మార్గశిర పున్నమిని కోరల పున్నమి అంటారు. కోరల అనే అమ్మవార్ని పూజించే రోజిది. యమధర్మరాజు వద్ద మంత్రిగా ఉండే చిత్రగుప్తుని చెల్లెలే కోరల. ఈమె కొన్నిచోట్ల గ్రామదేవతగా పూజలందుకుంటోంది.
దీపావళి వెళ్లిన రెండోరోజు యమద్వితీయ. భగినీ హస్తభోజనం అంటారు. ఆనాడు యమధర్మరాజు తన చెల్లెలైన యమున ఇంటికి వస్తాడు.
అలాగే మార్గశిర పున్నమి రోజున చిత్రగుప్తుడు తన చెల్లెలు కోరల ఇంటికి వస్తాడు. అన్నయ్య ఇంటికి వచ్చిన సందర్భంగా సంతోషించిన కోరల ఘనమైన విందును సమర్పిస్తుంది. చెల్లెల్ని ఆశ్వీరదిస్తూ మార్గశిర పున్నమి రోజు కోరలను పూజించినవారికి నరక బాధలు, అపమృత్యు భయం ఉండవని చిత్రగుప్తుడు వరం ఇస్తాడు.
కోరలమ్మకు మినపరొట్టెను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇందుకోసం మార్గశిర పున్నమినాటి సాయంత్రం మినపరొట్టెను తయారు చేసి కొద్దిముక్కను కొరికి కుక్కలకు వేయాలని పండితులు చెబుతున్నారు.
No comments:
Post a Comment