Monday 20 November 2017

POWER OF SOUND VIBRATION




శబ్దానికి తరంగశక్తి వుంటుంది, దాని ఫ్రీక్వెన్సీ స్థాయిని బట్టి నెగెటీవ్ లేదా పాజిటివ్ వైబ్రేషన్ ఉత్పన్నమవుతుంది. మంత్ర శాస్త్రంలో శబ్దానికే అత్యంత ప్రాముఖ్యత వుంటుంది, బీజాక్షరాల తో ఏర్పడే శబ్దం ఒక అద్భుతమైన మంత్ర శక్తిగా రూపాంతరం చెందుతుంది, వాటి నుండి వచ్చే శక్తి వైబ్రేషనే నాడు యంత్రాలుగా, చక్రాలుగా రూపొందించబడ్డాయి, ఇదంతా మన పూర్వీకులు దివ్య దృష్టితో ఏనాడో కనొగొని మంత్రం, యంత్రం, తంత్రం వంటి వాటిని ఆచరించి చూపించారు,
పేరూ కూడా ఒక శబ్దమే, మన పేరులోని ప్రతి అక్షరానికి ఒక సంఖ్యా వైబ్రేషన్, ఒక గ్రహ తత్వం వుంటుంది, వ్యక్తి పుట్టిన సమయాన్ని అనుసరించి ఆయా వ్యక్తికి కొన్ని మిత్ర గ్రహాలు, మిత్ర సంఖ్యలు, శత్రు గ్రహాలు, శత్రు సంఖ్యలు ఏర్పడుతాయి, వ్యక్తి పేరులో మిత్ర అక్షరాలు, మిత్ర సంఖ్యా వైబ్రేషన్ ఎక్కువగా వుంటే తలచిన కార్యాలను నెరవేర్చుకోగలగడం, అవకాశాలను అందిపుచ్చుకోగలగడం, జీవితంలో మెట్టు మెట్టుగా ఎదగడం వంటివి జరిగి అదృష్ట జాతకుడిగా పేరు గడిస్తారు, ఆ వ్యక్తి జన్మ తేదీని అనుసరించి అతని పేరులో శత్రు సంఖ్యా వైబ్రేషన్ ఎక్కువగా వుంటే కృషికి తగిన ఫలితాలు దక్కకపోవడం, అవకాశాలు జారవిడుచుకోవడం, మానసిక అనిశ్చితి మొదలగు సమస్యలతో సతమతమవడం జరుగుతుంటుంది.
ప్రస్థుత కాలంలో మన పాశ్చాత్య చదువుల ప్రభావం చేత మనిషి పుట్టింది మొదలు మరణించేంత వరకు, ఇంగ్లీషులోనే పేర్లు రాయడం, ఇంగ్లీషులోనే సర్టిఫికెట్లు పొందడం, ఇంగ్లీషులోనే సంతాకలు చేయడం జరుగుతుంది, అయితే మన చేతి రాతే మన నుదుటి రాత అనే నిగూఢ సత్యాన్ని ఒక సామేతగా మన పూర్వీకులు మనకు ఏనాడో తెలియజేశారు, మనం ఒక పేరుని రాసుకోవడం వలన, ఆ పేరుని సంతం చేసుకోవడం వలన, ఆపేరుతో పిలిపించుకోవడం వలన, ఆ పేరులోని అక్షరాల ప్రభావం, ఆ అక్షరాల కలయిక చేత ఏర్పడే సంఖ్యా వైబ్రేషన్ పాజిటివ్ గానో, లేదా నెగటివ్ గానో మనపై ప్రభావితం అవుతుంది. దానిని అనుసరించే జీవితంలో మనం ఎదుర్కొనే సంఘటనలు వుంటాయి.
ఎందుకంటే శబ్దానికి అంతటి శక్తి వుంది కాబట్టి, పాశ్చాత్యుడైన స్ట్రాంగ్లన్ అన్న శాస్త్రవేత్త గాయత్రి మంత్రం పై పరిశోధనలు చేసి ఇలా పేర్కొన్నాడు, గాయత్రి మంత్రాన్ని సక్రమంగా ఉచ్చరించినట్లయితే అది ఒక సెకండుకు రెండు లక్షల ప్రకంపనలను కలిగిస్తుంది అని తెలిపి, ప్రయోగ రీత్యా ఆయన అమెరికాలో నిరూపించాడు.
హన్స్ జెన్నీ అనే శాస్త్ర వేత్త ఓంకారం పై పరిశోధనలు చేసి టొనోగ్రఫీ ద్వారా ఏర్పడిని శ్రీ చక్రాన్ని అందరి కళ్ళకీ చూపించి, “ఓం”కార శబ్ద రూపం సాక్షాత్తు శ్రీ చక్రమే అని నిరూపించాడు.
మన శాస్త్రాలపైన పాశ్చాత్యులు తలమునకలై పరిశోధనలు చేసి భారతీయ ఘణత చాటుతుంటే మనలో కొందరు మాత్రం కనీస అధ్యయనం కూడా చేయకుండా, మూఢ నమ్మకాలు, బూటకాలు, ఇంకా ఏ కాలంలో ఉన్నారు అంటూ కొట్టి పారేయడం నిజంగా సిగ్గుచేటు.
అంతెందుకు మనలో ఒకడైన మన లోక కవి, యోగి వేమన పధ్యాలను మనం పట్టించుకోకుండా వదిలేస్తే పాశ్చాత్తుడైన
సి. పి. బ్రౌన్ వాటిని వెలుగులోకి తెచ్చి, ఆ పద్యాల మహత్యాన్ని మనందరికీ తెలియజేసాడు.
భారతీయులుగా పుట్టి కూడా మనలో కొందరు మన శాస్త్రాల పట్ల విశ్వాసం కూడా లేకుండా కళ్ళుమూసుకుపోయి హేళన చేస్తున్నారే కానీ ఇతర దేశస్తులు మాత్రం భారతీయ శాస్త్రాలను కళ్ళకద్దుకుని స్వీకరించి వాటిపై పరిశోధనలు చేసి వారి వారి దేశ కాలమాన పరిస్థితులకు తగినట్లూగా అభివృద్ది పరుచుకుంటున్నారు.

 హస్త సాముద్రికం పై వారు చేసిన పరిశోధనలు నేడు భారతీయ శాస్త్రాలకు ధీటుగా నిలిచాయి.
ఇంతకు మించి ఏం కావాలి భారతీయ శాస్త్రాల గొప్పదనం తెలియజేయడానికి.
జన్మ తేదీని అనుసరించి మరియు జన్మ తేదీ లేని వారికి వారి హస్త రేఖలలో వారికి అనుకూలముగా వున్న గ్రహ స్థానాలను అనుసరించి నా వద్ద నేం కరెక్షన్ చేసుకున్న వారెందరో, కోర్సులా రాసుకుని, సత్ఫలితాలను పొంది తిరిగి వారి కుటుంబ సభ్యులను, మిత్రులను నా వద్దకు తీసుకు వచ్చిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి.
పిల్లలు పుట్టగానే మంచి సంఖ్యా వైబ్రేషన్ గల పేరుని ఇస్తే వారు పెద్దయ్యాకా, మార్పులు, చేర్పులు, కోర్స్ రాయాడాలు అవసరం లేకుండా, పుట్టినప్పటి నుండి అదృష్ట జాతకులుగా ఎదిగి పేరు, ప్రఖ్యాతలు గడిస్తారు,
పిల్లలకు ఆస్తులు ఇవ్వవలసిన పని లేదు, అదృష్ట నామాన్ని ఇస్తే చాలు, అదే పిల్లల బంగారు భవిష్యత్తుకు వేసే పునాది,
ఇప్పటి వరకూ నేను ఎన్నో జాతకాలు పరిశీలన చేశాను, పేరులోని సంఖ్యల వైబ్రేషన్ పాజిటీవ్ గా వున్న వారు అదృష్టవంతులుగా వుండి, ఆనందకర జీవితాన్ని పొందడం, పేరులోని సంఖ్యల వైబ్రేషన్ నెగటీవ్ గా వున్న వారు దురదృష్టవంతుగా వుండి దుఃఖపూరిత జీవితాన్ని కలిగి వుండడం జరుగుతుంది,
వ్యక్తి పేరే ఒక మంత్రం, పేరు రాయడం ఒక తంత్రం,
ఈ మంత్రం, తంత్రం ఫలించడం లేదా దుష్ఫలించడం అనేది
ఆ వ్యక్తి పుట్టిన తేదీ పై ఆధారపడి వుంటుంది.

No comments:

Post a Comment