా రాహువు మిధున రాశిలో ఉన్నాడు ఆ సమ సప్తకం లో శక్తిని వేరే పద్ధతిలో పనిచేస్తున్నాయి అప్పుడు కేతువు టెర్రరిస్ట్ ఎటాక్ కారణమైతే ఇప్పుడు వైరస్ లకి కారణం అయ్యాడు అన్ని రకాల వైరస్ కి ప్రధానమైన కారణం కేతువు ఇప్పుడు కేతువు ధనస్సు రాశి లో ఉండి సామూహిక మానవ పునాదులను కదిలిస్తున్నాడు రాహువు కేతువు మిధున రాశి మరియు ధనస్సు రాశిలో సంచారం చేస్తున్నప్పుడు అనేక గందరగోళాలులకు కారణం అవుతున్నారు
కేతువు యొక్క పని విధానం పరిమితులు లేకపోవడం.అతను ఎటువంటి సరిహద్దులను గౌరవించడు అతని యొక్క స్థలం సమయం శక్తి స్థాయిలు పరిమితులకు మించి సంఘటనను సూచిస్తాడు బాధాకరంగా కరోనా వైరస్ సరిగ్గా ఇలానే చేసింది సాధ్యమైనంత అన్ని సరిహద్దులు దాటింది జాతీయ సరిహద్దులు మరియు జాతుల సరిహద్దులను దాటింది కేతువు పొగ లాంటి వాడు అన్నిటిలోకి చొచ్చుకుని పోతాడు కేతువు దయ లేని వాడు మరియు సూక్ష్మ జీవులకు కారణం అవుతాడు కాబట్టి మనం నివసించే ఐదు లేయర్ల శరీరం యొక్క లోపలి నాలుగు పొరల్లో మరింత హాని కలుగ చేస్తాడు మానవాళికి భయం అనుమానాలు భయానక పరిస్థితులు వ్యాప్తి మొదలైన వాటిని కూడా సృష్టిస్తున్నాడు
పాప గ్రహమైన కేతు గ్రహం ఘోరం హింస రక్తపాతం మొదలైనవి సూచిస్తాడు మీరు గమనిస్తే వైరస్ పుట్టినటువంటి దేశంలో జంతువులను మరియు అడవి మరియు పెంపుడు జంతువులను అత్యంత క్రూరంగా భీకరంగా చంపటం మరియు తినటం చేస్తూ ఉంటారు ప్రపంచ మానవాళి లో 20 శాతానికి పైగా ఇటువంటి పనులు చేస్తున్నారు ఈ ప్రతికూల కర్మలు మొత్తం సామూహిక మనస్తత్వాన్ని ప్రభావితం చేసింది కేతువు సమిష్టి యొక్క లోతైన జలాశయాలు సూచిస్తుంది మరియు కేతువు గత జన్మ కర్మ యొక్క అసహ్యకరమైన జ్ఞాపకాలను కలిగి ఉంటాడు గత జన్మ కర్మ ఫలితాలు ఆత్మలు మరియు దెయ్యాలు ఇలాంటి విషయాలను సూచిస్తాడు కేతువు తల లేనివాడు అయినప్పటికీ క్షమించ లేడు లేదా సహజంగా మరియు మరచిపోలేడు అతను అన్ని గ్రహాలలో అత్యంత ఎక్కువగా ప్రతీకారం తీర్చుకుంటాడు అతను మానవ జీవిత కాలానికి సరిపడా పగ పెంచుకుంటాడు
కరోనా వైరస్ కేతువు యొక్క సూచిక రాహువు యొక్క శక్తిని కేతువు ఉపయోగించుకుంటాడు కాబట్టి మనం ముందుగా రాహువు యొక్క శక్తి నుంచి బయట పడాలి మనం చేసే కర్మల ఈ యొక్క శక్తి ద్వారా బయట పడే అవకాశం ఉంది కేతువు గతాన్ని గురించి పాఠాలు నేర్పుతూ ఉంటాడు రాహు గతాన్ని విడిచిపెట్టి భవిష్యత్తు గురించి ఆలోచింపజేసేలా చేస్తాడు కావున కేతువు గతం గురించి రాహు భవిష్యత్తు వైపు చూసేలా చేస్తారు
మీ గత జన్మ కర్మలు పరిష్కరించపడినప్పుడే మీరు భవిష్యత్తు వైపు ముందుకు సాగగలరు రెండు గ్రహాలు కూడా ముఖ్యమైనవి మన యొక్క గతం మన వర్తమానం ద్వారా చేసే కర్మల ద్వారా భవిష్యత్తు సృష్టించబడుతుంది ఈ రెండు గ్రహాలు కలిసి మనకు చాలా విలువైన సందేశాన్ని ఇస్తాయి మీరు గతం నుంచి మీరు చేయగలిగినంత నేర్చుకోండి మరియు సమతుల్యం చేసుకోండి వైద్య బృందాలు మరియు ప్రభుత్వాలు మనలాంటి సామాన్య ప్రజలు కూడా మనమందరం ఏమి చేస్తున్నామో మరియు ఎలా మెరుగుపరుచుకోవాలి అనేది అమర్ పునరాలోచనలో ఉన్నందున ఇది అంతా ఆత్మ పరిశీలన కాలం అని మనం అర్థం చేసుకోవాలి
కేతువు తెలివి మరియు చోచుకు పోయె గ్రహం మన వైద్య బంధాలకు కూడా ఇది అవసరం కేతువు తీవ్రమైన ఏకాగ్రత మరియు లోతైన అంతర్దృష్టి కూడా కలిగిస్తూ ఉంటాడు కేతువు అపరిమితమైన వాడు కాబట్టి మన వైద్య బృందాలు అతను శక్తిని ఉపయోగించి వైద్య సరిహద్దులను దాటి కరోనా వైరస్ వ్యాక్సిన్ కనుగొనే అవకాశం ఉంది
సూర్యుడు మేష రాశిలో ఏప్రిల్ 13 2020 నుండి మే నెల 14 2020 వరకు ఉంటాడు కేతువు నుండి 5వ స్థానంలో సూర్యుడు ఉంటాడు సూర్యుడు మరియు కేతువు ఒకరికి ఒకరు 5/9 యాక్సిస్ లో ఉంటారు అప్పుడు సూర్యుడు మరియు కేతువు ఒకరినొకరు ప్రభావితం చేస్తారు వైద్య బృందాలు వారి యొక్క సంయుక్త శక్తి స్పష్టత నిర్మాణాత్మక చర్యలు ధైర్యం మరియు ఆత్మవిశ్వాసాన్ని కూడా పొందుతాయి వారి యొక్క పరిశోధన వేగంగా కదులుతుంది కాబట్టి ప్రభుత్వాలు మరింత నిర్ణయాత్మకంగా పని చేయగలవు
బుధుడు ఏప్రిల్ 25 నుంచి మే 9 వరకు మేష రాశిలో సంచారం చేశాడు అప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కట్టడికి తమ వంతు ప్రయత్నాలు తీవ్రతరం చేశాయి ప్రజలందరికీ కరోనా వైరస్ గురించి మంచి అవగాహన వస్తుంది కేతువు మరియు బుధుడు 5/9 యాక్సిస్ లోకి రావటం వల్ల వైద్య బంధాలకు మంచి ప్రోత్సాహం ఇస్తుంది బుద్ధుడు విశ్లేషణాత్మక మేధస్సు వివక్షత అనుకూలత సామర్థ్యం ఇలాంటి విషయాలను కలిగి ఉంటాడు కావున సూర్యుడితో పాటు బుద్ధుడు కూడా 5/9 యాక్సిస్ లో పనిచేశాడు కాబట్టి వైద్య బంధాలకు ఇది చాలా మంచి మద్దతు ఇస్తుంది
జ్యోతిషశాస్త్రం నేర్చుకునే ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ అనే మహమ్మారి కేస్ స్టడీ చక్కగా వినియోగించుకోవచ్చు మన దేశం యొక్క జాతకాన్ని విశ్లేషిస్తూ ప్రస్తుత గోచార స్థితిని అన్వయిస్తూ ఇంకా లోతైన విశ్లేషణ చేయవచ్చు మీకు వీలుంటే దాన్ని ప్రయత్నం చేయండి మరియు నిజ జీవితంలో ఎలా సరిపోతాయి చూడండి
మన గ్రంధాలు ఏమి చెబుతున్నాయి????
1.దేవ కేరళం÷ గోచార కేతువు శని గ్రహం తో కలిసినప్పుడు రాజులు భయంకరమైన యుద్ధాలు చేస్తారు. దొంగలు మరియు సైన్యం మరియు మనుషులు వస్తువులను తగలబెడతారు మరియు మానవ జీవితాలను నాశనం చేస్తారు
2.దేవ కేరళం÷ బృహస్పతి అతిచార వేగంతో ముందుకు కదిలినప్పుడు మరియు అస్తంగత్వం చెందినప్పుడు మరియు అదే సమయంలో శని వక్రీకరించినప్పుడు ప్రపంచం మొత్తం దుఃఖంతో గడుపుతుంది ముఖ్యంగా దక్షిణ ప్రాంతం దుఃఖంతో విలపిస్తుంది
వీటిలో మొదటి శ్లోకం మన పరిస్థితికి వర్తిస్తుంది రెండవ శ్లోకం వర్తించదు అయితే కొన్ని మార్పులతో వర్తిస్తుంది నేను వివరించే ప్రయత్నం చేస్తాను
2018 మధ్యకాలం నుండి గోచర గ్రహస్థితిని మనం ఒకసారి గమనించాలి ఆ సమయంలో శని ధనుస్సురాశిలో సంచారం చేస్తున్నాడు మార్చి 6 2019 న కేతువు ధనుస్సు రాశి లోకి ప్రవేశం చేశాడు ఈ శ్లోకం చెప్పినట్టుగానే సంక్షోభానికి వేదికగా నిలిచింది ఒకే రాశిలో శని మరియు కేతువు కలయిక జరిగింది కానీ వారిద్దరూ దగ్గరగా కలయిక జరగలేదు మన యొక్క ఈ సంఘటన కోసం ఇద్దరి కలయిక దగ్గరగా ఉండాలి కేతువు ధనుస్సు రాశిలో ధనస్సు నవాంశ లోకి ప్రవేశించాడు ఆ సమయంలో శని వక్రీకరించి వృశ్చిక నవాంశలో ఉన్నాడు
కేతువు మే 9న వృశ్చిక నవాంశ లోకి ప్రవేశించాడు వృశ్చిక నవాంశలో కేతువు మరియు శని కలయిక జరిగింది ఇది పూర్వాషాడ నాలుగో పాదం లో ఉంది సంయోగం స్వల్ప కాలం ఉంది ఎందుకంటే రెండు నెలల కాలంలో శని తన నక్షత్ర పాదాన్ని మార్చుకుని మూడో పాదంలో కి జూలై 6న ప్రవేశించాడు కేతువు జులై 10న పూర్వాషాడ 3 వ పాదం లో ఉన్న శనిగ్రహాన్ని కలిశాడు ఇది సెప్టెంబర్ 1న శని పూర్వాషాఢ రెండో పాదములో కి వెళ్లి చివరికి సెప్టెంబర్ 11న కేతు గ్రహం చేత శని గ్రహం దగ్గరగా కలయిక జరిగింది
చివరికి 2019 సెప్టెంబర్ 18న పూర్వాషాఢ రెండో పాదములో శని రుజుమార్గం పొందాడు అది కేతువుతో దగ్గరగా కలవడం కొనసాగించింది ఈ సమయం శని సంయోగానికి కారణం అయ్యాడు అక్టోబర్ 4న శని నక్షత్రం మూడో పాదం కి వెళ్ళాడు శని మరియు కేతువుల మధ్య చివరి కలయిక కాలం సెప్టెంబర్ 11 నుండి అక్టోబర్ 4 వరకు కొనసాగింది ఇది చాలా తక్కువ కాలం
2019 డిసెంబర్ 31న చైనా దేశం వారు 41 రోజులు రహస్య నిమోనియా తో ఉన్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారికి సమాచారం అందించారు
చైనా అధికారులు ఈ మొదటి సమాచార నివేదిక ఎంతటి విశ్వాసంఅయినదో స్పష్టంగా మనకు తెలియదు మనము అంగీకరిస్తే కేతువు మరియు శని సంయోగం పేరు శక్తి అనేది సెప్టెంబర్ 11 నుండి అక్టోబర్ 4 వరకు పరిస్థితి ఉధృతంగా ఉండాలి ఒకవేళ వైరస్ మొదటి ప్రభావం అక్టోబర్ 4న ప్రారంభం అయితే ఆ వైరస్ రోగలక్షణాలు బయటపడడానికి సుమారు 14 రోజుల సమయం పడుతుంది అలా అయితే అక్టోబర్ 18న ఎక్కడో ఒకచోట కనిపించాలి అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 31 వరకు సుమారు రెండున్నర నెలలు ఈ వ్యవధిలో చైనా అధికారులు దీనిని నియంత్రించటానికి ప్రయత్నించారు మరియు దీని గురించి బయట ప్రపంచానికి తెలియకూడదు అని నిర్ణయించుకొని ఉండవచ్చు
డిసెంబర్ 26న శని ధనుస్సు రాశి యొక్క చివరి నక్షత్ర పాద మైన ఉత్తరాషాడ లో కి వెళ్ళాడు అక్కడ శని మకర రాశిలోకి ప్రవేశం చేసే వరకు అనగా జనవరి 24 వరకు ఉన్నాడు రాబోయే విపత్తు జరగాల్సిన ఉదాహరణ ఇది డిసెంబర్ 31న చైనా అధికారులు ఈ మర్మమైన వ్యాధి గురించి నివేదించారు ఇది అక్కడినుంచి అడవి మంటలాగా వ్యాపించింది
శని మరియు కేతువు సెప్టెంబర్ 11 నుండి అక్టోబర్ 4 వరకు చివరి నక్షత్ర పాత్ర కలయికలో ఉండగా బృహస్పతి వృశ్చిక రాశిలో ఉన్నాడు మరియు నవంబర్ 4న బృహస్పతి ధనస్సు రాశి లోకి ప్రవేశించాడు మూలా నక్షత్రం లో కి ప్రవేశించాడు ఆ సమయంలో శని పూర్వాషాఢ రెండో పాదములో కేతువు పూర్వాషాడ 3 పాదం లో ఉన్నారు
కేతువు నవంబర్ 13న పూర్వాషాడ ఒకటో పాదం లో కి వెళ్ళాడు మరియు బృహస్పతి కేతువు ని ఆ నక్షత్ర పాదం లో 2020 జనవరి 4న కలుసుకున్నాడు ఈ సంయోగం జనవరి 15 వరకు కొనసాగింది శని మరియు కేతువు ఒక విపత్తు యొక్క వాగ్దానం చేసినప్పుడు బృహస్పతి కలయిక దారుణంగా ఉంది ఎందుకంటే బృహస్పతి ధనస్సు రాశికి అధిపతి ఆ రాశిలోనే సంయోగం జరిగింది మరియు దీనికి కారణమైన గ్రహాల పూర్తి నియంత్రణలోకి వచ్చింది
ధనస్సు రాశిలో శని మరియు బృహస్పతి ముఖాముఖిగా కలవలేదు ఎందుకంటే రాశిలో శని చాలా ముందు ఉన్నాడు జనవరి 24 నాటికి శని ధనస్సు రాశి ని విడిచి పెట్టినప్పుడు బృహస్పతి కన్యా నవాంశలో ఉన్నాడు మరియు మకరరాశిలో బృహస్పతి మరియు శని సంయోగం జరగాల్సి ఉంది అది వెంటనే జరగదు డిసెంబరు 7న ఉత్తరాషాడ మూడవ పాదం లో జరగాల్సి ఉంది డిసెంబర్ 24న ఉత్తరాషాడ నాలుగో పాదం వరకు ఈ కలయిక కొనసాగుతుంది బృహస్పతి మరియు శని జనవరి 21 2021 వరకు పలు సార్లు కలుస్తారు ఆ తర్వాత బృహస్పతి శనిగ్రహాన్ని విడిచిపెట్టి ముందుకు సాగాలి
జ్యోతిష్య శాస్త్ర రీత్యా కరోనా వైరస్ అనేది కేతు గ్రహానికి సంబంధించినది కేతువు అన్ని రకాల వైరస్లకి ప్రధాన కారకుడు అందువల్ల కేతు వైరస్లకు ఉత్తమ ప్రతినిధిగా ఉంటాడు ఒకే సమయంలో కొన్ని రకాల వైరస్లు జీవిస్తాయి కొన్ని రకాల వైరస్లు జీవించవు వైరస్ ఒక ప్రాణికి సోకినపుడు అది జీవిస్తుంది అది కూడా వేరొక ప్రాణం లాంటిదే కేతువు తన అనూహ్యమైన అవాస్తవిక స్వభావం చేత మరియు అతడి లక్షణాలు కారణంగా గ్రహాలలో ఒక ప్రత్యేకతను సంతరించు కున్నాడు కేతు గ్రహాన్ని విశ్లేషించడంలో తల పండిన జ్యోతిష్కులు వల్ల కూడా కాదు ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది జగమెరిగిన సత్యం ఇది నా అనుభవం కూడా...వైరస్ మంటను కలిగిస్తుంది మరియు చర్మానికి కారకుడు బుద్ధుని బాధ పెట్టినప్పుడు కేతువు చర్మం యొక్క వాపుని కలిగిస్తుంది కేతువు మరియు కుజుడు రెండూ కూడా సైన్యాన్ని సూచిస్తాయి కేతువు సరిహద్దు వెలుపల పోరాడుతూ ఉంటాడు కుజుడు సరిహద్దు లోపల పోరాడుతూ ఉంటాడు మొత్తం మీద ఈ కరోనా వైరస్ అనేది చేతుల ద్వారా ఉద్భవించి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ కేతు ద్వారా ఉత్తమంగా సూచించబడుతుంది
కేతువు మరియు శని కలయిక ధనస్సు రాశిలో ఇది ధర్మానికి సంబంధించిన రాశి ఈ వ్యాధి వ్యాప్తికి కారణం ధర్మం పతనమే కారణంగా కనిపిస్తోంది విస్తృతమైన అనారోగ్యం తల్లి స్వభావం పట్ల ప్రజలు ధర్మాన్ని నిలబెట్టడంలో విఫలం చెందారని ఇది చూపిస్తుంది
కరోనా వైరస్ ఉధృతి ఎప్పుడు తగ్గుతుంది????
రాహు సెప్టెంబర్ 12 2019 న ఆరుద్ర నక్షత్రం నాలుగో పాదం లో కి ప్రవేశించాడు 2020 మే నెల వరకు ఉంటాడు రాహు ఆకస్మిక సంఘటనలకు కన్ఫ్యూజన్ లాంటి లక్షణాలను కలిగించే గ్రహం మరియు పాప గ్రహం రాహువును సర్పంగా కూడా పరిగణిస్తారు రాహు సెప్టెంబర్ 12 2019 న ఆరుద్ర నక్షత్రంలో ప్రవేశించినప్పుడు 19 డిగ్రీల వద్ద ఉంది మార్చి 22 2020 నా రాహువు ఆరుద్ర ఒకటో పాదం లోకి (ధర్మ పాదం) సంచారం చేస్తున్నాడు మన దేశ ప్రధాని దేశానికి లాక్ డౌన్ చేయడం జరిగింది
ఏప్రిల్ 25న రాహు 7 డిగ్రీలలో మరియు ధనస్సు నవాంశలో ఉన్నాడు మరియు మే ఇరవై ఒకటో తేదీన ఆరుద్ర నక్షత్రం నుండి మృగశిరా నక్షత్రం లోకి ప్రవేశిస్తాడు రాహు వక్రీకరించి గమనం చేస్తాడు నాలుగో పాదం నుంచి మూడో పాదం ఈ విధంగా నాలుగు నుంచి 3, 3 నుంచి 2, 2 నుంచి 1వరకు సంచారం చేస్తాడు
2020 జనవరి 30న చైనాలో ఉన్న కరోనా వైరస్ ప్రపంచ మహమ్మారిగా మారింది ఈ సమయంలో రాహువు మకర నవాంశలో సంచారం చేస్తున్నాడు శనిగ్రహం కూడా అక్కడే ఉంది రోగ కారకుడైన శని రాహు(తెలియని వ్యాధులు) కు కారకుడైన గ్రహం మకర నవాంశలు ఉండగా జీవ కారుడైన గ్రహం బృహస్పతి కేతువుతో కలసి ధనస్సు రాశిలో ఉన్నాడు బృహస్పతి ఆకాశ తత్వ గ్రహం ఈ విధంగా గోచారం కరోనా వైరస్ సృష్టి తెర ముందుకు వచ్చింది
బృహస్పతి తన సొంత రాసి అయినా ధనుస్సు రాశిలో ఉండటం వల్ల కరోనా వైరస్ చైనా నుండి బయటికి వెళ్లడానికి అనుమతించకుండా బలంగా ఉంది కానీ బృహస్పతి మకరరాశిలోకి ప్రవేశించిన తరువాత బలహీనంగా పొందాడు చైనాలో ఉండవలసిన వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడం జరిగింది బృహస్పతి(జీవ కారక గ్రహం) మరియు కుజుడు మరియు శనితో కలిసి ఉన్నాడు కుజుడు భారతదేశ జాతక చక్రం కి సంబంధించి 7(మారక స్థానం) మరియు 12(హాస్పిటల్స్) స్థానాలకు అధిపతి అయి ఉన్నాడు బృహస్పతి భారీగా పాప గ్రహాల కలయిక చెందాడు తన శక్తిని కోల్పోయాడు
బృహస్పతిని రక్షణ గ్రహంగా అభివర్ణిస్తారు ఆకాశ తత్వ గ్రహం కావున బృహస్పతి బలహీనమైనప్పుడు అది రక్షణ శక్తిని కోల్పోవడం ప్రారంభించింది మరియు ఈ వైరస్ కారణంగా ప్రజలు ప్రభావం చూపడం ప్రారంభించారు
మే నెల 21వ తేదీన రాహువు ఆరుద్ర నక్షత్రం నుండి మృగశిరా నక్షత్రం లోకి ప్రవేశించాడు మిధున రాశి లో ఉన్న మృగశిరా నక్షత్ర పాదాలు ప్రతి విషయాన్ని సూక్ష్మంగా చూడటం ఏదో ఒకటి కనుగొనడానికి ప్రయత్నిస్తుంది ఇది పరిశోధన యొక్క నక్షత్రం ఈ సమయంలో అంటే మే 21 2020 తర్వాత రాహు విధ్వంసకరమైన నక్షత్రం నుండి మార్పు చెందుతున్నాడు అవునా కరోనా వైరస్ నివారణ కనుగొనడంలో వైద్య బృందానికి చక్కని అవకాశం దొరుకుతుంది మృగశిర నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు కోపానికి మరియు దూకుడుకి మరియు పేలుడు లాంటి వాటికి సంబంధించిన గ్రహం ఇది కూడా ఒక విధ్వంసకరమైన గ్రహం కుజగ్రహాని కూడా రుద్రుడు అంశతో పోలుస్తారు రాహు మృగశిరా నక్షత్రం లోకి వెళ్ళగానే కుజ స్తంభన ఉంటుంది అందువల్ల భయము మరియు మరణము అంతా మామూలు స్థితికి వస్తాయి రాహు మృగశిర నక్షత్రంలో సంచారం చేస్తున్నప్పుడు దేశంలో ఆకస్మిక మార్పులు సంభవించవచ్చు అని కూడా సూచిస్తుంది రాహు ఏదైనా గ్రహం తో కలిసినప్పుడు లేక ఏదైనా నక్షత్రంలో సంచారం చేస్తున్నప్పుడు ఆ గ్రహం యొక్క శక్తి లేక నక్షత్ర స్వభావం తీసుకుంటాడు లేక నక్షత్ర అధిపతి అయిన గ్రహం యొక్క ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది
అందువల్ల మృగశిరా నక్షత్రం లో రాహువు యొక్క సంచారం వల్ల వైరస్ శాంతించడం జరుగుతుంది
రాహు ఇప్పటికీ మిధున రాశిలో ఉన్నాడు కానీ వృశ్చిక నవాంశలో కి మారతాడు కాబట్టి వృశ్చికం అనేది ప్రకృతిలో రహస్యంగా ఉన్న అనేక విషయాలు సంకేతం అందువల్ల ప్రకృతిలో రహస్యం ఏదైనా రాహు గ్రహం తో అనుసంధానం జరుగుతుంది
మృగశిర నక్షత్రానికి దేవత చంద్రుడు కావున కరోనా వైరస్ వ్యాక్సిన్ లభించటానికి అద్భుతమైన గోచార గ్రహస్థితి
కావున వ్యాక్సిన్ లభిస్తుందని ఆశించి ఈ ఘోరమైన సంక్షోభం నుండి బయట పడదామని కోరుకుందాము
నా యొక్క చివరి ఆలోచనలు...
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్త మహమ్మారిగా మారటానికి గల కారణాలను మరియు గ్రహస్థితులను తెలుసుకున్నాము ముఖ్యంగా రాహు కేతువు ల ప్రభావం తీవ్రంగా ఉంది అని చెప్పడం జరిగింది రాహు మే 21 2020 తన సొంత నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం నుండి మృగశిరా నక్షత్రం లోకి ప్రవేశించాడు కావున కొంత బలహీనం చెందుతాడు కానీ మిధునరాశి లోనే సంచారం చేస్తాడు మరియు కేతువు మూలా నక్షత్రంలోనే సంచారం చేస్తున్నాడు సెప్టెంబర్ నాటికి వృశ్చిక రాశిలో ప్రవేశిస్తాడు అలాగే రాహువు వృషభరాశిలో కి ప్రవేశిస్తాడు కావున మే నెల 21వ తేదీ నుంచి రాహు ప్రభావం కొంత తగ్గినప్పటికీ కేతు ప్రభావం అధికంగానే ఉంటుంది జూన్ నెలలో మూడు గ్రహాలు వక్రీకరించి ఉండటం వలన కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి . కావున రాహు ప్రభావం మే నెల 21 2020 నుంచి కొంత ప్రభావం తగ్గటం వలన ప్రపంచం ఒక శుభవార్త వినే అవకాశం ఉంది కానీ కరోనా వైరస్ అంతం అనేది సెప్టెంబర్ చివరి వారం దాకా వేచి చూడవలసి ఉంటుంది
జ్యోతిష్య శాస్త్రం ద్వారా కరోనా (covid-19) వైరస్ ఆవిర్భావం మరియు వ్యాప్తి మరియు అంతం మరియు దేశ ఆర్థిక స్థితి గురించి తెలుసుకోవడం ఎలా???
జ్యోతిష్య శాస్త్ర రీత్యా భారతదేశ ఎకానమీ 2020-2022
దేశవ్యాప్తంగా 500 మరియు 1000 రూపాయల కరెన్సీ నోట్లు సంబంధించి డిమానిటైజేషన్ మన దేశ ప్రధాని 8 నవంబర్ 2016 నాడు ప్రకటించారు ఈ ప్రకటన ఆకస్మికంగా చేయటం వల్ల అనేకమందికి దిగ్భ్రాంతి కలిగింది మన ప్రధాని డిమానిటైజేషన్ యొక్క చర్య చాలా వివాదాస్పదమైంది చాలామంది ప్రభుత్వాన్ని విమర్శించారు కొంతమంది ఈ చర్యను ప్రశంసించారు కానీ ప్రధానమంత్రి యొక్క ఈ నిర్ణయం ఆర్థిక వృద్ధిని చాలావరకు మార్చింది మరియు దేశ జి.డి.పి వేగంగా క్షీణించటం ప్రారంభించింది
మన దేశం యొక్క G.D.P కొద్దికొద్దిగా పుంజుకుంటుంది కానీ వేగవంతం కావడం లేదు స్థిరమైన వేగాన్ని పుంజుకోవడం లో విఫలం చెందుతున్నాము రోజు రోజుకి దేశ G.D.P క్షీణింపబడుతుంది కావున ప్రజలు మరియు దేశం ఆర్థిక అల్లకల్లోలతో బాధపడుతున్నారు డిమానిటైజేషన్ యొక్క ప్రకంపనలు మనల్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి
భారతీయ ఆర్థిక వ్యవస్థ 2020-2022 భవిష్యత్తు సూచన
ప్రపంచం మొత్తం ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా వృద్ధి రేటు సాధిస్తుంది కానీ భారత దేశం మాత్రం ఆర్థిక వృద్ధి రేటు మందగించిన తరువాత భారతదేశం కోలుకోలేక పోయింది 2016 క్రితం వరకు భారతదేశం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ గా ఉండటం వల్ల G.D.P తగ్గింపు మరియు ఆర్థిక వ్యవస్థ పతనం భారతదేశంలో ఎక్కువగా ఉంది
అమెరికా చైనా మరియు తూర్పు మధ్య ప్రాంతంలో వాణిజ్య యుద్ధం 2008 లోకి లాగానే ప్రపంచ వాణిజ్యం మరియు ఆర్థిక వ్యవస్థను ప్రపంచ మాంద్యం యొక్క భయాన్ని కూడా ప్రభావితం చేసింది 2008లో కూడా ప్రపంచ ఆర్థిక సంక్షోభం ప్రపంచ ఆర్థిక మందగమనం ఉంది ఇది మానవుల ఆదాయాన్ని ప్రభావితం చేసింది మరియు చాలామంది ప్రజలు ఉద్యోగాలు కోల్పోయి నిరుద్యోగులుగా మారారు కానీ ఆ సమయంలో మంచి ఆర్థిక విధానం కారణంగా భారతదేశం ఇంకా వేగంగా అభివృద్ధి చెందుతుంది ఆ సమయంలో మన ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ గారికి ప్రతి ఒక్క భారతీయుడు కృతజ్ఞతలు చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది
మన ప్రస్తుత ప్రభుత్వ ఆర్థిక విధానం మరియు నిర్వహణ లోపాలను కలిగి ఉంది డిమానిటైజేషన్ తర్వాత కూడా ఇది ఎందుకు జరుగుతుంది అనే దానిపై భారత దేశ ఆర్థిక స్థితిని జ్యోతిష్య శాస్త్ర కోణం నుండి మనం చూడాలి మరియు భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క పురోగతి మరియు పెరుగుదల మరియు ఆర్థిక వృద్ధిని తిరిగి పొందే కాలాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి
భారతదేశ G.D.P రేటు 2016లో 8.17% నుండి 2019-20 లో 5.4% కి తగ్గింది గోచార గ్రహస్థితి దీనిని తెలియజేస్తుంది శని ధనస్సు రాశి లో ఉండగా బృహస్పతి 2017లో తులా రాశిలో సంచారం చేస్తున్నాడు ఇది ముఖ్యమైన పాత్రను పోషించింది మరియు దేశం యొక్క ఆర్థిక మందగమనంని బాగా ప్రభావితం చేసింది భారతదేశం యొక్క లగ్నం వృషభ లగ్నం మరియు రాసి కర్కాటక రాశి అవుతుంది వృషభ లగ్నం నుండి ఎనిమిదో స్థానంలో శని సంచారం రాసి నుండి ఆరో స్థానంలో శని సంచారం జరుగుతుంది
గురుడు యొక్క రాశిలో శని సంచారం అలాగే కేతువుతో పాటు గురుడు మరియు గ్రూపు మీద రాహు వీక్షణ 2019 నవంబర్ నుండి భారత దేశ ఆర్థిక వృద్ధి పెద్ద పతనానికి కారణమైంది అయినప్పటికీ శని సొంత క్షేత్రమైన మకర రాశిలో సంచారం చేస్తున్నాడు భారతదేశ లగ్నం నుండి 9వ స్థానంలో మరియు రాసి నుండి ఏడో స్థానంలో సంచారం జరుగుతుంది కొంత పెరుగుదల కనిపించవచ్చు కానీ భారతదేశ జాతక ప్రకారం బృహస్పతి కూడా 9వ స్థానంలో సంచారం చేస్తున్నాడు బృహస్పతికి ఆష్టమ స్థానానికి ఆధిపత్యం ఉంది కాబట్టి 2021 వరకు నిరంతర ఆర్థిక పతనానికి దారి తీస్తుంది బృహస్పతి మరియు శని జూన్ 30 వరకు మకర రాశి లోనే ఉంటారు దీని ఫలితంగా రూపాయి విలువ మరింత బలహీనం చెందుతుంది బృహస్పతి నవంబర్ 2020 నుండి ఒక సంవత్సరం కాలం పాటు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఇది డిసెంబర్ 2021 వరకు కొనసాగుతుంది గురుడు నీచరాశి లో సంచారం కొనసాగిస్తాడు గురుడు భారత దేశ జాతకం యొక్క లాభ స్థానానికి అధిపతి లాభాధిపతి నీచ స్థానంలో సంచారం శని తో కలయిక భారతీయ ఆర్థిక వ్యవస్థ బాగా క్షీణించవచ్చు
బృహస్పతి మరియు శని కలయిక ఈ విషయాన్ని మరింత క్లిష్టతరం చేసింది మరియు ప్రపంచ ఆర్థిక మాంద్యం మరియు ప్రపంచ మొత్తంలో ఆర్థిక మందగమనంనికి దారితీయవచ్చు మకర రాశిలో శని బృహస్పతి కలయిక వలన సంపన్నులు మరియు ఉన్నత ప్రభుత్వ అధికారులు పెద్ద ఆర్థిక మరియు రాజకీయ అవినీతికి దారితీసే అవకాశం ఉంది
ముండెను ఆస్ట్రాలజీ లో బృహస్పతి శని కలయిక లేక సమసప్తక స్థితి ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆర్థిక సామాజిక రాజకీయ మార్పులకు దారి తీస్తుంది 2008 నుండి 2010 వరకు శని సింహరాశిలో బృహస్పతి కుంభ రాశిలో సమసప్తక స్థితిలో సంచారం చేశారు అప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రతికూలంగా ప్రభావితం చేసింది అప్పుడు ప్రపంచం మొత్తం ఆర్థిక మందగమనంని ఎదుర్కొంది
జూలై 2020 వరకు భారతదేశానికి చిన్న చిన్న యుద్ధాలు లాంటి పరిస్థితులు నెలకొంటాయి అంతర్గత భద్రత సమస్యలు తలెత్తుతాయి వేసవి కాలం అయిపోయే సమయానికి భారత్-పాక్ మధ్య చిన్న చిన్న యుద్ధాలు జరిగే అవకాశం ఉంది సెప్టెంబర్ 20 2020 తరువాత రాహువు వృషభరాశిలో కి కేతు వృశ్చిక రాశి లోకి ప్రవేశిస్తారు ఇది భారతదేశానికి కొంత విశ్రాంతి మరియు సౌకర్యాన్ని ఇస్తుంది అయితే ఈ 2020 వేసవి కాలం తర్వాత భారతదేశానికి చాలా సమస్యాత్మకంగా ఉంటుంది ముఖ్యంగా మకరరాశిలో బృహస్పతి సంచారం మరియు వక్ర గమనం మకర నుండి ధనస్సు వచ్చే కాలంలో దేశాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది
1990-1991 మధ్యకాలంలో మకర రాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది ప్రారంభ దశలో వి.పి.సింగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది భారతదేశంలో రిజర్వేషన్ల చట్టాన్ని సవరించడానికి ప్రభుత్వం మొండి పట్టుదల కారణంగా దేశంలో అనేక రకాల భద్రతా బెదిరింపులు సంభవించాయి ప్రభుత్వం బలహీనంగా మారింది వారి నిర్ణయాల కారణంగా దేశంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ సామూహిక ఉద్యమం మతపరమైన ఎజెండాను కూడా పొందింది దీని ఫలితంగా రామజన్మభూమి ఉద్యమం పెరిగింది
కానీ ఈ సారి 2020లో శని(న్యాయం యొక్క గ్రహం) మకర రాశిలో సంచారం చేస్తుంది ఇప్పటికే అసమానత శాంతి లేకపోవడం దేశంలో అస్థిరత కు దారి తీసింది 1990 నుండి 1993 వరకు మరియు 2020లో ద్రవ్యోల్బణం పెరుగుతుంది కాశ్మీరీ పండితులు సామూహిక హత్యలు మరియు ఇస్లామిక్ జిహాద్ మరియు క్రూరత్వం నుండి తమని తాము రక్షించుకోవడానికి వారు తప్పించుకున్న చరిత్రను ఎప్పటికీ మరచిపోలేని మరో ముఖ్యమైన సంఘటన మనం చూశాం కాశ్మీరీ పండిట్ల ఈ బహిష్కరణ వారి యొక్క ఆస్తులను ప్రాణాలను కోల్పోయింది
భారతదేశం యొక్క లగ్నం నుండి బృహస్పతి భాగ్య స్థానంలో నీచరాశి లో మరియు రాసి నుండి ఏడో స్థానంలో సంచారం చేస్తున్నాడు మరియు శని గ్రహం తో కలిసి ఉన్నాడు లగ్నం నుండి మూడో స్థానం పొరుగు దేశాల ను సూచిస్తుంది శని మరియు బృహస్పతి దృష్టి మూడో స్థానం మీద ఉంది కావున ఆ దేశాలతో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొనవచ్చు భారతదేశం మరియు బ్రెజిల్ మరియు యునైటెడ్ కింగ్డమ్ లాంటి దేశాలలో ప్రజాదరణ పొందిన నాయకుల జీవితంలో అస్థిరత తేస్తుంది 2023-2024 లో బృహస్పతి మీనరాశిలో సంచారం మరియు మేషరాశిలో సంచారం వలన దేశానికి మంచి రోజులు వస్తాయి మీన రాశిలో బృహస్పతి సంచారం 2022 లో భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలో విజృంభణ తేస్తుంది
భారతదేశం యొక్క G.D.P బృహస్పతి 2022 లో మీన రాశిలో సంచారం తో పాటు మేషంలో రాహువు తులారాశిలో కేతు సంచారం వల్ల ఆర్థిక వృద్ధి రేటు వేగంగా పెరుగుతుంది ఇది ఆర్థిక పథకం ప్రకారం భారతదేశానికి అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది
వింశోత్తరి దశ ప్రకారం భారతదేశానికి చంద్ర మహర్దశ లో శని యొక్క అంతర్దశ కాలం నడుస్తుంది కావున ఇది భారతదేశానికి చాలా సమస్యాత్మకంగా ఉంటుంది
2022 లో బుధుని యొక్క అంతర్దశ కాలం వస్తుంది మరియు 2024 శుక్రుని యొక్క అంత దశాకాలం రానుంది ఈ కాలం దేశానికి విశ్రాంతి మరియు భద్రతను ఇస్తుంది చంద్ర మహాదశ కాలం శుక్రుడు మరియు రవి అంతర్దశ కాలం భారతదేశం తిరిగి ఆర్థిక కీర్తిని తెచ్చుకుంటుంది
ఆర్థిక వ్యవస్థపై సూర్య గ్రహణ ప్రభావం....
డిసెంబర్ 14 2020 నాడు సూర్య గ్రహణం భారతదేశంతో పాటు పలు దేశాల్లో స్టాక్ మార్కెట్లు పతనం అవుతుంది
జూన్ 2020లో సూర్య గ్రహణం భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధ పరిస్థితిని వేగవంతం చేస్తుంది అలాగే భారతదేశంలో జూన్ నుండి సెప్టెంబర్ 2020 వరకు అంతర్గత భద్రతకు ముప్పు ఉంది ఇవన్నీ భారత దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తాయి మరియు G.D.P 2021 వరకు తీవ్రంగా దెబ్బతింటుంది
కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం...
భారతదేశం ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో మరియు భయంతో బాధపడుతుంది ఈ వైరస్ యొక్క వ్యాప్తి జనవరి 25న భారతదేశంలో శని మకర రాశి సంచారం తర్వాత నెమ్మదిగా ప్రారంభమైంది ఇది జూలై 15 2020 తర్వాత ఈ మహమ్మారి సంక్షోభం నుండి ఉపశమనం లభిస్తుంది
ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో దాదాపుగా ప్రపంచం మొత్తం రోజు వారి ఆర్థిక ప్రవాహం మరియు ఆర్ధిక స్థితి మరియు ప్రభుత్వ పాలనను తీవ్రంగా దెబ్బతీసింది ఎవరికి పనిలేదు దాదాపు అన్ని కంపెనీలు ఆర్థిక వ్యవస్థకు సంబంధించి అన్ని కార్యకలాపాలు మూసివేయబడ్డాయి ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు గొప్ప కూలుతున్నాయి ఈ కరోనా వైరస్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నయి మకర రాశిలో శని సంచారం మరియు బృహస్పతి నీచ స్థితి దీని తీవ్రత కొనసాగుతోంది
ముండెను ఆస్ట్రాలజీ లో శని బృహస్పతి కలయిక ప్రపంచ మందగమనం భయం పెంచటం మరియు సిడ్నీ ఫారెస్ట్ ఫైర్ వంటి ప్రకృతి విపత్త్తులకు దారి తీసింది
ఆర్థికంగా రాబోయే రెండు సంవత్సరాలు భారతదేశం సవాళ్లను ఎదుర్కొంటోంది మరియు ఆర్థిక మందగమనం భారతదేశానికి ఆందోళన కలిగించే విధంగా ఉంటుంది అయితే ఈ ఆర్థిక మందగమనం ఏప్రిల్ 2022 తర్వాత విపరీతంగా పుంజుకుంటుంది మరియు ఆ తర్వాత ఏడు సంవత్సరాలు భారత దేశ ఆర్థిక వ్యవస్థ మంచి ట్రాక్ లోకి వస్తుంది ఇది బృహస్పతి మరియు శని సమసప్తకం లోకిరాకముందు వరకు బాగుంటుంది
జ్యోతిష్య పెద్దలు మరియు పండితులకు నాయొక్క నమస్కారాలు నా యొక్క ఈ వ్యాసంలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించ ప్రార్థన...
ఈ వ్యాసాన్ని పూర్తిగా ఓపికతో చదివిన మిత్రులందరికీ నా యొక్క కృతజ్ఞతలు
జ్యోతిష్య శాస్త్రంలో నాకు ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తూ నాకు అన్ని వేళలా మంచి సహాయ సహకారాలు అందిస్తున్నప్రముఖ జ్యోతిష్కులు మరియు గురువర్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను
ధన్యవాదములు
PLEASE STAY HOME STAY SAFE
96666022371
No comments:
Post a Comment