సూర్యుడు మకర రాశి లో ప్రవేశించే పుణ్య ఘడియల్లో ఉత్తరాయణ పుణ్య కాలం ఆరంభం. దేవమార్గం ప్రారంభమయ్యే రోజు. ఈ రోజు చేసే స్నానాలు, దానాలు, జపాలు, వ్రతాలు విశేష ఫలితాలనిస్తాయి. సంక్రాంతి రోజు గుమ్మడి, వస్త్రములు దానం చేయడం ఆచారం. విష్ణు సహస్రనామ పఠనమ్ ఈ రోజున మిక్కిలి శుభఫలాలనిస్తుంది. దేవ పితృ దేవతలనుద్దేసించి చేసే తర్పణాలు, దానాలు పుణ్యప్రదం. పౌష్య లక్ష్మిగా అమ్మవారి ని ఆరాధించే సమయం. సంక్రాంతి రోజు స్నానం చేయని వారికి రోగాదులు వస్తాయని ధర్మశాస్త్రం ద్వారా తెలుస్తుంది. సంక్రాంతి రోజు దేవతలకు, పితృదేవతలకు, పాత్రులకు ఏ ఏ దానాలు చేస్తామో అవి జన్మజన్మలకి అత్యధికం గా లభిస్తాయని ప్రతీతి. ఈ పుణ్య కాలం లో తిలలు, బియ్యం కలిపి శివారాధన చేయడం,ఆవు నేతి తో అభిషేకం చేయడం, నువ్వుల నూనె తో దీపం వెలిగించడం చాలా శ్రేష్ఠమైనది. నల్ల నువ్వులతో పితృతర్పణాలు ముఖ్యం గా ఆచరించవలసిన విధి. సంక్రమణం’ నాడు ఒంటి పూజ భోజనం చేయాలి. దేవతలకు పితృదేవతల పూజలకు పుణ్యకాలం. మంత్ర జపాదులకు, ధ్యానం పారాయయణ శ్రేష్ఠఫలాలని శీఘ్రంగా ప్రసాదించే కాల మహిమ సంక్రమణానికి ఉంది.
సంక్రాంతి సమీపిస్తున్న కొద్ది అధికమైన పుణ్య ఘడియలు అని తెలిపారు. గృహస్థుని జీవిత కాలం లో పంచ రుణాల గురించి విముక్తి పొందే మార్గాలను ఆచారరూపం లో నిక్షేపించి నిర్దేశింపబడింది ఆ పంచ రుణాలు ఏంటో వాటి నుండి ఈ సంక్రాంతి సమయంలో చేసే పూజా ది కార్యక్రమాల వల్ల మనకు తీరే రుణాలు ఏంటో తెలుసుకుందాం...

దేవ రుణం - త్రిమూర్తి స్వరూపుడైన సూర్య భగవానుణ్ణి సకల పోషకుడిగా, వేడి వెలుతురూ, ఆరోగ్యం ప్రసాదించే దైవం గా జ్ఞాన భాస్కరుడుగా, యుద్దాదిపతిగా మన సంస్కృతి లో ఆరాదిస్తున్నాం. ఇంద్ర, వరుణ, వాయుదేవతల సహాయం తో సూర్యుడు భూమి పై వర్షించడం వల్లనే మకర సంక్రాంతి పండుగ నాటికి పంటలు పండి మన చేతికి అందుతాయి. అందరి జీవన నిర్వహణ జరుగుతోంది. అందుకే సంక్రంతి నాడు తలంటుస్నానం చేసి, సూర్యాది దేవతలను పూజించి కొత్త బియ్యం తో పొంగులు వారే పొంగలి , పులగం తయారు చేసి, పాలను పొంగించి సూర్యభగవానుడికి భక్తి తో కృతఙ్ఞతలు నివేదించడం ఆచరమైంది.
పితృ రుణం - పితృ తర్పణాలు, పిండోదక దానాలు, శ్రాద్ధ కర్మలు మొదలైనవి ఆచరించడం ద్వారా మరణించిన పితరుల రుణం కొంతైనా తీరుతుందని విశ్వసిస్తారు. మకర సంక్రాంతి నాడు తెలకపిండిని ఒంటికి రాసుకొని స్నానం చేయడం ఆచారం. ఎందుకంటే మకర రాశికి శని అధిపతి. శని వాత ప్రధాన గ్రహమని చెప్పబడింది. వాతం తగ్గాలంటే సంక్రాంతి నాడు తెలకపిండి తో స్నానం చేసి, నువ్వులు బెల్లం గుమ్మడి కాయ మొదలైన దానాలు ఇవ్వడమే ఇందుకు పరిహారం అని చెబుతారు. నువ్వులు, బెల్లం తో చేసిన అరిసెలు మొదలైనవి తింటారు

భూత రుణం - భూమి, నీరు, గాలి మొదలైన భూతాలూ కరుణించడం వల్లనే పంటలు పండుతాయి. అందుకే కృతజ్ఞతా తో వాటిని కూడా పూజిస్తాం. పండిన పొలాల్లో పొంగలి మెతుకు, పసుపు కుంకం చల్లి ఎర్ర గుమ్మడికాయను పగల కొట్టి దిష్టి తీయడం ఆచరమైంది. పాడి పశువులు పాలిచ్చి మనల్ని పోషిస్తున్నాయి. ఎద్దులు వ్యవసాయం లో శ్రమిస్తున్నాయి. అందుకే కృతజ్ఞతాసూచకంగా కనుమ నాడు పశువులను, పశుశాలలను శుభ్రం చేసి అలంకరిస్తారు. వాటికి కూడా పొంగళ్ళు తినిపిస్తారు. ఇంటి ముంగిళ్ళలో బియ్యం పిండి తో ముగ్గులు వేస్తారు, ఆ పిండి క్రిమికీతకాదులకు ఆహారం గా ఉపయోగపడుతుందని. ఇలా మూగ జీవులకు, భూమి మొదలైన భూతాలకు మానవాళి కృతఙ్ఞతలు తెలిపే ఆచారాలను ఈ పండుగలో నిబద్దం చేసారు.
మనుష్య రుణం - ఇతరుల సహాయ సహకారాలు లేనిదే సమాజం లో జీవనం కొనసాగించలేము. అందుకు కృతజ్ఞతగా పండుగనాడు దాన్యం, తిలలు, కర్రలు, చెరుకు, గోవులు, పళ్ళు, వస్త్రాలు మొదలైనవి విరివిగా దానధర్మాలు చేస్తారు. అతిథులను ఆహ్వానిస్తారు వ్యవసాయం లో సహాయం చేసిన వారికి, ఇతర వృత్తులవారికి కొత్త ధాన్యాన్ని పంచి పెట్టడం కూడా ఈ పండుగలోని మరో ఆచారం .
ఋషి రుణం - ఈ పండుగ సమయం లో ఆచరించే జపతపధ్యానాది ఆధ్యాత్మిక సాధనాలు, సద్గ్రంధ పఠనాలు శీఘ్ర ఫలితానిస్తాయని విశ్వసిస్తారు. ఈ సంక్రమణ కాలం లో ధాన్యం, ఫలాలు, అజినం, కంచు, బంగారం వంటి లోహాలు దానం చేయడం ఉత్తమం. ఈ రోజు ఆచరించే దానాలలో ఘ్రుత కంబళి దానం శ్రేష్ఠమైనది. మూడున్నర వందల ప్రస్థములు పేరిన ఆవు నెయ్యి ని ఘ్రుత కంబళమని చెప్పబడింది. ఇంట నేయిని సేకరించలేని వారు అర లేక పావు వంతైనా సేకరించి మహేశ్వరుని మొదట ఇతర ఘ్రుతముతో అభిషేకించి పిదప ఈ ఘనీభూతమైన ఘ్రుత కంబళమును శివుని మస్తకము పై అర్పించాలి. తదుపరి దీని బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి..

సంక్రాంతి పండుగ ముందురోజు భోగి పండుగ..తర్వాతి రోజు కనుమ పండుగ
జరుపుకుంటాము...….సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
facebook page
YouTube
Printerest
Twitter
Instagram
Blog
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
No comments:
Post a Comment