Wednesday 27 December 2023

వాది – ప్రతివాది


               


ఒక ఊళ్ళో ఇద్దరు దగ్గరి బంధువుల మధ్య ఆస్తి విషయమై విభేదాలు పెరిగి శత్రువులయ్యారు. అది చివరికి న్యాయస్థానంలో వాజ్యం వేసుకునేదాకా వెళ్ళింది. వాళ్ళిద్దరి మధ్య వైరం వాళ్ళని కనీసం పలకరించుకోకుండా చేసింది.

ఆ ప్రతివాది యొక్క కొడుకు పెళ్ళి కుదిరింది. అతను పెళ్ళి పత్రికను శ్రీమఠానికి తీసుకుని వచ్చి పరమాచార్య స్వామి వారి ముందు ఉంచాడు.

మహాస్వామి వారు దగ్గర నిలబడిఉన్న సేవకుణ్ణి చూసి, “బంధువులందరి ఇళ్ళకు వెళ్ళి పెళ్ళికి పిలుస్తాడేమో అతన్ని అడుగు?” అని చెప్పారు.

”అవును పెరియవ మేము బంధువులందరి ఇళ్ళకు వెళ్ళి పెళ్ళికి ఆహ్వానిస్తాము” అని చెప్పాడు.

స్వామివారు ఒక్కక్షణం మౌనం వహించి “అతని పై కేసు వేసిన వాది ఇంటికి వెళ్ళి పిలుస్తాడేమో అడుగు” అని అన్నారు.

ఆ పెద్దమనిషి కొద్దిసేపు సంశయిస్తూ, “నేను అక్కడికి వెళ్ళి అవమానపడితే అది చాలా బాధగా ఉంటుంది పెరియవ” అని బదులిచ్చాడు.

”అలాంటిదేమి జరగదు. అతనికి పెళ్ళి శుభలేఖ ఇచ్చి ఖచ్చితంగా పెళ్ళికి రావాల్సిందని చెప్పు” అని చెప్పారు స్వామివారు.

అతను అన్యమనస్కంగానే తన వాది ఇంటికి వెళ్ళాడు. పరమాచార్య స్వామివారి మాటలు గుర్తుతెచ్చుకున్నాడు. “అతిథులను అగౌరవించడం మన సంప్రదాయం కాదు. ప్రతిఒక్కరిలోను మంచితనం ఉంటుంది”

బద్ధశత్రువైన ఇతను ఇలా తన ఇంటికి వస్తాడని అతను అనుకోలేదు. అతణ్ణి చూడగానే వెంటనే గట్టిగా మనస్ఫూర్తిగా కౌగిలించుకున్నాడు. “స్వాగతం స్వాగతం” అని సంతోషంతో పలకరించి శుభలేఖ తీసుకున్నాడు. “మన శత్రుత్వాన్ని మరచి నా ఇంటికి వచ్చి మరీ నన్ను ఆహ్వానించావు. నేను ఖచ్చితంగా పెళ్ళి వేడుకకు వస్తాను” అని హామీ ఇచ్చాడు.

ఆహ్వానించడానికి వెళ్ళిన ఆ వ్యక్తి మనసు మార్చుకున్నాడు. “ఎంత మంచి సంస్కారమున్న వ్యక్తి. నేను అనవసరంగా ఇతనితో గొడవ పెట్టుకుని శత్రుత్వం పెంచుకున్నాను” అని అనుకున్నాడు. అతనితో ఇలా అన్నాడు. “అన్నా! కేసు కోర్టుల గురించి మరచిపోదాం. ఆ విషయాన్ని సావకాశంగా మనమే పరిష్కరించుకుందాం” అని ఇద్దరు పరమాచార్య స్వామికి నమస్కారం చేసారు.

--- ‘ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డివైన్’ పరమాచార్య అనుభవాల సంగ్రహం

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం।

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం॥

🙏కంచిపరమాచార్యవైభవం


సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment