Wednesday, 27 December 2023

మహాప్రస్థాన పర్వం.




🌹పాండవుల ప్రస్థానం హిమాలయాల్లో ఊర్ధ్వముఖంగా సాగుతున్నది.


🌿పాండవులూ  వారితో కూడి శునకము నడుస్తూ వుండగా,  మార్గమధ్యంలో ద్రౌపది ప్రస్థానం ముగిసి,  మహాప్రస్థానంకి చేరుకున్నది.  అది చూసి భీమసేనుడు,  ' అగ్రజా ! ద్రౌపది ధర్మ తత్పరురాలు, పతివ్రతా కదా ! ఆమె అక్కడే ఎందుకు ఆగిపోవలసి వచ్చింది.  ' అని అడిగాడు. 

🌸ధర్మజుడు కొద్ధిసేపు మౌనం వహించి, భీమసేనుడు గుచ్చి గుచ్చి అడుగగా,  ' భీమసేనా ! ఆమె అంతరాంతరాలలో అర్జునుని పై ప్రియత్వం యెక్కువగా వున్నది.  ఆ పక్షపాతబుద్ధి వలన ముందుకు రాలేక పోయింది. '  అని సమాధానమిచ్చాడు. 

🌿ఆపై కొద్ధిదూరం వెళ్ళగానే, సహదేవుడు పడిపోయాడు.  మళ్ళీ భీముని సందేహం తీర్చడానికి,  ' సహదేవునిలో అహంకారం పాలు యెక్కువగా వున్నది.   అందువలన మనతో ప్రస్థానం కొనసాగించ లేకపోయాడు. '   అని చెప్పాడు ధర్మరాజు.   

🌸మరి కొద్ధి దూరం వెళ్ళగానే, నకులుడు యిక ముందుకు రాలేక ఆగిపోయాడు.  భీముడు మళ్ళీ అడుగగా  , ' భీమసేనా ! నకులుడు అందరిలోకీ శ్రేష్ఠుడు.  అయితే, అతనికి తన శారీరిక అందం మీద అభిమానం యెక్కువగా వున్నది.  అదే అతని పతనానికి కారణం. '  అని చెప్పాడు. 

🌿ఇంకొద్దిదూరం వెళ్ళగానే, అర్జునుడు పడిపోయాడు.  ' అన్నా ! అర్జునుడు కూడా పడిపోయాడు.  అర్జునునిలో కూడా బలహీనతలు వున్నవా ? '  అని ఆశ్చర్యంగా అడిగాడు, భీమసేనుడు.  '  అర్జునుడు తాను అమిత పరాక్రమ వంతుడనని విర్రవీగుతూ,  ఇతరుల శక్తి సామర్ధ్యాలను వొప్పుకునేవాడు కాదు. '  అని చెప్పి  భీమసేనునితో, శునకము తో సహా యింకా ముందుకు వెళ్ళసాగాడు. 

🌸మరి కొద్ధి దూరానికి, భీమసేనుడు కూడా ముందుకు రాలేకపోయాడు.   భీమసేనుడు ఆగిపోతూ, నాలో యేమి బలహీన వున్నది  అగ్రజా !   నేనెందుకు మీతో రాలేక పోతున్నాను. '  అని భారమైన కంఠంతో పెద్దగా అడిగాడు ధర్మజుని.  

🌿 ' నాయనా ! భీమసేనా ! నీ భోజన ప్రియత్వం, అసహజమైన క్రోధ అహంకారాలు,  నీ పతన హేతువులు. '  అనిచెప్పి ముందుకు సాగాడు, ధర్మరాజు.   తోక ఆడించుకుంటూ, శునకం కూడా ఆయనను వెంబడించింది. 

🌸అలా ముందుకు వెళ్లగా, వెళ్లగా,  మేరుపర్వతాన్ని సమీపించేసరికి, స్వయంగా ఇంద్రుడే, తన రధాన్ని తీసుకుని యెదురుగా వచ్చి,  ' ధర్మరాజా ! నేను మహేంద్రుడను. నిన్ను స్వయంగా సశరీరంగా స్వర్గానికి తీసుకు వెళదామని వచ్చాను.  నీవాళ్లంతా, వారి సూక్ష్మ శరీరాలతో, ఈ సరికే స్వర్గానికిచేరారు.  

