Monday 30 December 2019

శుక్రకవచమ్


ఈ శుక్ర కవచాన్ని శుక్ర వారం ఉదయం పారాయణ ప్రారంబించాలి రోజు 6నిమిషాలు గాని 60 నిమిషాలు గాని 6సార్లు గాని 60సార్లు గాని పారాయణ చేయచ్చు.ఈ శుక్ర కవచ పారాయణ వల్ల వివాహనికి అడ్దంకులు తొలుగుతాయి షుగరు వ్యాది నయం అవుతుంది అప్పుడె పుట్టిన శిశివు యెక్క ఆరోగ్యం బాగుపడుతుంది .చర్మ వ్యాదులు తొలుగుతాయి ఐతే ముఖ్యంగా గుర్తు పెట్టుకోవల్సిన విషయం ఏంటంటే గురు ముఖత ఉపదేశం లేనిదే పారాయణ చేయరాదు
శ్రీగణేశాయ నమః|
మృణాలకున్దేన్దుపయోజసుప్రభం పీతామ్బరం ప్రసృతమక్షమాలినమ్|
సమస్తశాస్త్రార్థవిధిం మహాన్తం ధ్యాయేత్కవిం వాఞ్ఛితమర్థసిద్ధయే|| ౧||
ఔమ్ శిరో మే భార్గవః పాతు భాలం పాతు గ్రహాధిపః|
నేత్రే దైత్యగురుః పాతు శ్రోత్రే మే చన్దనద్యుతిః|| ౨||
పాతు మే నాసికాం కావ్యో వదనం దైత్యవన్దితః|
వచనం చోశనాః పాతు కణ్ఠం శ్రీకణ్ఠభక్తిమాన్|| ౩||
భుజౌ తేజోనిధిః పాతు కుక్షిం పాతు మనోవ్రజః|
నాభిం భృగుసుతః పాతు మధ్యం పాతు మహీప్రియః|| ౪||
కటిం మే పాతు విశ్వాత్మా ఉరూ మే సురపూజితః|
జానుం జాడ్యహరః పాతు జఙ్ఘే జ్ఞానవతాం వరః|| ౫||
గుల్ఫౌ గుణనిధిః పాతు పాతు పాదౌ వరామ్బరః|
సర్వాణ్యఙ్గాని మే పాతు స్వర్ణమాలాపరిష్కృతః|| ౬||
య ఇదం కవచం దివ్యం పఠతి శ్రద్ధయాన్వితః|
న తస్య జాయతే పీడా భార్గవస్య ప్రసాదతః|| ౭||
|| ఇతి శ్రీబ్రహ్మాణ్డపురాణే శుక్రకవచం సమ్పూర్ణమ్||

కుండలి----వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలు..


No photo description available.
మానవ జీవనంలో వృత్తి, వ్యాపారాలు భాగమవుతాయి. జీవనము కోసం వ్యక్తి వ్యాపారం లేదా ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. అయితే దీని స్థితి తక్కువగా లేదా ఎక్కువగా ఉండగలదు. దీనిలో పదోన్నతి లేదా స్థానాంతరత ఏదైనా ఉండగలదు. ప్రశ్న కుండలి ఉద్యోగ, వ్యాపార రంగమునకు సంబంధమైన అన్ని ప్రశ్నలకు సమాధానమును ఇచ్చుటలో యోగ్యమైనదిగా చెప్పగలదు.
ఉద్యోగము వచ్చు సమయం
ప్రశ్న లగ్నములో అధిక స్థితి రాశిని నియుక్తము చేయుటకు అనుకూలముగా ఉండును. లగ్నాదిపతి సంబంధం దశమాదిపతితో ఉండి దానిపై సూర్యుడు కూడా కలిసి ఉంటే గనక తొందరగానే ఉద్యోగము లభిస్తుంది. కేంద్రీయ మరియు త్రికోణలో శుభ గ్రహములు ఉంటే కూడా ఉద్యోగం లభించుటకు అవకాశాలు ఉంటాయి.
ఉద్యోగములలో రెండు విధములైన ఉద్యోగములు ఉన్నాయి. లిఖిత పూరితమైనది. లిఖిత పూరితమైన దానికొరకు లగ్నాదిపతి, తృతీయాదిపతి, దశమాదిపతి, ఏకాదశాదిపతితో సంబంధములు వస్తే సాక్షాత్కారములో సఫలత కొరకు లగ్నాదిపతి ద్వితీయాదిపతితో దశమాదిపతి ఇంకా ఏకాదశాదిపతితో కలిసి అనుకూల సంబంధములు ఉంటే గనక ఉద్యోగము లభించును.
వ్యవసాయము
దశమ బావము వ్యవసాయ భావము అవుతుంది. ఈ భావములో స్థితి రాశి, గ్రహము మరియు రాశాదిపతి, ఈ భావమునకు సంబంధమయిన గ్రహములతో వ్యవసాయమునకు సంబంధమైన విషయములను తెలుసుకొచ్చును. దశమ బావములో అగ్ని తత్వము రాశి అనగా మేషం, సింహం లేదా ధను అయిన ఎడల వ్యక్తి శల్య చికిత్సకునిగా లేదా ఇంజనీయర్ కాగలడు.
దశమ బావములో పృద్వి తత్వము గల రాశి అనగా వృషభము, కన్యా లేదా మఖరరాశి ఉంటే గనక భూమి సంబంధమైన వ్యవసాయము చేయవచ్చును. ఈ స్థితిలో వ్యక్తి కృషి, గణిజ, భూగర్బ సంబంధమైన, శ్రమికుడుగా, ట్రాంస్ పోర్ట్, రైల్వే మొదలగు వాటితో సంబంధాలు కలిగి ఉండును.
దశమ బావములో వాయు ప్రధానమైన రాశి మిధునము, తుల, కుంభ రాశిలో వుండిన ఉచ్చస్థితిలో ఉద్యోగము లభించును. కుండలిలో ఈ స్థితి ఉంటే గనక వ్యక్తి రచయిత, కళాకారునిగా, ఎకౌంటెంట్, న్యాయవాది, ప్రభందనములకు సలహాకారునిగా, కాగిత పనులను చేయు వ్యక్తిగా స్థిర పడగలరు.
దశమ బావములో జల ప్రధానమైన రాశి అనగా కటకము, వృశ్చికము.. మీన రాశిలో కలిగిన వ్యక్తి జల క్షేత్రమునకు సంబంధమైన కార్యములను చేయువాడగును. అనగా నౌసేన, ఓడల వ్యాపారము, చేపల వ్యాపారము, ఈతకొట్టుట మొదలగునవి.

జ్యోతిష్య శాస్త్రం గురించి

Image may contain: text

జ్యోతిష్యం మూఢనమ్మకంగా కొందరు భావించినా జ్యోతిష్యం "శాస్త్రం" అనడానికి చాలా ఆదారాలు ఉన్నాయి. మన మెదడులోని ద్రవాలలో నవ గ్రహాలకు సంబంధించిన ఖనిజాలు ఉంటాయి. గ్రహాలు పరస్పర ప్రభావం కలిగివుంటాయి. అదేవిధంగా మనిషిపై కూడా ఆ ప్రభావం ఇంకా కొనసాగుతుంది. మానవ మస్తిష్కం గ్రహ గతులకు స్పందిస్తుంది.
సూర్యోదయం ప్రభావంతో మన శరీరాలు హార్మోన్లను విడుదల చేయడంతో మనం మేల్కొంటాం. చంద్రగమనం కూడా మనపై ప్రభావం చూపిస్తుంది. సముద్రపు అలలు, స్త్రీల ఋతుచక్రం, మానవుల మస్తిష్కం చంద్రగమన ప్రభావానికి లోనౌతాయి. సీజనల్ మెంటల్ డిజార్డర్ గా పిలువబడే (Seasonal Affective Disorder (SAD)) అనే మానసిక రోగం కూడా చలికాలంలో సూర్యుడు చాలాఎక్కువ సేపు కనపడకపోవడం వల్ల సంభవిస్తుంది.
అమావాస్య పౌర్ణమి రోజుల్లో చంద్రుడు భూమికి దగ్గరగా రావడం, దూరంగా జరగడం వంటి మార్పుల వల్ల సముద్రపు అలల్లో తేడాలు వస్తాయి. అదేవిధంగా మానవుల దేహంలోని నీరు కూడా ఆ ప్రభావానికి లోనవుతుంది. మానవులలో ఈ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అనడానికి రుజువు కొందరు అమావాస్య పౌర్ణమి రోజుల్లో విపరీత ప్రవర్తనను చూపడం. ముఖ్యంగా మానసిక రోగులకు ఆరోజుల్లో పిచ్చి ఇంకా ఎక్కువ అవడం. ఒక్క చంద్రుడే కాదు ఇతర గ్రహాలు కూడా మనపై ప్రభావాన్ని చూపిస్తాయి. అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ క్లైమెటాలజీ The American Institute of Medical Climatology వారు Philadelphia పోలీస్ డిపార్టామెంట్ వారికి సాయపడటానికి ఒక రీసెర్చ్ ని నిర్వహించారు.
మానవ ప్రవర్తనపై పౌర్ణమి ప్రభావం మీద జరిపిన ఆ పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెలుగుచూసాయి. ఆ పరిశోధన ప్రకారం పౌర్ణమి రోజుల్లో హత్య, విచక్షణా రహితంగా వాహనాల్ని నడిపి ఇతరుల మరణానికి కారణమవడం, అవసరానికి కాకుండా హాబీ పరంగా, మరోరకంగా తప్పకుండా దొంగతనం చేసి తీరాలనే తపన, ఇతరులమీద పగతీర్చుకోవాలనే కోరిక మొదలైనవి ఎక్కువగా రికార్డయ్యాయి. ఆ రకమైన నేరాలు ఆ రోజుల్లో ఎక్కువగా జరిగాయి. Miami విశ్వవిధ్యాలయానికి చెందిన Arnold Lieber అనే మానసిక శాస్త్రవేత్త మియామీలో గత 15 సంవత్సరాలలో జరిగిన 1,887 హత్యలకు పౌర్ణమి, అమావాస్యలకు గల సంబంధాన్ని గూర్చి పరిశోధనలు చేసి పౌర్ణమి, అమావాస్య రోజుల్లో మానవహనన ధుర్ఘటనలు ఎక్కువగా జరిగి మిగతా రోజుల్లో అవి తక్కువగా ఉన్నాయని గుర్తించారు.
W. Buehler అనే జర్మన్ శాస్త్రవేత్త పరిశోధనలో నెలలో చంద్రుని భూమికి దూరంగా ఉన్నకాలంలో (పరిమానం తగ్గుతూ కనిపించే సమయంలో) కన్నా చంద్రుని పరిమానం పెరుగుతూ కనిపించే కాలంలో 10 శాతం అధికంగా స్త్రీలు గర్భం ధరించడం జరిగింది. నెలలో చంద్రుని భూమికి దూరంగా ఉన్నకాలంలో (పరిమానం తగ్గుతూ కనిపించే సమయంలో) కన్నా చంద్రుని పరిమానం పెరుగుతూ కనిపించే కాలంలో గర్బం దాల్చినప్పుడు మగ సంతానం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని కూడా పరిశోధనలు తేల్చాయి.

ప్రాచీన గణిత శాస్త్రవేత్త భాస్కరుడు తన కూతురు లీలావతి జాతకం ప్రకారం ఆమె భర్త మరణిస్తాడని తెలుసుకుని ఏ ముహూర్తానికి ఆమె వివాహం జరిగితే ఆమెకు వైధవ్యం ప్రాప్తిస్తుందో తెలుసుకుని ఆ ముహూర్తానికి కాకుండా వేరే ముహూర్తానికి వివాహం జరిపించాలని ఒక గడియారాన్ని తయారుచేస్తాడు. కుండలో నీరు పోసి అడుగున చిన్న రంధ్రం ద్వారా నీరు ఒక్కొక్క చుక్క కింద పడేలా ప్లాన్ చేస్తాడు. దాని ఆధారంగా కాలాన్ని తెలుసుకుంటాడు. కానీ చివరికి కుమార్తె వివాహం జరిగి ఆమెకు జాతకం ప్రకారం వైధవ్యం ప్రాప్తింస్తుంది.
జాతక దోషాన్ని నివారించలేకపోయానని చింతిస్తూ తాను గడియారంగా మలచిన కుండ ను పరిశీలిస్తాడు. ఆ కుండ అడుగున చిన్న ముక్కు పుడక కనపడుతుంది. జరిగిన వాస్తవం ఏమిటంటే భాస్కరుని కుమార్తె లీలావతి ఆడుకుంటూ కుండలోకి తొంగిచూసినప్పుడు ఆమె ముక్కుపుడక జారి కుండలో పడి గడియారం గతి తప్పుతుంది. అందువల్ల భాస్కరుడు తాను అనుకున్న ముహూర్తానికి కాకుండా జాతకం ప్రకారం దోషం ఉన్న ముహూర్తానికే తన కూతురు వివాహం జరిపించి తరువాత బాధపడతాడు. ఇది జ్యోతిష్య శాస్త్రం గురించి ఒక వృత్తాంతం.

బ్యాంబు ట్రీ


బ్యాంబుట్రీ నవగ్రహాలలో బుథ గ్రహానికి చెందినది.బుదుడు వ్యాపార వృద్ది కారకుడు కావటం వలన ఇది వ్యాపార సంస్థలలో ఉంచితే వ్యాపారం దిన దినాభివృథ్ధి చెందుతుంది.వ్యాపార సంస్థలలో నరథిష్టికి ' ఆకర్షణకు ,వ్యాపారభివృథ్థికి చాలా మంచిది .
విద్యకి,వాక్ శుద్దికి బుదుడు కారకుడు.పిల్లలు చదువు కొనే టేబుల్ దగ్గర ఉంచితే మంచి తెలివితేటలు ,చదువుపై శ్రద్ద .మంచి వాక్ ఫటిమ కలిగి భావ ప్రకటన చేయగలడు.
ఇంటిలో ఏమైనా వాస్తు దోషాలు ఉన్న,వీడిపోటు ఉన్న ఇంటిలో సింహా ద్వారానికి ఎదురుగా ఉంచితే వీథిపోటు ,చిన్న చిన్న వాస్తు దోషాలు నరదృష్టి ,కనుదృష్టి,చెడు ఎనర్జీని తీసివేసి పాజిటివ్ ఎనర్జీని కలిగించి మంచి అన్యోన్నత ,ఒకరిపై ఒకరికి ప్రేమానురాగాలు కలిగి ఎప్పుడు సుఖశాంతులు ,థనాభివృద్దితో ఇల్లు కళకళ లాడుతుంది .
అదృష్టాన్ని తెచ్చిపెట్టే ఈ వెదురు మొక్కలు రకరకాల ఆకృతులలో రూపొందించిన గాజు ,మట్టి పాత్రలలో ఉంచి తూర్పు,ఉత్తర,ఈశాన్య దిక్కుల యందు ఉంచి అప్పుడప్పుడు నీటిని మారుస్తూ ఉండాలి.
వెదురు మొక్కలను గృహాలకంరణలో భాగంగా చాలా మంది తమ ఇళ్లలో ‘ఇండరో మొక్కలుగా’ను పెంచుకుంటున్నారు. ‘వెదురు మొక్కలను’ లక్కి ప్లాంట్స్‌గా అభివర్ణించుకుంటున్న పలువురు ఈ మొక్కలను ఇళ్లలో పెంచితే ‘ధన బలం’ పెరుగుతుందని విశ్వసిస్తున్నారు.
AKAANKKSHA YEDUR 9000123129

చంద్ర ద్వాదశావస్ధలు........!!!!



గ్రహావస్ధలు శుక్ర కేరళ రహస్య గ్రంధంలోనివి. పరాశర మహాముని చేత చెప్పబడిన ఈ గ్రహావస్ధలు రహస్య అవస్ధలని తెలియజేయబడినవి.
శ్లో:-మేషాది గణయే త్ప్రా ఙ్ఞా శ్చంద్రావస్ధా ప్రకీర్తితః
ఇతరేషాంగ్రహాణాంతు చంద్రస్ధం రాశిమారభేత్
మేషరాశి మొదలుకొని చంద్రుడున్న రాశి వరకు లెక్కింపగా చంద్రావస్ధలగును. ఇతరగ్రహాలకు చంద్రుడున్న రాశి మొదలుకొని ఇతరగ్రహాలున్న రాశివరకు లెక్కింపగా ఇతర గ్రహావస్ధలగును.
శ్లో:- ప్రవాసనష్టే చ మృతి జయం చ హాస్వంచ క్రీడారతి సుప్తయశ్చ
భుక్తి జ్వరం కంపిత నూస్ధిరాశ్చ భవం త్యవస్ధా స్సతతమ్ శశాంకే¦¦
చంద్రుడు మేషాదిగా 1 వస్ధానంలో ఉంటే ప్రవాసావస్ధ, 2 వస్ధానంలో నష్టం, 3 వస్ధానంలో మృతి, 4 వస్ధానంలో జయం, 5 వస్ధానంలో హాస్యం, 6 వస్ధానంలో క్రీడ , 7 వస్ధానంలో రతి , 8 వస్ధానం లో నిద్రావస్ధ, 9 వస్ధానంలో భోజనం, 10 వస్ధానంలో జ్వరం, 11 వస్ధానంలో తొందరపాటు, 12 వస్ధానంలో స్ధిరత్వం ఈ పన్నెండు అవస్ధలు చంద్ర ద్వాదశావస్ధలు అంటారు.
ఇతర గ్రహ అవస్ధలు
శ్లో:-ధీరఃప్రకంపీ గమితశ్చ భోగీ భుక్తి శ్శయానః కుపితో దయాళుః
నుప్తః ప్రమోదశ్చ నూఖం భయం చ భవంత్యవస్ధా స్సతతంగ్రహేషు¦¦
చంద్రుడున్న రాశి నుండి ఇతర గ్రహాలు 1 వస్ధానంలో ఉన్న ధీరత్వం, 2 వస్ధానంలో ప్రకంపనము, 3 వస్ధానంలో గమనము, 4 వస్ధానంలో భోగం, 5 వస్ధానంలోభోజనం, 6 వస్ధానం లో శయనం, 7 వస్ధానంలోకోపం, 8 వస్ధానంలోదయా స్వభావం, 9 వస్ధానంలోనిద్ర, 10 వస్ధానం లో సంతోషం, 11 వస్ధానంలో సుఖం, 12 వస్ధానంలో భయం. ఈ 12 అవస్ధలు చంద్రుని నుండి ఇతర గ్రహాలైన రవి, బుధ, కుజ, గురు, శుక్ర, శని గ్రహాలు ఉన్నప్పుడు ఈ అవస్ధలు పొందుతారు.
1)ధీరావస్ధను పొందిన గ్రహం ధైర్యవృద్ధిని ,బలం,ధనం,ఆయుష్యును,కీర్తిని,జాతకునికి కలుగజేయును.
2)ప్రకంపనావస్ధను పొందిన గ్రహం మనో దుఃఖం,శత్రుభయం,ధన నాశనం,జాతకునికి కలుగజేయును.
3)గమనావస్ధను పొందిన గ్రహం సుఖమును,ధన లాభం,ప్రయాణాలు జాతకునికి కలుగును.
4)భోగావస్ధను పొందిన గ్రహం భోగభాగ్యాలు,సంపదలు,స్త్రీ సౌఖ్యం,పుత్ర లాభం ,జాతకునికి కలుగును.
5)భుక్తావస్ధను పొందిన గ్రహం సౌఖ్యభోజనం,సంపద,దేహదారుడ్యం జాతకునికి కలుగును.
6)శయనావస్ధను పొందిన గ్రహం జ్వరం,భయం,రోగాలు జాతకునికి కలుగును.
7)దయావస్ధను పొందిన గ్రహం ఙ్ఞానాన్ని,విద్యను,సంపదను,భూలాభాన్ని,జాతకునికి కలుగును.
8)కోపావస్ధను పొందిన గ్రహం అధికారుల ఒత్తిడి,భయం,బంధు ద్వేషం,జాతకునికి కలుగును.
9)నిధ్రావస్ధను పొందిన గ్రహం మరణభయం,రోగభయం,జాతకునికి కలుగును.
10)సంతోషావస్ధను పొందిన గ్రహం ఎల్లప్పుడు సుఖమును,సంతోషమునుగౌరవాలను,సౌఖ్యజీవనం జాతకునికి కలుగును.
11)సుఖావస్ధ యందున్న గ్రహం సుఖం,వాహన సౌఖ్యం,మిత్ర లాభం,పుత్ర వృద్ధిని జాతకునికి కలుగజేయును.
12)భయావస్ధను పొందిన గ్రహం భయాన్ని,బుద్ధిలేమిని,చంచలస్వభావాన్ని జాతకునికి కలుగుజేయును.
ఉదా:-జాతకచక్రంలో చంద్రుడు మేషాదిగా 8 వస్ధానంలో ఉన్నాడు .
చంద్ర ద్వాదశావస్ధలలో 8 వ అవస్ధ నిద్రావస్ధ.
చంద్రుడి నుండి సూర్యుడు 11 వస్ధానంలో ఉన్నాడు కాబట్టి ఇతర గ్రహావస్ధ లలో 11 వ అవస్ధ సుఖావస్ధ
చంద్రుడి నుండి బుదుడు 11 వస్ధానంలో ఉన్నాడు కాబట్టి ఇతర గ్రహావస్ధ లలో 11 వ అవస్ధ సుఖావస్ధ .
చంద్రుడి నుండి కుజుడు 12 వస్ధానంలో ఉన్నాడు కాబట్టి ఇతర గ్రహావస్ధ లలో 12 వ అవస్ధ భయావస్ధ.
చంద్రుడి నుండి గురువు 9 వ స్ధానంలో ఉన్నాడు కాబట్టి ఇతర గ్రహావస్ధ లలో 9 వ అవస్ధ నిద్రావస్ధ.
చంద్రుడి నుండి శుక్రుడు 12 వస్ధానంలో ఉన్నాడు కాబట్టి ఇతర గ్రహావస్ధ లలో 12 వ అవస్ధ భయావస్ధ.
చంద్రుడి నుండి శని 10 వస్ధానంలో ఉన్నాడు కాబట్టి ఇతర గ్రహావస్ధ లలో 10 వ అవస్ధ సంతోషావస్ధ.

ఆర్ధిక పరమైన పనులలో ఆటంకములు ఉండవు.


No photo description available.
1. మీ ఇంటి ముఖ ద్వారానికి, ఒక మంచి రోజు, బయట లోపల లక్ష్మి దేవి ఫోటో ఉంచండి, ఆ లక్ష్మి దేవి వెనుక రెండు ఏనుగులు బంగారపు కలశాలతో లక్ష్మి దేవికి అభిషేకం చేస్తూ ఉండాలి. అలా ఉంచిన మీ ఆర్ధిక పరమైన పనులలో ఆటంకములు ఉండవు.
2. లక్ష్మి దేవికి 7 శుక్రవారాలు, 7 ముత్తైదువులకు, ఇంటి గృహిణి ద్వారా సౌభాగ్య సామగ్రి ( కుంకం, పసుపు, చందనం, తాంబూలం, వీలు అయితే ఎరుపురంగు జాకెట్టు గుడ్డ,దక్షిణ ) కానుకగా ఇప్పించండి. అలా ఇస్తే మీ ఇంటి గృహానికి మంచి ని తప్పక లక్ష్మి దేవి చేకూర్చుతుంది.
3. ప్రతినెలా వచ్చే అమావాస్య నాడు ఇంటి అంతటిని సుభ్రపరచండి.
4. మీ ఇంటి లో ఉండే దేవుని మందిరం లో,ఒక మంచి రోజు, ఒక కుంకుమ భరిణలో "గోమతి చక్రం" అనేది కుంకుమ భరిణలో ఉంచి మూతపెట్టి, కదిలించకుండా, దేవుని మందిరం లో ఉంచండి , దానికి పూజాది కార్యక్రమాలు, ఏమి చేయనవసరం లేదు. అలా చేస్తే మీ గృహంలో పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉంటె పరిష్కారం అవటానికి అవకాసం ఉన్నది.
గోమతి చక్రాలు 3 తీసుకోండి, వాటిని పొడి చేసి,ఒక మంచి రోజు, ఇంటి ముందర చల్లండి. మీ ఆర్ధిక బాధలు తొలగిపోవును .
5. సాయంత్రం , ఉదయం లైటు వేసిన తరువాత ఇల్లు చిమ్మరాదు .
6. మూత లేకుండా "డస్ట్ బిన్" ఉండకూడదు, పగిలిన అద్దము ఇంటిలో ఉండకూడదు.


నవవిధ భక్తిలక్షణములు

నవవిధ భక్తిలక్షణములు













No photo description available.

No photo description available.

 మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రకృతి లో ఉండే భీబత్సవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన లన నుండి భయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టనో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు . దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము --Nine Devotional Criteria, నవవిధ భక్తిలక్షణములు --- గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకుందాం . --
నవవిధ భక్తిలక్షణము :
శ్రవణం ,
కీర్తనం ,
స్మరణం,
పాదసేవణం ,
అర్చనం ,
వందనం ,.
దాస్యం ,
సఖ్యం ,
ఆత్మనెవేదనం,

కేతువు వలన కలిగే దోషాలు - శాంతి మార్గాలు


Image may contain: 1 person


















కేతువు బూడిద వర్ణంలో రెండు భుజములతో ఉంటాడు. కేతువు వాహనం గ్రద్ద. బ్రహ్మదేవుడికి తాను సృష్టించి జనం అపారంగా పెరగడంతో వారిని తగ్గించడానికి మృత్యువు అనే కన్యను సృష్టించాడు. మానవులకు మరణం ఇచ్చే బాధ్యతను అప్పగించాడు. తనకు మరణం ఇచ్చినందుకు ఆ కన్య దుఃఖించింది. ఆమె కన్నీటి నుంచి అనేక వ్యాదులు ఉద్భవించాయి. అప్పుడు తెల్లని పొగ రూపంలో ఒక పురుషుడు జన్మించాడు. కీలక నామ సంవత్సరం మార్గశిర కృష్ణ అమావాస్య నాడు మంగళ వారం మూలా నక్షత్రంలో కేతువు జననం జరిగింది.
కేతువు రాశి చక్రంలో అపసవ్యదిశలో పయనిస్తుంటాడు. అంటే మేషం నుంచి మీనానికి.. ఇలా పయనిస్తుంటాడు. రాశిలో ఒకటిన్నర సంవత్సరకాలం ఉంటాడు. సూర్యుడిని ప్రదిక్షిణం చేయడానికి 18 సంవత్సరాల సమయం పడుతుంది. రాహువు కేతువులు ఎప్పుడూ ఒకరికి ఒకరు రాశిచక్రం లోని 7వ స్థానంలో సంచరిస్తుంటారు. కేతు మహర్దశాకాలం 7 సంవత్సరాలు. కేతువు ముక్తి కారకుడు. అశ్విని, మఖ, మూలా నక్షత్రాలకు ఆధిపత్యం వహిస్తాడు. ఈ మూడు నక్షత్రాలలో వారికి జన్మించిన ఆరంభ దశ కేతు దశ.
కారకత్వం
కేతువు మోక్షవిజ్ఞాన కారకుడు చపలత్వము, జ్ఞానహీనత, శత్రు బాధలు, దూర ప్రదేశాలు, దేశాలు తిరుగుట, ఉన్మాదము, దృష్టమాంద్యము, కర్రదెబ్బలు, క్షుద్రము మంత్ర ప్రయోగములు మొదలగునవి కలిగినచో కేతువు బలహీనుడని గుర్తించాలి. వేదాంతం, తపస్సు, మోక్షం, మంత్ర శాస్త్రం, భక్తి, నదీస్నానం, మౌన వ్రతం, పుణ్యక్షేత్ర దర్శనం, మోసం, పరుల సొమ్ముతో సుఖించుట, దత్తత మొదలైన వాటిని సూచిస్తాడు.
వ్యాధుల వ్యాప్తి...
కేతువు మృత్యు కారకుడు, భయాన్ని కలిగిస్తాడు, వ్యాధులను కలిగిస్తాడు. రక్తపోటు, అలర్జీ, మతి స్థిమితం లేక పోవుట మొదలైన వ్యాధులకు కారకుడవుతాడు. అజీర్ణం, స్పోటకం, రక్తపోటు, చెముడు, నత్తి, దురదలు, గ్యాస్, అసిడిటీ, వైద్యం, జ్వరం, వ్రణామలను సూచిస్తాడు కేతువు ఏ గ్రహముతో కలిసిన ఆ అవయవమునందు బాధలు కలిగిస్తాడు. రోగ నిర్దారణ సాగదు కనుక చికిత్స జరుగడంలో సమస్యలు సృష్టిస్తాడు.
కేతువు ధ్యానం
లాంగూలయుక్తం భయదంజనానం కృష్ణాంబు భృత్సన్నిభ మేకవీరమ్|
కృష్ణాంబరం శక్తి త్రిశూల హస్తం కేతుం భజేమానస పంకజే హమ్ ||
ఫలాశపుష్ప సంకాశం తారకా గ్రహ మస్తకం |
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ ||
కేతు మంత్రము
ఓం హ్రీం క్రూం క్రూరరూపిణే కౌతలే ఐం సాః స్వాహా ||
14 9 16
15 13 11
10 17 11
కేతుయంత్రం
సోమవారం రాత్రి చంద్రహోరలో అనగా రాత్రి 8-9 గంటల మధ్యలో ఈ యంత్రం ధరించాలి. ప్రతి రోజు ఉదయమే స్నానం చేసి శుచిగా కేతుధ్యానం 39 పర్యాయాలు చేయాలి. మంత్రజపం 108 మార్లు జపించి, పైన తెలిపిన ప్రకారము యంత్రాన్ని పూజించి ధరించాలి. 10 సోమవారాలు ఉలవలు దానం ఇవ్వాలి.
పరిహారం
కేతుగ్రహ పరిహార పూజా కోసం కంచు ప్రతిమ మంచిది.
అధి దేవత - బ్రహ్మ
నైవేధ్యం - చిత్రాన్నం
కుడుములు - ఉలవ గుగ్గిళ్ళు
ప్రీతికరమైన తిథి - చైత్ర శుద్ధ చవితి
గ్రహస్థితిని పొందిన వారం - బుధవారం
ధరించవలసిన రత్నజ్ఞం - వైడూర్యం
ధరించవలసిన మాల - రుద్రాక్ష మాల
ధరించవలసిన రుద్రాక్ష - నవముఖి రుద్రాక్ష
ఆచరించవలసిన దీక్ష - గణేశ దీక్ష
మండపం - జెండా ఆకారం
ఆచరించ వలసిన వ్రతం - పుత్ర గణపతి వ్రతం
పారాయణం చేయవలసినది - శ్రీ గణేశ పురాణం
కేతు అష్టోత్తర శతనామావళి - గణేశ శతనామావళి
దక్షిణగా ఇవ్వాల్సిన జంతువు - మేక
చేయవలసిన పూజ - విఘ్నేశ్వర పూజ, సూర్యారాధన
దానం చేయవలసిన ఆహార పదార్ధాలు - ఖర్జూరం, ఉలవలు


Sunday 29 December 2019

సత్సంతానం కలిగించే దేవుడు... సుబ్రహ్మణ్యుడు.


బ్రహ్మ నుండి 'శివసుతుని చేత ' మాత్రమే మరణం పొందేలా వరం అందుకున్నాడు తారకాసురుడు, వాడి మరణానికై ఉద్భవించిన దివ్య తేజోమయుడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆయన జన్మించిన రోజునే సుబ్రహ్మణ్య షష్ఠి గా వ్యవహరిస్తారు.
సుబ్రహ్మణ్యస్వామి అనగానే నెమలి వాహనంతో శక్తి ఆయుధాన్నిధరించి, మెడ మీదుగా భుజాలపై నుంచి వేలాడే పూలమాలతో దర్శనమిచ్చే ధర్మ స్వరూపం గుర్తుకు వస్తుంది. పార్వతీ పరమేశ్వరుల గారాల తనయుడిగానే కాదు, అసురుల గుండెల్లో గుబులు పుట్టించిన వీరుడిగా కూడా ఆయనకి పేరుంది. ఈయనకు ఆరు ముఖాలు ఉంటాయి. ఆరువైపులా చూస్తూ పరిస్థితులను సమన్వయం చేసుకోగలడు. సుబ్రహ్మణ్యునికి కుమారస్వామి, మురుగన్, షణ్ముఖుడు, కార్తికేయ, స్కంద – అంటూ అనేక పేర్లు ఉన్నాయి.
స్వామిని పంచామృతాలతో అభిషేకించి, వివిధ పుష్పాలతో అలంకరించాలి. సుబ్రహ్మణ్య స్వామిని షోడశోపచారలతో పూజించి, ఇష్టమైన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ విధంగా స్వామిని ఆరాధించడం వలన సంతానం కలుగుతుందనీ ... అనారోగ్యాలు తొలగిపోతాయని ... విజయాలు చేకూరతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అనేక దోషాలు నశించి పోతాయనీ, పాపాలు పరిహరించబడతాయని స్పష్టం చేస్తున్నాయి. అందుకే ఈ పర్వదినాన ఆ స్వామిని శక్తి కొద్దీ పూజించాలి ... భక్తి కొద్దీ సేవించాలి.
ఈరోజున ఉదయానే స్నానం చేసి (వీలైతే నదీ స్నానం) సుబ్రహ్మణ్యుని ఆలయానికి వెళ్ళి దేవుని దర్శించుకుని, దానధర్మాలు చేసినట్లయితే తెలిసీ తెలీక చేసే పాపాలన్నీ తొలగిపోతాయి. సర్పదోషాలు ఉన్నవారు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ప్రార్ధనలు చేసి పుట్టలో పాలు పోస్తారు. ఐదు ముఖాలున్న నాగదేవతను ఆరాధిస్తారు. నాగదేవతల్లో ఒకటైన శంకపాలను పూజిస్తారు. ఇలా చేయడంవల్ల సర్ప దోషాలు తొలగిపోతాయి. చర్మవ్యాధులు ఉంటే తగ్గుతాయి. పిల్లాపాపలతో సుఖసంతోషాలు అనుభవిస్తారు. సంతానం లేని వారు ఆయనను నమ్ముకుంటే చాలు సకల శుభాలు లభిస్తాయని ప్రతీతి.

