Wednesday 29 November 2017

పంచాంగం నవంబర్ 30



గురువారం(బృహస్పతివాసరే)  నవంబర్ 30
శ్రీ *హేమలంబి* నామ సంవత్సరం
దక్షిణాయనం
హేమంత ఋతువు
మార్గశిర మాసం శుక్ల పక్షం
తిధి : ద్వాదశి తె3.04
(తెల్లవారితే శుక్రవారం)
నక్షత్రం : రేవతి మ12.55 తదుపరి అశ్విని
యోగం : వ్యతీపాతం సా6.06 తదుపరి వరీయాన్
కరణం : బవ మ3.54 తదుపరి బాలువ తె3.04
సూర్యరాశి :వృశ్చికం
చంద్రరాశి :మీనం
సూర్యోదయం :6.16
సూర్యాస్తమయం :5.20
రాహుకాలం : మ1.30 - 3.00
యమగండం: ఉ6.00 - 7.30
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : ఉ9.57 - 10.42 & మ2.23 - 3.07
అమృతకాలం : ఉ10.31 - 12.06 & తె5.14నుండి
మధ్వ ఏకాదశి  / మత్స్య ద్వాదశి / వాసుదేవ ద్వాదశి
శుభమస్తు

Tuesday 28 November 2017

పంచాంగం నవంబర్ 28, 2017



ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
నవంబర్ 28, 2017
మంగళవారం(భౌమ్యవాసరే)
శ్రీ *హేమలంబి* నామ సంవత్సరం
దక్షిణాయనం
హేమంత ఋతువు
మార్గశిర మాసం శుక్ల పక్షం
తిధి :దశమి తె5.31
(తెల్లవారితే బుధవారం)
నక్షత్రం:పూర్వాభాద్ర మ12.55
తదుపరి ఉత్తరాభాద్ర
యోగం :వజ్రం రా9.12
తదుపరి సిద్ధి
కరణం : తైతుల సా5.36 తదుపరి గరజి తె5.31
సూర్యరాశి : వృశ్చికం
చంద్రరాశి : మీనం
సూర్యోదయం : 6.14
సూర్యాస్తమయం : 5.20
రాహుకాలం :మ3.00 -4.30
యమగండం : ఉ9.00 - 10.30
వర్జ్యం :రా10.36 - 12.13
దుర్ముహూర్తం : ఉ8.28 - 9.12 & రా10.30 - 11.22
అమృతకాలం : ఉ6.18వరకు
శుభమస్తు


Sunday 26 November 2017

పంచాంగం నవంబర్ 27, 2017


ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
నవంబర్ 27, 2017
సోమవారం(ఇందువాసరే)
శ్రీ *హేమలంబి* నామ సంవత్సరం
దక్షిణాయనం
హేమంత ఋతువు
మార్గశిర మాసం శుక్ల పక్షం
తిధి : నవమి తె5.40
(తెల్లవారితే మంగళవారం)
నక్షత్రం : శతభిషం మ12.11
తదుపరి పూర్వాభాద్ర
యోగం :హర్షణం రా10.29
కరణం : బాలువ సా5.31
తదుపరి *కౌలువ* తె5.40
సూర్యరాశి :వృశ్చికం
చంద్రరాశి : కుంభం
సూర్యోదయం : 6.14
సూర్యాస్తమయం : 5.20
రాహుకాలం :ఉ7.30 - 9.00
యమగండం : ఉ10.30 - 12.00
వర్జ్యం : సా6.46 - 8.25
దుర్ముహూర్తం : మ12.09 - 12.54 & మ2.22 - 3.07
అమృతకాలం : ఉ6.17వరకు & తె4.39
శుభమస్తు

Friday 24 November 2017

మిత్ర సప్తమి





మార్గశిర శుద్ద సప్తమి ని భానుసప్తమి,నంద సప్తామి జయసప్తమి, మిత్ర సప్తమి అని అంటారు. ఈ రోజు సూర్యారాధన చేసి పాయసం నివేదన చేస్తే అనేకమైన మంచి ఫలితాలు కలుగుతాయి.

శని వారానికి అధిపతి శనీశ్వరుడు.సప్తమి కి అధిపతి సూర్యుడు..వీరిద్దరూ తండ్రి కొడుకులు .వీరిద్దరికీ పడదు.కాని ఈరోజు రెండు కలిసి వచ్చాయి.బద్ధకం వదిలి మందకొడి జీవనాన్ని వదిలి ఆరోగ్యకరమైన వేగవంతమైన జీవన విధానానికి ఈ వ్రతాన్ని చేస్తారు.గోధుమ నూకతో చేసిన పాయసాన్ని సూర్యుడికి ప్రీతికరమైనది చేసి బ్రమ్హచారి బ్రామ్హడికి వాయనం ఇవ్వడం వలన ఎంతో క్షేమ్మాన్ని ఇస్తాడు.ఆదిత్య హృదయ౦ మరియు సూర్యాష్టకం పటించాలి.తమర పువ్వు లేదా ఎరుపు ఆరంజ్ రంగులో ఉండే పుష్పాలను సమర్పించాలి.దీని వలన వృత్తిలో పేరు ప్రతిష్ట ఏర్పడతాయి.

పంచాంగం నవంబర్ 25, 2017



ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
నవంబర్ 25, 2017
శనివారం (స్థిరవాసరే)
శ్రీ *హేమలంబి* నామ సంవత్సరం
దక్షిణాయనం
హేమంత ఋతువు
మార్గశిర మాసం శుక్ల పక్షం
తిధి :సప్తమి తె4.34
(తెల్లవారితే ఆదివారం)
నక్షత్రం : శ్రవణం ఉ9.17 తదుపరి ధనిష్ఠ
యోగం : ధృవం రా11.47
కరణం : గరజి మ3.55 తదుపరి వణిజ తె4.34
సూర్యరాశి : వృశ్చికం
చంద్రరాశి : మకరం
సూర్యోదయం :6.14
సూర్యాస్తమయం :5.20
రాహుకాలం :ఉ9.00 - 10.30
యమగండం :మ1.30 - 3.00
వర్జ్యం :మ1.34 - 3.17
దుర్ముహూర్తం:ఉ6.13 - 7.42
అమృతకాలం : రా11.40 - 1.21
మిత్ర సప్తమి
శుభమస్తు

కూర్మావతారము



హిందూమత పురాణాల లో శ్రీమహావిష్ణువు యొక్క దశావతారాల లో రెండవ అవతారం కూర్మావతారము. కూర్మము అనగా తాబేలు. దేవదానవులు అమృతము కోసము పాలసముద్రాన్ని మథించడానికి మందర పర్వతాన్ని కవ్వంగా నిర్ణయించి, పాలసముద్రంలో వేస్తే అది కాస్తా ఆ బరువుకి పాలసముద్రంలో మునిగిపోతుంటే, విష్ణుమూర్తి కూర్మావతారములో దానిని భరిస్తాడు. ఇది కృతయుగం లో సంభవించిన అవతారం

 

అవతార గాథ

ఒకమారు దేవేంద్రుని ప్రవర్తనకు కోపించిన దూర్వాస మహర్షి "దేవతలు శక్తిహీనులగుదురు" అని శపించాడు. అందువలన దానవులచేతిలో దేవతలు పరాజయం పొందసాగారు. వారు విష్ణువుతో మొరపెట్టుకోగా "సకల ఔషధులకు నిలయమైన పాలకడలిని చిలికి అమృతాన్ని సాధించండి" అని విష్ణువు ఉపాయాన్ని ఉపదేశించాడు.
దేవతలు ఆ బృహత్కార్యం కోసం అందుకు తమకంటె శక్తివంతులుగా ఉన్న దానవులతో సంధి కుదుర్చుకొన్నారు. మందర పర్వతం కవ్వంగా, వాసుకి త్రాడుగా క్షీరసముద్ర మథనం మొదలయ్యింది. కాని మందరగిరి బరువుకి మునిగిపోసాగింది. కార్యం నిష్ఫలమయ్యే పరిస్థితి ఉత్పన్నమైంది.
అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారమును ధరించి ఆ కొండను భరించెను. ఆ అవతారాన్ని పోతన తన భాగవతంలో ఇలా వర్ణించాడు.
సవరనై లక్ష యోజనముల వెడల్పై కడు గఠోరంబైన కర్పరమున
నదనైన బ్రహ్మాండమైన నాహారించు ఘనతరంబగు ముఖ గహ్వరంబు
సకల చరాచర జంతురాసులనెల్ల మ్రింగి లోగొనునట్టి మేటి కడుపు
విశ్వంబుపై వేఱు విశ్వంబు పైబడ్డ నాగిన గదలనియట్టి కాళ్ళు
వెలిగి లోనికి జనుదెంచు విపుల తుండ
మంబుజంబుల బోలెడి యక్షియుగము
సుందరంబుగ విష్ణుండు సురలతోడి
కూర్మి చెలువొందనొక మహా కూర్మమయ్యె.
అలా దేవదేవుని అండతో సముద్రమథన కార్యం కొనసాగింది. ముందుగా జగములను నాశనము చేయగల హాలాహలము ఉద్భవించింది. దేవతల మొర విని, కరుణించి, పరమశివుడు హాలాహలాన్ని భక్షించి, తన కంఠంలోనే నిలిపాడు. అందుచేత ఆయనను గరళకంఠుడు అనీ, నీలకంఠుడు అనీ అంటారు. తరువాత సుర (మధువు), ఆపై అప్సరసలు, కౌస్తుభము, ఉచ్ఛైశ్రవము, కల్పవృక్షము, కామధేనువు, ఐరావతము వచ్చాయి. ఆ తరువాత త్రిజన్మోహినియైన శ్రీలక్ష్మీదేవి ఉద్భవించింది. సకలదేవతలు ఆమెను అర్చించి, కీర్తించి, కానుకలు సమర్పించుకొన్నారు. ఆమె శ్రీమహావిష్ణువును వరించింది. చివరకు ధన్వంతరి అమృత కలశాన్ని చేతబట్టుకొని బయటకు వచ్చాడు. తరువాత విష్ణువే మోహినిగా ఆ అమృతం దేవతలకు దక్కేలా చేశాడు.

స్తోత్రము

జయదేవుని స్తోత్రంలో కూర్మావతార వర్ణన

క్షితిరతి విపులతరే తవ తిష్ఠతి పృష్టే
ధరణి ధరణ కిణ చక్ర గరిష్ఠే
కేశవ! ధృత కచ్ఛప రూప!
జయ జగదీశ హరే!

దేవాలయములు

  • శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం పట్ణానికి 15 కి.మీ. దూరంలో శ్రీకూర్మం అనే పుణ్య క్షేత్రం ఉంది. శ్రీమహావిష్ణువు కూర్మావతారం రూపంలో ఇక్కడ పూజింపబడుతాడు. కూర్మావతారం మందిరం దేశంలో ఇదొక్కటే. ఈ మందిరం శిల్పకళాశైలి విశిష్టమైనది. 11వ శతాబ్దం కాలం నాటి శాసనాలు ఇక్కడ లభించాయి.
  • పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్తిలి మండలానికి చెందిన కంచుమర్రు గ్రామంలో కూర్మావతారుని ఆలయం ఉంది. కాలువలోంచి గ్రామంలోకి వచ్చి గ్రామస్తులకు డిప్పపై విష్ణుమూర్తి నామాలు సహజంగా కలిగిన ఓ తాబేలు కనిపించింది. దానిని తగిన ఏర్పాటుచేసి కాపాడుకుంటూ, పూజిస్తూ వచ్చాకా కొన్నేళ్ళకు తాబేలు మరణించింది. దాని శరీరం పెట్టి దాని రూపాన్ని నిర్మించి అక్కడే ఆలయాన్ని నిర్మించారు.
  • చిత్తూరు జిల్లా లోని పెలమనేరు మండలంలోని కూర్మాయి గ్రామంలో "కూర్మ వరదరాజ స్వామి దేవాలయం" కలదు


  1. మంధర పర్వతాన్ని మోస్తున్న తాబేలు
  2. కూర్మావతారము
  3. హంపిలో విఠలాలయం స్తంభంపై కూర్మావతార శిల్పం

సుబ్రహ్మణ్య షష్ఠి ,కుమార షష్ఠి, స్కంద షష్ఠి

 
 
బ్రహ్మ నుండి "శివసుతుని చేత" మాత్రమే  మరణం పొందేలా వరం అందుకున్నాడు తారకాసురుడు... వాడి మరణానికై ఎన్నో వ్యయప్రయాలు కూర్చి శివపార్వతులకు వివాహం జరిపించారు దేవతలు... అమ్మవారి అయ్యవారి కళ్యాణానంతరము, పార్వతీ అమ్మవారితో కలిసి పరమశివుడు ఆ కైలాసంలో ఒక వేయి దివ్య సంవత్సరాలు శృంగారలీలాకళోల్లాస హృదయులై క్రీడిస్తూ గుడుపుతున్నారు.. కానీ సమస్త లోకాలన్నీ కూడా తారకాసురుడు పెడుతున్న బాధలు భరింపలేకుండా ఉన్నారు...శివవీర్యానికి జన్మించే ఆ బాలుడు ఎప్పుడు ఉద్భవిస్తాడా అని సకల దేవతలూ అహోరాత్రులూ ఎదురుచూస్తున్నారు. అప్పుడే శివుని నుండి మహా తెజస్సు వెలువడింది...

అప్పుడు దేవతలందరి ప్రార్ధన మీద హవ్యవాహనుడైన అగ్ని, ఆ శివతేజాన్ని తాను స్వీకరిస్తాడు. తీసుకోవడం అయితే తీసుకున్నాడు కానీ, శివుని తేజస్సుని ధరించడం అంటే అంత తేలికా… అంతట అగ్నిదేవుడు ఆ తేజస్సు యొక్క తాపాన్ని తట్టుకోలేకపోయాడు. అప్పుడు శివుని ఆజ్ఞ మేరకు, అగ్నిదేవుడు ఆ శివతేజస్సుని భూమాతలో ప్రవేశ పెడతాడు. అంతటి తేజస్సుని భరించలేక భూమాత కూడా, వెళ్ళి గంగామాతని ప్రార్ధిస్తుంది. అప్పుడు గంగా అమ్మ వారు ఆ శివతేజాన్ని స్వీకరిస్తుంది. అంతటి గంగానది కూడా ఆ తాపాన్ని తట్టుకోలేక, కైలాస శిఖరాల దగ్గరలో ఉన్న శరవణము అనే రెల్లుపొదల తటాకంలో విడిచిపెడుతుంది. ఆ రెల్లుపొదల తటాకం నుండి, ఆరుముఖాలతో, పన్నెండు చేతులతో, దివ్యమంగళ స్వరూపుడై, మార్గశీర్ష శుద్ధషష్ఠినాడు, అనగా ఈ రోజే, ఒక దివ్య తెజోమయుడైన బాలుడు ఉద్భవించాడు. ఆయనే శ్రీ  సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారు. ఈ రోజునే సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు. దీనికే కుమారషష్ఠి, స్కంద షష్ఠి అని కూడా పేరు...



ఆయన పుట్టగానే, ఆరుగురు కృత్తికా నక్షత్రాలు వచ్చి వారి స్తన్యమిచ్చాయి కాబట్టి, స్వామివారికి, కార్తికేయ అనీ, పుట్టగానే ఆరుముఖాలతో ఉండడం వలన స్వామికి ఆరుముగన్ అనీ, షణ్ముఖ అనీ నామం వచ్చింది.

తండ్రి యైన పరమశివుని వద్ద సమస్త విద్యలూ నేర్చుకొన్న స్వామి దేవతల సేనాధిపతిగా నియుక్తుడయ్యాడు... అటు తరువాత తారకుని సంహరించి లోకాలలో శాంతిని నెలకొల్పాడు మన స్వామి....తారకుని విజయం అనంతరం దేవేంద్రుడు తన కుమార్తె అయిన దేవసేనను కుమారస్వామికిచ్చి వివాహం జరిపిస్తాడు...అటు తరువాత దక్షిణదేశం వచ్చిన స్వామి శ్రీ వల్లి దేవిని కూడా వివాహమాడతాడు... అలా శ్రీ కుమారస్వామి, శ్రీ వల్లీ దేవసేన సమేతుడై లోకాలను అనుగ్రహిస్తున్నాడు...
 
సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఈ మంత్రాన్ని పఠిస్తే సర్పగండం కాలసర్ప దోషం ఉండదు.
" ఓం శాం శరవణ భావ "
"ఓం కృత్తికా సూనవే నమః"
"ఓం   అగ్ని గర్భాయ నమః"

ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః... అందరికీ స్కంద షష్ఠి శుభాకాంక్షలు...

పంచాంగం నవంబర్ 24, 2017




ఓం శ్రీ గురుభ్యోనమః🙏
నవంబర్ 24, 2017 

శుక్ర వారం (భృగువాసరే)
శ్రీ హేవిళంబి నామ సంవత్సరం
దక్షిణాయనం
హేమంత ఋతువు
మార్గశిర మాసం
శుక్ల పక్షం
తిధి : షష్టి తె 3:16
నక్షత్రం : ఉత్తరాషాడ ఉ 7:12 తదుపరి శ్రవణం
యోగం :వృద్ధి రా 11:53
కరణం: కౌలువ మ 2:26
తదుపరి తైతుల తె 3:16
వర్జ్యం:ఉ 11:32-1:16
దుర్ముహూర్తం:
ఉ 8:26-9:10 &
మ 12:08-12:53
అమృతకాలం:
రా 9:58-11:42
సూర్యరాశి : వృశ్చికం
చంద్రరాశి : మకరం
రాహుకాలం :
ఉ 10:30-12:00
యమగండం :
మ 3:00-4:30
సూర్యోదయం: 6:13
సూర్యాస్తమయం: 5:20
 

శుభమస్తు
 

శ్రీ సుబ్రహ్మణ్య షష్టి 

Wednesday 22 November 2017

పంచాంగం నవంబర్ 22 .2017





ఓం శ్రీ గురుభ్యోనమః*🙏🏻
నవంబర్ 22 .2017
బుధవారం (సౌమ్యవాసరే)
శ్రీ *హేమలంబి* నామ సంవత్సరం
దక్షిణాయనం
హేమంత ఋతువు
మార్గశిర మాసం శుక్ల పక్షం
తిధి :చతుర్థి/చవితి రా11.36
నక్షత్రం :పూర్వాషాడ తె4.44
(తెల్లవారితే గురువారం)
యోగం : శూలం రా11.06
కరణం : వణిజ ఉ10.32
తదుపరి భద్ర/విష్ఠి రా11.36
సూర్యరాశి : వృశ్చికం
చంద్రరాశి :ధనుస్సు
సూర్యోదయం : 6.12
సూర్యాస్తమయం : 5.21
రాహుకాలం : మ12.00 - 1.30
యమగండం : ఉ7.30 - 9.00
వర్జ్యం :మ12.46 - 2.33
దుర్ముహూర్తం : ఉ11.24 - 12.28
అమృతకాలం : రా11.24 - 1.11
శుభమస్తు

Monday 20 November 2017

శ్రీ హనుమత్ భజాష్టకము


ప్రభంజనాంశ సంభవం ప్రశస్త సద్గుణం
నిరస్త భాక్తకిల్భిషం దురత్యయ ప్రతాపినమ్
ధరసుతాను మోదకం కపీంద్ర సన్నుతం పరం
రమాపురాధి వాసినం భజామి వాయునందనం
విరించ సర్వదేవతా వరాత్ సుదృప్త రావణం
నిరీక్ష్య నిర్భయేనతం జఘాన తన్య వక్షసి
సురేంద్ర వందితాకృతిం మునీంద్ర సంస్తుతం పరం
రమాపురాధి వాసినం భజామి వాయునందనం
ప్రసన్న కల్ప భూరుహం ప్రశస్త పాణి పంకజం
పరవాల ఆటలాధారం ప్రపుల్ల కంజా లోచనం
కఠోర ముష్టి ఘట్టితం అమరేంద్ర వైరి వక్షసం,
రమాపురాధి వాసినం భజామి వాయునందనం
లసత్కిరీట కుండలం ప్ప్రభన్న గండ మండలం
స్పురన్ముఖేందు శోభితం సుతప్త వర్మ భూషణం
ప్రలంబ బాహూ శోభితం ఉపవీతతంతు శోభితం
రమాపురాధి వాసినం భజామి వాయునందనం
అనేక యోజనోన్నతం సురోరగాది సేవితం
నినాయగంధ మాధనం మహౌషధాది సంభవం
సలీలయా రక్రుపటం సురామపాద పంకజం
రమాపురాధి వాసినం భజామి వాయునందనం
స్వభక్త పాప కాననే దవాన లాయితం ప్రభుం
న్వశతృ ఖండనే మహా కఠోర వజ్ర సన్నిభం
లసద్విచిత్ర రత్నకై:వినిర్మితోరు భూషణం
రమాపురాధి వాసినం భజామి వాయునందనం
ప్రమత్త రాక్షసాధిప స్వశక్తి తాడి తానుజం
ప్రవీక్ష్య శోక మోహితం రామపతిం వరం ముహు:
ఝడిత్య హస్త శోకినం ముదాన్వితం చకారయ:
రమాపురాధి వాసినం భజామి వాయునందనం
స్వయంభు శంభు పూర్వక మరార్భి తశ్చకారయ:
సరాంజనేయ భీమ మధ్య రూపక త్రయం ముదా
సరామకృష్ణ వ్యాస సమ్మదం ముహుశ్చ కారయ:
రమాపురాధి వాసినం భజామి వాయునందనం

శ్రీ హనుమద్వైభవం


మనకు ముక్కోటి దేవతలున్నారు. వారిలో ఎవరికి నచ్చిన దేవుడు వారి వారికి విడిగా ఉన్నారు. కొందరు విష్ణువును ఇష్టపడితే... కొందరు శివుని ఇష్టపడతారు. కానీ...అందరూ ఇష్టపడే దేవుడు మాత్రం ‘హనుమంతుడు’ ఒక్కడే. అదే ఆయన వైభవం. ఎవరికైనా... భయం కలిగితే...తన ఇష్టదైవాన్ని కూడా కాదని, ముందు ప్రార్థించేది హనుమంతుడినే. ఛిన్నపిల్లలకు దిష్టి తగిలినా..గాలి సోకినా...ముందుగా గుర్తొచ్చేది హనుమంతుడే. ఏ విషయంలోనైనా ఆటంకాలు ఎదురైతే...విజయం కోసం ముందుగా ప్రార్థించేది హనుమంతుడినే. ఎవరెవరి ఇష్టదైవం సంగతి ఎలా ఉన్నా...వ్యాయామ కళాశాలల్లో దర్శనమిచ్చే దేవుడు మన హనుమంతుడే. మిగతా దేవుళ్ల విషంయంలో వ్యక్తిగత భేదాభిప్రాయాల సంగతి ఎలా ఉన్నా...హనుమంతుని విషయంలో ఎవరికీ ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. అదే ఆయన వైభవం. ఏడు కాండలతో..ఇరవైనాలుగు వేల శ్లోకాలతో అలరారే ‘శ్రీమద్వాల్మీకి రామాయణ’ మహా కావ్యంలో... ‘కిష్కింథాకాండ’లో మనకు పరిచయమైన ‘హనుమంతుడు’ యుగాలు మారుతున్నా.. నేటికీ మనందరిచేత ‘జన్మదినోత్సవాలు’ చేయించుకుంటున్నాడంటే...అది ఆయన వైభవం కాక మరేమిటి ? హనుమంతునితో పాటు పరిచయమైన వారే...వాలి, సుగ్రీవ, జాంబవంతాదులు. మరి... వారెవరికీ లేని, రాని ప్రత్యేకత., హనుమంతునకు ఎలా వచ్చింది ?
రామ, లక్ష్మణులను చూసి ప్రాణభయంతో పరుగు తీస్తున్న వానరేశ్వరుడు సుగ్రీవునకు ధైర్యం చెప్పి...భిక్షుకరూపంలో రామ, లక్ష్మణుల దగ్గరకు వస్తాడు హనుమంతుడు. తను వచ్చిన విషయాన్ని.., తడబడకుండా, గొంతు చించుకు అరవకుండా, కనుబొమలు ఎగరేయకుండా.,స్పష్ఠంగా,ముచ్చటగా మూడుమాటల్లో చెప్పి., వారు ఎందుకు వచ్చారో అడుగుతాడు హనుమంతుడు. ‘లక్ష్మణా.. విన్నావుకదా.. ఈ వానరుని ప్రసంగం. చతుర్వేదాలు, నవ వ్యాకరణాలు ఆమూలాగ్రంగా వచ్చినవాడే.. ఇంత ఆహ్లాదకరంగా ప్రసంగించగలడు. ఇటువంటి సచివుడు ఉన్న రాజు, ప్రపంచాన్నే శాసించగలడు. ఇట్టి వాక్చాతుర్య కుశలునితో, మనం వచ్చిన కార్యాన్ని చాలా జాగ్రత్తగా వివరించాలి సుమా.’ అనిఅంటాడు శ్రీరాముడు. సకలకళాకోవిదుడైన శ్రీరాముడు., తనంతటి వాడైన లక్ష్మణుని హెచ్చరించిన సందర్బము రామాయణంలో ఇది ఒక్కటే. అదీ... మన హనుమంతుని వాగ్వైభవం. రామ, సుగ్రీవులకు అగ్నిసాక్షిగా మైత్రి కలిపి, ధర్మచ్యుతుడైన వాలి వధకు మార్గం సుగమం చేసి., రాజ్యభ్రష్ఠుడైన సుగ్రీవుని తిరిగి కిష్కింధాధిపతిగా అభిషిక్తుని చేసినదీ హనుమంతుడే. అదీ ఆయన మంత్రాంగ వైభవం. సీతాన్వేషణ కార్యంలో భాగంగా హనుమదాదులు దక్షిణ సముద్రతీరం దగ్గర కూర్చున్నారు. సముద్రం దాటాలి. ఒకడు పది యోజనాలు దాటుతానన్నాడు. మరొకడు ఇరవై..ఇంకడు యాభై...ఇలా ఎవరి శక్తికి తగిన విధంగా వారివారి బలం చాటారు.
చివరకు జాంబవంతుడు కూడా...సాగరలంఘనం చేయగలనే కానీ.. తిరిగి రాలేను అన్నాడు. అందరూ ప్రాణత్యాగానికి సిద్ధపడితే...జాంబవంతుని ప్రోత్సాహంతో సాగర లంఘనం చేసాడు హనుమ. ఆ మహత్తర కార్యంలో తన ప్రయాణానికి విఘ్నం కలిగించబోయిన మైనాకుని సంతృప్తి పరచి, నాగమాత సురసను జయించి, ఛాయాగ్రాహిణి సింహికను సంహరించి.,లంకానగరం చేరాడు. దుర్భేద్యమైన లంకను చూసి రకరకాలుగా ఆలోచనలు చేసి.. ముందుగా లంకానగరాధి దేవత లంకిణి దర్పమణచి లంకలో ప్రవేశిస్తాడు. అదీ ఆయన వీర, విక్రమ వైభవం. హనుమంతుని ధీశక్తికి అసలు పరీక్ష ఇక్కడే ఉంది. లంకలో సీతాన్వేషణ చేస్తున్నాడు హనుమ. లంకానగర వైభవం ఆయన మనసు హరించలేదు. అతిలోక సౌందర్యవతులైన ఎందరో మోహనాంగులు నగ్నంగా నిదురిస్తూంటే.. సీతకోసం., వారిని నఖశిఖ పర్యంతం చూస్తున్నా హనుమ మనసు చలించలేదు. అదీ ఆయన ఇంద్రియ నిగ్రహ వైభవం.
‘అయ్యో.. పరస్త్రీని చూడడమే పాపం కదా..ఇలా నగ్నంగా చూడడం మరింత పాపం కదా..ఇంత సౌందర్యాన్ని చూస్తున్నా, నా మనసు చలించకుండా, నిర్మలంగా ఉంది. కనుక నాకు పాపం లేదు. అయినా సీతను వెతకాలంటే స్త్రీల మధ్యనే కదా వెతకాలి. కనుక నా తప్పు ఏమీ లేదు’ అనుకుని సీతాన్వేషణ చేస్తున్నాడు హనుమ. ఇదీ... ఆయన ధర్మచింతనా వైభవం. రావణుని శయనం మీద నిదురిస్తున్న మందోదరిని చూసి..సీత అని భ్రమపడి ఆనందంతో గంతులు వేస్తాడు. మరుక్షణంలో ఆలోచనలో పడి...‘రామునకు దూరమైన సీత అలంకరించుకోదు..అన్న పానాలు ముట్టదు...ఇలా సుఖంగా నిదురించదు..కనుక ఈమె సీత కాదు.’ అని నిర్ణయించుకుంటాడు. ఇదీ..ఆయన తార్కిక వైభవం. అశోకవనంలో సీత కనిపించింది. ఎలా కనిపించింది.? ప్రాణత్యాగానికి సిద్ధపడుతూ కనిపించింది. ఇప్పుడు...ఆమె ప్రయత్నాన్ని ఆపాలి. రామగానం చేసి,రామాంగుళి ఆమెకు ఇచ్చి, ఆమెకు ధైర్యం చెప్తాడు. అదీ ఆయన ఆలోచనా వైభవం.
చిన్న వానరరూపంలో ఉన్న హనుమంతుని శక్తిని సీతమ్మ శంకించినవేళ.. తన విశ్వరూపం చూపించి ‘వానరసేనలో అందరూ నన్ను మించిన ఉద్దండులేనమ్మా...సుగ్రీవుని సేనలో ఏమీ చేతకానివాడను, ఏమీ తెలియనివాడను., నేను ఒక్కడినేనమ్మా. దూతగా మహామహులను పంపరు కదమ్మా’ అని వినయంగా పలుకడం ...అఖండ ప్రతిభావంతుడైన ఒక్క హనుమంతునకే చెల్లు. అదీ...ఆయన వినమ్రతా వైభవం. వచ్చిన కార్యం పూర్తయింది. అలాని వెంటనే వెనుతిరిగి వెళ్లిపోలేదు. తమ బలం శత్రువుకు తెలియచెప్పాలి. అందుకే అశోకవనం ధ్వంసం చేసాడు. మంత్రి పుత్రులను, సేనాధిపతులను, రావణపుత్రుడు అక్షకుమారునితో పాటు కొన్ని వేల మంది రాక్షసవీరులను ఏకాకిగా సంహరించాడు. రావణసభలో...రావణునికి హితోపదేశం ఛేసాడు. తనను పరాభవించిన రావణునికి బుద్ధివచ్చేలా.. లంకాదహనం చేసి., శ్రీరామునికి సీతమ్మ జాడ తెలిపిన కార్యసాధకుడు హనుమ. అదీ ఆయన కార్యసాధనా వైభవం. అంతేనా...యుద్ధరంగంలో లక్ష్మణుడు మూర్ఛనొందిన వేళ..అనన్య సామాన్యమైన సంజీవిని పర్వతాన్ని తెచ్చి కాపాడిన ఆయన ప్రతిభా వైభవం ఇంకెవరికి ఉంటుంది?
శ్రీరామ పట్టాభిషేకం వేళ..అందరూ వారివారి ఉచితాసపాలలో కూర్చుంటే..హనుమ మాత్రం శ్రీరామ పాద సాన్నిధ్యాన్ని మించిన ఉచితస్థానం మరొకటి లేదని తలచి., భక్తిగా చేతులు జోడించి శ్రీరాముని పాదాల చెంత కూర్చున్న హనుమంతుని భక్తి వైభవాన్ని వివరించడానికి భాష చాలదు. అందుకే...భక్తిభావనతో ఆ ఈశ్వరాంశ సంభూతుని ఆశీస్సులు అందుకుని ఆనందిద్దాం.
ఆంజనేయ మతిపాటలాననమ్ - కాంచనాద్రి కమనీయ విగ్రహమ్
పారిజాత తరుమూల వాసినమ్ - భావయామి పవమాన నందనమ్
యత్ర యత్ర రఘునాథ కీర్తనమ్ - తత్ర తత్ర కృత మస్తకాంజలిమ్
బాష్పవారి పరిపూర్ణ లోచనమ్ - మారుతిం నమత రాక్షసాంతకమ్


నివారణా చర్యలే జ్యోతిష ప్రయోజనం


మన భారత దేశం కర్మ భూమి.అనాదిగా మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నవాళ్ళం. కర్మ సిద్ధాంతం ప్రకారం మానవులు అనుభవించాల్సిన కర్మ ఫలితం 3 రకాలుగా ఉంటుంది. 
1) ప్రారబ్ధం: పూర్వ జన్మలలో మనం చేసిన కర్మలకు ఫలితంగా ఇప్పుడు అనుభవిస్తున్నది; 
2) సంచితం: అనుభవంలోకి రాకుండా ఇంకా మిగిలి ఉన్నది; 
3) ఆగామి: ఇప్పుడు చేస్తున్న కర్మలకు భవిష్యత్తులో లేదా మరు జన్మలలో అనుభవంలోకి వచ్చేది. ఇది రాబోయే కాలంలో అనుభవంలోకి వస్తుంది.


 ఈ 3 కర్మల వల్ల మానవుడు అనేక జన్మలు ఎత్తడం జరుగుతోంది. జ్యోతిషం మానవ జీవితంలో జరగాబోయే శుభాశుభ ఫలితాలను గూర్చి చెబుతుంది. దీనివల్ల ప్రయోజనం ఏంటి? బ్రహ్మ రాతను మార్చలేము గదా! అని వాదించే వారున్నారు. బ్రహ్మరాత మన పూర్వ జన్మ కర్మను అనుసరించే ఉంటుంది. ఆ పూర్వ కర్మ మనం చేసిందే, దాని మీద అధికారం కూడా మనదే. కర్మ సంకల్పం నుంచి పుడుతుంది.ఆ సంకల్పం కూడా మనదే కదా! సత్కర్మల ద్వారా దోషాన్ని ఎలా పరిహరించాలో జ్యోతిష శాస్త్రం తెలియేస్తుంది. పూర్వ జన్మలో చేసిన శుభ, పాప కర్మల యొక్క ఫలానుభవ కాలాన్ని జ్యోతిష శాస్త్రం సూచిస్తుంది. చీకటిలోని వస్తువులను దీపం యొక్క సహాయంతో చూసినట్లుగా జ్యోతిష శాస్త్ర సహాయంతో జీవితంలో జరుగబోయే శుభాశుభ సంఘటనలను ముందుగా గుర్తించి; తద్వారా మంత్ర, ఔషధ, జప, దాన, హోమ, రత్న ధారణాది శాంతి ప్రక్రియల ద్వారా వ్యతిరేక ఫలితాలను నివారించుకోవచ్చని వరాహమిహిరుల వారి సందేశం మనకు "లఘు జాతకం" అనే గ్రంథంలో కనిపిస్తున్నది. ఈ సందర్భంలో మనం పరమహంస యోగానంద వారు జ్యోతిష శాస్త్రంపై వ్యక్తపరిచిన అభిప్రాయాన్ని స్మరించుకోవడం ఎంతైనా అవసరం. "జ్యోతిషమనేది గ్రహాల కాంతి ప్రభావాలకు ప్రాణులలో కలిగే ప్రతిస్పందనలను వివరించే శాస్త్రం. నక్షత్రాలకు, గ్రహాలకు ఉద్దేశ పూరిత స్నేహ భావం కాని, ద్వేష భావం కాని ఉండవు. అవి కేవలం అనుకూల, ప్రతికూల కిరణాలను ప్రసరిస్తూ ఉంటాయి.వాటంతట అవి మానవులకు కీడు చేయవు, మేలూ చేయవు; కాని ప్రతి మనిషీ తాను గతంలో చేసిన కర్మలకు అనుగుణంగా అవసరమైన ఫలితాల అనుభవానికి అవి ఒక నియమబద్ధమైన మార్గాన్ని ఏర్పరుస్తాయి."

POWER OF SOUND VIBRATION




శబ్దానికి తరంగశక్తి వుంటుంది, దాని ఫ్రీక్వెన్సీ స్థాయిని బట్టి నెగెటీవ్ లేదా పాజిటివ్ వైబ్రేషన్ ఉత్పన్నమవుతుంది. మంత్ర శాస్త్రంలో శబ్దానికే అత్యంత ప్రాముఖ్యత వుంటుంది, బీజాక్షరాల తో ఏర్పడే శబ్దం ఒక అద్భుతమైన మంత్ర శక్తిగా రూపాంతరం చెందుతుంది, వాటి నుండి వచ్చే శక్తి వైబ్రేషనే నాడు యంత్రాలుగా, చక్రాలుగా రూపొందించబడ్డాయి, ఇదంతా మన పూర్వీకులు దివ్య దృష్టితో ఏనాడో కనొగొని మంత్రం, యంత్రం, తంత్రం వంటి వాటిని ఆచరించి చూపించారు,
పేరూ కూడా ఒక శబ్దమే, మన పేరులోని ప్రతి అక్షరానికి ఒక సంఖ్యా వైబ్రేషన్, ఒక గ్రహ తత్వం వుంటుంది, వ్యక్తి పుట్టిన సమయాన్ని అనుసరించి ఆయా వ్యక్తికి కొన్ని మిత్ర గ్రహాలు, మిత్ర సంఖ్యలు, శత్రు గ్రహాలు, శత్రు సంఖ్యలు ఏర్పడుతాయి, వ్యక్తి పేరులో మిత్ర అక్షరాలు, మిత్ర సంఖ్యా వైబ్రేషన్ ఎక్కువగా వుంటే తలచిన కార్యాలను నెరవేర్చుకోగలగడం, అవకాశాలను అందిపుచ్చుకోగలగడం, జీవితంలో మెట్టు మెట్టుగా ఎదగడం వంటివి జరిగి అదృష్ట జాతకుడిగా పేరు గడిస్తారు, ఆ వ్యక్తి జన్మ తేదీని అనుసరించి అతని పేరులో శత్రు సంఖ్యా వైబ్రేషన్ ఎక్కువగా వుంటే కృషికి తగిన ఫలితాలు దక్కకపోవడం, అవకాశాలు జారవిడుచుకోవడం, మానసిక అనిశ్చితి మొదలగు సమస్యలతో సతమతమవడం జరుగుతుంటుంది.
ప్రస్థుత కాలంలో మన పాశ్చాత్య చదువుల ప్రభావం చేత మనిషి పుట్టింది మొదలు మరణించేంత వరకు, ఇంగ్లీషులోనే పేర్లు రాయడం, ఇంగ్లీషులోనే సర్టిఫికెట్లు పొందడం, ఇంగ్లీషులోనే సంతాకలు చేయడం జరుగుతుంది, అయితే మన చేతి రాతే మన నుదుటి రాత అనే నిగూఢ సత్యాన్ని ఒక సామేతగా మన పూర్వీకులు మనకు ఏనాడో తెలియజేశారు, మనం ఒక పేరుని రాసుకోవడం వలన, ఆ పేరుని సంతం చేసుకోవడం వలన, ఆపేరుతో పిలిపించుకోవడం వలన, ఆ పేరులోని అక్షరాల ప్రభావం, ఆ అక్షరాల కలయిక చేత ఏర్పడే సంఖ్యా వైబ్రేషన్ పాజిటివ్ గానో, లేదా నెగటివ్ గానో మనపై ప్రభావితం అవుతుంది. దానిని అనుసరించే జీవితంలో మనం ఎదుర్కొనే సంఘటనలు వుంటాయి.
ఎందుకంటే శబ్దానికి అంతటి శక్తి వుంది కాబట్టి, పాశ్చాత్యుడైన స్ట్రాంగ్లన్ అన్న శాస్త్రవేత్త గాయత్రి మంత్రం పై పరిశోధనలు చేసి ఇలా పేర్కొన్నాడు, గాయత్రి మంత్రాన్ని సక్రమంగా ఉచ్చరించినట్లయితే అది ఒక సెకండుకు రెండు లక్షల ప్రకంపనలను కలిగిస్తుంది అని తెలిపి, ప్రయోగ రీత్యా ఆయన అమెరికాలో నిరూపించాడు.
హన్స్ జెన్నీ అనే శాస్త్ర వేత్త ఓంకారం పై పరిశోధనలు చేసి టొనోగ్రఫీ ద్వారా ఏర్పడిని శ్రీ చక్రాన్ని అందరి కళ్ళకీ చూపించి, “ఓం”కార శబ్ద రూపం సాక్షాత్తు శ్రీ చక్రమే అని నిరూపించాడు.
మన శాస్త్రాలపైన పాశ్చాత్యులు తలమునకలై పరిశోధనలు చేసి భారతీయ ఘణత చాటుతుంటే మనలో కొందరు మాత్రం కనీస అధ్యయనం కూడా చేయకుండా, మూఢ నమ్మకాలు, బూటకాలు, ఇంకా ఏ కాలంలో ఉన్నారు అంటూ కొట్టి పారేయడం నిజంగా సిగ్గుచేటు.
అంతెందుకు మనలో ఒకడైన మన లోక కవి, యోగి వేమన పధ్యాలను మనం పట్టించుకోకుండా వదిలేస్తే పాశ్చాత్తుడైన
సి. పి. బ్రౌన్ వాటిని వెలుగులోకి తెచ్చి, ఆ పద్యాల మహత్యాన్ని మనందరికీ తెలియజేసాడు.
భారతీయులుగా పుట్టి కూడా మనలో కొందరు మన శాస్త్రాల పట్ల విశ్వాసం కూడా లేకుండా కళ్ళుమూసుకుపోయి హేళన చేస్తున్నారే కానీ ఇతర దేశస్తులు మాత్రం భారతీయ శాస్త్రాలను కళ్ళకద్దుకుని స్వీకరించి వాటిపై పరిశోధనలు చేసి వారి వారి దేశ కాలమాన పరిస్థితులకు తగినట్లూగా అభివృద్ది పరుచుకుంటున్నారు.

 హస్త సాముద్రికం పై వారు చేసిన పరిశోధనలు నేడు భారతీయ శాస్త్రాలకు ధీటుగా నిలిచాయి.
ఇంతకు మించి ఏం కావాలి భారతీయ శాస్త్రాల గొప్పదనం తెలియజేయడానికి.
జన్మ తేదీని అనుసరించి మరియు జన్మ తేదీ లేని వారికి వారి హస్త రేఖలలో వారికి అనుకూలముగా వున్న గ్రహ స్థానాలను అనుసరించి నా వద్ద నేం కరెక్షన్ చేసుకున్న వారెందరో, కోర్సులా రాసుకుని, సత్ఫలితాలను పొంది తిరిగి వారి కుటుంబ సభ్యులను, మిత్రులను నా వద్దకు తీసుకు వచ్చిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి.
పిల్లలు పుట్టగానే మంచి సంఖ్యా వైబ్రేషన్ గల పేరుని ఇస్తే వారు పెద్దయ్యాకా, మార్పులు, చేర్పులు, కోర్స్ రాయాడాలు అవసరం లేకుండా, పుట్టినప్పటి నుండి అదృష్ట జాతకులుగా ఎదిగి పేరు, ప్రఖ్యాతలు గడిస్తారు,
పిల్లలకు ఆస్తులు ఇవ్వవలసిన పని లేదు, అదృష్ట నామాన్ని ఇస్తే చాలు, అదే పిల్లల బంగారు భవిష్యత్తుకు వేసే పునాది,
ఇప్పటి వరకూ నేను ఎన్నో జాతకాలు పరిశీలన చేశాను, పేరులోని సంఖ్యల వైబ్రేషన్ పాజిటీవ్ గా వున్న వారు అదృష్టవంతులుగా వుండి, ఆనందకర జీవితాన్ని పొందడం, పేరులోని సంఖ్యల వైబ్రేషన్ నెగటీవ్ గా వున్న వారు దురదృష్టవంతుగా వుండి దుఃఖపూరిత జీవితాన్ని కలిగి వుండడం జరుగుతుంది,
వ్యక్తి పేరే ఒక మంత్రం, పేరు రాయడం ఒక తంత్రం,
ఈ మంత్రం, తంత్రం ఫలించడం లేదా దుష్ఫలించడం అనేది
ఆ వ్యక్తి పుట్టిన తేదీ పై ఆధారపడి వుంటుంది.

పంచాంగం నవంబర్ 21, 2017




ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
నవంబర్ 21, 2017
మంగళవారం (భౌమ్యవాసరే)
శ్రీ *హేమలంబి* నామ సంవత్సరం
దక్షిణాయనం
హేమంత ఋతువు
మార్గశిర మాసం శుక్ల పక్షం
తిధి :తదియ రా9.28
తదుపరి చతుర్థి
నక్షత్రం : మూల రా2.09
యోగం : ధృతి రా10.45
తదుపరి శూలం
కరణం : తైతుల ఉ8.24
తదుపరి గరజి రా9.28
సూర్యరాశి :వృశ్చికం
చంద్రరాశి : వృశ్చికం
సూర్యోదయం : 6.12
సూర్యాస్తమయం : 5.21
రాహుకాలం : మ3.00 - 4.30
యమగండం : ఉ9.00 - 10.30
వర్జ్యం : ఉ8.25 - 10.12 & రా12.22 - 2.09
దుర్ముహూర్తం : ఉ8.25 - 9.10 & రా10.29 - 11.20
అమృతకాలం : రా7.03 - 8.50

Saturday 18 November 2017

శివపురాణం 27


ఒకప్పుడు ఋషులకు త్రిమూర్తులలో అసలు బ్రహ్మమెవరని సందేహం వచ్చింది. ఆ సందేహమును తీరతామని వారు త్రిమూర్తులనే అడిగారు. శంకరుడికి సద్యోదాత, అఘోర తత్పురుష ఈశాన వామదేవ అను అయిదు ముఖములు ఉంటాయి. ఈ అయిదు ముఖములతో ఋషుల వంక చూస్తూ అన్నాడు ‘అదేమిటయ్యా బ్రహ్మమెవరని అడుగుతారేమిటి? నేనే బ్రహ్మమును’ అన్నాడు. అపుడు బ్రహ్మగారు ‘నేనే ఈ లోకముల నన్నిటిని సృష్టించాను నేనే నిక్కపు కర్తను. నేనే ఈ సమస్త లోకములను ప్రవర్తింపచేశాను నేనే వీటిని సంహారం చేస్తాను. నేనెప్పుడూ బతికే ఉంటాను. కాబట్టి నాకన్నా బ్రహ్మమెవరు? నేనే బ్రహ్మమును’ అన్నాడు. తరువాత పక్కనున్న విష్ణువు ‘బ్రహ్మా, నా అంతవాడిని నేను అంటున్నావు. అసలు నీవు పుట్టింది నా నాభి కమలంలోంచి కదా! బ్రహ్మమును నేను’ అన్నారు. ఇద్దరికీ ఈ విషయంలో జగడం వచ్చింది. మనకి శృతి ప్రమాణం కదా అందుకని వేదాలని పిలుద్దాం అని వేదాలని పిలిచారు. అపుడు ఋగ్వేదం ఈ సమస్తమునకు సృష్టికర్త ఏ మహానుభావుడు సంకల్పం చేయాలని మొట్టమొదట నారాయణుడు జన్మించాడో ఎవడు చిట్టచివర ఈ లోకములని తనలోకి తీసుకుంటున్నాడో అటువంటి ఆ పరమశివుడు పరబ్రహ్మము అంది. దాన్ని తీసి పారేసి యజుర్వేదమును పిలిచారు. అసురీశాక్తులు పోయి ఈశ్వరీ శక్తులు రావడానికి జ్ఞానమును మహేశ్వరుడు ఇస్తాడు. కాబట్టి జ్ఞాన యజ్ఞమునందు ఆరాధింపబడుతున్నవాడు కనుక పరమశివుడే పరబ్రహ్మము అని చెప్పింది తరువాత సామవేదమును పిలిచి అడిగారు మూడు కన్నులున్న వాడెవడు ఉన్నాడో ఎవరు ఈ లోకమునంతటినీ తిప్పుతున్నాడో ఆ తిప్పుతున్న వాడిని ఏ యోగులు ఉపాసన చేస్తున్నారో ఏ యోగులకి ఉపాసన చేత జ్ఞానమునందు తెలియబడుతున్నాడో ఎవరడు తనలో తాను రమిస్తూ ఉంటాడో అటువంటి శివుడు పరబ్రహ్మము’ అని చెప్పింది. పిమ్మట అధర్వణ వేదము ఏ మహానుభావుడిని భక్తులందరూ సంసార సముద్రమును దాటి దుఃఖమును పోగొట్టుకుని ఆనందమును తెలుసుకోవడానికి ఉపాసన చేస్తున్నారో అటువంటి పరమశివుడు పరబ్రహ్మము’ అని చెప్పింది. అంటే సృష్టి చేసింది మనం కాదు, నిలబెట్టింది మనం కాదు, వేరొకడున్నాడు. తెలుసుకో అని శాస్త్ర ప్రమాణం. నాలుగు వేదములు అదే చెప్తున్నారు. ఇప్పుడు ప్రణవాన్ని పిలిచారు. అపుడు ప్రణవం ఎవడు నిరంతరమూ శక్తి స్వరూపముతో క్రీడిస్తూ ఉంటాడో, శక్తి ఆయనను విడిచిపెట్టి ఉండదో, శక్తీశ్వరులై వారున్నారో, అటువంటి శక్తీశ్వరుడై శక్తి ఆయనతో ఆయన శక్తితో విడివడకుండా కలిసి ఉంటారో అటువంటి పార్వతీ పరమేశ్వరులు, పార్వతి వామార్థ భాగమునందు ఉన్న శంకరుడే పరబ్రహ్మము’ అని చెప్పింది. ప్రణవం చెప్పిన మాటను వాళ్ళు అంగీకరించలేదు. ఈమాటలు రుచించక పోతే ఇప్పుడు ఈశ్వరుడు దండించవలసి ఉంటుంది. కాబట్టి ఈశ్వరుడు అంతటా నిండిన పరబ్రహ్మము జ్యోతిగా మారింది. జ్యోతి సాకారం అయింది. సాకారమును చూసినప్పుడు విష్ణువు ఊరుకున్నాడు. కానీ బ్రహ్మ నీవు ఎవరు? నువ్వు నా రెండు కనుబొమల మధ్యలోంచి పుట్టిన రుద్రుడవు. నన్ను స్తోత్రం చెయ్యి’ అన్నాడు.
బ్రహ్మలో మార్పు రాలేదు. ఆయన దండింపబడాలి. కాబట్టి ఇపుడు ఆ జ్యోతి ఘోర రూపమును పొందింది. ‘ఏమి నీ ఆజ్ఞ అని మొదటి రూపమును అడిగాడు. అహంకారంతో మాట్లాడుతున్నాడు. అయిదవ తలను గిల్లెయ్యి’ అంది. ఇప్పుడు ఈ స్వరూపం ప్రచండ రూపమును పొందింది. దిగంబరమై అయిదవతలను గోటితో గిల్లేసింది. ఆ రూపమే కాలభైరవ స్వరూపం. ఇలా జరిగేసరికి బ్రహ్మ నాలుగు తలకాయలు బట్టుకు వెళ్లి అమ్మవారి చేతుల క్రింద పెట్టేసి ఈశ్వరా, నేను చేసిన పొరపాటు మన్నించి ఉదారుడవై నన్ను కాపాడు అన్నాడు. అపుడు శంకరుడు కాల భైరవునితో నీవు కాలము వలె ప్రకాశించుచున్నావు. కాలము ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అలా ఉంది నీ నడక. నీ నడకలో బ్రహ్మ తల తెగిపోయింది. కాబట్టి నిన్ను ఇవాళ్టి నుంచి కాలభైరవ అని పిలుస్తారు. నీవు ఎంత గొప్ప వాడవయినా బ్రహ్మ తల తెంపేశావు కాబట్టి నీకు బ్రహ్మహత్యాపాతకం అంటుకుంది. ఈ అయిదవ తలకాయ పుర్రెను చేతిలో పట్టుకుని పన్నెండు సంవత్సరములు భిక్షాటన చేసి ఆ కపాలంలో తిను. అపుడు నీ బ్రహ్మ హత్యా పాతకం పోతుంది. పుట్టేతప్పటికే నీ స్వరూపమును చూసేటప్పటికీ లోకం అంతా గజగజలాడిపోయింది. కాబట్టి నిన్ను భైరవ శబ్దంతో పిలుస్తారు. ఎవడు ఈశ్వరుని ధిక్కరించి ఇచట బ్రతుకుతాడో వాడి ప్రాణోత్క్రమణము అవగానే నువ్వే కనపడతావు. దీనిని ‘భైరవ యాతన’ అంటారు. అప్పుడు జీవుడు నిన్ను చూసి హడలిపోతాడు. కానీ ఎవరు నీ గురించి వింటారో, శివాలయమునకు వచ్చినపుడు ఎవరు కాలభైరవుడి యందు శిరస్సు వంచి నమస్కరిస్తారో వాళ్ళ పాపమును నీవు తీసెయ్యి. అలా తీసేసే శక్తిని నేను నీకు ఇచ్చాను కాబట్టి నిన్ను ‘అమర్దకుడు’ అని పిలుస్తారు.
ఇకనుంచి నీవు నా దేవాలయములలో క్షేత్ర పాలకుడవయి ఉంటావు. భక్తుల పాపములను నీవు తీసిన వాటిని నువ్వు తినేసెయ్యి. నువ్వు పాపములను తినేసి వాళ్ళను రక్షిస్తావు కాబట్టి నీకు ‘పాప భక్షకుడు’ అనే పేరును ఇస్తున్నాను. నిన్ను కాశీ క్షేత్రమునకు అధిపతిగా ఉంచుతున్నాను. నీ అనుగ్రహం ఉన్నవాళ్ళే కాశీక్షేత్ర ప్రవేశం చేస్తారు’ అని చెప్పాడు. అందుకే మనను కాశీక్షేత్రంలోని కాలభైరవుడు ఆ క్షేత్రప్రవేశానికి అనుమతించిన క్షేత్రపాలకుడు కనుక అయ్యా నాకు లోపలికి ప్రవేశింపచేసి నా పాపములను దగ్ధం చేశావు కాలభైరవా’ అని ఆ మహానుభావుడికి ఇంటికి రాగానే కృతజ్ఞతా పూర్వకంగా కాలభైరవ పూజ అని చేసి ఇకనుంచి మంచి పనులు చేస్తాను అని అన్న సంతర్పణ చేస్తాడు. భైరవ మూర్తి ప్రసన్నమూర్తి అయినాడని చెప్పడానికే ఆయన మేడలో ఒక గారెల దండ వేస్తారు. కాశీ సంతర్పణ చేస్తే తప్పకుండా వెళ్లి ఆ ప్రసాదమును తీసుకోవాలి.
ఇహలోకమునందు ఇప్పటివరకు ఈశ్వరుడి పట్ల తాము చేసిన దూషణల ఫలితము ఎలా పోతుందని బెంగ పెట్టుకున్న వాళ్ళ కోసం భైరవ యాతన ఇక్కడే తేలికగా అనుభవింప చేస్తాడు.
అందుకే హరిద్వార్, ఋషికేశ్ వెళ్ళిన వాళ్ళు మానసా దేవి ఆలయమునకు వెళ్తే బయటకు వచ్చేటప్పుడు ‘ఒకసారి ఒంగోండి’ అని ఒక బెత్తం పెట్టి వీపు మీద కొడతారు. అది భైరవ యాతన అని ఆ కర్ర ఠప్ అంటుంది. అక్కడితో పాపాలు పోతాయి. ఈవిధంగా ఆ నాడు పరమేశ్వరుడు కాల భైరవుడికి ఇన్ని వరములను గుప్పించాడు. ఆ మూర్తే ఇప్పటికీ మనకి ప్రతి శివాలయంలో ఆయన ఈశ్వర ఆజ్ఞను ఔదలదాల్చి వచ్చినవాడు కనుక మహానుభావుడు కాలభైరవ స్వరూపంతో ఉంటాడు. ఆయన భక్తుల పాలిట కొంగుబంగారం. ఎవరు ఈశ్వర ధిక్కారం చేస్తాడో వారి పాలిట భైరవ దర్శనంగా భయంకరంగా కనపడతాడు.
కాబట్టి ఆ కాలభైరవ స్వరూపం అంత గొప్పది. ‘మేము కాశీ వెళ్ళాము – మాకు ఇంట ఏ భయమూ లేదు’ అని చెప్పడానికి ఒక నల్లతాడును రక్షగా కూడా కట్టుకుంటారు. కాబట్టి ఇన్ని రూపములుగా ఆ కాలభైరవ స్వరూపం ఆనాడు ఆవిష్కరింపబడింది.
ఎవరు ఈ కాలభైరవ స్వరూపమును గురించి వింటున్నారో భక్తితో ప్రణమిల్లుతున్నారో ఒక్కసారి నమస్కరిస్తున్నారో అటువంటి వారు శివానుగ్రహాన్ని పొందుతారు. కాలభైరవుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడు. వాళ్ళు ఎప్పుడూ ఎంతో సంతోషంగా, సుఖంగా ఉంటారు.

ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371


శివపురాణం 26



ఒకనాడు పార్వతీదేవి చెలికత్తెలయిన జయ విజయలు అమ్మవారితో ఒకమాట చెప్పారు. ‘అమ్మా, నంది నిన్నూ వహిస్తాడు, శంకరుడినీ వహిస్తాడు. కానీ ఆయనకు కొంచెం శంకరుని మాల ఔదలదాల్చడంలోనే సంతోషం ఎక్కువ. భ్రుంగీ అంతే. మన మాటే వినేవాడు ఒకడు లేడు. అలాంటి వాడు మనకి ఒకడు ఉంటే బాగుంటుంది. అందుకని నీవు ఒకడిని సృష్టించి ద్వారపాలకుడిగా పెడితే వాడు నీ మాటే వింటూంటాడు. అలాంటి వాడిని తయారు చెయ్యి. అతడు మన అంతఃపురమును కాపాడడానికి పనికివస్తాడు” అని చెప్పారు. వారి మాటలు విన్న పార్వతీ దేవి అలాగే చేద్దాం అని తన శరీరమునకు ఉన్న మలమును స్నానం చేసేటప్పుడు నలుగు పిండిలా తీసి దానిలోంచి ఒక పిల్లవాడిని తయారు చేసింది. నలుగులోంచి తయారు చేయబడిన పిల్లవాడు ఎలా ఉన్నాడన్నది ఎవరికీ తెలియదు. చాలా బాగుండాలని అమ్మవారు సంకల్పం చేసి ప్రాణప్రతిష్ఠ చేసింది. వాడు లేచి కూర్చున్నాడు. అపుడు వానితో నీవు వెళ్లి ద్వారము దగ్గర కూర్చుని ఎవరూ లోపలి రాకుండా నిలుపు’ అంది అపుడు ఆ పిల్లవాడు ద్వారం దగ్గర కూర్చున్నాడు.
ప్రమథగణములలో ముందు నందీశ్వరుడు విజయం చేస్తుండగా శివుడు లోపలి వెళ్ళబోయాడు.ఈ పిల్లవాడు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు అన్నాడు. ముందు శంకరుడు జ్యోక్యం చేసుకోలేదు. అపుడు ప్రమథగణములకు ఆ పిల్లాడికి మధ్య యుద్ధం జరిగింది. ఎవరు సలహా చెప్పారో వాళ్ళే అమంవారి దగ్గరకు వచ్చి అమ్మా పిల్లవాడు యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి నీ శక్తులను పిల్లవాడికి ఇవ్వవలసింది అని చెప్పారు. అమ్మవారు శక్తులను ఇచ్చింది. ఆ పిల్లవాడు అద్భుతమయిన యుద్ధం చేసి ప్రమథగణములనన్నిటిని ఓడించేశాడు. ఇంక అక్కడ నుండి బ్రహ్మ, విష్ణువు కూడా వచ్చేశారు యుద్ధానికి. అయినా ఆ పిల్లవాడు శంకరుడిని లోపలికి పంపించలేదు. అపుడు శంకరుడు చేతిలో త్రిశూలమును పట్టుకుని పిల్లవాని కంఠమునకు గురి పెట్టి విసిరాడు. అపుడు త్రిశూలం ఆ పిల్లవాని కంఠమును ఉత్తరించేసింది. ఆ పిల్లవాడు క్రిందపడి మరణించాడు. తరువాత శంకరుడు లోపలికి వెళ్ళాడు. భార్యాభర్తలిద్దరూ సంతోషంగా మాట్లాడుకుంటున్న సమయంలో పార్వతీదేవి బయట కాపలా పెట్టిన పిల్లవాని ప్రస్తావన వచ్చింది. అపుడు శివుడు ఆ పిల్లవానిని త్రిశూల ధారల చేత చంపేశాను అన్నాడు. అపుడు పార్వతీదేవి అయ్యో ఆ పిల్లాడిని నేనే సృష్టించాను – చంపేశారా అని దుఃఖమును పొందింది. ఆవిడ దుఃఖమును ఉపశమింపజేయడానికి దేవతలు అందరూ వచ్చారు. ఆవిడ శంకరుని తన బిడ్డను మరల బ్రతికించమని అడిగింది. అప్పుడు ఆయన తన అనుచరులను పిలిచి మీరు ఉత్తర దిక్కుగా వెళ్ళి మీకు మొట్టమొదట కనపడిన ప్రాణి ఏదయితే ఉంటుందో దాని తలకాయ తీసుకురండి. ఆ తలకాయ పిల్లవాడికి పెడతాను’ అన్నాడు. వాళ్లకి మొట్టమొదట ఏనుగు కనపడింది. వాళ్ళు దాని తలకాయ పట్టుకొచ్చారు. దానిని ఈ పడిపోయిన పిల్లవాని కంఠమునకు కలిపాడు. ఆ పిల్లవాడు చక్కగా లేచి కూర్చున్నాడు. ఇప్పుడు వానికి శంకరుడెవరో తెలిసి శంకరునికి నమస్కారం చేశాడు. వెంటనే శంకరుడు కూడా వాడిని ఎత్తి తొడమీద కూర్చోపెట్టుకున్నాడు. ఈలోపుగా సుబ్రహ్మణ్య జననం కూడా జరిగిపోయింది. ఈ ఇద్దరి పిల్లలతో సంసారం చక్కగా నడిచిపోతోంది.
ఒకరోజు ఒక యోగ్యమయిన సంబంధం వచ్చింది విశ్వరూప ప్రజాపతి అనే ఆయన తన ఇద్దరు కుమార్తెలయిన సిద్ధిబుద్ధి అనే వాళ్ళను ఇవ్వాలనుకుంటున్నాను అని వచ్చాడు. అపుడు శంకరుడు తన కుమారులను పిలిచి ఎవరు ముందు భూప్రదక్షిణ చేసి వస్తే వారికి ముందుగా పెళ్ళి చేస్తానన్నాడు. ఇద్దరూ బయలుదేరారు. గణపటిది మూషిక వాహనం. అందుకని ఆయన తల్లిదండ్రులిద్దరికీ ఏడుమార్లు ప్రదక్షిణం చేసి వారిని పత్ర పుష్పములతో పూజ చేశారు. సుబ్రహ్మణ్యుడికి ఎక్కడికి వెళ్ళినా వినాయకుడు ముందుగా వెళ్ళిపోతున్నట్లు కనపడుతున్నాడు. పార్వతీ పరమేశ్వరునకు ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసిన ఫలితమును ఆయన ఖాతాలో వేసి ‘నువ్వు చెప్పినటువంటి నియమమును పాటించిన వాడివి కనుక నీకు ముందు వివాహం చేస్తున్నాను అని చెప్పి సిద్ధి బుద్ధిలను గణపతికిచ్చి వివాహం చేశారు. సుబ్రహ్మణ్య స్వామీ వారు క్రౌంచ పర్వతం దగ్గరకు వెళ్ళారు. పార్వతీ పరమేశ్వరులు కూడా వెళ్ళారు.
ఇక్కడ మనకు కొన్ని సందేహములు కలగడానికి అవకాశం ఉంది. ఒకవేళ నిజంగా శంకరుడు ఆ పిల్లవాని తలను తీసివేసి ఉంటే ఏనుగు తల పెట్టడం ఎందుకు? పడిపోయిన తలకాయనే అతికించవచ్చు కదా! అని. పార్వతీ దేవి అనగా పరమ ప్రక్రుతి. పరమ శివుడనగా పరమ పురుషుడు. పరమ ప్రకృతి అంటే పంచ భూతములు. పంచభూతములయందలి కదలిక పరమేశ్వరుడు. అమ్మవారు భూతములన్నిటిని తయారుచేస్తుంది. కానీ లోపల చైతన్యం శివుడు. అంటే శివ సంబంధమయిన ఎరుక లేదు. లోపల ఉన్న చైతన్యము ‘నేను’ అన్నది తెలియదు. పైన ఉన్న శరీరము మూడు గుణముల చేత బంధింపబడి ఉంది. ఈ మూడు గుణములే ప్రకృతి యొక్క మలము. అదే అమ్మవారి శరీరంలోంచి వచ్చిన మలము. ఆ మలముతో పిల్లవాడు తయారు అయాడు. అంటే త్రిగుణములయందు కొట్టుమిట్టాడుతున్నాడు. కాబట్టి ఈ తలకు ప్రకృతి తెలుసు శివుడు తెలియదు. లోపల ఉన్న చైతన్యం బయట నిలబడిన శివుడు అని తెలియదు. కాబట్టి ఆయన దానితోనే పోరాటం చేశాడు. శంకరుడు ఆ పిల్లవాని తలను త్రిశూలంతో తరిగేశాడు. త్రిశూలమునకు ఉన్న మూడు త్రిగుణములు, వీటికి ఆధారమైన సత్యము శంకరుని చేతిలో ఉన్న త్రిశూలం. శంకరుడు గుణాతీతుడు. ఎప్పుడయితే శివుడి చేతి త్రిశూలం పిల్లవాని కంఠమునకు తగిలిందో త్రిగుణములకు సంబంధించిన బుద్ధి పోయింది. ఇప్పుడు ‘గజ’ – ఏనుగు తల పెట్టబడింది. ‘గ’ అంటే గతి అంటే కదలడం; ‘జ’ అంటే పుట్టడం. ఇపుడు ఆ పిల్లవానికి ఇందులోంచి పుట్టి ఇందులోకి వెళుతున్నాడో తెలిసిపోయింది. అంటే ఇప్పుడు శివసంబంధం వచ్చేసింది. శివుడు తెలిసిపోయాడు. తెలిసిపోవడం గజముఖం. అందుకని శంకరుడికి నమస్కారం చేశాడు. ఇది మీరు చెయ్యవలసిన ఉపాసనా క్రమమును వినాయకుని మూర్తి ద్వారా లోకమునకు తెలియజెప్పడం. ఏనుగు తల బ్రహ్మాండమును చెప్తే మనిషి శరీరం పిండాండమును చెప్తుంది. బ్రహ్మాండం, పిండాండం రెండింటి యందు పంచభూతములు ఉన్నాయి. రెండూ పంచ భూతములలో నిండి ఉన్నప్పటికీ రెండింటియందు ఉన్నది ఒక్కటే అని జీవ బ్రహ్మైక్య సిద్ధిని పొంది తత్త్వమసి అర్థమయితే ‘తత్ త్వం అసి’ ‘అదే వాడి ఉన్నాడు’ జీవుడే ఈశ్వరుడై ఉన్నాడు అని తెలియడమే ఏనుగు ముఖం మనుష్యుడు తల కంఠం దగ్గర శివానుగ్రహంతో కలవడం. కాబట్టి తత్త్వమసి మహావాక్యం నడయాడితే మహాగణపతిగా తిరుగుతున్నాడు. కాబట్టి ఇప్పుడాయన వినాయకుడు అయ్యాడు. ‘వి’ అంటే విశిష్టమయిన – అనగా విశిష్టమయిన నాయకుడు అయ్యాడు. మీరు ఆయనను ఉపాసన చేస్తే ఆయన మిమ్మల్ని అటువంటి పథంలోకి తీసుకు వెడతాడు. ఆయన విఘ్నములకు నాయకుడు. విఘ్నమును తీసేస్తాడు. మీరు ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుస్తాడు.
గణపతి పరబ్రహ్మమై ఉన్నాడు. ఈయనకు సిద్ధిబుద్ధి భార్యలు. ఎవరు బుద్ధిని ఉపయోగిస్తాడో వాడు సిద్ధిని పొందగలడు. బుద్ధి అనేది ఒక్క మనుష్య ప్రాణికే ఉంది. గణపతి ఆరాధన చేత మంచి బుద్ధి వచ్చి సిద్ధి పొందడమే ఆయనకీ సిద్ధి బుద్ధి భార్యలు అయి ఉండడం. ఆ అనుగ్రహం మీయందు ప్రసరింపబడడం. ఏనుగుకు అన్నిటికన్నా ఇష్టమైనది దాని దంతం. కానీ అది నమలడానికి పనికిరాదు. ఏనుగు ముఖం ఉన్న గణపతి వ్యాసుడు భారతం చెప్తుంటే తన దంతమును విరిచేసి దానితో రచన చేశాడు. మనకి ఉన్న వస్తువులను లోకోపకారానికి ఉపయోగించాలి. భారతమును రచించడానికి తన దంతం ఉపయోగ పడితే కొన్ని యుగాలపాటు పంచమ వేదమయిన భారతమును లోకం చదువుకుని ఉద్ధరింపబడుతుంది అని భావించి తన దంతమును విరిచేసి దానితో భారతమును రచన చేశాడు. ‘ఏకదంతం, శూర్పకర్ణం, లంబోదరం’ అని పేర్లు సంపాదించాడు. ఎంతో శాశ్వతమయిన యశస్సు పొందాడు. శివుడు ఎంత సులభుడో వినాయకుడు అంత సులభుడు. ఇరువది ఒక్క గరిక తెచ్చి ఆయన పాదముల మీద వేస్తే చాలు. అన్నీ ఇచ్చేస్తాడు. కొద్దిగా సింధూరమును గండయుగ్మమునాకు రాస్తే చాలు పొంగిపోతాడు. ఏనుగు తల కనపడితే మంగళ ప్రదము. చివరకు కలలోకి ఏనుగు వచ్చినా అది మంగళప్రదమే.
గణపతి స్వరూపంలో చిత్రమయినది ఎలుక. గణపతికి వాహనం ఎలుక. ఎలుక దొంగతనానికి ప్రతీక. మనతో పాటే ఉంటుంది. మన వస్తువులన్నీ ఎత్తుకుపోతూ ఉంటుంది. మన బ్రతుకూ అంతే. విఘ్నేశ్వరుని ప్రార్థిస్తే మనకి ఆయన పదిమంది హృదయాలను కొల్లగొట్ట గలిగిన దొంగతనమును పొందుతాడు. అనగా ఈశ్వరాభిముఖుడై భగవద్భక్తి చేత తాను మాట్లాడిన మాటలకు పరవశులై చాలామంది హృదయాలను తాను కొల్లగొట్టే దొంగ అవుతాడు. ఇలా మారడానికి ఎలుక విఘ్నేశ్వరుడిని వహించింది. మీరు కూడా అలా వహించడం నేర్చుకోవాలి. పదిమంది ప్రేమను సంపాదించుకోవడం నేర్చుకోవాలి. దీనిని సూచించదానికే ఎలుకను వాహనంగా పెట్టుకున్నాడు. ఎలుక చెవులు పెద్దవిగా ఉంటాయి చేట లాగా. గణపతిని నమ్మి ఆవాహన చేసి జాగ్రత్తగా ఉపాసన చేస్తే లోకంలో పొల్లు తీసేసి సారం వైపుకి మనలను నడిపిస్తాడు. పరమభక్తిని ఇస్తాడు. ఆయన ఆయుధమయిన గొడ్డలితో కర్మ పాశములను తెంచి భక్తీ పాశములను వేసి తన వైపుకి లాక్కుంటాడు.
చవితి తిథి ఆయనకు చాలా ఇష్టమైన తిథి. ఆరోజు ఎవరయినా వినాయకుడి గురించి ప్రత్యేకంగా వినినా, చదివినా వారు ఎంతో ప్రయోజనమును పొందుతారు. పరమ భక్తితో స్వామికి నమస్కారం చేసినా ఎవరు కోరుకున్నది వారికి అనుగ్రహిస్తాడు. విద్యార్థికి విద్య వస్తుంది. ద్రవ్యార్థికి ద్రవ్యం వస్తుంది. కన్యార్థికి కన్య దొరుకుతుంది. పుత్రార్థికి పుత్రుడు పుడతాడు. భోగార్థి అయిన వాడికి భోగములు కలుగుతాయి. మోక్షార్థికి మోక్షం దొరుకుతుంది. రాజ్యార్థికి రాజ్యం, కీర్తి కావాలనుకున్న వారికి కీర్తి వస్తుంది. ఆరోగ్యం కుదుటపడక చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్లకి ఆరోగ్యం కలుగుతుంది. ఋణభారంతో ఉన్నవాడికి ఋణం తొలగుతుంది. ఇక్కట్టులలో ఉన్న వాడికి ఇక్కట్టులు తొలగిపోతాయి. గణపతి దర్శనం చేత గణపతి యొక్క అనుగ్రహం చేత గణపతి కథను చదవడం చేత సమస్త శుభములు సమకూడతాయని పెద్దలు మనకు ఫలశ్రుతిని వివరణ చేసి ఉన్నారు. కాబట్టి ఆ గజానన స్వరూపము అంత గొప్ప స్వరూపము.

Friday 17 November 2017

పంచాంగం నవంబర్ 18, 2017



ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
నవంబర్ 18, 2017
శనివారం (స్థిరవాసరే)
శ్రీ *హేమలంబి* నామ సంవత్సరం
దక్షిణాయనం శరద్ ఋతువు
కార్తీక మాసం బహుళ పక్షం
తిధి : అమావాస్య మ3.50
తదుపరి మార్గశిర శుక్ల పాడ్యమి
నక్షత్రం : విశాఖ రా7.00
తదుపరి అనూరాధ
యోగం : శోభన రా9.41
తదుపరి అతిగండ
కరణం : నాగవ మ3.50
తదుపరి కింస్తుఘ్నం తె4.37
సూర్యరాశి : వృశ్చికం
చంద్రరాశి : తుల
సూర్యోదయం : 6.09
సూర్యాస్తమయం : 5.21
రాహుకాలం : ఉ9.00 - 10.30
యమగండం : మ1.30 - 3.00
వర్జ్యం : రా11.11 - 1.05
దుర్ముహూర్తం : ఉ6.09 - 7.39
అమృతకాలం : ఉ9.33 - 11.16
శుభమస్తు

పంచాంగం నవంబర్ 17, 2017




ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
నవంబర్ 17, 2017
శుక్రవారం (భృగువాసరే)
శ్రీ *హేమలంబి* నామ సంవత్సరం
దక్షిణాయనం శరద్ ఋతువు
కార్తీక మాసం బహుళ పక్షం
తిధి : చతుర్దశి మ2.39 తదుపరి అమావాస్య
నక్షత్రం : స్వాతి సా5.15 తదుపరి విశాఖ
యోగం : సౌభాగ్యం రా9.50
కరణం : శకుని మ2.39 తదుపరి చతుష్పాద్ తె3.14
సూర్యరాశి : తుల
చంద్రరాశి : తుల
సూర్యోదయం : 6.09
సూర్యాస్తమయం : 5.21
రాహుకాలం : ఉ10.30 - 12.00
యమగండం : మ3.00 - 4.30
వర్జ్యం : రా11.15 - 12.58
దుర్ముహూర్తం : ఉ8.23 - 9.08 & మ12.07 - 12.52
అమృతకాలం : ఉ7.59 - 9.40
శుభమస్తు

Monday 13 November 2017

నవంబర్ 2017 కుంభరాశి రాశిపలం







https://www.youtube.com/watch?v=S4JelwiD8JU

నవంబర్ 2017 సింహరాశి రాశిపలం



https://www.youtube.com/watch?v=f2do1r3f5DQ

నవంబర్ 2017 కర్కాటకరాశి రాశిపలం



https://www.youtube.com/watch?v=G96fT3HY7M8

నవంబర్ 2017 కన్యరాశి రాశిపలం



https://www.youtube.com/watch?v=m14BEhP7PXU

నవంబర్ 2017 తులారాశి రాశిపలం



https://www.youtube.com/watch?v=dLUBkc66vAw

నవంబర్ 2017 వృశ్చికరాశి రాశిపలం




https://www.youtube.com/watch?v=YAFUx0fmFwE

నవంబర్ 2017 వృషభరాశి రాశిపలం






https://www.youtube.com/watch?v=c5A_7J1kEmE