మానవ జీవితం మీద గ్రహాల ప్రభావం తప్పకుండా ఉంటుంది.
కానీ నువ్వు అనుభవించే ఫలితాలు కి గ్రహాలకి సంబంధం ఉండదు. నీ గత జన్మ, ప్రస్తుత జన్మ చేసే కర్మల ఆధారంగానే గ్రహాలు ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది.
నీ గత జన్మ చరిత్ర కి ప్రస్తుత జన్మకి మధ్యన ఉండే వారదే గ్రహాలు.
ఇక్కడ నీ జీవితానికి నువ్వే కీలకం.
మరి జ్యోతిష్య శాస్త్రం ఎక్కడ ఉపయోగపడుతుంది?
1. నీ జీవితం స్థూలంగా ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.
2. జీవితంలో జరిగే పెళ్లిలకే పేరంటాలికే లాంటి ముఖ్య సంఘటనకి ముహూర్తాలు పెట్టడానికి ఉపయోగపడుతుంది.
3. నీ శారీరిక మానసిక స్థితిని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది.
4. గ్రహణాలు, వాతావరణం, తుఫాన్లు లాంటి మొదలైన భౌగోళిక, ఖగోళ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
5. జ్యోతి శాస్త్రాన్ని లోతుగా అధ్యయనం చేసి, మీ జీవితానికి అనువదించుకుంటే ఆధ్యాత్మిక ప్రగతికి ఉపయోగపడుతుంది.
అంతేగాని ఇవేమీ అర్థం చేసుకోకుండా..నీ కోరికలకు తగ్గట్టుగా గ్రహాలు స్పందించవు.
నీ కోరికలకి గ్రహాలకి సంబంధం ఉండదు. గ్రహాలకి చాలా పెద్ద పనులు ఉన్నాయి. ఈ విశ్వ వ్యవస్థ సక్రమంగా జరిగేటట్టు చూసే బాధ్యత గ్రహాలకి ఉంది.
అంతేగాని గ్రహాలు కేవలం మనిషి కోసం పుట్టలేదు.
జ్యోతిష్యాన్ని కేవలం "ప్రేడిక్షన్" కోసం ఉపయోగిస్తే మనం "అడిక్షన్" అవుతాము
No comments:
Post a Comment