Thursday, 28 December 2023

ఏనక్షత్రం_నాడు_పితృదేవతలను_పూజిస్తే_ఏఫలం_లభిస్తుంది_అనేది_మహాభారతం_కూర్మపురాణం_చెబుతున్నాయి.

 



1)అశ్విని: వాహనాలు కావాలనుకున్న వారు అశ్వినీ నక్షత్రం ఉన్నప్పుడు తల్లి తండ్రుల సేవ చేయాలి.

2)భరణి: ఆయువు కావలసిన వారు భరణిలో అమ్మానాన్నలను అర్చించాలి.

3)కృత్తిక: అగ్నిసహితంగా కుమారునితో కలసి పితరులను కృత్తిక ఉన్నప్పుడు అర్చిస్తే రోగశోకాలు లేనివాడవుతాడు.

4)రోహిణి: సంతానం కావాలనుకున్నవారు తమ పితరులను రోహిణీ నక్షత్రం ఉన్నప్పుడు ప్రార్థించాలి.

5)మృగశిర: బ్రహ్మతేజస్సు కలుగుతుంది.

6)ఆర్ద్ర: శౌర్యం కావాలనుకున్నవారు ఆరుద్రా నక్షత్రం ఉన్నప్పుడు అర్చించాలి. అంటే పోలీసులు, సైన్యం, అగ్నిమాపకదళం, భద్రతాదళాలు, అంగరక్షకులు వంటి వృత్తులలోని వారు ఈ రోజు తమ తల్లితండ్రులను పూజించాలి. దీని వల్ల శూరత్వం కలిగి తమ శౌర్యవృత్తుల్లో రాణిస్తారు.

7)పునర్వసు: ధనం, భూమి కావాలనుకున్న వారు పునర్వసులో పెద్దలను సేవించాలి.

8)పుష్యమి: తాతముత్తాలను పుష్యమి నాడు సేవిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం, పుష్టికలుగుతుంది.

9)ఆశ్రేష: ఈ నక్షత్రం ఉన్నప్పుడు అమ్మానాన్నలను ప్రసన్నం చేసుకుంటే ధీరులైన పుత్రసంతానం, సర్వ కోరికలూ తీర్చే కుమారులు కలుగుతారు.

10)మఖ: తన దాయాదులలో మేటి కావాలను

కున్న వారు మఖనాడు పితరుల అర్చన చేయాలి.

11)పుబ్బ: పాపనాశనం, సౌభాగ్యం పుబ్బ వల్ల కలుగుతాయి.

12)ఉత్తర: సంతానధనాలు ఉత్తరానక్షత్రం వల్ల కలుగుతాయి.

13)హస్త:తన కులంలో శ్రేష్ఠత్వం హస్తా నక్షత్రం ద్వారా పొందుతారు.

14)చిత్త: అందమైన కొడుకులు కావాలనుకున్న వారు చిత్తా నక్షత్రంలో పెద్దలను సేవిస్తే సౌందర్యంకల పుత్రులు  అనేకం కలుగుతారు.

15)స్వాతి: వ్యాపారాల వృద్ధిని స్వాతి కలిగిస్తుంది. (ఉద్యోగాలలో వృద్ధి కూడా కలుగుతుంది.)

16)విశాఖ: స్వర్ణరజతాలు పొందవచ్చు. అలాగే అనేక మంది పుత్రులు విశాఖ నక్షత్రం నాడు సేవిస్తే కలుగుతాయి.

17)అనూరాధ: రాజ్యాధికారం, మంచి మిత్రులను అనూరాధ ద్వారా పొందవచ్చు.

18)జ్యేష్ఠ: సర్వసమృద్ధి, కోరుకున్న రంగంలో అధిపతి కావాలంటే జ్యేష్ఠా నక్షత్రంలో అర్చన చేయాలి.

19)మూల: ఆరోగ్యం, చేసే కృషి ఫలించాలంటే మూలా నక్షత్రంలో మ్రొక్కాలి.

20)పూర్వాషాఢ: సమృద్దీ కీర్తిప్రతిష్ఠలు కలుగడానికి పూర్వాషాఢలోని పితృదేవతార్చన తోడుపడుతుంది.

21)ఉత్తరాషాఢ: నిశ్శోకవంతుడు, శుభగృహం (మంచి ఇల్లు) పొందాలి అంటే ఉత్తరాషాఢలో తాతముత్తాల ఆశీర్వచనాలు పొందాలి.

22)శ్రవణం: బ్రతికినన్నాళ్ళూ శ్రేష్ఠత్వం అనంతరం స్వర్గప్రాప్తి శ్రవణం నాటి మాతాపితరుల సేవ కలిగిస్తుంది.

23)ధనిష్ఠ: రాజ్యప్రాప్తి. నేడు రాజకీయాల్లో రాణించాలనుకున్న వారు ధనిష్ఠ నక్షత్రం ఉన్నప్పుడు అమ్మానాన్నలను సేవించాలి. వారికి పదవీయోగం కలుగుతుంది. 

24)శతభిషం:వైద్యులు హస్తవాసి కోసం అమ్మానాన్నలను శతభిష నక్షత్రం ఉన్న సమయంలో అర్చించాలి. మహాబలవంతులు అవుతారు. 

25)పూర్వాభాద్ర: మేకలు గొర్రెలు వంటివి పొందవచ్చు. అంటే యానిమల్ హజ్బెండరీస్ కు చెందిన వారు పూర్వాభాద్రలో పితరులను అర్చిస్తే వారి అనుగ్రహంతో పశువుల మందలు,వ్యవసాయం  వృద్ధిపొందుతాయి. 

26)ఉత్తరాభాద్ర: గోసంపద వృద్ధి అవుతుంది.

27)రేవతి: వెండి బంగారం ఇతర వజ్రవైఢూర్యాదులు పొందాలంటే రేవతిలో అమ్మానాన్నల ఆశీర్వాదాలు పొందాలి.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment