Friday 5 October 2018

మేషరాశి లక్షణాలు

No automatic alt text available.

స్వరూపం
ఈ రాశివారు ఎప్పుడూ సౌందర్యంపై ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా నగలు, ఉంగరాలు వంటివాటిపై ఆసక్తి ఎక్కువ. వస్త్ర ధారణలోను తమ అభిరుచికి తగ్గట్టుగా వ్యవహరిస్తారు. వీరి వస్త్రధారణ చూసి చాలామంది వీరిని అనుసరిస్తారు.వీరికి మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది.
వ్యాపారం
మేషరాశికి చెందినవారు అత్యంత సమర్థవంతులుగా ఉంటారు.ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం కలిగి వాటిని అవసర సమయాల్లో ఉపయోగించి కీర్తి శిఖరాలకు చేరుకుంటారు. సిమెంటు, ఇనుము తదితర ఖనిజ సంబంధిత పరిశ్రమల్లో మేషరాశివారు రాణిస్తారు. వీటితోపాటు సూపర్ మార్కెట్లు ప్రారంభించినా లాభాలను సాధిస్తారు. మొత్తం మీద వీరి జాతకానికి సరిపోయే వ్యాపారాన్ని చేపట్టినట్లయితే తప్పకుండా లాభాల బాటలో పయనిస్తారు.
ఆర్థిక స్థితి
మేష రాశికి చెందిన వారు ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటారు.దీనికి కారణం వారి శ్రమ, పట్టుదలే. అత్యంత చతురత మనస్తత్వం కలిగిన వారు కావటంతో ఎక్కడికి వెళ్లినా అనుకున్న పనిని నెరవేర్చుకోగలుగుతారు. వీరి బుద్ధి కులతే వీరికి పెద్ద పెట్టుబడి అని చెప్పవచ్చు.
స్వభావం
మేషరాశి చెందినవారు స్వేచ్ఛాప్రియులుగాను,స్పష్టమైన వ్యక్తిత్వం కలిగిన వారుగా ఉంటారు. వ్యక్తిగత సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు.ధైర్యం, విచక్షణతో కష్టాలను ఎదుర్కొంటారు. వీరు ఆకస్మిక నిర్ణయాలు తీసుకునేవారై, స్వార్ధపరులై ఉంటారు. ఎవరైనా రెచ్చ గొడితే పనులు అర్దాంతంగా వదిలిపోయేవారయి, సహనంలేని వారుగానూఉంటారు.
వృత్తి, జీవిత గమనం
మేషరాశిలో జన్మించినవారు జీవితంలో ఉన్నత వ్యక్తులగానో, ప్రముఖలు గానో చెలామణి అవుతారు. దీనికి కారణం ఈ రాశిపై మంగళ గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. వీరు రాజకీయాలలో కీలకపాత్ర పోషించే అవకాశాలు లేకపోలేదు. రాజకీయ నేతలుగా ఎదగటంవల్ల వీరిపై ప్రజలలో ఎనలేని మమకారం ఉంటుంది. ఇతరుల నుంచి ఏదైనా నేర్చుకోవటానికి వీరు సంశయించరు.
అదృష్ట రంగు
మేషరాశికి చెందిన వారు ఎరుపు లేదా తెలుపు రంగులు అదృష్ట రంగులు. ఈ రంగులతో ఉన్న దుస్తులను ధరించినట్లయితే వీరికి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఎరుపు రంగు రుమాలును చేతిలో ఉంచుకోవటం వీరికి ఎంతైనా మంచిది.
ప్రేమ సంబంధాలు
ఈ రాశివారు ప్రేమ పిపాసకులు, ఉత్సాహవంతులుగా ఉంటారు. వీరు ఇతరులను ప్రేమించటమే కాడుండా వారినుంచి ప్రేమను సైతం పొందుతారు. ఒక్కొక్కసారి ప్రేమే వీరిపాలిట శాపంగా మారుతుంది. ఆంటే ప్రేమవల్ల బాధపడాల్సి ఉంటుంది. వీరి ఆర్ధిక పరిస్థితి బాగా ఉండటంవల్ల ఎక్కువమంది వీరిపై ఆధారపడతారు.
స్నేహం
మేష రాశికి చెందినవారికి వృషభ, మిధున, కన్యా, తులా,మకర రాశులకు చెందినవారు మంచి మిత్రులవుతారు. కాగా మిధునం, కర్కాటకం, సింహం, వృశ్చిక రాశులకు చెందిన వారు వీరికి విరోధులుగా ఉంటారు.మొత్తం మీద కుంభరాశికి చెందిన వారికి పెద్ద సంఖ్యలో మిత్రులు ఉంటారు. వీరంతా దాదాపు ప్రాణమిత్రులని చెప్పవచ్చు.
అలవాట్లు
మేషరాశికి చెందిన వారు లాటరీలలో పాల్గొనటం ఓ హాబీ. సవాళ్లుగా ఉన్నటువంటివాటిని తమ హాబీలుగా నిర్ణయించుకుంటారు. తమకు అత్యంత ఆసక్తిని కలిగించే ప్రతి అంశాన్నిహాబీగా స్వీకరిస్తారు. నృత్యం, సంగీతం వంటి కళలను అభ్యసించటం కూడా హాబీగా ఉంటుంది.
దాంపత్య జీవితం
మేష రాశి వారు ఎంత కష్టపడైనా పని సాధించాలనే ఆకాంక్ష అధికంగా ఉంటుంది. ఏదైనా తలుచుకుంటే పూర్తయ్యేదాకా నిద్రపోరు. ఈ రాశి వారిపై సూర్యుడు, మంగళ, శుక్ర గ్రహాల ప్రభావం అధికంగా ఉండంటంవల్ల జీవితంలో ప్రతి విషయంలో కొత్తదనాన్ని కోరుకుంటారు. ఈ రాశివారి భార్య అందంగా ఉంటే వారిపై వీరికి ఎప్పుడూ మనస్సులో అనుమానాలు కలుగుతూ ఉంటాయి.
బలహీనతలు
ఈ రాశివారు ఎక్కువగా ఆరోగ్యంపై దృష్టిపెడతారు. వీరికి కోపం ఎక్కువ కాబట్టి చిన్నపాటి అవమానం జరిగినా తట్టుకోలేరు. దీనివల్ల వీరు ప్రతికూల సమస్యలను ఎదుర్కొంటారు. ఈ రాశిలో కొంతమంది తప్పులు చేసినా వాటిని అంగీకరించటానికి ససేమిరా అంటారు. దానివల్ల వీరు ఆతర్వాత భారీగానే నష్టపోతారు.
అదృష్ట రత్నం
మేషరాశికి చెందినవారి అదృష్ట రత్నం నీలం.ఈ రంగు రత్నాన్ని మేషరాశివారు ధరించినట్లయతే శని దేవుని ప్రసన్నం చేసుకోవటం ద్వారా తాము ఎదుర్కొంటున్న కష్ట నష్టాల నుంచి బయటపడవచ్చు. ఈ నీలం రత్నాన్ని ధరించిన మేషరాశి వారికి అన్నింటా విజయం చేకూరుతుంది.
వ్యక్తిత్వం
మేష రాశివారు ఉదార స్వభావం కలిగి ఉంటారు. వీరు ఎప్పుడూ తమ లక్ష్యాన్నిపూర్తిచేసుకోవాలనే సత్ససంకల్పంతో ఉంటారు. ఈ సమయంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. వీరికి ప్రేమాభిమానాలు ఎక్కువ. అలాగే అందరినుంచి ఇదే భావాలను తిరిగి పొందుతారు.
విద్య
మేషరాశికి చెందిన వారు ఇంజినీరింగ్, వైద్యతో పాటు ఇతర టెక్నికల్ రంగాలలో స్థిరపడతారు. ఏరోనాటికల్, రీసెర్చ్ సంబంధిత కోర్సులను చేస్తారు. శాస్త్ర, సాంకేతిక రంగాలలో అగ్రగామిలుగా నిలుస్తారు.
ఆరోగ్యం
మేషరాశికి చెందిన వారికి బాల్యంలోనే ఎక్కువ అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నవారై ఉంటారు. ఫలితంగా కొన్నిసార్లు అప్పటి అనారోగ్య సమస్యలు తిరిగి ఇబ్బందిపెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆస్త్మా వంటి ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు వీరిని చిన్నతనంలోనే బాధిస్తాయి. మామూలు జ్వర సమస్యలు మొదులుకుని కంటి సమస్యలు, చర్మ సంబంధిత సమస్యలు వీరికి వచ్చే అవకాశాలు మెండు. కనుక ఆరోగ్యంపై అత్యంత శ్రద్ధను ప్రదర్శించాల్సి ఉంటుంది.
ఇల్లు- కుటుంబం
ఈ రాశికి చెందినవారు తమ కుటుంబానికి ప్రధాన ఆధారంగా ఉంటారు. అదేవిధంగా అత్యంత ప్రేమ పాత్రంగా చూసుకుంటారు.దీనితో వీరంటే కుటుంబంలో ఒక ప్రత్యేక గౌరవం ఉంటుంది. వారు ఏదైనా ఆదేశిస్తే యావత్ కుటుంబం తూ.చ తప్పకుండా పాటిస్తుంది. మొత్తం మీద అత్యంత క్రమశిక్షణ కలిగినవారుగా ఉంటారు
కలిసివచ్చే రోజు
మేషరాశికి చెందినవారిపై మంగళ గ్రహ ప్రభావం ఉంటుంది. కనుక వీరికి మంగళవారం కలిసివచ్చే రోజుగా చెప్పవచ్చు.దీనితోపాటు గురువారం,ఆదివారం కూడా కలిసివచ్చే రోజులే. అయితే శుక్రవారం మాత్రం కలిసిరాదు.
అదృష్ట సంఖ్య
మేషరాశి చెందినవారికి 9 సంఖ్య అత్యంత అదృష్టమైన సంఖ్య. ఆ తర్వాత వరుసగా 9తో గుణించబడే 27, 36, 45, 54, 63... వంటి సంఖ్యలు కూడా అదృష్ట సంఖ్యలే.

No comments:

Post a Comment