గ్రహా దోషాలు-దానాలు


రవిగ్రహ దోషం ఉన్నవారు గోదుమపిండి,గోధుమరొట్టె,ఆరెంజ్ వస్త్రాలు,రాగి,రాగి జావ,మిరియాలు వస్తువులు దానం చేయవచ్చును.
చంద్రగ్రహ దోషం ఉన్నవారు అన్నదానం,బియ్యం,పాలు,నీళ్ళు,కెలుపు కాటన్ వస్త్రాలు,వెండి వస్తువులు,పొంగళి మొదలగునవి దానం చేయవచ్చును.
కుజగ్రహ దోషం ఉన్నవారు కందిపప్పు,మిరపకాయలు,పచ్చి ఖర్జూర,డేట్స్ సిరప్,బెల్ల,ఎరుపు వస్త్రాలు,వ్యవసాయ పనిముట్లు,శుక్రుడితో కలిసిన సోదరికి వస్త్రాభరణాలు బహుమతిగా ఇవ్వటం.,ఎరుపు రంగు వస్త్రాలు మొదలగునవి దానం చేయటం.
బుధగ్రహ దోషం ఉన్నవారు పెసరపప్పు,ఆకుకూరలు,కూరగాయలు,ఆకుపచ్చ వస్త్రాలు,విద్యార్ధులకు విద్యా సంబంధమైన వస్తువులు ,పుస్తకాలు ఆవుకి పచ్చగడ్డి వెయ్యటం మొదలగునవి దానం చేయవచ్చును.
గురువుగ్రహ దోషం ఉన్నవారు పండ్లు,తీపి పదార్ధాలు,శెనగ గుగ్గిళ్ళు,ధార్మిక కార్యక్రమాల కోసం దానం,విద్యా,వైద్యం,భోజనం,పసుపు రంగు వస్త్రాలు ,తియ్యని పానియాలు, బఠాని గుగ్గిళ్ళు,దానం చేయవచ్చును.
శుక్రగ్రహ దోషం ఉన్నవారు స్త్రీలకు సంబందించిన బొట్టు బిళ్ళలు,జడ పిన్నులు,జడ రబ్బర్లు, గోరింటాకు,గోళ్ళ రంగులు,సెంటు,అద్దాలు,దువ్వెనలు,పౌడర్లు,పూలు,డ్రైప్రూట్స్, బొబ్బర్లు, అలచందలు,రంగు రంగుల వస్త్రాలు,మొదలగునవి దాన చేయవచ్చును.
శనిగ్రహ దోషం ఉన్నవారు వంట నూనె,నువ్వులు,ఇనుము,దేవాలయాలకు సిమెంట్,నీలిరంగు వస్త్రాలు ,కార్మికులకు,పనిచేసేవారికి వస్తు,ధన రూపంలో దానం చేయవచ్చును.
రాహుగ్రహ దోషం ఉన్నవారు మినప సున్నిండలు,ఇడ్లీలు,మినపగారెలు,తడిపి నాబెట్టిన మినుములు ఆవుకి పెట్టటం,పొగరంగు వస్త్రాలు దానం చేయవచ్చును.
కేతుగ్రహ దోషం ఉన్నవారు పశువులకు,పక్షులకు,చేపలకు ఆహారం పెట్టటం,ఉలవల పొడిని ఆవులకి పెట్టటం,విచిత్ర వర్ణ వస్తువులు దానం చేయవచ్చును.

కస్తూరి..



Contact 96666౦2371
జాతకచక్రంలో శుక్రగ్రహ దోషం ఉన్నవారికి వివాహం తొందరగా కాక పోవటం,వివాహ విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నష్ట పోవటం,వివాహం అయిన తరువాత దంపతుల మద్య విభేదాలు,వాహన సౌఖ్యత లేకపోవటం జరుగుతుంది.శుక్రగ్రహ దోష నివారణకు కస్తూరి ని పూజా మందిరంలో ఉంచి పూజ చేసుకోవచ్చును.
ఎర్రటి జాకెట్టు గుడ్డలో ఉంచి బీరువాలోగాని,లాకర్లో గాని ఉంచిన డబ్బు వృధాగా ఖర్చు అవ్వద
కస్తూరిని పొందటం కోసం ఈ గ్రంధి మొత్తాన్ని జింక శరీరం నుండి వేరు చేస్తారు. బాగా పెరిగిన, ఆరోగ్యకరమయిన గ్రంధిలో నలభై శాతం కస్తూరి ఉంటుంది. ఈ గ్రంధిని బాగా ఎండపెట్టడం వలన అందులో దాగి ఉన్న ముదురు ఎరుపు రంగులో ఉండే కస్తూరి నలుపు రంగులోకి మారుతుంది.
పూర్వ కాలంలో మరియు పురాణాలలో కూడా దీని ప్రస్తావన ఉంది. వాటిల్లో దీనిని అలంకారానికి, సుగంధ పరిమళానికి, ఆరోగ్యానికి, హోమాలకి రక రకాలుగా వాడినట్లు చెప్పబడింది.కస్తూరిని శని, రాహు గ్రహాలకు; రోహిణి, మూల, భరణి నక్షత్రాలకు హోమద్రవ్యము క్రింద వాడవలెనని శ్రీ విష్ణుధర్మోత్తర పురాణంలో చెప్పబడింది. అలానే మణిద్వీపంలో కస్తూరి మృగాలు సంచరిస్తూ నిత్యం పరిమళాలను వెదచల్లుతూ ఉంటాయి అని మణిద్వీప వర్ణన (దేవీ భాగవతం) లో కూడా ఉంది.


వాస్తవానికి కస్తూరి అనేది అత్యంత ఖరీదయిన జంతు ఉత్పత్తులలో ఒకటి.
కస్తూరి ఉన్న ఇంట్లో ధనాభివృద్ధి ఉంటుంది. రుణభాదలు ఉండవు.అధికారుల వేదింపులు ఉండవు.
వైవాహిక జీవితంలో కలిగే ఇబ్బందులను తొలిగిస్తుంది.దంపతుల మద్య ఏటువంటి గొడవలు లేకుండా అన్యోన్యత కలిగి ఉంటారు.
బిజినెస్ చేసే బీరవాలోగాని,గల్లా పెట్టెలోగాని ఉంచిన దనానికి లోటు ఉండదు.పూజా స్థలంలో ఉంచిన వ్యాపారాభివృద్ధి జరుగుతుంది.

ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371