Wednesday 27 December 2023

శివుడిని ఎలా ధ్యానించాలి ?




శివుడిని కూర్చుని ధ్యానించాల లేక పడుకుని కూడా ధ్యానించవచ్చ అనే సందేహంలో నేను ఉన్నప్పుడు నాకు ఒక అద్భుతం జరిగింది.

అదేమిటంటే నేను శ్రీ రుద్రం ఎంతో శ్రద్ధగా వింటూ ఉన్నప్పుడు

"ఆసీనేభ్యహ్ శయానేభ్యశ్చ వో నమో నమః " అనే వాక్యాన్ని విన్నాను..అది వినగానే నేను నేనుగా లేను. ఈశ్వరా ! మాటల్లో చెప్పలేను ఆ అనుభూతిని.

ఆ వాక్యం అర్థం ఏమిటంటే కూర్చుని ఉండేది శివుడే,పడుకుని ఉండేది కూడా శివుడే.(అలాంటప్పుడు నేను ఎక్కడ ఉన్నాను).

ఆ శివుడికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం. ఎంత గొప్ప అర్థమో చూశారా.

ఈ విషయాన్ని తెలుసుకున్నాక ఇక నేను కూర్చుని ఉండడం ఏమిటి,నేను పడుకుని ఉండడం ఏమిటి..అంతా ఆయనే..ఈశ్వరుడే..ఈ భావనే మనిషిలో పరిపూర్ణమైన ఈశ్వర శరణాగతిని కలిగిస్తుంది. ఈ శరణాగతియే 

మనిషిలోని "నేనే ఇది చేస్తున్నాను" అనే అహంకారాన్ని కాల్చి బూడిద చేస్తుంది.

ఇంతకూ శివుడిని ఎలా ధ్యానించాలి? మీరు ఏది చూస్తూ ఉన్నా, ఏది వింటూ ఉన్నా, ఏమి చేస్తూ ఉన్నా, అదంతా శివ స్వరూపంగా భావన చేస్తూ

చూస్తూ ఉండాలి. ఇదే నిజమైన శివ ధ్యానం.

శ్రీ రుద్రంలో ఎంతో లోతైన అర్థం మరియూ అద్వైత జ్ఞానం దాగి ఉందండీ. 

ఆ అర్థాన్ని తెలిసి శ్రీ రుద్రం చదివినప్పుడే మన జన్మధన్యమవుతుంది.

ఓం నమశ్శివాయ 🙏

సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment