Wednesday 27 December 2023

మీనక్షత్రానికి సంబంధించిన చెట్టు పెంచండి .సర్వ సౌఖ్యాలను పొందండి.

 



జీవి ఈ భూమ్మీదకు వచ్చేప్పుడు సూర్యుడు ఏనక్షత్రానికి దగ్గరలో వున్నాడో అది మన జన్మ నక్షత్రంగా జ్యోతిష్యశాస్త్రం తెలుపుతుంది. జీవన గమనం లో వచ్చే అన్ని మలుపులను దీని ఆధారంగా చెప్పగలిగే దివ్య శాస్త్రము జ్యోతిష్యము. ఇక జీవితములో మనిషికి దు:ఖాన్ని కష్టాలను ఎలాసంభవిస్తాయో వాటికి ఏగ్రహములకు శాంతులు చెయ్యాలో ఈశాస్త్రము లో పరిహారాలు సూచించబడతాయి. దానికనుగుణముగా మనము నక్ష్తర శాంతులు గ్రహ శాంతులు జరిపించుకుంటూంటాము.

మన నక్షత్రానికి సంబంధించిన వృక్షాన్ని స్వయంగా పెంచటం ద్వారా దోషాలేమన్నా వుంటె తొలగటమే గాక .సర్వ సౌఖ్యాలను పొందవచ్చు. ఈసూత్రాన్ని ఆచరించి ఎంతో మేలు పొందవచ్చు.మీరు పుట్టిన నక్షత్రానికి దగ్గర సంబంధమ్ గల వృక్షాన్నిపెంచితే అది పెరిగి పెద్దయ్యేకొద్దీ శుభాలను కురిపిస్తుంది మీ జీవితం లో.

మీరునాటవలసిన మొక్కనుగాని లేక ,విత్తనాన్ని గాని మీకు ఎక్కడవీలైతే అక్కడ ,రోడ్లపక్కన వీధి పక్కలన ,పార్కు,కొండ,అడవి దేవాలయం ఇలా మీకు ఎక్కడ వీలుంటే అక్కడ నాటాలి. దానిని పెరిగేలా శ్రద్ద చూపాలి. మీకు నాటాక వాటి పోషణ కు సమయము చాలకుంటే మీస్వతం దబ్బుతో దానిని పెరిగేదాకా సంరక్షించే ఏర్పాటు చేయాలి.మీ నక్షత్రం చూసుకుని ప్రతి నెల ఒక్కసారయినా ఆవృక్షాన్ని దర్శించి నమస్కరించాలి. మీరు నాటిన ప్రదేశానికి సంవత్సరం లో ఒక్కసారైనా వెళ్ళి నమస్కరించి రావాలి. మీగ్రామము లో లేదా నివాస సమీపం లో ఎక్కద ఆవృక్షము కనిపించినా నమస్కరించాలి.ఎట్టి పరిస్థితి లోనూ ఆవృక్షాన్ని దూషించటం గాని నరకటం గాని చేయరాదు.పసిపిల్లలచేత కూడా ఇలా వృక్షాన్ని నాటించిచూడండి వారి జీవితాన శుభాలు వెల్లివిరుస్తాయి. ఇది చదివిన వెంటనే మీ మిత్రులందరికీ తెలియజేయండి. మీరంతా కలసి రోడ్డుపక్కన ఒకప్రదేశములో మీ అందరి నక్షత్రాలకు సంబంధించిన వృక్షాలను సామూహికంగా పెంచటంద్వారా అందరికీ వేడుకగా వుంటుంది కూడా.


ఏనక్షత్రానికి సంబంధించిన వారు ఏవృక్షం నాటాలి

————————————–

అశ్వని – జీడిమామిడి

భరణి – దేవదారు

కృత్తిక – అత్తి [మేడి]

రోహిణి – నేరేడు

మృగశిర – మారేడు

ఆరుద్ర -చింత

పునర్వసు – గన్నేరు

పుష్యమి – పిప్పలి

ఆశ్లేష – బొప్పాయి

మఖ – మర్రి

పుబ్బ – మోదుగ

ఉత్తర – జువ్వి

హస్త – కుంకుడు

చిత్త – తాడి

స్వాతి – మద్ది

విశాఖ – మొగలి

అనూరాధ – పొగడ

జ్యేష్ఠ – కొబ్బరి

మూల – వేగి

పూర్వాషాఢ – నిమ్మ

ఉత్తరాషాఢ – పనస

శ్రవణం – జిల్లేడు [తెల్లజిల్లేడు మరీ శ్రేష్ఠం]

ధనిష్ఠ – జమ్మి

శతభిషం – అరటి

పూర్వాభద్ర – మామిడి

ఉత్తరాభాద్ర -వేప

రేవతి -విప్ప

సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment