దేహములోనున్న జీవుడు బయటకు పోయినప్పుడు ఆ దేహము దగ్గరకు రావడానికి భార్యకూడ భయ పడుతుంది.
మనము ఎంతో ప్రేమగా చూసుకునే భార్యాబిడ్డలు వాకిలి వరకే వస్తారు.
బంధుమిత్రులు వల్లకాటివరకే వస్తారు. కాని పరమేశ్వరుడు మనము ఎన్ని జన్మలెత్తినా కూడా మనతో ఉండి ఎప్పుడెప్పుడు మనలను తరింపచేద్దామా అని ఎన్నో ఉపాయములతో నిరంతరం మన వెంట ఉంటున్నాడు.
ఆ పరబ్రహ్మ మనలను వదలకుండా
మనం ఏ దేహము ధరించినా అందులో హృదయవాసిగా ఉంటున్నాడు.
అటువంటి పరబ్రహ్మను నేడు మనం మరచిపోయి భార్య పిల్లలు, బంధుమిత్రులు, ధనధాన్యాలు, వస్తువాహనాలు ఇవే నిత్యమనుకుని వీటి చుట్టూ తిరుగుతున్నాము.
ఫలితంగా ఏమెుస్తుంది? అసంతృప్తి, ఆందోళన, అశాంతి.
దేనిని పట్టుకుంటే జీవితమునకు సార్థకత చేకూరుతుందో దానిని పట్టుకోవాలి. దానినే పొందడానికి సాధన చేస్తుండాలి.
🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!
No comments:
Post a Comment