🌿రా !  రధమెక్కు.  మా సురలోకాన్ని పావనము చెయ్యి. ' అని అడిగాడు. 

' నీ ఆదరణకు చాలా సంతోషం మహేంద్రా ! అయితే, నాతో పాటు, ఒక అనుకోని అతిధి కూడా వున్నాడు. ఆ జీవిని కూడా మీరు రధంలోనికి అనుమతిస్తే, నేను కూడా వస్తాను. ' అని వినయంగా అన్నాడు.  

🌸ఎవరని అడుగగా, శునకాన్ని చూపించాడు ధర్మరాజు.  మహేంద్రుడు నవ్వుతూ, స్వర్గంలో  జంతుజాలంకి ప్రత్యేక అనుమతులు లేవు ధర్మజా !  ' అని అనగానే, తాను కూడా స్వర్గాన్ని త్యజించడానికి సిద్ధపడ్డాడు, ధర్మరాజు. 

🌿వెంటనే, శునకం రూపంలో వున్న ధర్మదేవత ప్రత్యక్షమై, ధర్మరాజును ఆశీర్వదించి,  ఈ నీ త్యాగబుద్ధే నిన్ను నిరంతరం కాపాడింది.  శుభం భూయాత్. '  అని ఆశీర్వదించి, స్వర్గలోకానికి వెళ్లే రధం యెక్కడానికి ధర్మరాజుకు సహాయపడి, అంతర్ధానమయ్యాడు.  ఇంద్రునితో సహా, ధర్మరాజు స్వర్గానికి సశరీరంగా వెళ్ళాడు. 

మహాప్రస్థానం పర్వం సమాప్తం.

🌹స్వర్గారోహణ పర్వం ;🌹

🌸బొందితోనే స్వర్గానికి చేరిన ధర్మరాజు,  తన శరీరంతోనే స్వర్గంలో తిరుగుతూ,  సర్వ సుఖాలు అనుభవిస్తున్న దుర్యోధనుని చూసాడు.  

🌿నరకకూపం లోనికి కూడా తొంగి చూసాడు ధర్మరాజు.   అక్కడ నరకంలో బాధలను అనుభవిస్తున్న తన తమ్ములను, ద్రౌపదిని చూసాడు. '  ఇక్కడకు వచ్చినా నా మనసుకు కలతచెందే విషయాలే గోచరిస్తున్నాయి. '  అని బాధపడ్డాడు. 

 🌸అయితే, మహేంద్రుని ద్వారా ' జీవుడు పుణ్య పాపాలలో యేది తక్కువగా చేస్తే, దానిని ముందుగా అనుభవిస్తారు ' అని తెలుసుకుని వూరట చెందాడు.  

🌿ఆ  విధంగా స్వర్గ నరకాలలో తన వాళ్ళందరినీ చూసాడు, ధర్మరాజు. 

ఆ తరువాత, మహేంద్రుని యేర్పాట్లపై,  దివ్య మందాకినీ జలాలతో పవిత్రస్నానం చేసి, తన దేహం వదిలివేసి,  దివ్యదేహంతో, దేవతామూర్తిగా శోభించి  నిత్యశాంతిని అనుభవించాడు, ధర్మరాజు. 

🌸  తన పరివారమంతా కొంతకాలానికి దేవతామూర్తుల వలే స్వర్గానికి చేరగా,  అందరూ మదమాత్సర్యాలు లేని స్వర్గసుఖాలు అనుభవించారు. 

🌿అని ఈ విధంగా మహాభారతగాధను సర్పయాగంలో వైశంపాయనుడు జనమేజయునకు వినిపించాడని, శౌనకాది మహామునులకు, సూతమహర్షి, నైమిశారణ్యంలో చెప్పాడు.  

🌸ఈ మహాభారతగాధను భక్తి శ్రధ్ధలతో విన్నవారికి అన్నింటా జయం కలుగుతుందనీ, అంతమున మోక్షం సిద్ధిస్తుందని,  ఫలశ్రుతి కూడా చెప్పాడు. ..🚩🌞🙏🌹🎻

🙏🌹మంగళం మహత్. 

శుభం భూయాత్.....🌹🙏

సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment