శంకరుల నోట పలికిన లక్మీ స్తోత్రమే కనకధారా స్తోత్రం. లక్మీ కటాక్షాన్ని కోరుకునేవారు ప్రతి రోజు కనకధారా స్తోత్రాన్ని పఠిస్తే దారిద్ర్యం దరిచేరదు.
మానవాళికి కనకధారా స్త్రోత్రం ఓ పెద్ద వరం. దీనిని క్రమంతప్పకుండా నిష్టగా పారాయణం చేసిన వారి ఇంట్లో కనక వర్షమే.
మొత్తం స్తోత్రంలో 25 శ్లోకాలున్నాయి. ఇందులో మొదటిది హయగ్రీవ స్తోత్రం. చివరిది ఫలశ్రుతి. ఈ రెంటినీ మినహాయిస్తే 23 శ్లోకాలు.
అంగం హరే: పులక భూషణ మాశ్రయంతీ
భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ ।
అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా
మాంగల్యదా౭స్తు మమ మంగళదేవతాయా: ॥
నీలమేఘశ్యాముడైన హరిని తన చూపులతో చుట్టివేసిన మంగళమూర్తి, సకలసిద్ధిస్వరూపిణి అయిన శ్రీలక్ష్మీదేవి నాకు సమస్త సన్మంగళములను ప్రసాదించును గాక !
నమోస్తు దేవ్యై భృగు నందనాయై నమోస్తు విష్ణో రురసి స్థితాయై ।
నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై నమోస్తు దామోదర వల్లభాయై ॥
భృగుమహర్షి బిడ్డయైనది, విష్ణువు వక్ష:స్థలము నధివసించి యున్నదియు, కమలములే తన ఆలయములుగా గలదియు నగు దామోదరప్రియాదేవికి నమస్కారము.
.సర్వేజనా సుఖినో భవంతు
No comments:
Post a Comment