Saturday 3 September 2016

వారఫలం (5 -12 సెప్టెంబర్ 2016)

వారఫలం (5 -12 సెప్టెంబర్ 2016)


 మేషం:
(అశ్విని, భరణి కృత్తిక 1వ పాదం )
 ఇంట ఒక శుభకార్యానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో పెద్దలను సంప్రదించడం మంచిది. దంపతుల మధ్య దాపరికం శుక్ర, శనివారాల్లో ఇబ్బందులకు దారితీస్తుంది.ముందుచూపుతో ఆలోచించి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన అవసరం. స్త్రీలకు తమ మాట నెగ్గాలన్న పంతం అనర్ధాలకు దారితీస్తుంది. వృత్తి వ్యాపారాల్లో నిలదొక్కుంటారు.  ఉద్యోగస్తులు తోటివారి సహకారంతో పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ఒక స్థిరాస్తి అమర్చుకునే దిశగా మీ ఆలోచనలుంటాయి. చిన్న తరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు ఆశాజనకం. ప్రింటింగ్ రంగాల వారికి, నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణాలు, మరమ్మతులకు అనుకూలం. చేపట్టిన పనులు అర్ధాంతంగా నిలిపివేయాల్సి వస్తుంది. ఆత్మీయులకు విలువైన కానుకలందిస్తారు. విద్యార్థులకు విదేశీ చదువుల కోసం చేసే ప్రయత్నాలు సుగమమవుతాయి.

వృషభం:
(కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు)
 ధనం మితంగా వ్యయం చేయడం శ్రేయస్కరం. చుట్టుపక్కల వారి నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. మీ విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. స్త్రీలు టీవీ ఛానెళ్ళ కార్యక్రమాల్లో రాణిస్తారు. ప్రయత్నపూర్వకంగా మొండి బాకీలు వసూలు కాగలవు.  ఈ వారం వృత్తి వ్యాపారాలు ప్రగతిపథంలో సాగుతాయి. కష్ట సమయంలో అయిన వారికి అండగా నిలుస్తారు. ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.పెద్దల గురించి ఆందోళన చెందుతారు.  కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే సూచనలున్నాయి. పత్రికా సంస్థలలోని వారు ఎంత శ్రమించినా గుర్తింపు అంతంత మాత్రంగానే ఉంటుంది. గృహ నిర్మాణానికి కావలసిన ప్లాను ఆమోదం పొందడంతో పాటు రుణం కూడా మంజూరవుతుంది. మీ సంతానం పై చదువుల కోసం బాగా శ్రమించాల్సి ఉంటుంది. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగులు వచ్చిన తాత్కాలిక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం.

మిథునం:
(మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు )
ఆర్థిక, కుటుంబ సమస్యలు క్రమంగా మెరుగుపడుతాయి. ఆది, సోమవారాల్లో చేపట్టిన పనులు అనుకున్న విధంగా సాగవు. స్త్రీలకు వస్త్రప్రాప్తి, వస్తులాభం వంటి శుభ ఫలితాలున్నాయి. ప్రతి విషయంలోను ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఏ వ్యక్తినీ తక్కువగా అంచనా వేయడం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాల్లో సంబంధం లేని వ్యక్తుల ప్రమేయం లేకుండా జాగ్రత్త వహించండి. ఖర్చులు అధికమైనా మీ అవసరాలు నెరవేరగలవు. పాత పరిచయస్తుల ద్వారా ఒక ముఖ్య సమాచారం అందుతుంది. ఆత్మీయుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. వృత్తిపరంగా ఎదురైన చికాకులు సమసిపోగలవు.  పుణ్యక్షేత్ర సందర్శనలు, దూర ప్రయాణాలు ఉల్లాసంగా సాగుతాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగాల్సి ఉంటుంది. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఆస్తి వివాదాలు, భూమికి సంబంధించిన సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులెదుర్కుంటారు.

కర్కాటకం:
(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష )
వ్యాపారాల్లో ఆటుపోట్లను అధికమిస్తారు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ధనం మితంగా వ్యయం చేయడం మంచిది. విద్యార్థులు విదేశీ చదువుల కోసం చేసే యత్నాల్లో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు. ఆహార విషయాల్లో ఏకాగ్రత వహించండి. ఆస్తి పంపకాల్లో పెద్దల నిర్ణయం నిరుత్సాహపరుస్తుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. తొందరపాటు నిర్ణయాల వల్ల మంగళ, బుధవారాల్లో ఇబ్బందులెదుర్కుంటారు. ఆత్మీయుల ఇంట శుభకార్యానికి హాజరు కావాలనే ఆలోచన బలపడుతుంది. స్త్రీలకు వస్త్రప్రాప్తి, వస్తులాభం వంటి శుభఫలితాలున్నాయి. ఉద్యోగస్తులు తోటివారితో విందులు, శుభకార్యాల్లో పాల్గొంటారు.కోర్టు వ్యవహారాలు ఒక పట్టాన తేలవు. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. సామాజిక, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. నిరుద్యోగులు, ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. వృత్తిపరంగా కొత్త వ్యక్తులను కలుసుకుంటారు.

సింహం:
(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం )
వ్యాపారాల విస్తరణలు, నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలను మీరే చూసుకోవడం మంచిది. ఇతరులు మీ గురించి చేసిన వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబంలో ప్రేమానుబంధాలు బలపడుతాయి. ఆత్మీయులకు విలువైన కానుకలు చదివించుకుంటారు. ఖర్చులు అధికమైనా ఇబ్బందులు తలెత్తవు. కొంతమంది మీ ఉన్నతిని చూసి అసూయపడే ఆస్కారం ఉంది. ఆది, గురువారాల్లో మీ ఆంతరంగిక విషయాలు, వ్యాపార రహస్యాలు గోప్యంగా ఉంచండి. వాహనం నడుపుతున్నప్పుడు మెలకువ వహించండి. వ్యవసాయ, తోటల రంగాల వారు నిశ్చింతకు లోనవుతారు. క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. నగదు, విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోండి. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలకు సంబంధించిన సమాచారం అందుతుంది. ప్రైవేట్ సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికం. ఆకస్మిక ప్రయాణం తప్పదు. షేర్లు, స్థిరాస్తుల క్రయ విక్రయాల్లో పునరాలోచన అవసరం.

కన్య:
(ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు)
వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు మున్ముందు మంచి ఫలితాలనిస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ కూడదు. స్త్రీలకు చుట్టుపక్కల వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులకు తోటివారి తీరు ఆందోళన కలిగిస్తుంది. వాహనం నిదానంగా నడపడం శ్రేయస్కరం.  ఆదాయ వ్యయాల్లో మీ అంచనాలు ఫలించవు. మంగళ, బుధవారాల్లో ఊహించని ఖర్చులు మీ ఆర్థికస్థితికి అవరోధంగా నిలుస్తాయి. సమయానికి సహకరించని మిత్రుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. మీ అశక్తతను కుటుంబీకులు అర్థం చేసుకుంటారు. మీ శ్రీమతి ఓదార్పుతో మానసికంగా కుదుటపడుతారు. ఉద్యోగస్తులు, ఉన్నతాధికారులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. ఏ యత్నం కలిసిరాకపోవడంతో నిరుద్యోగులు అశాంతికి లోనవుతారు. పుణ్యకార్యాల్లో చురుకుగా పాల్గొంటారు. వృత్తుల వారు ఆదాయం కంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మేలు. కొంతమంది మీ నుంచి విషయాలు సేకరించేందుకు యత్నిస్తారు.

తుల:
(చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు)
శుక్ర, శనివారాల్లో చేపట్టిన పనుల్లో ఒత్తిడి, ఆటంకాలు ఎదుర్కొంటారు. ఆస్తి పంపకాల విషయంలో దాయాదులతో విభేదాలు తలెత్తుతాయి. ఆత్మీయులు, కుటుంబీకులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. ధనం మితంగా వ్యయం చేయడం మంచిది.  ముఖ్యమైన వ్యవహారాలు మీరే చూసుకోవడం మంచిది. మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. నూతన వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి బాగా శ్రమించాల్సి ఉంటుంది. విద్యార్థులకు తోటివారితో సత్సంబంధాలు నెలకొంటాయి.  చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు మిశ్రమ ఫలితం. వృత్తిపరమైన చికాకులు అధిగమిస్తారు. ప్రైవేట్ సంస్థల్లోని వారికి యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. వైద్య రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు మంచి స్పందన లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం వంటి చికాకులు తప్పవు. గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు, పుణ్యక్షేత్ర సందర్శనల్లో అసౌకర్యానికి లోనవుతారు.

వృశ్చికం:
(విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట)
ఆత్మీయులకు విలువైన కానుకలందిస్తారు. మీ కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి.  ఈ వారం ఇంటా బయటా అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. ఆర్థిక స్థితిలో ఆశాజనకమైన మార్పులుంటాయి. వృత్తి ఉద్యోగాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. వ్యాపారాల్లో తలెత్తిన ఆటంకాలు, చికాకులు తొలగిపోగలవు. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగండి. అకాలభోజనం, శ్రమాధిక్యతతో స్వల్ప అస్వస్థతకు లోనవుతారు. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, మందుల వ్యాపారులకు ఆశాజనకం. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. స్త్రీలకు పుట్టింటి వైపు నుంచి ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులు రాత, మౌఖిక పరీక్షల్లో రాణిస్తారు. విలువైన వస్తువులు, నగదు విషయంలో జాగ్రత్త వహించండి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. చిన్ననాటి మిత్రుల కలయితో మీలో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది.

ధనుస్సు:
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం )
నూతన పెట్టుబడులు, షేర్ల క్రయ విక్రయాల్లో అవగాహన అవసరం. తలపెట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. స్త్రీలకు శుభకార్యాల్లో గుర్తింపు, ఆదరణ లభిస్తాయి. మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఏ విషయంలోను స్పష్టమైన నిర్ణయానికి రాలేరు. మీ సమస్యలను అయిన వారికి తెలియజేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆదాయానికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో కొంత మార్పు ఉంటుంది. వాహనం నడుపుతున్నప్పుడు మెలకువ వహించండి. కోర్టు కేసులు వాదనకు వస్తాయి. దైవ, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. శంకుస్థాపనలు, నిశ్చితార్థాలకు అనుకూలం. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. ఉద్యోగ యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, మందులు, చిన్న వ్యాపారులకు ఆశాజనకం. విద్యార్థులకు ఉపాధ్యాయులు, తోటివారితో సత్సంబంధాలు నెలకొంటాయి. నోటీసులు, ముఖ్యమైన రసీదులు అందుకుంటారు.

మకరం:
(ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు)
మీ ఆలోచనలు, కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి. కొంతమంది మీ నుంచి రహస్యాలు సేకరించేందుకు యత్నిస్తారు. ఖర్చులు ఆదాయానికి తగినట్టుగానే ఉంటాయి. మీ వాగ్ధాటితో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారం కావడంతో మనస్సు తేలికపడుతుంది. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. మీ శ్రీమతి ప్రోత్సాహంతో ఒక స్థిరాస్తి కొనుగోలుకు యత్నాలు సాగిస్తారు. వ్యాపారాల అభివృద్ధికి కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. భాగస్వామిక, సొంత వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. స్త్రీలకు ఆరోగ్యం విషయంలో ఏమరుపాటు కూడదు. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాల్లో చుక్కెదురవుతుంది. వృత్తిపరంగా ప్రముఖులను కలుసుకుంటారు. ట్రాన్స్‌పోర్ట్, ట్రావెలింగ్, ఆటోమొబైల్ రంగాల వారికి పురోభివృద్ధి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. నగదు, ముఖ్యమైన పత్రాలు జాగ్రత్తగా ఉంచండి. ఉద్యోగస్తులు, అధికారులు, తోటివారితో సమావేశాలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ సమాచారం అందుతుంది.

కుంభం:
(ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు )
 ఆది, సోమవారాల్లో ఒప్పందాలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. మీ శ్రీమతి ఇచ్చిన సలహాను తేలికగా కొట్టివేయడం మంచిది కాదు. శారీరక శ్రమ, మితిమీరిన ఆలోచనల వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. స్త్రీల ప్రతిభకు సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆత్మీయులకు విలువైన కానుకలు చదివించుకుంటారు. అందరినీ అతిగా విశ్వసించి భంగపాటుకు గురవుతారు.వ్యాపారాల అభివృద్ధి, గృహ నిర్మాణాలు, మార్పులు, చేర్పులకు అనుకూలం.  పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా రంగాల వారికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది. ప్రయాణాలు, పుణ్యక్షేత్ర సందర్శనలు ఉల్లాసం కలిగిస్తాయి. ఆస్తి వివాదాలు, కోర్టు వ్యవహారాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఇంట ఒక శుభకార్యం సానుకూలమవుతుంది. పెద్దలకు, తోబుట్టువులకు నూతన వస్త్రాలు సమర్పించుకుంటారు. అర్థాంతంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, పని ఒత్తిడి వంటి చికాకులు తప్పవు.

మీనం:
(పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి )
మీ చిత్తశుద్ధి, నిజాయితీలకు సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. బుధ, గురువారాల్లో ఊహించని ఖర్చులు, సమయానికి చేతిలో ధనం లేకపోవడం వంటి ఇబ్బందులెదుర్కుంటారు. చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తికావు. ఇంటా బయటా స్త్రీల ఆధిపత్యం కొనసాగుతుంది. నూతన పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణలకు అనుకూలం. వ్యాపారాల్లో ఆటుపోట్లు అధిగమించి అనుభవం గడిస్తారు. వేడుకలు, శుభకార్యాల్లో ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఆపత్సమయంలో ఆత్మీయులకు తోడుగా నిలుస్తారు. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఊహించని సమస్యలు తలెత్తుతాయి. విద్యార్థులకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో సత్ఫలితాలు సాధిస్తారు. ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమకు తగిన ప్రతిఫలం ముడుతుంది. మీ సంతానం వివాహ, ఉద్యోగ, విద్యా యత్నాలు ఫలిస్తాయి. చిన్నతరహా పరిశ్రమలు, వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు ఆశాజనకం. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారాలు తెలియడంతో మనస్సు కుదుటపడుతుంది.
 

 

 

 

 

 

 

No comments:

Post a Comment