Monday 26 September 2016

పసుపు ( హరిద్ర ) -విశిష్టత

పసుపు ( హరిద్ర ) -విశిష్టత

పసుపుని సంస్కృతంలో హరిద్ర అని అంటారు. పసుపును అన్ని శుభకార్యాల్లో ఉపయోగిస్తారు.

  ఒకప్పుడు ముఖానికి పసుపు రాసుకునే స్నానానికి వెళ్ళేవాళ్ళు. అందుకే వయసు కనపడకుండా, ముఖాన ముడతలు లేకుండా చక్కగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ హడావిడి జీవనయానంలో అంత తీరిక ఉండటం లేదు. కానీ రెండు రోజులకు ఒకసారయినా ఒక పది నిమిషాలు తీరిక చేసుకుని కొంచెం పసుపు, దానికి సరిపడా నీళ్ళు తీసుకుని బాగా కలిపి పసుపు ముద్ద ముఖానికి రాసి ఒక పది నిమిషాలు తర్వాత కడిగేయాలి. పసుపు కొత్త కణాలను వృద్ధి చేసి చర్మాన్ని బిగుతుగా మార్చటమే గాక వయసు రీత్యా వచ్చే ముడతల్ని రానివ్వదు. సుమంగళులకు తాంబూలం లేదా ఆకు, వక్క ఇచ్చే సమయంలో మొదట పసుపు ఇచ్చి తరువాత కుంకుమ ఇస్తారు. పసుపు సౌభాగ్యానికి చిహ్నం. ఈ కారణం చేతనే సుమంగుళులు తన భర్తకు శుభం కోరుతూ మాంగల్యానికి పసుపును ఉంచి నమస్కరిస్తారు. దేవీ ఆలయాల్లో, నవరాత్రి పూజా సమయంలో దేవికి పసుపుతో చేసే అలంకారాలు ముఖ్యమైనవి. గోదాదేవి లేదా ఆండాళ్ అమ్మవారి దేవాలయానికి మీరు వెళ్లినప్పుడు మీకు పసుపు ప్రసాదాన్ని అందిస్తే మీరు ఏం చేస్తారు? పసుపును ఇంటికి తీసుకు వచ్చి వంటల్లో లేదా స్నానం చేసేందుకు ఉపయోగిస్తారు. అయితే ఇకపై అలా చేయవద్దు. ప్రసాదంగా పసుపును పొంది ఇంటికి తీసుకు వచ్చినప్పుడు చేయాల్సిన విధాన క్రమం:
1. దేవుని ప్రసాదమైన పసుపును ప్రతి దినం పూజాస్థానంలో ఉంచి పూజిస్తే ఇంటికి, ఇంట్లో ఉన్నవారికి అన్ని విధాలా ధన, కనక, వస్తు, వాహనాలు వృద్ధి చెందుతాయి.
2. పసుపును నీటిలో వేసి స్నానం చేస్తే దేహ కాంతి పెరుగుతుంది. సమస్త చర్మరోగాలు నయం అవుతాయి. పసుపును నీటిలో వేసి చేసే స్నానాన్ని మంగళ స్నానం అని పిలుస్తారు.
3. పసుపుతో గౌరీదేవిని చేసి పూజించటం ద్వారా ఇంట్లో ఉండే వధువుకు ఉన్న వివాహ దోషాలు తొలగిపోయి, త్వరలో వివాహం నిశ్చయమవుతుంది.
4. దేవికి పసుపు రంగు చీరను ఇస్తే ఇంట్లో ఉండే దోషం మరియు దైవ దోషాలు తొలగిపోతాయి.
5. దుకాణాల్లో చాల రోజులుగా అమ్ముడు కాకుండా మిగిలి ఉండే వస్తువులపై కొద్దిగా పసుపు పొడిని చల్లితే వెంటనే వ్యాపారమవుతుంది.
6. పసుపు నీటితో ఇంటిని కడిగితే ఆ ఇంటికి ఆ ఇంటివారికి డబ్బుకు సమస్య రాదు, అప్పుల బాధ తొలగిపోతుంది.
7. కామెర్లు ఉన్నవారి ఇంటి వారు పసుపును దానంగా ఇస్తే కామెర్ల రోగం తొలగిపోతుంది.
8. ప్రతి సంవత్సరం కామెర్లు వచ్చేవారు సుమంగుళులకు పసుపు రంగు చీర, తాంబూలాలను దానంగా ఇస్తే కామెర్ల సమస్య తలెత్తదు.
9. గృహదేవతను పసుపు నీటితో కడిగితే విగ్రహాలకు దైవ కళ పెరుగుతుంది.
10. వ్యాపారం జరుగని దుకాణాల్లో శంఖాన్ని పసుపు రంగు కాగితంలో చుట్టి దానిని గల్లాపెట్టెలో ఉంచితే వ్యాపారం బాగా అవుతుంది.
పసుపు ఆరోగ్యానికి ఎంతో మంచిదంటారు మన బామ్మలు. అందులోనూ జలుబు, దగ్గులాంటివి చేస్తే పాలల్లో పసుపు కలిపి తాగమంటారు. అయితే ఇప్పుడు ఈ డ్రింక్ కు సిడ్నీ నుంచి శాన్‌ ఫ్రాన్సిస్ కో వరకూ మంచి డిమాండ్‌ ఉందిట! ఆశ్చర్యపోతున్నారా? నిజం. పసుపు కలిపిన పాలను పశ్చిమదేశాల్లో గోల్డెన్‌ మిల్క్ గా పిలుస్తారు. ఇందులో కొబ్బరి, బాదం, జీడిపప్పు పాలను కూడా కలిపి మరింత రుచికరంగా చేస్తారు. అక్కడ దొరికే లాటెలలో టాప్‌ లిస్టులో గోల్డెన్‌ మిల్క్‌ ఉండడం విశేషం.
'పసుపు'.. పురాతన కాలం నుంచి భారతీయులు తమ వంటకాల్లో ఎక్కువగా వాడుతూ వస్తున్నారు. అల్లం జాతికి చెందిన దుంప అయిన పసుపు మసాలా దినుసుల్లో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. పసుపులోని ఔషధ గుణాలను గుర్తించిన భారతీయ శాస్త్ర విజ్ఞానం ప్రపంచానికి దిక్సూచిలా పని చేస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు.. పసుపు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు భారతీయులు ఏనాడో గుర్తించారు. దీని ప్రయోజనాలను గ్రహించిన ఇతర దేశాలలోనూ పసుపుకు మరింత క్రేజ్ పెరుగుతోంది.
వానాకాలం వచ్చిందంటే తరచుగా ఇబ్బంది పెట్టే జలుబు, చర్మ సమస్యలు, కంటి సమస్యలను పసుపుతో నివారించవచ్చు. పసుపును పాలతో కలిపి ఉపయోగిస్తే.. ఇందులోని ఔషధ గుణాలు రెట్టింపు అవుతాయని అనేక పరిశోధనల్లో స్పష్టమైంది. పాలలోని పోషకాలు, పసుపులోని ఔషధగుణాలు కలిసి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనంతో పాటు ఆరోగ్యాన్ని ఇస్తాయి.
చిన్న పసుపు ముక్కను పాలతో కలిపి మరిగించినప్పుడు శరీరంలో వేడి పుట్టించి ఊపిరితిత్తుల సమస్యలు, సైనస్ నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. అంతే కాదు, ఇది ఉబ్బసం, బ్రాంకైటిస్ ను నయం చేయడానికి ఒక సమర్థవంతమైన పరిష్కారంగా పనిచేస్తుంది.
పసుపులో క్యాన్సర్ కి వ్యతిరేకంగా పోరాడే అణువులు ఉన్నట్టు గుర్తించారు. భోపాల్ లోని రాజీవ్ గాంధీ విశ్వవిద్యాలయం అధ్యయనాల్లో ఈ కొత్త విషయం బయటపడింది. పసుపులో యాంటీ సెప్టిక్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్ వంటి రకరకాల గుణాలు పుష్కలంగా ఉండటమే.. ఈ అధ్యయనాలకు ప్రోత్సాహాన్నిచ్చిందని సైంటిస్ట్ లు చెబుతున్నారు.
పసుపును ఆహార పదార్థాలలో వాడుతుంటాం. ఎన్నో వ్యాధులకు మందుగా కూడా ఉపయోగిస్తాం. అలాంటి పసుపు శరీర లావణ్యాన్ని కూడా పెంచుతుంది.

* ప్రతిరోజూ ఉదయం స్నానం చేయటానికి అరగంట ముందు పసుపు ఒంటికి బాగా పట్టించి తర్వాత స్నానం చేస్తే ఆరోగ్యంతో పాటు శరీర లావణ్యాన్ని కూడా పెంచుతుంది.

* ఎక్కువ సేపు నీటిలో ఉంటే పాదాలు నాని పగుళ్లు, లేక ఒరుసుకుపోవడం లాంటివి జరుగుతుంది. అలాంటపుడు పసుపు రాసుకుంటే యాంటీ సెప్టిక్‌గా పనిచేసి ఉపసమనం కలిగిస్తుంది.

* పసుపు నీటిని వారానికి ఒకసారి తాగడం వలన ఒంట్లోని వేడిని తగ్గిస్తుంది. ఇంకా శరీరంలోని రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది.

* ఆముదంలో కొంచెం పసుపు కలుపుకొని శరీరానికి పూసుకొని పదినిముషాల తర్వాత సబ్బుతో రుద్దుకొని స్నానం చేయాలి. ఇలా చేస్తే శరీరంపై ఉన్న మచ్చలు, దురద, చర్మవ్యాధులు అన్ని తగ్గిపోతాయి.

* శరీరంమీద ఏర్పడిన దురదతో బాధపడుతుంటే పసుపు, వేపాకుని నూరి ఒంటికి పూస్తే దురద తగ్గిపోతుంది.

No comments:

Post a Comment