Thursday, 21 December 2023

జోతిష్యంలో నవాంశ చక్ర ఫలితాలు..



- రాశి చక్రంలోనూ నవాంశ చక్రం లోను ఒకే లగ్నమైతే అది వర్గోత్తమ లగ్నం.

ఈ వర్గోత్తమ లగ్నం ధనం, పేరు ప్రఖ్యాతలు ఇస్తుంది. ఈ సందర్భంలో  లగ్న అధిపతి శుభుడు అయితే, మనిషి మంచివాడు అవుతాడు. లగ్నాధిపతి పాపి అయితే ఆ వ్యక్తి  క్రూరుడు  అవుతాడు.

వర్గోత్తమ గ్రహం రాశిలోనూ, నవాంశలో, ఒకే రాశిలో ఉంటే అది వర్గోత్తమం.  ఇటువంటి గ్రహం, దశ అత్యంత శక్తివంతంగా పని చేస్తుంది. ఆ దశ అంతర్దశలు బాగా యోగిస్తాయి.

రాశి చక్రంలో నీచలో ఉన్నా, గ్రహాలు నవాంశలో ఉచ్చ లో ఉంటే, నవాంశ లో స్వస్థానంలో ఉన్నా ఆగ్రహానికి నీచ లేనట్లే.

ఆ గ్రహ దశలో ఉచ్చ, స్వస్థాన ఫలితాలు కలుగుతాయి. ఆ గ్రహ దశ అద్భుతంగా యోగిస్తుంది.

రాశిలో ఉచ్చ లేదా స్వస్థానంలో ఉన్నప్పటికీ ఆగ్రహం నీచలో ఉంటే ఆ గ్రహ దశ అద్భుతంగా యోగిస్తుంది.

రాశీ లో గ్రహం ఉచ్చ లో ఉండి, నవాంశ లో నీచంలో ఉంటే ఆ గ్రహం యోగించదు.

నవాంశలో రెండు గ్రహాలు పరివర్తన చెందుతే ఆ దశ రాజ యోగాన్ని ఇస్తుంది.

ఏదయినా జాతకంలో లో గురువు గాని, చంద్రుడు గాని, వర్గోత్తమం పొందుతే ఆ జాతకం గొప్ప జాతకం కింద భావించాలి. గురు, చంద్రులు ఇద్దరు వర్గోత్తమం పొందితే అది ఇంకా చాలా గొప్ప జాతకం కింద భావించాలి  ఒక గ్రహం

 నవాంశలో కారకుడుతో  కలిసినా,  దృష్టిపొందినా ఆ కారకత్వాలు బాగా వృద్ధి చెందుతాయి.

ఆంటే ఉదాహరణకు రాశిలోని ద్వితీయాధిపతి ధన కారకుడు, గురువుతో నవాంశలో కలిసిన లేదా వీక్షించినా గొప్ప ధనవంతుడు అవుతాడు.

అలాగే రాశిలోని సప్తమాధిపతి తో వివాహ కారకుడు శుక్రుడు నవాంశలో కలిసినా లేదా ఈ వీక్షణం పొందినా మంచిభార్య, భార్య మూలక ధనం లభిస్తాయి.

నవాంశ చక్రంలో సప్తమంలో పాప గ్రహాలు ఉండడం వలన వివాహ సౌఖ్యం ఉండదు.

రాశిచక్రంలోని దశమాధిపతి నవాంశలో ఏ రాశిలో ఉంటాడో ఆ రాశీ అధిపతికి సంబంధించిన వృత్తి ఉంటుంది.

నవాంశలో రాహు కేతువులలో  ఒకరు కుజుడితో కలిసినా కన్యా లేదా మిధునం లో ఉంటే స్కిన్ ప్రాబ్లెమ్ ఉంటుంది.

నవాంశలో శని చంద్రులు కలిసి ఉంటే జాతకుడు పిసినారి దురాశ గలవాడు ఔతాడు.

నవాంశలో గురు స్వక్షేత్రములో లేదా ఉచ్చలో ఉంటే జాతకుడు ఖచ్చితంగా  గొప్ప స్థాయికి చేరతాడు.

నవాంశలో శుక్రుడు రాహు కేతువులు లో ఒకరితో కలిసి ఉంటే అన్య కుల వివాహం జరిగి తీరుతుంది.

నవాంశలో శని సింహంలో ఉండడం మంచిది కాదు, కానీ  వర్గోత్తమం చెందితే మంచిదే.

నవాంశలో రవి ఉచ్చలో ఉంటే విశాలమైన నుదురు ఉంటుంది.

పురుషుని నవాంశలో భార్య స్వభావం సహకారం, స్త్రీ నవాంశలో భర్త స్వభావం సహకారం తెలుస్తాయి.అలాగే అత్తమామల సహకారం తెలుస్తుంది

నవాంశ చక్రం లోని నవాంశ లగ్నాధిపతి స్వస్థానం లేదా ఉచ్చ లో ఉంటే మంచి భార్య లేదా భర్త లభించే యోగం ఉంటుంది.

నవాంశ లగ్నాధిపతి నవాంశలో స్వక్షేత్రము లేదా ఉచ్చలో ఉండి 

రాశి చక్రంలో కేంద్ర కోణాల్లో ఉంటే 22 సంవత్సరాల లోపల వివాహం అవుతుంది.

నవాంశ చక్రంలో నవాంశ లగ్నాధిపతి మిత్ర క్షేత్రాల్లో ఉండి రాశిలో లో కేంద్ర కోణాల్లో ఉంటే 25 సంవత్సరాల లోపల వివాహం అవుతుంది.

నవాంశలోని నవాంశ లగ్నాధిపతి రాశి చక్రంలో నీఛలో ఉంటే బాగా ఆలస్యంగా  వివాహం అవుతుంది.

నవాంశ లగ్నాధిపతి నవాంశలో 6, 8 స్థానాల్లో ఉంటే భార్యతో విడాకులు లేదా ఎడబాటు కలుగుతుంది.

నవాంశ చక్రం లోని లగ్నాధిపతి రాశి చక్రంలో ద్వితీయంలో ఉంటే వివాహం తర్వాత ధన వంతులు అవుతారు.

రాశీ చక్రంలోని లగ్నాధిపతి నవాంశలో నీఛలో ఉన్నా రాహు కేతువులతో కలిసి ఉన్నా వివాహ సమయాల్లో తీవ్రమైన గొడవలు జరుగుతాయి,ఆ వివాహం లో సుఖం ఉండదు.

నవాంశ చక్రంలో స్వంత నక్షత్రం లో గల గ్రహ దశ ఉఛ్ఛ గ్రహ ఫలితాలను ఇస్తుంది.

వివాహ సౌఖ్యం:-లేదా అసౌఖ్యం,

 నవాంశలో: 

ఇవి స్త్రీ పురుషులు ఇద్దరికీ వర్తిస్తుంది.

నవాంశ లగ్నాధిపతి నవాంశలో వ్యయం లో ఉంటే జీవిత భాగస్వామితో సుఖం ఉండదు.

నవాంశ లగ్నాధిపతి పాపి అయి పాప గ్రహాలతో కలిసి ఉంటే భార్య లేక భర్త గయ్యాళి గంపల్లాగా, లేదా ఉన్మాదంగా తయారయి విడిపోతారు. 

లేదా మాటలు లేకుండా జీవితాంతం ఉండాల్సి ఉంటుంది.

నవాంశ లగ్నాధిపతి శుభుడై నవాంశలో కేంద్ర కోణాల్లో ఉంటే వివాహ సౌఖ్యం అద్భుతంగా ఉంటుంది.

నవాంశ లగ్నాధిపతి శుభుడై 

శుభగ్రహాలతో కలిసి ఉంటే తీయటి వివాహ బంధం ఉంటుంది.

స్త్రీ లేదా పురుషులకు నవాంశలో చంద్రుడు నీఛలో ఉంటే వివాహ సౌఖ్యం ఉండదు.

నవాంశ లగ్నాధిపతి రాశి చక్రంలో 2 ,9 ,11 అధిపతులతో ఏ ఒక్కరితో కలిసి ఉన్న అత్తవారింటి నుండి భారీ కట్నం వస్తుంది.

అత్తమామల సహకారం బాగా ఉంటుంది. పై సందర్భంలో రాశీలో కలిసి ఉన్న గ్రహాలలో ఏ ఒక్క గ్రహం కూడా రాశిలో నీఛ పడకూడదు.

పురుషులకు నవాంశ లగ్నం వృషభ తులలో ఒకటైతే స్ర్తీ వలన వేధింపులు తప్పవు.

స్త్రీలకు నవాంశ లగ్నం మేషం లేదా వృశ్చికం అయితే  భర్త వలన వేధింపులు ఉంటాయి.

నవాంశలో సప్తమంలో కుజ బుధులు కలిసి ఉంటే త్వరలోనే కచ్చితంగా విడాకుల అవుతాయి.

నవాంశలో సప్తమంలో రవి చంద్రులు ఇద్దరు ఉంటే చక్కని వివాహ సౌఖ్యం కీర్తి విలువైన ఆస్తులు లభిస్తాయి.

నవాంశ లో రవి చంద్రులు వర్గోతమంగా ఉంటే రాజ యోగం.

నవాంశలో పంచమాదిపతి శుభ గ్రహాలు చూస్తుంటే సంతానం వలన సుఖం ధనం లభిస్తాయి.

అదే పంచమాధిపతిని పాప గ్రహాలు చూస్తే పిల్లల వలన కష్టాలు అవమానాలు అసౌఖ్యం భయం కలుగుతాయి.

నవాంశలో 1 ,5, 9 లోని పాప గ్రహాలు వెనక ఉన్న భావాలను అనగా 12 ,4 ,8 లను దెబ్బతీసి

ఆయా కారకత్వాల శుభాలు లభించకుండా చేస్తాయి.

రాశిలోని సప్తమాధిపతి నవాంశలోని కేంద్రాలలో లేదా కోణాల్లో ఉండి వర్గోత్తమం చెందితే గొప్ప పేరు ప్రఖ్యాతులు భాగ్య యోగం గల సంతానం పుడతారు. సంతానం పుట్టడం తోటే కలిసి వస్తుంది.

ఏ రాశిలో నైనా ఐదవ నవాంశలో ఉన్న గ్రహ దశ రాజయోగం ఇస్తుంది.

స్త్రీ నవాంశ పరిశీలన🙏

స్త్రీలకు నవాంశలో సప్తమాధిపతి రవి అయితే భర్త సౌశీల్యం కలిగి ఉంటారు.

నవాంశలో సప్తమాధిపతి చంద్రుడైతే భర్త అందమైన వాడు కామవాంచలు కలిగి గుణవంతుడు అవుతాడు.

సప్తమాధిపతి కుజుడు అయితే అనగా సప్తమ స్థానం మేష వృశ్చిక లో ఒకటైతే భర్త మంచి సాహసి పొగరుబోతు జగడాల కొరివి అవుతాడు.

సప్తమం ధనస్సు మీనంలో ఒకటైతే  భర్త మంచి సౌశీల్యం కలిగి ఆస్తి  కలవాడు అవుతాడు.

 సప్తమం కన్య మిధునాలలో ఒకటైతే భర్త మంచి తెలివి కల మాటకారి , అందమైన వాడు అవుతాడు.

వృషభ తుల అయితే అందమైన వాడు భార్యను ప్రేమగా చూస్తూ ఉండేవాడు అవుతారు.

మకర కుంభాలలో ఒకటైతే తనకంటే బాగా పెద్దవాడు రోగిష్టి,బద్దకస్తుడు అవుతాడు.

రాశి లగ్నం మరియూ నవాంశ లగ్నం🙏

చివరిగా రాశిచక్రంలోని లగ్నానికి నవాంశ లగ్నం 12 అయితే జాతకుడికి అన్ని దురలవాట్లు ఉంటాయి. జీవితంలో పైకి రావడం కష్టం

రాశి లగ్నానికి నవాంశ లగ్నం తొమ్మిదవది అయితే జాతకుడు తెలివి మంచితనం అదృష్టం కలిగి ఉంటాడు

రాశీ లగ్నానికి నవాంశ లగ్నం11 అయితే జాతకుడు పుణ్య జీవి మోక్షం పొందే అవకాశం ఉంటుంది.

నవాంశ లగ్నానికి రాశి లగ్నం ఏడవది అయితే నీచుడు పాపి,ఔతాడు అని అర్దం చేసుకోవచ్చు.ఓం శనైచ్చరాయనామః

నవాంశ గోచారం .

గ్రహాలు నవాంశలో ఒక్కో గ్రహం గోచారంలో ఉండే సమయం పరిశీలన చేయాలి.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371


No comments:

Post a Comment