Wednesday 14 September 2016

పూజా గదిలో ఎలాంటి విగ్రహాలు పెట్టాలి?



పూజా గదిలో ఎలాంటి విగ్రహాలు పెట్టాలి?

 

మనకు మనశ్శాంతిని, ధైర్యాన్ని,ప్రశాంతతను ఇచ్చే గది మన ఇంట్లో పూజ గది. అలాంటి పూజ గదిలో ఎలాంటి విగ్రహాలను పెట్టాలి, ఎలాంటి విగ్రహాలను పెట్టకూడదు అనేది చాలామందికి తెలీక ఏవేవో విగ్రహాలను తీసుకుని వచ్చి పెట్టి లేని పోనీ కష్టాలను తెచ్చుకుంటారు. అసలు ఎలాంటి విగ్రహాలను పెట్టకూడదు అనేది తెలుసుకుందాం…

నిలబడి ఉన్న వినాయకుడి, సరస్వతీ దేవి విగ్రహాలను ఇంట్లో పెట్టకూడదు. వినాయక మరియు సరస్వతి దేవి విగ్రహాలు ఉండటం ఇంటికి చాలా మంచిది.అలాగే నిలబడి ఉన్న లక్ష్మి దేవి ఉంటె ఆ ఇంట్లో లక్ష్మి నిలవదు. కాని, నిలబడి ఉంటె ఇంటికి అరిష్టం. పది ఇంచులు కన్నా పెద్దగా ఉన్న విగ్రహాలను ఇంట్లో పెట్టకూడదు. పెద్ద పెద్ద విగ్రహాలు గుడిలో మాత్రమే పెట్టాలి. అలాగే ఇంట్లో ఎక్కువ విగ్రహాలు కూడా పెట్టకూడదు. మీ కుల దైవం మరి ఇష్ట దైవం పెట్టుకోవాలి. అలాగే మరణించిన వాళ్ళ ఫోటోలను పూజ గదిలో పెట్టకూడదు. పూజగదిలో చనిపోయిన వాళ్లు ఫోటోలు పెట్టడం వల్ల దేవుళ్లు ఆగ్రహిస్తారని తత్వవేత్తలు చెబుతున్నారు
దేవుడి గదిలో చనిపోయిన వాళ్లు ఫోటోలు పెట్టుకుని పూజలు నిర్వహించడం వల్ల దురదృష్టంతో పాటు, ప్రశాంతత కోల్పోవడం, శ్రేయస్సు, ధనం కోల్పోవడం కూడా జరిగే అవకాశాలున్నాయని వాస్తు శాస్త్రం హెచ్చరిస్తోంది.
వాస్తు శాస్త్రం ప్రకారం పూజగది ఈశాన్యం దిశగా ఉండాలి. చనిపోయిన పెద్దవాళ్ల ఫోటోలు వాయువ్య దిశగా ఉండాలి.
ఈ నియమాలు పాటించడంలో పొరపాట్లు జరిగితే.. ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది
 ఫోటోలు, పూజ గది వాస్తు ప్రకారం లేకపోతే.. కుటుంబ సభ్యులు మానసిక ప్రశాంతత కోల్పోతారు
దేవుడిని నేల మీద కాకుండా కొంచెం ఎత్తులో మనం కూర్చుంటే, దేవుడి పాదాలు మన చాతీ దగ్గరకు రావాలి.

1 comment: