Wednesday 31 October 2018

భగవత్ కృప





భగవత్ కృప ఏరూపంలో అయినా ఉండవచ్చు.
ఓవ్యక్తి తనకు ఎదురైన సంఘటన ఇలా వివరిస్తున్నారు.
రాత్రి 9 గంటల ప్రాంతంలో నాకు అకస్మాత్తుగా ఎలర్జీ వచ్చింది. ఇంటిదగ్గర మందు లేదు. నేను తప్ప ఇంట్లో ఎవరూ లేరు. భార్య పిల్లలు పుట్టింటికి వెళ్ళారు. నేను ఒక్కడినే ఉండిపోయాను. డ్రైవర్ కూడా తన ఇంటికి వెళ్లిపోయాడు.
వర్షాకాలం కనుక బయట కొద్దిగా వర్షం పడుతున్నది. మందు దుకాణం ఎక్కువ దూరం లేదు. నడుచుకుంటూ కూడా వెళ్ళగలను. కానీ వాన పడుతున్నది కనుక నేను రిక్షాలో వెళ్లడం సరైన పని అనుకున్నాను.
పక్కనే రాముని గుడి కడుతున్నారు. ఒక రిక్షా అతడు భగవంతుడిని ప్రార్థిస్తున్నా డు.
నేను అతడిని వస్తావా అని అడిగాను. అతను వస్తాను అని తల ఊపగానే నేను ఎక్కేసాను.
రిక్షా అతను చాలా అనారోగ్యంగా అనిపించాడు. అతని కళ్ళల్లో కన్నీరు కూడా ఉంది. “ఏమైంది నాయనా? ఎందుకు ఏడుస్తున్నావు? ఒంట్లో బాగోలేదులా ఉంది.” అని నేను అడిగాను.
“వర్షం వల్ల మూడు రోజుల నుండి ఎవరూ దొరకలేదు. ఆకలిగా ఉంది. ఒళ్ళు నొప్పులుగా కూడా ఉంది.
‘భోజనం పంపించు తండ్రీ’ అని.” అని ఇప్పుడే భగవంతుని ప్రార్థిస్తున్నాను అన్నాడు.
నేను ఏమీ మాట్లాడకుండా రిక్షా ఆపించుకుని, మందు దుకాణానికి వెళ్ళిపోయాను. అక్కడ ఆలోచిస్తూ ఉన్నాను.
‘భగవంతుడు నన్ను ఇతని సహాయం కోసం పంపలేదు కదా? ఎందుకంటే ఇదే ఎలర్జీ అరగంట ముందు వచ్చి ఉంటే నేను డ్రైవర్ని పంపేవాడిని. రాత్రి బయటకు పోవటం నాకు అవసరం ఉండేది కాదు. నేను కూడా వెళ్ళాలనుకునే వాడిని కాదు.’
మనసులోనే భగవంతుని అడిగేసాను- నన్ను ఈ రిక్షా అతడి సహాయార్థం పంపావు కదా? అని. నా మనసుకు ‘అవును’ అని జవాబు వచ్చినట్లనిపించిది.
నేను భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకొని, నా మందుతో పాటు రిక్షావాడి కోసం కూడా మందు తీసుకొన్నాను.
పక్కనే ఒక చిన్న రెస్టారెంటులో ఛోలే భటూరే కొని, ప్యాక్ చేయించి, వచ్చి రిక్షా ఎక్కి కూర్చున్నాను.
ఏ గుడి ముందర రిక్షా ఎక్కానో అక్కడికే వచ్చి ఆపించుకుని, దిగాను. అతడి చేతిలో 30 రూపాయలు పెట్టి, వేడి వేడి ఛోలే భటూరే, మందులు ఇచ్చి, ఇట్లా చెప్పాను- “ఈ ఆహారం తిని మందు వేసుకో. ఒక్కొక్క మాతర- ఇవి ఇవాళ, ఇవి రేపు పొద్దున టిఫిన్ తిన్న తర్వాత. ఆ తర్వాత వచ్చి నాకు కనిపించి వెళ్ళు.”
అప్పుడు రిక్షా అతను ఏడుస్తూ అన్నాడు- “నేను భగవంతుడిని రెండు రొట్టెలు అడిగాను. ఆయన నాకు ఛోలే భటూరే పెట్టాడు.
చాలా నెలల ముందు నాకు ఇవి తినాలి అని కోరిక కలిగింది. ఈరోజు భగవంతుడు నా ప్రార్థన విన్నాడు. భగవంతుని మందిరం దగ్గర ఆయన భక్తుడిని నా సహాయం కోసం పంపించాడు.”
అట్లా ఇంకా ఏవేవో మాటలు చెప్తూ ఉండిపోయాడు. నేను స్తబ్ధంగా ఉండి వింటూ ఉండిపోయాను.
ఇంటికి వచ్చి ఆలోచించాను. ఆ రెస్టారెంట్ లో చాలా వస్తువులు ఉన్నాయి. నేను ఏదైనా కొనగలిగేవాడిని. సమోసా, లేదా భోజనం కానీ, నేను చోలే బటూరే మాత్రమే ఎందుకు కొన్నాను? నిజంగా భగవంతుడు రాత్రిపూట తన భక్తుని సహాయార్థం నన్ను పంపాడు.
మనము ఎవరికైనా సహాయం చేసేందుకు సరైన వేళకు చేరితే భగవంతుడు అతని ప్రార్థన విన్నాడు అని దాని అర్థం. మనను తనకు ప్రతినిధిగా పంపాడు అని అర్థము.
ఓ భగవంతుడా సర్వదా నాకు సరైన దారి చూపిస్తూ ఉండు తండ్రీ! అని భగవంతుని వేడుకున్నాను.
సర్వులకు సర్వదా భగవంతుని అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ

Tuesday 23 October 2018

శ్రీలక్ష్మీ ఫలం

No automatic alt text available.

మనస్సే అన్నింటికీ కారణం. ఆ మనస్సుకు కారకుడు చంద్రుడు. చంద్రుని కళలతో మనస్సు ప్రభావితం అవుతుందని పెద్దలు చెబుతారు. రక్త హీనత, అతి మూత్రం, గర్భ సంబంధిత వ్యాధులు, వరబీజము, బేదులు, మానసిక వ్యాధులు, ఉదర సంబంధిత వ్యాధులు, కేన్సర్(రాచ పుండు) మొదలైన వాటికి చంద్రుడు కారకుడు.
చంద్రుని ఆధారంగా ఆ నక్షత్రం యొక్క ప్రభావంతో వారి వ్యక్తిత్వాన్ని అంచనావేస్తాం. అంటే...మనస్సు, తెలివితేటలు, గ్రహణశక్తి, మతిమరుపు, చిత్తచాంచల్యం, ఇంద్రియనిగ్రహం, సౌందర్యం, లావణ్యం, శరీరసౌఖ్యం... మొదలైనవి. సూర్యచంద్రకాంతుల ప్రభావం మనపై ఉంటుంది. సూర్యకాంతి వల్ల శారీరక ఆరోగ్యం, చంద్రకాంతి వల్ల మానసిక ఆరోగ్యం కలుగుతాయని గుర్తించాలి. అందుకే ఇంటిలోకిసూర్య, చంద్రకాంతి పడేలా చూసుకోవాలని శాస్త్రం చెబుతోంది. క్షార వృక్షములకు చంద్రుడు అధిపతి.
జాతకంలో చంద్రుడు అనుకూలంగా లేని వాళ్ళు ,బాలారిష్ట దోషం ఉన్నవారు శ్రీఫలాన్ని పూజించాలి.శ్రీపలాన్నే లఘు నారికేళం అని కూడ అంటారు.సముద్ర తీర ప్రాంతాలలో క్షార వృక్ష జాతికి చెందిన వృక్షాలయందు దొరుకుతాయి.


శ్రీలక్ష్మీ ఫలాలు కొన్నిబూడిద రంగులో ఉంటాయి.కొన్ని తెలుపు రంగులో ఉంటాయి.శ్రీలక్ష్మీ ఫలం చూడటానికి చిన్న సైజులో ఉన్న దీనిప్రభావం చాలా శక్తి వంతమైనవి.
శ్రీలక్ష్మీ ఫలం అనేది కొబ్బరికాయ ఆకారంలో పెద్దసైజు ఉసిరికాయ ఆకారంలో ఉంటాయి.కొబ్బరికాయలాగే దీనికి కూడా పీచు ఉంటుంది.పీచు దిగువున మామూలు కొబ్బరికాయలకు ఉండే విధంగానే మూడు బిందువులు ఉంటాయి. శ్రీలక్ష్మీ ఫలం లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారు.

No automatic alt text available.
శ్రీలక్ష్మీ ఫలాన్ని ఏదైనా శుభముహూర్తంలో ఇంటికి తెచ్చుకొని శుభ్రమైన నీటితో కడిగి పవిత్ర గంగాజలంతో అభిషేకించాలి.ఉదయాన్నే స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని పసుపు,గంధంతో శ్రీలక్ష్మీ ఫలానికి మొత్తం పూయాలి.తరువాత కుంకుమతో బొట్ట్లు పెట్టాలి.శ్రీఫలమ్ చుట్టు పుష్పాలతో అలంకరించాలి. లవంగాలు,యాలకులు,పండ్లు నైవేద్యం ఇవ్వాలి.కర్పూరం,సాంబ్రాణితో ధూపం చూపాలి.తరువాత పసుపు గాని,ఎరుపు గాని,తెలుపు గాని వస్త్రాన్నితీసుకొని శ్రీలక్ష్మీ ఫలాన్ని ,కొన్ని నాణేలను గుడ్డలో చుట్టి పెట్టి లక్ష్మీ దేవి ప్రతిరూపంగా భావిస్తూ ధూపదీపనైవేద్యాలతో పూజించాలి.శ్రీలక్ష్మీ ఫలంతో పాటు పెట్టిన నాణేలను అప్పుడప్పుడు తీసుకొంటు,నాణేలను అప్పుడప్పుడు చేరుస్తూ ఉంటే ఇంట్లో ఎల్లప్పుడు ధనాభివృద్ధి ఉన్నట్లే.
"ఓం శ్రీం శ్రియై నమః"అనే మంత్రాన్ని రోజు 11 సార్లు జపమాలతో జపం చేయాలి.

