Sunday 18 September 2016

ఇంట్లో పెట్టకూడని పెయింటింగ్స్ జాబితా


 ఇంట్లో పెట్టకూడని పెయింటింగ్స్ జాబితా



పెయింటింగ్స్ తో ఇంటిని అలకరించే అభిరుచి ఉంటె ఈ  విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాస్తు శాస్త్రం ప్రకారం మీరు కొన్ని పెయింటింగ్స్ ఇంట్లో పెట్టుకోకూడదు. ఇవి పెట్టుకుంటే చెడు జరుగుతునదని నమ్మకం. మీరు ఇంట్లో పెట్టకూడని పెయింటింగ్స్ జాబితా చూడండి...

1.
తాజ్ మహల్ ప్రేమకు చిహ్నమైనప్పటికీ షాజహాన్ భార్య ముంతాజ్ సమాధి గా నిర్మించబడింది. అది ఒక సమధి కావడం వలన చెడు ఫలితాలు ఉంటాయని అందుకే ఇంట్లో పెట్టుకోకూడదని అంటారు.
2.

రామాయణ మహాభారతాల నుంచి యూద్ధ సన్నివేశాల పెయింటింగ్స్ ఇంట్లో పెట్టుకోకూడదు. ఇవి దాయదుల మధ్య ఎప్పటికీ అంతం కాని పోరును సూచిస్తాయి.
 



3.
పారే జలపాతం పెయింటింగ్స్ గాని ఫౌంటైన్స్ పెయింటింగ్స్ గాని ఇంట్లో పెట్టుకోకూడదు. ఇవి పేదరికాన్ని సూచిస్తాయి. మీకు వచ్చిన సంపద గుర్తింపు ఎక్కువ కాలం నిలువకూడదు అని సూచిస్తాయి.


 
4.
మునుగుతున్న ఓడ పెయింటింగ్ ఇంట్లో ఉంచకూడదు. మునిగిపోతున్న ఓడ కుటుంబ సభ్యుల మద్య అంతరాలను పెంచడం అనే అంశాన్ని సూచిస్తోంది. మీ దగ్గర ఇటువంటి పెయింటింగ్ ఉంటే వెంటనే విసిరేయండి.
 




 

 5.
సాదారణంగా నటరాజ పెయింటింగ్ ప్రతీ క్లాసికల్ డ్యాన్సర్ ఇళ్ళల్లో ఉంటుంది. ఇది మంచి కళాత్మకంగా ఉన్నప్పటికీ వినశనాన్ని సూచిస్తుంది. తాండవ నృత్యం అంటే వినాశనానికి నృత్యం అనే మశాన్ని సూచిస్తుంది. అందుకే నటరాజ విగ్రహం కాని పెయింటింగ్ కాని  ఇంట్లో పెట్టుకోవడం అంత మంచిది కాదు. 
 
6.
ఏడుస్తున్న బాలుడు బాలిక పెయింటింగ్స్ ఈ మధ్యా బాగా పాపులర్. అయితే ఇవి దురదృష్టానికి సూచికలు. అందువల్ల అటువంటి పెయింటింగ్స్ ఇంట్లో పెట్టుకోవద్దు. పళ్ళు పూలు లేని చెట్లు, నగ్న చిత్రాలు,వేటాడే చిత్రాలు వంటివి ఇంట్లో పెట్టుకోకూడదు. ఇవి దురదృష్టానికి హేతువులు.


7.
క్రూర జంతువులైన పులులు,ఎలుగుబంట్లు,తోడేల్లు వంటి పెయింటింగ్స్ పెట్టుకోకూడదు. ఇవి మనుషుల్లోని హింసా ప్రవృత్తిని సూచిస్తాయి. చూసారు కదా. అందువల్ల ఇటువంటి పెయింటింగ్స్ మీ ఇంట్లో ఉంటే వెంటనే బయట పడేయండి.






   




No comments:

Post a Comment