Tuesday, 19 December 2023

తిరుప్పావై (ఆళి మళైక్కణ్ణా) 4వ పాశురము 🌷🌷

  



డిసెంబర్ 19


మార్గశి 4

గోపికలు తమ వ్రతముచే లోకమంతయు పాడిపంటలతో సమృద్దిగా వుండాలని కోరుకున్నారు.

తన వ్రతముకు స్నానము ప్రదానము కావున స్నానము చేయుటకు అనుగుణముగా

జలమును సమృద్దిగా ఉండవలెను అని భావించినారు. ఈ వ్రతమునకు ఫలముగా

అనుకుని వేరే వాటిని ఆశ్రయించక భక్తి తో భగవంతుని వినయ విదేయత కలిగివున్నారు.

వానదేవుని ఈ పాసురములో ప్రార్ధిస్తున్నారు. మరి ఈ పాసురము లో ఎలా

అడుగుతున్నారో తెలుసుకుందాము.

ఆళి మళైక్కణ్ణా! పాశురము:-

ఆళి మళైక్కణ్ణా! ఒన్ఱు నీ కై కరవేల్

ఆళి ఉళ్ పుక్కు ముగందు కొడార్ త్తేఱి

ఊళి ముదల్వన్ ఊరువం పోళ్ మెయ్ కఱుత్తు

పాళియన్ తోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్

ఆళిపొల్ మిన్ని వలమ్బురిపోల్ నిన్ఱదిరుందు

తాళాదే శారుంగం ఉదెత శరమళైపోల్

వాళ ఉలగినిల్ పెయ్దిడాయ్ నాంగళుమ్

మార్గళి నీరాడ మగిళుందేలోర్ ఎమ్బావాయ్

తాత్పర్యము :-

గంభీరమైన స్వభావము కలవాడైన వర్షము కురుయునట్టి ఓ మేఘదైవతమా!

నీవు వర్షజలముననుగ్రహించు దాత్రుత్వములో ఏ మాత్రము సంకోచము చూపించకు.

గంభీరమైన సముద్రము మద్యలోనున్న నీటినంతను బాగుగా త్రాగి గర్జించి ఆకాసమునంతను

వ్యాపింపచేయును. సమస్త జగత్తులకు కారణమైన శ్రీమన్నారాయణుని శరీరమువలె

దివ్యమైన నల్లని స్వరూపమును ధరించి ఆభగవంతుని సుందర విశాల దీర్గబాహువుల

జంటలో కుడిచేతి యందలి చక్రాయుధమువలె మెరయుచు ఎడమచేతి యందలి శంఖము

వలె మధురగంభీరముగా ఉరిమి ఆ భగవంతుని శారంగమను ధనుస్సు నుండి వెడలివచ్చు

బాణములవలె వర్షదారాలు లోకమునంతను సుఖింపజేయునట్లును.

మేము సంతోషముతో మార్ఘశీర్ష స్నానము చేయునట్లు వర్షించు. అని అండాళ్ళమ్మ

ఈ పాశురములో ప్రార్దించుచున్నది.🌷🌷

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment