Tuesday 31 October 2023

పంచ మహా యజ్ఞాలంటే ఏమిటి?

 





👉ఇవి ఋత్విక్కులు చేసేయజ్ఞాలు కాదండీ. శాస్త్ర ప్రకారం ప్రతి వ్యక్తీ అను నిత్యం పాటించ వలసిన విధులు. అవి ఏమిటి?

1. దేవ యజ్ఞం

పూర్వం నిత్యాగ్నిహోత్రులు వుండేవారు.

వారు తాము భోజనం చేసే ముందు కొంచెం అన్నాన్ని అగ్నికి ఆహుతి చేసేవారు. దీనికి ఆహుతం అని పేరు. అలాకాక ఇంట్లో వారందరూ అగ్నికి సమిధలు సమర్పించినా ఆహుతం చేసినట్లే. సృష్టికి మూలకారకుడైన దేవదేవుని నిత్యం తలుచుకుని ఆయనకు కృతజ్ఞతలు తెలపటమే దీని ముఖ్యోద్దేశ్యం.

2. పితృ యజ్ఞం

మనల్ని కని పెంచి ఇంత వారిని చేసిన తల్లితండ్రలను ప్రేమగా చూడాలి. చిన్నప్పుడు వారు మనల్ని ఎంత ప్రేమగా చూశారో, మన అవసరాలెలా తీర్చారో, అలాగే వారి పెద్ద వయసులో వారిని కనిపెట్టుకుని వుండాలి. ఇలా వారి ఋణాన్ని కొంతయినా తీర్చుకోగలం. ఇది పితృ యజ్ఞం.

3. భూత యజ్ఞం

గృహస్తు సర్వప్రాణికోటిమీద దయ కలిగి పుండాలి. పశు పక్షులు, క్రిమి, కీటకాదులు మానవుడి మీద ఆధార పడి వున్నాయి. అందుకే మనిషికి భూత

దయ వుండాలి. అన్నం తినే ముందు ఒక ముద్ద అన్నం పక్షుల కోసం బయట (పక్షులు వచ్చే ప్రదేశంలోపెట్టాలి. ఇంటి ముందు కుక్కకి, ఇంట్లో పిల్లికి అన్నం పెట్టాలి. ఇంట్లో పశువులు వుంటే వాటికి పెట్టాలి. క్రిమి కీటకాల కోసం కొంచెం అన్నం (తినక ముందు) పక్కన పెట్టాలి. (మన పెద్దలు వీటిని పాటించటం మీలో కొందరయినా చూసే వుంటారు). జలాశయాలలో జలచరాలకు కూడా

ఆహారం వెయ్యాలి. సర్వ ప్రాణులయందూ దయ కలిగి వుండి ప్రతి నిత్యం కనీసం ఏదో ఒక దానికన్నా ఆహారం ఇవ్వాలి.

4. మనుష్య యజ్ఞం

మన పెద్దలు అతిధి దేవో భవ అన్నారు.

అప్పటివారు ఆతిధ్యం కోరి వచ్చినవారు తమకు తెలియనివారయినా వారిని ఆదరించి సత్కరించేవారు. రోజులు మారినాయి. అయినా

ఇంటికొచ్చినవారిని మన కులం వారా, మన మతం వారా మన కేవిషయంలో నైనా పనికి వస్తారా లేదా వగైరాలాలోచించకుండా వారు వచ్చిన సమయాన్నిబట్టి తగు విధంగా గౌరవించాలి. తోటి వారి పట్ల దయ కలిగి వుండాలి. అందరితో

సఖ్యంగా వుండాలి. ఎవరైనా సహాయం కోరితే, మనం చెయ్యగలిగితే నిస్వార్ధంగా చెయ్యాలి.

5. బ్రహ్మ యజ్ఞం

ప్రతి వారూ, ప్రతి రోజూ వేద మంత్రాలు కానీ శాస్త్రిలని కానీ చదవాలి. ఇప్పుడు వేద మంత్రాలు చదివే వారి సంఖ్య తక్కువగానీ ప్రతి వారూ ఎవరికి

వీలయిన, ఎవరికి ఆసక్తి వున్న, ఎవరికి అనుకూలంగా వున్న శాస్త్రాలను చదవాలి. ప్రతి రోజూ కొత్త విషయాలను తెలుసుకునే ఆసక్తి

చూపించాలి. అంతేకాదు. తను తెలుసుకున్నది ఇతరులకు చెప్పాలి. ప్రతి మనిషికీ భగవంతుని పట్ల విశ్వాసం, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, భూత దయ, తోటి మనిషులతో కలిసి వుండే మనస్తత్వం,

శాస్త్రం తెలుసుకుని నలుగురితో పంచుకునే జిజ్ఞాస

వున్నాయనుకోండి. ఈ ప్రపంచం ఎలా వుంటుందో ఒక్కసారి ఊహించుకోండి.

మనిషిని సక్రమ మార్గంలో నడపటానికే ఈ పంచ యజ్ఞాలను నిర్దేసించారు మన పెద్దలు.


సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు


వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

బుధుడు - బుధవారం ప్రత్యేకం

 


🙏ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధం సౌమ్యంసత్వగుణోపేతంతం బుధం ప్రణమామ్యహం 

👉🏿ఈయన వాణిజ్యాధిపతి. విద్య, కోశాగారం, గణితం, వస్త్రాలు, బుద్ది, వ్యాపార, పచ్చరంగు మరకతం, జ్యోతిష్యం, చర్మం, వంధ్యత్వం, బంధు, భక్తి, హేమంతం, కనిష్ట సోదరా, గోపురాలు, వైద్యం, లిపి, పిచ్చి, కుష్టు, చర్మం, వాక్కు వంటి వాటికి అధిపతి.

గ్రహము: బుధుడు

లింగం:నపుంసక

స్వభావము:సాత్విక

కాలబలము:రాత్రి, పగలు

ఇష్ట కాలము:ప్రాతః కాలం

రత్నము: పచ్చ

వారము;బుధవారం

ధరించవలసిన వ్రేలు:చిటికిన వ్రేలు బంగారం తో

తత్వమూ;భూ తత్వం

ఋతువుశరత్

ఫలము;చింత

లోహం:సత్తు, పాదరసం

స్థానము;భూమి

దిక్కులు:ఉత్తరం

రంగులు:ఆకుపచ్క

సమిధలు:ఉత్తరేణి

అధిష్టాన దేవత:విష్ణువు

పూజలు:విష్ణు పూజ

వర్ణములు:వైశ్య

మూలికలు:, నేలగుమ్మడి, పచ్చదారం

పండుగలు:తోలి ఏకాదశి

వృక్షములు:ఫల రహిత

జంతువులూ:చిలుక

గృహ భాగములు:క్రీడా, అంగడి, చదువు గది

గ్రహచారము:౩౦ రోజులు

గ్రహ వయస్సు:20 సం లు

అధిదేవత:విష్ణు

ప్రత్యదిదేవత:నారాయణ

దానం:పెసలు, నెయ్యి, ఆకుపచ్చ పండ్లు, తాంబూలం, సంపంగి, ఆకుపచ్చ వస్త్రం

ప్రసాదం:పెసలతో చేసినవి

దేవాలయము:వైష్ణవ

గోత్రము:ఆత్రేయ

ఆసనం:బాణాకారం

విగ్రహం:

వెండితోదేవా వర్గం:శైవ

వయస్సు:కౌమారం

స్వ క్షేత్రం:కన్య, మిధున

దశ సం:అ౭

తల్లి తండ్రులు:చంద్ర, తార

దృష్టి:7

భార్యలు:ఇలా(జ్ఞాన శక్తి దేవి)

భావ కారకత్వం:వాణిజ్య, మంత్రం విద్య

గ్రహ వర్గం:శని

మిత్రులు: శని, శుక్ర

శత్రువులు: గురు, చంద్ర

ధాన్యం:పెసలు

దిన చలనం:1 deg 

నక్షత్రాలు:ఆశ్లేష, రేవతి, జ్యేష్ట

వాహనం:సింహ

గుణం:రజో గుణం

నీచ:మీన(15deg)

ఉచ్చ:కన్య(15deg)

సంఖ్యా:5

ఎత్తు:పొడుగు

భాగం:మెడ

నీతి:భేద నీతి

స్వభావం:ద్విస్వభావం

ధాతువులు: చర్మం

గ్రహ దేశం:వింధ్య నుండి గంగ

మిత్ర రాశి: మకర, కుంభ, తుల, వృషభ

శత్రు రాశి:ధనుస్సు, మీనం

సమ గ్రహం:కుజ, శని

విషమ రాశి:కర్కట

గ్రహ పీడలు:జ్ఞాతి పీడ

తత్వములు:వాత, పిత్త, శ్లేష్మ

ఫలం:బుద్ధిబలం

మూలత్రికోణం:కన్య(16-20)

ఆధిపత్యం: తిర్యక్ జంతువులకి

నాయకత్వం:యువరాజు

ఇతర నామాలు:సౌమ్య, సోమాజ, ఇందుజ, బోధనా, విధుసుత, విద్ జ్ఞా

యోగములు:భద్ర మహా పురుష యోగం, బుధదిత్య యుగం

అంత: శక్తులు: వాక్కు

రూపాది వర్ణన:దుర్వాశ్యాముడు

వ్యద గ్రహం:చంద్ర

గ్రహోదయం:శీర్షోదయం

స్వరూపం:పక్షి

ఉనికిపట్టు:గ్రామములలో

వేదములు: అధర్వణ

షడ్బలం: 7 రూపాలు

దిగ్బలం:తూర్పు

దృష్టి:కటాక్ష

ధాతువులు:చర్మం 

వర్ణం:గరికపోచల

వస్త్రం:తడిసిన

కాలం:రెండు మాసములు

జాతి:శూద్ర

పరమోచ్చ:కన్యలో 15వ భాగం

పరమ నీచ:మీనములో 20 వ భాగం

శుభత్వం:అర్ధ శుభుడు

గోచర రిత్య శుభ:2,4,6,11,

గోచార రిత్య వేద:5,3,9,12,

రాజ్యములు:మగధ

గోచారం అశుభ:1,3,5,7,9,12.

ఆకారం:గుండ్రని

మనిషిని బాధించు భాగం:కంఠం

సమ క్షేత్రం:మేషం, ధనస్సు, వృషభం, మకరం

గ్రహం బలంగ ఉంటే:జ్ఞానం

గ్రహం బలహీనంగ ఉంటె:తగాదా, మోసం

ధరించవలసిన రుద్రాక్ష:10ముఖ

స్థానం: మెడ

వయోరీతి:కీమారం 

సంతానం: పురూరవ

కులం:వైశ్యులు

శుభత్వం:అర్ధ శుభ

గ్రహ ఆసనం:సింహ/ బనానాస్

పదవి వివరం:చంద్ర పుత్ర

గ్రహ జప సంఖ్యా:17వేలు

నైసర్గిక గ్రహ బలం:గురు

గ్రహఇష్ట కాలం: ప్రాతః కాలం

దేహము పై ప్రభావం: గుహ్య అంగాలు

దేహం లోని భాగం:మెదడు

వేదా స్థానాలు:5,3,9,12

గ్రహ జన్మ సం:సౌమ్య

గ్రహ తిది:భాద్రపద సుద్దా ఏకాదశి

గ్రహ రుషి:నారాయణ

గ్రహ ఛందస్సు:త్రిష్టుప్

గ్రహ అదృష్ట సంఖ్య:4

రత్నం తో ధరించాలసిన లోహం:బంగారం

గ్రహ జప మంత్రం: ఓం బుం బుధాయ నమః

గ్రహ క్షేత్రం: ర్యాలీ

గ్రహ మాసం:భాద్రపద

గ్రహ ద్రవ్యం:కంచు

అయనాది కాలం:రెండు నెలలు

బుధ గ్రహ అధిదేవత విష్ణు. ప్రత్యధి దేవత నారాయణ. అయితే బుధ దోషం కలవారు 17000 జప సంఖ్య జపం చేసాక, 1700 అది ప్రత్యధి దేవతల జపం, 1700 తర్పణం, 170 హోమం ఉత్తరేణి సమిధలతో చేయలు. పెసలు దానం. పచ్చ దానం. చేయాలి.

విష్ణు అధిపతి కావున, విష్ణు సహస్రనామ పారాయణం గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. మాతంగి దేవి అర్చన జపం బుధ దోషం తొలగిస్తుంది. 

ఓం బుం బుధాయ నమః

బుధ నపుంసక గ్రహం. మిశ్రమ రుచుల కారకత్వం కలిగిన వాడు. ఇరవై వయసున్న వారిని సూచిస్తాడు. వర్ణం ఆకు పచ్చ, జాతి వైశ్య, అధి దేవత విష్ణువు, గుండ్రని  ఆకారం, పరిమాణం పొడుగు, ప్రకృతి కఫ, వాత, పిత్తములు కల వాడు. శరధృతువును ఉత్తర దిక్కునూ, సూచిస్తూ, పృధ్వీ తత్వం కలిగిన వాడు, గ్రహ సంఖ్య అయిదు, రత్నం పచ్చ, లోహం, ఇత్తడి, కంచు, గుణం రజో గుణం కలిగిన వాడు. లగ్నంలో దిక్బలం కలిగి ఉంటాడు. ఆశ్లేష, మూల, రేవతి నక్షత్రములకు బుధుడు అధిపతి. మిధున కన్యా రాశులకు అధిపతి. బుధుడు కన్యారాశిలో పదిహేను డిగ్రీల వద్ద పరమ ఉచ్ఛ స్థితిని పొందుతాడు. మీనరాశిలో పదిహేను డిగ్రీల వద్ద పరమ నీచను పొందుతుంది. కన్యారాశిలో పదిహేను ఇరవై డిగ్రీలు మూల త్రికోణము ఔతుంది. బుధుడికి సూర్యుడు, శుక్రుడు మిత్రులు. సింహరాశి, వృషభరాశి, తులారాశులు మిత్ర స్థానములు. చంద్రుడు శత్రువు. కర్కాటక రాశి శత్రు స్థానం. బుధ గ్రహ దశ పదిహేడు సంవత్సరాలు. బుధుడు ఏడవ స్థానం మీద మాత్య్రమే దృష్టిని సారిస్తాడు.

బుధుడు స్వభావరీత్యా శుభుడు, తత్వము భూతత్వం, గ్రహ స్వభావం, ఒంటరిగాపాపి శుభగ్రహములతో చేరిన శుభుడు. జీవులు పక్షులు, గ్రహ స్థానం క్రీడాస్థలాలు, జలతత్వం జలభాగం, ఆత్మాధికారం వాక్కు, పాలనా శక్తి రాకుమారుడు, గ్రహపీడ బంధువుల వలన బాధలు, గ్రహ వర్గం శని, గృహంలో భాగములు పఠనా మందిరం, దిక్బలం తూర్పు, నివాస ప్రదేశములు జనావాసాలు, చెట్లు ఫలములు లేని చెట్లు, పండ్లు సీమ చింత, ధాన్యం పెసలు, పక్షులు చిలుక, గబ్బిలం, జంతువులు మేక గొర్రె, ఇతర వస్తువులు నగలు, మిశ్ర లోహములు. వస్త్రం తడి వస్త్రం, దేవ వ్ర్గం శైవ, గ్రహ వేదం అధ్ర్వణ వేదం, గ్రహ గోత్య్రం ఆత్రేయ, అర్ధశుభుడు, అవతారం బుద్ధావతారం, గ్రహవర్ణం తాళపత్ర వర్ణం, వారం బుధవారం, మన స్థితి సాత్వికం, బలంగా ఉంటే వాక్చాతుర్యం బుద్ధి జ్ఞానం, ఋషి నారాయణుడు.

🟢బుధుడి ప్రభావం

బుధ ప్రభావితులు పొట్టిగా ఉంటారు. చురుకుగా ఉంటారు. వాక్చాతుర్యం కలిగి ఉంటారు. బుద్ధి కుశలత కలిగి ఉంటారు. వృద్ధాప్యంలో కూడా యవ్వనంతో కనిపిస్తారు. దీర్ఘాలోచ కల వారు, మేధా సంపత్తి కల వారుగా ఉంటారు. సందేహ ప్రవృత్తి కలవారుగా ఉంటారు. విషయ జ్ఞానం అందు ఆసక్తులు. రచయితలు, కళాకారులుగా ఉంటారు. తలనిప్పి, తల నొప్పి, అల్సర్ వ్యాధి పీడితులయ్యే అవకాశం ఉంది. ప్రసార రంగంలోనూ, కళారంగంలోనూ, గణికులుగా ఉంటారు.

🟢బుధుడి కారకత్వాలు

👉🏿 బుధుడు వాక్కుకు, మేనమామకు, మేనకోడలికి, మేనల్లుడికి, మాతా మహులకు కారకత్వం వహిస్తున్నాడు. ఉపన్యాసంలో నైపుణ్యం, లలిత కళలు, గణిత శాసత్రం, వాణిజ్యం, అర్ధ శాస్త్రం, ఖగోళ శాస్త్రం, వ్యాపార శాస్త్రం, వ్యాకరణం, జ్యోతిషం, వివిధరకాల భాషలు, శిల్పి, మంత్రం, తంత్రం, వివేకం, పుస్తక పచురణ, గ్రంథాలయం మొదలైన వాటికి కారణం. దౌత్యం, వైద్యం, మధ్యవర్తిత్వం మొదలైన వాటికి కారకత్వం వహిస్తాడు. వైష్ణవులు, వైష్ణవ భక్తి, వైష్ణవాలయం మొదలైన వారికి కారకత్వం వహిస్తాడు. నాభి, నరము, స్వరపేటిక, చర్మమును సూచిస్తాడు కనుక నరముల బలహీనత, మూర్చ, చ్చెముడు, మెదడుకు సంబంధించిన వ్యాదులకు కారకత్వం వహిస్తాడు. సకల విధ ఆకు కూరలు, కాయ కూరలకు కారకత్వం వహిస్తాడు. సభా నిర్వాహకులు, ప్రజాసంబంధిత వ్యవహారికులు, ప్రచారకులు, ఉపన్యాసకులు, ఉపాద్యాయులు, న్యాయవాదులు మొదలైన వాటికి కారకత్వం వహిస్తాడు. వాక్సంబంధిత వృత్తులకు బుధుడు కారకుడు. మేధావులు, పండితులు, చరిత్రకులు, గుమస్తాలు, చిత్రకారులు, రాయబారులు, విద్య, గణికులు, దస్తూరి, నవలలు, వ్యాసాలు, కల్పితాలు, చిన్న పుస్తకములు, యువకులు, ప్రకటనలు, వాహనములు, వ్యాపారం, నిఘంటువులు, సత్యవాదముకు బుధుడు కాకత్వం వహిస్తాడు.

🟢బుధుని రూపురేఖలు

బుధుడు దుర్వాదళ దేహకాంటి కలిగిన వాడు. నాలుగు భుజములు కలిగి పీత వస్త్రములను ధరించి పసుపు పచ్చని మాలా ధారణ చేసి గద, కత్తి, డాలు ఆయుధములను చేత పట్టి ఉంటాడు. బుధుడు సింహమును అధిరోహించి ఉంటాడు.

🙏బుధుని పూజించు విధానం

బుధుడిని పూజించుటకు బంగారు ప్రతిమను చేయాలి. పాలతో కలిపిన అన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. అధిదేవత విష్ణువు, అధిష్టాన దేవత దుర్గ. ప్రసాదము పులిహోర, వడపప్పు, దోషనివారణకు దానం చేయవలసిన లోహం బంగారం. బుధుడికి శ్రావణ్ శుక్ల పంచమి, వైశాఖ పూర్ణిమ, ఆచరించ వలసిన వ్రతం సత్యనారాయణ వ్రతం, పారాయణ చేయవలసిన గ్రంథం దేవీ భాగవతం, పారాయణ చేయవలసిన బుధగ్రహ అష్టోత్తర శతనామావళి, విష్ణు సహస్ర నామం, ధరించవలసిన మాల తులసి మాల, తీసుకోవలసిన దీక్ష గోవింద దీక్ష, ధరించ వలసిన రుద్రాక్ష చతుర్ముఖ రుద్రాక్ష, దర్శించ వలసిన ఆలయాలు విష్ణాలయం దుర్గాలయం, పూజ దుర్గా పూజ, దానం చేయవలసిన వాస్థువులు పెసలు ఆకు పచ్చని వస్త్రాలు, ఆసనం బానాకారం, గ్రహ శాంతికి చేయ వలసిన జపం పది హేడు వేలు, హోమముకు వాడవలసిన సమిధ ఉత్తరేణి.

బుధ గ్రహ జపం (Budhagraha Japam)

👉🏿ఆవాహనము:

అస్య శ్రీబుధగ్రహ మహా మంత్రస్య! కాశ్యప ఋషిః

బుధగ్రహోదేవతా త్రిష్టుప్ ఛందః బుధగ్రహ మాల మంత్ర జపం కరిష్యే!!

👍కరన్యాసము:

ఓం ఉద్భుద్యస్వాగ్నే ప్రతిజాగృహే - అంగుష్టాభ్యం నమః

ఓం త్వమిష్టపూర్తీ - తర్జనీభ్యాం నమః ఓం సగ్ నృజేధాంమయం చ -

మధ్యమాభ్యాం నమః ఓం అస్మిస్నదస్తే ఆవాః - అనామికాభ్యాం నమః

ఓం జయమానశ్చ సీదతి - కరతల కరపృష్టాభ్యాం నమః

అంగన్యాసము:

ఓం ఉద్భుద్యస్వాగ్నే ప్రతిజాగృహే - హృదయాయ నమః

ఓం త్వమిష్టపూర్తీ - శిరసే స్వాహా ఓం సగ్ నృజేధాంమయంచ - శిఖాయైవషట్ ఓం అస్మిస్నదస్తే ఆవాః - కవచాయహుం ఓం అద్భుతరాశ్మీన్ విశ్వదేవా - నేత్రత్రయా వౌషట్ ఓం జయమానశ్చ సీదతి - అస్త్రాయఫట్ ఓం భూర్వవస్సువరోమితి దిగ్భందః ఆదిదేవతా: ఇదం విష్ణుర్వి చక్రమే త్రేధానిదధే పదం! సమూఢ మస్యపాగ్ సురే!!

ప్రత్యథి దేవతా: సహస్ర శీర్షః పురుషః! సహస్తాక్ష సహస్ర పాత్!

నభూమిం విశ్వతో వృత్యా! అత్యతిష్ట దశాంగులమ్!!

వేద మంత్రము: అద్భుద్య స్వాగ్నే ప్రతి జాగృహ్యే! సామిష్టా పూర్తేనగ్ సృజేధామయంచ పునః కృణ్వగ్ స్త్వాపితరం యువాన మన్వాతాగ్!

సీత్వయితంతు మేతం!! బుధ కవచ స్తోత్రము పీతాంబర ధరః పాతు! పీతమాల్యానులేపనః! బుధః పాతు శిరోదేశం సౌమ్యః పాతు ఛ ఫాలకం!!

నేత్రే జ్ఞానమయః పాతు! శ్రుతీ పాతు!విభూద్భవః! ఘ్రాణం గంధ ధరః పాతు! భుజౌపుస్తక భూషితః! మద్యం పాతు సురారాద్యః! పాతునాభిం ఖగేశ్వరః! కటిం కాలాత్మజః పాతు! ఊరు: పాతు సురేశ్వరః! జానునీ రోహిణి నూను:! పాతు జంఘే ఫలప్రదః! పాదౌ బాణాసనః పాతు:! సౌమ్యౌఖిల వాపు:! ఫలశ్రుతి: ఏపోప్ కవచః పుణ్యం సర్వోపద్రవ శాంతిదః! సర్వరోగ ప్రశమనః సర్వదుఖ నివారకః! ఆయురారోగ్య శుభదః! పుత్రాపౌత్ర ప్రవర్తన:! యః పఠేత్కావచం దివ్యం శృణుయద్వా సమాహితః! సర్వాన్ కామా స్మవాప్నోతి! దీరఘమాయుశ్చ విందతి!!

బుధ మంగళాష్టకం సౌమ్యః పీత ఉదజ్ముఖ స్సమిదపామార్గోత్రి గోత్రోద్భవో: బాణేశాన దశస్సుహృద్ర విసితౌ వైరీం దురన్యే సమాః! కన్యాయుగ్మ పతిర్ధశాష్టక చతుష్టణ్ణేత్రగ శ్యోభానః! విష్ణుర్వ్టైభగదైవతో మగధవః కుర్యాత్సదా మంగళమ్!!

🟢బుధాస్తోత్తర శతనామావళి:

ఓం బుధాయ నమః ఓం బుధార్చితాయ నమః ఓం సౌమ్యాయ నమః ఓం సౌమ్యచిత్తాయ నమః ఓం శుభప్రదాయ నమః ఓం దృఢవ్రతాయ నమః ఓం దృఢఫలాయ నమః ఓం శ్రుతిజాల ప్రబోధకాయ నమః ఓం సత్యవాసాయ నమః ఓం శ్రేయసాంపతయే నమః

ఓం అవ్యయాయ నమః ఓం సోమజాయ నమః ఓం సుఖదాయ నమః ఓం శ్రీమతే నమః ఓం సోమవంశప్రదీపకాయ నమః ఓం వేదవిదే నమః ఓం వేదతత్త్వజ్ఞాయ నమః ఓం వేదాంతజ్ఞాన భాస్వరాయ నమః ఓం విద్యావిచక్షణ విభవే నమః ఓం విద్వత్ప్రీతికరాయ నమః ఓం బుధాయ నమః ఓం విశ్వనుకూలసంచారినే నమః ఓం విశేష వినయాన్వితాయ నమః

ఓం వివిధాగమసారజ్ఞానాయ నమః ఓం వీర్యవతే నమః ఓం విగతజ్వరాయ నమః ఓం త్రివర్గ ఫలదాయ నమః ఓం అనంతాయ నమః ఓం త్రిదశాదిపూజితాయ నమః ఓం బుద్ధిమతే నమః ఓం బహుశాస్త్రజ్ఞాయ నమః ఓం బలినే నమః ఓం బంధవిమోచకాయ నమః ఓం వక్రాతివక్రగమనాయ నమః ఓం వాసవాయ నమః ఓం వసుధాధిపాయ నమః ఓం ప్రసాదవదనాయ నమః ఓం వంద్యాయ నమః ఓం వరేణ్యాయ నమః

ఓం వాగ్విలక్షణాయ నమః ఓం సత్యవతే నమః ఓం సత్యసంకల్పాయ నమః ఓం సత్యబంధవే నమః ఓం సదాదరాయ నమః ఓం సర్వరోగ ప్రశమనాయ నమః ఓం సర్వమృత్యునివారకాయ నమః ఓం వాణిజ్యనిపుణాయ నమః ఓం వశ్యాయ నమః ఓం వాతాంగినే నమః ఓం వాతరోగహృతే నమః ఓం స్థూలాయ నమః ఓం స్థిరగుణాధ్యక్షాయ నమః ఓం అప్రకాశాయ నమః

ఓం ప్రకాశాత్మనే నమః ఓం ఘనాయ నమః ఓం గగనభూషణాయ నమః ఓం విధిస్తుత్యాయ నమః ఓం విశాలాక్షాయ నమః ఓం విద్వజ్ఞనమనోహరాయ నమః ఓం చారుశీలాయ నమః ఓం స్వప్రకాశాయ నమః ఓం చపలాయ నమః ఓం చలితేంద్రియాయ నమః ఓం ఉదజ్ముఖాయ నమః ఓం మఖాసక్తాయ నమః ఓం మగధాధిపతయే నమః

ఓం హరయే నమః ఓం సౌమ్యవత్సర సంజితాయ నమః ఓం సోమప్రియకరాయ నమః ఓం సుఖినే నమః ఓం సింహాధిరూధాయ నమః ఓం సర్వజ్ఞాయ నమః ఓం శిఖపర్ణాయ నమః ఓం శివంకరాయ నమః ఓం పీతాంబరాయ నమః ఓం పీతవపుషే నమః ఓం పీతచ్ఛత్రద్వాజాంచితాయ నమః ఓం ఖడ్గచర్మధరాయ నమః

ఓం కార్యకర్త్రే నమః ఓం కలుషహారాకయ నమః ఓం ఆత్రేయ గోత్రజాయ నమః ఓం అత్యస్తవినయాయ నమః ఓం విశ్వపావనాయ నమః ఓం చాంప ఏయ పుష్పసంకాశాయ నమః ఓం చారణాయ నమః ఓం చారుభూషణాయ నమః ఓం వీతరాగాయ నమః ఓం వీరభాయాయ నమః ఓం విశుద్ధకనక ప్రభాయ నమః ఓం బంధుప్రియాయ నమః ఓం బంధముక్తాయ నమః ఓం బాణమండల సంశ్రితాయ నమః

ఓం తర్కశాస్త్ర విశారదాయ నమః ఓం ప్రశాంతాయ నమః ఓం ప్రీతిసంయుక్తాయ నమః ఓం ప్రియకృతే నమః ఓం ప్రియభాషణాయ నమః ఓం మేధావినే నమః ఓం మాధవాసక్తాయ నమః ఓం మిథునాధిపతయే నమః ఓం సుధీయే నమః ఓం కన్యారాశి ప్రియాయ నమః ఓం కామప్రదాయ నమః ఓం ఘనఫలాశ్రయాయ నమః

ఓం బుధగ్రహాయ నమః బుధ గ్రహ స్తోత్రమ్ అస్యశ్రీ బుధ స్తోత్ర మహామంత్రస్య వసిష్ట ఋషిః త్రిష్ణుప్భంద: శ్రీ బుధో దేవతా బుధగ్రహ ప్రసాద సిద్ద్యర్దే జపే వినియోగః భా మిత్యాది షడంగన్యాసః భూర్బువస్సురోమితి దిగ్భంధః ధ్యానమ్ బుధశ్చతుర్భిర్వరదాభయాసిగదా వహంతం వరదం ప్రశాంతమ్, పీతప్రభం చంద్రసుతం సురాధ్యం సింహేనిషణ్ణం బుధమాశ్రయామి. పీతాంబరం: పీరవపు: కిరీటీ ఛ చతుర్భుజ:

పీతధ్వజపతాకీ ఛ రోహిణీ గర్భసంభవః ఈశాన్యాధిషుదేశేషు బాణాసన ఉదాబ్ముఖః నాథో మగధదేశస్య మంత్రో మంత్రారథతత్త్వవితే. సుఖాసనః కర్ణికారో హైత్రశ్చాత్రే య గోత్రవాన్, భరద్వాజ ఋషి ప్రఖ్యైర్జ్యోతిర్మండలమండితః అడిపత్యదిదేవాభ్యామన్మతో గ్ర్రహమండలే, ప్రవిష్టస్సూక్ష్మ రూపేణ సమస్తవరదస్సుఖీ. సదా ప్రదక్షిణం మేరో: కుర్వాణః సంప్రాప్త సుఫలప్రదః కన్యాయా మిథునస్యాపి రాశేరథిపతిర్ధ్వయో:

ముద్గదాన్యప్రదో నిత్యం మార్త్యా మర్త్యసురార్చితః యస్తు సౌమ్యేన మనసా స్వమాత్మనం ప్రపూజయేత్, తస్య వశ్యో భవేన్నిత్యం సౌమ్యనామధరో బుధః బుధస్తోత్రమిదం గమ్యం వసిష్టోనోదితం పురా, దిలీపాయ ఛ భక్తాయ యాచమానాయ భూభ్రుతే. యః పఠేదేకవారం వా సర్వాష్టమవాప్నుయాత్, స్తోత్రరాజమిదం పుణ్యం గుహ్యాద్గుహ్యతమం మహాత్.

ఏకవారం ద్వివారం వా త్రివారం యః పఠేన్నరః తస్యాపస్మారకుష్టాదివ్యాధిబాధా స విద్యతే. సర్వగ్రహకృతాపీడా పఠితే స్మిన్న విద్యతే, కృత్రి మౌషధదుర్మంత్రం క్రుత్రిమాదివిశాచరై: యదృద్భయం భవేత్తత్ర పఠితే స్మిన్ నవిద్యతే, ప్రతీమ యా ఛ స్వర్నేణ లీఖీతా తు భుజాష్టకా. మఉద్గదాన్యోపరి స్వప్తపీతవస్త్రాన్వితే ఘటే, విన్యస్య విధినా సమ్యక్ మాసమేకం నిరంతరమ్. యే పూజయంతి తే యాంతి దీర్ఘమాయు: ప్రజాధనమ్, ఆరోగ్యం భాస్మగుల్యాదిసర్వవ్యాధి వినాశనమ్. యం యం కామయత్ సమ్యక్ తత్తదాపొస త్యసంశయః ఇతి శ్రీస్కాందే పురాణే బుధస్తోత్రం సంపూర్ణమ్.

🙏బుధ గ్రహ దోష అనగా ఏమిటి  నివారణకు ఏమి చెయ్యవలెను............!!

బుధ గ్రహ ప్రభావంతో నరాలు, చర్మం, స్వరపేటిక సంబంధిత వ్యాధులు, నాసిక సంబంధ వ్యాధులు, పక్షవాతం, పిచ్చితనం, నోటి వ్యాధులు సామాన్యంగా బుధుడు కల్పించే వ్యాధులు. అంతేగాకుండా వ్యాపారంలో చిక్కులు, మోసపోవడం, మతిపరుపు, ఆదాయ వ్యయాలు గణిత సంబంధమైన పొరపాట్లు బుధ గ్రహ దోషం వలన కలిగే ఇబ్బందులని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

👉🏿బుధ గ్రహ దోష నివారణకు పచ్చని మైదానంలో, ఆకు పచ్చి వాతావరణంలో కొంతకాలం గడపటం మంచిది.

 విద్యాలయ పరిసరాల్లో ఉండటం, పండిత ప్రసంగ శ్రవణం, మేధావుల స్నేహం ఉపయుక్తమైన ప్రక్రియలు చేయడం ద్వారా బుధ గ్రహ దోషాలు తొలగును ,

బుధవారం రోజు పచ్చ పెసలు బ్రాహ్మణునికి దానం చేయాలి. 

బుధవారాల్లో పచ్చ పెసలు నానపెట్టి ఆవుకు పెడితే దోష నివారణ జరుగుతుందని 

జ్యోతిష్యశాస్రం చెబుతున్నారు. 

బుధవారం రోజున పేదలకు పెసర హల్వా పంచిపెడితే మంచిది.

#ఆశ్లేష నక్షత్రము

ఆదిశేషుడు, లక్ష్మణుడు యొక్క జన్మ తారగా చెప్పబడే నక్షత్రము ఆశ్లేష నక్షత్రము. అధిపతి బుధుడు. వీరికి బుధ దశలో జీవితం ప్రారంభం అవుతుంది. దశ పూర్తి ప్రమాణం 17 వత్సరాలు. తదుపరి 

కేతు దశ 7 సంవత్సరాలు,

శుక్ర దశ 20 సంవత్సరాలు,

రవి దశ 6 సంవత్సరాలు,

చంద్ర దశ 10 సంవత్సరాలు,

కుజ దశ 7 సంవత్సరాలు,

రాహు దశ 18 సంవత్సరాలు,

గురు దశ 16 సంవత్సరాలు,

శని దశ 19 సంవత్సరాలు గా అనుభవంలోకి వస్తాయి. 

వీరికి మొదటి సంవత్సరం జ్వర భయం, 4 వ యేట జంతుభయం, 8 వ యేట అగ్నిభయం, 11 యేట వాహన లేదా ఇతర ప్రమాదాలు, 27 వ యేట జంతు, పక్షి, క్రిమీ కీటకాది భయాలు, 30 వ యేట మరియు 63 వ ఏట అపమృత్యువు. దాటితే, 86 సంవత్సరాలు దాకా ఆయుర్దాయం. ఆశ్లేష చివరి రెండు ఘడియలు జననం దోషం. 

మొదటి పాదం శుభం. రెండో పాదం శిశువుకు, మూడవ పాదం తల్లికి, నాల్గవ పాదం తండ్రికి దోషం. ఆశ్లేష బలి, నక్షత్ర శాంతి హోమం జపం చేయాలి శాంతి అవసరం. ఆరుతారలతో సర్ప ఆకారంలో ఉంటుంది ఈతార. వరుసగా 4 పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయి. 

మొదటి పాదం ధనూర్నవాంశ కావున బుద్ధిబలం కలిగి భాగ్యవంతులు అవుతారు ధైర్యం ఉంటాయి. రెండవ పాదం మకర నవాంశ కావున మొండితనం, తీవ్ర స్వభావం ఉంటాయి. మూడవ పాదం కుంభ నవాంశ కావున కఠినబుద్ధి, సోమరితనం ఉంటాయి. నాల్గవ పాదం మీన నవాంశ వ్యాధి పీడ, ఏక సంతాగ్రహి, ధనార్జన ఎక్కువ. 

ఆశ్లేష అధిపతి బుధుడు కావున వీరు బుధగ్రహ జప, స్తోత్ర పఠనం చేస్తూ ఉండాలి. బుధ గ్రహానికి అధిపతి విష్ణువు కావున విష్ణు సహస్రనామం పారాయణ చేయుట ఉత్తమం. అలాగే, తాంత్రికధిపతి మాతంగి కావున అమ్మవారి జప ఉపాసన చేయుట కూడా ఉత్తమం.


సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు


వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

ఆశ్వయజమాన కథ

 


శ్రీ సంకష్టహర గణపతయే నమః

పార్వతీదేవి "గణపతితో గణపతి ! ఆశ్వయుజ మాసమున శ్రీ సంకష్ట హర చతుర్థీ వ్రతమును, ఎట్లు ఆచరించవలెనో, ఎవరు ఆచరించి, ఎట్టి ఫలమును పొందిరో వివరింపుము అని కోరగా గణపతి వివరించెను.

అమ్మా ! పార్వతీదేవి ! శ్రీ కృష్ణుడు ధర్మరాజుకు చెప్పిన విశేషములు నీకును వివరింతును. ఆశ్వయుజ కృష్ణచతుర్థినాడు గణపతిని గజాననుడుగా పూజించవలెను.

నిర్మలమైన మనస్సుతో నన్ను ధ్యానించి, దూర్వాయుగ్మములతో బిల్వదళములతో (గరిక, మారెడు) పూజించి ఫలములు, మోదకములు (కుడుములు) నివేదింపవలెను.

బాణాసురిని పుత్రిక ఉష నిద్రించుండ, స్వప్నమున అనిరుద్ధుని చూచి, అతని సౌందర్యమును మెచ్చి, అతనినే వివాహమాడవలెనని తలంచి, ఇదియెట్లు సాధ్యమగునా? యని వ్యాకుల మనస్కమయ్యెను.

పిదప తన చెలికత్తెను పిలిచి చెలీ నేను కలలో అనిరుద్ధుని వివాహమాడితిని. కనుక నీవు ఎట్లుయినను ప్రయత్నించి నా మనోనాథుని ఇచ్చటికి తీసికొనిరమ్ము లేనిచో నేను బ్రతుకను అని చెప్పగా చెలికత్తె చిత్రలేఖ, ఉష కోరికను నెరవేర్చుటకై సాయం సమయమునకు ద్వారకా నగరమును చేరి, గోధూళివేళ తన మాయాబలమున అనిరుద్దుని గైకొనివచ్చి, ఉషామందిరమున జేర్చెను.

రాత్రి యయినను ఇంటికి రాకున్న అనిరుద్దునికై ప్రద్యుమ్నుడు (తండ్రి) మిక్కిలి వగచి, ఈ వార్త తన తల్లిదండ్రులగు రుక్మిణి శ్రీకృష్ణునకు విన్నవించెను. వారును మనుమని అదృశ్యవార్త విని మిక్కిలి చింతింపసాగిరి.

రుక్మిణి దుఃఖమును భరింపలేక శ్రీకృష్ణునితో నాథా! నామనుమడుగు అనిరుద్దుని చూడకనే నొక్కక్షణమైన మనజాలను. అతడు నాకు ప్రాణములకన్నామిన్న. కనుక వెంటనే అనిరుద్దుని తెచ్చి నాముందుంచుము. అని విలపించెను.

అంతట సర్వజ్ఞుడు, లీలామానుష విగ్రహుడు, జగన్నాటకసుత్రధారియగు శ్రీకృష్ణుడు రుక్మిణి కోర్కెనెరవేర్చుటకై సభకేతెంచి అచ్చట నున్న లోమశ (రోమశ) మహర్షిని జూచి నమస్కరించి ఋషిశ్వరా ! నామనుమని అనిరుద్ధుని ఎవరు తీసికొనిపోయిరో, వారు ఇప్పుడు ఎక్కడనున్నాడో ? ఏమైనాడో! తెలియకున్నది, మీరు దివ్యదృష్టితో చూచి సర్వము వివరింపుడు అని ప్రార్థింపగా, లోమశ మహర్షి దేవా శ్రీకృష్ణా ! సర్వము తెలిసియు, నన్నిట్లు ప్రశింతువా?

ఏమి నీ లీలా ! నీ మనుమడుగు అనిరుద్ధుని బాణాసురుని కుమార్తె ఉషభర్తగా వరించి చెలికత్తె వలన మాయోపాయమును తెప్పించుకొని, తన అంతఃపురమున దాచియున్నది. ఈ విషయము నారదముని వలన తెలిసినది. మీరు శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతమును ఆచరించి గణపతిని పూజింతురేని, మీ మనమని పొందగలరు అని చెప్పెను.

అంతట శ్రీకృష్ణుడు మునులవలన ఈ వ్రతవిధానమును తెలిసికొని, కల్పోక్త ప్రకారముగ రుక్మిణీయుతడై ఈ వ్రతమును ఆచరించెను. తత్పలముగా బాణాసురునితో యుద్ధముచేసి వాని హస్తములను ఖండించి, విజయము నొంది, ఉషానిరుద్దులను స్వీక రించి ద్వారకా నగరము చేరి, పుత్రపౌత్రాదులతో సుఖముగా నుండెను. 

కనుక అమ్మా! వ్రతము గొప్ప ప్రభావముగలది. దీనిని ఆచరించుటచే సర్వవిఘ్నములు తొలగును. సర్వపుణ్యతీర్థములు సేవించిన ఫలము చేకూరును. అని చెప్పెను.

ఇది శ్రీకృష్ణ యుధిష్ఠిరసంవాదాత్మకమైన శ్రీసంకష్టహర చతుర్థీవ్రతమును ఆశ్వయుజ మాస కథ సమాప్తము.

మూకం కరోతి వాచాలం, పంగులం లంఘయతే గిరిమ్,

యత్కృపాత మహం వందే పరమానందమాధవమ్,

శ్రీకృష్ణార్పణమస్తు

శ్రీ మహాగణపతి ప్రసాదసిద్ధిరస్తు

ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః


సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు


వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

నిత్యరాశీఫలాలు

 



/నవంబర్ 0️⃣1️⃣/2️⃣0️⃣2️⃣3️⃣సౌమ్యవాసరే (బుధవారము)

 రాశి ఫలాలు 

👉సంతృప్తికరమైన జీవితం కోసం మీరు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకొండి. బిజినెస్ అప్పుకోసం వచ్చిన వారిని, చూడనట్లుగా వదిలెయ్యండి. వ్యక్తిగత స్థాయిలో మీకు బాగా దగ్గరివారు సమస్యలను సృష్టించవచ్చును. ఈరోజు మీ ప్రేమ మీరు ఎంత అందమైన పనిచేసారో చూపడానికి వికసిస్తుంది. మీరు ఈరోజుమొత్తం మిరూములో కూర్చుని పుస్తకము చదవడానికి ఇష్టపడతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో స్పెషల్ చేయవచ్చు. అవసరమైన సమయంలో మీస్నేహితులు మీకు సహాయసహకారాలు అందించరుఅని భావిస్తారు.

🔴అదృష్ట సంఖ్య :- 7️⃣

🟢అదృష్ట రంగు :- లేత తెలుపు మరియు తెలుపు

🟤చికిత్స :- క్రమంగా మీ ఇంటి వద్ద ప్రధాన దేవత యొక్క వెండి విగ్రహన్నీ బలమైన ఆర్ధిక స్థితి కోసం ఆరాధించండి

🐂వృషభరాశి

వృషభ రాశి ఫలాలు 

మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది. చాలామంది, మ్మటలతోనే పొగుడుతారు. ఎవరైతే చాలాకాలం నుండి ఆర్ధికసమస్యలను ఎదురుకుంటున్నారో వారికి ఎక్కడనుండిఐనమీకు ధనము అందుతుంది,ఇది మీయొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది. కుటుంబ సభ్యులు, మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు. ఈ రోజంతా ప్రేమసంబంధమైన గుర్తులు ఆక్రమించుకుంటాయి. ఈరాశిలోఉన్న వివాహితులు వారిపనులనుపూర్తిచేసుకున్న తరువాత ఖాళి సమయాల్లో టీవీ చూడటము,ఫోనుతో కాలక్షేపం చేస్తారు. మీరు, మీ భాగస్వామి ఈ రోజు ఓ అద్భుతమైన వార్తను అందుకుంటారు. ఈరోజు,ఎవరైతే కుటుంబానికి దూరంగా నివసిస్తున్నారో వారువారియొక్క కుటుంబాన్ని మిస్అవుతున్నారు,కావున మీ కుటుంబసభ్యుట్లతో మాట్లాడి మీయొక్క మనస్సును కుదుటపర్చుకోండి.

అదృష్ట సంఖ్య :- 6

అదృష్ట రంగు :- పారదర్శక మరియు చంద్రిక

చికిత్స :- మీ వ్యవసాయ అలవాట్లు కోసం ఒక ఆకుపచ్చ సీసా లేదా కుండ లో మనీ ప్లాంట్ నాటండి.

💑మిధునము

మిథున రాశి ఫలాలు 

మీకుమీరే మరింత ఆశావహ దృక్పథం వైపుకి మోటివేట్ చేసుకొండి. అది మీలో విశ్వాసాన్ని , సరళతను పెంచుతుంది. కానీ అదేసమయంలో మీలోని వ్యతిరేక భావోద్వేగాలైన భయం, అసహ్యత, ఈర్ష్య, పగ ద్వేషం వంటివాటిని విసర్జించ డానికి సిద్ధపరచాలి. ఇతరులను మురిపించాలని మరీఎక్కువగా దూబరా ఖర్చు పెట్టకండి. మీ చక్కని ఆరోగ్యం కొరకు, బయట ఎక్కువ దూరం నడవండి. ప్రేమవ్యవహారాలలో బలవంతపెట్టడం మానండి. ఈరాశికి చెందినవారు ఈరోజు ఇతరులను కాలవటముకంటే ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతారు.మీరు ఖాళి సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోడానికి కేటాయిస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు తీవ్రంగా గొడవపడవచ్చు. ఈరోజు ప్రారంభం చాలా అద్వీతీయంగా ఉంటుంది.మిమ్ములను రోజంతా ఉత్తేజపరుస్తుంది.

అదృష్ట సంఖ్య :- 4

అదృష్ట రంగు :- గోధుమ రంగు మరియు బూడిద రంగు

చికిత్స :- మీ భాగస్వామికి ఏదైనా పాలరాయి ఆధారిత వస్తువు/ స్మృతి చిహ్నము ఇవ్వండి మరియు మీ ప్రేమ జీవితం పరస్పరం ప్రయోజనకరంగా మరియు సంతృప్తికరంగా చేయండి.

🦀కర్కాటకము

కర్కాటక రాశి ఫలాలు 

ఆరోగ్యం చక్కగా ఉంటుంది. మదుపు చేయడం మంచిదే కానీ సరియైన సలహా తీసుకొండి. మీ శ్రీమతితో మాట్లాడి, పెండింగ్ లో గల ఇంటిపనులను ముగించడానికి ఏర్పాటుచేయండి. మీరు చాలా పేరుపొందుతారు, వ్యతిరేక లింగం వారిని సులువుగా ఆకర్ష్స్తారు. పన్ను మరియు బీమా విషయాలు కొంత ధ్యాసను కోరుతాయి. మీ జీవిత భాగస్వామితో మీకున్న పాత మధురానుభూతులను గురించి మీ పాత మిత్రుడొకరు మీకు గుర్తు చేయవచ్చు. పాఠశాలలో మీరు మీయొక్క సీనియర్లతో గొడవపడతారు,ఇదిమీకు మంచిదికాదు.కావున మీరు మీకోపాన్ని నియంత్రించుకోవటము మంచిది.

అదృష్ట సంఖ్య :- 8

అదృష్ట రంగు :- నలుపు మరియు నీలం

చికిత్స :- మంచి ఆర్ధిక ఆదాయాన్ని పొందటానికి, మద్యపానం మరియు మాంసాహారాన్ని రద్దు చేయండి. అలాగే, హింసాత్మక మరియు క్లిష్టమైన ప్రవర్తన మరియు మోసం చేసే ధోరణులను నివారించండి

🦁సింహరాశి

సింహ రాశి ఫలాలు 

విచారాన్ని తరిమెయ్యండి- అది మిమ్మల్ని ఆవరించి, మీ అభివృద్ధికి అడ్డుపడుతున్నది. మీయొక్క పాతమిత్రుడు మిమ్ములను ఆర్ధికసహాయము అడిగేఅవకాశము ఉన్నది,దీనివలన మీరుఆర్ధికంగా కొంత నీరసంగా ఉంటుంది. మీ సామాజిక జీవితాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. కొంత వీలుచేసుకునైనా పార్టీలు వంటివాటికి మీ కుటుంబ సభ్యులతో హాజరు అవుతూ ఉండండి. అది మీ మూడ్ ని రిలాక్స్ చెయ్యడమే కాక మీలోని సందిగ్ధత ని కూడా తొలగిస్తుంది. ఈరోజు సహజ సౌందర్యాన్ని చూసి తడబడతారు. శాస్త్రోక్తమైన కర్మలు/ హోమాలు/ పవిత్రమైన వేడుకలు ఇంటిలో నిర్వహించబడతాయి. పెళ్లంటే కేవలం సెక్స్ మాత్రమేననే వాళ్లు నిజానికి అబద్ధం చెబుతున్నారు. ఎందుకంటే నిజమైన ప్రేమంటే ఏమిటో ఈ రోజు మీరు తెలుసుకోనున్నారు. ఈరోజు,మీకుటుంబసభ్యులు మిమ్ములను,మీరు చెప్పేవిషయాలను పట్టించుకోరు.దీనివలన వారుమీయొక్క కోపానికి గురిఅవుతారు.

సంఖ్య :- 6

అదృష్ట రంగు :- పారదర్శక మరియు చంద్రిక

చికిత్స :- దీపం వెలిగించి కొన్ని నలుపు మరియు తెలుపు ఎరుపు గింజలు జోడించండి. ఈ పరిష్కారం కోల్పోయిన కుటుంబ ఆనందాన్ని పునరుద్ధరించడం మరియు దగ్గరి కుటుంబ బంధాల కోసం మార్గం సుగమం చేస్తుంది

💃🏼కన్యరాశి

కన్యా రాశి ఫలాలు 

మీ వ్యక్తిగత సమస్యలు, మానసిక ప్రశాంతతను నాశనం చేస్తాయి. కానీ మీకు మీరే మానసిక వ్యాయామాలు వంటివి అంటే వత్తిడిని దాటడానికి పనికివచ్చే ఏదోఒక ఉత్సుకత కలిగించేవి చదవడంలో లీనమవండి. ఈరాశిలోఉన్న వివాహము అయినవారికి వారియొక్క అత్తామావయ్యలనుండి ఆర్ధికప్రయోజనాలను పొందుతారు. ఈ రోజు మీ ఇంటి లోపల బయట కూడా పెను మార్పులు చేసే అవకాశం హెచ్చుగా ఉన్నది. ఈరోజు,మీరు అనుభవిస్తున్న జీవితసమస్యలను మీ భాగస్వామితో పంచుకుంటారు.కానీ వారుకూడా వారిసమస్యలను చెప్పుకోవటంవలన మీకు ఇది మరింత విచారాన్ని కలిగిస్తుంది. మీరు మీయొక్క ఖాళీసమయములో ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తారు.అయినప్పటికీ మీరు దీనిమీద ధ్యాస పెట్టటమువలన ఇతరపనులు ఆగిపోతాయి. మీ మూడీనెస్ ను మీ జీవిత భాగస్వామి కొన్ని ప్రత్యేకమైన సర్ ప్రైజ్ ల ద్వారా చక్కగా మార్చేస్తారు. ఈరోజు, మీరు అప్పుగా ఇచ్చిన ధనము మీకు తిరిగివస్తుంది.దీనివలన మీరు అన్ని ఆర్ధికసమస్యలనుండి బయటపడతారు.

అదృష్ట సంఖ్య :- 5

అదృష్ట రంగు :- ఆకుపచ్చ మరియు త్సామనము

చికిత్స :- ఒక మంచి ప్రేమ జీవితం కోసం, వెండి వస్తువులు మరియు వజ్రాభరణాల బహుమతిగా ఇచ్చుకోండి.

⚖తులారాశి

తులా రాశి ఫలాలు 

వత్తిడిని తొలగించుకోవడానికి మీపిల్లతో విలువైన సమయాన్ని కొంతసేపు గడపండి. ముఖ్యమైన వ్యక్తులు, వారికి ప్రత్యేకం అనిపిస్తే, నచ్చినట్లైతే, దేనికొరకు అయినా సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమౌతారు. మనుషులు మీకు బోలెడు ఆశలు కలలు కలిగించవచ్చును- కానీ మీ పరిశ్రమ పైనే అంతా ఆధారపడి ఉంటుంది. ఈ రోజు, గుడ్డిప్రేమను సాధించగలుగుతారు. మీ అభిప్రాయాన్ని కోరినప్పుడు, మొహమాటం, సిగ్గు పడకుండా తెలియచేయండి- ఏమంటే మీరు మంచి ప్రశంసలు పొందుతారు. మీ జీవిత భాగస్వామి అనుకోకుండానే ఏదో చక్కని పని చేయవచ్చు. అది నిజంగా మీకు మరపురానిదిగా మిగిలిపోవచ్చు. మీకుటుంబసభ్యులు ఏదైనాపనిచేయమని లేదా వారాంతంలోచేయమని ఒత్తిడితెస్తుంటే మీకుఅది సాదారణముగా చికాకును కలిగిలిస్తుంది.మీరు మీయొక్క కోపాన్ని నియంత్రించుకోండి.

అదృష్ట సంఖ్య :- 7

అదృష్ట రంగు :- లేత తెలుపు మరియు తెలుపు

చికిత్స :- భౌతికంగా సవాలు చేయబడిన మరియు వికలాంగులకు, తీపి పదార్థాలను ఇవ్వడం ద్వారా కుటుంబన్నీ సంతోషకరంగా మార్చుకోవచ్చు.

🦞వృశ్చికరాశి

వృశ్చిక రాశి ఫలాలు 

ఇతరుల అవసరాలు, మీ కోరికతో ముడిపడి ఉండడం వలన కాస్త జాగ్రత్తగా ఉండండి- మీ భావాలను పట్టిఉంచకండి. అలాగే, రిలాక్స్ అవడానికి అవసరమైన అన్నిటినీ చెయ్యండి. ఈరోజు డబ్బు విపరీతంగా ఖర్చుఅవుతుంది.మీరు ఆర్ధికంగా కూడా ఇబ్బందులు ఎదురుకుంటారు. ఆరోగ్యం బాగులేని బంధువు ఇంటికి చూడడానికి వెళ్ళండీ. ప్రేమ విషయంలో బానిసలాగ ఉండకండి. మీరు ఈరోజుమొత్తం మిరూములో కూర్చుని పుస్తకము చదవడానికి ఇష్టపడతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఇతరుల ప్రభావంలో పడి మీతో గొడవ పడవచ్చు. కానీ మీ ప్రేమ, సహానుభూతి వల్ల చివరికి అంతా సర్దుకుంటుంది. ఈరోజు,మీ ప్రయాణములో ఒకబాటసారి మీకు చికాకును తెప్పిస్తాడు.

అదృష్ట సంఖ్య :- 9

అదృష్ట రంగు :- ఎరుపు మరియు పసను

చికిత్స :- వేయించిన ఆహారాన్ని (పకోడా) కాకులకు తినపించడం ద్వారా సంతోషంగా మరియు ఆరోగ్యకరమైన ఉండండి (కాకులు శనిగ్రహముచే పాలింపబడతాయి)

🏹ధనుః రాశి

ధనుస్సు రాశి ఫలాలు 

ఒక తమాషా పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తే క్రుంగిపోకండి. ఆహారానికి ఉప్పుతోనే రుచితెలిసినట్లు, కొంత విచారం ఉండడం అవసరం. అలాగ ఉన్నప్పుడే, మీరు సంతోషపు విలువను గుర్తిస్తారు. కొన్ని సామాజిక సమావేశాలకు హాజరయి మీ మూడ్ ని మార్చుకొండి. మీరు మీ మిత్రులలో ఎవరైతే అప్పుఅడిగి తిరిగి సెల్లించకుండా ఉంటారో వారికి దూరంగా ఉండండి. కుటుంబంతో కలిపి సామాజిక కార్యక్రమాలు అమితమైన ఆనందాన్నిస్తాయి. మీ ప్రేమ జీవనం, వివాహ ప్రస్తావనతో జీవితకాల బంధం కావచ్చును. ఈరోజు మీచేతుల్లో ఖాళీసమయము చాలా ఉంటుంది,మీరుదానిని ధ్యానంచేయడానికి ఉపయోగిస్తారు.దీనివలన మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. మీ జీవిత భాగస్వామి ముందెన్నడూ లేనంత అద్భుతంగా ఈ రోజు కన్పించడం ఖాయం. తననుంచి ఈ రోజు మీరు ఓ చక్కని సర్ ప్రైజ్ అందుకోవచ్చు. ఈరోజు మీ తల్లితండ్రులకు ఇష్టమైన ఆహారాన్ని వారికి చెప్పకుండా బయటనుండి తీసుకువచ్చి వారిని ఆశ్చర్యపరుస్తారు.దీనివలన కుటుంబవాతావరణము కూడా బాగుంటుంది.

అదృష్ట సంఖ్య :- 6

అదృష్ట రంగు :- పారదర్శక మరియు చంద్రిక

చికిత్స :- మీ ఆర్ధిక పరిస్థితి మెరుగుపరుచుకోవడానికి, “ఓం హమ్ హనుమతే నమః” మంత్రాన్ని 11 సార్లు ఉదయాన్నే పఠించండి.

🐊మకర రాశి

మకర రాశి ఫలాలు 

మీ కుటుంబంతో సమయం గడుపుతూ, అందరికీ దూరంగా ఉన్నట్లు, ఒంటరినన్న భావనను వదిలిపెట్టండి. మీ ఆశలు నెరవేరుతాయి. మీకు ఇంతవరకు లభించిన ఆశీస్సులు, అదృష్టాలు కలిసి వస్తాయి- గతంలో మీరుపడిన కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు దొరుకుతుంది. మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. మీ లవర్ తో బయటకు వెళ్ళినప్పుడు, మీ ఆహార్యంలో, ప్రవర్తనలో, సహజంగా ఉండండి. మీకు ఖాళీసమయము దొరికినప్పటికీ మీరు మీకొరకు ఏమి చేసుకోలేరు. మీ జీవిత భాగస్వామితో కలిసి ఈ రోజు సాధారణం కంటే చాలా స్పెషల్ గా మీకు గడవనుంది. మీరు ఈరోజు మీఅందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు,ముఖ్యంగా కేసలాంకరణకు,వస్త్రధారణకు సమయము కేటాయిస్తారు.దీనితరువాత మీరు మీపట్ల సంతృప్తిని పొందుతారు.

అదృష్ట సంఖ్య :- 6

అదృష్ట రంగు :- పారదర్శక మరియు చంద్రిక

చికిత్స :- ఎల్లప్పుడూ ఆరోగ్య శరీరం మరియు మనస్సు కోసం మీ జేబులో సమీపంలోని వస్త్రంలో పసుపు గుడ్డని ఉంచండి. పసుపురంగు ఒక గొప్ప మానసిక స్థితిని పెంచేది

⚱కుంభరాశి

కుంభ రాశి ఫలాలు 

బయటజరిగే ఔట్ పార్టీలు, ఆహ్లాద కరమైన జాంట్ లు ఈరోజు మిమ్మల్ని మంచి మూడ్ లో ఉంచుతాయి. మీ ఇంటిగురించి మదుపు చెయ్యడం లాభదాయకం. యువతను కలుపుకుంటూ పోయే కార్యక్రమాలలో నిమగ్నం కావడానికి ఇది మంచి సమయం. ఇవాళ మీరొకరిని కలవబోతున్నారు. వారు మీ హృదయానికి బలంగా తాకి, మనసుకు నచ్చుతారు. మీరు మీ సమయాన్ని స్నేహితుడితో సమయాన్ని గడుపుతారు,కానీ మత్తుపానీయాలనుండి దూరంగా ఉండండి. ఇది వృధాసమయము లాంటిది. మీ జీవిత భాగస్వామి ముందెన్నడూ లేనంత అద్భుతంగా ఈ రోజు కన్పించడం ఖాయం. తననుంచి ఈ రోజు మీరు ఓ చక్కని సర్ ప్రైజ్ అందుకోవచ్చు. మొక్కలు పెంచటంవలన మీకు మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది.ఇది పర్యావరణానికి కూడా మంచిది.

అదృష్ట సంఖ్య :- 4

అదృష్ట రంగు :- గోధుమ రంగు మరియు బూడిద రంగు

చికిత్స :- నిరంతర మంచి ఆరోగ్యానికి ఒక రాగి గాజు ధరించాలి

🐟మీనరాశి

మీన రాశి ఫలాలు 

మీ యొక్క ఒక స్వార్థపూరితమైన స్నేహితుని వలన/ పరిచయస్థుని వలన, మీ మానసిక ప్రశాంతతకుచికాకు కలుగుతుంది. ఈరోజు మీకు ఆర్థికప్రయోజనాలు కలిగే సూచనలు ఉన్నవి,కానీ మీయొక్క దూకుడు స్వభావముచేత మీరు అనుకుంతాగా ప్రయోజనాలను పొందలేరు. మీరు ఒంటరిగా అనిపించినప్పుడు మీ కుటుంబం సహారా తీసుకొండి. అది మిమ్మల్ని నిస్పృహనుండీ కాపాడుతుంది. ఇంకా మీరు తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. ప్రేమలో ఎగుడుదిగుడులను ఎదుర్కోవడానికి చిరునవ్వును, ధైర్యాన్ని, సాహసస్వభావాన్ని కలిగిఉండండి. మీ శరీర వ్యవస్థలోని తక్కువ శక్తి, దీర్ఘకాలిక విషంలా పనిచేస్తుంది. మీరు ఏదోఒక స్జనాత్మకత గల పనిని చేసుకుంటూ ఉండాలి, మిమ్మల్ని మీరు బిజీగా ఉంఛుకోవాలి. రోగంతో పోరాడాలని నిర్ణయించుకుంటూ మోటివేట్ చేసుకుంటూ ఉండండి. మీకు, మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలు తెచ్చిపెట్టేందుకు ఎవరో ప్రయత్నించవచ్చు. కానీ మీరిద్దరూ ఏదోలా సర్దుబాటు చేసుకుంటారు. స్పా చేయించుకున్నతరువాత మీరు ఉత్సాహముగా కనిపిస్తారు.

