Monday 28 January 2019

Tip Of The Day




Kids Room

If Your Kids want  to more active and more Energitic Let them use ENEfpr sleeping .Kids room csn at be ENE

వివాహ విషయంలో సప్తమ స్ధానం ప్రాముఖ్యత



భారతీయ సాంప్రదాయంలో వివాహం జీవితంలో ఒకే ఒకసారి జరిగే అతి ముఖ్యమైన అంశం. వివాహం అనంతరం భార్యా భర్తలు జీవితాంతం కలసి ఉండే విధంగా జాతకాదులు పరిశీలించాలి. వివాహ విషయంలో కేవలం వధూవరుల గుణమేళన పట్టికలోని గుణాలను మాత్రమే పరిశీలించటమే కాకుండా, మిగతా అంశాలైన సప్తమ స్ధానం, పంచమ స్ధానం, వివాహానంతర దశలు మొదలగు అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవలెను.
ప్రస్తుతం వధూవరుల నిర్ణయ విషయంలో ఉభయులకు విద్య, వృత్తి, సంపాదన, ఆస్తి, అందం, రంగు, పొడవు, ఎత్తు, లావు, సన్నం అనే విషయాలపై శ్రద్ధ వహిస్తూ ఇద్దరి మధ్య సామరస్యానికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ఇద్దరి మద్య సఖ్యత లోపించినప్పుడు పై అంశాలు అన్ని నిరర్ధకం అని తెలుసుకోవాలి.
         యుక్త వయస్సు దాటి ఆలస్యమవుతుందని ఆరాట్మ్లో ఏదో ఒక సంబందాన్ని కుదుర్చుకోవాలనే ఆతృత కంటే వధూవరుల శాశ్వత సౌఖ్యానికి అధిక ప్రాదాన్యమిచ్చి ఆలస్యమైనా సరైన సంబంధం నిర్ణయించటం సముచితం.
      ప్రస్తుత సమాజంలో మహిళలు విద్య, వివిధ రంగాలలో ఉత్సాహం చూపిస్తూ స్వతంత్ర భావాలు, స్వాభిమానం, ధైర్యం పెంపోందించుకుంటున్నారు. ఉద్యోగ, వృత్తి, వ్యాపారాలు నిర్వహిస్తూ స్వయంగా సంపాదనకు ప్రాముఖ్యం ఇస్తూ పురుషులకు పోటీతత్వంగా ఉంటున్నారు. కళలు, క్రీడలు, రాజకీయ రంగాలలో రాణిస్తున్నారు. కనుక శక్తికి, చైతన్యానికి, స్వతంత్ర భావాలకు, ధైర్య సాహసాలకు కారకుడు అయిన కుజ గ్రహం వీరి జాతకాలలో బలంగా కనిపిస్తుంది. వివాదాలకు కూడా కుజుడే కారకుడు కావటం వలన దాంపత్య జీవితంలో ప్రతికూల స్ధానంలో ఉన్న కుజుడు సఖ్యతకు భంగం కలిగించే అవకాశాలు ఉన్నాయి. విద్యా అర్హతలతో ఉద్యోగాలలో రాణిస్తున్న నేటి మహిళలు భర్త వేదింపులు సహించలేక ఎటువంటి సంకోచం లేకుండా విడాకులకు సిద్ధమవుతున్నారు. కనుక తల్లిదండ్రులు, వధూవరుల జాతకంలోని సఖ్యత విషయమై నిదానంగా పరిశీలించి నిర్ణయాలకు రావటం శ్రేయస్కరం.
           ముందుగా ఇద్దరి  జాతకాలలోని సప్తమ స్ధానం, అక్కడి గ్రహాలను, సప్తమాధిపతి ఉన్న రాశి, భావాలను, వాటికి ఇతర గ్రహాల దృష్టి సంయోగాలను పరిశీలించాలి.
         సప్తమంలో రవి, బుధ గురు, శుక్రులు శుభ ఫలితాన్ని ఇస్తారు. చంద్రుడు మిశ్రమ ఫలితాన్ని ఇస్తాడు. శని, రాహు, కేతువులు బాధను కలిగిస్తారు. వక్రించిన గ్రహాలు సప్తమంలోఉన్న, సప్తమాధిపతి వక్రించిన వివాహ సంబంధాలు నిర్ణయించటం కష్టం అవటమే కాకుండా ఆలస్యమవుతుంది.
        లగ్నాధిపతికి సప్తమాధిపతి సంయోగం కానీ, పరస్పర కోణ స్ధితి ఉన్న ఇద్దరి మధ్య సఖ్యతకు నిదర్శనంగా ఉంటుంది.
            సప్తమ స్ధానంలో శనిగ్రహం ఉన్న వివాహం ఆలస్యం అవుతుంది. లేదా ఇద్దరి మద్య వయో భేదం ఉంటుంది. లేదా ఇదివరకు వివాహం అయిన వారితో పెళ్ళి జరగచ్చు. లేదా వివాహం పట్ల విముఖత, అశ్రద్ధ, అసంతృప్తి కనిపించవచ్చు. సప్తమ శనికి శుభదృష్టి ఉంటే క్రమేణ అనుబంధాలు బలపడతాయి. కేంద్రంలో ఉన్న రవి, చంద్ర, శుక్రులకు శనితో సంయోగం ఇబ్బందికరంగా ఉంటుంది.
             సప్తమంలో కుజుడి వలన తీవ్ర విభేధాలు, వివాదాలు సంభవిస్తాయి. కేంద్రంలో ఉన్న చంద్ర, శుక్రులతో  కుజుడు కలసి ఉన్న ప్రతికూల పరిస్ధితులు ఉంటాయి. గురు దృష్టి ఉన్న అనుకూలంగా ఉండును.
             సప్తమంలో రాహు, కేతువుల వలన అపోహలతో సంసార జీవితాన్ని పాడు చేసుకుంటారు. అన్య మతస్ధులతో గాని ఇతర కులస్ధులతో గాని వివాహం జరిగే సూచనలు ఉన్నాయి. శుభగ్రహ దృష్టి ఉంటే అనుకూల పరిస్ధితులు ఉంటాయి.
         
          లగ్నం, సప్తమ స్ధానం ద్విస్వభావ రాశులైన మిధునం, మీన, కన్య రాశులై  రవి, చంద్ర, కుజ, శుక్రులు సప్తమాధిపతి ఈ  ద్విస్వభావ రాశులలో ఉంటే రెండు వివాహాలు గాని, వివాహేతర సంబంధాలు గాని జరగవచ్చు.
             సప్తమ స్ధానంలో చంద్రుడు ఉన్న అందమైన వారితో గాని, సంచార వృత్తి లేదా ఉద్యోగం ఉన్న వారితో గాని, జన సంబంద, జనాకర్షణ కలిగిన వృత్తులలో ఉన్న వారితో వివాహం జరిగే అవకాశం ఉంది. సప్తమ చంద్ర స్ధితి కొంత వ్యామోహాలకు, చంచలత్వానికి సంకేతంగా ఉంటుంది.
            లగ్నం నుండి చతుర్ధాధిపతికి సప్తమం, సప్తమాధిపతితో సంబంధం ఏర్పడిన మాతృ వర్గీయులతోను, దశమాధిపతికి సప్తమం, సప్తమాధిపతితో సంబంధం ఏర్పడిన పితృ వర్గీయులతో వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి.
             లగ్నం నుండి తృతీయ, నవమ స్ధానాలకు సప్తమ స్ధానంతో సంబంధం ఏర్పడితే  సోదరి, సోదరులు లేదా ధూరపు బందువులకు సంబందించిన వారితో లేదా వారి చొరవతో వివాహం  జరుగుతుంది.
        సప్తమాధిపతి నవమ, ద్వాదశ స్ధానాలలో ఉంటే విదేశాలలో ఉన్నవారితో గాని, భోధన, ప్రచార, సమాచార, సంచార రంగాలలో ఉన్న వారితో వివాహం జరగవచ్చును.
        సప్తమాధిపతి షష్టమ, అష్టమ, ద్వాదశ స్ధానాలలో ఉన్న వైద్యులతో  వివాహం జరుగవచ్చు.
సప్తమాధిపతి పంచమ, లాభ, తృతీయ, నవమ స్ధానాలలో ఉన్న, లేదా వాటి అధిపతులు సప్తమంలో ఉన్న ప్రేమ వివాహాలు జరుగవచ్చు.
సప్తమాధిపతి ద్వాదశ భావాలలో ఏ భావంలో ఉన్న ఆ భావానికి సంబంధించిన విషయాలలో ఆసక్తి గాని, వృత్తిగాని, ప్రాదాన్యం.

పంచాంగం . 29 - 01 - 2019



ఓం శ్రీ గురుభ్యోనమః🙏
🌷పంచాంగం🌷
శ్రీరస్తు, శుభమస్థు, అవిఘ్నమస్థు,
తేదీ ... 29 - 01 - 2019,
వారం ... మంగళవారం, ( భౌమ్యవాసరే ),
శ్రీ విళంబి నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
హేమంత ఋతువు,
పుష్య మాసం,
బహుళ పక్షం,
తిధి : నవమి రా7.24
తదుపరి దశమి,
నక్షత్రం : విశాఖ రా7.53
తదుపరి అనూరాధ,
యోగం : గండం ఉ11.18
తదుపరి వృద్ధి,
కరణం : తైతుల ఉ7.44
తదుపరి గరజి రా7.24
ఆ తదుపరి వణిజ,
వర్జ్యం : రా11.57 - 1.35,
దుర్ముహూర్తం : ఉ8.52 - 9.37 &
రా10.57 - 11.48,
అమృతకాలం : ఉ11.05 - 12.40,
రాహుకాలం : మ3.00 - 4.30,
యమగండం. : ఉ9.00 - 10.30,
సూర్యరాశి : మకరం,
చంద్రరాశి : తుల,
సూర్యోదయం : 6.38,
సూర్యాస్తమయం : 5.49,

ఈరోజు తేదీ ... 27 జనవరి, 2019, ఆదివారం, భానుసప్తమి.


ఆదివారం, సప్తమి తిథి కలిసి వస్తే దాన్ని భాను సప్తమి అంటారు. ఇది చాలా గొప్ప యోగం.
సాధారణంగా ఆదివారం నాడు అనేక నియమాలు పాటించాలని ధర్మశాస్త్రం చెబుతోంది. వాటిలో ప్రధానంగా
1. సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవడం
2. ఆదివారం అభ్యంగన స్నానం చేయకపోవటం. ఆ రోజు కేవలం శిరస్నానం మాత్రమే చేయాలి.
3. వంటికి, తలకు నూనె పెట్టుకోరాదు.
4. ఉల్లి, వెల్లుల్లి, మద్యము, మాంసాహారానికి దూరంగా ఉండాలి.
5. బ్రహ్మచర్యం పాటించాలి.
నవగ్రహాలకు అధిపతి సూర్యభగవానుడు. ఆయన కటాక్షం ఉంటే మనకు అసాధ్యమైనది ఏదీ ఉండదు. సుర్యారాధనతో విద్యా, వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. అవివాహితులకు వివాహమవుతుంది. సంతానం కలుగుతుంది. మనఃశ్శాంతి లభిస్తుంది. సూర్యారాధనతో లభించనిది అంటూ ఏదీ ఉండదు.
- ఈ భానుసప్తమి అనేది సూర్యునికి సంబంధించిన ఒకానొక పర్వదినమున, గొప్ప యోగము. ఈ రోజు చేసే స్నానం, దానము, జపము, హోమము లక్ష రెట్ల ఫలితాన్ని ఇస్తుందని శాస్త్ర వచనం.
- పెద్దలు ఈ రోజున ఆవుపాలతో చేసిన పరమాన్నము శ్రీ సూర్య భగవానునికి నివేదన చేస్తారు.
- ఆదివారం నాడు సూర్యోదయానికి పూర్వం నిద్రలేచి స్నానాదికాలు ముగించనివారు, ఆహార నియమాలు పాటించని వారికి 7 జన్మల పాటు రోగాలు వస్తాయని, దరిద్రం పడుతుందని శాస్త్రవచనం. ఈ విషయాన్ని పరమశివుడే సూర్యాష్టకంలో చెబుతారు.
ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్ధినే
సప్త జన్మ భవేద్రోగీ జన్మ కర్మ దరిద్రతా
స్త్రీ తైల మధు మాంసాని హస్త్యజేత్తు రవేర్ధినే
న వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం స గచ్ఛతి
భావం - తినకూడని పదార్ధాలు, మద్యము, మాంసము మొదలైనవి తినేవాడు ఏ జన్మల పాటు రోగాలతో బాధపడతాడు. ఆజన్మాంతం దరిద్రం ఉంటుంది. స్త్రీ సమాగమము, తైలం రాసుకోనుట, మద్యమాంసాలను ఆదివారం విడిచిపెట్టినవానికి శోకం, వ్యాధి, దారిద్ర్యం ఉండదు. అతడు నేరుగా సూర్యలోకనికి వెళతాడు.
- ఈ నియమాలు ఒక్క భానుసప్తమికే పరిమితం కాదు, ప్రతి ఆదివారం విధిగా పాటించమని పరమశివుడు సూర్యాష్టకంలో చెప్పారు. కనుక అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోమని, దుర్వినియోగం చేయవద్దని సూచన.
- ఈనాడు సూర్యుని అనుగ్రహం కోసం సూర్యాష్టకం, ఆదిత్యహృదయం, సూర్య ద్వాదశనామాలు పఠించడం శ్రేష్ఠం.సూర్యనమస్కారాలు ఎంతో శుభఫలితాన్ని, కామ్యసిద్ధిని ఇస్తాయి.
ఓం శ్రీ సూర్యనారాయణ నాయ నమః

Tuesday 22 January 2019

Tip Of The Day - Photoes of friends and relatives



Photoes of friends and relatives

Keep your inlaws, relatives Friends photos at NORTH SOUTH  to get help from them and to maintain good rapo in between.

శరణు అన్నవారిని స్వామి వెతుక్కుంటూ వస్తాడు!


ఒక ఆవు అడవిలో గడ్డి మేస్తుండగా, ఒక పులిని చూసి పారిపోసాగింది.
పులి బారినుండి తప్పించుకోవడానికి ఆ ఆవు ఒక నీళ్ళులేని, బాగా బురదగా ఉన్న చిన్న చెరువులో దూకేసింది. ఆ ఆవును తరుముకుంటూ వస్తున్న పులి కూడా ఆ తమకంలో ఆ బురదగా ఉన్న చెరువులో దూకేసింది.
ఆ రెండు ఆ నీళ్ళు లేని బురదతో ఉన్న చెరువులో ఎంత ఒకదాని మీద ఒకటి పడ్డా, ఆ చెరువులో నుండి బయట పడటం వాటి వల్ల కాలేదు.
పులి ఆవుని చూసి, ” ఇప్పుడు నీ ఎముకలు పరపరా నమిలేయాలని ఉంది ” అన్నది.
ఆ పులి ఆవు పైకి పంజా విసరాలని శతవిదాల ప్రయత్నించి విఫలమైంది. ఆ బురదలో నుండి తప్పించుకోలేక నిస్సహాయురాలైంది.
అప్పుడా ఆవు పులిని చూసి నవ్వి, ”నీకు యజమాని ఎవరైనా ఉన్నారా? అనడిగింది
పులి, "_”ఏం మాట్లాడుతున్నావు. ఈ అడవికి యజమానిని నేనే!! నువ్వెందుకు అలా అడుగుతున్నావు. నాకు నేనే కదా యజమానిని”_ అని గర్వంగా గర్జించింది.
అప్పుడా ఆవు _”నువ్వీ అడవికి రాజువే కావచ్చు. కానీ ఇప్పుడు నిన్ను నీవు రక్షించుకోలేని స్థితిలో ఉన్నావు కదా”_ అన్నది..
పులి _”నీ పరిస్థితి అంతే కదా!! నువ్వు ఈ బురదలో కూరుకుని ఉన్నావు కదా!! ఆకలితో చస్తావు కదా”_ అన్నది.
అప్పుడా ఆవు *”నేను చావను.”* అన్నది.
”ఈ అడవికి రాజునైన నేనే ఈ బురదలో కూరుకుని పోయి బయటకు రాలేక పోతున్నాను. నువ్వొక సాధుజంతువైన నిన్ను ఎవరు రక్షిస్తారు” అన్నది పులి.
_”నిజమే !! నన్ను నేను రక్షించుకోలేను. కానీ నా స్వామి నన్ను రక్షిస్తాడు. సూర్యాస్తమయం అవ్వడంతో నేను ఇంటికి చేరక పోవడంతో నన్ను వెతుక్కుంటూ వస్తాడు. నన్ను ఈ బురదనుండి పైకి లేపి నన్ను రక్షించి, మా ఇంటికి నన్ను తీసుకువెడతాడు.”_ అని మధురంగా, మెల్లగా చెప్పింది.
పులి స్థబ్దురాలై, దిగాలుపడిపోయింది.
సూర్యాస్తమయం కాగానే, ఆవు చెప్పినట్లు, దాని యజమాని వచ్చి, ఆవు దురవస్థ చూచి, ఆ బురదలో నుండి దానిని పైకి తీశాడు. దానిని ఇంటికి తీసుకుపోయాడు. ఆ ఆవు యజమాని దయపట్ల ఎంతో కృతజ్జత మనస్సులోనే చెప్పుకుంది. ఆవు దాని యజమాని, పులి దురవస్థకు చింతించారు. *కానీ దాని దురహంకారం వారిని దాని దగ్గరకు చేరనివ్వలేదు.*
మనం ఆధ్యాత్మికంగా పరిశీలిస్తే, ఆవు శరణాగతి చేసినవాడికి ప్రతీక. పులి సామాన్య మానవునిలో ఉన్న అహంకారపూరిత మనస్సుకు ప్రతీక. యజమాని గురువు లేదా మన స్వామి. బురద మన చుట్టూ ఉన్న ప్రపంచం, ఆకర్షణలు, పులి ఆవును తరుముకు రావడం మన జీవిత పోరాటం అన్నమాట.
జీవిత పోరాటం అలసిపోయి, ఏమీ చేతకాక, నిస్సహాయ పరిస్థితిలో ఉన్నప్పుడే దైవాన్ని ప్రార్దించడం కాక, మనకు స్వామి ఒకడు ఉన్నాడు అని ఎల్లప్పుడూ అనుకుంటూ మనం ఆ స్వామికి శరణాగతి చేస్తే, దైవమయిన ఆ యజమాని జీవన సమరంలో మనం ఓడిపొతున్నప్పుడు, ఒక నిస్సహాయ పరిస్థితిలో ఉన్నప్పుడు *”నేనున్నాను”* అంటూ వచ్చి మనలను పంకిలం నుండి లేవదీసి ఈ భవబంధాల నుండి విముక్తి ని ప్రసాదిస్తాడు.

Friday 18 January 2019

12 అంకెతో మనుజులకు ఉన్న అనుబంధం.


అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రకృతి లో ఉండే భీబత్సవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన లన నుండి భయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టనో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు . దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము --12 అంకెతో మనుజులకు ఉన్న అనుబంధం-- గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకుందాం . . .

పన్నెండు.. పసందు-నేడు అరుదైన 12-12-12. చివరి అయిదు అంకెలు ఒకలా ఉండాలని కొందరు.. సీరియల్‌గా ఉండాలని మరికొందరు.. మరోలా కావాలని ఇంకొందరు సెల్‌ఫోన్‌ కంపెనీ కార్యాలయాల వద్ద హడావుడి పడుతుండడం చూస్తూనే ఉన్నాం..

ఎంతైనా ఫర్వాలేదు.. నాకా నెంబరు వచ్చేటట్లు చూడండని ఒకరు.. ఎలాగైనా నా నంబరులో ఏడు.. సున్నా లేకుండా చూడాలని ఇంకొకరు.. రోజూ ఆర్టీవో కార్యాలయం వద్ద ఇలాంటి దృశ్యాలు కనిపిస్తూనే ఉన్నాయి..
నీ పుట్టిన తేదీ ఎంత??.. నీ హాల్‌టికెట్‌ నెంబరులోని అంకెల మొత్తం ఎంత?? అది సరిసంఖ్యా, బేసి సంఖ్యా?.. ఏ సంఖ్య అయితే ఏం జరుగుతుంది? ఓ సంఖ్యా శాస్త్రవేత్త అంచనాలూ... టీవీల్లో ప్రత్యేక షోలూ మనకు సుపరిచితమే…

ఇలా ఎక్కడ చూసినా నెంబర్ల గొడవే.. ఏ అంకె అయితే ఏముందిలే అనేవారూ ఉన్నారు... అలాంటి వారికి అస్సలు టేస్టు లేదని విమర్మించేవారికీ కొదవలేదు.

ఎవరి నమ్మకం ఎలా ఉన్నా.. అపుడపుడు అరుదైన సందర్భాలు వస్తుండడం కద్దు. 12-12-12... అంటే... 12వ తేదీ 12వ నెల 12వ సంవత్సరం (2012). అంటే వందేళ్లకోసారి వచ్చే సంబరం. అత్యంత అరుదుగా వచ్చే కొన్ని తేదీలకు ప్రత్యేక విశిష్టతను ఆపాదించటం ఇటీవలకాలంలో సర్వసాధారణమైపోయింది. 12-12-12 తేదీ కూడా ఆ కోవలోనిదే. ఈ సందర్భంగా 12 సంఖ్య విశిష్టతను చెప్పుకోవడంతోపాటు జ్యోతిష్య, సంఖ్యశాస్త్రపరంగా ఎదురయ్యే లాభనష్టాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

నిత్య జీవితంలో 12తో మనకు ఎంతో సంబంధం ఉంది. ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న ఆంగ్ల క్యాలండరుకు 12 నెలలు ఉంటే, భారతీయ ఖగోళ విజ్ఞాన శాస్త్రం ప్రకారం 12 రాశులు, 12 లగ్నాలకు హైందవులు ఇచ్చే ప్రాధాన్యం అంతా, ఇంతా కాదు.

శ్రీకాకుళం జిల్లాతో అనుబంధం

జీవరాశుల ప్రత్యక్ష దైవం.. ఆరోగ్య ప్రదాత అరసవల్లి సూర్యనారాయణస్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన సూర్యనమస్కారాలు 12. ఆ సూర్య భగవానుడిని ప్రజలంతా ఆదిత్య, రవి, సూర్య.. ఇలా 12 పేర్లతో కొలవడం మరో ప్రత్యేకత. పవిత్రమైన భగవద్గీతలో 12వ స్కంధానికి అరుదైన గౌరవం ఉంది. భార్యభర్తల అన్యోన్య దాంపత్యానికి, పండంటి కాపురానికి పన్నెండు సూత్రాలు చెప్పుకుంటుంటారు. ఇలా చెప్పుకుంటూపోతే.. ఎన్నో విశిష్టతల సమాహారం ఆ సంఖ్య. అలాంటి సంఖ్య తేదీల్లో.. నెలల్లో.. ఏడాదిలో వచ్చిన అరుదైన సందర్భమే ఇది.

ఖగోళ.. ఆధ్యాత్మిక నేపథ్యం:
ద్వాదశ (12) రాశుల్లో సూర్యుడు సంచరించే మాసం సౌరమాసం. పన్నెండు మాసాలు ఒక ఏడాది. దీని ఆధారంగానే సౌరమానం ఏర్పడింది. ఈ రాశుల్లోనే సమస్త ప్రాణికోటి జనిస్తుంది. రాశులను ఆధారంగా చేసుకొని నక్షత్రాలు, వీటి ఆధారంగా పాదాలు. ద్వాదశ రాశులు, ద్వాదశ ఆదిత్యులు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, ద్వాదశ దేవతారూపులు, ద్వాదశ పుష్కర తీర్థాలు, ద్వాదశ మాసాలు గురించి వింటుంటాం.

ఆంగ్ల క్యాలండరుకు 12 నెలలు:
1.జనవరి, 2. ఫిబ్రవరి, 3. మార్చి, 4. ఏప్రిల్ , 5. మే, 6. జూన్‌, 7. జూలై, 8. ఆగస్ట్ , 9. సెప్టెంబర్ , 10. అక్టోబర్ , 11. నవంబర్ , 12. డిసెంబర్.

ద్వాదశ దేవతారూపులు :
1.కన్నతండ్రి, 2.పోషించిన వాడు, 3.విద్య చెప్పినవాడు, 4.మంత్రాన్ని ఉపదేశించినవాడు, 5.ఆపదలో రక్షించేవాడు, 6.దారిద్య్రాన్ని పోగొట్టేవాడు, 7.భయాన్ని పోగొట్టువాడు, 8.కన్యాదానం చేసిన వాడు, 9.జ్ఞానం ఉపదేశించినవాడు, 10.ఉపకారం చేసినవాడు, 11రాజు, 12భగవద్భక్తుడు.

ద్వాదశ పుష్కర తీర్థాలు :
1.గంగ, 2.నర్మద, 3.సరస్వతి, 4.యమున, 5.గౌతమి, 6.కృష్ణ, 7.కావేరి, 8.తామ్రపర్ణి, 9.సింధు, 10.తుంగభధ్ర, 11.తపతీ, 12.సరయూ నదుల పుష్కరాలు.

ద్వాదశ జ్యోతిర్లింగాలు :
1.సోమనాథేశ్వరుడు, 2.శ్రీశైలమల్లికార్జునేశ్వరుడు, 3.శ్రీమహాకాళేశ్వరుడు, 4.శ్రీఓంకారేశ్వరుడు, 5.శ్రీవైద్యనాథేశ్వరుడు, 6.శ్రీభీమేశ్వరుడు, 7.శ్రీరామేశ్వరుడు, 8.శ్రీనాగనాథేశ్వరుడు, 9.శ్రీవిశ్వనాథేశ్వరుడు, 10.శ్రీత్రయంబకేశ్వరుడు, 11.శ్రీకేదారేశ్వరుడు, 12.శ్రీఘృష్ణేశ్వరుడు.

ద్వాదశ ఆదిత్యులు :

1.మిత్ర, 2.రవి, 3.సూర్య, 4.భాను, 5.ఖగ, 6.పూష్ణ, 7.హిరణ్యగర్భ, 8.మరీచి, 9.ఆదిత్య, 10.సవిత్రు, 11.ఆర్క, 12.భాస్కర.

ద్వాదశ రాశులు :
1.మేషం, 2.వృషభం, 3.మిథునం, 4.కర్కాటకం, 5.సింహం,6. కన్య, 7.తుల, 8.వృశ్చికం, 9.ధనుస్సు, 10.మకరం, 11.కుంభం, 12.మీనం.

ద్వాదశ మాసాలు :
1.చైత్రం, 2.వైశాఖం, 3.జ్యేష్ఠం, 4.ఆషాఢం, 5.శ్రావణం, 6.భాద్రపదం, 7.ఆశ్వయుజం, 8.కార్తీకం, 9.మార్గశిరం, 10.పుష్యం, 11.మాఘం, 12.ఫాల్గుణం.


పారిజాత వృక్షం


పారిజాత వృక్షం గురించి తెలియని వారుండరు. ఈ వృక్షం పేరు చెప్పగానే వెంటనే అందరికి గుర్తుకొచ్చే పేర్లు ఏవంటే శ్రీకృష్ణుడు,సత్యభామ. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు పారిజాత వృక్షాన్ని స్వర్గం నుంచి తీసుక వచ్చి సత్యభామకు ఇచ్చాడని నానుడి ఉంది. శ్రీకృష్ణుడు తెచ్చిన పారిజాత వృక్షం  ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బారాబంకి జిల్లా, కింటూర్ అనే గ్రామంలో ఉంది.  ఈ పారిజాత వృక్షాన్ని ఇప్పడు కూడా భక్తులు చూడవచ్చు. ఈ మహా వృక్షాన్ని ప్రపంచంలోని వృక్ష శాత్రవేత్తలు పరిశీలించి, ప్రపంచంలోనే విలక్షణమైన వృక్షంగా దీనిని గుర్తించారు.

ఈ వృక్షానికి సంబంధించి కొన్ని పురాణ కథలు కూడా  ఉన్నాయి
  • కింటూర్ గ్రామం బారాబంకి పట్టణానికి 38 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ గ్రామాన్ని మొదట 'కుంతి' అని పిలిచేవారు. 'కుంతి' పాండవుల తల్లి. మహాభారత కాలంలో కుంతి దేవి ఒక శివాలయాన్ని ఈ ఊరిలో నిర్మించుకొని అక్కడే ప్రాణాలను విడిచిందట అలా ఆవిడ చితాబస్మం నుంచి పారిజాత అనబడే వృక్షం పుట్టుకొచ్చిందని అక్కడి వారి భావన.
  • మరో కథనం ప్రకారం అర్జునుడు స్వర్గం నుండి పారిజాత వృక్షాన్ని తీసుకొని వచ్చాడని, కుంతీ దేవి ఈ పారిజాత పుష్పాలను తెంపుకొని శివుడికి పూజలు చేసేదని మరోక వాదన
  • శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంద్రలోకం నుంచి పారిజాత వృక్షాన్ని తీసుకొని వచ్చి సత్యభామకు బహుకరించాడు. దీనిని దొంగిలించడానికి ప్రయత్నించే శ్రీకృష్ణుడు కష్టాలలో పడతాడు. ఆ కథే పారిజాతాపహరణం.
             
              ఈ పురాణ కధనాలు నిజమో కాదో తెలీదు గానీ ఈ వృక్షం మాత్రం పురాతమైనదని చెప్పడం మాత్రం ఖచ్చితం. దీని వయస్సు సుమారు ఐదు వేల సంవత్సరాలకు పైగానే ఉండవచ్చని వృక్ష శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ప్రపంచంలోని ఏ చెట్టుకూ లేని ప్రత్యేకత ఈ చెట్టుకు ఉంది. ఆ ప్రత్యేకతలు ఏమిటంటే... ఈ వృక్షం పునరుత్పత్తి గానీ, పండ్లు గానీ ఉత్పత్తి చేయదు. దిగువ భాగంలో ఈ చెట్టు ఆకులు ఎలా ఉంటాయంటే చేతి ఐదు వేళ్ళను పోలి ఉంటాయి. పై భాగాన ఆకులు ఏడు భాగాలుగా ఉంటాయి. వీటి పుష్పాలు కూడా ఎంతో అందంగా బంగారు, తెలుపు రంగు కలిసిన వర్ణములో ఉంటాయి. 
           పారిజాత పుష్పం ఈ చెట్టుకు పుష్పాలు ఎప్పుడు పడితే అప్పుడు వికసించదు. ఇది కేవలం జూన్/ జులై నెలలో మాత్రమే వికసిస్తుంది. ఈ పుష్పాల సువాసనలు చాలా దూరం వరకు వ్యాపిస్తుంది. వృక్షం యొక్క ఎత్తు 45 అడుగులు, చుట్టుకొలత 50 అడుగులు గా పేర్కొనటం జరిగింది. వృక్షం గొప్పతనం ఏమిటంటే, దీని శాఖలు గానీ, ఆకులు గానీ కుచించుకుపోయి కాండంలో కలవడమే తప్ప ఎండిపోయి రాలటం మాత్రం జరగదట. ఇది నిజమేనని అక్కడికెళ్లిన భక్తులు కూడా చెప్పుతుంటారు. ఆ చెట్టు వద్ద ఆకులు గాని..పుష్పాలు గాని కింద రాలినట్లు అసలు కనిపించవని వారు తెలుపుతారు.

సత్సంగం ఎందులకు ?



మనలోని ఆసుర లక్షణాలు తొలగించడానికి....

దంభము --- తనకు లేని దానిని ఉన్నట్లుగా ప్రదర్శించటము,
దర్పము -- తాను అందరికన్నా గొప్పవాడిని అని భావించటం,
దురభిమానము -- ఇతరులు తనకన్నా తక్కువ వారు నేనే ఉన్నతమైన వాడిని అని భావించటం,
దీర్ఘకాలము ప్రదర్శించే క్రోధము,
పరుషత్వము -- మాట ద్వారాగానీ ,చేష్ట ద్వారా గానీ ఎదుటివాడిని గాయపరచే లక్షణము,
మూర్ఖత్వము ---దేశకాల వ్యవస్థలగురించి తనగురించి ఇతరుల గురించి ఇంగితము లేకుండా ఉండటం
ఆసుర లక్షణాల గురించి భగవానుడు చాలా చక్కగా వివరించారు... కలికాలంలో ఎక్కువగా కనబడేది ఆసురప్రవృత్తియే ! మనలోకి మనం తొంగి చూసి ఆ లక్షణాలు పెరుగుతున్నప్పుడలా కత్తిరించుకోవడమే మన కర్తవ్యము ....

*అందుకు సత్సంగమే మార్గమని ఆదిశంకరులు కూడా బోధించారు*

Thursday 17 January 2019

పంచాంగం తేదీ ... 18 - 01 - 2019


🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏
🌹పంచాంగం🌹
శ్రీరస్తు, శుభమస్థు, అవిఘ్నమస్తు,
తేదీ ... 18 - 01 - 2019,
వారం ... శుక్రవారం, ( బృహస్పతి వాసరే ),
శ్రీ విళంబి నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
హేమంత ఋతువు,
పుష్య మాసం,
శుక్లపక్షం,
తిధి : ద్వాదశి సా5.21
తదుపరి త్రయోదశి,
నక్షత్రం : రోహిణి ఉ9.41
తదుపరి మృగశిర,
యోగం : బ్రహ్మం రా8.18
తదుపరి ఐంద్రం,
కరణం : బాలువ సా5.21
తదుపరి కౌలువ తె4.33
ఆ తదుపరి తైతుల,
వర్జ్య : మ3.05 - 4.37,
దుర్ముహూర్తం : ఉ8.51 - 9.35 &
మ12.32 - 1.16,
అమృతకాలం : ఉ8.07వరకు &
రా12.21 - 1.53,
రాహుకాలం. : ఉ10.30 -12.00,
యమగండం. : మ3.00 - 4.30,
సూర్యరాశి : మకరం,
చంద్రరాశి : వృషభం,
సూర్యోదయం : 6.38,
సూర్యాస్తమయం : 5.42,

భగవద్గీత అంటే ఏమిటి?





– జీవితమంతా అయిపోయిన తర్వాత చదువుకోవాల్సిన పుస్తకమా?
– రిటైర్‌మెంట్‌ రోజు సహోద్యోగులు ఇచ్చే బహుమతా?
– ఎవరైనా మరణించినప్పుడు ప్లే చేసే సీడీనా?
– అది కేవలం హిందువులదా?
– పనీపాటా వదిలేసి సన్యసించమని చెబుతుందా అది?
మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళుతున్నాం, ఏం చేస్తున్నాం, ఏం ప్రతిఫలం అందుకుంటున్నాం? అందుకు ప్రతిగా ఏం చేయాలి? కన్ ఫ్యూజన్ లేకుండా భగవద్గీతను మూడు ముక్కల్లో చెప్పాలంటే- ఇంతకంటే పెద్ద సెంటెన్సులు లేవు. కొందరు అనుకున్నట్టుగా, భగవద్గీత ఎట్టిపరిస్థితుల్లో మతగ్రంథం కానే కాదు. కురుక్షేత్ర సంగ్రామంలో అందరినీ చంపడం అధర్మం అనే చింత. అందరూ చచ్చిపోతారనే బాధ. ఈ రెండింటి గురించి మథనపడే అర్జునుడికి- శ్రీకృష్ణుడు విడమరిచి చెప్పిన సారాంశమే భగవద్గీత. 
వేల ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా నిత్య చైతన్య ప్రవాహమై, దారిమరిచిన బాటసారికి కరదీపికై, సమస్త భూమండలాన్ని దివ్యశక్తితో ముందుకు నడిపిస్తున్న ఏకైక గ్రంథం - ఇగిరిపోని గంధం- భగవద్గీత. ఇదేదో మతోద్బోధ అనుకునే వాళ్ల మైండ్ సెట్ మార్చలేం.
ఆధ్యాత్మిక ప్రవచనమైనా, వ్యాపార సూక్తులైనా, మేనేజ్మెంట్ కోర్సులైనా, వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులైనా, ఆటలో గెలవాలన్నా, పరీక్షలో పాస్ కావాలన్నా, జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్నా, ఎక్కడో చోట ఏదో సందర్భంలో గీతను కోట్ చేస్తాం. గీత గురించి చర్చిస్తాం. ఆది శంకరాచార్య దగ్గర్నుంచి స్వామీ వివేకానంద, మాక్స్ ముల్లర్ దాకా భగవద్గీత గొప్పదనాన్ని వేనోళ్లా చాటినవారే.
ఎన్నటికీ తరగని మేథో నిధి ఆ గ్రంథం.

“కాదు. అవన్నీ అపోహలు. ఒక్కముక్కలో చెప్పాలంటే భగవద్గీత ‘డైనమిక్‌ ప్రిస్కిప్షన్‌ ఫర్‌ లైఫ్‌’. సంతృప్తిసంతోషాలు నిండిన జీవితం గడపాలంటే, చేస్తున్న పనిలో విజయం సాధించాలంటే గీతను అర్థం చేసుకోవాలి. చిన్నవయసులోనే అది జరగాలి”


గవద్గీత జ్ఞానం సర్వసమస్యలను నివారిస్తుంది, సకల శుభాలను కలిగిస్తుంది. మానవులందరి సమస్త దుఃఖాలను తరిమివేయడానికి, వారికి సమస్త విజయాన్ని చేకూర్చడానికే భగవద్గీత జ్ఞానం ధరణిపై అవతరించింది. దాదాపు పన్నెండు కోట్ల సంవత్సరాల కిందటే శ్రీకృష్ణుని ద్వారా సూర్యదేవుడైన వివస్వానునికి చెప్పిన ఈ గీతాజ్ఞానము 20 లక్షల సంవత్సరాలుగా మానవ సమాజంలో విలసిల్లుతున్నట్లు చరిత్ర చెబుతోంది. అయితే కాలక్రమంలో దాని ఉనికి తగ్గినట్లు కనిపించడం వల్ల శ్రీకృష్ణుడు తిరిగి దానిని ఐదువేల సంవత్సరాల కిందట అర్జునునికి చెప్పాడు.
మానవుల సకల శ్రేయస్సు కొరకు చెప్పబడిన భగవద్గీత మీద జనులకు ఎందుకు విశ్వాసం కలగడం లేదు? ఇది వినేవాళ్లలో లోపమా, లేకపోతే చెప్పే వాళ్లలో లోపమా? సమస్త దుఃఖాలలో కూరుకొనిపోయి ఉన్నప్పటికిని జనులు ఎందుకు సకల సమస్యా నివారిణియైున భగవద్గీతను ఆశ్రయించలేకపోతున్నారు? నిజంగా భగవద్గీతలో సర్వసమస్యలను నివారించగలిగేటంత శక్తి ఉన్నదా? నిజ జీవితంలో భగవద్గీతను ఏ విధంగా అమలు చేయవచ్చును? ఐదువేల ఏళ్లనాడు చెప్పిన భగవద్గీత నేటి 21వ శతాబ్దం పరిస్థితిలో సంగతమే అవుతుందా? ఇటువంటి ఎన్నో ప్రశ్నల కారణంగా మనిషి ఈ దివ్య గీతాజ్ఞానానికి దూరమవుతున్నాడా?
దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని దివ్యసందేశమైనట్టి భగవద్గీత అత్యంత పురాతన కాలం నుంచి గంగానదిలాగా మానవసంఘంలో ప్రవహిస్తోంది. తత్కారణంగా అనంతకాలం నుండి అసంఖ్యాకమైన పుణ్యాత్ములు అమృతమయమైన గీతాజ్ఞానాన్ని స్వీకరించి కృతార్థులై తరించారు. కొంతమంది మహనీయులు కేవలం తామే గీతామృతం ద్వారా అమరులు కావడంతో సంతృప్తి చెందక, దానిని ప్రపంచవ్యాప్తం చేశారు. ఆ విధంగా వారు ప్రపంచమానవాళినందరినీ ఉద్ధరించారు. అన్ని రకాల జీవులలో కనిపించే కార్యాలను నాల్గింటిగా మనం విభజించవచ్చు.
ఆహారం తినడం, నిద్రపోవడం, సుఖాలు  అనుభవించడం, స్వీయరక్షణ చేసుకోవడం. అయితే అతి దుర్లభంగా లభించే మానవజన్మలో ఈ కార్యాలతో పాటు ఆత్మోద్ధారానికి సంబంధించిన పనులను కూడా ప్రవేశపెట్టాలి. ఇంకా సూటిగా, స్పష్టంగా చెప్పాలంటే పైన తెలిపిన నాలుగు కార్యాలను ఆత్మోద్ధారముతో ముడిపెట్టి జీవించి పరమానందాన్ని పొందాలి. ఈ విధంగా చేయకపోతే మానవసమాజం కేవలం జంతుసమాజమే అవుతుంది. ఆత్మదర్శనానికై ఉవ్విళ్లూరే శ్రద్ధాళువు హృదయంలో మహోన్నతమైన మార్పును తీసుకొనిరావడంలో భగవద్గీత ఒక గొప్ప పాత్రను పోషిస్తుంది.
భగవదవతారమైన వ్యాసదేవుడే సకల శాస్త్రాలను రచించారు. వేదాలు, ఉపనిషత్తులు, వేదాంగసూత్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఇంకా ఎన్నో ఆయన రచించారు. అయితే భగవద్గీత అనేది స్వయంగా భగవంతుడు పలికిన జ్ఞానం. సకల మానవాళి శ్రేయస్సు కొరకే శ్రీకృష్ణుడు దానిని పలికాడు. ఆ దేవదేవుడు తొలుత గీతాజ్ఞానాన్ని సూర్యునికి చెబితే, సూర్యుడు తన పుత్రుడు మనువుకు చెప్పాడని, మనువు దానిని ఇక్ష్వాకు మహారాజుకు చెప్పాడని భగవద్గీతలో ఉంది. ఈ రకంగా గీతాజ్ఞానామృతం మానవసమాజంలో లభించడం మొదలైంది.
నిజానికి జ్ఞానమే బలం. కండబలం నిజమైన బలం కానేకాదు. ఇది అక్షర సత్యం. జీవికను సంపాదించుకోవడానికి మనిషి ఏదో ఒక, ఎంతో కొంత జ్ఞానాన్ని సంపాదించుకోవాల్సి ఉంటుంది. కానీ నిత్యజీవనాన్ని, నిత్యానందాన్ని ప్రసాదించే జ్ఞానం అన్ని జ్ఞానాలలో శ్రేష్టమైనది. అది సామాన్య జ్ఞానానికి పూర్తిగా భిన్నమైనట్టిది. దానికి కేవలం ప్రామాణిక శాసా్త్రల ద్వారా, సాధువురుషుల ద్వారా, ప్రామాణిక గురువు ద్వారా మాత్రమే మనిషి పొందగలుగుతాడు. శ్రీకృష్ణుడు అటువంటి దివ్యమైన జ్ఞానాన్ని జనులందరికీ ఇచ్చాడు కనుకనే జగత్తులో జగద్గురువుగా ప్రసిద్ధి చెందాడు.
అటువంటి జగద్గురువు కోరిన రీతిగా గీతాజ్ఞానాన్ని పంచే శుద్ధ భక్తులు నిశ్చయంగా భగవత్కృపకు పాత్రులౌతారు. ఆ విధంగా కృష్ణకృపకు పాత్రులయ్యే భక్తులు జీవితంలో కృతకృత్యులై రాబోయే తరాలవారికి ఆదర్శనీయులౌతారు. తనను అనుసరించే వారి జీవితాలను జయప్రదం చేయడంలో భగవద్గీత మహిమ ఎంతో ఘనమైనది. అందుకే గీతాజ్ఞానం మానవసంఘంలో తెంపు లేకుండా ప్రవహిస్తూ ఉంది.

అసలు భగవద్గీత కంతటికీ సమగ్ర సారమేమిటి అనేది అతి సులభంగా ఈ శ్లోకంలో చెప్పారు యామునాచార్యులు.

స్వధర్మజ్ఞాన వైరాగ్య సాధ్యభక్త్యేకగోచరః
నారాయణః పరం బ్రహ్మా గీతాశాస్త్రే సమీరితః

భగవద్గీతకి సారాంశం నారాయణుడు అని ఒక్క అర శ్లోకంలో చెప్పేసారు గీతా సారాంశాన్ని. మరి ఎలాంటి నారాయణుడు అతడు, "స్వధర్మజ్ఞాన వైరాగ్య సాధ్యభక్త్యేకగోచరః" మేం నారాయణుని కోసం తపస్సు చేస్తాం, జపం చేస్తాం, యజ్ఞం చేస్తాం, యాగం చేస్తాం, మేం యోగం చేస్తాం. అంటే ఆయన యాగం వల్లనో యోగం వల్లనో లభించేవాడు కాదు. భక్తి వల్ల లభించు భగవంతుడు మనకి భగవద్గీతలో కనిపిస్తున్నాడు. భక్తి అంటే ఏమి ? ప్రేమ. ఎట్లాంటి ప్రేమ ? భగవంతుడి మీద నిష్కలంకమైన ప్రేమ. అంటే ప్రేమించి ఏమిస్తావు తిరిగి అడగకపోయేది ప్రేమ. మనం హోటలుకి వెళ్తే భోజనం పెట్టి ఇంత ఇవ్వు అనేది ప్రేమ కాదు. మూల్యం అడగకుండా ప్రతి ఫలాన్ని ఆశించకుండా చేసేదేదో దాన్ని ప్రేమ అంటాం. తల్లి తన పిల్లవాడిని వాడు రేపు పెద్దవాడై ఏదో ఉద్దరిస్తాడని ప్రేమ చేయదు. ప్రేమించ కుండా ఉండలేక తాను ప్రేమ చేస్తుంది, దాన్ని కదా మనం ప్రేమ అనేది. ఎదురు చూడక ప్రతిఫలం ఆశించక చేసేది ప్రేమ. అట్లాంటి ప్రేమతో ఎవడైతే భగవంతున్ని సేవిస్తాడో దాన్ని భక్తి అంటారు. అట్లాంటి ప్రేమకు లభించు తత్త్వం అనేది మనకు భగవద్గీతలో కనిపిస్తుంది.

"స్వధర్మజ్ఞాన వైరాగ్య సాధ్యభక్త్యేకగోచరః", ఆ భగవంతుని పై ఏర్పడ్డ ప్రేమ వల్ల మనకి ఇతరత్రమైన వాటి యంది రుచి తగ్గుతుంది. దాన్ని వైరాగ్యం అంటాం. ఆ భగవంతుని గురించి ఎంతేంత ఎంతెంత వింటుంటే అంతంత అంతంత తెలుస్తూ ఉంటుంది దాన్ని జ్ఞానం అంటాం. ఎంత తెలిస్తే ఆ భగవంతుని కోసం ఏదో ఒకటి చేద్దాం అని అనిపిస్తుంది. ఎదో ఒకటి చేద్దాం అని అనిపిస్తుంది దాన్ని ధర్మం అంటాం. ఆ చేసేప్పుడు భగవంతునికి నచ్చేట్టు చేయాలనిపిస్తుంది అందుకు ఆయన మనకి ఏది నియమించాడో దాన్ని స్వధర్మం అంటారు. ఇలా స్వధర్మంతో ఏర్పడ్డ జ్ఞానం వల్ల వైరాగ్యంతో ప్రేమకలిగితే ఆ ప్రేమకి లభించువాడు నారాయణుడు అంటే. ఇది భగవద్గీత చెప్పేది.

"నారాయణః పరం బ్రహ్మా గీతాశాస్త్రే సమీరితః", అంటే భగవద్గీతలో నారాయణుడే పరమ దైవము అని చెప్పబడి ఉంది. అదేంటి మాకు నారాయణుడు గొప్ప వాడని తెలుసును, అయితే భగవద్గీతలో ఎక్కడా నారాయణుడు అనే పేరు కనిపించదు కదా అంటే నారాయణ అంటే ఏమిటి తెలియాలి, పరం బ్రహ్మ అంటే ఏమిటి తెలియాలి. సంస్కృతంలో బ్రహ్మ అంటే పెద్దది, మిగతా వాటిని తనంతట చేయునది. బృహతి బ్రుంహయతి ఇతి బ్రహ్మ. అదే తనని మించినది మరొకటి లేనిది అయితే అది పరం బ్రహ్మ అంటారు. మరి ఈ పరం బ్రహ్మ ఎక్కడ ఉంటాడు ? అంటే భగవద్గీత చెప్పేప్పుడు మధ్యలో తన విరాట్ రూపాన్ని చూపించాడు. విశ్వరూపాన్ని పదకోండవ అధ్యాయంలో చూపించాడు. ఆ రూపంలో తాను అన్నింటా లోన ఉంటాడని పదవ అధ్యాయంలో చెప్పాడు. అన్నింటా బయట ఉంటా అంటే అన్నింటినీ తనలో కలిగి ఉన్నాను అనేది పదకొండవ అధ్యాయంలో చెప్పాడు. ఇలా లోన బయట ఉండేవాణ్ణి నారాయణుడు అంటారు. సంస్కృతంలో 'ర' అంటే నశించునవి. 'నర' అంటే నశించనివి. ఈ ప్రపంచంలో కనిపించేవి మార్పు చెందుతూ ఉంటాయి కానీ నశించవు. అందుకే వీటిని వస్తువు అంటాం, అంటే అవి ఎక్కడో ఎదో ఒక రూపంలో 'వసతి' ఉంటాయి, కానీ నశించడం అనేది జరగదు. కాబట్టి అలాంటి వస్తువులని కలిగిన ఈ ప్రపంచాన్ని నారములు అంటారు. 

అవి ఆయా స్థానాల్లో ఉంటున్నాయి. అయితే ఈ వస్తువులన్నీ స్వతంత్రముచే అలా ఉండటం లేదు. వీటిని మనం నియంత్రించటం లేదు. మరి ఎవరు వీటిని నియంత్రిస్తున్నారు ? కొంత పరిదిలో చూస్తే మనం కొన్ని వస్తువులని మార్పు చేస్తున్నాం. కానీ భూమి, గ్రహాలు, నక్షత్రాల మాటేమిటి ? అవి ఏమైనా వాటి ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నాయా. వాటి కదలిక చాలా క్రమ బద్ధంగా జరుగుతుంది. వాటికి స్థితి గతులకి ఒక కారణం అనేది ఉంటుంది. మనం చూసేదాన్ని కార్యం అంటారు. ఈ కార్యాలన్నింటికీ కారణమై వాటికి ఆధారమైన వాడిని నారములకి అయనము అంటారు. అయనం అంటే ఆధారం అని అర్థం. నార మరియూ అయన కలిపితే నారాయణ అయ్యింది. కనిపించే ప్రతీది నారాయణ అవుతుంది. ఆ పదం అనేది పుంలింగ శబ్దం అయ్యింది. కానీ నారాయణ అనేవాడు "న స్త్రీ న పుంమాన్ న షండః" స్త్రీత్త్వ పుంస్త్త్వ నపుంసకత్త్వ అనే వాటికి అతీతము నారాయణ అనే తత్త్వం. 

స్త్రీ, పురుష అనేవి కర్మ ప్రభావానికి లోబడినవి. నమ్మాళ్వార్ చెబుతారు, "ఆణల్లన్ పెన్నల్లన్ అల్లావలియుమల్లన్", మనం భగవంతుడు అని అయితే ఎవరిని పిలుస్తున్నామో ఆయన పురుషుడు కాదు, స్త్రీ కాదు, మరొకటేదో కాదు. మరి అతడు అని ఎందుకు అనడం ? అంటే శాసించడం అనేది పుంలింగ శబ్దం. దయ అనేది స్త్రీలింగ శబ్దం. భగవంతుడు లోకాన్ని శాసించువాడు కనుక పుంలింగ శబ్దాన్ని వాడుతాం. అందుకే ఆ పదం నారాయ'ణ' అయ్యింది. అది పుంలింగ శబ్దం అయ్యింది. నారాయణ అనే శబ్ధాన్ని మించి అర్థాన్ని ఇచ్చే పదం మరొకటి లేదు. ఆ నారాయణుడే అవతరించి కృష్ణుడై వచ్చినప్పుడు తనని ఆశ్రయించిన వారికి "మమ సాయుజ్యమాగతాః సర్గేపనోజాయతే ప్రళయేన విదంతిచ" తనతో సమానమైన స్థితిని ఇస్తాను అన్నాడు. తనంతట చేయువాన్ని బ్రహ్మ అంటాం కనుక నారాయణుడే పరంబ్రహ్మ. అతణ్ణి మించిన వాడు మరొకటి లేడు. ఇది సారాంశం. అన్నింటికి బయటా ఉంటాడు, అన్నింటా లోనా ఉంటాడు. నారాయణ అనేది భగవంతుని పేరు. భగవద్గీత సారాంశం నారాయణుడు.

  ఈ అంతిమ పరీక్షలో నెగ్గితే కలిగే విజయం గురించి శ్రీకృష్ణ పరమాత్మ చెబుతూ.. 'ఇదే ఆధ్యాత్మికము, దివ్యము అయినట్టి జీవన విధానం, బ్రాహ్మీస్థితి. దీనిని పొందిన తర్వాత మనిషి తిరిగి మోహానికి గురికాడు. మరణ సమయంలోనూ అదేవిధంగా స్థితుడైనవాడు భగవద్రాజ్యంలో ప్రవేశిస్తాడు' (భగవద్గీత 2.72) అని చెప్పాడు. అంతిమ పరీక్ష సమయంలోనూ బ్రాహ్మీస్థితిలో ఉన్న వ్యక్తికి మళ్లీ జన్మ లభించదు. అదే ముక్తి. జనన మరణ చక్రం నుంచి బయటపడటమే ముక్తి. దీనిని గీతాచార్యుడు బ్రహ్మనిర్వాణస్థితిగా వర్ణించాడు. కాబట్టి బ్రాహ్మీస్థితి ద్వారా జ్ఞానవంతుడు అంతిమ పరీక్షలో నెగ్గి బ్రహ్మనిర్వాణస్థితిని అంటే భగవద్రాజ్యంలో ప్రవేశాన్ని పొందుతాడు. అయితే ఈ ఫలితం కోట్లాది జన్మలెత్తినా లభించకపోవచ్చు. లేదా ఒక్క క్షణంలో లభించవచ్చు. కృష్ణ శరణాగతి ద్వారా ఖట్వాంగ మహారాజు మరణానికి కొన్ని క్షణాల ముందు అటువంటి దివ్య జీవనస్థితిని పొందాడని శ్రీమద్భాగవతం చెబుతోంది. సద్భక్తుల సాంగత్యం ద్వారా మనిషి

"ఎవరు మరణ సమయంలో నన్నే స్మరింతురో, వారు నన్నే పొందుతారు" అని శ్రీకృష్ణుడు చెప్పాడు.

కాని  ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం.మనిషి మరణించాక భగవద్గిత వింటున్నాం.ఈకాలం లో అసలు ఎప్పుడన్నా భగవద్గిత వినిపించింది అంటే అది ఎవరన్న చనిపోయారు అనడానికి సంకేత౦లా భగవద్గితని వినిపిస్తున్నాం.పోనీ ఎవరికైనా కాస్త ఇష్టం అభిమానం ఉంది విందామని పెట్టుకున్న చిన్న సౌండ్ లో పెట్టుకోవాల్సి వస్తోంది.పెద్ద సౌండ్ లో పెడితే ఇంట్లో ఎవరు పోయారో అని ఇరుగు పొరుగు వాలు వచ్చి అడుగుతారనే భయమేస్తోంది.

ఇలా మన పవిత్ర , ఉత్కృష్ట గ్రందాన్ని మనమే చిన్నచూపు చూస్తే ఎలా.ఎక్కడైనా శుభకార్యాలలో కనీసం మనం ఈ భగవద్గీతని పెడుతున్నామా?కనీసం ఆలయాల్లో ,సత్సంగాలలో పెడుతున్నామా? కేవల౦ చావుకి సంకేతం గా మాత్రమే వాడుతున్నాం.

వేల ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా నిత్య చైతన్య ప్రవాహమై, దారిమరిచిన బాటసారికి కరదీపికై, సమస్త భూమండలాన్ని దివ్యశక్తితో ముందుకు నడిపిస్తున్న ఏకైక గ్రంథం - ఇగిరిపోని గంధం- భగవద్గీత.ఇది మన జీవితాల్లో ,దినసరి క్రమంలో భాగం కావాలి.దీనికి మనమంతా నడు౦ కట్టాలి. మన ఇళ్ళల్లో రోజు  ఒక భాగం కావాలి .మన ఆలయాలలో ,సత్సంగాలలో,సంప్రదాయాలలో ఒక తప్పనిసరి భాగం  చేసుకోవాలి.ఇక మీద చనిపోయన వాళ్ళ దగ్గర భగవద్గితని వినిపించడం మానెయ్యాలి.ఈ దిశగా అందరు తగిన ప్రచారం చెయ్యలి.

మన భగవద్గీతని రక్షించుకునే ఈ ప్రయత్నంలో ప్రభుత్వం తనవంతు సహకారాన్ని అందించాలి.చనిపోయిన వాళ్ళదగ్గర  భగవద్గీత వినిపించిన వాళ్ళని శిక్షించాలి.ఆలయాలలో,ఊరి మధ్యలో రోజు భగవద్గీత ని తప్పనిసరిగా రోజు వినిపించేలా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఇలా సహకరించిన నాడు ,మనమంతా కలిసి ప్రయత్నించిన రోజు తప్పక మన భగవద్గీతకి పూర్వ ప్రాభవాన్ని తీసుకురాగలం.

 

జై శ్రీమన్నారాయణ్




 

Wednesday 16 January 2019

పంచాంగం తేదీ . 17 - 01 - 2019


🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏
🔥పంచాంగం🔥
శ్రీరస్తు, శుభమస్థు, అవిఘ్నమస్తు,
తేదీ ... 17 - 01 - 2019,
వారం ... గురువారం, ( బృహస్పతి వాసరే ),
శ్రీ విళంబి నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
హేమంతఋతువు,
పుష్యమాసం,
శుక్లపక్షం,
తిధి : ఏకాదశి సా6.35
తదుపరి ద్వాదశి,
నక్షత్రం : కృత్తిక ఉ10.09
తదుపరి రోహిణి,
యోగం : శుక్లం రా10.34
తదుపరి బ్రహ్మం,
కరణం : వణిజ ఉ6.58
తదుపరి భద్ర/విష్ఠి రా6.35
ఆ తదుపరి బవ తె5.57,
వర్జ్యo : రా1.50 - 3.25
దుర్ముహూర్తం : ఉ10.20 - 11.04
& మ2.45 - 3.29,
అమృతకాలం : ఉ7.45 - 9.21 &
తె 6.33నుండి,
రాహుకాలం. : మ1.30 - 3.00,
యమగండం. : 6.00 - 7.30,
సూర్యరాశి : మకరం,
చంద్రరాశి : మేషం,
సూర్యోదయం : 6.38,
సూర్యాస్తమయం : 5.42,


ముక్కనుమ*
*మతత్రయ ఏకాదశి*
*సావిత్రి గౌరీ వ్రతం*
*బొమ్మల నోము*