జాతకంలో చంద్రుడు పాపస్థానాలలో ఉన్న నీచలో ఉండి శుభగ్రహ దృష్టి లేకపోయిన మానసిక సమస్యలు ఎదుర్కొంటారు.అమావాస్య పౌర్ణమి రోజులలో ఉద్రేకాలకు లోనవుతారు.ఇలాంటి వారు ఎల్లప్పుడు శ్రీఫలాన్ని దగ్గర ఉంచుకుంటె మంచిది.శ్రీ ఫలం తాంత్రిక ప్రయోగాలకు ఎంతో ఉపయోగపడుతుంది.
జాతకంలో చంద్రుడు అష్టమంలో ఉంటే బాలారిష్ట దోషం అంటారు.బాలారిష్ట దోషం ఉన్నవారు శ్రీపలాన్ని ఎర్రటి గుడ్డలో కట్టి మెడలో గాని ,నడుముకి గాని కట్టుకోవాలి.


No automatic alt text available.
ప్రజాపయోగ వ్యాపారసంస్థలలో,వాటర్,రియల్ ఎస్టేట్,పాల వ్యాపారసంస్థలలో తప్పనిసరిగా శ్రీపలాన్ని పూజించాలి.శ్రీ ఫలాన్ని నిత్యం పూజించే వారికి ధనానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు.శ్రీ ఫలాన్ని వ్యాపారస్ధలంలోను, ఆపీసుల్లో ఉంచిన సత్వర ఆర్ధికాభివృద్ధి ఉంటుంది.శ్రీ ఫలాన్ని పూజచేసుకొని దగ్గర ఉంచుకొనేవారికి డబ్బు వృధాగా ఖర్చు అవ్వవు.శ్రీ లక్ష్మీ ఫలంతో పాటు ఎల్లప్పుడు నాణేలను ఉంచాలి.
శ్రీ ఫలాన్ని వ్యవసాయం చేసే వారు వ్యవసాయ సమయంలో భూమిలో ఉంచిన పంటలు బాగా పండుతాయి.వాయువ్య దిక్కు దోషం ఉన్నవారు 11 శ్రీపలాల్ని తెల్లగుడ్డలో చుట్టి వాయువ్య దిక్కున ఉంచిన దోష నివారణ జరుగుతుంది.
పిట్స్,మతిమరుపు,స్త్రీలకు ఋతు సమస్యలు,గర్బాశయ సమస్యలు ఉన్న వారు శ్రీపలాన్ని పూజించి దగ్గర ఉంచుకోవాలి.

contact for original sreephalam 9000123129
 (sree vidhatha peetam )

Monday 15 October 2018

కార్యసిద్దిని చేకూర్చే శక్తివంతమైన ఆంజనేయ స్వామి శ్లోకాలు . . .!!








హనుమంతుడు కార్యసాధకుడు. భక్తితో హనుమంతుడిని కొలిచిన వారికి వారి కోరికలు తప్పక నెరవేరతాయి. భక్తులు వారి వారి కోరికను అనుసరించి ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధించగలుగుతారు.

1. విద్యా ప్రాప్తికి:-
పూజ్యాయ, వాయుపుత్రాయ వాగ్ధోష వినాశన!
సకల విద్యాంకురమే దేవ రామదూత నమోస్తుతే!!


2. ఉద్యోగ ప్రాప్తికి :-
హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వా పీడా వినాశినే!
ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూపా నమోస్తుతే!!

3. కార్య సాధనకు :-
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిమ్ వద!
రామదూత కృపాం సింధో మమకార్యమ్ సాధయప్రభో!!

4. గ్రహదోష నివారణకు :-
మర్కటేశ మహోత్సాహా స్రవ గ్రహ నివారణ!
శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయామ్ ప్రభో!!

5. ఆరోగ్యమునకు :-
ఆయుః ప్రజ్ఞ యశోలక్ష్మీ శ్రద్ధా పుత్రాస్సుశీలతా!
ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే!!

6. సంతాన ప్రాప్తికి :-
పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్!
సంతానం కురమే దేవ రామదూత నమోస్తుతే!!

7. వ్యాపారాభివృద్ధికి :-
సర్వ కళ్యాణ దాతరమ్ సర్వాపత్ నివారకమ్!
అపార కరుణామూర్తిం ఆంజనేయం నమామ్యహమ్!!

8. వివాహ ప్రాప్తికి :-
యోగి ధ్యే యాం ఘ్రి పద్మాయ జగతాం పతయేనమః!
వివాహం కురమేదేవ రామదూత నమోస్తుతే!!

ఈ శ్లోకాలను ఆయా కార్యసిద్ధిని కోరుకునేవారు 40 దినాలు నిష్ఠతో స్మరిస్తూ, ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి శక్తికొద్దీ ప్రదక్షణా సంఖ్యా నియమాన్ని అనుసరించి ప్రదక్షణాలు చేసి ఆ స్వామిని పూజిస్తే తమ తమ కార్యాలలో విజేతలు అవుతారు.
భక్తి తో చేస్తే ఫలితం వుంటుంది

Monday 8 October 2018

మహాలయ అమావాస్య... మహిమాన్వితమైన అమావాస్య!



              భాద్రపద  అమావాస్యని మహాలయ అమావాస్య అని పిలుస్తారు. ఈ అమావాస్య క్రిష్ణ పక్షం చతుర్ధశి రోజున ప్రారంభమవుతుoది. ఈ పర్వదినాన శివుడిని పూజిస్తారు.ఈ అమావాస్య రోజు శివుడిని పూజించడం వల్ల అన్ని సమస్యలు దూరమై జీవితంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతలు పొందుతారు. పూర్తీ నమ్మకం, భక్తితో ఈ రెండు రోజులు శివుడిని పూజించాలి. అయితే శనిదేవుడిని కూడా ఈ అమావాస్య వేళ పూజిస్తే జీవితంలో ఎదుర్కొంటోన్న కష్టాలన్నీ తీరిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రతి ఏలా భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ అమావాస్య రోజు సాధారణంగా పితృపక్షాలు నిర్వహిస్తారు. అలాగే అనేక ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.  
          శాస్త్రాల ప్రకారం అమావాస్య శనివారంనాడు వచ్చిదంటే చాలా పవిత్రంగా భావిస్తారు. ఆ రోజు శనిదేవుడిని పూజించడం వల్ల చాలా ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. అన్ని పాపాలు తొలగిపోవడమే కాకుండా ఆరోగ్యం, సంపద, శ్రేయస్సు కలుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శించి, పవిత్ర స్నానాలు, యాగాలు చేసి, ఉపవాసం ఉండటం వల్ల కూడా పాపాల నుంచి విముక్తి పొందవచ్చు.
          శివుడ్నే కాదు భాద్రపద అమావాస్య నాడు విష్ణుమూర్తిని కూడా ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ అమావాస్య రోజు విష్ణువుని పూజిస్తే మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం, ఆర్థికంగా మెరుగైన ఫలితాలు పొందుతారు.
చనిపోయిన కుటుంబ సభ్యులకు ఈ అమావాస్య రోజు పూజలు చేయడం వల్ల వాళ్లు ప్రశాంతత పొందుతారు. చనిపోయిన వాళ్ల కోసం ఉపవాసం ఆచరిస్తే వాళ్ల ఆత్మ శాంతిస్తుంది. అలాగే, శాస్త్రాల ప్రకారం పితృ దేవతలకు అమావాస్య ప్రత్యేకం. అందుకే అమావాస్య రోజులలో చనిపోయిన వాళ్ల పేరు మీద పూజలు నిర్వహించాలి. ఇక సంవత్సరానికి ఒకసారి వచ్చే మహాలయ అమావాస్య నాడు తప్పనిసరిగా పితృ దేవతల్ని ఆరాధించాలి. శ్రద్ధగా శ్రాద్ధ క్రియ చేయటంతో పాటూ నువ్వుల నీటితో తర్పణాలు విడవాలి. అప్పుడే వాళ్లు సంతోషించి మనకు రక్షణ, శుభాలు కలిగిస్తారు...
ఈ అమావాస్య రోజు హోమం చేయడం కూడా చాలా మంచి పలితాలను ఇస్తుంది. జీవితంలో అన్ని సమస్యలు దూరమవుతాయి. కాబట్టి జ్యోతిష్య శాస్త్రానుసారం మనకు ఏ హోమం అవసరమో తెలుసుకుని దాన్ని భాద్రపద అమాస్యనాడు ఆచరించాలి.
       మొత్తంగా మహాలయ అమావాస్యగా చెప్పబడే ఈ భాద్రపద అమావాస్యనాడు ఎంత భక్తి, శ్రద్ధలతో గడిపితే అంత ఉత్తమం. ఆధ్యాత్మిక ఉన్నతికి ఈ రోజు అద్భుతమైన అవకాశం కల్పిస్తుంది.

Navagraha amavasya kosam contact 9000123129

ధ్వజస్థంభం పుట్టుక

No automatic alt text available.

                      మనం ఏదేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి, ప్రదక్షిణచేసి ఆతర్వాతే లోపలికి వెళతాం. అసలీ 'ధ్వజస్థంభం' కధాకమామీషూ ఏంటో ఓసారి చూద్దాం. ఈ ధ్వజస్థంభం ఏర్పడటానికి ఓకధ ఉంది.

              భారత యుద్ధానంతరం పాండవులలో జ్యేష్టుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్టిస్తాడు. ధర్మబధ్ధంగా రాజ్య పాలన చేస్తుంటాడు. ధర్మమూర్తిగా, గొప్పదాతగా పేరు పొందాలనే కోరికతో విరివిగా దానధర్మాలు చేయడం మొదలు పెడ్తాడు. ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగినరీతిగా గుణపాఠం చెప్పాలనుకుంటాడు. ధర్మరాజుకి అశ్వమేధయాగం చేసి, శత్రురాజులను జయించి, దేవతలనూ బ్రాహ్మణులను సంతుష్టి పరచి, రాజ్యాన్ని సుస్థిరం, సుభిక్షం చేయమనీ చెప్తాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసా వహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి, యాగాశ్వానికి రక్షకులుగా నకుల సహదేవులను సైన్యంతో పంపుతాడు.


               ఆ యాగాశ్వం అన్నిరాజ్యాలూ తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది. ఆ రాజ్యానికి రాజు మయూర ధ్వజుడు. ఆయన మహా పరాక్రమ వంతుడు, గొప్ప దాతగా పేరుగాంచినవాడు. మయూరధ్వజుని కుమారుడు తామ్ర ధ్వజుడు, పాండవుల యాగాశ్వాన్నిబంధిస్తాడు. తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకులసహదేవులు, భీమార్జునులు ఓడిపోతారు. తమ్ములందరూ ఓడిపోయిన విషయం తెల్సుకున్న ధర్మరాజు స్వయంగా యుధ్ధానికై బయలుదేరగా శ్రీకృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజుడ్ని యుధ్ధంలో జయించడం సాధ్యంకాదనీ, మహాబలపరాక్రమవంతులైన భీమార్జునులే ఓడిపోయారనీ, అతడ్నికపటోపాయాంతో మాత్రమే జయించాలనీ చెప్తాడు.


             శ్రీకృష్ణుడు, ధర్మరాజుతోకలసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేర్తాడు. ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలచి ఏమి కావాలో కోరుకొమ్మని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు, "రాజా! మీ దర్శనార్ధమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఈతని కుమారుడ్ని పట్టుకుంది. బాలుని విడిచి పెట్టవలసినదిగా మేముప్రార్థించగా, సింహం మానవ భాషలో' మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజైనా మయూరధ్వజుని 'శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా అతడి భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వగా తెచ్చి ఇస్తే, ఈతడ్ని వదిలేస్తాననీ చెప్పిందనీ, కనుక ప్రభువులు మా యందు దయదలచి తమ శరీరంలోని సగభాగాన్ని దానమిచ్చి ఈతడి కుమారుని కాపాడమని కోరుతారు. వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయించి భార్యాసుతులు అతని శరీరాన్నిమధ్యకు కోసి వారికి ఇవ్వమని చెప్తాడు. వారు ఆయన శరీరాన్ని సగంగా కోయటం చూచిన ధర్మరాజు అతని దాన గుణానికి నివ్వెరపోయాడు. ఇంతలో మయూరధ్వజుని ఎడమకన్ను నుంచి నీరు కారటం చూసిన ధర్మరాజు "తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు గాక వద్దు అంటాడు. అందుకు మయూరధ్వజుడు, "మహాత్మా తమరు పొరపడుతున్నారు. బాధపడి నా శరీరాన్ని మీకివ్వటం లేదు. నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది, కానీ ఆ భాగ్యం తనకు కలగటంలేదు కదా అని ఎడమ కన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తున్నది." అని వివరిస్తాడు.


             మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపి "మయూరధ్వజా! నీ దానగుణం అమోఘం ! ఏదైనావరం కోరుకో! అనుగ్రహిస్తాను" అంటాడు. "పరమాత్మా! నా శరీరం నశించినా నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేలాగానుగ్రహించండి. " అని కోరుతాడు మయూరధ్వజుడు. అందుకు శ్రీకృష్ణుడు "తథాస్తు" అని పలికి, "మయూరధ్వజా! నేటి నుంచీ ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ, నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది. ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యం నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారి జన్మ సఫలం అవుతుంది. నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది" అంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుంచీ ఆలయాల ముందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్టించడం ఆచారమయింది. భక్తులు ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి ఆ తర్వాతే ములవిరాట్టు దర్శనం చేసుకోడం సాంప్రదాయంగా మారింది.

Friday 5 October 2018

పిల్లలకు అన్నప్రాసన ఎన్నో నెలలో చేయాలి ?

Image may contain: 1 person

  ఆడ పిల్లలకు ‘5 ‘ వ నెలలో, 
మగ పిల్లలకు ‘6 ‘ వ నెలలో అన్న ప్రాసన చేయాలి. 
6 నెల 6వ రోజున ఇద్దరికీ పనికివస్తుంది.

"దీర్ఘాయుష్మాన్ భవ" అంటే?

No automatic alt text available.
Image may contain: one or more people, people standing and outdoor

చలా సంవత్సరాల క్రితం మహాస్వామి వారి దర్శననానికి నలుగురైదుగురు పండితులు వచ్చారు. స్వామి వారికి సాష్టాంగం చేసి వారి ముందు కూర్చున్నారు.
మహాస్వామి వారు భక్తులతో మట్లాడుతూ, ఆ కూర్చున్న పండితులనుద్దేశించి ఇలా అడిగారు. “భక్తులు నాకు నమస్కరిస్తే, నేను వారిని “నారాయణ నారాయణ” అని ఆశీర్వదిస్తాను. మరి మీరు గృహస్తులు ఏమని అశీర్వదిస్తారు?”
మేము “దీర్ఘాయుష్మాన్ భవ సౌమ్య అని అశీర్వదిస్తాము. అదే సాంప్రదాయము.“
అని అన్నారు.
”అంటే ఏమిటి?” అని మహాస్వామి వారు ప్రశ్నించారు.
”చాలాకాలం సౌఖ్యంగా ఉండు” అని దీని అర్థం.
మహాస్వామి వారు అక్కడ ఉన్న అందరు పండితులను అదే ప్రశ్నవేసారు. అందరూ అదే సమాధానం చెప్పారు.
మహాస్వామి వారు కొద్ది సేపు మౌనంగా ఉండి, “మీరందరూ చెప్పిన అర్థం తప్పు” అన్నారు.
పండితులు ప్రశ్నార్థకంగా చూసారు. వాళ్ళందరూ పెద్ద విధ్వాంసులు. సంస్కృత వ్యాకరణాలలో శిరోమణులు. మంచి విద్వత్ కలిగిన వారు.
సంస్కృత వాక్యం “దీర్ఘాయుష్మాన్ భవ” అనునది చలా సమాన్యము. సంస్కృత పరిజ్ఞానము ఏమి లేకపోయిననూ అర్థమగును. కాని మహాస్వామి వారు ఆ అర్థము తప్పు అంటున్నారు అని పండితులు ఒకరి మొహాలు ఒకరు చూసుకునుచున్నారు.
వారి పరిస్థితి చూసి మహాస్వామి వారు ”నేను చెప్పనా దాని అర్థం” అని అన్నారు. పండితులంతా చెవులు రిక్కించారు.
”పంచాంగములోని (తిథి వార నక్షత్ర యోగ కరణ) పంచ అంగములలో ఉన్న 27 యోగములలో ఒకటి ఆయుష్మాన్, 11 కరణములలో ఒకటి భవ, వారములలో సౌమ్య వాసరము అంటే బుధవారము అని అర్థం. ఎప్పుడైతే ఇవి మూడు అంటే ‘ఆయుష్మాన్-యోగము’, ‘భవ-కరణము’, ‘సౌమ్యవాసరము-బుధవారము’ కలిసి వస్తే అది శ్లాగ్యము – అంటే చలా శుభప్రదము మరియు యోగ కారకము. కావున ఇవి మూడు కలిసిన రోజున ఏమేమి మంచి ఫలములు సంభవమగునో అవి నీకు ప్రాప్తించుగాక” అని అర్థం.
ఈ మాటలు విన్న వెంటనే ఆ పండితులు ఆశ్చర్యపోయి, ఆనందాశ్రువులతో అందరూ మహాస్వామి వారికి సాష్టాంగం చేసి నమస్కరించారు.


మేషరాశి లక్షణాలు

No automatic alt text available.

స్వరూపం
ఈ రాశివారు ఎప్పుడూ సౌందర్యంపై ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా నగలు, ఉంగరాలు వంటివాటిపై ఆసక్తి ఎక్కువ. వస్త్ర ధారణలోను తమ అభిరుచికి తగ్గట్టుగా వ్యవహరిస్తారు. వీరి వస్త్రధారణ చూసి చాలామంది వీరిని అనుసరిస్తారు.వీరికి మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది.
వ్యాపారం
మేషరాశికి చెందినవారు అత్యంత సమర్థవంతులుగా ఉంటారు.ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం కలిగి వాటిని అవసర సమయాల్లో ఉపయోగించి కీర్తి శిఖరాలకు చేరుకుంటారు. సిమెంటు, ఇనుము తదితర ఖనిజ సంబంధిత పరిశ్రమల్లో మేషరాశివారు రాణిస్తారు. వీటితోపాటు సూపర్ మార్కెట్లు ప్రారంభించినా లాభాలను సాధిస్తారు. మొత్తం మీద వీరి జాతకానికి సరిపోయే వ్యాపారాన్ని చేపట్టినట్లయితే తప్పకుండా లాభాల బాటలో పయనిస్తారు.
ఆర్థిక స్థితి
మేష రాశికి చెందిన వారు ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటారు.దీనికి కారణం వారి శ్రమ, పట్టుదలే. అత్యంత చతురత మనస్తత్వం కలిగిన వారు కావటంతో ఎక్కడికి వెళ్లినా అనుకున్న పనిని నెరవేర్చుకోగలుగుతారు. వీరి బుద్ధి కులతే వీరికి పెద్ద పెట్టుబడి అని చెప్పవచ్చు.
స్వభావం
మేషరాశి చెందినవారు స్వేచ్ఛాప్రియులుగాను,స్పష్టమైన వ్యక్తిత్వం కలిగిన వారుగా ఉంటారు. వ్యక్తిగత సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు.ధైర్యం, విచక్షణతో కష్టాలను ఎదుర్కొంటారు. వీరు ఆకస్మిక నిర్ణయాలు తీసుకునేవారై, స్వార్ధపరులై ఉంటారు. ఎవరైనా రెచ్చ గొడితే పనులు అర్దాంతంగా వదిలిపోయేవారయి, సహనంలేని వారుగానూఉంటారు.
వృత్తి, జీవిత గమనం
మేషరాశిలో జన్మించినవారు జీవితంలో ఉన్నత వ్యక్తులగానో, ప్రముఖలు గానో చెలామణి అవుతారు. దీనికి కారణం ఈ రాశిపై మంగళ గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. వీరు రాజకీయాలలో కీలకపాత్ర పోషించే అవకాశాలు లేకపోలేదు. రాజకీయ నేతలుగా ఎదగటంవల్ల వీరిపై ప్రజలలో ఎనలేని మమకారం ఉంటుంది. ఇతరుల నుంచి ఏదైనా నేర్చుకోవటానికి వీరు సంశయించరు.
అదృష్ట రంగు
మేషరాశికి చెందిన వారు ఎరుపు లేదా తెలుపు రంగులు అదృష్ట రంగులు. ఈ రంగులతో ఉన్న దుస్తులను ధరించినట్లయితే వీరికి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఎరుపు రంగు రుమాలును చేతిలో ఉంచుకోవటం వీరికి ఎంతైనా మంచిది.
ప్రేమ సంబంధాలు
ఈ రాశివారు ప్రేమ పిపాసకులు, ఉత్సాహవంతులుగా ఉంటారు. వీరు ఇతరులను ప్రేమించటమే కాడుండా వారినుంచి ప్రేమను సైతం పొందుతారు. ఒక్కొక్కసారి ప్రేమే వీరిపాలిట శాపంగా మారుతుంది. ఆంటే ప్రేమవల్ల బాధపడాల్సి ఉంటుంది. వీరి ఆర్ధిక పరిస్థితి బాగా ఉండటంవల్ల ఎక్కువమంది వీరిపై ఆధారపడతారు.
స్నేహం
మేష రాశికి చెందినవారికి వృషభ, మిధున, కన్యా, తులా,మకర రాశులకు చెందినవారు మంచి మిత్రులవుతారు. కాగా మిధునం, కర్కాటకం, సింహం, వృశ్చిక రాశులకు చెందిన వారు వీరికి విరోధులుగా ఉంటారు.మొత్తం మీద కుంభరాశికి చెందిన వారికి పెద్ద సంఖ్యలో మిత్రులు ఉంటారు. వీరంతా దాదాపు ప్రాణమిత్రులని చెప్పవచ్చు.
అలవాట్లు
మేషరాశికి చెందిన వారు లాటరీలలో పాల్గొనటం ఓ హాబీ. సవాళ్లుగా ఉన్నటువంటివాటిని తమ హాబీలుగా నిర్ణయించుకుంటారు. తమకు అత్యంత ఆసక్తిని కలిగించే ప్రతి అంశాన్నిహాబీగా స్వీకరిస్తారు. నృత్యం, సంగీతం వంటి కళలను అభ్యసించటం కూడా హాబీగా ఉంటుంది.
దాంపత్య జీవితం
మేష రాశి వారు ఎంత కష్టపడైనా పని సాధించాలనే ఆకాంక్ష అధికంగా ఉంటుంది. ఏదైనా తలుచుకుంటే పూర్తయ్యేదాకా నిద్రపోరు. ఈ రాశి వారిపై సూర్యుడు, మంగళ, శుక్ర గ్రహాల ప్రభావం అధికంగా ఉండంటంవల్ల జీవితంలో ప్రతి విషయంలో కొత్తదనాన్ని కోరుకుంటారు. ఈ రాశివారి భార్య అందంగా ఉంటే వారిపై వీరికి ఎప్పుడూ మనస్సులో అనుమానాలు కలుగుతూ ఉంటాయి.
బలహీనతలు
ఈ రాశివారు ఎక్కువగా ఆరోగ్యంపై దృష్టిపెడతారు. వీరికి కోపం ఎక్కువ కాబట్టి చిన్నపాటి అవమానం జరిగినా తట్టుకోలేరు. దీనివల్ల వీరు ప్రతికూల సమస్యలను ఎదుర్కొంటారు. ఈ రాశిలో కొంతమంది తప్పులు చేసినా వాటిని అంగీకరించటానికి ససేమిరా అంటారు. దానివల్ల వీరు ఆతర్వాత భారీగానే నష్టపోతారు.
అదృష్ట రత్నం
మేషరాశికి చెందినవారి అదృష్ట రత్నం నీలం.ఈ రంగు రత్నాన్ని మేషరాశివారు ధరించినట్లయతే శని దేవుని ప్రసన్నం చేసుకోవటం ద్వారా తాము ఎదుర్కొంటున్న కష్ట నష్టాల నుంచి బయటపడవచ్చు. ఈ నీలం రత్నాన్ని ధరించిన మేషరాశి వారికి అన్నింటా విజయం చేకూరుతుంది.
వ్యక్తిత్వం
మేష రాశివారు ఉదార స్వభావం కలిగి ఉంటారు. వీరు ఎప్పుడూ తమ లక్ష్యాన్నిపూర్తిచేసుకోవాలనే సత్ససంకల్పంతో ఉంటారు. ఈ సమయంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. వీరికి ప్రేమాభిమానాలు ఎక్కువ. అలాగే అందరినుంచి ఇదే భావాలను తిరిగి పొందుతారు.
విద్య
మేషరాశికి చెందిన వారు ఇంజినీరింగ్, వైద్యతో పాటు ఇతర టెక్నికల్ రంగాలలో స్థిరపడతారు. ఏరోనాటికల్, రీసెర్చ్ సంబంధిత కోర్సులను చేస్తారు. శాస్త్ర, సాంకేతిక రంగాలలో అగ్రగామిలుగా నిలుస్తారు.
ఆరోగ్యం
మేషరాశికి చెందిన వారికి బాల్యంలోనే ఎక్కువ అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నవారై ఉంటారు. ఫలితంగా కొన్నిసార్లు అప్పటి అనారోగ్య సమస్యలు తిరిగి ఇబ్బందిపెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆస్త్మా వంటి ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు వీరిని చిన్నతనంలోనే బాధిస్తాయి. మామూలు జ్వర సమస్యలు మొదులుకుని కంటి సమస్యలు, చర్మ సంబంధిత సమస్యలు వీరికి వచ్చే అవకాశాలు మెండు. కనుక ఆరోగ్యంపై అత్యంత శ్రద్ధను ప్రదర్శించాల్సి ఉంటుంది.
ఇల్లు- కుటుంబం
ఈ రాశికి చెందినవారు తమ కుటుంబానికి ప్రధాన ఆధారంగా ఉంటారు. అదేవిధంగా అత్యంత ప్రేమ పాత్రంగా చూసుకుంటారు.దీనితో వీరంటే కుటుంబంలో ఒక ప్రత్యేక గౌరవం ఉంటుంది. వారు ఏదైనా ఆదేశిస్తే యావత్ కుటుంబం తూ.చ తప్పకుండా పాటిస్తుంది. మొత్తం మీద అత్యంత క్రమశిక్షణ కలిగినవారుగా ఉంటారు
కలిసివచ్చే రోజు
మేషరాశికి చెందినవారిపై మంగళ గ్రహ ప్రభావం ఉంటుంది. కనుక వీరికి మంగళవారం కలిసివచ్చే రోజుగా చెప్పవచ్చు.దీనితోపాటు గురువారం,ఆదివారం కూడా కలిసివచ్చే రోజులే. అయితే శుక్రవారం మాత్రం కలిసిరాదు.
అదృష్ట సంఖ్య
మేషరాశి చెందినవారికి 9 సంఖ్య అత్యంత అదృష్టమైన సంఖ్య. ఆ తర్వాత వరుసగా 9తో గుణించబడే 27, 36, 45, 54, 63... వంటి సంఖ్యలు కూడా అదృష్ట సంఖ్యలే.

Thursday 4 October 2018

శ్రీకృష్ణుడి కుటుంబము...


శ్రీకృష్ణుడికి భార్యలందరితోనూ ఒక్కొక్కరి వల్ల పదేసి మంది పిల్లలు పుట్టారు.
రుక్మిణి వల్ల కృష్ణుడికి ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, సుదేష్ణుడు, చారుదేహుడు, సుబారుడు, చారుగుప్తుడు, భద్రచారుడు, చారుచంద్రుడు, విచారుడు, చారుడు అనే బిడ్డలు కలిగారు.
సత్యభామ వల్ల కృష్ణునికి భానుడు, సుభానుడు, స్వర్భానుడు, ప్రభానుడు, భానుమంతుడు, చంద్రభానుడు, బృహద్భానుడు, అతిభానుడు, శ్రీభానుడు, ప్రతిభానుడు అనే బిడ్డలు కలిగారు.
జాంబవతీ శ్రీకృష్ణులకు సాంబుడు, సుమిత్రుడు, పురజిత్తు, శతజిత్తు, సహస్రజిత్తు, విజయుడు, చిత్రకేతుడు, వసుమంతుడు, ద్రవిడుడు, క్రతువు అనే సంతానం కలిగింది. జాంబవతికి కలిగిన ఈ బిడ్డలంటే కృష్ణుడికి ప్రత్యేకమైన ప్రేమ ఉండేది.
నాగ్నజితి, కృష్ణులకు వీరుడు, చంద్రుడు, అశ్వసేనుడు, చిత్రగుడు, వేగవంతుడు, వృషుడు, లముడు, శంకుడు, వసుడు, కుంతి అనే పిల్లలు కలిగారు.
కృష్ణుడికి కాళింది వల్ల శ్రుతుడు, కవి, వృషుడు, వీరుడు, సుబాహుడు, భద్రుడు, శాంతి, దర్శుడు, పూర్ణమానుడు, శోమకుడు అనే కుమారులు జన్మించారు.
లక్షణకు, శ్రీకృష్ణుడికి ప్రఘోషుడు, గాత్రవంతుడు, సింహుడు, బలుడు, ప్రబలుడు, ఊర్ధ్వగుడు, మహాశక్తి, సహుడు, ఓజుడు, అపరాజితుడు అనే సంతానం కలిగింది.
మిత్రవింద, కృష్ణులకు వృకుడు, హర్షుడు, అనిలుడు, గృద్ధుడు, వర్ధనుడు, అన్నాదుడు, మహాశుడు, పావనుడు, వహ్ని, క్షుధి అనే పుత్రులు పుట్టారు.
కృష్ణుడికి భద్ర అనే భార్య వల్ల సంగ్రామజిత్తు, బృహత్సేనుడు, శూరుడు, ప్రహరణుడు, అరిజిత్తు, జయుడు, సుభద్రుడు, వాముడు, ఆయువు, సత్యకుడు అనే పిల్లలు పుట్టారు.