Thursday 21 December 2023

జ్యోతిష్యం

 



జ్యోతిష్యం లేదా జోస్యం , భవిష్యత్తును తెలుసుకొనుటకు ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది విశ్వసించే విధానం. ఇది నిర్దిష్టమైన హిందూ ధర్మ శాస్త్రము. జీవి జీవితంలో జరిగినది, జరుగుతున్నది, జరగబోయేదీ జననకాల గ్రహస్థితి ప్రకారము, శరీర లక్షణాలు, అర చేతులు, మొదలగు వివిధ అంశాలను ఆధారం చేసుకొని చెప్పబడుతుంది. ఆరు వేదాంగాలలో జ్యోతిష్యం ఒకటి. ఇప్పటికీ ఆదరణ పొందుతున్న ప్రాచీనశాస్త్రాలలో ఇది కూడా ఉంది. మొట్టమొదటిగా జ్యోతిష్య శాస్త్రాన్ని గ్రంధరూపంలో వరాహమిహిరుడు అందించాడు. హిందూ సాంప్రదాయాల, విశ్వాసాలలో జన్మ సిద్దాంతం ఒకటి. జన్మసిద్దాంతం ప్రకారము పూర్వ జన్మ పాపపుణ్యాల ప్రభావం ప్రస్తుత జన్మలో ఉంటుంది. దానికి తగిన విధంగా, తగిన సమయంలోనే జీవి జననం ఈ జన్మలో జరుగుతుంది. అనగా అటువంటి గ్రహస్థితిలో జీవి జననం జరుగుతుంది. ఇది అంతా దైవలీలగా హిందువులు భావిస్తారు. కావున ప్రతి జీవి భూత భవిష్యత్ వర్థమాన కాలములు జననకాల గ్రహస్థితి ప్రకారము జరుగుతాయి. ఇది హిందువుల ప్రగాఢ విశ్వాసము.హస్తసాముద్రికము, గోచారము, నాడీ జ్యోస్యము, న్యూమరాలజీ, ప్రశ్న చెప్పడం, సోది మొదలైన విధానాలుగా జ్యోస్యం చెప్పడం వాడుకలో ఉంది.

పురాణాలలో జ్యోతిష్యంమార్చు

శ్రీనివాసుడు పద్మావతిని చేపట్టడానికి సోది చెప్పే స్త్రీ రూపంలో వచ్చి తన ప్రణయ వృత్తాంతాన్ని ఆకాశరాజు దంపతులకు తెలిపి వారిలో తమ వివాహం పట్ల సుముఖత కలిగించి పద్మావతిని పరిణయమాడటంలో విజయం సాధించినట్లు పురాణ కథనాలు చెప్తున్నాయి.

కంసుడికి మేనల్లుడి రూపంలో మరణం పొంచివున్నట్లు ఆకాశవాణి ముందుగానే వినిపించింది.

శిశుపాలుని మరణం కృష్ణుని ద్వారా సంభవించనున్నదని పెద్దలు చెప్పినట్లు అందువలన శిశుపాలుని తల్లి కృష్ణుని నుండి నూరు తప్పుల వరకు సహించేలా వరం పొందినట్లు భారతంలో వర్ణించబడింది. ఆ తరువాత నూరు తప్పులు చేసి శిశుపాలుడు కృష్ణుని చేతిలో మరణించడం లోక విదితం.

ఐదుగురు మహావీరులు ఒకే నక్షత్రంలో పుడతారని, వారిలో మొదటిసారిగా ఎవరు ఎవరిని సంహరిస్తారో, మిగిలిన ముగ్గురు అతని చేతిలోనే మరణిస్తారని ముందుగానే చెప్పడం జరిగింది. ఆ ఐదుగురు మహావీరులు ఎవరంటే భీముడు, ధుర్యోధనుడు, జరాసంధుడు, బకాసురుడు, కీచకుడు. అందుకే గాంధారి తన కుమారుడు దుర్యోధనుడిని దీర్ఘాయుష్కుని చేయటానికి, అతని శరీరాన్ని వజ్రకాయంగా మార్చడానికి శక్తివంతమైన మూలికా ఔషధాన్ని అతనికి రాస్తున్నప్పుడు, దానిని చెడగొట్టడానికే, పనిగట్టుకుని మరీ శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చి, దుర్యోధనుడిని ఆయుఃక్షీణుడిని చేసాడనే విషయం కూడా లోక విదితమే

త్రిజటా స్వప్నవృత్తాంతములో శ్రీ రాముడు రావణుని వధించి సీతమ్మను విడిపించినట్లు త్రిజట వాల్మీకి పలికించడం స్వప్నాధారిత జ్యోస్యం వాడుకలో ఉన్నదని చెప్పడానికి నిదర్శనం.

అనేక పురాణాలలో జ్యోతిష్యశాస్త్రమునకు సంబంధించిన శాస్త్రీయాంశాలు పేర్కొనబడినవి. గరుడ మహా పురాణం జ్యోతిష్య శాస్త్రాన్ని   (పూర్వఖండము లోని 59 నుండి 67 అధ్యాయములవరకు గల)  తొమ్మిది అధ్యాయాలలో వివరించింది. వీటిలో సాముద్రిక శాస్త్రమును గురించి 64,65 అధ్యాయాలు రెండింటిలో విశదీకరించింది.

జానపదుల జోస్యంమార్చు

చిలుక జోస్యం, పుల్లల జోస్యం, రాగుల జోస్యం, చిప్పకట్టె జోస్యం, అంజన పసరు జోస్యం, చెంబు జోస్యం మొదలైనవి జానపదుల జోస్యాలు.

బాలసంతు వారు శైవులు.తెల్లవారు ఝామున గంట వాయిస్తూ ఇంటింటికి వచ్చి ఇంటి యజమాని విన్నా వినకపోయినా జోస్యం చెప్పి వెళతారు.

ప్రశ్నా శాస్త్రంమార్చు

జ్యోతిష శాస్త్రంలో ప్రశ్నాశాస్త్రం ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రశ్నా శాస్త్ర సంబంధిత విషయాలు శ్రీ విష్ణు ధర్మోత్తర మహాపురాణంలో లభ్యమవుతాయి. కనుక ఈ శాస్త్రం ఆతి పురాతన కాలం నుండి ప్రాచుర్యం పొంది ఉంది. ప్రశ్నఅడగడం అన్నది అప్పటి నుండి ఇప్పటి వరకు వాడుకలో ఉన్న విషయమే. అనేక రూపాలలో ప్రశ్నలకు సమాధానం చెప్పేవాళ్ళున్నా జ్యోతిష శాస్త్ర పండితులు అతి జాగరూకతతో గణించి చెప్పే సమాధానాలు విశ్వసించ దగినవి. ప్రశ్నా శాస్త్రానికి సమాధానం చెప్పాలంటే సాధారణంగా జాతక చక్రాన్ని చూసి చెప్పే కంటే విశేష పాండిత్యం అవసరమౌతుంది. పురాణాలలో ప్రశ్నా శాస్త్రాన్ని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించబడింది. పృచ్ఛకుడు ఎలా ఉండాలి, ఏ సమయంలో ప్రశ్న అడగాలి. ఎలాంటి ప్రదేశంలో అడగాలి మొదలైన అనేక విషయాలు ప్రస్తావించబడ్డాయి. అలాగే ప్రశ్నను చెప్పే పండితుడు ఎలా చెప్పాలి అనే విషయాలు ప్రస్తావించబడ్డాయి. వాటిలో శ్రీ విష్ణు ధర్మోత్తర మహాపురాణంలో ప్రస్తావించబడిన విషయాలు ఇక్కడ చూడవచ్చు.

ప్రశ్నచెప్పే జ్యోతిష పండితుడు శుభ్రమైన వస్త్రధారణ చేసి ఉండాలి. శ్వేతవస్త్రధారణ మరింత శ్రేష్టం.

ప్రశ్నచెప్పే జ్యోతిష పండితుడు మంచి మనసు కలవాడై ఉండాలి.

ప్రశ్నచెప్పే జ్యోతిష పండితుడు శుభసమయంలో సమాధానం చెప్పాలి.

చెప్పే జ్యోతిష పండితుడు తలంటుకున్న సమయంలో, దుఃఖితుడై ఉన్న సమయంలో, వికలమై మనస్సు కల్లోలితమైన సమయంలో, తల విరబోసుకున్న సమయంలో, bhuumi

మీద నిలబడి ఉన్న సమయంలో సమాధానం చెప్పకూడదు. అలాంటి సమయంలో పండితుడిని ప్రశ్న అడగకూడదు. ఆ పరిస్థితిలో చెప్పే సమాధానం అశుభాన్ని కలిగిస్తుంది.

ప్రశ్న అడిగే ప్రదేశం పట్టి ఫలితాలు ఉంటాయి. పూలున్న ప్రదేశం, వృక్షములు ఉన్న ప్రదేశం, పచ్చిక మైదానాలు, నదీతీరాలు, సరస్సు తీరాలు, చక్కగా లక్ష్మీకళుట్టిపడుతున్న భవనాలలో చెప్పే సమాధానం

శుభఫలితాలు ఇస్తాయి.

ప్రశ్న అడుగు పృచ్ఛకుడు శ్మశానం, కబేళా (మాంసవిక్రయ శాల), కారాగారం, నడి రోడ్డు, బురదగల ప్రదేశం, పాడుబడిన కట్టడాలు, పాడుబడిన గృహములు, ఎలుకలు కలుగులు, పాము కన్నాలు, పురుగులు ఉన్నప్రదేశంలో అడిగిన అశుభఫలితాలు కలుగుతాయి.

దండహస్తులు (చేత కర్రలు పట్టుకున్న వాళ్ళు), కాషాయ వస్త్ర ధారులు, తల అంటుకున్న వాళ్ళు, జాతి భ్రష్టులు, నపుంసకులు, స్త్రీలు, సంకెళ్ళు తాళ్ళు పట్టుకున్న వాళ్ళు, తాడి పండ్లు చేత పట్టున్న వాళ్ళు అడిగిన ప్రశ్నకు ఫలితం భయంకరం ఫలితాలను ఇస్తుంది.

సంధ్యా సమయం, మిట్ట మధ్యాహ్నం, మధ్యాహ్నానికి ముందు సమయం, రాత్రి వేళలు అడిగిన అశుభ ఫలితం ఇస్తుంది. ఉత్తర దిక్కు, ఈశాన్య మూల, తూర్పు దిక్కున నిలిచి అడిన శుభ ఫలితం ఇస్తుంది.

ప్రశ్నాశాస్త్రంలో 1నుండి249 మధ్య ఒక అంకెను పృచ్ఛకుడుని అదిగి ఆ అంకెకు సంబంధించిన సబ్ ఆధారముగా ఫలమును చెప్పు విధానము ఉత్తమమైనది

జన్మలగ్నముమార్చు

భూమి తనచుట్టూ తాను తిరిగే ఆత్మ ప్రదక్షిణ కాలంలో ప్రతి రెండు గంటలకు లగ్నం మారుతూ 24 గంటల సమాయాన్ని 12 రాశుల లగ్నాలుగా విభజిస్తూ జ్యోతిష్య గణన చేస్తారు. చైత్రమాసం పాడ్యమి సూర్యోదయం మేష లగ్నంతో ఆరంభం ఔతుంది. ఒక రోజుకు నాలుగు నిమిషాల కాలం ముందుకు జరుగుతూ చేర్చుకొని ఒక మాసకాలంలో 120 నిమిషాలు లగ్న కాలం మారుతూ వైశాఖమాస ప్రారంభం వృషభ లగ్నంతో ఉదయం ఆరంభం ఔతుంది. ఈ విధంగా లగ్న గణన చేస్తూ జాతకుడు పుట్టిన లగ్న నిర్ణయం చేస్తారు. లగ్నము ప్రదేశములకు అనుగుణముగా మారుతుంటుంది.

జ్యోతిషం సూర్య కేంద్రక సిద్దాంతప్రకారము చెప్పబడినదే. భూమి, సూర్యునిచుట్టూ తిరగడం వలన ఏర్పడేమార్పులు జ్యోతిషశాస్త్రం స్పష్టంగా వివరిస్తున్నది. జీవులు భూమి మీద బ్రతుకుతున్నాయి కానీ సూర్యుని మీద కాదు. అందుకే భూమిని కేంద్రంగా తీసుకోవడం జరిగింది. ఇది చాలా అంతరార్థం కలిగిన విషయము. జ్యోతిష శాస్త్రజ్ఞానం కచ్చితంగా అవసరం.

రాహుకేతువులు భూకక్ష్య, సూర్యకక్ష్యల ఖండనబిందువులు. అందుకే జన్మకుండలిలో అవి ఎదురెదురుగా ఉంటాయి. అందుకే వాటిని ఛాయాగ్రహాలు అంటున్నాము.

హేతువాదులు వారి సిద్దాంతాన్ని అనుసరించి, దేవుదు లేడు అని నమ్ముతూ ఉంటారు. వారికి జ్యోతిషం గురించి అనవసరం.

శాస్త్రవేత్తలు చాలావిషయాలు తెలుసుకొంటున్నారు. జ్యోతిషం గురించి కూడా తెలుసుకొంటారు.

జ్యోతిష్యం విమర్శకుల ప్రతి ప్రశ్నకు సమాధానమిస్తుంది.

సంక్రాంతి కాల నిర్ణయం సంక్రాంతి సందేహ నివారణ

శ్లో॥ మాందైక కర్మేన శుద్ధవ్యర్కేందు ఉత్పాదతా తిథి: । శ్రాద్ధాదీషు పరిగ్రాహ్యా గ్రహణాదౌతు బీజయుక్ ॥ ॥ తిథి కౌస్తుభం ॥

శ్లో॥ సిద్ధాంత గ్రహచారేణ వ్రతాది: కాల ఉచ్యతే । దృక్సిద్ధ గ్రహచారేణ ప్రత్యక్ష ఫల చింతితమ్ ॥ సిద్ధాంత రహస్యం

నిత్య నైమిత్తిక కర్మలకు, వ్రతములకు, పండుగలకు, శ్రాద కర్మలకు తిథిని నిర్ణయించుట యందు దృక్ కలపకుండా పూర్వ పద్ధతి ప్రాకారమే (మహర్షి ప్రోక్తమైనది, సూర్య సిద్దాంత ఉక్తమైన పద్ధతి, సంప్రదాయ పద్ధతి ప్రకారమే) ఆచరించవలయును.

గ్రహణాదులయందు, జాతక ఫలములు తెలియపరచునప్పుడు దృక్ యుక్తమైన గ్రహములను తీసుకోవలనని మన శాస్త్రములు, సిద్ధాంత గ్రంధములు, మన పూర్వీకులు తెలియపరచిరి.

నాడీ గ్రంథాలు

భాష

Download PDF

వీక్షించు

సవరించు

నాడీ గ్రంథాలు పురాతన కాలంలో భారతదేశంలో తాళపత్రాలపై రాయబడ్డ జ్యోతిష్యానికి సంబంధించిన గ్రంథాలు. వీటిలో ఎక్కువ భాగం తమిళం లోనూ, కొన్ని సంస్కృతం లోనూ ఉన్నాయి. శుక్ర నాడి, ధ్రువ నాడి సంస్కృతంలో ఉన్నాయి. చంద్ర నాడి, బ్రహ్మ నాడి, అగస్త్య నాడి, విశ్వామిత్ర నాడి, సుబ్రహ్మణ్య నాడి, నంది నాడి, కాకాభుజంగ నాడి మొదలైనవెన్నో తమిళ భాషలో ఉన్నాయి. ఇవి చాలా పెద్ద గ్రంథములు. నాడీ జ్యోతిష్యం చెప్పేవారు ఈ గ్రంథాలను గుప్తముగా ఉంచి తమ జీవనోపాధి కొరకు ఉపయోగించుచున్నారు కాబట్టి ప్రస్తుతం ఇవి ఎక్కడా ప్రచురణలో లేవు. జాతక ఫలములను కావల్సిన వారు వీరిని సంప్రదిస్తే వారు ఆగ్రంథములను పరిశీలించి ఫలములను రాసి ఇస్తారు. కౌశిక నాడి, అగస్త్య నాడి మొదలైన వానిని చేతి రేఖల ఆధారంగా చూస్తారు.

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

HAVANIJAAA

(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం

Ph. no: 9666602371


No comments:

Post a Comment