Saturday 30 December 2023

స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ క్రింద మహిళలు శుచి, శుభ్రతతో తయారు చేసిన అరిసెలు, లడ్డూలు, జంతికలు, సకినాలు లాంటి మీకు కావలసిన పిండివంటలు ఆర్డర్ పై చేసి పంపగలము. ఈ ఆర్డర్ ద్వారా స్వచ్ఛమైన పదార్థాలు పొందడంతోపాటు స్వయం ఉపాధి పొందాలనుకునే మహిళలకు చేయూత ఇచ్చిన వారు అవుతారు.

    ఇవేకాకుండా రోజువారీ అవసరాలైన పసుపు, కారం, ధనియాలపొడి, అల్లంవెల్లుల్లి పేస్ట్, పచ్చళ్ళు, సాంబార్, చారుపొడి లాంటి మసాలాలు ప్రత్యేకంగా తయారుచేసి ఇవ్వబడును.కొరియర్ సౌకర్యం కలదు

మహిళా సాధికారిత సాధనలో మనవంతు చేయూత నిద్దాం

శ్రీ విధాత పీఠంలో

 భగవత్ భందువులందరికిీ

శ్రీ విధాత పీఠంలో 14-1-2024 (ఆదివారం) భోగి రోజు గోదా కల్యాణం  హవనిజా గారి ఆధ్వర్యంలో జరుగును.మీ మీగోత్ర నామాలతో పూజ జరిపించుకోదలచిన వారు   516/- ఈ క్రింది నెంబరుకు gpay కానీ, phonepay   ద్వారా కానీ పంపగలరు

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

HAVANIJAAA

(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం

Ph. no: 096666 02371

శ్రీ విధాత పీఠంలో

 భగవత్ భందువులందరికిీ

శ్రీ విధాత పీఠంలో 1-1-2024 (సోమవారం) ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా ఆయుష్షు హోమం శివార్చన  హవనిజా గారి ఆధ్వర్యంలో జరుగును.మీ మీగోత్ర నామాలతో పూజ జరిపించుకోదలచిన వారు ఈ క్రింది నెంబరుకు gpay కానీ, phonepay   ద్వారా కానీ పంపగలరు

ఆయుష్షు హోమం  516/-

శివార్చన 216/-

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

HAVANIJAAA

(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం

Ph. no: 096666 02371

Friday 29 December 2023

రోహిణి నక్షత్రం ,4 వ పాదం వారు గ్రహదోషాలు పోవడానికి పారాయణ చేయవలిసిన శ్లోకము

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

శనివారం, శక సంవత్సరం: 09-10-1945 (క్రీ.శ.30-12-2023) నాటి ఉదయం గ్రహ స్థితి: (సూ ఉ/అ – 06:49:09/17:47:44గం)🙏

🙏Saturday, Saka Era : 09-10-1945 (30-12-2023 AD) Planetary position at Sun Rise Time (Sun Rise/ Set – 06:49:09/17:47:44 hrs)🙏

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

నేను గాయత్రి జపించవచ్చా?

ఒకనాడు ఒక రైతు భక్తుడు మహాస్వామిని, "నేను గాయత్రీ మంత్రం జపించవచ్చా?" అని అడిగాడు. 

ఈ ప్రశ్న ఎంతటివారినైనా ధర్మసంకటంలో పడేస్తుంది. జపించవచ్చు అన్నా జపించకూడదు అన్నా చర్చనీయాంశం అవుతుంది. శ్రీమఠం యొక్క ప్రధాన కార్తవ్యం సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ, ఆచరింపచేస్తూ దాన్ని కాపాడటం. ఈ భరత భూమి వేల సంవత్సరములుగా ఎన్నిటినో చూసింది. ఈ దేశ ప్రజలు తమ సనాతన ధర్మం యొక్క ఉనికిని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూనే, దురాక్రమణలను అణచివేతలను ఎదుర్కొన్నారు. 

ఈదురుగాలులకి వొంగిన పైరు గాలి ఉధృతి ఆగిపోగానే లేచి నిలబడినట్టు, మాహావృక్షం వంటి ఈ వేదభూమి కూడా ఎన్నో దాడులను తట్టుకుని అలాగే నిలబడింది. 

కాని శ్రీమఠం ఎన్ని మార్పులకు సమన్వయం చూపగలదు? అందులో శ్రీమఠం యొక్క వాటా ఎంత? ఇవాల్టి ఆలోచన రేపటికి పాతది అయిపోతుంది. ఆ మరుసటి రోజుకి ఉనికినే కోల్పోతుంది. ఒక డ్యాం కూలిపొయినప్పుడు వచ్చే వరదని ఎవరూ నివారించలేకపొయినా, ఏదో ఒక రోజున వరద తగ్గిన తరువాత, ఆ ప్రవాహాన్ని ఒక నదిగా మార్చాలి కదా.

పరమాచార్య స్వామివారు ఏమి చెప్తారో ఎవరికి తెలియలేదు. కాని స్వామివారు ఏ క్లిష్ట సమస్యకైనా వారిదైన విశిష్ట శైలిలో పరిష్కారం చూపించగలరు. 

ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా భక్తునితో, "నీకెంత మంది పిల్లలు?" అని అడిగారు. 

అతను "మీ ఆశీర్వాదం వల్ల ముగ్గురు ఆడపిల్లల్లు పుట్టారు. మొదటి అమ్మయికి 5 యేళ్ళు. రెండో అమ్మాయికి 3 యేళ్ళు. అఖరి దానికి 6 నెలలు" అని చెప్పాడు.

స్వామి ఇలా చెప్పారు, "ఒకర్ని గాయత్రి అని, రెండో అమ్మాయిని సంధ్య అని, మూడో అమ్మాయికి సావిత్రి అని పేర్లు పెట్టి పిలువు. బేబి, లిల్లీ, బిల్లీ ఇలాంటి పేర్లతో పిలవద్దు. ఇలా నువ్వు రోజూ గాయత్రి, సంధ్య, సావిత్రి అని పిలుస్తూ ఉంటే నీకు గాయత్రి మంత్ర జప పుణ్య ఫలం దక్కుతుంది".

ఆ భక్తుని మొహం ఆనందంతో వెల్లివిరిసింది. సాంప్రదాయానికి వ్యతిరేకమైన పనిని చేబూనిన సమయంలో పరమాచార్య స్వామివారు అతనికి విషయ అవగాహన కలిగించి ఒక స్పష్టమైన సమాధానాన్ని అందించారు. మహాస్వామి వారి నుంచి ప్రసాదం తీసుకుని నిండైన ఆశీస్సులతో సంతోషంగా తన స్వస్థానానికి వెళ్ళాడు ఆ భక్తుడు.

[వర్ణ వ్యవస్థలో ఆరుగాలం శ్రమించే శూద్రులు గాయత్రి జపం చెయ్యవలసిన అవసరం లేదు. ఉదాయాన్నే తూర్పువైపుకు తిరిగి సూర్యునికి మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేస్తే చాలు సహస్ర గాయత్రి చేసిన ఫలితం వారి ఖాతాలో వేస్తారు. అనుకూలం ఉన్నవారు భవిష్యోత్తర పురాణంలోని బ్రహ్మప్రోక్త సూర్య స్తుతిని చదువుకోవాలి]

🌹🌹🌹🌹🌹

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం .

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

గరుడపురాణం:-

పురాణాలలో ఒకటైన ‘గరుడ పురాణంలో’ 

28 రకాల నరకాలున్నాయి...

మనుషులే కాదు ఇతర జీవజాలం కూడా ప్రశాంతంగా బతకాలని మన పెద్దలంతా బలంగా కోరుకున్నారు. రాముడైనా, యముడైనా వారి సంకల్పం సామాజిక సంక్షేమమే! మన పెద్దల ఆకాంక్షలు నెరవేరాలంటే మనమంతా క్రమశిక్షణ కలిగి కట్టుబాటుతో జీవించాలి. మనం చేసే పాపాలను బట్టి యముడు ఆయా నరకాలకు మనను పంపుతుంటాడట. “అపరిచితుడు” సినిమా గుర్తుంది కదా. అందులో గరుడపురాణం పుస్తకంలో భూలోకంలో చేసే తప్పులకు నరకలోకంలో ఎటువంటి శిక్షలు విధిస్తారు.. ఆ శిక్షలు ఎలా ఉంటాయి అని చూపించారు, ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ తప్పులు చేయాలంటే కాస్త భయం కలిగిందని చెప్పవచ్చు.

 అసలు గరుడపురాణంలో చెప్పినట్టు నరకంలో విధించే శిక్షలు ఏమిటి.. అవి ఎలా ఉంటాయి. ఏ తప్పుకు ఎటువంటి శిక్ష విధిస్తుందో ఒకసారి తెలుసుకుందాం‌. మన తప్పులు సరిచేసుకుందాం.

🔥 1.తమిశ్రం:- ఇతరుల సొమ్మును, భార్యాపిల్లలను కాజేసిన వాళ్ళను యమదూతలు కాలపాశంతో కట్టేసే ఇదో చిమ్మచీకటి నరక కూపం.

🔥 2. అంధతమిశ్రం:- ఒకరినొకరు వెూసపుచ్చుకుని చిన్ని నా పొట్ట నిండితే చాలుననుకుంటూ స్వార్థ చింతనతో ముక్కుమునగ తినే వారిని, అవసరాలు తీరే వరకు భార్యను వాడుకుని ఆ తరువాత వెంట్రుకముక్కలా వదిలిపారేసే భార్యా భర్తలను శిక్షించేందుకు యముడు ఈ నరకానికి పంపుతాడు.

🔥 3. రౌరవం:- రురు అంటే భయంకరమైన విషనాగు అని అర్థం. శరీరం శాశ్వతమని తనకోసం, తన వారి కోసం ఇతరుల ఆస్తిపాస్తులను లాక్కుని అక్రమంగా అనుభవించే వాళ్ళు ఇక్కడికి వస్తారు.

🔥 4. మహారౌరవం:- న్యాయమైన వారసత్వాన్ని కాదని ఆస్తిపాస్తులను అక్రమంగా లాక్కుని అనుభవించే వారిని, ఇతరుల భార్యను, ప్రేమికురాలిని అక్రమంగా లోబరచుకుని అనుభవించే వారు ఇక్కడకు వస్తారు.

🔥 5. కుంభీపాకం:- వేట ఒక ఆట అంటూ సాధు జంతువులను కిరాతకంగా హతమార్చి కడుపునింపుకునే వారు ఇక్కడికి వస్తారు.

🔥 6.కాలసూత్రం:- ఈ నరకం కణకణలాడే రాగిపాత్రగా ఉంటుంది. పైనుంచి సూర్యుడు, కింద భగ్గున మండుతున్న మంటతో ఆ రాగి కొలిమి విపరీతంగా వేడెక్కి ఉంటుంది…

🔥 7. అసితపత్రవనం:- విధ్యుక్త ధర్మాలను గాలికి వదిలేసి ఇతరుల పనులలో వేలుపెట్టి వాళ్ళనూ చెడగొట్టే వాళ్ళు ఇక్కడకు వస్తారు.

🔥 8.సూకరముఖం:- అధికార దుర్వినియోగానికి పాల్పడి, అక్రమాలు, అన్యాయాలలో దిగబడి విధినిర్వహణలో సక్రమంగా వ్యవహరించని పాలకులు, అధికారులు ఈ నరకానికి వస్తారు.

🔥 9. అంధకూపం:- చిట్టి చీమకైనా అపకారం తలపెట్టని వాళ్ళు, అపకారికైనా ఉపకారం చేసే వాళ్ళను బుద్ధిపూర్వకంగా తొక్కిపట్టి బాధించే వాళ్ళు, కాపాడమని ప్రాథేయపడేవారిని అవకాశం ఉండి కూడా కాపా డని వాళ్ళు ఈ నరకానికి వస్తారు.

🔥 10. తప్తమూర్తి:- ఈ నరకం ఒక కొలిమిలా ఉంటుంది. ఇక్కడ పెను మంటలు నాల్కలు సాచి భగభగ మండుతుంటాయి. బంగారం, విలువైన రత్నాలు, రత్నాభరణాలు కాజేసిన వారిని ఇందులో పడేసి సజీవదహనం చేస్తారు.

🔥 11: క్రిమిభోజనం:- ఇది క్రిమికీటకాలతో నిండి ఉండే నరకం. ఇంటికి అతిథులుగా వచ్చిన వాళ్ళను ఆదరించకుండా, వాళ్ళకు మెతుకు విదిల్చకుండా మింగేవాళ్ళను, ఎదుటి వాళ్ళను సొంత పనులకు, స్వార్థ ప్రయోజనాలకు వాడుకుని అవసరం తీరాక విసిరిపారేసే వాళ్ళను ఇక్కడికి తీసుకువచ్చి క్రిమికీటకాలకు ఆహారంగా పడేస్తారు.

🔥 12. శాల్మలి:- దీన్నే ‘తప్తశాల్మలి’ అని కూడా పిలుస్తారు. వావీ వరస పట్టించుకోకుండా అక్రమ సంబంధాలకు ఎగబడే ఆడ, మగ వాళ్ళను ఈ నరకానికి తెస్తారు.

🔥 13. వజ్రకంటకశాలి:- జాతి రీతి లేకుండా జంతువులతోనూ శృంగారం నడిపే వారికి ఈ నరకం ప్రత్యేకంగా సిద్ధంగా ఉంటుంది.

🔥 14. వైతరణి:- అధికారాన్ని సద్వినియోగం చేసి ప్రజలకు సేవ చేయాల్సిన వాళ్లు వాటిని పూర్తిగా దుర్వినియోగపరచి అక్రమాలకు, అనుచితాలకు పాల్పడితే ఇక్కడికి వస్తారు.

🔥 15. పూయోదకం:- వైతరిణిలో ఉండే కాలుష్య జలమే ఈ నరకంలో ఒక బావిలో ఉంటుంది. వివాహం చేసుకునే ఉద్దేశ్యం లేకపోయినా మాయమాటలు చెప్పి ఆడపిల్లను ముగ్గులోకి దింపి అనుభవించే పురుషపశువులకు ఈ నరకంలో శిక్ష పడుతుంది.

🔥 16. ప్రాణరోధం:- కుక్కలు వగైరా జంతువులను వేటకు ఉసిగొల్పి సాధు జంతువుల ప్రాణాలు హరించే వారి కోసం ఈ నరకం తలుపులు తెరిచి ఉంటాయి.

🔥 17. వైశాసనం:- పేదలు ఆకలి దప్పులతో బాధపడుతుంటే తమ దర్పాన్ని ప్రదర్శించుకోడానికి విందులు వినోదాలు చేసుకుంటూ అవతలి బాధపడుతుంటే చూసి ఆనందించే దుర్మార్గపు మనసున్న వాళ్ళంతా ఈ నరకానికి వచ్చి పడతారు.

🔥 18. లాలభక్షణం:- అతి కాముకులు, భార్యను కట్టుబానిసంగా కన్నా నీఛంగా చూసే వాళ్ళు తమ ఆధిక్యతను చాటుకోడానికి వీర్యం తాగిస్తారు. ఇలాంటి వార్తలు తరుచు వినబడుతుంటాయి. అలాంటి పొగరుబోతుల పని పట్టేందుకే ఈ నరకం ఉంది.

🔥 19. సారమేయాదానం:- ఆహారంలో విషం కలిపే వాడు, ఊచకోతకు దిగేవాడు, దేశాన్ని సర్వనాశనం చేసే వాడు ఈ నరకానికి వస్తాడు.

🔥 20. అవీచి:- నీటిబొట్టులేని నరకం ఇది. అక్కడ రాతిపలకలు పరుచుకున్న తీరు చూస్తే అక్కడ సముద్రమేదో ఉందేవెూ అనిపిస్తుంది. తప్పుడు సాక్ష్యం చెప్పేవాళ్ళను, తప్పుడు ప్రమాణాలు చేసే వాళ్ళను, వ్యాపార వ్యవహారాలలో అబద్ధాలు చెప్పి వెూసం చేసే వాళ్ళను ఈ నరకానికి తీసుకు వస్తారు.

🔥 21. అయోపానం:- ఈ నరకం తాగుబోతుల కోసమే ఉంది. ఆడా, మగ తాగుబోతులకు వేరువేరుగా శిక్షలుంటాయి. పాపులు బతికి ఉండగా ఎన్నిసార్లు మద్యం పుచ్చుకున్నారో లెక్కలు తీసి అన్నిసార్లు ఈ శిక్షలు విధిస్తారు. తాగుబోతు ఆడదైతే ఇనపద్రవాన్ని తాగాలి. అదే తాగుబోతు మగవాడైతే లావా తాగాలి.

🔥 22. రక్షోభక్ష:- జంతుబలిని, నరబలిని విచ్చలవిడిగా చేసి మాంసాన్ని ఇష్టానుసారంగా తినే వారి కోసం ఈ నరకం ఉంది.

🔥 23. శూలప్రోతం:- ఎదుటి వాడు ఏ అపకారం చేయకపోయినా నిష్కారణంగా ప్రాణాలు తీసే వాళ్ళను, నమ్మకద్రోహం చేసే వాళ్ళను ఈ నరకంలోకి పంపుతాడు యముడు.

🔥 24. క్షరకర్దమం:- మంచి వాళ్ళ పట్ల అవమానకరంగా వ్యవహరించి దబాయించి బతికేసే వాళ్ళను ఈ నరకానికి తీసుకువస్తారు.

🔥 25. దందశూకం:- తనతోటి మానవులను జంతువుల్లా భావించి విచ్చలవిడిగా వేటాడడం, తక్కువ చూపు చూడడం, మానవహక్కులను హరించి వేయడంలాంటివి చేస్తాడో వాడు ఈ నరకానికి వస్తాడు.

🔥 26. వాతరోదం:- అడవులలో, చెట్లమీద, కొండకొమ్ములలో ఉంటూ ఎవ్వరి జోలికీ రాని జంతువులను పట్టి పల్లార్చే వారికోసం ఈ నరకం ఉంది.

🔥 27. పర్యావర్తనకం:- ఆకలితో అలమటించిపోయే వాడు ఒక్క ముద్ద అన్నం పెట్టమని అడిగితే పెట్టకపోగా నానా దుర్భాషలాడేవాడిని ఈ నరకంలో పడేస్తారు.

🔥 28. సూచీ ముఖం:- గర్వం, పిసినారితనం ఉన్న వారిని, రోజు వారి ఖర్చులకు కూడా డబ్బు తీయకుండా దాచేసే పరమలోభులు ఇక్కడికి వస్తారు..!!

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

తిరుప్పావై –14 వ పాశురము

పాశురము :-

ఉజ్ఞ్గల్ పుళైక్కడై తోట్టత్తు వావియుల్

శెజ్ఞ్గళు నీర్వాయ్ నెగిలిన్దుఆంబల్వాయ్ కూమ్బినకాణ్

శెజ్ఞ్గల్పొడిక్కూరై వెణ్ బల్ తవత్తవర్

తజ్ఞ్గల్ తిరుక్కోయిల్ శజ్ఞ్గిడువాన్ పోగిన్రార్

ఎజ్ఞ్గలై మున్న మెళుప్పువాన్ వాయ్ పేశుమ్

నజ్ఞ్గా యెలున్దిరాయ్ నాణాదాయ్ నావుడై యాయ్

శజ్ఞ్గొడు శక్కర మేన్దుమ్ తడక్కైయన్

పజ్ఞ్గయక్కణ్ణానై ప్పాడేలో రెమ్బావాయ్.

తాత్పర్యము:-

స్నానము చేయుటకు గోపికల నందరను లేవుదునని చెప్పి నిద్రించుచున్న ఒక యమెను ఇందు మేల్కొలుపుచున్నారు.

ఓ పరిపూర్ణురాలా ! నీ పెరటితోటలో దిగుడుబావిలోని ఎఱ్ఱతామరలు వికసించినవి. నల్లకలువలు ముడుచుకొనిపోవుచున్నవి. లెమ్ము. ఎఱ్ఱని కాషాయములను దాల్చి తెల్లని పలువరుస గలిగి వైరాగ్యముతో కూడిన సన్యాసులు తమ తమ యాలయములలో ఆరాధన మొనర్చుటకై పోవుచున్నారు లెమ్ము. మమ్ములను ముందుగానే మేల్కొని వచ్చి లేపుదునని మాట నిచ్చినవు. మరచితివా ! ఓ లజ్ఞావిహీనురాలా ! లెమ్ము. ఓ మాటనేర్పు గలదానా ! శంఖమును చక్రమును ధరించినవాడును, ఆజానుబాహువును అయిన పుండరీకాక్షుని మహిమను గానము చేయుటకు లేచి రమ్ము.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

రాశి ఫలితాలు

 30-12-2023

స్థిర వాసరః (శనివారం )

మేషం

 30-12-2023

దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలకు మందకోడిగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు అధిగమించడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు.

---------------------------------------

వృషభం

 30-12-2023

వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. మానసిక ఆందోళనతో కొంత చికాకు పరుస్తాయి. స్థిరాస్థి కొనుగోలు ప్రయత్నాలు  వాయిదా వేస్తారు.  ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

---------------------------------------

మిధునం

 30-12-2023

ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సోదరుల సహాయ సహకారాలతో కొన్ని వ్యవహారాలు  పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు  చేస్తారు. చిన్ననాటి మిత్రుల తో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

---------------------------------------

కర్కాటకం

 30-12-2023

అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది.  కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కొందరు ప్రవర్తన వలన మానసిక ఆందోళనలు తప్పవు. నేత్ర సంబంధిత అనారోగ్యాలను కొంత బాధిస్తాయి.

---------------------------------------

సింహం

 30-12-2023

మానసికంగా మరింత ఉత్సాహంగా ఉంటారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం లభిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంతాన వివాహ విషయమై గృహమున ప్రస్తావన వస్తుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి.

---------------------------------------

కన్య

 30-12-2023

 మీ ఆలోచనలు ఇతరులకు  నచ్చే విధంగా ఉండవు. నిరుద్యోగ  ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి.  ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. నూతన రుణ ప్రయత్నాలు కలసి రావు.  కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.

---------------------------------------

తుల

 30-12-2023

ఇతరులకు  సైతం సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. దూరప్రాంత బంధుమిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు.

---------------------------------------

వృశ్చికం

 30-12-2023

వృత్తి వ్యాపారంలో విశేషలాభాన్ని ఆర్జిస్తారు.  బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒక వ్యవహారానికి సంబంధించి ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. నూతన వస్త్రా భరణాలను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలలో  నూతన పరిచయాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు అధిగమించి ముందుకు సాగుతారు.

---------------------------------------

ధనస్సు

 30-12-2023

ఇంటా బయట విలువ మరింత పెరుగుతుంది. సమాజంలో పేరు కలిగిన వ్యక్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కొన్ని విషయాలను ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. దైవానుగ్రహం తో కొన్ని పనులు పూర్తవుతాయి.

---------------------------------------

మకరం

 30-12-2023

బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు  అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చాలా కాలంగా పూర్తికాని పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

---------------------------------------

కుంభం

 30-12-2023

ఆర్థిక పరిస్థితి  మరింత నిరుత్సాహ పరుస్తుంది.  వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. సోదరులతో వివాదాలకు  దూరంగా ఉండటం  మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు తప్పవు.

---------------------------------------

మీనం

 30-12-2023

సమాజంలో  పేరు, ప్రతిష్ఠలు పెరుగుతాయి. రుణబాధలు నుండి ఉపశమనం పొందుతారు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. స్త్రీ సంబంధిత ధన లాభ సూచనలు ఉన్నవి.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

పంచాంగము

శనివారం, డిసెంబరు 30, 2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - హేమంత ఋతువు

మార్గశిర మాసం - బహుళ పక్షం

తిథి:తదియ ఉ8.16 వరకు

వారం:శనివారం (స్థిరవాసరే)

నక్షత్రం:ఆశ్లేష తె4.48 వరకు 

యోగం:విష్కంభం రా2.40 వరకు

కరణo:భద్ర ఉ8.16 వరకు తదుపరి బవ రా9.13 వరకు

వర్జ్యం:సా4.32 - 6.17

దుర్ముహూర్తము:ఉ6.33 - 8.01

అమృతకాలం:తె3.02 - 4.48

రాహుకాలం:ఉ9.00 - 10.30

యమగండ/కేతుకాలం:మ1.30 - 3.00

సూర్యరాశి:ధనుస్సు

చంద్రరాశి:కర్కాటకం

సూర్యోదయం:6.34

సూర్యాస్తమయం: 5.32

సంకష్టహర చతుర్థీ

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ క్రింద మహిళలు శుచి, శుభ్రతతో తయారు చేసిన అరిసెలు, లడ్డూలు, జంతికలు, సకినాలు లాంటి మీకు కావలసిన పిండివంటలు ఆర్డర్ పై చేసి పంపగలము. ఈ ఆర్డర్ ద్వారా స్వచ్ఛమైన పదార్థాలు పొందడంతోపాటు స్వయం ఉపాధి పొందాలనుకునే మహిళలకు చేయూత ఇచ్చిన వారు అవుతారు.

    ఇవేకాకుండా రోజువారీ అవసరాలైన పసుపు, కారం, ధనియాలపొడి, అల్లంవెల్లుల్లి పేస్ట్, పచ్చళ్ళు, సాంబార్, చారుపొడి లాంటి మసాలాలు ప్రత్యేకంగా తయారుచేసి ఇవ్వబడును.కొరియర్ సౌకర్యం కలదు

మహిళా సాధికారిత సాధనలో మనవంతు చేయూత నిద్దాం

వివరాలకు/ ఆర్డర్ కొరకు సంప్రదించండి

RAVELARA/VIDHATHA SOCIETY

9666602371

శ్రీ విధాత పీఠంలో

 భగవత్ భందువులందరికిీ

శ్రీ విధాత పీఠంలో 14-1-2024 (ఆదివారం) భోగి రోజు గోదా కల్యాణం  హవనిజా గారి ఆధ్వర్యంలో జరుగును.మీ మీగోత్ర నామాలతో పూజ జరిపించుకోదలచిన వారు   516/- ఈ క్రింది నెంబరుకు gpay కానీ, phonepay   ద్వారా కానీ పంపగలరు

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

HAVANIJAAA

(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం

Ph. no: 096666 02371

శ్రీ విధాత పీఠంలో

 భగవత్ భందువులందరికిీ

శ్రీ విధాత పీఠంలో 1-1-2024 (సోమవారం) ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా ఆయుష్షు హోమం శివార్చన హవనిజా గారి ఆధ్వర్యంలో జరుగును.మీ మీగోత్ర నామాలతో పూజ జరిపించుకోదలచిన వారు ఈ క్రింది నెంబరుకు gpay కానీ, phonepay   ద్వారా కానీ పంపగలరు

ఆయుష్షు హోమం  516/-

శివార్చన 216/-

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

HAVANIJAAA

(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం

Ph. no: 096666 02371

శ్రీ విధాత పీఠంలో

 భగవత్ భందువులందరికిీ

శ్రీ విధాత పీఠంలో 30-12-2023 (శనివారం)సంకటహరచతుర్థి సందర్భంగా సంకష్టగణపతి హోమం హవనిజా గారి ఆధ్వర్యంలో జరుగును.మీ మీగోత్ర నామాలతో పూజ జరిపించుకోదలచిన వారు 516/-

ఈ క్రింది నెంబరుకు gpay కానీ, phonepay   ద్వారా కానీ పంపగలరు

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

HAVANIJAAA

(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం

Ph. no: 096666 02371

Thursday 28 December 2023

లక్ష్మీదేవి ఆరాధన శుక్రవారమే ఎందుకు చేయాలి.

👉🏻 లక్ష్మీదేవిని గురు, శుక్రవారాలలో ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ రోజులలో దేవిని ప్రసన్నం చేసుకుని, ఆమె ఆశీస్సులు పొందేందుకు వ్రతాలు చేస్తారు. లక్ష్మీదేవికి ప్రీతికరమైన స్తోత్రాలు, స్తుతులు ఆరోజునే పఠిస్తారు. ఆ రోజు కొంతమంది ఉపవాసం ఉంటారు. ఈనాడు మానవులే కాదు, పురాణాలలో రాక్షసులు సైతం శుక్రవారం లక్ష్మీదేవిని పూజించే వారనడానికి ఉదాహరణగా అనేక కథలున్నాయి. అసలు శుక్రవారమే లక్ష్మీదేవికి ఆరాధనకు అనుకూల మైన దినంగా ఎందుకు పేరుమోసింది? రాక్షసులు కూడా ఆరోజే లక్ష్మీదేవిని ఎందుకు ఆరాధించేవారు? అందునా రాక్షస సంహారి అయిన విష్ణుమూర్తి భార్యను రాక్షసులు పూజించడమేమిటి? ఈ సందేహాలన్నీ వస్తాయి. ఈ సందేహాలకు సమాధానం ఏమిటంటే రాక్షసుల గురువు శుక్రాచార్యుడు. ఈ శుక్రాచార్యుల పేరు మీదుగానే శుక్రవారం ఏర్పడిందని హిందూ పురాణాలు చెబుతున్నాయి. ఇకపోతే శుక్రాచార్యుడి తండ్రి భృగుమహర్షి. ఈ భృగుమహర్షి 

బ్రహ్మదేవుడి సంతానంలో ఒకరు. ఇతడు లక్ష్మీదేవికి తండ్రి కూడా! అందుకే లక్ష్మీదేవికి భార్గవి అని పేరు. ఈ విధంగా లక్ష్మీ దేవికి శుక్రాచార్యుడు సోదరుడు. అందుకే ఆమెకు శుక్రవారం అంటే ప్రీతికరమైనది. లక్ష్మీదేవి రూపు రేఖలలో వస్త్రధారణలో రంగులకు కూడా ప్రాధాన్యం వుండి.

లక్ష్మీదేవి ఎక్కువగా ఎరుపు, ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించినట్లు చిత్రాలు చిత్రీకరిస్తారు. ఎరుపు రంగుకి శక్తికి, ఆకుపచ్చ రంగు సాఫల్యతకు, ప్రకృతికి చిహ్నాలు. ప్రకృతికి లక్ష్మీదేవి ప్రతినిథి. అందుకే ఆమెను ఈ రెండు రంగుల వస్త్రాలలో ఎక్కువగా చిత్రిస్తారు. ఇక లక్ష్మీదేవిని బంగారు ఆభరణాలు ధరించినట్లు చూపిస్తారు. బంగారం ఐశ్వర్యనికి సంకేతం. ఐశ్వర్యాధిదేవత లక్ష్మీదేవి కాబట్టే ఆమెను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. విష్ణువు ఆరాధనలోనూ లక్ష్మీపూజకు ప్రాధాన్యం ఉంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో కానీ, విష్ణుమూర్తిని దరిచేరలేరు. లక్ష్మీదేవి ప్రసన్నత లేకుంటే విష్ణువు భక్తులకు అందుబాటులో ఉండరు. సదాచారం, సత్ప్ర వర్తన లక్ష్మీదేవి ఆహ్వానాలు. ఈ రెండూ ఉంటె ముందు లక్ష్మీదేవి అనుగ్రహం, తద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పొందవచ్చు.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

లక్నో పేరు మార్చబడింది. దాని అసలు నామధేయం "లక్ష్మణ పురి"గా మార్చి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉత్తరప్రదేశ్ లోని యోగి సర్కార్.....🙏

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

సాక్షాత్ పరమేశ్వరుడే స్వయంగా తన శివలింగాన్ని తానే ప్రతిష్ఠించుకొన్న శివలింగమే తిరువిడై మరుదూర్ శ్రీ మహాలింగేశ్వరుడు .

🙏ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా , పరమశివుడు తనలోని తపఃశక్తిని ఇక్కడి శివలింగం నందు ప్రవేశపెట్టాడని అందువల్ల ఇక్కడి శివలింగం స్వయంభువు లింగమని పురాణాలు చెబుతున్నాయి.

సృష్టి మొదలయ్యినప్పుడు బ్రహ్మ దేవుడు రూపొందించిన సువర్ణ కలశం మొదట భూమిపై తాకిన ప్రదేశమే కుంభకోణం క్షేత్రం . అందువల్లే ఈ క్షేత్రాన్ని అతి పవిత్రమైన ప్రాంతంగా హిందూ పురాణాల్లో పేర్కొంటారు. అటువంటి కుంభకోణం దగ్గర్లోనే తిరువిడైమరుదూర్ అనే పుణ్యక్షేత్రం ఉంది.

ఇక ఇక్కడ అరుదుగా కనిపించే తెల్ల మద్ది చెట్లు మనకు కనిపిస్తాయి. తిరువిడైమరుదూర్ ఆలయం ప్రాంగణంలో ఉండే మద్ది చెట్టుకి ప్రదక్షిణ చేస్తే చాలా మంచి శుభాలు జరుగుతాయి. 

ఇటువంటి మద్ది చెట్లు కేవలం మధ్యార్జునం , శ్రీశైలంలో మాత్రమే ఉన్నాయి. 

ఈ ఆలయం పక్కనే భారత దేశంలో అత్యంత అరుదైన దేవాలయాల్లో ఒకటిగా పేర్కొనే మూకాంబిక దేవి ఆలయాన్ని కూడా ఇక్కడే విరాజిల్లుతుంది.

ఇక ఈ దేవాలయానికి చుట్టూ నాలుగు దిక్కుల్లో నాలుగు దేవాలయాలు ఉన్నాయి. 

అవి తూర్పు వీధిలో విశ్వనాథుడు, పడమట ఉన్న బుుషిపురేశ్వరుడు, దక్షిణ వీధిలో ఉన్న ఆత్మనాధుడు, వీధిలో ఉన్న చొన్ననాధుడు. 

ఇంతటి విశిష్టమైన దేవాలయంను ఈ క్షేత్రాన్ని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావిస్తారు.

ఈ క్షేత్రంలోని మహాలింగేశ్వరస్వామిని భక్తితో ప్రదక్షిణ చేస్తే ఎటువంటి మానసిక బాధలైనా

తొలిగిపోతాయని స్థల పురాణం తెలుపుతుంది . 

వివాహం, సంతానం కావాల్సిన వారు ఎక్కువ మంది ఈ క్షేత్రాన్ని సందర్శిస్తూ ఉంటారు.

ఈ క్షేత్రంలో ప్రవేశ ద్వారం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్లరు . ఒకవేళ అలా చేస్తే బ్రహ్మహత్యా దోషం చుట్టుకుంటుందని చెబుతారు. ఇందుకు సంబంధించి  ఒక కథనం ప్రచారంలో ఉంది. ఒకసారి పాండ్య రాజు వరుగుణ పాండ్యన్ అడవిలో వేటకి వెళ్లి , తిరిగి వచ్చే సరికి చీకటి పడుతుంది. ఆ చీకట్లో అతని గుర్రం ఒక బ్రాహ్మణుడి మీదుగా వెళ్లి అతని చావుకు కారణమవుతుంది. దీంతో  అతనికి బ్రహ్మహత్యా దోషం చుట్టుకుంటుంది.  శివ భక్తుడైన పాండు రాజు శివుడిని ప్రార్తించగా .. పరమ శివుడు కలలో కనిపించి తిరువిడైమరుదూర్ క్షేత్రంలోని శివలింగాన్ని దర్శించుకోవాల్సిందిగా సూచిస్తాడు. దీంతో రాజు తిరువిడైమరుదూర్ వెళ్లి  తూర్పు ద్వారం గుండా ఆలయ ప్రవేశం చేస్తాడు. 

అతన్ని అన్ని చోట్లకు వెంటాడుతున్న బ్రహ్మహత్యా దోషం పవిత్రమైన శివాలయంలోకి రాలేక తూర్పు ద్వారం వద్దనే ఉండి పోతుంది. ఇక రాజు శివుడిని ఆరాధించిన తర్వాత అదే ముఖద్వారం నుండి బయటకు వస్తుండగా ..వచ్చిన తూర్పు ద్వారం నుంచి కాకుండా  మరో ద్వారం గుండా బయటకు వెళ్లమని ఆశరీరవాణి సూచించడంతో రాజు అలాగే చేస్తాడు. దీంతో 

ఇప్పటికీ ఆ బ్రహ్మహత్య దోషం అక్కడే ఉందని లోనికి వెళ్లిన వారు ఎవరైనా ఈ ద్వారం గుండా వస్తే  బ్రహ్మహత్య దోషం వారికి చుట్టుకుంటుందని చెబుతారు.

ఈ పవిత్రక్షేత్రానికి మధ్యార్జునం అని కూడా పేరు ఉత్తరంలో ఉన్న శ్రీశైల మల్లికార్జునిడికి, దక్షిణాన ఉన్న తిరుపుట్టైమరుదూరుకు మధ్యన ఉండటం వల్ల  ఈ క్షేత్రాన్ని మధ్యార్జునం అని పిలుస్తారు. 

అర్జునం అంటే మద్ది చెట్టు. ఈ మూడు క్షేత్రాల్లో మాత్రమే అత్యంత అరుదైన మద్దిచెట్లు దర్శనమిస్తాయి. 

