Thursday 17 January 2019

భగవద్గీత అంటే ఏమిటి?





– జీవితమంతా అయిపోయిన తర్వాత చదువుకోవాల్సిన పుస్తకమా?
– రిటైర్‌మెంట్‌ రోజు సహోద్యోగులు ఇచ్చే బహుమతా?
– ఎవరైనా మరణించినప్పుడు ప్లే చేసే సీడీనా?
– అది కేవలం హిందువులదా?
– పనీపాటా వదిలేసి సన్యసించమని చెబుతుందా అది?
మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళుతున్నాం, ఏం చేస్తున్నాం, ఏం ప్రతిఫలం అందుకుంటున్నాం? అందుకు ప్రతిగా ఏం చేయాలి? కన్ ఫ్యూజన్ లేకుండా భగవద్గీతను మూడు ముక్కల్లో చెప్పాలంటే- ఇంతకంటే పెద్ద సెంటెన్సులు లేవు. కొందరు అనుకున్నట్టుగా, భగవద్గీత ఎట్టిపరిస్థితుల్లో మతగ్రంథం కానే కాదు. కురుక్షేత్ర సంగ్రామంలో అందరినీ చంపడం అధర్మం అనే చింత. అందరూ చచ్చిపోతారనే బాధ. ఈ రెండింటి గురించి మథనపడే అర్జునుడికి- శ్రీకృష్ణుడు విడమరిచి చెప్పిన సారాంశమే భగవద్గీత. 
వేల ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా నిత్య చైతన్య ప్రవాహమై, దారిమరిచిన బాటసారికి కరదీపికై, సమస్త భూమండలాన్ని దివ్యశక్తితో ముందుకు నడిపిస్తున్న ఏకైక గ్రంథం - ఇగిరిపోని గంధం- భగవద్గీత. ఇదేదో మతోద్బోధ అనుకునే వాళ్ల మైండ్ సెట్ మార్చలేం.
ఆధ్యాత్మిక ప్రవచనమైనా, వ్యాపార సూక్తులైనా, మేనేజ్మెంట్ కోర్సులైనా, వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులైనా, ఆటలో గెలవాలన్నా, పరీక్షలో పాస్ కావాలన్నా, జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్నా, ఎక్కడో చోట ఏదో సందర్భంలో గీతను కోట్ చేస్తాం. గీత గురించి చర్చిస్తాం. ఆది శంకరాచార్య దగ్గర్నుంచి స్వామీ వివేకానంద, మాక్స్ ముల్లర్ దాకా భగవద్గీత గొప్పదనాన్ని వేనోళ్లా చాటినవారే.
ఎన్నటికీ తరగని మేథో నిధి ఆ గ్రంథం.

“కాదు. అవన్నీ అపోహలు. ఒక్కముక్కలో చెప్పాలంటే భగవద్గీత ‘డైనమిక్‌ ప్రిస్కిప్షన్‌ ఫర్‌ లైఫ్‌’. సంతృప్తిసంతోషాలు నిండిన జీవితం గడపాలంటే, చేస్తున్న పనిలో విజయం సాధించాలంటే గీతను అర్థం చేసుకోవాలి. చిన్నవయసులోనే అది జరగాలి”


గవద్గీత జ్ఞానం సర్వసమస్యలను నివారిస్తుంది, సకల శుభాలను కలిగిస్తుంది. మానవులందరి సమస్త దుఃఖాలను తరిమివేయడానికి, వారికి సమస్త విజయాన్ని చేకూర్చడానికే భగవద్గీత జ్ఞానం ధరణిపై అవతరించింది. దాదాపు పన్నెండు కోట్ల సంవత్సరాల కిందటే శ్రీకృష్ణుని ద్వారా సూర్యదేవుడైన వివస్వానునికి చెప్పిన ఈ గీతాజ్ఞానము 20 లక్షల సంవత్సరాలుగా మానవ సమాజంలో విలసిల్లుతున్నట్లు చరిత్ర చెబుతోంది. అయితే కాలక్రమంలో దాని ఉనికి తగ్గినట్లు కనిపించడం వల్ల శ్రీకృష్ణుడు తిరిగి దానిని ఐదువేల సంవత్సరాల కిందట అర్జునునికి చెప్పాడు.
మానవుల సకల శ్రేయస్సు కొరకు చెప్పబడిన భగవద్గీత మీద జనులకు ఎందుకు విశ్వాసం కలగడం లేదు? ఇది వినేవాళ్లలో లోపమా, లేకపోతే చెప్పే వాళ్లలో లోపమా? సమస్త దుఃఖాలలో కూరుకొనిపోయి ఉన్నప్పటికిని జనులు ఎందుకు సకల సమస్యా నివారిణియైున భగవద్గీతను ఆశ్రయించలేకపోతున్నారు? నిజంగా భగవద్గీతలో సర్వసమస్యలను నివారించగలిగేటంత శక్తి ఉన్నదా? నిజ జీవితంలో భగవద్గీతను ఏ విధంగా అమలు చేయవచ్చును? ఐదువేల ఏళ్లనాడు చెప్పిన భగవద్గీత నేటి 21వ శతాబ్దం పరిస్థితిలో సంగతమే అవుతుందా? ఇటువంటి ఎన్నో ప్రశ్నల కారణంగా మనిషి ఈ దివ్య గీతాజ్ఞానానికి దూరమవుతున్నాడా?
దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని దివ్యసందేశమైనట్టి భగవద్గీత అత్యంత పురాతన కాలం నుంచి గంగానదిలాగా మానవసంఘంలో ప్రవహిస్తోంది. తత్కారణంగా అనంతకాలం నుండి అసంఖ్యాకమైన పుణ్యాత్ములు అమృతమయమైన గీతాజ్ఞానాన్ని స్వీకరించి కృతార్థులై తరించారు. కొంతమంది మహనీయులు కేవలం తామే గీతామృతం ద్వారా అమరులు కావడంతో సంతృప్తి చెందక, దానిని ప్రపంచవ్యాప్తం చేశారు. ఆ విధంగా వారు ప్రపంచమానవాళినందరినీ ఉద్ధరించారు. అన్ని రకాల జీవులలో కనిపించే కార్యాలను నాల్గింటిగా మనం విభజించవచ్చు.
ఆహారం తినడం, నిద్రపోవడం, సుఖాలు  అనుభవించడం, స్వీయరక్షణ చేసుకోవడం. అయితే అతి దుర్లభంగా లభించే మానవజన్మలో ఈ కార్యాలతో పాటు ఆత్మోద్ధారానికి సంబంధించిన పనులను కూడా ప్రవేశపెట్టాలి. ఇంకా సూటిగా, స్పష్టంగా చెప్పాలంటే పైన తెలిపిన నాలుగు కార్యాలను ఆత్మోద్ధారముతో ముడిపెట్టి జీవించి పరమానందాన్ని పొందాలి. ఈ విధంగా చేయకపోతే మానవసమాజం కేవలం జంతుసమాజమే అవుతుంది. ఆత్మదర్శనానికై ఉవ్విళ్లూరే శ్రద్ధాళువు హృదయంలో మహోన్నతమైన మార్పును తీసుకొనిరావడంలో భగవద్గీత ఒక గొప్ప పాత్రను పోషిస్తుంది.
భగవదవతారమైన వ్యాసదేవుడే సకల శాస్త్రాలను రచించారు. వేదాలు, ఉపనిషత్తులు, వేదాంగసూత్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఇంకా ఎన్నో ఆయన రచించారు. అయితే భగవద్గీత అనేది స్వయంగా భగవంతుడు పలికిన జ్ఞానం. సకల మానవాళి శ్రేయస్సు కొరకే శ్రీకృష్ణుడు దానిని పలికాడు. ఆ దేవదేవుడు తొలుత గీతాజ్ఞానాన్ని సూర్యునికి చెబితే, సూర్యుడు తన పుత్రుడు మనువుకు చెప్పాడని, మనువు దానిని ఇక్ష్వాకు మహారాజుకు చెప్పాడని భగవద్గీతలో ఉంది. ఈ రకంగా గీతాజ్ఞానామృతం మానవసమాజంలో లభించడం మొదలైంది.
నిజానికి జ్ఞానమే బలం. కండబలం నిజమైన బలం కానేకాదు. ఇది అక్షర సత్యం. జీవికను సంపాదించుకోవడానికి మనిషి ఏదో ఒక, ఎంతో కొంత జ్ఞానాన్ని సంపాదించుకోవాల్సి ఉంటుంది. కానీ నిత్యజీవనాన్ని, నిత్యానందాన్ని ప్రసాదించే జ్ఞానం అన్ని జ్ఞానాలలో శ్రేష్టమైనది. అది సామాన్య జ్ఞానానికి పూర్తిగా భిన్నమైనట్టిది. దానికి కేవలం ప్రామాణిక శాసా్త్రల ద్వారా, సాధువురుషుల ద్వారా, ప్రామాణిక గురువు ద్వారా మాత్రమే మనిషి పొందగలుగుతాడు. శ్రీకృష్ణుడు అటువంటి దివ్యమైన జ్ఞానాన్ని జనులందరికీ ఇచ్చాడు కనుకనే జగత్తులో జగద్గురువుగా ప్రసిద్ధి చెందాడు.
అటువంటి జగద్గురువు కోరిన రీతిగా గీతాజ్ఞానాన్ని పంచే శుద్ధ భక్తులు నిశ్చయంగా భగవత్కృపకు పాత్రులౌతారు. ఆ విధంగా కృష్ణకృపకు పాత్రులయ్యే భక్తులు జీవితంలో కృతకృత్యులై రాబోయే తరాలవారికి ఆదర్శనీయులౌతారు. తనను అనుసరించే వారి జీవితాలను జయప్రదం చేయడంలో భగవద్గీత మహిమ ఎంతో ఘనమైనది. అందుకే గీతాజ్ఞానం మానవసంఘంలో తెంపు లేకుండా ప్రవహిస్తూ ఉంది.

అసలు భగవద్గీత కంతటికీ సమగ్ర సారమేమిటి అనేది అతి సులభంగా ఈ శ్లోకంలో చెప్పారు యామునాచార్యులు.

స్వధర్మజ్ఞాన వైరాగ్య సాధ్యభక్త్యేకగోచరః
నారాయణః పరం బ్రహ్మా గీతాశాస్త్రే సమీరితః

భగవద్గీతకి సారాంశం నారాయణుడు అని ఒక్క అర శ్లోకంలో చెప్పేసారు గీతా సారాంశాన్ని. మరి ఎలాంటి నారాయణుడు అతడు, "స్వధర్మజ్ఞాన వైరాగ్య సాధ్యభక్త్యేకగోచరః" మేం నారాయణుని కోసం తపస్సు చేస్తాం, జపం చేస్తాం, యజ్ఞం చేస్తాం, యాగం చేస్తాం, మేం యోగం చేస్తాం. అంటే ఆయన యాగం వల్లనో యోగం వల్లనో లభించేవాడు కాదు. భక్తి వల్ల లభించు భగవంతుడు మనకి భగవద్గీతలో కనిపిస్తున్నాడు. భక్తి అంటే ఏమి ? ప్రేమ. ఎట్లాంటి ప్రేమ ? భగవంతుడి మీద నిష్కలంకమైన ప్రేమ. అంటే ప్రేమించి ఏమిస్తావు తిరిగి అడగకపోయేది ప్రేమ. మనం హోటలుకి వెళ్తే భోజనం పెట్టి ఇంత ఇవ్వు అనేది ప్రేమ కాదు. మూల్యం అడగకుండా ప్రతి ఫలాన్ని ఆశించకుండా చేసేదేదో దాన్ని ప్రేమ అంటాం. తల్లి తన పిల్లవాడిని వాడు రేపు పెద్దవాడై ఏదో ఉద్దరిస్తాడని ప్రేమ చేయదు. ప్రేమించ కుండా ఉండలేక తాను ప్రేమ చేస్తుంది, దాన్ని కదా మనం ప్రేమ అనేది. ఎదురు చూడక ప్రతిఫలం ఆశించక చేసేది ప్రేమ. అట్లాంటి ప్రేమతో ఎవడైతే భగవంతున్ని సేవిస్తాడో దాన్ని భక్తి అంటారు. అట్లాంటి ప్రేమకు లభించు తత్త్వం అనేది మనకు భగవద్గీతలో కనిపిస్తుంది.

"స్వధర్మజ్ఞాన వైరాగ్య సాధ్యభక్త్యేకగోచరః", ఆ భగవంతుని పై ఏర్పడ్డ ప్రేమ వల్ల మనకి ఇతరత్రమైన వాటి యంది రుచి తగ్గుతుంది. దాన్ని వైరాగ్యం అంటాం. ఆ భగవంతుని గురించి ఎంతేంత ఎంతెంత వింటుంటే అంతంత అంతంత తెలుస్తూ ఉంటుంది దాన్ని జ్ఞానం అంటాం. ఎంత తెలిస్తే ఆ భగవంతుని కోసం ఏదో ఒకటి చేద్దాం అని అనిపిస్తుంది. ఎదో ఒకటి చేద్దాం అని అనిపిస్తుంది దాన్ని ధర్మం అంటాం. ఆ చేసేప్పుడు భగవంతునికి నచ్చేట్టు చేయాలనిపిస్తుంది అందుకు ఆయన మనకి ఏది నియమించాడో దాన్ని స్వధర్మం అంటారు. ఇలా స్వధర్మంతో ఏర్పడ్డ జ్ఞానం వల్ల వైరాగ్యంతో ప్రేమకలిగితే ఆ ప్రేమకి లభించువాడు నారాయణుడు అంటే. ఇది భగవద్గీత చెప్పేది.

"నారాయణః పరం బ్రహ్మా గీతాశాస్త్రే సమీరితః", అంటే భగవద్గీతలో నారాయణుడే పరమ దైవము అని చెప్పబడి ఉంది. అదేంటి మాకు నారాయణుడు గొప్ప వాడని తెలుసును, అయితే భగవద్గీతలో ఎక్కడా నారాయణుడు అనే పేరు కనిపించదు కదా అంటే నారాయణ అంటే ఏమిటి తెలియాలి, పరం బ్రహ్మ అంటే ఏమిటి తెలియాలి. సంస్కృతంలో బ్రహ్మ అంటే పెద్దది, మిగతా వాటిని తనంతట చేయునది. బృహతి బ్రుంహయతి ఇతి బ్రహ్మ. అదే తనని మించినది మరొకటి లేనిది అయితే అది పరం బ్రహ్మ అంటారు. మరి ఈ పరం బ్రహ్మ ఎక్కడ ఉంటాడు ? అంటే భగవద్గీత చెప్పేప్పుడు మధ్యలో తన విరాట్ రూపాన్ని చూపించాడు. విశ్వరూపాన్ని పదకోండవ అధ్యాయంలో చూపించాడు. ఆ రూపంలో తాను అన్నింటా లోన ఉంటాడని పదవ అధ్యాయంలో చెప్పాడు. అన్నింటా బయట ఉంటా అంటే అన్నింటినీ తనలో కలిగి ఉన్నాను అనేది పదకొండవ అధ్యాయంలో చెప్పాడు. ఇలా లోన బయట ఉండేవాణ్ణి నారాయణుడు అంటారు. సంస్కృతంలో 'ర' అంటే నశించునవి. 'నర' అంటే నశించనివి. ఈ ప్రపంచంలో కనిపించేవి మార్పు చెందుతూ ఉంటాయి కానీ నశించవు. అందుకే వీటిని వస్తువు అంటాం, అంటే అవి ఎక్కడో ఎదో ఒక రూపంలో 'వసతి' ఉంటాయి, కానీ నశించడం అనేది జరగదు. కాబట్టి అలాంటి వస్తువులని కలిగిన ఈ ప్రపంచాన్ని నారములు అంటారు. 

అవి ఆయా స్థానాల్లో ఉంటున్నాయి. అయితే ఈ వస్తువులన్నీ స్వతంత్రముచే అలా ఉండటం లేదు. వీటిని మనం నియంత్రించటం లేదు. మరి ఎవరు వీటిని నియంత్రిస్తున్నారు ? కొంత పరిదిలో చూస్తే మనం కొన్ని వస్తువులని మార్పు చేస్తున్నాం. కానీ భూమి, గ్రహాలు, నక్షత్రాల మాటేమిటి ? అవి ఏమైనా వాటి ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నాయా. వాటి కదలిక చాలా క్రమ బద్ధంగా జరుగుతుంది. వాటికి స్థితి గతులకి ఒక కారణం అనేది ఉంటుంది. మనం చూసేదాన్ని కార్యం అంటారు. ఈ కార్యాలన్నింటికీ కారణమై వాటికి ఆధారమైన వాడిని నారములకి అయనము అంటారు. అయనం అంటే ఆధారం అని అర్థం. నార మరియూ అయన కలిపితే నారాయణ అయ్యింది. కనిపించే ప్రతీది నారాయణ అవుతుంది. ఆ పదం అనేది పుంలింగ శబ్దం అయ్యింది. కానీ నారాయణ అనేవాడు "న స్త్రీ న పుంమాన్ న షండః" స్త్రీత్త్వ పుంస్త్త్వ నపుంసకత్త్వ అనే వాటికి అతీతము నారాయణ అనే తత్త్వం. 

స్త్రీ, పురుష అనేవి కర్మ ప్రభావానికి లోబడినవి. నమ్మాళ్వార్ చెబుతారు, "ఆణల్లన్ పెన్నల్లన్ అల్లావలియుమల్లన్", మనం భగవంతుడు అని అయితే ఎవరిని పిలుస్తున్నామో ఆయన పురుషుడు కాదు, స్త్రీ కాదు, మరొకటేదో కాదు. మరి అతడు అని ఎందుకు అనడం ? అంటే శాసించడం అనేది పుంలింగ శబ్దం. దయ అనేది స్త్రీలింగ శబ్దం. భగవంతుడు లోకాన్ని శాసించువాడు కనుక పుంలింగ శబ్దాన్ని వాడుతాం. అందుకే ఆ పదం నారాయ'ణ' అయ్యింది. అది పుంలింగ శబ్దం అయ్యింది. నారాయణ అనే శబ్ధాన్ని మించి అర్థాన్ని ఇచ్చే పదం మరొకటి లేదు. ఆ నారాయణుడే అవతరించి కృష్ణుడై వచ్చినప్పుడు తనని ఆశ్రయించిన వారికి "మమ సాయుజ్యమాగతాః సర్గేపనోజాయతే ప్రళయేన విదంతిచ" తనతో సమానమైన స్థితిని ఇస్తాను అన్నాడు. తనంతట చేయువాన్ని బ్రహ్మ అంటాం కనుక నారాయణుడే పరంబ్రహ్మ. అతణ్ణి మించిన వాడు మరొకటి లేడు. ఇది సారాంశం. అన్నింటికి బయటా ఉంటాడు, అన్నింటా లోనా ఉంటాడు. నారాయణ అనేది భగవంతుని పేరు. భగవద్గీత సారాంశం నారాయణుడు.

  ఈ అంతిమ పరీక్షలో నెగ్గితే కలిగే విజయం గురించి శ్రీకృష్ణ పరమాత్మ చెబుతూ.. 'ఇదే ఆధ్యాత్మికము, దివ్యము అయినట్టి జీవన విధానం, బ్రాహ్మీస్థితి. దీనిని పొందిన తర్వాత మనిషి తిరిగి మోహానికి గురికాడు. మరణ సమయంలోనూ అదేవిధంగా స్థితుడైనవాడు భగవద్రాజ్యంలో ప్రవేశిస్తాడు' (భగవద్గీత 2.72) అని చెప్పాడు. అంతిమ పరీక్ష సమయంలోనూ బ్రాహ్మీస్థితిలో ఉన్న వ్యక్తికి మళ్లీ జన్మ లభించదు. అదే ముక్తి. జనన మరణ చక్రం నుంచి బయటపడటమే ముక్తి. దీనిని గీతాచార్యుడు బ్రహ్మనిర్వాణస్థితిగా వర్ణించాడు. కాబట్టి బ్రాహ్మీస్థితి ద్వారా జ్ఞానవంతుడు అంతిమ పరీక్షలో నెగ్గి బ్రహ్మనిర్వాణస్థితిని అంటే భగవద్రాజ్యంలో ప్రవేశాన్ని పొందుతాడు. అయితే ఈ ఫలితం కోట్లాది జన్మలెత్తినా లభించకపోవచ్చు. లేదా ఒక్క క్షణంలో లభించవచ్చు. కృష్ణ శరణాగతి ద్వారా ఖట్వాంగ మహారాజు మరణానికి కొన్ని క్షణాల ముందు అటువంటి దివ్య జీవనస్థితిని పొందాడని శ్రీమద్భాగవతం చెబుతోంది. సద్భక్తుల సాంగత్యం ద్వారా మనిషి

"ఎవరు మరణ సమయంలో నన్నే స్మరింతురో, వారు నన్నే పొందుతారు" అని శ్రీకృష్ణుడు చెప్పాడు.

కాని  ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం.మనిషి మరణించాక భగవద్గిత వింటున్నాం.ఈకాలం లో అసలు ఎప్పుడన్నా భగవద్గిత వినిపించింది అంటే అది ఎవరన్న చనిపోయారు అనడానికి సంకేత౦లా భగవద్గితని వినిపిస్తున్నాం.పోనీ ఎవరికైనా కాస్త ఇష్టం అభిమానం ఉంది విందామని పెట్టుకున్న చిన్న సౌండ్ లో పెట్టుకోవాల్సి వస్తోంది.పెద్ద సౌండ్ లో పెడితే ఇంట్లో ఎవరు పోయారో అని ఇరుగు పొరుగు వాలు వచ్చి అడుగుతారనే భయమేస్తోంది.

ఇలా మన పవిత్ర , ఉత్కృష్ట గ్రందాన్ని మనమే చిన్నచూపు చూస్తే ఎలా.ఎక్కడైనా శుభకార్యాలలో కనీసం మనం ఈ భగవద్గీతని పెడుతున్నామా?కనీసం ఆలయాల్లో ,సత్సంగాలలో పెడుతున్నామా? కేవల౦ చావుకి సంకేతం గా మాత్రమే వాడుతున్నాం.

వేల ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా నిత్య చైతన్య ప్రవాహమై, దారిమరిచిన బాటసారికి కరదీపికై, సమస్త భూమండలాన్ని దివ్యశక్తితో ముందుకు నడిపిస్తున్న ఏకైక గ్రంథం - ఇగిరిపోని గంధం- భగవద్గీత.ఇది మన జీవితాల్లో ,దినసరి క్రమంలో భాగం కావాలి.దీనికి మనమంతా నడు౦ కట్టాలి. మన ఇళ్ళల్లో రోజు  ఒక భాగం కావాలి .మన ఆలయాలలో ,సత్సంగాలలో,సంప్రదాయాలలో ఒక తప్పనిసరి భాగం  చేసుకోవాలి.ఇక మీద చనిపోయన వాళ్ళ దగ్గర భగవద్గితని వినిపించడం మానెయ్యాలి.ఈ దిశగా అందరు తగిన ప్రచారం చెయ్యలి.

మన భగవద్గీతని రక్షించుకునే ఈ ప్రయత్నంలో ప్రభుత్వం తనవంతు సహకారాన్ని అందించాలి.చనిపోయిన వాళ్ళదగ్గర  భగవద్గీత వినిపించిన వాళ్ళని శిక్షించాలి.ఆలయాలలో,ఊరి మధ్యలో రోజు భగవద్గీత ని తప్పనిసరిగా రోజు వినిపించేలా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఇలా సహకరించిన నాడు ,మనమంతా కలిసి ప్రయత్నించిన రోజు తప్పక మన భగవద్గీతకి పూర్వ ప్రాభవాన్ని తీసుకురాగలం.

 

జై శ్రీమన్నారాయణ్




 

No comments:

Post a Comment