అదృష్ట సంఖ్య :- 1

అదృష్ట రంగు :- ఆరెంజ్ మరియు బంగారం


సర్వేజనా సుఖినో భవంతు


శుభమస్తు


వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

 




 శ్రీ గురుభ్యోనమః🙏🏻

బుధవారం, నవంబరు 1,2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - శరదృతువు

ఆశ్వయుజ మాసం - బహుళ పక్షం

తిథి:చవితి రా10.48 వరకు  

వారం:బుధవారం (సౌమ్యవాసరే)

నక్షత్రం:రోహిణి ఉ6.08

యోగం:పరిఘము సా5.09 వరకు

కరణం:బవ ఉ10.51 వరకు తదుపరి బాలువ రా10.48 వరకు

వర్జ్యం:ఉ11.53 - 1.31

దుర్ముహూర్తము:ఉ11.21 - 12.07

అమృతకాలం:రా9.44 - 11.23

రాహుకాలం:మ12.00 - 1.30

యమగండ/కేతుకాలం:ఉ7.30 - 9.00

సూర్యరాశి:తుల

చంద్రరాశి:వృషభం

సూర్యోదయం:6.02

సూర్యాస్తమయం:5.27

సంకష్టహర చతుర్థి


సర్వేజనా సుఖినో భవంతు


శుభమస్తు


వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

షోడశ గౌరి వ్రతము_పూజ విధానం

 



భూ శుద్ధి :

ఇంటిలో ఈశాన్య మూలలో స్థలమును శుద్దిచేసి , అలికి , బియ్యపు పిండితో గాని , రంగుల చూర్ణములతో గాని , ముగ్గులు పెట్టి , దైవ స్థాపన నిమిత్తమై ఒక పీటను వేయాలి పీట మరీ ఎత్తుగా గాని , మరీ పల్లముగా గాని ఉండకూడదు. పిదప ఆ పీటకు కూడా చక్కగా పసుపు వ్రాసి , కుంకుమతో బొట్టు పెట్టి , వరి పిండి (బియ్యపు పిండి )తో ముగ్గు వేయాలి సాదారణంగా అష్ట దళ పద్మాన్నే వేస్తారు. పూజ చేసేవారు తూర్పు ముఖంగా కూర్చోవాలి .ఏ దైవాన్ని పూజించ బోతున్నారో ఆ దైవం యొక్క ప్రతిమను గాని , చిత్రపటం గాని ఆ పీటపై ఉంచాలి. ముందుగా పసుపుతో గణపతిని తయారు చేసి (పసుపును షుమారు అంగుళం సైజులో త్రికోణ ఆకృతిలో ముద్దగా చేసి ) దానికి కుంకుమ బొట్టు పెట్టి , పిదప ఒక పళ్ళెంలో గాని , క్రొత్త తుండు గుడ్డ మీద గాని బియ్యం పోసి దానిపై ఒక తమలపాకు ఉంచి , అందు పసుపు గణపతి నుంచి అగరువత్తులు వెలిగించాలి. ఇప్పుడు పూజకు కావలసిన వస్తువులను అమర్చుకోవాలి. దీపారాధన నైరుతి దిశలో చేయవలెను.

దీపారాధనకు కావలసిన వస్తువులు - దీపారాధన విధానము :

దీపారాధన చేయుటకు కుంది (ప్రమిద ) వెండిది గాని , ఇత్తడి ది గాని , మట్టిది గాని వాడ వచ్చును. కుందిలో 3 అడ్డ వత్తులు 1 కుంభ వత్తి (మధ్యలో ) వేసి నూనెతో తడపవలెను. ఇంకొక అడ్డ వత్తి నూనెతో తడిపి ఏక హారతిలో(కర్పూర హారతికి వాడే వస్తువు ) వేసి ముందుగా ఏక హారతిలో వేసిన వత్తిని అగ్గిపుల్లతో వెలిగించి , వెలిగించిన వత్తితో కుందిలోని 1 అడ్డ వత్తి 1 కుంభ వత్తి వెలిగించ వలెను. తర్వాత చేయి కడుక్కుని నూనె కుంది నిండా వేసి పిదప ఆ కుందికి మూడు చోట్ల కుంకుమ అలంకారము చేయవలెను. తర్వాత అక్షతలు వేసి దీపారాదనను లక్ష్మీ స్వరూపముగా భావించి నమస్కారము చేయవలెను. కుందిలో మిగిలిన రెండు అడ్డ వత్తులు పూజా సమయంలో ధూపము చూపిన తరువాత దీపము చూపించుటకు వాడవలెను. దీపారాధనకు నువ్వుల నూనెగాని , కొబ్బరి నూనెగాని , ఆవు నెయ్యి గాని వాడవచ్చును. ఈ విధంగా దీపం వెలిగించి ఘంటను వాయిస్తూ నమస్కరించి ఈ క్రింది శ్లోకమును చదువు కొనవలెను.

ఘంటా నాదము :

శ్లో || ఆగ మార్ధంతు దేవానాం గమనార్ధంతు రక్ష సామ్

కుర్యా ద్ఘంటారవం తత్ర దేవతా హ్వాహన లాంచనమ్

మనము ఆచమనము చేసినటువంటి పంచ పాత్రలోని నీళ్ళు దేవుని పూజకు వినియోగించ రాదు. పూజకు విడిగా ఒక గ్లాసు గాని , చెంబు గాని తీసుకుని దానిలో శుద్ధ జలమును పోసి ఆ చెంబునకు కలశారాధన చేసి ఆ నీళ్ళు మాత్రమే దేవుని పూజకు ఉపయోగించ వలెను.

పూజకు కావలసిన వస్తువులు :

షోడస గౌరీ దేవి ఏ వ్రతమును (పూజను ) ఆచరించు చున్నామో ఆ దేవుని యొక్క బొమ్మ (ప్రతిమ ) (తమ శక్తి కొలది బంగారముతో నైనను , వెండితో నైనను లేక మట్టితో నైనను తీసుకొనవలెను ), లేదా చిత్ర పటము , మండపమునకు మామిడి ఆకులు ,అరటి మొక్కలు , కొబ్బరి కాయలు , పళ్ళు , పువ్వులు , పసుపు , కుంకుమ , గంధం, హారతి కర్పూరం , అక్షతలు , అగ్గి పెట్టె , అగరువత్తులు , వస్త్ర , యజ్నోపవీతములు , తోరములు , (తెల్లని దారమునకు పసుపు రాసి 9 వరుసలు (పోగులు ) వేసి 9 చోట్ల పువ్వులతో కట్టి , ఈ తోరములను దేవునికి పూజ చేసి పూజచేసిన వారందరూ కుడి చేతికి ధరిస్తారు. ప్రత్యేక నివేదన (పిండి వంటలు )

(పూజ చేసేవారు ) ఈ దిగువ కేశవ నామాలను స్మరిస్తూ ఆచమనం చేయాలి. ఈ నామములు మొత్తం 24 కలవు.

1. ఓం కేశవాయ స్వాహా " అని చెప్పుకొని చేతిలో నీరు తీసుకొని లోనికి తీసుకోవాలి

2 . " ఓం నారాయణాయ స్వాహా "అనుకొని ఒకసారి

3 . " ఓం మాధవాయ స్వాహా " అనుకొని ఒకసారి జలమును పుచ్చుకోనవలెను. తరువాత

4 . " ఓం గోవిందాయ నమః " అని చేతులు కడుగు కోవాలి .

5 . " విష్ణవే నమః " అనుకుంటూ నీళ్ళు త్రాగి , మధ్య వ్రేలు , బొటన వ్రేళ్ళతో కళ్ళు తుడుచుకోవాలి.

6 . " ఓం మధుసూదనాయ నమః " అని పై పెదవిని కుడి నుంచి ఎడమకి నిమురుకోవాలి.

7. ఓం త్రివిక్రమాయ నమః క్రింది పెదవిని కుడి నుంచి ఎడమకి నిమురుకోవాలి.

8. ఓం వామనాయ నమః

9. ఓం శ్రీధరాయ నమః " ఈ రెండు నామాలు స్మరిస్తూ తలపై కొంచెం నీళ్ళు చల్లు కోవాలి.

10 . ఓం హృషీ కేశాయ నమః ఎడమ చేతిలో నీళ్ళు చల్లాలి.

11. ఓం పద్మనాభాయ నమః పాదాలపై ఒక్కొక్క చుక్క నీరు చల్లు కోవాలి.

12. ఓం దామోదరాయ నమః శిరస్సుపై జలమును ప్రోక్షించు కోవలెను.

13. ఓం సంకర్షణాయ నమః చేతి వ్రేళ్ళు గిన్నెలా వుంచి గడ్డము తుడుచుకోనవలెను .

14. ఓం వాసుదేవాయ నమః వ్రేళ్ళతో ముక్కును వదులుగా పట్టుకొనవలెను .

15. ఓం ప్రద్యుమ్నాయ నమః 

16. ఓం అనిరుద్దాయ నమః నేత్రాలు తాకవలెను .

17. ఓం పురుషోత్తమాయ నమః

18. ఓం అధోక్షజాయ నమః రెండు చెవులూ తాక వలెను

19. ఓం నార సింహాయ నమః 

20. ఓం అచ్యుతాయ నమః బొడ్డును స్పృశించ వలెను.

21. ఓం జనార్ధనాయ నమః చేతి వ్రేళ్ళతో వక్ష స్థలం , హృదయం తాకవలెను.

22. ఓం ఉపేంద్రాయ నమః చేతి కొనతో శిరస్సు తాకవలెను.

23. ఓం హరయే నమః

24. ఓం శ్రీ కృష్ణాయ నమః కుడి మూపురమును ఎడమ చేతి తోను, ఎడమ మూపురమును కుడి చేతితోను ఆచమనం చేసిన తరువాత ఆచమనం చేసి , వెంటనే సంకల్పము చెప్పుకోనవలెను.

ఆచమనము అయిన తరువాత , కొంచెం నీరు చేతిలో పోసుకుని నేలపై చిలకరించుతూ ఈ శ్లోకమును పటించవలెను .

శ్లో || ఉత్తిష్టంతు భూత పిశాచాః యేతే భూమి భారకాః

యేతేషామ విరోదేన బ్రహ్మ కర్మ సమారభే ||

ప్రాణాయామమ్య: ఓం భూ : -ఓం భువః ఓం సువః - ఓం మహః -ఓం జనః ఓం తపః - ఓగ్ సత్యం -ఓం తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహీ దీయో యోనః ప్రచోదయాత్ - ఓం ఆపోజ్యోతిర సోమృతం బ్రహ్మ భూర్భువ స్సువరోం అని సంకల్పము చెప్పు కొనవలెను.

సంకల్పము: మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభన ముహూర్తే అద్య బ్రాహ్మణః (ఇక్కడ శ్రీ మహా విష్ణో రాజ్ఞాయ అని కూడా చెప్పవచ్చు ) ద్వితీయ పరార్దె శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమ పాదే జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే మేరోర్దక్షిణ దిగ్బాగే శ్రీ శైలస్య ఈశాన్య ప్రదేశే (మనకు శ్రీశైలము ప్రధాన క్షేత్రము కావున మనము శ్రీశైలమునకు ఏ దిక్కున ఉన్నామో ఆ దిక్కు చెప్పుకొనవలెను ), కృష్ణా గోదావర్యో : మధ్య ప్రదేశే (మనం ఏ ఏ నదులకు మధ్యన ఉన్నామో ఆయా నదుల పేర్లు చెప్పుకొనవలెను ), శోభన గృహే (అద్దె ఇల్లు ఐనచో వసతి గృహే అనియు , సొంత ఇల్లయినచో స్వగృహే అనియు చెప్పుకొనవలెను ) , సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర సన్నిదౌ అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన .......... సంవత్సరే , (ఇక్కడ తెలుగు సంవత్సరమును అంటే పూజ చేయునపుడు ఏ సంవత్సరము జరుగు చున్నదో ఆ సంవత్సరము యొక్క పేరు చెప్పుకొనవలెను. ) ......... ఆయనే , సంవత్సరమునకు రెండు ఆయనములు - ఉత్తరాయణము, దక్షిణాయనము . జనవరి 15 మకర సంక్రమణం మొదలు జూలై 14 కర్కాటక సంక్రమణం వరకు ఉత్తరాయణము , జూలై 15 కర్కాటక సంక్రమణము నుండి మరల జనవరి 14 పెద్ద పండుగ అనగా మకర సంక్రమణము వరకు దక్షిణాయనం పూజ చేయునపుడు ఏ ఆయనము జరుగుచున్నదో దానిని చెప్పవలెను )...........ఋతు : (వసంత , గ్రీష్మ , వర్ష మొ || ఋతువు లలో పూజ సమయములో జరుగుచున్న ఋతువు పేరు )............మాసే , (చైత్ర , వైశాఖ మొ || పన్నెండు మాసములలో పూజాసమయంలో జరుగు చున్న మాసం పేరు ) .......పక్షే , (నెలకు రెండు పక్షములు పౌర్ణమికి ముందు శుక్ల పక్షము , అమావాస్యకు ముందు కృష్ణ పక్షములు వీటిలో పూజ జరుగుచున్న సమయమున గల పక్షము పేరు ) ........తిధౌ , (ఆరోజు తిది ) .........వాసరే (ఆ రోజు ఏ వారమైనది చెప్పుకొని ) శుభ నక్షత్రే , శుభయోగే , శుభ కరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభ తిధౌ మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం పురుషులైనచో శ్రీమాన్ ...........గోత్రస్య ........నామధేయః, శ్రీమత్యః , గోత్రస్య , నామదేయస్య అనియు, స్త్రీలైనచో శ్రీమతి , గోత్రవతి , నామదేయవతి , శ్రీమత్యాః , గోత్ర వత్యాః, నామధేయవత్యాః , అనియు (పూజచేయువారి గోత్రము , నామము చెప్పి ) నామదేయస్యః ధర్మపత్నీ సమేతస్యః (పురుషులైనచో ) మమ సహ కుటుంబస్య , క్షేమ స్థైర్య , వీర్య , విజయ , అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ద్యర్ధం , ధర్మార్ధ కామ మోక్ష ఫల పురుషార్ధ సిద్ద్యర్ధం , పుత్ర పౌత్రాభి వృధ్యర్ధం , సకల విధ మనోవాంచాఫల సిద్ద్యర్ధం , శ్రీ షోడస గౌరీ దేవి ముద్దిశ్య శ్రీ షోడస గౌరీ దేవి ప్రీత్యర్ధం (ఏ దేవుని పూజించు చున్నామో ఆ దేవునియొక్క పేరు చెప్పుకొని ) సంభ వద్భి రుపచారై : సంభవతాని యమేన సంభవతా ప్రకారేణ యావచ్చక్తి (నాకు తోచిన రీతిలో , నాకు తోచిన నియమములతో , నాకు తోచిన విధముగా , భక్తి శ్రద్దలతో సమర్పించు కొంటున్న పూజ ) ధ్యానా వాహనాది షోడశోప చార పూజాం కరిష్యే తదంగ కలశ పూజాం కరిష్యే || పిదప కలశారాధనము చేయవలెను .

కలశ పూజను గూర్చిన వివరణ :

వెండి , రాగి , లేక , కంచు గ్లాసులు (లేదా పంచ పాత్రలు ) రెండింటిలో శుద్ధ జలమును తీసుకుని ఒక దానియందు అక్షతలు , తమలపాకు , పువ్వు ఉంచుకొనవలెను. రెండవ పాత్రకు బయట మూడు వైపులా గంధమును వ్రాసి కుంకుమను అద్దవలెను ఇట్లు చేయునపుడు గ్లాసును గుండ్రముగా త్రిప్పుచూ గంధమును కాని , కుంకుమను గాని పూయరాదు. గంధమును ఉంగరపు వ్రేలితో పూయవలెను. కుంకుమ అక్షతలు వగైరా బొటన , మధ్య , ఉంగరపు వ్రేళ్ళను కలిపి సమర్పించ వలెను. యజమానులు (ఒక్కరైతే ఒకరు , దంపతులైతే ఇద్దరూను ) ఆ కలశాన్ని కుడి చేతితో మూసి వుంచి ఇలా అనుకోవాలి.

ఈ విధముగా కలశమును తయారుచేసి పూజను చేయునపుడు మొదటగా ఈ శ్లోకమును చదువవలెను .

మం || కలశస్య ముఖే విష్ణు : కంటే రుద్ర స్సమాశ్రితః

మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృ గణా స్మృతాః ||

ఋగ్వేదో ధ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః

అంగైశ్చ సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితః

శ్లో || గంగైచ యమునే చైవ కృష్ణే , గోదావరి , సరస్వతి , నర్మదా సింధు

కావేర్యౌ జలేస్మిన్ సన్నిధం కురు.

ఇక్కడ ఇలా శ్లోకము ముగిసిన తరువాత ఆయాతు శ్రీ షోడస గౌరీ దేవి

పూజార్ధం దురితక్షయ కారకాః (ఏ దేవుని పూజిస్తున్నామో ఆ దేవుని పేరు చెప్పవలెను ) కలశోదకేన ఓం దేవం సంప్రోక్ష్య (కలశ మందలి ఉదకమును దేవునిపై చల్లాలి) , ఓం ఆత్మానం సంప్రోక్ష్య అని (ఆ నీటిని తనపై చల్లుకోవాలి ) ఓం పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య (పూజా ద్రవ్యములపై కూడా చల్లాలి ) కలశ మందలి నీటిని పై మంత్రం చదువుతూ పువ్వుతో గాని , ఆకుతో గాని చల్లాలి.

మార్జనము : ఓం అపవిత్రః పవిత్రోవా సర్వా వస్తాం గతోపివా

యస్మరే త్పుండరీ కాక్షం సభాహ్యాభ్యంతర శ్శుచి :||

అని పిదప కాసిని అక్షతలు , పసుపు , గణపతిపై వేసి , ఆయనను తాకి నమస్కరించి ప్రాణ ప్రతిష్టాపన చేయవలెను.

ప్రాణ ప్రతిష్ట అనగా శ్రీ తులసీ ధాత్రి సహిత శ్రీ లక్ష్మీ నారాయణ ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త స్సుముహూర్తోస్తు తధాస్తు. స్థిరోభవ, వరదోభవ , సుముఖోభవ ,సుప్రసన్నోభవ. తరువాత ఇలా చదువుతూ విఘ్నేశ్వరునికి నమస్కరించవలెను .

శ్లో || శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్

ప్రసన్న వదనం ధ్యాయే త్సర్వ విఘ్నోప శాంతయే ||

సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజ కర్ణక :

లంబోరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః

ధూమ కేతు ర్గణాధ్యక్షః పాలచంద్రో గజానన

వక్రతుండ శ్శూర్ప కర్ణో హేరంబః స్కంద పూర్వజః

షోడ శైతాని నామాని యః పటే చ్చ్రుణు యాదపి

విద్యా రంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తధా

సర్వ కాసంగ్రామే ర్యేషు విఘ్నస్తస్య నజాయతే |

పిదప షోడశోపచార పూజను చేయవలెను. షోడశోపచారములనగా ఆవాహన , ఆసనం , అర్ఘ్యం , పాద్యం , ఆచమనీయం , స్నానం , వస్త్రం , యజ్ఞోపవీతం , గంధం , పుష్పం , ధూపం , దీపం , నైవేద్యం , తాంబూలం , నమస్కారం , ప్రదక్షణములు మొదలగునవి.

షోడశోపచార పూజా ప్రారంభః

ధ్యానం :

శ్లో || కురు పద్మాసనే పద్మకరే సర్వ లోకైక పూజితే

భక్తా బీష్ట ప్రదేదేవి సుప్రీతా భవ సర్వదా

ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః ధ్యాయామి -ధ్యానం సమర్పయామి

అని షోడస గౌరీ దేవిని మనస్సున ధ్యానించి నమస్కరించ వలెను.

ఆవాహనం :

శ్లో || గచ్చా గచ్చ దేవిత్వం సర్వ మంగళ దాయిని

శ్రద్దా భక్తి సమాయుక్త ధ్యాయామి పరమేశ్వరి.

శ్రీ షోడశ గౌరీ దేవి నమః ఆవాహయామి ఆవాహనార్ధం అక్షతాం సమర్పయామి అనగా మనస్పూర్తిగా దేవుని మన ఇంట్లోకి ఆహ్వానించడం అట్లు మనస్సున స్మరిస్తూ అక్షతలు దేవునిపై వేయవలెను.

ఆసనం :

శ్లో || విచిత్ర స్వర్ణ సంయుక్తం చిత్రవ వర్ణ సుశోభితం

గౌరీ సింహాసనం దేవి దాస్యామి శుభ లోచిన

ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. సింహాసనార్ధం అక్షతాం సమర్పయామి

దేవుడు కూర్చుండు టకై మంచి బంగారు పీట వేసినట్లు అనుకుంటూ అక్షతలు వేయవలెను.

అర్ఘ్యం :

శ్లో || గగాజల సమాయుక్తం సుగంధం గంధ సంయుతం ,

గృహాణర్ఘ్యం మయాదత్తం మంగళం కురుమే శివే ||

ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః హస్తౌ : అర్ఘ్యం సమర్పయామి

దేవుడు చేతులు కడుగుకొనుటకై నీళ్ళిస్తున్నామని మనసున తలుస్తూ , ఉద్దరిణెతో నీరు వేరొక గిన్నెలో వదల వలయును.

పాద్యం :

శ్లో || పుణ్య తీర్ధం సమానీతం పవిత్రం ద్రవ్య సంయుతం

పాద్యంచ పరి గృహ్నాతు గౌరీ దేవి నమోస్తుతే ||

ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః పాదౌ : పాద్యం సమర్పయామి.

దేవుడు కాళ్ళు కడుగుకొనుటకు నీరు ఇస్తున్నామని మనసున అనుకుంటూ పువ్వుతో పంచ పాత్రలోని నీరు అదే గిన్నెలో ఉద్దరిణెతో వదలవలెను.

ఆచమనీయం :

శ్లో|| సర్వ తీర్ధ సమధ్బూతం పవిత్రం విమలం జలం

గృహాణాచ మనం దేవి శంకరార్ధ శరీరణి||

ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః ఆచమనీయం సమర్పయామి.

అంటూ దేవుని ముఖము కడుగుకొనుటకై నీళ్ళి స్తున్నామని మనమున తలుస్తూ పైన చెప్పిన పాత్రలో ఉద్దరిణెతో ఒక మారు నీరు వదలవలెను.

సూచన :

అర్ఘ్యం , పాద్యం , ఆచమనం మొదలగు వాటికి ఉద్దరిణెతో నీరు వేరొక పాత్రలో వదలవలెను. అరవేణం (పంచ పాత్రకు క్రింద నుంచు పళ్ళెము) లో వదలరాదు.

మధుపర్కం :

ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః మధుపర్కం సమర్పయామి.

అని దేవునికి స్నానం చేయుటకు వస్త్ర మిచ్చు చున్నామని తలుస్తూ , ఈ మధుపర్కం ను దేవి ప్రతిమకు

అద్దవలెను. (ప్రత్తిని పెద్ద బొట్టు బిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆ పైన రెండు వైపులా పసుపులో అద్ది ఉంచుదాన్ని మధుపర్కం అంటారు).

పంచామృత స్నానం :

శ్లో || శర్కరా మధు సంయుక్తం దధి క్షీర ఘ్రుతం తధా

పంచామృతం గృహాణ త్వం గౌరీ దేవి నమోస్తుతే ||

ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః పంచామృత స్నానం సమర్పయామి.

అని స్నానమునకు పంచామృతములతో కూడిన నీరు ఇచ్చునట్లు భావించి ఆవు నెయ్యి , ఆవు పాలు , ఆవు పెరుగు , తేనె , పంచదార కలిపిన పంచామృతమును దేవిపై ఉద్దరిణెతో చల్ల వలెను.

శుద్దోదక స్నానం :

శ్లో || గంగాజల సమానీతం సర్వ తీర్ధ సముద్భవం ,

స్నానార్దంచ గృహాణత్వం సర్వ కామ ఫల ప్రదే ||

ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః శుద్దోదక స్నానం సమర్పయామి .పంచపాత్రలోని శుద్ధ నీటిని పువ్వుతో దేవునిపై చల్లవలెను.

వస్త్ర యుగ్మం :

శ్లో|| దివ్యాంబరం సమానీతం విచిత్రం చోత్తరీయకం

గృహాణత్వం మాయాదేవి సర్వ మంగళ దాయిని ||

ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః వస్త్ర యుగ్మం సమర్పయామి.

(యుగ్మమనగా రెండు ) అనుచు వస్త్రమును (ప్రత్తిని పెద్ద బొట్టు బిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆపైన రెండు వైపులా కుంకుమలో అద్దినచో అది వస్త్రమగును .ఇటువంటివి రెండు చేసుకొనవలెను.) దేవి ప్రతిమకు అద్దవలెను.

యజ్ఞోపవీతం :

ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః ఉపవీతం సమర్పయామి

అనగా జందెమును ఇవ్వవలెను , ఇదియును ప్రత్తితో చేయవచ్చును ప్రత్తిని తీసుకుని పసుపుచేత్తో బొటన వ్రేలు , మధ్య వ్రేలితో మధ్య మధ్య నలుపుతూ పొడవుగా చేసి , కుంకుమను అద్దవలెను. దీనిని పురుషదేవతా పూజకు మాత్రమే సమర్పించవలెను.

గంధం :

శ్లో || శ్రీ ఖండం చందనం చైవ కర్పూరాగరు సంయుతం

విలేపర సుర శ్రేష్టే ప్రేత్ ర్ధం ప్రతి గుహ్యతాం.

ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః గంధాన్ సమర్పయామి .ముందుగా తీసి పెట్టుకున్న గంధమును కుడి చేతి ఉంగరం వ్రేలితో దేవి ప్రతిమపై చల్లవలెను.

ఆభరణం :

శ్లో || అంగుళ్య ముక్తా భరణాది యుక్తం హస్తాన లంకృత్యక రైశ్చ బంధం

మాణిక్య ముక్తా ఫల విద్రమేశ్చ గోమేదీ వైడూర్య కృతాంశ్చహారా ||

ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః ఆభరణాన్ సమర్పయామి.

అని దేవికి మనము చేయించిన ఆభరణములను అలంకరించవలెను. లేనిచో అలంకరణార్ధం అక్షతాన్ సమర్పయామి అని అక్షతలు దేవి పై వేసి ఆభరణాన్ సమర్పయామి అని నమస్కరించ వలెను.

అక్షతలు :

శ్లో || అక్షతాన్ ధవళాన్ రమ్యా హరి ద్రాళంయుతా శుభా

అవి గృహ్ణా తుమే దేవి వాంచి తార్ద ఫలప్రదే ||

ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః అక్షతాన్ సమర్పయామి.

(అక్షతలకు కొద్ది బియ్యమును తడిపి పసుపు వేసి కలపవలెను ) అక్షతలు తీసుకొని దేవి ప్రతిమపై చల్లవలెను.

పుష్ప సమర్పణ :

శ్లో || శత పత్రై ర్జాతి సుమై : మల్లికాది మనోహరై

కేతకీ కర వీరైశ్చ అర్చయామి హరప్రియే ||

ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః పుష్పాణి సమర్పయామి .దేవికి పువ్వులతో అలంకారము చేయవలెను. పువ్వులను దేవిపై వేసి నమస్కరించ వలెను. పిదప అధాంగ పూజను చేయవలెను.ఈ క్రింది నామాలను చడువుచూ పుష్పములతో గాని , పసుపు కుంకుమలతో గాని దేవిని పూజించవలెను.

అధాంగ పూజ

మహా దేవ్యై నమః పాదౌ పూజయామి

కమలోద్భవాయైనమః గుల్ఫౌ పూజయామి

సర్వలోక జనన్యై నమః జానునే పూజయామి

పుణ్య మూర్త్యే నమః జంఘే పూజయామి

విశ్వ మూర్త్యై నమః ఊరూ పూజయామి

మహా గౌర్యై నమః కటిం పూజయామి

అదోక్షజాయై నమః హృదయం పూజయామి

కంబు కంట్యై నమః కంటం పూజయామి

పరమాత్మనే నమః స్కంధౌ పూజయామి

అంభోజ హస్తాయై నమః హస్తౌ పూజయామి

రమ్య ముభాయై నమః ముఖం పూజయామి

ధర్మ కృతాయై నమః కర్ణౌ పూజయామి

శర్వాన్యై నమః లలాటం పూజయామి

విష్ణుమూర్త్యై నమః శిరః పూజయామి

శ్రీ మహా గౌర్యై నమః సర్వాణ్యం పూజయామి ||

అధ గ్రంధి పూజా || తోరగ్రంధి పూజ ||

దేవ్యై నమః ప్రతమ గ్రంధి పూజయామి

కమలోద్భవాయై నమః ద్వితీయ గ్రంధి పూజయామి

ఇందు చూడామణ్యై తృతీయ గ్రంధి పూజయామి

సర్వలోక జనన్యై నమః చతుర్ధ పూజయామి

పుణ్య మూర్త్యై నమః పంచమ పూజయామి

పరమాత్మనే నమః షష్ఠ పూజయామి

ధర్మ కృతాయై నమః సప్తమ పూజయామి

సరస్వత్యై నమః అష్టమ పూజయామి

మహా గౌర్యై నమః నవమ పూజయామి

మన్మధ వాసిన్యై నమః దశమ పూజయామి

పుణ్య మూర్త్యై నమః ఏకాదశ పూజయామి

శుబ్ర వర్ణాయై నమః ద్వాదశ పూజయామి

సరస్వత్యై నమః త్రయోదశ పూజయామి

ధర్మ కృతాయై నమః చతుర్దశ పూజయామి

కనకా భరణాయై నమః పంచదశ పూజయామి

సర్వలోక జనన్యై నమః షోడశ పూజయామి

తరువాత అష్టోత్తర శతనామావళి పూజ దీనియందు 108 మంత్రములుండును ఈ మంత్రములను చదువుచు పుష్పములతో గాని , పసుపు కుంకుమలతో గాని దేవిని పూజించవలెను. పిదప అగరుబత్తిని వెలిగించి

ధూపం :

శ్లో || దశాంగం గుగ్గులం ధూముత్త మంగంధం సంయుతం

తన ప్రియార్ధ మానీతం గృహాణ పరమేశ్వరి ||

ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః ధూప మాఘ్రాపయామి .ధూపం సమర్పయామి అంటూ ఎడమ చేత్తో గంట వాయిస్తూ కుడి చేత్తో అగరుబత్తిని తిప్పుతూ పొగను దేవికి చూపవలెను

దీపం :

శ్లో || సాజ్యంత్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా

గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరా పహే ||

ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః సాక్షాత్ దీపం దర్శయామి .

అని మొదట్లో చెప్పిన విధంగా దీపారాదనలో వున్నఅదనపు వత్తులలో ఒక దానిని తీసుకుని హారతి వెలిగించే దాంట్లో వేసి వెలిగించి గంట మ్రోగిస్తూ ఆ దీపం దేవికి చూపుతూ పై శ్లోకమును చదువవలెను.

నైవేద్యం :

శ్లో || ఆ పూపాన్వి విధా స్వాదూశాలి గోధుమ పాచితా

షోడశే కాగు యుక్తా గృహాణ పరమేశ్వరి.

ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నైవేద్యం సమర్పయామి

అని ఒక బెల్లం ముక్క , పళ్ళు , కొబ్బరికాయ మొదలగునవి ఒక పళ్ళెము లోనికి తీసుకుని దేవి వద్ద ఉంచి దానిపై పువ్వుతో నీళ్ళు చల్లుతూ ఎడమ చేత్తో గంట వాయిస్తూ "ఓం భూర్భువస్సువః ఓం తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి , ధియోయోనః ప్రచోదయాత్ , సత్యం త్వర్తేన పరిషించామి , (ఋతం త్వా సత్యేత పరిషించామి అని రాత్రి చెప్పవలెను ) అమృతమస్తు అమృతో పస్తరణమసి , ఓం ప్రాణాయ స్వాహా , ఓం అపానాయ స్వాహా , ఓం వ్యానాయ స్వాహా , ఓం ఉదానాయ స్వాహా , ఓం సమానాయ స్వాహా , మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అంటూ ఆరు మార్లు చేతితో (చేతిలోని ఉద్దరిణె తో ) దేవికి నివేదనం చూపించాలి. పిదప ఓం శ్రీ గౌరీ దేవి నమః నైవేద్యానంతరము "హస్తౌ ప్రక్షాళయామి " అని ఉద్దరిణెతొ పంచపాత్రలోని నీరు ముందు చెప్పిన అర్ఘ్య పాత్ర (పంచపాత్ర కాకుండా విడిగా చెంబులో పెట్టుకునే నీళ్ళ పాత్ర ) లో వదలాలి తరువాత "పాదౌ ప్రక్షాళయామి " అని మరోసారి నీరు అర్ఘ్య పాత్రలో ఉద్దరిణెతొ వదలాలి. పునః శుద్దాచమనీయం సమర్పయామి అని ఇంకొక మారు నీరు వదలాలి.

తాంబూలం :

శ్లో|| పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం

కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతి గృహ్యాతాం

ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః తాంబూలం సమర్పయామి

అని చెబుతూ తాంబూలమును (మూడు తమలపాకులు , రెండు పోక చెక్కలు, అరటి పండు వేసి ) దేవి వద్ద ఉంచాలి. తాంబూలం వేసుకున్నాక నోరు కడుక్కొనుటకు నీరు ఇస్తున్నామని తలుస్తూ , 'తాంబూల చరవణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి' అంటూ ఉద్దరిణెతో నీరు అర్ఘ్య పాత్రలో వదలాలి .పిమ్మట కర్పూరం వెలిగించి

నీరాజనం :

శ్లో || చిత్రం నీరాజనం దేవి గృహాణ హరి వల్లభే ||

ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః కర్పూర నీరాజనం సమర్పయామి.

అని కర్పూర బిళ్ళలు హారతి కుందిలో వేసి ముందుగా దీపారాధనకు వెలిగించి న దీపంతో వెలిగించి , మూడు మార్లు తిప్పుచూ , చిన్నగా గంట వాయించ వలెను. అనంతరం మళ్ళీ పువ్వుతో నీరు హారతి కుంది చివర వదులుతూ 'కర్పూర నీరాజనం అనంతరం శుద్దచామనీయం సమర్పయామి ' అని చెప్పి నీరాజనం దేవికి చూపించి తరువాత ఇంటిలోని వారందరూ హారతిని కళ్ళకు అద్దుకోవాలి తరువాత అక్షతలు , పువ్వులు, చిల్లర డబ్బులు చేతిలో పట్టుకుని ,

మంత్ర పుష్పం :

శ్లో || అక్షతాన్శ్వేత దూర్వాంశ్చ మల్లికా కుమాన్వితా||

పుష్పాంజిలిం ప్రదాస్యామి గృహాణ కరుణా నిధే ||

శ్రీ షోడశ గౌరీ దేవి నమః యధాశక్తి మంత్ర పుష్పం సమర్పయామి

అని చెప్పుకుని అక్షతలు , పువ్వులు , చిల్లర దేవి వద్ద ఉంచవలెను.పిమ్మట ఈ దిగువ మంత్రం జపిస్తూ మూడుసార్లు ప్రదక్షిణం చేయాలి.

ప్రార్ధన మంత్రం :

శ్లో || నృత్యైశ్చ గీత వాద్యైశ్చ పురాణ శ్రవణా దిభి :

రాజోపచారై ర్బహు భి : స్సంతుష్టా బహు సర్వదా ||

దేహి గౌరి సదారోగ్యం పుత్ర పౌత్ర ప్రవర్ధనం ,

త్వత్పాద పద్మ యుగళం పూజయామి హరప్రియే ||

తోర బంధనం :

శ్లో || సర్వ మంగళ మాంగల్యే సర్వ మంగళ దాయినీ ,

సర్వ సంపత్కర శీఘ్రం గౌరీ దేవి నమోస్తుతే ||

వాయన మంత్రం :

శ్లో || ఏవం సంపూజ్య బక్త్యాచ గౌరీ దేవీం స్వ శక్తితః

దాతవ్యం షోడశా పూపా నావాయ నంతు ద్విజాయచ ,

గందాదిభి నలం కృత్య బ్రాహ్మణాయ ప్రదీయతాం ||

శ్రీ గౌరీ ప్రతి గృహ్ణాంతు శ్రీ గౌరీ వైద దాతిచ ,

శ్రీ గౌరీ తారకో భాభ్యాం మహా గౌర్యై నమోస్తుతే ||

ప్రార్ధన :

యస్స్య స్మృత్యాచ , వరదా భవతు ||

పుష్పములను , అక్షతలను చేతియందు ఉంచుకుని , వ్రతకధను చదివి వాటిని దేవిపై వేయవలెను.

ప్రదక్షిణం :

శ్లో|| ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియ ,

నమస్తే విఘ్న రాజాయ నమస్తే విఘ్న నాశన ||

శ్లో || ప్రమద గణ దేవేశ ప్రసిద్దె గణ నాయక ,

ప్రదక్షిణం కరోమిత్వా మీశ పుత్ర నమోస్తుతే ||

శ్లో || యానికానిచ పాపాని జన్మాంతర క్రుతానిచ

తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||

ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.

శ్రీ దేవికి చేతిలో అక్షతలు , పువ్వులు తీసుకుని లేచి నిలబడి మూడు సార్లు ఆత్మ ప్రదక్షిణ చేసి (అనగా తమలో తాము చుట్టూ తిరిగి ) పిమ్మట సాష్టాంగ నమస్కారం చేసి (మగవారు పూర్తిగా పడుకుని తలను నెలకు ఆన్చి , ఆడువారు మోకాళ్ళపై పడుకుని కుడికాలు ఎడమకాలుపై వేసి ) తరువాత దేవిపై చేతిలో నున్న అక్షతలు , పువ్వులు చల్లి మరల తమ స్థానమున ఆసీనులై నమస్కరించుచూ

పునః పూజ :

ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః పునః పూజాంచ కరిష్యే

అని చెప్పుకుని , పంచ పాత్రలోని నీటిని చేతితో తాకి , అక్షతలు దేవిపై చల్లుతూ ఈ క్రింది మంత్రములు చదువు కొనవలెను.

షోడశోపచారములు :

ఛత్రం ఆచ్చాదయామి , చామరం వీజయామి , నృత్యం దర్శయామి , గీతం శ్రావయామి , వాద్యం ఘోషయామి , సమస్త రాజోపచార , శక్త్యోపచార ,భక్త్యోపచార పూజాం సమర్పయామి అనుకొని , నమస్కరిస్తూ ఈ క్రింది శ్లోకమును చదువు కొనవలెను.

పూజాఫల సమర్పణమ్ :

శ్లో || యస్య స్మృత్యాచ నామోక్త్యా తపం పూజా క్రియాది షు

యాన సంపూరతాం యాతి సద్యో వందే తమచ్యుతం

మంత్ర హీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర |

యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే ||

అనయా ధ్యానా వాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మకః శ్రీ షోడశ గౌరీ దేవి సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు.

ఏతత్ఫలం శ్రీ షోడశ గౌరీ దేవి అర్పణ మస్తు అంటూ అక్షతలు నీటితో పాటు అరవేణంలో వదలవలెను. పిమ్మట ' శ్రీ షోడశ గౌరీ దేవి ప్రసాదం శిరసా గృహ్ణామి' అనుకుని స్వామి వద్ద అక్షతలు తీసుకుని తమ తమ తలలపై వేసుకొనవలెను. ఆపిదప పసుపు గణపతి ఉన్న పళ్ళెము నొకసారి పైకి ఎత్తి తిరిగి క్రింద ఉంచి పళ్ళెములో ఉన్న పసుపు గణపతిని తీసి దేవుని పీటముపై ఉంచవలెను దీనిని ఉద్వాసన చెప్పటం అంటారు.

ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః యధాస్థానం ప్రవేశాయామి శోభనార్ధం పునరాగమనాయచ అని ఉద్వాసన పలుకుతారు.

పూజావిధానం సంపూర్ణమ్

తీర్ధ ప్రాశనమ్ :

శ్లో || అకాల మృత్యు హరణం సర్వ వ్యాధి నివారణమ్ |

సమస్త పాప క్షయ కరం శ్రీ షోడశ గౌరీ దేవి పాదోదకం పావనం శుభం ||

అని తీర్ధమును చేతిలో వేసుకుని మూడు సార్లు నోటిలోనికి తీసుకొనవలెను.


వ్రతకదా ప్రారంభము

కైలాస పర్వతం పైన ఒకనాడు స్కందుడు (అనగా 'కుమార స్వామి ' పుత్రులు (కొడుకులు ) పౌత్రులు అనగా (మనుమలు ) కలుగు వ్రత మేదైనా ఉన్నచో తెలుపుము అనగా పరమ శివుడు " కుమారా ! మంచి ప్రశ్న అడిగితివి అన్ని సంపదలను యిచ్చునట్టి స్వర్ణ గౌరి (అనగా షోడశ గౌరీ వ్రతం )ఒకటి కలదు. ఈ వ్రతము యొక్క కధను వినుమని ఇలా చెప్పు చుండెను.

పూర్వము సరస్వతీ నదీ తీరంలో 'విమలము ' అనే పేరుగల నగరము ఉండెను. చంద్ర ప్రభుడు అను రాజు ఉండెను. ఈ రాజ్యానికి ఈయన అధిపతి ఇతనికి ఇద్దరు భార్యలు పెద్ద భార్య యందు ఇతనికి ప్రేమ ఎక్కువ ఒకనాడు ఇతడు వేటకు చాలా దూరం వెళ్లి ఒక చెట్టు దగ్గర అనేక అంటే చాలా మంది స్త్రీలను చూచాడు. వాళ్ళంతా దీక్షతో స్వర్ణ గౌరి (షోడశ గౌరి ) వ్రతమును చేయుచుండిరి. చంద్ర ప్రభుడు ఆ వ్రత విధానమును , దాని ఫలమును వారి వలన తెలుసుకుని వెంటనే ఆ వ్రతమును చక్కగా శ్రద్దా భక్తులతో చేసి పదహారు గ్రంధులు (అనగా పదహారు పోగులు ) కల తోరమును కట్టుకొని ఇంటికి వచ్చి తన భార్యలకు ఆ వ్రతమును ఉపదేశించాడు. పెద్ద భార్య చంద్ర ప్రభుని చేతికి ఉన్న తోరమును చూచి అపార్ధం చేసుకుని , దుర్భాష లాడుతూ (అనగా అతనిని తప్పు పట్టి ) దానిని త్రెంపి తోటలోని ఎండిపోయిన చెట్టు పైకి విసిరివేసెను. తోరము తగిలిన వెంటనే ఆ చెట్టు చిగిర్చెను. ఇది అంతా చూసి , అతని చిన్న భార్య ఆశ్చర్యము చెంది ఆ తోరము తీసుకుని తాను కట్టుకొనెను. ఆ ప్రభావము చేత తన భర్తకు ఇష్ట మయ్యెను. అపచారము (చెడుపని) చేయుట చేత చంద్ర ప్రభుడు విడిచి పెట్టెను. విడువబడిన పెద్ద భార్య అనేక కష్టములు అనుభవించుచూ అడవుల పాలై దిక్కు తెలియక ఏడ్చు చుండెను. ఈమె ఏడ్చుట చూచి మహాగౌరి సాక్షాత్కరించెను. (అనగా కనిపించెను ) మహా గౌరిని చూచి నమస్కరించుచూ జయదేవి నమస్తుభ్యం జయ భక్త వరప్రదే ! అని ఈ విధముగా ప్రార్ధించి తన తప్పును క్షమింప చేయమని కోరెను. కరుణామయి అయిన గౌరి యొక్క అనుగ్రహమును పొంది స్వర్ణ గౌరి వ్రతమును చేసి , ఇహ లోకమున (ఈ లోకమున ) అన్ని విధములైన సౌభాగ్య సుఖములను పొంది చివరకు శివుని సన్నిధికి చేరెను.


సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు


వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

Monday 30 October 2023

🙏సిరిమానోత్సవం 🙏

 


అక్టోబర్ 31 మంగళవారం

విజయనగరంలో పైడితల్లి సిరిమానోత్సవం

విజయనగరం సిరిమానోత్సవం అతిపెద్ద వేడుక. విజయనగర రాజుల ఆధ్యాత్మిక వైభవం పైడిత‌ల్లి ఉత్సవాలకు తలమానికం సిరిమానోత్సవం అని అందరూ గుర్తిస్తారు.

ఇది రాష్ట్ర పండుగ. రెండున్నర శతాబ్దాలకు పైబడి నిరంతరాయంగా సిరిమానోత్సవం జరుగుతోంది.

ఏటికేడాది పైడితల్లిని దర్శంచువచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఎంతో అట్టహాసంగా జరిగే ఈ సిరిమానోత్సవాన్ని కొవిడ్ ఆంక్షల కారణంగా అనేక జాగ్రత్తల మధ్య ఈసారి నిర్వహిస్తున్నారు.

ఉత్త‌రాంధ్రుల క‌ల్ప‌వ‌ల్లి, విజ‌య‌న‌గ‌రం ప్ర‌జ‌ల‌ ఇల‌వేలుపు శ్రీ పైడిత‌ల్లి అమ్మ‌వారి ఉత్సవాలకు తలమానికం సిరిమానోత్స‌వం. విజయదశమి అనంతరం మంగళవారం సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు.

పైడితల్లి ఉత్తరాంధ్రుల కల్పవల్లిగా పూసపాటి రాజుల ఇలవేల్పుగా భాసిల్లుతోంది.  పైడితల్లి అమ్మవారి దేవాలయం విజయనగరం మూడు లాంతర్లు కూడలి వద్ద 1757లో నిర్మించారు.

1758లో  ప్రారంభమైన అమ్మవారి ఉత్సవాలు నేటివరకూ సుమారు మూడు శతాబ్దాలుగా నిరాటంకంగా కొనసాగుతున్నాయి. క్రీ.శ. 1757 ధాత నామ సంవత్సరం విజయదశమి వెళ్ళిన మంగళవారం నాడు విజయనగరం పెద్ద చెరువులోంచి అమ్మవారి విగ్రహాన్ని పతివాడ అప్పలస్వామి నాయుడు అనే వ్యక్తి పైకి తీశారు. 

ఆయనే అమ్మవారికి తొలి పూజారి అయ్యాడు. అప్పటినుండి ఇప్పటివరకు ఆ కుటుంబానికి చెందినవారే వంశపారంపర్యంగా పూజారులుగా ఉంటున్నారు.

ప్రస్తుత పూజారి బంటుప‌ల్లి వెంకటరావు ఏడో తరంవాడు. ఈ పూజారే సిరిమానోత్సవంలో సిరిమాను అధిరోహించి భక్తుల్ని ఆశీర్వదిస్తారు.

అమ్మవారుగా కొలవబడుతున్న పైడితల్లి విజయనగరం పూసపాటి రాజవంశీయులు పెద విజయరామరాజు చెల్లెలు. పసిప్రాయం నుండి అధ్యాత్మిక భావాలతో దేవీ ఉపాసన చేసేది. అన్న పొరుగు రాజ్యమైన బొబ్బిలిపై యుద్ధ సన్నాహాలు చేయడం ఆమెను కలతపెట్టింది. బుస్సీ కుట్రకు లొంగిపోయిన విజయరామరాజు చెల్లెలి యుద్ధ నివారణ ప్రయత్నాల్ని లెక్కచేయలేదు. 

1757లో బొబ్బిలిపై యుద్ధం ప్రకటించారు. వెలమ వీరులు తమ పౌరుష ప్రతాపాల్ని పణంగా పెట్టి విజయమో వీర స్వర్గమో అన్నట్లు పోరాడారు. కానీ విజయం విజయరామరాజునే వరించింది. ఆ రోజు రాత్రి దేవి కలలో కనిపించి అన్న ప్రాణాలకు వచ్చే ప్రమాదాన్ని ముందే హెచ్చరించింది. 

ఉపవాసదీక్షలో ఉన్న ఆమె పతివాడ అప్పలనాయుడు, మరికొందరు అనుచరుల్ని వెంటబెట్టుకొని బొబ్బిలి బయలుదేరారు. కొద్ది దూరం వెళ్ళగానే ఆమె అపస్మారక స్థితిలోకి జారుకున్నది. తన ప్రతిమ పెద్దచెరువు పశ్చిమ భాగంలో లభిస్తుందని, దాన్ని ప్రతిష్ఠించి, నిత్యం పూజలు, ఉత్సవాలు చేయమని చెప్పి ఆమె దేవిలో ఐక్యమయింది. అప్పటినుండి ఆమెను అమ్మవారిగా కొలుస్తూ ప్రతి ఏటా ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు.

సిరిమాను ఉత్సవంలో అమ్మవారిని దర్శించిన వారికి కోరిన కోర్కెలు తప్పక నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.🙏


సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు


వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

బాలసుబ్రహ్మణ్యుడు పళని🌺

 





పూర్వం శివుడు, 'గొప్ప జ్ఞానఫలం 'నీవే' అని సుబ్రహ్మణ్యస్వామితో అన్నాడు. తమిళంలోని 'ఫలం నీ' అనే పేరు కాలక్రమంలో పలనిగా మారింది. అదే పళని క్షేత్రం. ఒకసారి నారదుడు అమూల్యమైన జ్ఞానఫలాన్ని తీసుకుని కైలాసానికి వెళ్లాడు. దానిని ముక్కలు చేయకుండా తినమని కోరాడు. పార్వతి ఆ ఫలాన్ని కుమారులకు ఇవ్వాలనుకుంది. "ఎవరైతే ముందుగా ఈ భూప్రదక్షిణం చేసివస్తారో వారికే ఈ ఫలం యిస్తాను' అని పార్వతీదేవి పలుకడంతోనే సుబ్రహ్మణ్యస్వామి తన వాహనమైన నెమలిని అధిరోహించి బయలుదేరాడు. వేగంగా ప్రయాణించలేని వినాయకుడు ఆలోచించి, తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేసి భూప్రదక్షిణ ఫలాన్ని, నారదుడిచ్చిన జ్ఞానఫలాన్ని కూడా సొంతం చేసుకున్నాడు. దాంతో అలిగిన సుబ్రహ్మణ్యస్వామి కైలాసం వదలి, ప్రస్తుతం పళని వున్న కొండపైకి వచ్చి కొలువుదీరినట్లు స్థలపురాణం చెబుతోంది.

పళనిలో ఆలయం ఉన్న శివగిరి కొండ సుమారు 485 అడుగుల ఎత్తు. 695 మెట్లమార్గం ద్వారా, రోప్ వే లేదా రైలు మార్గాల్లో కొండ మీదికి చేరుకోవచ్చు. విశాలమైన ప్రాంగణంలో వివిధ మండపాలు కలిగిన ఈ ఆలయ ప్రధాన గర్భాలయంలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి నిలుచుని ద్విభుజాలతో కటిహస్తుడై మరో చేతిలో దండం ధరించి కౌపీనధారిగా దర్శనం ఇస్తాడు. స్వామివారిని మురగన్, దండాయుధపాణి అని భక్తలు పిలుస్తారు. నవపాషాణం అనే విశిష్టమైన శిలతో తయారుచేసిన స్వామి విగ్రహం నుంచి ధూప, దీప సమర్పణ సమయంలో మూలికా పదార్థాలు వెలువడుతాయని, వాటిని పీల్చడం వల్ల వ్యాధులు నశిస్తాయని చెబుతారు. ఈ స్వామి కావడి ప్రియుడు. పూలు, పాల కావళ్ళను భక్తులు స్వామి వారికి సమర్పిస్తారు




సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.



జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

🙏శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్య విరచిత శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం

 


🙏కోట్ల జన్మల పాప రాశులను భస్మం చేసే మహామహిమాన్వితమైన శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం🙏

 (దీనినే సుబ్రహ్మణ్యాష్టకం అని కూడా అంటారు )

ప్రతీ రోజు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిని స్మరించడం, సకల శుభకరం.

హే స్వామినాథ! కరుణాకర దీనబంధో శ్రీపార్వతీశ ముఖపంకజ పద్మ బంధో

శ్రీశాదిదేవగణపూజిత పాదపద్మ వల్లీశనాథ మమదేహి కరావలంబం II 1 

ఓ స్వామినాథా!! అంటే పరమశివునికే ప్రణవం బోధించాడు కాబట్టి, సుబ్రహ్మణ్యుడికి స్వామినాథ అనే నామం వచ్చినది. అంటే ఇక్కడ స్వామి వారిని గురుస్వరూపముగా చెప్పారు. ఓ స్వామినాథా, కరుణను చూపించేవాడా, దీనులను రక్షించేవాడా... ఇక్కడ దీనుడు అంటే ఎవరు? దీనుడు అంటే లౌకికముగా ఐశ్వర్యము లేనివాడు అని ఒక్కటే కాదు అర్ధం, ఎవరు తాము చెయ్యవలసిన పురుషప్రయత్నము చేసి, స్వామి వారి మీదే సంపూర్ణ భారము వేసి శరణాగతి చేస్తారో, వారు దీనులు. నీవే తప్ప ఇతఃపరంబెరుగను అని కరిరాజు ప్రార్ధించినట్లుగా చేస్తే, వాడు దీనుడు. ఎప్పుడూ నేను, ఇది నాది, నేను చేశాను ఇది అని విర్రవీగితే వాడు స్వామి వారి కరుణను ఒక్కనాటికి పొందలేడు.

శ్రీపార్వతీశ ముఖపంకజ పద్మ బంధో అంటే, సుబ్రహ్మణ్యుడు సాక్షాత్తు అమ్మ పార్వతీ అమ్మవారి రూపమే, అందుకే ఎప్పుడు మనం సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి వెళ్ళినా, ఆయనని చూస్తే, నమస్కరించాలి అనే కన్నా, దగ్గరకి వెళ్ళి ఎవరూ చూడకపోతే ఒకసారి ముద్దుపెట్టుకోవాలనిపిస్తుందిముద్దుల మూటకట్టేస్తాడు స్వామి, సదా బాలరూపం కదా. ఎన్ని యుగాలైనా విఘ్నేశ్వరుడూ, సుబ్రహ్మణ్యుడూ ఇద్దరూ బాలస్వరూపమే. చిన్నపిల్లలని చూస్తేనే మనకి ఎంతో ముద్దుగా ఉంటుంది, అలాంటి సాక్షాత్తు శివగౌరీ సుతుడైన సుబ్రహ్మణ్యుడిని చూస్తే ఎంత ముద్దు కలుగుతుంది. అంతటి సమ్మోహనా రూపము స్వామిది. అమ్మవారి పద్మము వంటి ముఖమును పోలి ఉన్న ముఖము కలిగినవాడు అని అర్ధం.

శ్రీశాదిదేవగణపూజిత పాద పద్మ అంటే ... సకల దేవతలూ, సాక్షాత్ శ్రీమహాలక్ష్మీ అమ్మవారి చేత పూజింపబడిన పాదపద్మములు ఉన్నవాడు. అంటే లోకములో సకల ఐశ్వర్యాలకూ ఆలవాలము శంకరుడు. అటు మహాలక్ష్మీ అమ్మవారైనా, కుబేరుడైనా ఐశ్వర్యాన్ని శంకరుని అనుగ్రహముతోనే పొందారు. అటువంటి శంకరుడికి, సుబ్రహ్మణ్యుడికి అభేదము. శంకరుడు ఎప్పుడు పుట్టాడో ఎవరికీ తెలియదు, కాబట్టి ఆయన బాల్యంలో ఎలా ఉంటాడో తెలియాలి అంటే సుబ్రహ్మణ్యుడిని చూడాలి. ఇంకో విషయం, లక్ష్మీనారాయణులకి వరసగా చెప్తే సుబ్రహ్మణ్యుడు అల్లుడు. ఎందుకంటే, వల్లీదేవసేనా అమ్మవార్లు ఇద్దరూ మహావిష్ణువు కుమార్తెలే. అలాగే ఇతర దేవతలందరూ స్వామిని పూజిస్తారు. అంతెందుకు, సాక్షాత్ మహావిష్ణు స్వరూపమైన శ్రీరామచంద్రమూర్తికి బాల్యకాండలో విశ్వామిత్రుని చేత ఉపదేశింపబడిన ఆఖ్యానము "స్కందోత్పత్తి". ఆ తర్వాత, రాముడు రావణసంహారముకి వెళ్ళే ముందు, తిరుచెందూర్ క్షేత్రము నందు స్వామిని సేవించి వెళ్ళారు అని అక్కడి స్థల పురాణం చెబుతుంది. అసలు సుబ్రహ్మణ్యుడికి ఉన్న మరో నామమే దేవసేనాపతి, అంటే సకల దేవసేనలకూ అధిపతి. సకలదేవతలచే పూజింపబడిన పాద పద్మములు కల వాడా!! ఓ స్వామినాథా!!

ఇటువంటి స్వరూపము ఉన్న ఓ స్వామినాథా!! మాకు చేయూతనివ్వు, సహాయాన్నందించే చేతులనివ్వు అని ఈ మొదటి శ్లోకములో ప్రార్ధిస్తున్నాము.

దేవాధిదేవనుత దేవగణాధినాథ దేవేంద్ర వంద్య మృదు పంకజ మంజు పాద

దేవర్షి నారద మునీంద్ర సుగీత కీర్తే వల్లీశనాథ మమదేహి కరావలంబం II 2 

 దేవతలు, వారి అధిదేవతలచే కీర్తింపబడిన వాడా, ఇంద్రునిచే పూజింపబడిన పాదపద్మములు కలవాడా, నారదాది మునీంద్రులు, దేవర్షులచేత కీర్తించబడిన తండ్రీ, వల్లీనాథా మాకు చేయూత నిచ్చి మమ్మల్ని రక్షించు స్వామినాథా!!

నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్ తస్మాత్ ప్రదాన పరిపూరిత భక్తకామ

శృత్యాగమ ప్రణవవాచ్య నిజస్వరూప వల్లీశనాథ మమదేహి కరావలంబం II 3 

స్వామి వారు, అనేక మంది అన్నార్తులకు, అన్నమును ప్రసాదించి, ఆ ప్రసాద రూపములో సర్వ రోగములను నివారించేవాడు. రోగములు అంటే భౌతికమైన రోగాలే కాక, భవరోగమును కూడా పరిహరించి, తనలో తీసుకునే కారుణ్యం కలిగిన వాడు. భక్తులు కోరిన కోరికలను (ధర్మబద్ధమైన కోర్కెలు) తక్షణమే తీర్చేవాడు. సకల వేదాలు, ఆగమాలు, ప్రణవములు ఏ పరబ్రహ్మ స్వరూపాన్ని కీర్తిస్తున్నాయో.... అటువంటి స్వరూపము ఉన్న ఓ వల్లీనాథా మాకు చేయూతనివ్వు, రక్షించు.

క్రౌంచామరేంద్ర పరిఖండన శక్తి శూల పాశాది శస్త్ర పరిమండిత దివ్యపాణే

శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ వల్లీశనాథ మమదేహి కరావలంబం II 4 

క్రౌంచ పర్వతమును భేదించిన వాడివి, శక్తి, శూలము, ధనుస్సు, బాణములు చేత ధరించి, కుండలములను కర్ణాభరణములుగా కలవాడివై, అమితమైన వేగముతో పయనించే నెమలిని వహనముగా కల ఓ వల్లీనాథా!! మమ్మలను రక్షించు. ఇక్కడ బహుశా కుండలీశ అంటే కేవలం కుండలములను ధరించు వాడు అనే కాకపోవచ్చు, కుండలీ శక్తికి నాథుడు... అంటే వల్లీ అమ్మ వారిని కుండలినీ శక్తికి ప్రతీకగా పెద్దలు చెప్తారు, అటువంటి కుండలినీ శక్తికి ఈశా అంటే నాథుడైన వాడా అని అర్ధం కూడా కావచ్చు.

 దేవాధిదేవ రథమండల మధ్యవేద్య దేవేంద్ర పీఠనగరం ధృఢచాప హస్తం

శూరం నిహత్య సురకోటి భిరీడ్యమాన వల్లీశనాథ మమదేహి కరావలంబం II 5 

ఓ దేవాధిదేవా! అనేక మంది దేవసేనల నడుమ రథమును అధిష్ఠించిన వాడివై, ఇంద్రుని రాజ్యమును కాపాడుటకు పూనుకున్న వాడివై, చేత బాణములను, విల్లును పట్టుకుని, ముఫ్ఫై మూడు కోట్ల మంది దేవతల ప్రార్ధనని మన్నించి సూరపద్మాసురుడు అనే రాక్షసురుడిని సంహరించిన ఓ వల్లీనాథా!! మమ్మల్ని నీ బాహువులచే రక్షించు తండ్రీ.

హారాదిరత్న మణియుక్త కిరీటహార కేయూరకుండల లసత్కవచాభిరామ

హేవీర తారక జయామర బృందవంద్య వల్లీశనాథ మమదేహి కరావలంబం II 6 

హారములు, రత్నములు, మణులచే పొదగబడిన కిరీటమును ధరించినవాడా, భుజకీర్తులు, కర్ణములకు కుండలములు మరియు వక్షస్థలమునందు కవచమును ధరించినవాడా, తారకాసురుడిని జయించిన వాడా, దేవతలచేత ప్రార్ధింపబడే ఓ వల్లీనాథా! నీ చేతులతో సహాయమునివ్వు.

పంచాక్షరాది మనుమన్త్రిత గాంగతోయైః పంచామృతైః ప్రముదితేంద్ర ముఖైర్మునీంద్రైః

పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ వల్లీశనాథ మమదేహి కరావలంబం II 7 

పంచాక్షరి మొదలైన పవిత్రమైన మంత్రములతోనూ, గంగాది పవిత్ర నదీ జలాలతోనూ, పంచామృతాలతోనూ, ఇంద్రాది దేవతలూ, మునీంద్రులు స్తుతించబడుతూ ఉండగా, హరిహరులచే పట్టాభిషిక్తుడైన ఓ వల్లీనాథా! స్వామీ మాకు చేయూతనివ్వు.

శ్రీకార్తికేయ కరుణామృత పూర్ణదృష్ట్యా కామాదిరోగ కలుషీకృత దుష్ట చిత్తమ్

సిక్త్వాతు మామవ కళాధర కాంతి కాంత్యా వల్లీశనాథ మమదేహి కరావలంబం II 8 

ఆరుగురు కృత్తికలు, స్తన్యము ఇచ్చిన కారణముగా, స్వామీ నీవు కార్తికేయ అనే నామముతో పిలువబడినావు. ఓ కార్తికేయా! నీ యొక్క కరుణతో కూడిన అమృత దృష్టి మాపై ప్రసరిస్తే చాలు, మాలోని కోరికలను, సకల రోగములను, దుష్ట చిత్తమును నిర్మూలించే వాడా, సకల కళలకూ నిధియైనవాడా, శివుని తేజస్సుతో వెలిగే ఓ వల్లీనాథా! మాకు చేయూతనివ్వు. మమ్మల్ని రక్షించు.

సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం యే పఠన్తి ద్విజోత్తమాః తే సర్వే ముక్తి మాయాన్తి సుబ్రహ్మణ్యప్రసాదతః

సుబ్రహ్మణ్యాష్టక మిదం ప్రాతరుత్ధాయ యః పఠేత్ కోటిజన్మ కృతం పాపం తత్క్షణా దేవనశ్యతి. || 9 

ఏ ద్విజులైతే ఈ పుణ్యప్రదమైన సుబ్రహ్మణ్యాష్టకమును నిత్యమూ చదువుతారో, వారికి సుబ్రహ్మణ్యుడు ముక్తిని ప్రసాదించును. ప్రతీ రోజూ ఉదయముననే ఈ అష్టకమును ఎవరైతే పఠిస్తారో, వారు కోటి జన్మలలో చేసిన పాపము, ఒక్క క్షణములో నశించును.

🙏ఇతి  సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం సంపూర్ణం


సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371