ప్రపంచంలో మరెక్కడా ఇటువంటి తెల్లని మద్దిచెట్లు కనపడవు . ఇక ఈ ఆలయం పక్కనే మనకు 

భారత దేశంలో అత్యంత మహిమాన్విత ఆలయాల్లో ఒకటిగా చెప్పబడే మూకాంబిక అమ్మవారి ఆలయం కనిపిస్తుంది. అమ్మవారు పద్మాసనంలో కూర్చొన్న స్థితిలో మనకు కనిపిస్తుంది. మూకాసురుణ్ణి చంపడం వల్ల వచ్చిన బ్రహ్మ హత్యా దోషం పోవడానికి ఇక్కడ తపస్సు చేసినట్లు

స్థలపురాణం చెబుతుంది. కర్నాటకలోని మూకాంబిక దేవి ఆలయం వలే ఈ ఆలయం కూడా చాలా ప్రాముఖ్యం కలిగినది. ఈమెను చాలా శక్తికల దేవతగా ప్రజలు భావిస్తారు. ఇక్కడ బ్రహ్మ హత్య దోషం కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అంతే కాకుండా  పిల్లల కోసం, సుఖ ప్రసవం కోసం ఈ దేవిని స్థానిక భక్తులు పూజిస్తారు. కాబట్టి , సృష్టి మొదలయినప్పుడు  భక్తులు సేవించుకోవటానికి పరమ శివుడు ఈ లింగాన్ని సృష్టించి, ఆ లింగానికి శక్తిని ప్రసాదించటానికి 

తాను తపస్సు చేసి, ఆ తపో శక్తిని అందులో ప్రవేశపెట్టి, తానుకూడా అందులో లీనమయ్యాడని ,

పరమశివుడు స్వయంగా తపస్సు చేసి ఆ శక్తిని ఆ లింగంలో ప్రవేశపెట్టాడంటే అది ఎంతటి 

మహాద్భుత లింగమో పురాణాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి , ఎంతో ప్రాముఖ్యత గల ఈ పుణ్య క్షేత్రంలోని మహాలింగేశ్వరున్ని దర్శించుకొన్నవారికి  కోరుకున్న కోరికలు నెరవేరగలవని శాస్త్ర వచనం 

శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

పసుపు-పరిహారాలు

పసుపుని సంస్కృతంలో హరిద్ర అని అంటారు. పసుపును అన్ని శుభకార్యాల్లో ఉపయోగిస్తారు. శాస్త్రాల్లో పేర్కొన్న కొన్ని ముఖ్య వస్తువులు ఎవరి నుంచి అయినా పొందవచ్చు. వాటికి మైల ఉండదు.

అవేమిటంటే...

1. పసుపు, 2. కుంకుమ, 3. పూలు, 4. పళ్లు, 5. తమలపాకు, 6. వక్క, 7. పాలు, 8. పెరుగు, 9. నేయి, 10. తేనె, 11. కూరగాయలు, 12. తులసి, 13. గంధం అరగదీసే సానరాయి, 14. గంధం చెక్క...

వీటిలో పసుపుకు మొదటి స్థానం కల్పించబడింది. అలానే సుమంగళులకు తాంబూలం లేదా ఆకు, వక్క ఇచ్చే సమయంలో మొదట పసుపు ఇచ్చి తరువాత కుంకుమ ఇస్తారు.

పసుపు సౌభాగ్యానికి చిహ్నం. ఈ కారణం చేతనే సుమంగుళులు తన భర్తకు శుభం కోరుతూ మాంగల్యానికి పసుపును ఉంచి నమస్కరిస్తారు.

దేవీ ఆలయాల్లో, నవరాత్రి పూజా సమయంలో దేవికి పసుపుతో చేసే అలంకారాలు ముఖ్యమైనవి. గోదాదేవి లేదా ఆండాళ్ అమ్మవారి దేవాలయానికి మీరు వెళ్లినప్పుడు మీకు పసుపు ప్రసాదాన్ని అందిస్తే

పసుపును ఇంటికి తీసుకు వచ్చి వంటల్లో లేదా స్నానం చేసేందుకు ఉపయోగిస్తారు అలా కాకుండా ప్రసాదంగా పసుపును పొంది ఇంటికి తీసుకు వచ్చినప్పుడు ఈ విధంగా చేయండి.

1. దేవుని ప్రసాదమైన పసుపును ప్రతి దినం పూజాస్థానంలో ఉంచి పూజిస్తే ఇంటికి, ఇంట్లో ఉన్నవారికి అన్ని విధాలా ధన, కనక, వస్తు, వాహనాలు వృద్ధి చెందుతాయి.

2. పసుపును నీటిలో వేసి స్నానం చేస్తే దేహ కాంతి పెరుగుతుంది. సమస్త చర్మరోగాలు నయం అవుతాయి. పసుపును నీటిలో వేసి చేసే స్నానాన్ని మంగళ స్నానం అని పిలుస్తారు.

3. పసుపుతో గౌరీదేవిని చేసి పూజించటం ద్వారా ఇంట్లో ఉండే వధువుకు ఉన్న వివాహ దోషాలు తొలగిపోయి, త్వరలో వివాహం నిశ్చయమవుతుంది.

4. దేవికి పసుపు రంగు చీరను ఇస్తే ఇంట్లో ఉండే దోషం మరియు దైవ దోషాలు తొలగిపోతాయి.

5. దుకాణాల్లో చాల రోజులుగా అమ్ముడు కాకుండా మిగిలి ఉండే వస్తువులపై కొద్దిగా పసుపు పొడిని చల్లితే వెంటనే వ్యాపారమవుతుంది.

6. పసుపు నీటితో ఇంటిని కడిగితే ఆ ఇంటికి ఆ ఇంటివారికి డబ్బుకు సమస్య రాదు, అప్పుల బాధ తొలగిపోతుంది.

7. కామెర్లు ఉన్నవారి ఇంటి వారు పసుపును దానంగా ఇస్తే కామెర్ల రోగం తొలగిపోతుంది.

8. ప్రతి సంవత్సరం కామెర్లు వచ్చేవారు సుమంగుళులకు పసుపు రంగు చీర తాంబూలాలను దానంగా ఇస్తే కామెర్ల సమస్య తలెత్తదు.

9. గృహదేవతను పసుపు నీటితో కడిగితే విగ్రహాలకు దైవ కళ పెరుగుతుంది.

10. వ్యాపారం జరుగని దుకాణాల్లో దక్షణావృత శంఖాన్ని పసుపు రంగు కాగితంలో చుట్టి దానిని గల్లాపెట్టెలో ఉంచితే వ్యాపారం బాగా అవుతుంది

సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

కనకధారా స్తోత్రం 🕉️

శంకరుల నోట పలికిన లక్మీ స్తోత్రమే కనకధారా స్తోత్రం. లక్మీ కటాక్షాన్ని కోరుకునేవారు ప్రతి రోజు కనకధారా స్తోత్రాన్ని పఠిస్తే దారిద్ర్యం ద‌రిచేర‌దు.

మాన‌వాళికి క‌న‌క‌ధారా స్త్రోత్రం ఓ పెద్ద వ‌రం. దీనిని క్ర‌మంత‌ప్ప‌కుండా నిష్ట‌గా పారాయ‌ణం చేసిన వారి ఇంట్లో క‌న‌క వ‌ర్ష‌మే.

మొత్తం స్తోత్రంలో 25 శ్లోకాలున్నాయి. ఇందులో మొదటిది హయగ్రీవ స్తోత్రం. చివరిది ఫలశ్రుతి. ఈ రెంటినీ మినహాయిస్తే 23 శ్లోకాలు.

అంగం హరే: పులక భూషణ మాశ్రయంతీ

భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ ।

అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా

మాంగల్యదా౭స్తు మమ మంగళదేవతాయా: ॥

నీలమేఘశ్యాముడైన హరిని తన చూపులతో చుట్టివేసిన మంగళమూర్తి, సకలసిద్ధిస్వరూపిణి అయిన శ్రీలక్ష్మీదేవి నాకు సమస్త సన్మంగళములను ప్రసాదించును గాక !

నమోస్తు దేవ్యై భృగు నందనాయై నమోస్తు విష్ణో రురసి స్థితాయై ।

నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై నమోస్తు దామోదర వల్లభాయై ॥

భృగుమహర్షి బిడ్డయైనది, విష్ణువు వక్ష:స్థలము నధివసించి యున్నదియు, కమలములే తన ఆలయములుగా గలదియు నగు దామోదరప్రియాదేవికి నమస్కారము.

.సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ శాంతా మల్లేశ్వర స్వామి వారి  ఆర్ధ్ర అభిషేక దర్శనం. గొడుగుపేట, మచిలీపట్నం.. 11వ శతాబ్దం నాటి అతి పురాతనమైన శివాలయం.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

 రోహిణి నక్షత్రం 3 వ పాదం వారు గ్రహదోషాలు పోవడానికి పారాయణ చేయవలిసిన శ్లోకము

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

తిరుప్పావై – 13వ పాశురము

పాశురము :-

పుళ్ళిన్ వాయ్ కీణ్డానైప్పొల్లా వరక్కనై,

క్కిళ్ళి క్కళైన్దానై క్కీర్తిమై పాడిప్పోయ్,

ప్పిళ్ళైగళెల్లారుమ్ పావైక్క,ళమ్బుక్కార్,

వెళ్ళియెళు న్దువియాళముఱఙ్గిత్తు,

పుళ్ళుమ్ శిలుమ్బిన గాణ్ పోదరి క్కణ్ణినాయ్,

కుళ్ళక్కుళిరక్కుడైన్దు నీరాడాదే,

పళ్ళిక్కిడత్తియో పావాయ్ ! నీనన్నాళాల్,

కళ్ళమ్ తవిర్‍న్దు కలన్దేలో రెమ్బావాయ్

తాత్పర్యము:-

పక్షిశరీరమును ఆవేశించిన బకాసురుని నోరు చీల్చి తన్ను కాపాడుకొని, మనను కాపాడిన శ్రీకృష్ణుని, దుష్టరాక్షసుడగు రావణుని పదితలలను హేలగా చిగుళ్లు త్రుంపినట్లు త్రుంపి పారవేసిన శ్రీరాముని గానముచేయుచు పోయి మన తోడిపిల్లలందరును వ్రతక్షేత్రమును చేరినారు. లోన తుమ్మెదగల తామరపూలనుబోలిన కన్నులు గలదానా! లేడివంటి చూపులు గలదానా! శుక్రుడు ఉదయించుచున్నాడు, గురుడస్తమించుచున్నాడు. పక్షులు కూయుచున్నవి. కృష్ణవిరహతాపము తీరునట్లు చల్లగా అవగాహనమొనర్చి స్నానమొనర్పక పాన్పుపై పండుకునియుండెదవేల ? ఓ సుకుమారస్వభావా! ఈ మంచిరోజున నీవు నీ కపటముని వీడి మాతో కలసి ఆనందము ననుభవించుము.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

రాశి ఫలితాలు

29-12-2023 

శుక్రవారం (భృగు వాసరః )

మేషం

 29-12-2023

దైవదర్శనాలు చేసుకుంటారు. వృధా ఖర్చులు అదుపు చెయ్యడం మంచిది. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. మాతృ సంభంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది.

---------------------------------------

వృషభం

 29-12-2023

సంతానం పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. నూతన వాహనయోగం ఉన్నది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

---------------------------------------

మిధునం

 29-12-2023

ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా పడుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు చికాకు కలిగిస్తాయి. ధన పరమైన సమస్యలు బాధిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది చేపట్టిన పనులలో శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకోని మార్పులు ఉంటాయి.

---------------------------------------

కర్కాటకం

 29-12-2023

ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. గృహమున ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి.

---------------------------------------

సింహం

 29-12-2023

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార పరంగా భాగస్థులతో వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులు వ్యయప్రయాసలతో కానీ పూర్తికావు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

---------------------------------------

కన్య

 29-12-2023

ఆప్తుల సలహాలతో ముందుకు సాగడం మంచిది. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆకస్మిక ధన లాభాలు పొందుతారు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. విలువైన వస్తులాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఉత్సాహనిస్తుంది.

---------------------------------------

తుల

 29-12-2023

విద్యార్థులకు నూతన అవకాశములు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు.

---------------------------------------

వృశ్చికం

29-12-2023

స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. .ముఖ్యమైన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప నష్టాలు తప్పవు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఇంటా బయట బాధ్యతలు మరింతగా పెరుగుతాయి.

---------------------------------------

ధనస్సు

 29-12-2023

సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇతరులకు ధన పరంగా మాట ఇవ్వడం మంచిది కాదు.

---------------------------------------

మకరం

 29-12-2023

 చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆర్థికాభివృద్ధి కలుగుతుంది.

---------------------------------------

కుంభం

 29-12-2023

కీలక సమయంలో సన్నిహితుల  సాయం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. సంతాన విద్య ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

---------------------------------------

మీనం

 29-12-2023

ఉద్యోగాలలో అధికారులతో కొద్దిపాటి వివాదాలు తప్పవు. ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి.  అనుకోని ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. చేపట్టిన పనులలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడుతాయి.