Saturday, 16 December 2023

"మాసానాం మార్గశీర్షోహం"

 


"13-12-2023 నుండి 11-01-2024 వరకు మార్గశిర మాసం." 

శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం మార్గశిరం. ఈ మాసంలో ఎన్నో పర్వదినాలు వచ్చి అందరికీ ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతాయి. అందుకే ఈ మాసంలో, ప్రతి దినం శుభదినం గానే భావిస్తారు.

భగవద్గీత మన జీవనగీత. పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వారికి, గీత మార్గదర్శి. గీతే చుక్కాని. శరీర అభివృద్దికి తల్లి పాలు ఎంత ముఖ్యమో, బుద్ది వికాసానికి, ఆత్మజ్ఞానానికి భగవద్గీత, అంతకంటే ఎక్కువ ఉపయోగపడుతుంది. అలాంటి భగవద్గీత ప్రపంచానికి అందిన రోజు ఈ మాసంలోనే. 

భగవంతుని ఆరాధకులకు ఎంతో ముఖ్యమైన ధనుర్మాసం కూడా, ఈ మాసంలోనే ప్రారంభం అవుతుంది. ధనుర్మాసంలో తిరుప్పావై పఠనం, ఆండాళ్ పూజ మొదలైన క్రతువులు భక్తులకు మానసిక ఉల్లాసం కలిగిస్తాయి. 

మార్గశిర మాసంలో పంచమి రోజున నాగపంచమి జరుపుకుంటారు. నాగుపాములను పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. షష్ఠి రోజున సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించడం ఆనవాయితీ. అష్టమి రోజును కాలభైరవాష్టమిగా జరుపుకుంటారు. 

అంతే కాదు వైకుంఠ ద్వారాలు తెరుచుకునే పరమాద్భుతమైన సుదినం ఏకాదశి. ఈ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, మోక్ష ఏకాదశి అని వివిధ పేర్లతో పిలుచుకుంటారు.

ఈ మాసంలోనే మత్స్య ద్వాదశి, హనుమద్వ్రతం, దత్తాత్రేయుని ఆవిర్భావం, తదితర పర్వదినాలు వస్తున్నాయి. అందుకే ఈ మాసాన్ని ఆధ్యాత్మిక మాసంగా భావిస్తారు. 

సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment